సామాజిక సమీకరణాల ఆధారంగా.. 175 శాసనసభ, 24 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్సార్‌సీపీ
ఇడుపులపాయలో దివంగత సీఎం వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రకటన
ఎంపీ అభ్యర్థుల పేర్లను చదివి వినిపించన ఎంపీ నందిగం సురేష్
పెండింగ్‌లో అనకాపల్లి ఎంపీ స్థానం
ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను చదివి వినిపించిన ధర్మాన ప్రసాదరావు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు గతంలో కంటే ఎక్కువ స్థానాల కేటాయింపు
మహిళలకు పెరిగిన ప్రాధాన్యం
సీట్లు దక్కనివాళ్లకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్న సీఎం జగన్
Updates
సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈరోజు 50 శాతం స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్థానాలకు కేటాయించాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఎప్పుడూ జరగలేదు. దాదాపు 99 స్థానాల్లో మార్పులు చేశాం. ప్రజల మీద నమ్మకంతో మార్పులు చేశాం. టికెట్ రాని వారికి రాబోయే రోజుల్లో సముచిత స్థానం ఇవ్వడం జరుగుతుంది. ఇదే నా భరోసా. విప్లవాత్మక మార్పులతో ఈ ఐదేళ్ల పాలన జరిగింది. ఎక్కడా లంచం లేకుండా సంక్షేప పథకాలు ప్రజలకు అందాయి. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించాం. దేశ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో ఇది లిఖించదగిన అంశం. గ్రామాలు మారాయి. స్కూల్స్ బాగుపడ్డాయి. ఆసుపత్రులు మారాయి. మహిళా సాధికారత, సామాజిక న్యాయం చేసి చూపించాం. మార్పులను ప్రజలు గమనించాలి. రాబోయే రోజుల్లో సామాజిక న్యాయం మరింత ఎక్కువగా అందిస్తామన్నారు.
ఎంపీ అభ్యర్థులు వీరే..
ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన నందిగామ సురేష్..
అనకాపల్లి స్థానం పెండింగ్‌లో ఉంది.
మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల వర్గాలకు 200 సీట్లకు గాను 100 స్థానాలు కేటాయించారు. సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం సీట్లు కేటాయింపు.
ఎంపీల విద్యార్థత..
25 మంది ఎంపీ అభ్యర్థుల్లో 88 శాతం ఉన్నత విద్యావంతులే.
ఇందులో 22 మంది డిగ్రీ ఆపైన చదువుకున్న వారు.
25 మంది అభ్యర్థుల్లో ఐదుగురు డాక్టర్లు, నలుగురు లాయర్లు.
ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒకరు మెడికల్ ప్రాక్టిషనర్.
ఎమ్మెల్యేల విద్యార్హత..
175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులు.
77 శాతం మంది ఉన్నత విద్యావంతులకే సీట్లు కేటాయింపు.
2024 ఎన్నికల బరిలో 18 మంది డాక్టర్లు, 15 మంది అడ్వకేట్లు.
34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు
ఒకరు రక్షణ శాఖ మాజీ ఉద్యోగి, ఒక జర్నలిస్టు.
25 ఎంపీ సీట్లకు గాను ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు ఒకటి, బీసీలకు 11, ఓసీలకు 9 సీట్లను కేటాయించారు.
►ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలైన 200 సీట్లలో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లు.
►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గతంలో కంటే అదనంగా 11 సీట్లు కేటాయించిన సీఎం వైఎస్ జగన్.
►2019లో బీసీలకు 41 స్థానాలు కేటాయిస్తే ఈసారి 48 సీట్లు కేటాయింపు.
►2019లో మహిళలకు 15 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే.. 2024లో నాలుగు స్థానాలు పెంపు.
►2019లో మైనార్టీలకు ఐదు ఎమ్మెల్యే స్థానాలు కాగా.. 2024లో మరో రెండు స్థానాలు పెంచి ఏడు స్థానాలు కేటాయింపు.
►2019లో మహిళలకు రెండు ఎంపీ స్థానాలు ఇస్తే.. ఈసారి ఒకసీటు అదనంగా మూడు సీట్లకు పెంపు.
►2019లో ఎంపీ ఎన్నికల్లో ఎస్సీలకు నాలుగు, బీసీలకు 12 సీట్లు కాగా.. 2024లో బీసీలకు అదనంగా నాలుగు సీట్లు కేటాయింపు.
►2019లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొత్తం 89 సీట్లు కేటాయింపు.
►2024 ఎన్నికల్లో 11 సీట్లు అదనంగా పెంచి 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయింపు.
►2019లో మహిళలు, మైనార్టీలకు 18 సీట్లు ఇస్తే..
►2024లో ఆరు సీట్లు పెంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 24 సీట్లు ఇచ్చి తన మార్క్ చాటుకున్న సీఎం జగన్.
►2019 ఎన్నికల్లో మహిళలకు 15 చోట్ల ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు.. ఈసారి ఆరు సీట్లు పెంచి 24 చోట్ల అవకాశం.
►2024 ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 14 ఎమ్మెల్యే సీట్లు కేటాయింపు.
వైఎస్సార్‌ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు
- ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్
- ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్
- వైఎస్సార్ సమాధి వద్ద పూలమాలలతో నివాళులర్పిస్తున్న సీఎం జగన్, వైఎస్సార్‌సీపీ నేతలు
కాసేపట్లో ఇడుపులపాయకు సీఎం జగన్
- కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్
- కాసేపట్లో ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయకు
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటనపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ
►తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
►గన్నవరం నుండి కడప ఎయిర్ పోర్ట్ కి బయల్దేరిన సీఎం జగన్మోహన్ రెడ్డి.
జాబితాలో పెద్దగా మార్పులు ఉండవు: సజ్జల
- అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్పష్టత ఇచ్చాం
- 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలు గెలవడమే లక్ష్యం
- మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నాం
- వైఎస్సార్‌సీపీ తుది జాబితాలో ఇది కనిపిస్తుంది
ఇడుపులపాయకు బయల్దేరిన సీఎం జగన్
- వైఎస్సార్‌ఘాట్ వద్ద కాసేపట్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన
- మధ్యాహ్నం 12.30కు వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళి
- ఆ తర్వాత.. మధ్యాహ్నాం 12.50 నుంచి 1.20 వరకు జాబితా ప్రకటన
- సీఎం జగన్ సమక్షంలో.. అభ్యర్థుల పేర్లను రిలీజ్ చేయనున్న వైఎస్సార్‌సీపీ నేతలు
- అసెంబ్లీ ఎన్నికల కోసం 175, లోక్‌సభ ఎన్నికల 25 మంది పేర్లను ఒకేసారి ప్రకటించనున్న పార్టీ
సామాజిక న్యాయం ప్రతిబింబించేలా జాబితా..
►మధ్యాహ్నాం 12.58 నిమిషాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితా ప్రకటన
►సీఎం జగన్ సమక్షంలో అభ్యర్థుల్ని ప్రకటించనున్న ధర్మాన, ఎంపీ నందిగం సురేష్
►బీసీతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఉండే అవకాశం
►అన్ని వర్గాలకు అవకాశాలు ఉండేలా తుది జాబితా
►ఇప్పటికే 68 అసెంబ్లీ స్థానాలకు మార్పులు ప్రకటించిన వైఎస్సార్‌సీపీ
►32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 14 మంది సిట్టింగ్ ఎంపీలకు పక్కన పెట్టిన అధిష్టానం
►సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపోటములే ప్రామాణికంగా నిర్ణయం తీసుకున్న సీఎం జగన్
►ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితాను నేడు ప్రకటించనున్నారు.
►ఇడుపులపాయ వద్ద 200 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రకటిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ధర్మాన ప్రసాదరావు, నందిగామ సురేష్ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.
►వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటే అవకాశం. అన్ని వర్గాలకు అవకాశం ఉండే విధంగా వైఎస్సార్‌సీపీ జాబితా రూపొందించినట్టు సమాచారం.
సీఎం జగన్ ఇడుపులపాయ షెడ్యూల్ ఇలా..
►ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ చేరుకుంటారు.
►అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. అనంతరం ఇడుపులపాయ నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.
►మరోవైపు గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశ్వసనీయతను చాటుకున్నారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మేనిఫెస్టోను ప్రకటించాక.. ఆ వెంటనే పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ ప్రచార భేరి మోగించనున్నారు.
►ఈ నెల 18 నుంచి ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు రెండు లేదా మూడు బహిరంగసభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రచార ప్రణాళికను రూపొందించారని తెలుస్తోంది. ఓవైపు సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. మరోవైపు వైఎస్సార్‌సీపీ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో దూసుకెళ్లే దిశగా అడుగులేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment