సాక్షి, గుంటూరు: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య బూడిద గొడవ చివరికి చంద్రబాబు వద్దకు చేరింది. ఆదినారాయణరెడ్డికి వ్యతిరేకంగా ఎస్పీకి జేసీ ఘాటు లేఖ రాసిన సంగతి తెలిసిందే. జేసీ లేఖ నేపథ్యంలో కూటమిలో ప్రకంపనలు సృష్టించగా.. పంచాయితీ తేల్చడానికి ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు పిలిపించారు. అయితే, చంద్రబాబుతో భేటీ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఆదినారాయణరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
‘‘వెట్ డ్రై యాష్ అనేది ఉచితం. పీఎంఈజీపీలో తీసుకుపోతామని అంటాం. ఈ మాత్రం దానికే జేసీ ప్రభాకర్‌రెడ్డి పెద్ద లేఖ రాశారు. లెటర్ రాసిన వాడు స్వయంగా రావాలి కదా? ఎందుకు రాలేదు. జ్వరమో.. ఇంకేదో నాకు తెలియదు.
..బీజేపీ, టీడీపీ సమస్య కాదు ఇది. స్థానికత సమస్య ఇక్కడ ఉంది. అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీ తన ఏరియాలో ఉంది కనుక జెసీ ప్రభాకర్‌రెడ్డి అడుగుతున్నాడు. సీఎం నిర్ణయం తీసుకుంటారు. ఆయన చెప్పినట్లు వింటాం. జేసీ దివాకర్‌రెడ్డిది ఏమైనా రాజరికమా?. కాంగ్రెస్ నుంచి ఆయన టీడీపీకి వచ్చాడు.. నేను టీడీపీ నుంచి బీజేపీకి వచ్చా.. కూటమిలో ఉంటూ కూటమిని విమర్శించడం సరికాదు’’ అని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అటు ఆది.. ఇటు జేసీ ‘బూడిద’ రగడ!
Comments
Please login to add a commentAdd a comment