ఒట్టి మాటలు వద్దురా.. గట్టి పనులే మేలురా...
విశ్వసనీయతే ఊపిరిగా మ్యానిఫెస్టో కూర్పు
జగనన్న చెప్పాడంటే చేస్తాడంటున్న ప్రజలు
అది కాదురా అప్పలరాజు.. కంకర్రాళ్ళు గంపెడు ఎందుకురా.. పనికొచ్చే రత్నం ఒక్కటి ఉంటె సరిపోదేట్రా.. ఎదవ సంతానం పదిమందిని కంటే యేటి లాభం.. వజ్రంలాంటి కొడుకు ఒక్కడు ఉంటె సరిపోదేట్రా.. కాయలివ్వని చెట్లు వెయ్యి ఉంటె యేటి లాభం.. పళ్ళిచ్చే మొక్క ఒక్కటి సరిపోదేట్రా.. అంటున్నారు నారాయణ.. ఒరేయ్ బాబు నీ ఎగ్జామ్పుల్స్ ఆపురా నాయిన ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావ్... హాయిగా తాటిముంజెలు తిని ప్రశాంతంగా కూకోరా అన్నాడు... అప్పలరాజు... వెంటనే నారాయణ అందుకుని.... అదేరా.. నిన్న జగన్ మ్యానిఫెస్టో ఇచ్చాడు కదా... అదైతే నాకు నచ్చిందిరా... చక్కగా రైతులకు... మహిళలకు, చిరు ఉద్యోగులకు తాను ఏమి చేయగలడో అది క్లారిటీగా చెప్పేసాడు... చంద్రబాబు మాదిరి వంద మాటలు చెప్పి రెండు అమలు చేసి మిగతావి ఎగదొబ్బే రకం కాదని లచ్ఛమంది సమక్షంలో ఒప్పుకున్నాడు.
తండ్రి మాదిరి మనిషిరా... ఎక్కడా మాయ మర్మం.. ఉండవు... చెప్పేదే చేస్తాడు..చేసేదే చెబుతాడు...అదన్నమాట... అన్నాడు నారాయణ... ఐతే ఇప్పుడేమంటావ్ రా బాబు అన్నాడు అప్పలరాజు... నేనేమీ అనడం లేదురా.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నాయకుడు మనకు ఉండాల... చంద్రబాబు మాదిరి వెయ్యి మాటలు చెప్పి... రెండో మూడో అమలు చేసి కాదన్నా మ్యానిఫెస్టోను దాచేసేవాడు మనకు వద్దురా బాబు... ఎంత చేయగలడో... అదే చెప్పాడు.. కాబట్టి నాకు మరొక్కసారి జగన్ నచ్చాడురా... అన్నాడు.. నారాయణ.. నువ్వన్నదీ నిజమేరా.. అలా నిజాయితీగా చేసేవాళ్ళు... చెప్పేవాళ్ళు లేరిప్పుడు... ఇక చంద్రబాబు ఐతే మొత్తం మాయ చేస్తాడు... అలాంటివాళ్లను ఇప్పటికే మూడుసార్లు నమ్మి మునిగిపోయాం చాలురా బాబూ... అనుకుంటూ తాటిముంజెలు తింటూ కూర్చున్నారు ఇద్దరు...
అమలు చేయని హామీలు ఎన్ని ఇస్తే ఏమి లాభం... కదలని చెక్క గుర్రం ఎంత బావుంటే ఏమి లాభం.... పాలివ్వని ఆవు ఎంత అందంగా ఉంటె ఏమి లాభం... అలాగే అమలు చేయని మ్యానిఫెస్టోలో ఎన్ని పథకాలు ఎన్ని హామీలు ఉంటె ఏమి లాభం... అందుకే చెప్పేదే చేస్తాం... చేసేదే చెబుతాం .... విశ్వసనీయతే మా ప్రాణం... ఇచ్చిన మాట మీద నిలబడడమే మా విశ్వసనీయత అంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన మ్యానిఫెస్టో ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆకాశాన్నంటే హామీలు లేవు...ఇంటింటిలో బంగారం గుమ్మరిస్తాం అనే బొంకులు లేవు.. ఊరూవాడా పందిరివేస్తాం... రోజూ మీకు విందుభోజనాలు పెడతాం అనే మాయలు లేవు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ...ఎక్కడెక్కడ .. ఏఏవర్గాలకు ఏయే విధంగా మరింత మేలు చేయగలమో అక్కడక్కడా అలా చేస్తూ వెళతాం అంటూ హామీ ఇచ్చారు.. అమ్మఒడి .. రైతుభరోసా వంటివి ఆయావర్గాలకు మేలు చేస్తాయి.
ఇక మిగతా పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నవి వాటిని యథాతథంగా కొనసాగిస్తారు... అన్నిటికీ మించి చంద్రబాబు మాదిరిగా నోటికొచ్చింది చెప్పడం, తరువాత మాట తప్పడం జగన్ వద్ద ఉండదు.. ఏది చెబుతారో అదే చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉండడంతో ఉన్నవి చాలు... ఈ మాత్రం సరిగ్గా అమలైతే ఇంకేం కావాలి... చంద్రబాబు వస్తే అవి కూడా ఇవ్వడు.. మాటలు చెప్పి ఓట్లేయించుకుని మోసం చేస్తాడు అని ప్రజలు తమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. జగన్ అన్న ఉంటే చాలు... ఉన్న పథకాలు అమలు చేస్తారు అనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది.AP people praising cm ys jagan manifesto 2024 for ap elections
:::: సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment