adinarayana reddy
-
అవినీతిలో ‘ఆది’పత్యం
ఆయనో మాజీ మంత్రి. సొంత పేరు కంటే.. పేకాట పాపారావంటే స్థానిక ప్రజలు సులభంగా చెప్పేస్తారు. సోదరుడిని, ఆయన తయారు చేసుకున్న వర్గాన్ని అణగదొక్కి మరీ రాజకీయాల్లోకి వచ్చారు. దివంగత మహానేత వైఎస్సార్ భిక్షతో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన మరణం తర్వాత విచ్చలవిడి దోపిడీకి బరితెగించారు. గండికోట ప్రాజెక్టు, గాలేరు–నగరి సొరంగం పనుల కాంట్రాక్టర్ల నుంచి రూ.కోట్లలో దోచుకున్నారు.కాలువ తవ్వకాల్లో వచి్చన బండరాళ్లను కూడా వదల్లేదు. కంకరగా మార్చి అక్రమార్జన చేశారు. పక్క రాష్ట్రానికి ఇసుక తరలించేందుకు పెన్నానదికి గర్భశోకం కలిగించారు. నీరు–చెట్టు పథకంలో ఆయన దోపిడీకి అడ్డు లేదంటే అతిశయోక్తి కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నమ్మినవారిని నట్టేట ముంచడం,పారీ్టలు మారడం అంటే ఆయనకు మంచినీళ్లు తాగినంత సులభం.సాక్షి టాస్క్ ఫోర్స్: ‘‘జమ్మలమడుగులో వర్గ పోరాటం కొనసాగించాం. మా సర్వస్వం కోల్పోయాం. ఆస్తులు కూడా తాకట్టులో ఉన్నాయి. ఒక్క అవకాశం ఇవ్వండి..’’ అంటూ రాజకీయాల్లోకి వచ్చారు. గెలిచారు. ఆ తర్వాత ఆయన సాగించిన దోపిడీతో రాష్ట్రంలోనే అత్యధిక సంపాదనాపరుల్లో ఒకరిగా మారారు. ప్రకృతి వనరుల దోపిడీలో ఆయన జోరు చూసి నియోజకవర్గ ప్రజలే నోరెళ్లబెట్టారు. ప్రభుత్వ, కొండ పోరంబోకు భూములను వందల ఎకరాలు స్వాహా చేసి, తన సాగులోకి చేర్చుకున్నారు. సోలార్ ప్రాజెక్టు పనుల్ని శాసించారు. చివరికి గండికోట నిర్వాసితుల చెక్కుల్నీ స్వాహా చేశారు. చెప్పుకుంటూ పోతే.. ఆయన అక్రమాలకు లెక్కే లేదు. ఇప్పుడు కేంద్ర పారీ్టలో చేరి, మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రతి అవకాశం.. ఆదాయ మార్గందేవగుడి, గొరిగనూరు, పెద్దదండ్లూరు, సున్నపురాళ్లపల్లె, చలివెందుల, సుగమంచుపల్లె, ధర్మాపురం గ్రామాల్లో ఈ నేత కుటుంబ ఆధిపత్యం యథేచ్ఛగా సాగుతోంది. అనూహ్య పరిస్థితుల్లో అమాత్యుని హోదా దక్కించుకున్నారు. ఇంకేముంది ఆయా గ్రామాల పరిధిలో పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బెంగళూరు తదితర ప్రాంతాలకు భారీ వాహనాలతో ఇసుకను తరలించారు. కేవలం ఇసుక తరలింపుతోనే రూ.వందల కోట్లు ఆర్జించారు.పేకాట పాపారావు ఈయనకు స్థానికంగా మరో పేరు కూడా ఉంది. పేకాట పాపారావుగా బాగా ప్రసిద్ధి. 2019 ఎన్నికల తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా పేకాట కోసం బెంగళూరు క్లబ్బును తన నివాసంగా మార్చుకున్నారు. గత నాలుగున్నరేళ్లూ నమ్ముకున్న కార్యకర్తలకు దూరంగా పత్తాలేకుండా పోయారు. ఆ మధ్య ఓ చానల్ ఇంటర్వ్యూలో కూడా తన జూద ప్రావీణ్యతను మహ సరదాగా చెప్పుకొచ్చారు.ఆ నేతపై ఉన్న కేసుల్లో కొన్ని ఈ నేతపై పోలీసు కేసులు కూడా ఉన్నాయి. ∗ 2020లో క్రైమ్ నెం.130 పేరిట 143, 144, 147, 148, 323, 324, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ∗ మైదుకూరు పోలీసు స్టేషన్లో క్రైమ్ నెం.239/2020 కేసు ఉంది. ∗ తుళ్లూరులో క్రైమ్ నెం.65/2023 ఐపీసీ 294, 504, 505(2), 506 సెక్షన్ల కింద కేసులు నమోదయినట్లు సదరు నేత తన ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు.ప్రభుత్వ భూములు స్వాహా.. ఈ మాజీ అమాత్యుని కుటుంబ సభ్యులు పెన్నానది ఇసుకతో సరిపెట్టుకోలేదు. ఇసుక తరలిపోగా ఏర్పడిన గట్టి ప్రాంతాన్ని వ్యవసాయ భూములుగా మార్చి, సాగులోకి తెచ్చారు. సమీప బంధువుల పేరిట సున్నపురాళ్లపల్లె సమీపంలో 300 ఎకరాలు సాగుచేసి అనుభవిస్తుండగా, అవి స్టీల్ ప్లాంట్ పరిధిలోకి వెళ్లాయి. సర్వే నెం.411లో కొండపోరంబోకు భూమిని ఆక్రమించి బినామీల పేర్లతో సాగు చేసుకునేవారు. సర్వే నెం.64లో గొరిగనూరు గ్రామానికి చెందిన ఈతని బంధువు సబ్ డివిజన్ చేయించి మరీ భూముల్ని ఆక్రమించారు. దేవగుడి ఆధిపత్య గ్రామాల్లో ఈ కుటుంబం వందలాది ఎకరాల కొండ ప్రాంతాన్ని ఆక్రమించి సొమ్ము చేసుకుంది.‘డైమన్షనల్’దందా టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఈయనకు అడ్డూఅదుపూ లేదు. మైలవరం మండలంలోని కొండల్లో విలువైన, అరుదైన ఖనిజాలు లభిస్తాయి. అందులో డైమన్షనల్ స్టోన్ ఒకటి. ఆ రాయిని శిల్పాలు, దేవాలయాల నిర్మాణానికి ఉపయోగిస్తారు. ఒక్కొ టన్ను ధర రూ.వేలల్లోనే. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా, రాయల్టీ చెల్లించకుండా అక్రమంగా తరలించారు. రూ.కోట్లలో ఆర్జించారు.గ్రావెల్ అక్రమ రవాణా స్థానికంగా అడ్డుకునే వారు లేకపోవడంతో.. నియోజకవర్గ పరిధిలోని శిరిగేపల్లి, సున్నపురాళ్లపల్లె కొండల్లో రోడ్లకు ఉపయోగపడే గ్రావెల్‌ను ఈ మాజీ అమాత్యుని సమీప బంధువే అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. పొక్లెయినర్ల సాయంతో కొండలు, గుట్టల్ని పెకలించేశారు. క్రషర్ ద్వారా కంకరగా మార్చి సొమ్ము చేసుకున్నారు.పాలూరు ఎత్తిపోతల పథకం చేపట్టిన కోయా కంపెనీ, సుజిలాన్ పవర్ విండ్ ప్రాజెక్టుతోపాటు సోలార్ కంపెనీ యాజమాన్యం నుంచి ఎన్నికల ఖర్చుల పేరిట దందాల ఆరోపణలూ ఉన్నాయి. ఎన్టీపీసీ సోలార్ ప్రాజెక్టు ఎర్త్ పనులు ఈ కుటుంబం కనుసన్నుల్లోనే జరిగాయి. నీరు–చెట్టు పథకం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్లు పనులు జరిగితే, అందులో సగం సొమ్ము ఈయన సన్నిహితుల జేబులోకే వెళ్లినట్లు సమాచారం. -
బెదిరింపుల పర్వం!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే, దరిదాపుల్లో కూడా నిలవలేం. అవకాశం ఉన్న చోట పోలింగ్ ఏకపక్షంగా నిర్వహించుకునే చర్యలు చేపట్టాలి. అందుకు ఎవరి స్థాయిలో వారు పనిచేయండి. నా ప్రమేయం అవసరమైన చోట చెప్పండి. నేనే స్వయంగా రంగంలోకి దిగుతా. నయానో.. భయానో ఈమారు అనుకూలంగా మలుచుకోవాలి. ఎవరి పాత్ర వారు సమర్థవంతంగా నిర్వర్తించండి. మరీ ముఖ్యంగా ఈ ఏడు గ్రామాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.. అని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు దిశా–నిర్దేశం చేశారు. ఆపై బెదిరింపుల పర్వానికి తెరలేపుతున్నారు. దేవగుడి పరిసర ప్రాంతాలైన గొరిగెనూరు, ధర్మాపురం, సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు, సుగమంచిపల్లె, శేషారెడ్డిపల్లె, శిరిగేపల్లె గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరులుగా ఉన్నప్పుడు ఆయా గ్రామాల ప్రజలు దేవగుడి కుటుంబానికి మద్దతుగా ఉండేవారు. దేవగుడి సోదరులు తెలుగుదేశం పారీ్టలో చేరిన తర్వాత అదే గ్రామాలకు చెందిన వారు వైఎస్ కుటుంబం వెంట నడుస్తూ వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచారు. తాజాగా బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి తెరపైకి వచ్చాక, ఇప్పుడు అవే గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సోదరులను ఆయా నేతలపైకి ఉసిగొల్పారు. సౌమ్యంగా మద్దతు కోరండి, డబ్బు ఆశ చూపండి, అప్పటికీ మీమాట వినని వారితో నేను స్వయంగా మాట్లాడతా.. తర్వాత దౌర్జన్యం చేసేందుకు కూడా వెనుకడవద్దని వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే ఆ ఏడు గ్రామాలకు చెందిన నాయకులతో వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ మంచిగా మద్దతు కోరుతున్నట్లు సమాచారం. రాబోవు రోజుల్లో మరింత స్పీడు పెంచి భయపెట్టుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తే... ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్తే దరిదాపుల్లో కూడా పోటీలో నిలువలేమనే అంచనాకు దేవగుడి సోదరులు వచ్చినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో దాదాపు 87 శాతం ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందినట్లు గుర్తించారు. ఓటుకు వెళ్తే అభ్యర్థులతో నిమిత్తం లేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా వైఎస్సార్సీపీకి మద్దతు లభిస్తున్నట్లు గ్రహించారు. ఇక పాత తరహాలో పోలింగ్ చేపట్టకపోతే ఉపయోగం లేదనే అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే మైలవరం మండలంలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ఓ సర్పంచ్‌పై బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. వైఎస్సార్సీపీకి ప్రచారం వరకే పరిమితం కావాలని, పోలింగ్‌కు మూడు రోజుల ముందు నుంచి గ్రామంలో ఉండొద్దని హెచ్చరించినట్లు తెలిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే సూత్రాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. పాత రోజులను గుర్తు చేయవద్దనే తరహాలో బెదిరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. పరిస్థితిని బట్టి డబ్బులకు మెత్తబడే వారిని డబ్బుతో వశపరుచుకోవాలని, అలా కాదన్నవారి విషయాలపై దౌర్జన్యాకు సైతం వెనుకాడవద్దనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటి నుంచే పటిష్టమైన చర్యలు చేపట్టి గ్రామస్థాయి నేతలు భయభాంత్రులకు గురి కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
సాక్షి ప్రతినిధి, కడప: ఎంతటి సమావేశమైనా సరే, ఆయన వచ్చేంతవరకూ వేచి ఉండాల్సిందే. కుటుంబ సభ్యులకైనా, అనుచరులకైనా, సన్నిహితులైనా ఎవరికైనా సరే, ఆయన చెప్పిందే వేదం, సూచించిందే ఫైనల్. మరీ ముఖ్యంగా బాబాయ్ మాట కోసం అబ్బాయ్‌కి ఎదురుచూపులు ఉండేవి. ఇదంతా గతం. ప్రస్తుతం కథ అడ్డం తిరిగింది. అబ్బాయ్ లేనిదే బాబాయ్ బయటికెళ్లలేని దుస్థితి ఎదురవు తోంది. ‘అహం బ్రహ్మస్మీ’ అన్నట్లుగా వ్యవహారం తల్లకిందులయ్యింది. నా అనుకున్న వారంతా ఛీదరించుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. అబ్బాయ్ కోసం బాబాయ్ వెయిట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈమొత్తం వ్యవహారం జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డికి వర్తించనుంది. ‘ఆది మాట తప్పడు, మడమ తిప్పడు’ అనే నినాదంతో ఆదినారాయణరెడ్డి రాజకీయ ఆరంగ్రేటం చేశారు. అనతికాలంలోనే అవకాశవాదికి నిదర్శనం ‘ఆది’ అని ఆయన చర్యలు రుజువు చేశాయి. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చలువ నీడలో ఎదిగిన ఆది తక్కువ కాలంలోనే సహజ సిద్ధమైన ప్రవర్తన బహిర్గతమవుతూ వచ్చింది. అప్పట్లో జిల్లాలోని నాయకులంతా వైఎస్ కుటుంబానికి అండగా పదవులు త్యజించేందుకు సిద్ధం అయ్యారు. అప్పటి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా నిలిచారు. ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులుపై అనర్హత వేటు పడింది. కానీ అప్పట్లో ‘అసెంబ్లీలో కిరణ్...బయట జగన్’ అంటూ ఆదినారాయణరెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. అధికారాన్ని కోల్పోయేందుకు ఇష్టపడని ఆయన వైఎస్ కుటుంబానికి అండగా నిలువలేకపోయారు. కానీ వైఎస్ కుటుంబం అండ లేకపోతే, గెలిచే పరిస్థితి లేదని 2014లో మళ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థిత్వం స్వీకరించి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పారీ్టలో చేరి ..మంత్రి పదవి దక్కించుకున్నారు. అంతటితో ఆగకుండా వైఎస్ కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడారు. తొమ్మిదిన్నర్ర చెప్పుతో కొట్టాలన్నారు. ఫలితంగా తర్వాత జరిగిన ప్రజాతీర్పులో ఆదినారాయణరెడ్డి కొట్టుకుపోయారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కుటుంబంలోనూ ఏకాకిగా... కుటుంబంలో ఎప్పుడూ పైచేయిగా నిలిచే ఆదినారాయణరెడ్డి తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఏకాకిగా మిగిలారు. విభజించు, పాలించు అన్న ధోరణిని వంటబట్టించుకున్న ఆయన దేవగుడి కుటుంబంలో అన్న కుమారుడు భూపేష్‌రెడ్డి రాజకీయ వారసత్వానికి బ్రేకులు వేశారు. మరో సోదరుల తనయులు గోవర్ధన్‌రెడ్డి, రాజే‹Ùరెడ్డిలను చేరదీశారు. ఒక్కమాటలో చెప్పాలంటే భూపేష్ రెడ్డికు ప్రత్యామ్నాయంగా తయారు చేశారు. ‘టీడీపీ ఇన్ఛార్జిగా తీసుకోవడం కాదు, టికెట్ తెచ్చుకోవడం గొప్ప. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుంది, బీజేపీ టికెట్ తనకే ఇస్తుందని’ ఏడాదికి ముందు నుంచే ఆదినారాయణరెడ్డి సన్నిహితులతో చెప్పుకుంటూ వచ్చారు. అచ్చం అదే తీరులో పొత్తు పొడవడం, ఆదికి బీజేపీ టికెట్ దక్కడం క్రమంగా తెరపైకి వచ్చాయి. అప్పటి వరకూ రాజకీయంగా బలోపేత చర్యలు చేపట్టిన భూపేష్ నిర్ఘాంతపోయారు. జమ్మలమడుగులో సీన్ రివర్స్ఆదికి బీజేపీ టికెట్ ప్రకటించిన తర్వాత నాలుగు రోజులైనా స్వగ్రామంలో అడుగు పెట్టని పరిస్థితి తలెత్తింది. కుటుంబం యావత్తు భూపేష్‌కు అండగా నిలిచింది. స్వతంత్ర అభ్యరి్థగా రంగప్రవేశం చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఈ పరిస్థితిని పసిగట్టిన ఆది కొంత ఓపిక పట్టారు. భూపే‹Ùకు టీడీపీ పార్లమెంటు టికెట్ అప్పగించేంత వరకూ వేచి ఉండి తర్వాత అడుగుపెట్టారు. ఇక తామంతా ఒక్కటేనంటూ చెప్పుకోవాల్సిన దుస్థితి ఆదినారాయణరెడ్డి వచ్చి చేరింది.జమ్మలమడుగు పర్యటనల్లో భూపేష్ కోసం ఆదినారాయణరెడ్డి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకు మనకు అండగా ఉంటున్నాడా? లేదా? అని సన్నిహితులతో క్రాస్ చెక్ చేసుకోవాల్సిన దౌర్భాగ్యం నెలకొంది. మరోవైపు గ్రామస్థాయి నాయకులు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డిని విశ్వసించే పరిస్థితి లేదు. సన్నిహితులే కాదు, సమీప బంధువులు సైతం దూరమవుతున్నారు. ఈక్రమంలోనే జమ్మలమడుగుకు మాజీ మున్సిపల్ చైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి సైతం వైఎస్సార్సీపీలో చేరిపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆది పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అడుగడుగునా అవకాశవాదం తెరపైకి వస్తుండడమే ఇలాంటి దుస్థితికి కారణమని పలువురు చెప్పుకుంటున్నారు. -
దళితులపై పెత్తందారీ తోడేలు దొంగ ప్రేమ
రామోజీరావు: వేలాది దళిత కుటుంబాలను రోడ్డు మీదకు లాగి వారి ఆశలను చిదిమేసి హైదరాబాద్‌లో ఫిలిం సిటీని నిర్మించిన పెత్తందారీ కర్కోటకుడు. ఫిలిం సిటీ కోసం దళితుల నుంచి వందలాది ఎకరాల అసైన్డ్, భూదాన్ భూములను నిర్ధాక్షిణ్యంగా లాక్కున్న కబ్జాకోరు. గ్రామాలకు వెళ్లే రోడ్లను ఫిలిం సిటీలో కలిపేసుకుని గోడ గట్టి, ఆ గ్రామాల ప్రజలను నానా తిప్పలు పెట్టి, వారి ఉసురు తీసిన రక్త పిపాసి. వేలాది దళిత కుటుంబాలను నిర్దాక్షిణ్యంగా చిదిమేసి రాజసౌధాలను నిర్మించుకుని రాజులా చలామణి అవుతున్న ఆధునిక నరకాసురుడు. ఇప్పుడు వారిపై తనకు అమిత ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న తోడేలు. చంద్రబాబు: రాష్ట్రంలో పచ్చ ముఠాకు నాయకుడు. దళితులంటే అస్సలు పడని ఓ పెత్తందారు. ఆయన హయాంలో దళితులపై లెక్కలేనని దాడులు, అవమానాలు. ముఖ్యమంత్రిగా ఉండగానే ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ వ్యాఖ్యానించిన దళిత ద్వేషి. ఈయనే కాదు.. ఈయన వెంట ఉన్న నేతలదీ అదే తీరు. దళితులకు రాజకీయాలెందుకురా అంటూ హుంకరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. దళితుల దగ్గర కంపు కొడుతుందంటూ ఈసడించుకున్న ఆదినారాయణ రెడ్డి. వీళ్లే కాదు.. టీడీపీలో అనేక మంది నేతలది ఇదే తీరు. వీళ్లంతా రామోజీ నమ్మిన బంటు చంద్రబాబు బ్యాచ్. అందుకే దళితులపై వీళ్లెంతగా వీరంగం వేసిన రామోజీకి కనిపించదు, వినిపించదు. సీఎం వైఎస్ జగన్: నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ దళితులను కుటుంబ సభ్యుల్లా అక్కున చేర్చుకున్న నాయకుడు. వారిని రాజకీయంగా, అన్ని రంగాల్లో ఉన్నత స్థితి కల్పిస్తూ, వారి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి, ఎవరినీ పైసా అడగాల్సిన పని లేకుండా ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ముఖ్యమంత్రి. వారిని సాధికారత వైపు నడిపించి, సమాజంలో గౌరవం కల్పించి, తలెత్తుకొని తిరిగేలా చేసిన నేత. దళితులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తారు కాబట్టే ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాను ఇటీవల ఆ వర్గానికి చెందిన నేత నందిగం సురేష్ తో విడుదల చేయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే దళితుల మనసు గెల్చుకున్న దళిత బంధువు. – సాక్షి, అమరావతి రామోజీ కపట నాటకం తానే స్వయంగా దళితుల భూములు లాక్కొని, వారి కంటి నుంచి రక్తం కారేలా ఏడిపించిన రామోజీ.. ఇప్పుడు దళితులపై ప్రేమ అంటూ కపట నాటకమాడుతున్నారు. జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు అంటిందంటూ ఈనాడులో రక్తపు రాతలు రాసి అక్కసును బయటపెట్టుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో దళితులకు దక్కిన గౌరవం ఏ పాటిదో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇది తమ ప్రభుత్వమని ప్రతి దళితుడూ చెప్పుకునే రాష్ట్రంలో అనుకోకుండా జరిగిన ఒకట్రెండు ఘటనలను బూచిగా చూపి దళితుల నెత్తురు జగన్ చేతులకు అంటిందని నిస్సిగ్గుగా రాయడం ఆకాశంపై ఉమ్మి వేయడం లాంటి ప్రయత్నమేనని విశ్లేషకులు చెబుతున్నారు. దళితులంటే అంటరాని వారనే ఆదిమ సమాజపు భావజాలంతో వారిని అడుగడుగునా అవమానిస్తున్న చంద్రబాబు బ్యాచ్‌కు మద్దతు పలికిన రామోజీరావు.. దళితులకు అన్ని విధాలుగా అండదండలందిస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై బురద జల్లేలా రాసిన రాతలను అసలు ఎవరైనా నమ్ముతారా? ఈ లాజిక్ రామోజీ బుర్రకు అందదు. ఎందుకంటే.. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చాలన్నదే ఆయన ఏకైక అజెండా. అందుకే తప్పుడు రాతలతో ప్రజలను పక్కదోవ పట్టంచాలని ప్రయత్నిస్తున్నారు. బాబు హయాంలో దారుణ దమనకాండ చంద్రబాబు హయాంలో దళితులపై దారుణమైన దమనకాండ జరిగినా అసలు ఏమీ జరగనట్లు దొంగ నిద్ర నటించాడు రామోజీ. సాక్షాత్తూ బాబు సీఎంగా ఉన్నప్పుడే వారి పుట్టుకనే అవమానç³రిచేలా అన్యాయమైన వ్యాఖ్యలు చేసినా కిమ్మనలేదు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని బాబు అన్నప్పుడు దళిత సమాజం మొత్తం భగ్గుమంది. అప్పుడు రామోజీ వంత పలికింది దళితులకు కాదు.. బాబుకు. బాబు మంత్రివర్గ సభ్యుడు ఆదినారాయణరెడ్డి దళితులను అవహేళన చేసినప్పుడు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నీచంగా తూలనాడినా రామోజీకి దళితులపై ప్రేమ పుట్టలేదు. 2017 డిసెంబర్లో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనుచరులు ఓ దళిత మహిళపై దాడి చేసి, ఆమె బట్టలు చింపి పొలం నుంచి ఈడ్చిపడేసినా పట్టించుకునే నాథుడే లేడు. బాబు హయాంలో దళితులు నిత్యం భయంగా బతికే పరిస్థితులు ఉండేవి. తమపై దాడులు జరిగితే పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యేవి కాదు. కేసు పెట్టడానికి దళితులు పోరాడాల్సివచ్చేది. బాబు హయాంలో ఎస్సీలపై నేరాల సంఖ్య పెరిగినట్లు క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలే చెబుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు తగ్గిపోయాయి. దళితుల భద్రతకు పెద్దపీట వేయడంతోపాటు దళిత మహిళనే హోంమంత్రిగా చేసిన ఘనత వైఎస్ జగన్‌ది. అలాంటి జగన్ చేతులు దళితుల రక్తం అంటిందంటూ అడ్డగోలు రాతలతో రామోజీ ఆక్రోశం వెనుక బాబును పీఠం ఎక్కించాలన్న తపన ఉందని మేధావులు అంటున్నారు. దళితుల గురించి చంద్రబాబు, టీడీపీ నేతలు చేసిన దారుణ వ్యాఖ్యలు ♦ ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? అందరూ సంపన్న వర్గాల్లోనే పుట్టాలని కోరుకుంటారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాలు ఏలవచ్చనుకుంటారు. కులాలను బట్టి ఓట్లు రావు. వాటితో ఎవడూ గెలవలేడు. మంద కృష్ణ ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేకపోయాడు. - సీఎం హోదాలో 2016 ఫిబ్రవరి 9న చంద్రబాబు ♦ దళితులు శుభ్రంగా ఉండరు. వారి దగ్గర వాసన వస్తుంది. వాళ్లు సరిగా చదవరు. అయినా ఎస్పీలు అవుతారు. రిజర్వేషన్లు పదేళ్ల కోసం ఇస్తే 70 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. పట్టాలిస్తే వాటిని నిలుపుకోరు. – 2017లో చంద్రబాబు మంత్రివర్గం సభ్యుడిగా ఉన్నప్పుడు ఆదినారాయణరెడ్డి ♦రాజకీయంగా మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరు దళితులు. మీరు వెనుకబడిన వారు. మీరు షెడ్యూల్డ్ క్యాస్ట్ వారు. రాజకీయాలు మాకుంటాయి. మాకు పదవులు. మీకెందుకురా పిచ్చి –––––––––––––––– – 2019 ఫిబ్రవరి 20న టీడీపీకి చెందిన అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితుడిపై దాడి చేసేది టీడీపీ నాయకులే రాష్ట్రంలో దాడులు చేసేది టీడీపీ నాయకులే. వారు అధికారంలో ఉన్నా, లేకపోయినా దళితులే లక్ష్యంగా దాడులు చేస్తుంటారు. దళిత నాయకుడినైన నాపై అంబేడ్కర్ జయంతి రోజున టీడీపీ అభ్యర్థి బోనెల విజయచంద్ర తన అనుచరులతో దాడికి దిగారు. మా ఇంటికి వచ్చి తలుపులు పగులగొట్టి వీరంగం సృష్టించారు. ఇవి ఈనాడు రామోజీరావుకు కనిపించవు. దళిత ద్రోహి చంద్రబాబే. ఈ రోజు ఆయనకు మద్దతుగా ఈనాడులో తప్పుడు కథనాలు ఇవ్వడం దారుణం. టీడీపీ పాలనలో దళితులపై జరిగిన దాడులు రాయాలంటే పేపర్లు చాలవు. – అలజంగి జోగారావు, ఎమ్మెల్యే, పార్వతీపురం ఎవరు మేలు చేశారో తెలుసు దళితులకు సీఎం జగన్ పాలనలోనే మేలు జరిగింది. దళితులను అక్కున చేర్చుకొని, ఉన్నత స్థితికి చేర్చింది సీఎం వైఎస్ జగన్ మాత్రమే. ఎన్నికల వేళ ఈనాడు అధినేత రామోజీరావుకు మతి భ్రమించింది. ఎస్సీ సామాజిక వర్గం ఓట్ల కోసం తప్పుడు కథనాలు వండివార్చితే నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. ఓటమి భయంతో నిత్యం కట్టు కథలు అల్లుతున్నారు. గత ఎన్నికల్లోనూ వారిది ఇదే ధోరణి. ప్రజలు ఎప్పుడూ వాస్తవాలనే స్వీకరిస్తారు. ప్రజలంతా బాబు అండ్‌కో ను ఛీ కొడుతుంటే ఎలాగైనా బాబును గద్దెనెక్కించాలని, తద్వారా కేసుల నుంచి తప్పించుకోవాలని రామోజీ తాపత్రయపడుతున్నారు. – రేగాన శ్రీనివాసరావు, టూరిజం కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చంద్రబాబే దళితుల ద్రోహి దళితులంటే బాబుకు గిట్టదు. కేవలం ఓట్లు దండుకోవడానికే మాత్రమే బాబుకు ఎస్సీలు కావాలి. తర్వాత తన సామాజికవర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ఎస్సీలపై ఆయన చేసిన దాడులన్నీ చెప్పుకుంటూ పోతే పుస్తకం రాయొచ్చు. ఎవరైనా ఎస్సీలుగా పుడతారా అని హేళన చేసింది చంద్రబాబే. ఇటీవల ఓ మైనారిటీ సమావేశంలో కూడా ఎస్సీలను చులకన చేసి మాట్లాడారు. క్రైస్తవులంతా ఎస్సీలని, అధికారంలోకి వస్తే వాళ్ల అంతు చూస్తామన్నట్లుగా బెదిరింపు ధోరణిలో వ్యవహరించారు. ఇటువంటివన్నీ పచ్చ పత్రికలు కప్పిపుచ్చి బాబును వెనకేసుకుని వస్తున్నాయి. దళితులకు సీఎం జగన్‌మాత్రమే మేలు చేస్తున్నారు. – ప్రసాద్, మాల మహానాడు అధ్యక్షుడు, చిత్తూరు పచ్చ పత్రిక విషపు రాతలు సీఎం జగన్, దళితులపై పచ్చ పత్రిక విషపు రాతలు రాసింది. సీఎం జగన్ బస్సు యాత్రకు తండోపతండాలుగా వస్తున్న వారిలో అధికంగా ఉండేది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలే. మరి ఈ పచ్చ రాతలు రాసే వాళ్లకు ఇలాంటి నిజమైన యాత్రలు కనిపించవా?. దళితులకు తీవ్ర అన్యాయం చేసింది బాబే. ఆయన దళిత ద్రోహి. గతంలో మాల, మాదిగలను విడదీసి గద్దెనెక్కిన బాబు దళిత జాతిని అవహేళనగా మాట్లాడుతూ దళిత విద్యార్థులపై కుట్ర పూరిత పాలన కొనసాగించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా బయటికి కూడా రాని విధంగా చంద్రబాబు దళిత జాతి అణచివేతకు పెద్ద కుట్ర చేశాడు. – ఎగ్గుల శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు చంద్రబాబే దళిత ద్రోహి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడే దళిత ద్రోహి. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా దళితులపైన దాడుల కేసులు 3400 పైగా నమోదయ్యాయి. నమోదవని ఇంకా చాలా ఉన్నాయి. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చంద్రబాబు అన్న మాటలు ఇప్పటికీ మేం మర్చిపోలేదు. చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తున్నాయి. దళితులపైన టీడీపీ నేతలు, ఆ ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు ఎన్నో. లేనిపోని రాతలు రాసి జగనన్న ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే సహించేది లేదు. – మాస్టీల మంజు, ఎస్సీ నేత, ఏఎంసీ మాజీ అధ్యక్షురాలు, కంచిలి -
పూటకో మాట.. సరికొత్త ఆట!
సాక్షి ప్రతినిధి, కడప: మాటల గారడీతో నేతల్ని బురిడీ కొట్టించే ఎత్తుగడల్లో ఆయన దిట్ట. కలిసివస్తే తన ప్రతిభ.. లేదంటే ఎదుటోళ్ల తప్పుగా వర్ణించే నేర్పరితనం ఆయనది. అనుకున్నట్లుగా అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. అన్న కుటుంబానికి నాడు–నేడు ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేశారని సోదరులంతా పసిగట్టారు. అవకాశవాదానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆగ్రహోదగ్రులయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆయన చతురత ప్రదర్శించారు. ఒకే ఒక్క స్టేట్మెంట్తో వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఆది మైండ్ గేమ్‌తో అటు అబ్బాయ్.. ఇటు సోదరులను శాంతింపజేశారు. ఈ నాటకానికి కథ, స్క్రీన్ ప్లే మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కాగా, తారా గణం ఆయన కుటుంబ సభ్యులు కావడం విశేషం. ► జమ్మలమడుగు నియోజకవర్గ రాజకీయాలకు నాలుగున్నరేళ్లుగా మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దూరంగా ఉన్నారు. ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటం చేసిన దాఖలాలే లేవు. తనకు అధికారం అండ లేకపోతే, రాజకీయ మనుగడ కష్టమని భావించి తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతోనే బీజేపీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి ఉనికి చాటుకునే చర్యలు మినహా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష పోరాటం చేసింది లేదు. తెలుగుదేశం పార్టీకి దిక్కు దిశా లేని సమయంలో మాజీ జెడ్పీటీసీ భూపేష్‌రెడ్డి రంగప్రవేశం చేశారు. టీడీపీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టి ఆ మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించారు. అనుచరులను చేరదీసుకొని ఎన్నికల్లో పోటీ చేయాలని తలచిన నేపథ్యంలో తనను కాదని టికెట్ తెచ్చుకోగలరా? అంటూ ఆదినారాయణరెడ్డి సన్నిహితులు, కుటుంబ సభ్యుల వద్ద వ్యాఖ్యానిస్తూ వచ్చారు. అనుకున్నట్లుగా టీడీపీ టికెట్ భూపేష్‌కు దక్కకుండా వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీకి దక్కేలా తెరవెనుక పావులు కదిపి సక్సెస్ అయ్యా రని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు తన సోదరుడు దేవగుడి నారాయణరెడ్డి కుమారుడు భూపేష్‌కు టీడీపీ టికెట్ దక్కకుండా బీజేపీకి దక్కేలా ఆదినారాయణరెడ్డి చేపట్టిన పైరవీలను పసిగట్టిన కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులయ్యారని సమాచారం. అందుకు కారణం 2004లో వర్గ రాజకీయాలను కొనసాగిస్తూ వచ్చిన నారాయణరెడ్డికి సీటు లేకుండా అడ్డుతగిలిన వైనం, తాజాగా భూపేష్‌కు ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా వ్యవహరించిన తీరుతో దేవగుడి సోదరులంతా ఏకతాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆదినారాయణరెడ్డికి వ్యతిరేకంగా పయనించేందుకు అందరూ సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఆయన బీజేపీ అభ్యర్థిత్వం దక్కినా స్వగ్రామంలో అడుగు పెట్టకుండా ఉండిపోయారు. ఈలోపు భూపేష్‌కు టీడీపీ ఎంపీ టికెట్ దక్కింది. ఆ వెనువెంటనే జమ్మలమడుగు చేరుకున్న ఆది తాను ఎంపీకి, మావాడు భూపేష్ ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తాం. అదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం, పరిశీలనలో ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగానే అటు అబ్బాయ్.. ఇటు సోదరులు శాంతించినట్లు సమాచారం. ఆది మైండ్ గేమ్‌కు మొత్తం కుటుంబం ఫ్లాట్ అయినట్లు తెలుస్తోంది. నేడు ఉమ్మడిగా సమావేశం.. బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డి ఇరువురు శుక్రవారం జమ్మలమడుగులో ఉమ్మడిగా కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జనసేన కార్యకర్తలు సైతం హాజరుకానున్నారు. ఇప్పటి వరకూ బాబాయ్...అబ్బాయ్ ఎవరికి వారు రాజకీయాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇకపై ఉమ్మడిగా రానున్నారు. వర్గ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న జమ్మలమడుగులో అవకాశవాద రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ఇందుకు దేవగుడి కుటుంబమే ప్రధాన కారణమైంది. ఇలాంటి రాజకీయాలకు ఓటర్లు చెక్ పెట్టాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
నాడు తండ్రి.. నేడు తనయుడికి ‘ఆది’పోటు
సాక్షి ప్రతినిధి, కడప: కడప పార్లమెంట్ బలిపీఠం ఎక్కించేందుకు టీడీపీ నానా హైరానా పడింది. అభ్యర్థి ఎంపికకు పలు రకాలుగా కసరత్తు చేసింది. క్రమం తప్పకుండా ఐవీఆర్ఎస్ ఫోన్ సర్వేలు నిర్వహిస్తూ రోజుకొక పేరు తెరపైకి తెచ్చింది.ఎట్టకేలకు జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జి భూపేష్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అసెంబ్లీ టికెట్ ఆశించిన భూపేష్‌ను ఏకంగా ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం వెనుక కుయుక్తుల మంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎవరైనా సరే, ఓటమి ఎదుర్కోవాల్సిన సీటుకు భూపేష్‌ను ఎంపిక చేయడం వెనుక ఆదినారాయణరెడ్డి తెరవెనుక వ్యూహం పన్నినట్లు సమాచారం. ►మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నుంచి ప్రతిసారి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన తర్వాత చివరలో ఆ ఫలితం తన ఖాతాలో వేసుకోవడం ఆదికి అలవాటుగా మారిపోయింది. ఈమారు టీడీపీ అధినేత చంద్రబాబుపై నారాయణరెడ్డి కుటుంబం పెట్టుకున్న ఆశలు సైతం నీరుగారిపోయాయి. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటావని అటు తండ్రి చంద్రబాబు, ఇటు తనయుడు లోకేష్ భూపేష్‌రెడ్డిని ఊరించారు. తుదకు జమ్మలమడుగు సీటు బీజేపీకి కేటాయించి రాజకీయ సంకటస్థితిలోకి నెట్టారు. హితులు, సన్నిహితుల సూచనల మేరకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు భూపేష్‌రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా పసిగట్టిన ఆది అండ్‌కో పార్లమెంట్ అభ్యర్థిగా తెరపైకి తెచ్చారనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలనే దిశగా... టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన తమకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని భావించిన భూపేష్‌రెడ్డి ఇప్పుడు జమ్మలమడుగు టికెట్‌ను బీజేపీకి కేటాయించడం పట్ల డైలమాలో పడ్డారు. ఆదినారాయణరెడ్డి బీజేపీ కార్యాలయం జమ్మలమడుగులో ప్రారంభించి, టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగా టీడీపీ టికెట్ భూపేష్‌కు దక్కకుండా పథక రచన చేసి సక్సెస్ అయ్యారు. ఈదశలో అటు కుటుంబ సభ్యులు ఇటు భూపేష్ మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలనే ఒత్తిడి తెచ్చారు. ఆమేరకు భూపేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నహాలు చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితు ల్లో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా భూపేష్‌ను ప్రకటించేలా ఆది తెరవెనుక మంత్రాంగం చేపట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఆమేరకు టీడీపీ అధిష్టానం భూపేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం విశేషం. జమ్మలమడుగులో అడుగుపెట్టని ఆది... బీజేపీ అభ్యర్థిగా నాలుగు రోజుల క్రితం ఆదినారాయణరెడ్డిని ప్రకటించినా ఇప్పటికీ జమ్మలమడుగులో అడుగుపెట్టలేదు. అందుకు కారణం దేవగుడి కుటుంబం నుంచి తీవ్ర ప్రతిఘటన ఉండటమేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. టీడీపీ టికెట్ భూపేష్‌కు దక్కదని, బీజేపీ అభ్యర్థిగా తానే బరిలో ఉంటానని చెప్పి, ఆమేరకు సక్సెస్ అయినా ఆది కుయుక్తులను దేవగుడి కుటుంబం పసిగట్టింది. నారాయణరెడ్డి కుటుంబానికి అప్పుడు, ఇప్పుడు ఆదినారాయణరెడ్డి రాజకీయ వెన్నుపోటు పొడిచారని గ్రహించి కుటుంబం అంతా భూపేష్‌కు అండగా నిలిచింది. ఈపరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థిగా ఎంపికై నా స్వగ్రామంలో కాలు పెట్టలేని దుస్థితి ఏర్పడినట్లు సమాచారం. ఏది ఏమైనా కడప పార్లమెంటు బలిపీఠంపై భూపేష్‌ను బలవంతంగా ఎక్కించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. భూపేష్ది అదే పరిస్థితి.. ఆదినారాయణరెడ్డి తమ రాజకీయ వారసుడు భూపేష్‌రెడ్డి అంటూ 2009 ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. 2014లో భూపేష్ తెరపైకి వస్తారని భావించినా, ఆదినారాయణరెడ్డి తిరిగి వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. నారాయణరెడ్డి కుటుంబానికి రాజకీయ వెన్నుపోటు పొడిచినట్లే, తర్వాత వైఎస్సార్సీపీ కూడా వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆపై మంత్రి పదవి సైతం దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. అప్పటినుంచి స్థానికంగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండాపోయారు. టీడీపీ అధికారం కోల్పోవడంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో బీజేపీ కండువా వేసుకున్నారు. వర్గ రాజకీయాలకు నిలయమైన జమ్మలమడుగులో క్యాడర్‌ను కాపాడుకోవాలని నారాయణరెడ్డి తన కుమారుడు భూపేష్‌రెడ్డితో కలిసి టీడీపీలో యాక్టివ్ అయ్యారు. రాజకీయంగా నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు నారాయణరెడ్డి క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. భూపేష్ రాజకీయ ఎదుగుదలకు దేవగుడి కుటుంబం (ఆదినారాయణరెడ్డి మినహా) పని చేస్తూ వచ్చింది. ప్రస్తుతం టీడీపీ టికెట్ లభిస్తుందని భావించారు. అనూహ్యంగా ఆ స్థానంలోకి ఆదినారాయణరెడ్డి వచ్చి చేరిపోయారు. ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించేలా మంత్రాంగం నిర్వహించారు. తాము కష్టపడి క్యాడర్‌ను తయారు చేసుకుంటే చివర్లో వచ్చి కోడిపిల్లను గద్ద ఎత్తుకెళ్లినట్లు ఎమ్మెల్యే సీటును ఆదినారాయణరెడ్డి దక్కించుకున్నారనే ఆవేదన భూపేష్‌లో ఉండిపోయింది. నాడు తండ్రి సీటును బ్లాక్మెయిల్ రాజకీయాల ద్వారా చేజేక్కించుకున్న ఆది, రాజకీయ మంత్రాంగంతో నేడు తనయుడి సీటును దక్కించుకుని ‘ఆది’పోటుకు గురయ్యారు. -
కుటుంబ సభ్యుల నుంచే విమర్శలు.. ఆదినారాయణరెడ్డి భవితవ్యం ఏంటి?
ఏపీలో విపక్షాల మధ్య పొత్తుల వ్యవహారం కొంత మంది నేతల్ని అయోమయానికి గురి చేస్తోంది. ఎంపీగా పోటీ చేయాలా.. లేక ఎమ్మెల్యేగా పోటీ చేయాలా.. అసలు తన సీటు తనకు దక్కుతుందా అనే అనుమానాలు టీడీపీలో వ్యక్తం అవుతున్నాయి. అక్కడక్కడా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కాషాయ దళంలో చేరిన నేతలు కూడా తమకు అవకాశం వస్తుందా? రాదా? అన్న సందేహాలతో విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఆ జిల్లాలో విపక్షాల పరిస్థితి ఎలా ఉంది? ఉమ్మడి కడప జిల్లాకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి అదినారాయణరెడ్డి రాజకీయ భవితవ్యం అయనకే అర్థం కావడంలేదు. పైగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు మరి కొంత మంది నేతలను గందరగోళంలోకి నెడుతున్నాయి. ఇందుకు కారణం టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తుల వ్యవహారమే కారణం అంటున్నారు. మూడు పార్టీల మధ్య పొత్తుల వ్యవహారంపై ఎంతకీ క్లారిటీ రావడం లేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజకీయంగా కనుమరుగు అవుతామనే అభద్రతాభావం ఆదినారాయణరెడ్డిని వెంటాడుతోంది. ఎన్నికల పొత్తు సాకుతో జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తానంటూనే, బీజేపీ ఆదేశిస్తే ప్రొద్దుటూరు అసెంబ్లీ లేదా కడప పార్లమెంట్ సీటుకు అయినా పోటీ చేస్తానని ఆయన ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆదినారాయణ రెండు నియోజవర్గాల టీడీపీ నేతల కంట్లో నలుసులా తయారయ్యారు. గతంలో పొత్తు ఉన్నా లేకున్నా టీడీపీ టికెట్ ఖరారైందంటూ ఆది చేసిన ప్రచారం ఇతర నేతల్లో గుబులు రేపింది. ఆదినారాయణరెడ్డి చేసిన ప్రకటన ఆయన సొంత కుటుంబంలోనే అలజడి రేపుతోంది. అన్న కుమారుడు భూపేష్ రెడ్డి తన రాజకీయ వారసుడు అంటూ 2009 ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయనే సైంధవుడిలా భూపేష్‌రెడ్డిని అడ్డుకుంటున్నారని కుటుంబ సభ్యులనుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదినారాయణ అన్న మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి పోటీ చేసి గతంలో ఓటమిపాలయ్యారు. తీరా 2004లో దివంగత మహానేత వైఎస్ఆర్ గాలి వీస్తున్న సమయంలో ఆది అడ్డు తగిలి అన్న బదులుగా తను పోటీ చేసి గెలుపొందారు. మళ్లీ ఇప్పుడు అయన తనయుడు విషమయంలోను అదే చేస్తున్నాడంటూ కుటుంబం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వెంటనే బీజేపీలో చేరిపోయారు. ఇక తనకు బాబాయ్ అడ్డు ఉండదని భావించిన భూపేష్‌రెడ్డి ఏడాది క్రితం జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జి బాధ్యతలను తీసుకున్నారు. ఇంతలో జమ్మలమడుగు స్థానం బీజేపీకి కేటాయించాలంటూ ఆదినారాయణ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆది చర్యలు దేవగుడి కుటుంబంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భూపేష్ నాయకత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మెజార్టీ కుటుంబ సభ్యులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. కుటుంబం నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను అంచనా వేసిన ఆది ప్రొద్దుటూరులో అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరుకు మారతారనే ప్రచారం అక్కడ టిక్కెట్లు ఆశిస్తున్నవారిలో టెన్సన్ పెంచుతోంది.ప్రొ ద్దుటూరు టీడీపీటికెట్ కోసం నలుగురు పోటీ పడుతున్నారు. ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సురేష్‌నాయుడు సీటు ఆశిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆ సీటుపై బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి కన్ను పడింది. ఇక్కడ టికెట్ కోసం నలుగురు పోట్లాడుకోవడం సాకుగా చూపించి..పొత్తులో భాగంగా బీజేపీకి ప్రొద్దుటూరు సీటు కేటాయించాలనే దిశగా ఆదినారాయణరెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎత్తుగడలు వేయడంలో దిట్టగా పేరున్న ఆదినారాయణరెడ్డి కుయుక్తులు కలిసి వస్తాయో...లేక బెడిసి కొడతాయో వేచిచూడాల్సిందే.. -
ఆదినారాయణ రెడ్డి కుయుక్తులు
-
చదిపిరాళ్ల కుటుంబంలో ఏకాకిగామిగిలిన ఆదినారాయణరెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: జమ్మలమడుగు నియోజకవర్గంలోని చదిపిరాళ్ల కుటుంబంలో మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఏకాకి అయ్యారు. సోదరులు మూకుమ్మడిగా ఏకతాటిపైకి వచ్చారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి భూపేష్ రెడ్డి మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వీరంతా పాల్గొన్నారు. బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి జిత్తులకు ఇంటి నుంచే బ్రేకులు పడ్డాయి. నాన్నలా సీటు వదులుకునే ప్రసక్తే లేదని భూపేష్ సైతం తేల్చి చెప్పారు. ఆరోజు పరిస్థితులు వేరు, ఈరోజు పరిస్థితులు వేరంటూనే ఎన్నికల్లో పోటీలో ఉంటానని బహిరంగంగా ప్రకటించారు. టీడీపీ, బీజేపీ ఎన్నికల పొత్తులో భాగంగా జమ్మలమడుగు సీటు బీజేపీకి కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీకి సైతం వెళ్లి అధిష్టానం పెద్దలతో సంప్రదింపులు జరిపి, విజయవాడలో తిష్ట వేశారు. ఎలాగైనా సరే జమ్మలమడుగు సీటును బీజేపీ కోటాలో దక్కించుకోవాలని అనేక యుక్తులు ఇప్పటికీ ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పొత్తులో భాగంగా పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందేమోనన్న భావన టీడీపీ ఇన్చార్జి భూపేష్‌రెడ్డి మదిలో పడింది. ఈ నేపథ్యంలో మంగళవారం జమ్మలమడుగు కేంద్రంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభిమానులను, అనుచరులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి దేవగుడి సోదరులు హాజరవుతారా.. లేదా అన్న సందేహం రాజకీయ పరిశీలకుల్లో ఉండింది. అయితే అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆదినారాయణరెడ్డి మినహా మిగిలిన సోదరులంతా సమావేశానికి హాజరై ఆశ్చర్యపరిచారు. ఆది స్పీడ్‌కు బ్రేకులు.. బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి స్పీడ్‌కు ఇంటి నుంచే బ్రేకులు పడుతున్నాయి. సోదరులు మాజీ ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణరెడ్డి, శివనాథరెడ్డిలతోపాటు రామాంజనేయరెడ్డి, జయరామిరెడ్డి, శివనారాయణరెడ్డి, గోపాల్‌రెడ్డి సైతం భూపేష్‌రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు బరిలో ఉంటానని ఆత్మీయ సమావేశంలో భూపేష్ స్పష్టం చేశారు. నాన్నలా పోటీ నుంచి విరమించే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. ఆరోజు పరిస్థితులు వేరు, ఈరోజు పరిస్థితులు వేరని చెప్పుకొచ్చారు. టీడీపీ ఓటు బీజేపీకి బదలాయింపు కాదని ప్రకటించారు. మీరంతా నా వెన్నంటే నడుస్తారని ఆశిస్తున్నా అంటూ.. బీజేపీకి సీటు కేటాయించినా సరే, ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని నర్మగర్భంగా తేల్చి చెప్పడం విశేషం. తిరగబడ్డ భూపేష్... దేవగుడి కుటుంబంలో ఆదినారాయణరెడ్డిని నియంతగా పరిశీలకులు అభివర్ణిస్తారు. ఆయన చెప్పిన మాటనే మిగిలిన సోదరులంతా ఆచరించాల్సిన పరిస్థితి ఉండేది. 2009 ఎన్నికల నుంచి తన రాజకీయ వారసుడు భూపేష్ అంటూ ప్రకటిస్తూ వచ్చిన ఆయన ఇటీవల టీడీపీకి కేటాయిస్తే భూపేష్, బీజేపీకి కేటాయిస్తే తాను పోటీలో ఉంటానని సన్నిహితులతో చెప్పుకొచ్చినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితిలో మరోమారు అవకాశం కోల్పోకూడదనే భావన భూపేష్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అవకాశవాదిగా ముద్రపడిన ఆది ఎత్తుగడలను పసిగట్టి ఆ మేరకే భూపేష్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు స్పష్టమవుతోంది. ఏదిఏమైనా భూపేష్ తన కుటుంబంలో పట్టు సాధించి ఆదికి రాజకీయ సవాల్ విసిరినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
వైఎస్ వివేకాను చంపిందెవరు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినపుడు ముఖ్యమంత్రి స్థానంలో అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడే ఇప్పుడు అమాయకంగా... హత్య చేసిందెవరు? అని ప్రశ్నిస్తున్నారు. ఇది వారం రోజుల్లో తేల్చాల్సిన కేసు అని చెబుతున్న వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత... హత్య జరిగాక రెండు నెలలపాటు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడిని ప్రశ్నించనే లేదు. అంతే కాదు.. హత్య చేశానని, తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు మరికొందరితో కలిసి వివేకాను తనే గొడ్డలితో నరికానని అంగీకరించిన దస్తగిరి ఇప్పుడు జైలు నుంచి విడుదలై దర్జాగా బయట తిరుగుతున్నాడు. సునీతకు, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఆత్మీయుడిగా మారాడు. చంద్రబాబు అనుకూల మీడియాకు వీఐపీ నాయకుడైపోయాడు. వివేకా గుండెపోటుతో చనిపోయారని సునీత బావగారు శివప్రకాశ్రెడ్డితో సహా పలువురికి ఫోన్లు చేసి చెప్పిన నాటి టీడీపీ మంత్రి ఆదినారాయణరెడ్డి.. తర్వాత ఓడిపోవటంతో బీజేపీలోకి ఫిరాయించారు. వీళ్లలో హత్య చేసిన వాళ్లు... చేయించిన వాళ్లు... దాన్ని కప్పిపుచ్చి రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడానికి ప్రయత్నిస్తున్న వారు... అంతా ఉన్నారు. అందరూ కలిసి లోతైన కుట్రతో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిపై, ఆయన కుటుంబంపై దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ కుట్రను మరింత లోతుకు తీసుకెళుతున్నారు. కుట్రలో భాగంగానే... చంద్రబాబు అనుకూల తోక పత్రికకు అధిపతిగా వ్యవహరిస్తున్న వ్యక్తి మూడు రోజుల కిందట నర్రెడ్డి సునీతతో సహా చంద్రబాబును కలిశారు. కడప ఎంపీగా సునీతను పోటీకి దింపటంపై అక్కడ చర్చ జరిగింది. చివరకు సునీతను పోటీ చేయించని పక్షంలో ఆమె చేత విస్తృతంగా ప్రచారం చేయించాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రచారమంటే... నియోజకవర్గంలో తిరగటం మాత్రమే కాదు. జాతీయ స్థాయిలో మీడియా సమావేశాలు కూడా. అందులో భాగమే ఢిల్లీలో సునీత ప్రెస్ కాన్ఫరెన్స్. దానికి కొనసాగింపే శనివారం ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ బహిరంగ సభలో చంద్రబాబు ఊగిపోవటం. ఇదంతా ఒక స్కెచ్. సూత్రధారి చంద్రబాబు. పాత్రధారులు సునీత నుంచి దస్తగిరి, బీటెక్ రవి వరకూ ఎందరో!!. వివేకా హత్యతో లాభమెవరికి? జాతీయ, అంతర్జాతీయ నేర పరిశోధన ప్రమాణాలు చెప్పేదొకటే.. ఒక నేరం వల్ల ఎవరికి లాభం ఉంటుందో వారే దోషులు, కుట్రదారులు. అలా చూసినప్పుడు వివేకా హత్యతో లాభమెవరికి? ఆయన్ను అడ్డు తొలగించుకోవాలనుకున్నది ఎవరు? ఈ కోణంలో పరిశీలించినప్పుడు వచ్చే సమాధానాలు రెండే. వివేకా సంపాదించిన ఆస్తులు తమకే దక్కాలని, ఆయన రాజకీయ వారసత్వమూ తమకే ఉండాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి పంతం పట్టారు. కాకపోతే షమీమ్ అనే మహిళను వివేకా రెండో వివాహం చేసుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆమెతో వివేకాకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ రెండో వివాహంతో వివేకా కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. వివాహాన్ని వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు, చిన్న బావమరిది అయిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి సౌభాగ్యమ్మ పులివెందులలో నివాసం ఉండకుండా హైదరాబాద్‌లో ఉన్న కుమార్తె సునీత వద్ద ఉంటున్నారు. సునీత నర్రెడ్డి ? ఆస్తి మొత్తం మాకే దక్కాలి.... వివేకా రెండో వివాహాన్ని ఆయన కుమార్తె సునీత తీవ్రంగా వ్యతిరేకించారు. తన తండ్రి యావదాస్తీ తమకే చెందాలని ఆమె పంతం పట్టారు. కానీ వివేకానందరెడ్డి తన రెండో భార్యకు ఆస్తిలో వాటా ఇస్తానన్నారు. ఓ ఇల్లు ఇచ్చేశారు. హైదరాబాద్‌లోనూ ఒక ఇల్లు కొనుగోలు చేసి తన కుమారుడిని అక్కడే ఉంచి బాగా చదివిస్తానని షమీమ్‌కు మాట ఇచ్చారు. దాన్ని వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత తీవ్రంగా వ్యతిరేకించారు. వాగ్వాదానికి దిగారు. అక్కడితో ఆగకుండా కుటుంబానికి చెందిన కంపెనీల్లో ఆయనకున్న చెక్ పవర్‌ను రద్దు చేశారు. షమీమ్‌తో సునీత గొడవ పడ్డారు. పరస్పరం దారుణంగా దూషించుకుంటూ వారిద్దరి మధ్య సాగిన వాట్సాప్ చాటింగ్ వివరాలను కూడా దర్యాప్తు సంస్థలు వెలికి తీశాయి. సౌభాగ్యమ్మ, సునీత మొండి పట్టుదల చూశాక వివేకా కాస్త జాగ్రత్తపడ్డారు. తన ఆస్తిలో షమీమ్‌కు వాటా కల్పిస్తూ వీలునామా రాస్తానన్నారు. అందుకోసం స్టాంపు పేపర్లు కూడా తెప్పించుకున్నారు. అదిగో... అలా స్టాంపు పేపర్లు తెచ్చిన రోజుల వ్యవధిలోనే వివేకా హఠాత్తుగా హత్యకు గురయ్యారు. ఆయన్ను హత్య చేశాక దస్తగిరి సహా హంతకులు ఆ ఇంటిలో ఉన్న బీరువాలో ఏవో స్టాంపు పేపర్లు, రౌండ్ సీల్ కోసం వెతికారని ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగయ్య తన వాంగ్మూలంలో పేర్కొనడం ఇక్కడ ప్రస్తావనార్హం. పైపెచ్చు వివేకా హత్య జరిగిన కొన్ని నెలలకే కుటుంబానికి చెందిన భూములు, ఇతర ఆస్తులన్నింటినీ సునీత తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీన్ని బట్టి హత్య వల్ల ఎవరికి లబ్ధి కలిగిందో తెలుస్తోంది కదా!. మరి హత్య చేయించిందెవరో కనుక్కోవటానికి ఇంతకన్నా ఏం కావాలి? మాటమార్చి... చంద్రబాబు గూటిలోకి తన తండ్రి వివేకా హత్య వెనుక అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని మంత్రి ఆదినారాయణ రెడ్డి, అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉన్నారని సునీత 2019 మార్చిలో చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకూ కృషి చేశారని కూడా చెప్పారు. 2019 మార్చి 21న హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి మరీ ఇవన్నీ చెప్పిన సునీత... 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎంను చేసి తన తండ్రి కోరిక నెరవేర్చాలని ప్రజలను కోరారు. కానీ 2020లో స్థానిక సంస్థల ఎన్నికల తరువాత ఆమె పూర్తిగా ప్లేటు ఫిరాయించారు. సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డి... చంద్రబాబు గుప్పిట్లోకి వెళ్లి టీడీపీ రాజకీయ కుట్రలో భాగస్వాములయ్యారు. చంద్రబాబు? రాజకీయ లబ్ధికి ఇదే అదను.. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిజానికి కడప జిల్లాలోను, పులివెందులలోను టీడీపీకి ప్రధాన అడ్డంకి వైఎస్ వివేకా. ఆయన అడ్డు తొలగింది. వైఎస్సార్సీపీ అధిపతి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని దీనిలో ఇరికించి దుష్ప్రచారం సాగిస్తే... కడప జిల్లాలో తాము పాగా వేయొచ్చనేది బాబు దురాలోచన. అందుకే... మార్చి 15న వివేకా హత్య విషయం బయటకు వచ్చిన తరవాత బాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తన సొంత మనిషి అయిన అప్పటి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును రంగంలోకి దింపారు. ఆయన అందరినీ ప్రభావితం చేస్తూ దర్యాప్తును ఆదిలోనే తప్పుదోవ పట్టించారు. నిజానికి ఈ హత్య విషయంలో సునీత లక్ష్యం ఒక్కటే. హత్య వెనుకనున్న తన భర్త, బావగార్ల పేర్లు బయటకు రాకుండా ఉండటం. బాబు లక్ష్యమేమో తన ప్రత్యర్థులను ఇరికించటం. అందుకే ఈ విజాతి ధ్రువాలు రెండూ ఆకర్షించుకుని... ఒకరి లక్ష్యానికి మరొకరు సాయంగా నిలిచారని... రానురాను కుట్రను మరింత లోతుల్లోకి తీసుకెళుతున్నారని ఈ వ్యవహారాన్ని దగ్గర్నుంచి పరిశీలిస్తున్నవారు చెప్పే మాట. ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిలపై సందేహాలు రేకెత్తించేలా పచ్చ మీడియా ద్వారా అభూతకల్పనలతో దుష్ప్రచారం చేయటం... హత్య వెనుక ఉన్న కుట్రదారుల పాత్ర బయటకురాకుండా కేసును సంక్లిష్టంగా మార్చటం... ఇవన్నీ ఇందులో భాగంగానే జరిగిపోయాయి. చంద్రబాబు గ్యాంగ్‌కు కృతజ్ఞతలతో.. మీ సునీత బహుశా... నాలుగేళ్లుగా తాము సాగిస్తున్న కుట్రను మరింత పదునెక్కించాలనుకున్నారో, ఇకపై ముందుకు వెళ్లాలంటే ముసుగు తీయక తప్పదని భావించారో గానీ... సునీత ముసుగు తీశారు. రెండ్రోజుల కిందట ఢిల్లీలో బాబు స్క్రిప్టును చదువుతూ... ఆఖరికి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి కూడా కృతజ్ఞతలు చెప్పారంటే టీడీపీ ఏ స్థాయిలో సునీతకు సహకరించిందో... ఈ కుట్ర ఎంత లోతైనదో తెలియకమానదు. వైఎస్సార్సీపీ టికెట్టుపై గెలిచి... ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని దూషిస్తూ సమాజంలో వర్గవిభేదాలు సృష్టించేందుకు కుట్రపన్నిన ఎంపీ రఘురామకృష్ణరాజు... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అత్యంత పరుషపదంతో దూషించిన టీడీపీ నేత పట్టాభి... సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ అత్యంత వివాదాస్పదుడిగా మారిన టీడీపీ నేత, పి.గన్నవరం అభ్యర్థి మహాసేన రాజేశ్.. తమ పార్టీ విధానాలతో నిమిత్తం లేకుండా చంద్రబాబు కోసమే పనిచేస్తున్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, సీపీఐ నారాయణ... బీజేపీలో ఉంటూ బాబు ఎజెండాను అమలు చేస్తున్న సీఎం రమేశ్... బాబు లాయరు సిద్ధార్థ లూథ్రా... నిరపరాధులను హింసించి, వేధించి కేసు దర్యాప్తును పక్కదారి పట్టించిన సీబీఐ అధికారి రామ్‌సింగ్... సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా... వీళ్లందరికీ సునీత కృతజ్ఞతలు తెలిపారు. అంటే తాను ఆ పచ్చ ముఠాలో సభ్యురాలినేనని విస్పష్టంగా ప్రకటించారు. విశేషమేంటంటే వీళ్లందరిలో ఓ ఉమ్మడి లక్షణం ఉంది. అది... తమ వృత్తులు, పార్టీలకు అతీతంగా చంద్ర బాబు కోసం పనిచేయటం. వైఎస్ జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకించటం. అది చాలదూ... సునీత పాత్రను బయటపెట్టడానికి!!. ఇంకా వివేకా ఎవరెవరికి అడ్డంకిగా ఉన్నారు? ఆయన హత్యతో ఏ పాత్ర«ధారికి ఎలాంటి లాభం? ఇవన్నీ ఒకసారి చూద్దాం... ఆదినారాయణ రెడ్డి? గుండెపోటు అని మొదట చెప్పింది ఈయనే... వివేకా గుండెపోటుతో చనిపోయారని మీడియా సాక్షిగా బయటకు చెప్పింది నాటి మంత్రి ఆదినారాయణ రెడ్డి. వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తనకు ఫోన్ చేసి గుండెపోటుతో వివేకా మరణించారని చెప్పారని, సిగరెట్లు ఎక్కువ తాగుతారు కనక అలా జరిగి ఉండొచ్చని తాను కూడా అన్నానని ఆయన స్వయంగా మీడియాకు వెల్లడించారు. అంతేకాదు.. శివప్రకాశ్ రెడ్డి ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారం కోసం వెళుతున్న ఎంపీ అవినాశ్‌రెడ్డికి చెప్పటంతో... ఆయన తన వాహనాన్ని నిలిపేసి, వెనక్కు తిరిగి వివేకా ఇంటికి వచ్చారు. మరి గుండెపోటు అని ప్రచారం చేయాల్సిందిగా శివప్రకాశ్‌రెడ్డికి చెప్పిందెవరు? ఆదినారాయణ రెడ్డికి ఆయనే అడ్డంకి... 2014 ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి... టీడీపీకి అమ్ముడుపోయారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయకుండా అనైతికంగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన్ను కడప ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు నిర్ణయించారు. కానీ ఎంపీగా గెలవటానికి వివేకానందరెడ్డి ప్రధాన అడ్డంకిగా నిలిచారు. జిల్లాపై పూర్తి పట్టున్న వివేకా రంగంలో ఉంటే తాను ఎంపీగా గెలవడం అసాధ్యమని ఆది నారాయణ రెడ్డి గుర్తించారు. ఈ నేపథ్యంలో వివేకా హత్యకు గురయ్యారు. వివేకా హత్య ఆదినారాయణరెడ్డికి రాజకీయంగా ప్రయోజనం కలిగించేదే కదా? నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ? లేఖను దాచి... గుండెపోటని ప్రచారం చేసి వివేకా హత్య కేసు దర్యాప్తు పక్కదారి పట్టించడంలో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డిది కీలకపాత్ర. ఎందుకంటే హత్యకు గురైనప్పుడు వివేకా తన స్వదస్తూరితో రక్తంతో ఓ లేఖను రాశారు. ఆ లేఖను చూసిన ఎవరికైనా... అది మామూలు మరణం కాదని, ముమ్మాటికీ హత్యేనని తెలిసిపోతుంది. అలాంటి లేఖను ఆ రోజు (2019, మార్చి 15) ఉదయం 6.10 గంటలలోపే వివేకా పీఏ కృష్ణారెడ్డి చూశారు. ఆ విషయాన్ని వెంటనే సునీత భర్త రాజశేఖరరెడ్డికి ఫోన్లో చెప్పారు. ‘మేం వచ్చే వరకు ఆ లేఖను గానీ, వివేకా సెల్‌ఫోన్‌ను గానీ ఎవరికీ ఇవ్వవద్దు. పోలీసులకు కూడా చెప్పొద్దు’ అని వారు పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించారు. ఆ లేఖను గనక వెంటనే పోలీసులకు ఇవ్వమని వారు చెప్పి ఉంటే... మొత్తం వ్యవహారం మరోలా ఉండేది. వివేకాది హత్య అని తేలిపోయేది. ఎవరూ మృతదేహం వద్దకు వెళ్లేవారు కాదు. పోలీసులు తమ పని తాము చేసేవారు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచటంతో... వ్యవహారం మొత్తం వారు ప్లాన్ చేసినట్టే సాగింది. బీటెక్ రవి... ? వివేకా ఉంటే ఇక అంతే.. పులివెందుల నియోజకవర్గంలో కనీసస్థాయిలోనైనా పట్టు సాధించాలన్నది టీడీపీ నేత బీటెక్ రవి లక్ష్యం. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో 2019 ఎన్నికల్లో యథేచ్చగా అక్రమాలు సాగించవచ్చనేది ఆయన పన్నాగం. కానీ వివేకా వైఎస్సార్సీపీకి పెద్దదిక్కుగా నిలబడటంతో బీటెక్ రవి ఆటలు సాగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను దొంగదెబ్బ తీసిన బీటెక్ రవికి పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని వివేకా పంతం పట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన హత్యకు గురయ్యారు. హత్యకు ముందు రోజు కొమ్మారెడ్డి పరమేశ్వర రెడ్డి(ఈయనకు వివేకాతో ఆర్థిక విభేదాలు తలెత్తాయి)తో బీటెక్ రవి రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందారు కూడా. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి తిరస్కరించడం సందేహాలకు తావిచ్చేదే. రామ్‌సింగ్? చంద్రబాబు చేతిలో పావు... వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఎంతటి సిద్ధహస్తుడో వివేకా కేసులో సీబీఐ తీరే నిరూపిస్తోంది. వాస్తవానికి ఈ కేసులో నిశితమైన దర్యాప్తు జరిగి దోషులు బయటపడాలని మొదటి నుంచీ భావిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... కేసును సీబీఐ దర్యాప్తు కోసం అప్పగించాలని సునీత కోరగానే సరేనన్నారు. సీబీఐకి అప్పగించారు. కాకపోతే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే ముందస్తు కుట్రతో బీజేపీలోకి పంపిన తన మనుషులు సీఎం రమేశ్, సుజనా చౌదరి ద్వారా చంద్రబాబు చక్రం తిప్పటం మొదలెట్టారు. సీబీఐ దర్యాప్తు అధికారిగా నియమితుడైన రామ్‌సింగ్ వివాదాస్పద వ్యవహార శైలే అందుకు తార్కాణం. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన ఆయన ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టుగా ఎంపీ అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని కేసును పక్కదారి పట్టించారు. దస్తగిరిని ఢిల్లీకి తీసుకువెళ్లి బెదిరించి... ప్రలోభాలకు గురిచేసి అప్రూవర్‌గా మార్చారు. తాము అనుకున్నది అతని అప్రూవర్ వాంగ్మూలంగా నమోదు చేశారు. పీఏ కృష్ణారెడ్డిని, మరికొందర్ని ఢిల్లీకి తీసుకువెళ్లి తీవ్ర చిత్రహింసలు పెట్టారు. తాను చెప్పిందే చెప్పాలని వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వైఎస్సార్ జిల్లాలో పలువురిని అక్రమంగా నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేయడంతో వారి కుటుంబాలు బెంబేలెత్తిపోయాయి. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రామ్‌సింగ్ స్వయంగా అసత్య ఆరోపణలు చేశారు. కడపలో తాను కార్లో వెళ్తుంటే ఆగంతకులు వచ్చి హత్య చేస్తానని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించగా ఆయన కారుపై ఎలాంటి దాడి జరగలేదని... ఎవరూ బెదిరించలేదని నిర్ధారణ అయ్యింది. అనేక ఫిర్యాదులు రావటంతో ఇంతటి వివాదాస్పదుడైన రామ్సింగ్ను న్యాయస్థానం ఆదేశాలతో కేంద్ర హోమ్ శాఖ ఈ కేసు దర్యాప్తు నుంచి తప్పించింది. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి? రాజకీయ వారసత్వం మాకే దక్కాలి.. వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వంపై ఆయన అల్లుడు, చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి కన్నేశారు. ఆయన తరువాత రాజకీయ వారసత్వంగా తమకే పదవులు దక్కాలని భావించారు. కానీ వివేకానందరెడ్డి తన రెండో భార్య షమీమ్‌తో తనకు కలిగిన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయించారు. దాంతో రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి కంగుతిన్నారు. షమీమ్ ఇంటికి వెళ్లి ఆమెను తీవ్రంగా హెచ్చరించారు. ఆమె కుమారుడిని కిడ్నాప్ చేస్తామని కూడా బెదిరించారు. వారిద్దరికి భయపడి ఆమె పులివెందుల నుంచి హైదరాబాద్ వెళ్లిపోయి ఓ అజ్ఞాత ప్రదేశంలో ఉండేవారు. అంటే వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం తమకే దక్కాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారన్నది సుస్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే వివేకానందరెడ్డి 2019 ఎన్నికల ముందు హత్యకు గురయ్యారు. దస్తగిరి? హత్య చేసి... హైడ్రామా తండ్రిని చంపినవారిపై ఎవరికైనా కోపం, కక్ష ఉంటాయి. కానీ వివేకానందరెడ్డిని ఎంత పాశవికంగా హత్య చేసిందీ వెల్లడించిన దస్తగిరితో వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండటం విస్మయం కలిగించేదే. వివేకాను హత్య చేసిన నలుగురిలో దస్తగిరి ఉన్నారన్నది నిర్ధారణ అయ్యింది. కానీ అదే దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిపై నిరాధారణ ఆరోపణలు చేయిస్తున్నారంటే... వెనుక ఎవరున్నారన్నది కీలకం. చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి...ఇలా అందరూ దస్తగిరికి బహిరంగంగానే సహకరిస్తున్నారు. వివేకా హత్యకు ముందు రూ.500 కు కూడా అప్పులు చేసిన దస్తగిరి ప్రస్తుతం ఓ కాన్వాయ్‌తో కూడిన బొలేరో వాహనాలను కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతున్నారు. ఇక దస్తగిరి చేస్తున్న దుష్ప్రచారాన్ని పదే పదే టీడీపీ అనుకూల మీడియా ప్రసారం చేస్తోంది. ఆయన ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తోంది. అంటే దస్తగిరి ఇష్టానుసారంగా చెబుతున్న కట్టుకథలు, చేస్తున్న అసత్య ఆరోపణల వెనుక చంద్రబాబు ముఠా, సునీత కుటుంబమే ఉందన్నది స్పష్టమవుతోంది కదా!. సెల్ఫోన్లో డేటా డిలీట్ చేశారెందుకు? ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డికి వివేకా రాసిన లేఖను, సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి అందజేశారు. వారు ఆ సెల్‌ఫోన్‌లోని డేటాను డిలీట్ చేశారు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. ‘‘ఆ రోజు ఉదయం పీఏ కృష్ణా రెడ్డి ఫోన్ చేసి గాయాలతో వివేకా బాత్రూమ్లో పడి ఉన్నారని చెప్పారు. మా నాన్నకు గతంలో కూడా గుండె సమస్య ఉన్నందున బాత్రూమ్లో పడి తలకు బలమైన గాయం అయి ఉండొచ్చని భావించా. అందుకే పోలీసులకు అలాగే ఫిర్యాదు చేయమని కృష్ణారెడ్డితో చెప్పా’’ అని సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో సునీత పేర్కొన్నారు. లేఖను చూశాకైనా... వివేకా మృతదేహాన్ని చూశాకైనా ఒక డాక్టరైన సునీతకు ఎలాంటి అనుమానమూ రాలేదంటే ఏమనుకోవాలి? ఉద్దేశపూర్వకంగా నిజాలు దాటిపెట్టారని భావించనవసరం లేదా? తండ్రిని ఓడించినా... సునీతకు ఇష్టులే వివేకానందరెడ్డిని 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే చంద్రబాబు దొంగదెబ్బ తీసి ఓడించారు. 2017లో వైఎస్సార్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకాను పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంపిక చేశారు. జిల్లాలో మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీ వారే కావడంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని భావించారు. వివేకా ఎమ్మెల్సీగా ఎన్నికైతే జిల్లాలో టీడీపీకి ఉనికే ఉండదని చంద్రబాబు భావించారు. అందుకే వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసి వివేకాను కుట్రతో ఓడించారు. అక్రమాలకు పాల్పడి బీటెక్ రవి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ కుట్రలో చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి సర్వంతామై వ్యవహరించారు. కానీ ఆ ముగ్గురూ సునీతకు, ఆమె భర్త, బావగారికిçప్పుడు అత్యంత సన్నిహితులైపోవటమే విచిత్రం. – సాక్షి, అమరావతి -
బీజేపీ కంటే చంద్రబాబు భజనే ఎక్కువైంది!
సాక్షి ప్రతినిధి, కడప : పేరుకు కాషాయ కండువా కప్పుకున్నా.. మనసు మాత్రం పచ్చ పార్టీ గురించే ఆలోచిస్తుంది. చంద్రబాబుకు జై కొట్టే అతి కొద్దిమంది బీజేపీ నేతల్లో ముందు వరుసలో మాజీ ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణరెడ్డి నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ విస్తరించాలనే ఉద్దేశం కంటే టీడీపీ బలపడాలనే లక్ష్యం ఆయనలో బలంగా దాగి ఉంది. అందుకు అనుగుణంగానే రాజకీయ సమాలోచనలు ఉంటున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. తాజాగా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పొత్తులపై ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఒకవైపు తాము జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నామని, టీడీపీతో కలిసి వెళ్లేది లేదని బీజేపీ అగ్రనేతలు చెబుతున్నారు. బీజేపీలోని చంద్రబాబు వర్గం నేతలు మాత్రం టీడీపీతో కలవడానికి అత్యధికంగా ఇష్టపడుతున్నారు. అడపాదడపా అదే విషయాన్ని తెరపైకి తెస్తూ తెలుగుదేశం పార్టీని రక్షించేందుకు తెరవెనుక సంకల్పం పుచ్చుకున్నారు. అలాంటి వారిలో జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ముందు వరుసలో నిలుస్తున్నారు. నిత్యం బీజేపీ భజన కంటే చంద్రబాబు భజనే పరిపాటిగా పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పటిష్టత ఎలా ఉన్నా, టీడీపీ బలపడాలనే తపన మెండుగా ఉండడమే అందుకు ప్రధాన కారణంగా రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కొరవడిన చిత్తశుద్ధి! 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఘోర పరాజయం పాలైంది. టీడీపీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణరెడ్డి సైతం భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ సైతం అదేబాట పట్టారు. అందుకు ప్రధాన కారణం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడమే. అధికారం లేకపోతే రాజకీయ మనుగడ కష్టసాధ్యమనే భావనే వారిని బీజేపీలో చేరేలా చేసింది. వైఎస్సార్సీపీ జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే క్రమంలో కుటుంబం యావత్తు ఆ పార్టీలో చేరారు. కాగా బీజేపీలో కేవలం ఆదినారాయణరెడ్డి మాత్రమే చేరి, కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీలో అలాగే కొనసాగేలా జాగ్రత్త పడ్డారు. ఇదే వైఖరిని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా అవలంబించారు. ఎంపీగా బీజేపీ జాతీయ నేతలతో నిత్యం టచ్‌లో ఉంటూనే కుటుంబాన్ని టీడీపీలో కొనసాగిస్తున్నారు. బీజేపీ పట్ల వీరికి ఉన్న చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. రాబోవు రోజుల్లో మరింత వివాదాస్పదం.. భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ పాళ్లు అధికం. అరువు తెచ్చుకున్న నాయకుల కారణంగా ఆ పార్టీలో కూడా క్రమశిక్షణ లోపించింది. ఎన్నికల గడువు సమీపించే కొద్ది బీజేపీ నేతల నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు అధికం కానున్నాయి. అదే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు గురించి మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు కూడా అందులో భాగంగానే భావించాల్సి వస్తోంది. ఇప్పటికే జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే ఆది సోదరుడి కుమారుడు భూపేష్‌రెడ్డి కొనసాగుతున్నారు. టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ కుటుంబాన్ని అలాగే కొనసాగించి, ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ కేటాయించాలని తెరవెనుక మంత్రాంగాన్ని మాజీ ఎమ్మెల్యే ఆది నడుపుతున్నట్లు సమాచారం. ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం తమ స్వగ్రామం దేవగుడికి సమీపంలోనే ఉండడం, ప్రొద్దుటూరు పట్టణం, రూరల్, రాజుపాళెం మండలాలు మాతమ్రే విస్తరించి ఉండడం, పలువురితో ప్రత్యక్ష సంబంధాల దృష్ట్యా ఆ సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమేరకే బీజేపీ నాయకత్వంతో నిమిత్తం లేకుండా వివాదాస్పద నిర్ణయాలు, అభిప్రాయాలు తెరపైకి తెస్తున్నారు. రాబోవు రోజుల్లో మరింతగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, కుదిరితే టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు.. లేదంటే బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే ఆదినారాయణరెడ్డి అసలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్
-
వివేకా హత్య కేసు: కుట్రదారులతో కుమ్మక్కు
తండ్రిని హత్య చేసినవానిపై పగ తీర్చుకునే కథతో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. హత్యకు కుట్ర చేసినవారిని జైలుకు పంపించేవరకు చేసిన న్యాయ పోరాటాలూ చూశాం. కానీ తండ్రిని హత్య చేసిన హంతకుడిని ఆప్తుడిగా భావిస్తూ సఖ్యతగా ఉండటం ఏ సినిమా కథలోనూ లేదు. తండ్రి రాజకీయ ప్రత్యర్థులతో జట్టు కట్టడం ఎక్కడా వినలేదు. అందుకే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిది తీరు విస్మయం కలిగిస్తోంది. వివేకా రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు, ఆది నారాయణ రెడ్డి, బీటెక్ రవిలతో ఆయన కుటుంబ సభ్యులు జట్టు కట్టారు. హతుడైన వివేకా కుటుంబ సభ్యులు హంతకుడైన దస్తగిరితో చేతులు కలిపారు. ఈ కుట్ర కథలో సూత్రధారులు, పాత్రధారులూ ఒక్కటయ్యారు. ఆస్తి, రాజకీయ వారసత్వం కోసం కక్షగట్టిన కుటుంబ సభ్యులు కూడబలుక్కుని వాస్తవాలు దాచిపెడుతున్నారు. రాజకీయ ఆధిపత్యం కోసం కాచుకుని కూచున్న ప్రత్యర్థి పార్టీ నేతలు ఆడించినట్టు ఆడుతున్నారు. వెరసి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలకు పాతరేసేందుకు ఆయన సొంత కుటుంబ సభ్యులే యత్నిస్తున్నారు. ఆర్థిక, రాజకీయ వారసత్వ విభేదాలతో వివేకా హత్య దర్యాప్తును తప్పుదారి పట్టిస్తున్న ఈ ముఠా పన్నాగం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. వివేకా శత్రువులతో జట్టుకట్టిన ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డికి బయట శత్రువులు, ప్రత్యర్థులతో ఆయన కుటుంబ సభ్యులే జట్టు కట్టడం విభ్రాంతి కలిగిస్తోంది. ఆయనకు రాజకీయంగా శత్రువులు, ప్రత్యర్థులు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి కాగా... ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలతో అల్లుడు–చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి ఆయనకు ఇంట్లోనే శత్రువులుగా మారారన్నది బహిరంగ రహస్యం. అలాంటి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్ రెడ్డితో పాటు వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా ప్రస్తుతం ఆ టీడీపీ నేతలతో అత్యంత సన్నిహితంగా ఉంటుండటం విస్మయపరిచేదే. వాస్తవానికి ఒకప్పుడు వివేకా వద్ద డ్రైవర్‌గా ఉన్న దస్తగిరిని సునీతే పన్లోంచి తొలగించారు. అదే దస్తగిరి వివేకాను నరికి హత్య చేస్తే... అతనితో సునీత, అమె భర్త సఖ్యతగా ఉంటున్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే ఓ కీలకమైన అంశం చర్చించాల్సిన అవసరం ఏర్పడుతోంది. వివేకానందరెడ్డి మరణిస్తే ఎవరికి ప్రయోజనం అన్నది ఈ కేసులో కీలకంగా మారుతోంది. కడప జిల్లాలో కనీసం ఉనికి చాటుకోవాలంటే వివేకానందరెడ్డి ఉండకూడదన్నది టీడీపీకి రాజకీయ అవసరం. తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నందున వివేకానందరెడ్డి అడ్డుతొలగించుకోవడం అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి ప్రయోజనకరం. పులివెందులలో పట్టు సాధించడానికి వివేకానే అడ్డున్నారన్నది బీటెక్ రవి ఉద్దేశం. అందుకే 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లోఆయన్ని దొంగదెబ్బతీసిన ఈ ముఠానే 2019లో ఏకంగా భౌతికంగా అడ్డుతొలగించుకునేందుకు కుట్ర పన్నారనటానికే ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పాలి. మరి వారితో వివేకా కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిది సఖ్యతగా ఉండటం వెనుక అసలు కోణం ఏమిటన్నదే ఈ కేసులో కీలకం. అసలు టీడీపీ మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి... వివేకా పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డికి ఎలా సన్నిహితుడయ్యారు? అదీ ఆదినారాయణ రెడ్డిని ఎంపీ ఎన్నికల్లో ఓడించి సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని గెలిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న నేపథ్యంలో...! దీని వెనుకే అసలు గూడు పుఠాణీ ఉంది. వివేకానందరెడ్డి మరణించిన విషయాన్ని ఆయన పీఏ కృష్ణారెడ్డి చెబితే శివ ప్రకాశ్ రెడ్డి వెంటనే ఎవరికి సమాచారం ఇవ్వాలి... సాధారణంగా సమీప బంధువులకు ముందు చెప్పాలి. కానీ వివేకానందరెడ్డి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న అప్పటి టీడీపీ మంత్రి ఆది నారాయణ రెడ్డికి మొదట ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనేమీ వివేకాకు బంధువు కాదు... మిత్రుడు అంతకన్నా కాదు. పైపెచ్చు రాజకీయ ప్రత్యర్థి. ఏదో విషయాన్ని గోప్యంగా ఉంచాలన్న ఉద్దేశంతోనో... విషయాన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడతోనో వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగి ఉంటుందన్నది తేలిగ్గానే అర్థమవుతుంది. వివేకా ఇంట్లో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు వివేకానందరెడ్డి రెండో వివాహం అనంతరం ఆయన కుటుంబంలో తలెత్తిన పరిణామాలు ఈ కేసులో అత్యంత కీలకం. తన రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇస్తానని... ఆమెతో తనకు పుట్టిన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకా చెప్పడమే ఆ కుటుంబంలో విభేదాలకు ఆజ్యం పోసింది. ఎందుకంటే ఆయన ఆస్తికి ఏకైక వారసుడిని కావాలని అల్లుడు–చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పట్టుదలతో ఉన్నారు. అందుకే ఆస్తిలో షమీమ్‌కు వాటా ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఇక రాజకీయంగా వివేకా వారసత్వాన్ని అందుకోవాలని పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి భావిస్తున్నారు. అందుకు వివేకా సమ్మతించకపోవడంతో పాటు తన రెండో భార్య కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటిస్తాననేసరికి కక్ష గట్టారు. అందుకే వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె, అల్లుడు ఆయన్ని విడిచిపెట్టి హైదరాబాద్‌లో ఉంటుండగా... షమీమ్‌తో సునీత ఘర్షణ పడ్డారు. జుగుప్సాకరమైన భాషలో వాట్సప్ మెసేజుల ద్వారా దూషించుకున్నారు. షమీమ్‌ను వివేకా బావమరుదులిద్దరూ తీవ్రంగా బెదిరించారు. 2012లో రోడ్డు ప్రమాదానికి గురైన వివేకాను చూసేందుకు వెళ్లిన షమీమ్‌ను శివప్రకాశ్ రెడ్డి ఇంట్లోకి రానివ్వలేదు. ఆయన హెచ్చరించడంతో... ప్రాణభయంతో షమీమ్ అన్నయ్య, వదిన కుటుంబం పులివెందుల విడిచిపెట్టి వెళ్లిపోయింది. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్ రెడ్డిలతో ముప్పు ఉన్నందునే షమీమ్ హైదరాబాద్‌లో తన చిరునామా కూడా గోప్యంగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. షమీమ్‌కు ఓ ఇల్లు ఇవ్వాలని... ఆమె కుమారుడిని హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించాలని అనుకుంటున్నా గానీ తన కుటుంబ సభ్యులు అడ్డుపడుతుండటంతో సాధ్యం కావడం లేదని వివేకా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఎందుకంటే అప్పటికే కుటుంబ వ్యాపార సంస్థలకు సంబంధించి ఆయనకు ఉన్న చెక్ పవర్‌ను ఆయన కుటుంబ సభ్యులు తొలగించారు. వివేకా ఇద్దరు బావమరుదులు తనను తీవ్రంగా బెదిరించారని వారితో తనకు తన కుమారుడికి ముప్పు ఉందని షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోనూ స్పష్టం చేశారు. వివేకాకు కూడా ఆయన ఇద్దరు బావమరుదుల నుంచే ముప్పు ఉండేదని చెప్పారామె. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు ఆయన హత్య వెనక ఎంత బలంగా ఉండవచ్చో తెలియకమానదు. రక్తపు మరకల లేఖపై గప్‌చుప్..!! వివేకానందరెడ్డికి ఇంటా, బయటా ఉన్న శత్రువులందరూ అన్ని విషయాలపైనా మాట్లాడుతున్నారు కానీ... రక్తపు మరకలతో ఉన్న లేఖపై మాత్రం మౌనం వహిస్తున్నారు. అదే వివేకా రాసిన లేఖ. వివేకా రక్తపు మరకలతో తడిసిన లేఖపై... అంతా కూడబలుక్కుని నిర్ణయించుకున్నట్టు ఒక్క మాటా మాట్లాడటం లేదు. ఎందుకంటే ఈ హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు, ఆయన బృందం పన్నిన వ్యూహంలో భాగమే ఆ లేఖపై మౌనం!!. విచిత్రమేంటంటే తరచూ టీడీపీ వేదికల మీద ఈ కేసు గురించి మాట్లాడే చంద్రబాబు ఒక్క రోజు కూడా వివేకా రాసిన లేఖ గురించి ప్రస్తావించ లేదు. సునీత, ఆమె భర్త కూడా అసలు అలాంటి లేఖ ఒకటి ఉన్నట్టుగా కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే వివేకా గుండె పోటుతో మరణించారనే కట్టు కథను ప్రచారంలోకి తెచ్చేందుకే ఆ లేఖను ఆ ముఠా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసింది. వివేకాపై తీవ్రంగా దాడిచేసిన తరువాత హంతకులు ఆయన చేత బలవంతంగా లేఖ రాయించారు. వాళ్లు బెదిరించడంతో... డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరచినట్టు ఆ లేఖలో వివేకా రాశారు. ఆ లేఖను మొదట.. అంటే 2019, మార్చి 15న ఉదయం 6.10 గంటలలోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి... ఆ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. తాము వచ్చే వరకు ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను ఎవరికి ఇవ్వకుండా దాచి ఉంచాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పీఏ కృష్ణారెడ్డితో చెప్పారు. వారు అలా చెప్పకపోయి ఉంటే కృష్ణారెడ్డి ఆ లేఖ విషయాన్ని వెంటనే బయటపెట్టేవారు. దాంతో వివేకాది హత్యేనని అందరికీ వెంటనే స్పష్టత వచ్చేది. గుండెపోటో మరొకటో కాదని వెంటనే తెలిసిపోయేది. అలా తెలిసి ఉంటే... ఎవ్వరూ మృతదేహాన్ని తాకే ప్రయత్నం చేసి ఉండేవారు కాదు. అప్పుడసలు ‘‘రక్తపు మరకలు కడిగిందెవరు? గాయాలకు కట్లు కట్టిందెవరు?’’ అని పదేపదే ప్రశ్నించే అవకాశం చంద్రబాబు నాయుడికి వచ్చి ఉండేదే కాదు. కానీ వారు అలా చేయలేదు. వివేకా గుండెపోటుతో మరణించారని ప్రచారం చేయాలన్న ఉద్దేశంతోనే ఆ లేఖను బయటపెట్టకూడదని సునీత, ఆమెభర్త రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్ రెడ్డి నిర్ణయించినట్టు స్పష్టమవుతోంది. అనంతరం టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ద్వారా గుండె పోటు కథను ప్రచారంలోకి తెచ్చారు. గుండె పోటు కథ ప్రచారంలోకి రావడంతో తమ లక్ష్యం నెరవేరిందని వారు భావించారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పులివెందుల చేరుకోవటంతో ఆ లేఖతోపాటు వివేకా సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి వారికి ఇచ్చారు. ఆ లేఖను చదివాక కూడా వెంటనే దాన్ని పోలీసులకు అప్పగించనే లేదు. ఆ సెల్‌ఫోన్‌లోని మెస్సేజులు, డేటాను డిలీట్ చేశారు. అనంతరం సునీత ఆదేశాలతో సాయంత్రం 5గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నది ఈ హత్య కేసులో కీలకాంశం. ముందస్తు పన్నాగం ప్రకారమే ఆ లేఖపై మాత్రం ఇటు సునీత, ఆమె భర్త గానీ అటు చంద్రబాబు, టీడీపీ నేతలుగానీ మాట్లాడటం లేదు. అవినాశ్‌ను వివేకా ఇంటికి వెళ్లమని చెప్పింది శివప్రకాశ్‌రెడ్డే వివేకా హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు టీమ్ పక్కా పన్నాగంతో వ్యవహరించింది. వాస్తవాలు వెలుగులోకి రాకుండా...కేవలం ఊహాగానాలు, అభూతకల్పనల చుట్టూనే దర్యాప్తు కేంద్రీకృతం అయ్యేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే టీడీపీ అనుకూల పచ్చ మీడియాలో రోజుకో కట్టుకథను ప్రచారంలోకి తీసుకువస్తూ అటు సీబీఐ దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తూ... ఇటు ప్రజలనూ తప్పుదారి పట్టిస్తోంది. ఎంపీ అవినాశ్ రెడ్డినే లక్ష్యంగా చేసుకుని విషం చిమ్ముతోంది. ఎంపీ అవినాశ్ రెడ్డి వివేకా నివాసానికి ఏ సమయానికి వెళ్లారు... అక్కడ ఏం చూశారు అన్నదే ప్రధానాంశంగా చేసుకుని... వివేకా మృతదేహానికి కుట్లు వేశారని, కట్లు కట్టారనే అవాస్తవాలను ప్రచారంలోకి తీసుకువస్తోంది. వివేకానందరెడ్డి పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి 2019 మార్చి 15న ఉదయం 6.20 గంటల సమయంలో ఫోన్ చేసి చెబితేనే ఎంపీ అవినాశ్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. అప్పటికే ఎన్నికల ప్రచారం కోసం తన అనుచరులతో జమ్మలమడుగు వెళుతున్న ఆయనకు శివ ప్రకాశ్‌రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రాకపోయి ఉంటే ఆయన జమ్మలమడుగు వెళ్లి ఉండేవారు. వివేకా మరణించారని చెప్పి... వెంటనే వెళ్లమంటేనే అవినాశ్ అక్కడికి వెళ్లారు. ఆయన అక్కడకు వెళ్లినా పీఏ కృష్ణా రెడ్డి మాత్రం వివేకా రాసిన లేఖ గురించి చెప్పలేదు. ఎందుకంటే ఆ లేఖ విషయం గోప్యంగా ఉంచమని సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆయన్ని ఆదేశించారు. ఆ లేఖ విషయాన్ని శివ ప్రకాశ్ రెడ్డి ఎంపీ అవినాశ్‌కు ఫోన్ చేసినప్పుడు చెప్పినా... లేక ఆయన వివేకా ఇంటికి రాగానే పీఏ కృష్ణా రెడ్డి చెప్పినా ఎవ్వరూ భౌతిక కాయాన్ని తాకే ఉండేవారే కాదు. ఆ లేఖ విషయాన్ని అవినాశ్ వెంటనే పోలీసులకు చెప్పి ఉండేవారు. వివేకా హత్యకు గురయ్యారని అందరికీ వెంటనే తెలిసిపోయేది. అప్పటికే భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు, సాధారణ ప్రజల్ని ఆ మృతదేహం దగ్గరకు ఎవరూ వెళ్లకుండా అవినాశే కట్టడి చేసేవారు. దాంతో ఈ కేసులో కీలక ఆధారాలు పోలీసులకు దొరికేవి. కానీ అలా జరగడం నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదని వాళ్లు పన్నిన వ్యూహమే చెబుతోంది. అందుకే ఆయన లేఖ విషయాన్ని ఎంపీ అవినాశ్‌కు చెప్పలేదు. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించి వివేకా హత్య కేసును తప్పుదారి పట్టించారని చెప్పటానికి ఇంతకన్నా ఆధారాలేం కావాలి? ‘కట్టు’కథలో ఇరికించడానికేనా? వివేకానందరెడ్డిని హత్య చేసి.. గుండెపోటుతో మరణించారన్న కట్టు కథను తెరపైకి తేవడానికే శివప్రకాశ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఫోన్లో మాట్లాడుకుని ఉంటారన్నది కాస్త లోతుగా పరిశీలిస్తే అర్థమయ్యే విషయం. వారిద్దరి ఫోన్ సంభాషణ అనంతరమే గుండె పోటు కథ తెరపైకి వచ్చింది. వివేకా గుండె పోటుతో మరణించారని శివప్రకాశ్ రెడ్డి తనతో చెప్పారని ఆది నారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఎక్కువగా సిగరెట్లు తాగడంతోనే అలా అయ్యి ఉంటుందని తాను ఆయనతో చెప్పినట్లు కూడా వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఎంత కుట్రపూరితంగా గుండె పోటు కథను తెరపైకి తెచ్చారో తెలియటం లేదా? మరోవైపు వివేకాను కుట్రపూరితంగా ఓడించిన బీటెక్ రవి, వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి సన్నిహితుడయ్యారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసి తాను ఎమ్మెల్సీగా గెలిచానని బీటెక్ రవి తాజాగా పచ్చ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం అంగీకరించారు. అదే ఇంటర్వ్యూలో వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, తాను ఇప్పటికీ అత్యంత సన్నిహితులమని కూడా చెప్పడం గమనార్హం. అంటే వివేకా మరణంతో రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందుతామని భావిస్తున్న వారంతా అప్పుడు ఇప్పుడూ ఒకే జట్టుగా ఉంటున్నారన్నది అర్థం కావటం లేదా? అమరావతి నుంచి కథ నడిపిన బాబు.. వైఎస్ వివేకా హత్యకు గురైన రోజు అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతి నుంచి పెద్ద కథే నడిపారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కడప ఎస్పీతోనూ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డితోను, అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవితోను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కేసు దర్యాప్తును ప్రభావితం చేశారు. వివరాలు ఎప్పటికప్పుడు చంద్రబాబుకు అప్డేట్ చేశారు. కడప ఎస్పీకి సైతం ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేందుకు ఏబీవీ ఎందుకు అంతగా తాపత్రయ పడ్డారన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ... తాను జరిపిన దర్యాప్తులో అసలు లేఖ విషయమే పట్టించుకోలేదు. -
ఏది నిజం?: వివేకా హంతకుల్ని నడిపిస్తున్నదెవరు?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డికి వైఎస్సార్ సీపీ తరఫున టిక్కెట్టిచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గెలిచేంత మెజారిటీ ఉన్నా సరే... కుట్రపూరితంగా ఆయన్ని ఓడించి.. టీడీపీ తరఫున బీటెక్ రవిని గెలిపించింది చంద్రబాబు నాయుడు. ఆయన ఉంటే జిల్లాలో తాము రాజకీయంగా ఏమాత్రం ఎదగలేమని భావించింది టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి. ఆయన్ని ఏకంగా గొడ్డలితో నరికి నేను హత్య చేశాను అని దర్యాప్తు సంస్థల ఎదుటే సాక్ష్యం ఇచ్చిన దస్తగిరి. వీళ్లంతా ఎవరు? వివేకానందరెడ్డిని వ్యక్తిగతంగా, రాజకీయంగా అంతం చేసిన ముఠా సభ్యులు. మరి వీళ్లంటే వివేకానందరెడ్డి కుటుంబానికి సహజంగానే తీవ్ర ఆగ్రహం ఉండాలి కదా? కానీ ఏం జరుగుతోంది? చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, దస్తగిరి... బాబు కోసం పనిచేసే ‘ఈనాడు’.. దాని తోకలు.. వీళ్లంతా ఇపుడు వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు–చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితులైపోయారు. అంతా కలిసే కోర్టులకెళుతున్నారు. ‘నేనే నరికి చంపా’ అన్న దస్తగిరి బెయిలుకోసం దరఖాస్తు చేస్తే వ్యతిరేకించ లేదు. దర్జాగా బయటే తిరుగుతున్నాడతను. ఎల్లో మీడియాకు పతాక స్థాయి ఇంటర్వ్యూలిస్తున్నాడు. వంకర మాటల ఓపెన్హార్టులో బీటెక్ రవి ప్రవచనాలు చెప్తున్నాడు. వీళ్లంతా కలిసి హంతకుడిని కూడా వదిలేసి తమ రాజకీయ ప్రత్యర్థుల్ని దీంట్లో ఇరికించడానికి వెంటాడుతున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. ఎవరికి అర్థం కానిది ఈ నాటకం? వివేకానందరెడ్డి హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన ఈ ఎల్లో మాఫియాను ఛేదిస్తే తప్ప హత్య వెనక ఉన్న వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదు. 2017లో వివేకాపై చంద్రబాబు రాజకీయ కుట్ర.. మెజార్టీ సభ్యులు ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి వైఎస్ వివేకానందరెడ్డిని రాజకీయంగా అంతం చేయడమే కాదు భౌతికంగానూ లేకుండా చేయాల్సిన అవసరం కచ్చితంగా టీడీపీకే ఉందన్నది బహిరంగ రహస్యం. వైఎస్సార్ జిల్లాలో టీడీపీ బలోపేతానికి ఆయనే అడ్డంకిగా నిలబడ్డారు. అందుకే 2017లో వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వివేకాను కుట్రపూరితంగా ఓడించారు చంద్రబాబు. స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకానందరెడ్డిని అభ్యర్థిగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపిక చేశారు. జిల్లాలో మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీకి చెందినవారే ఉండటంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని అంతా భావించారు. వివేకాను ఓడిస్తే.. నాటి విపక్ష నేత జగన్‌ను ఓడించినట్లేనని చంద్రబాబు భావించారు. అందుకే వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలు పెట్టి తమ వైపు లాక్కున్నారు. దీనికి నాటి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి పూర్తిగా సహకరించారు. ఎందుకంటే వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నీతిబాహ్యంగా టీడీపీకి అమ్ముడుపోయి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి అయిన వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేశ్ భారీగా డబ్బులు వెదజల్లి వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభపెట్టి దొడ్డిదారిలో వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించారు. 2019... వివేకా భౌతికంగా అంతం 2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబులో మళ్లీ గుబులు మొదలైంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే సీటును గెలిచిన టీడీపీకి ఈ సారి అది కూడా కష్టమేనని అర్థమైంది. కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ లోక్‌సభ స్థానానికి పార్టీ ఎన్నికల ఇన్చార్జ్గా అప్పటికే వైఎస్ వివేకానందరెడ్డిని నియమించారు. పార్టీ గెలుపు కోసం ఎన్నికల వ్యూహాలు పన్నుతూ...అందర్నీ కలుపుకుంటూ వెళ్లారు వివేకా. దాంతో చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి బెంబేలెత్తారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు ఖరారు చేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్‌ను కూడా ఆదినారాయణ రెడ్డి కొడుక్కి ఇచ్చారు. వివేకా ఉంటే ఎప్పటికీ తాము రాజకీయంగా పైచేయి సాధించలేమన్నది బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే వివేకా హత్యకు గురయ్యారు. మరి ఇది టీడీపీ కుట్ర కాదా? వివేకా హత్యకు ముందు టీడీపీ నేతలతో కొందరి రహస్య సమావేశాలు... ఆయన హత్య తరువాత టీడీపీ నేతలు వ్యవహరించిన తీరే దీనికి ఊతమిస్తోంది. హత్య అనంతరం... అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పదేపదే కడప ఎస్పీకి ఫోన్ చెయ్యడం... బీటెక్ రవితో కూడా నేరుగా సంభాషించటం... ఎప్పటికప్పుడు జరుగుతున్న వ్యవహారాలను నాటి సీఎం చంద్రబాబుకు అప్డేట్ చెయ్యటం.. ఇవన్నీ కాదనలేని వాస్తవాలు. అంటే... అంతా తాము అనుకున్నట్లే జరుగుతోందా? లేదా.. అన్నది బాబుకు ఏబీ అప్డేట్ చేశారన్నది నిపుణుల మాట. హత్యకు ముందు... వివేకా అనుచరుడితో బీటెక్ రవి భేటీ ఎందుకో...! తనకు దీర్ఘకాలంగా అనుచరుడిగా ఉన్న కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డితో వివేకాకు ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు వచ్చాయి. దాంతో పరమేశ్వరరెడ్డి కక్ష పెంచుకుని పులివెందుల నియోజకవర్గంలో వివేకా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ నేత బీటెక్ రవితో చేతులు కలిపాడు. వివేకా హత్యకు అప్పటికే పన్నాగం సిద్ధం కావడంతో... ముందుగా పరమేశ్వరరెడ్డి ఎలిబీ సృష్టించుకోవడానికి వివేకా హత్యకు కేవలం రెండు రోజుల ముందే అంటే 2019 మార్చి 13న అనారోగ్యం సాకుతో కడపలోని సన్‌రైజ్ ఆస్పత్రి ఐసీయూలో చేరాడు. కానీ ఎవరికీ తెలియకుండా 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో హరిత హోటల్లో రెండుసార్లు సమావేశమయ్యాడు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి... ఆ తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి తిరస్కరించడం సందేహాలకు తావిస్తోంది. ‘గుండె పోటు’ కథకుడు శివప్రకాశ్ రెడ్డి... వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయటమే కాదు. ఆ హత్యలో ఇతరుల్ని ఇరికించడానికి కూడా ఎల్లో గ్యాంగ్ పకడ్బందీ కుట్ర పన్నిందని చెప్పొచ్చు. ఎందుకంటే వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారనే తప్పుడు ప్రచారం వెనుక ఆయన పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డి, టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. శివప్రకాశ్‌రెడ్డి మొదట ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పారు. ‘‘సిగరెట్లు ఎక్కువుగా తాగుతారు కదా! అందుకే ఇలా జరిగి ఉండొచ్చు’’ అని ఆదినారాయణరెడ్డి ఆయనతో చెప్పారు. ఈ విషయాన్ని ఆదినారాయణ రెడ్డి స్వయంగా టీవీ ఛానెళ్ల ఎదుట వెల్లడించారు. అంతేకాదు. ఆదినారాయణరెడ్డికి చెప్పిన శివప్రకాశ్ రెడ్డే... ఎన్నికల ప్రచారం నిమిత్తం ఉదయాన్నే జమ్మలమడుగు వెళుతున్న ఎంపీ అవినాశ్‌రెడ్డికి కూడా వివేకా గుండెపోటు విషయం చెప్పారు. దాంతో అక్కడి నుంచే వెనుదిరిగి... అవినాశ్ రెడ్డి వివేకా ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ వివేకా పీఏ కృష్ణారెడ్డితో పాటు పలువురు ఉన్నారు. ఇలా శివప్రకాశ్ రెడ్డి చెప్పిన గుండెపోటు విషయమే... టీవీల్లో బ్రేకింగ్ న్యూస్‌గా వచ్చింది. ఆయన హత్యకు గురయ్యారనే నిజం బయటపడేలోపే ఈ తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చారు. మరి శివప్రకాశ్‌రెడ్డి, ఆది నారాయణరెడ్డి ఈ తప్పుడు ప్రచారాన్ని ఎందుకు చేశారు? దీన్ని ఛేదిస్తే హత్య కేసులో అసలు కుట్ర బయటపడుతుంది. రక్తపు మరకల లేఖ.. గోప్యంగా ఉంచమన్న కుమార్తె, అల్లుడు.. వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసేందుకుగాను ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డి పక్కా ప్లాన్‌తోనే వ్యవహరించారు. అదెలాగంటే... వైఎస్ వివేకాపై తీవ్రంగా దాడిచేసిన తరువాత హంతకులు ఆయన చేత బలవంతంగా లేఖ రాయించారు. వాళ్లు బెదిరించడంతో... డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని ఆ లేఖలో వివేకా రాశారు. ఆ లేఖను మొదటగా అంటే ఆ రోజు ఉదయం 6.10లోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి... ఆ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. రక్తపు మరకలున్న ఆ లేఖ చూసినవారెవరికైనా... వివేకాది హత్యేనని తెలిసిపోతుంది. కానీ లేఖ విషయాన్ని కృష్ణారెడ్డి చెప్పగానే... తాము వచ్చే వరకు ఆ లేఖను, వివేకా సెల్‌ఫోన్‌ను ఎవ్వరికీ ఇవ్వవద్దని, దాచి ఉంచాలని కృష్ణారెడ్డితో నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు. ఆ తరవాతే అసలు పన్నాగానికి తెరలేచింది. శివ ప్రకాశ్ రెడ్డి ద్వారా అవినాశ్‌రెడ్డికి చెప్పించారు. అవినాశ్ రెడ్డి కాల్ డేటా చూస్తే ఈ విషయం నిర్ధారణ అవుతుంది కూడా. అవినాశ్ అక్కడకు చేరాక కూడా ఆయనకు లేఖ చూపించలేదు. లేఖ ఉందన్న విషయం కూడా చెప్పలేదు. అంటే... అన్నీ పథకం ప్రకారమే చేశారు. వాస్తవానికి వారు గనక ఆ లేఖను వెంటనే పోలీసులకు ఇవ్వాలని చెప్పి ఉంటే వివేకా హత్యకు గురయ్యారన్నది వెంటనే అందరికీ తెలిసిపోయేది. కనీసం అక్కడకు చేరుకున్న అవినాశ్‌కు చూపించినా హత్య సంగతి అర్థమయ్యేది. హత్య జరిగిందని తెలిస్తే ఎవ్వరూ మృతదేహాన్ని తాకేవారే కాదు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. బహుశా! అంతా తామనుకున్నట్టే జరిగిందనో ఏమో!! ఆ రోజు నుంచీ ఇప్పటివరకూ చంద్రబాబు నాయుడు ఈ హత్య గురించి ఎక్కడ మాట్లాడినా... మృతదేహానికి బ్యాండేజీ ఎవరు కట్టారు? రక్తపు మరకలు ఎవరు తుడిచారు? అనే ప్రశ్నలే వేస్తున్నారు. మొత్తం టీడీపీ, ఎల్లో మీడియా.. అందరూ ఇదే విషయమై దుష్ప్రచారం చేస్తున్నారు. అంతే తప్ప అసలు గుండెపోటు అని చెప్పిందెవరు? వారికెలా తెలిసింది? అసలు లేఖను ఎందుకు గోప్యంగా ఉంచారు? అలా ఎందుకు ఉంచమన్నారు? అనే విషయాలను మాత్రం ప్రచారంలోకి రానివ్వటం లేదు. ఇదీ.. కుట్ర వెనక అసలు కథ. ఆ రోజు మధ్యాహ్నం 1గంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఆ లేఖతోపాటు వివేకా సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి ఇచ్చారు. ఆ లేఖను చదివారు కానీ... వెంటనే పోలీసులకు ఇవ్వలేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నదే ఈ హత్య కేసులో కీలకం. చంద్రబాబు మంత్రాంగం... వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన రోజు అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతి నుంచి పెద్ద కథే నడిపారు. అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కడప ఎస్పీతోనూ టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డితోను, బీటెక్ రవితోను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కేసు దర్యాప్తును ప్రభావితం చేశారు. కేసు దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేందుకు ఏబీవీ ఎందుకు అంతగా తాపత్రయ పడ్డారన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ... తాను జరిపిన దర్యాప్తులో అసలు లేఖ విషయమే పట్టించుకోకపోవటం గమనార్హం. వివేకా మరణిస్తే ఎవరికి ప్రయోజనం... ! ఆయన రెండో వివాహంతో ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు వివేకానందరెడ్డి మరణిస్తే ఎవరికి లాభం అన్నది ఈ కేసులో కీలకం. దాంతో అన్ని వేళ్లూ వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన విభేదాలపైకే వెళ్తున్నాయి. తాను రెండో వివాహం చేసుకున్న షమీమ్ అనే మహిళకు పుట్టిన కుమారుడికి ఆస్తిలో భాగం ఇవ్వాలని ఆయన భావించారు. తన రాజకీయ వారసుడిగా చేస్తానన్నది ఆ జిల్లాలో అందరికీ తెలుసు. అందుకే ఆ కుటుంబంలో ఆస్తి వివాదాలు, రాజకీయ వారసత్వ వివాదాలు తీవ్రస్థాయికి చేరాయి. వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్రంగా గొడవపడి ఆయన్ని విడిచిపెట్టి హైదరాబాద్‌లో ఉంటున్నారు. సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, బావగారు శివ ప్రకాశ్‌రెడ్డి షమీమ్ ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డారు. వివేకానందరెడ్డి అప్పటికే ఆమెకు ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను బలవంతంగా తీసుకున్నారు. షమీమ్, వైఎస్ సునీత పరస్పరం దూషించుకుంటూ చేసుకున్న వాట్సాప్ చాటింగ్‌ను కూడా అప్పట్లోనే సిట్ బృందం వెలికితీసింది. షమీమ్‌కు ఓ ఇల్లు ఇవ్వాలని... ఆమె కుమారుడిని హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించాలని అనుకుంటున్నా...అవ్వడం లేదని వివేకా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి జీవించి లేకపోతే ఆయన కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిదికే ఎక్కువ లాభమన్నది గమనించాల్సిన అంశం. ఆస్తితో పాటు రాజకీయ వారసత్వం కూడా తమకే వస్తుందన్నది వారి ఉద్దేశంగా తెలుస్తుంది. హంతకుడు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చింది ఎవరు...!? వైఎస్ వివేకాను గొడ్డలితో స్వయంగా నరికాను అని చెప్పిన దస్తగిరి అప్రూవర్‌గా మారడంతోనే ఈ కేసు దర్యాప్తు దారితప్పింది. అతన్ని అప్రూవర్‌గా మార్చింది ఎవరనే అంశమూ ఇక్కడ కీలకం. దస్తగిరి తరచు వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో భేటీ అవుతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవితో సన్నిహితంగా ఉంటున్నారు. ఎల్లో మీడియాకు ఇంటర్వ్యూలిస్తున్నాడు. అంటే వివేకా కుటుంబం, టీడీపీ నేతల పన్నాగంలో భాగంగానే దస్తగిరి అప్రూవర్‌గా మార్చినట్టు స్పష్టమవుతోంది. అప్పటివరకు పేదరికంలో కొట్టుమిట్టాడిన దస్తగిరి.. అప్రూవర్‌గా మారిపోగానే ఒక్కసారిగా ధనవంతుడైపోయాడు. కారు, బంగ్లా, డ్రైవర్... అన్నీ వచ్చేశాయి. మరి వీటిని ఇస్తున్నదెవరు? ఎందుకు ఇస్తున్నారు? సీబీఐ అధికారులు దస్తగిరిని ఢిల్లీకి తీసుకువెళ్లి మరీ అప్రూవర్‌గా మార్చి వాంగ్మూలం నమోదు చేశారు. అందులో వాస్తవం ఎంతన్నది పట్టించుకోకుండా ఆ వాంగ్మూలం ఆధారంగానే ఏకపక్షంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. హంతకుడు ఎల్లో గ్యాంగ్ హీరోనా...! వివేకాను హత్య చేసిన దస్తగిరిని అటు టీడీపీ ఇటు టీడీపీ అనుకూల పచ్చ మీడియా హీరోగా చూపించేందుకు బరితెగించి వ్యవహరిస్తున్నాయి. ఈనాడు,ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ 5 చానళ్లు దస్తగిరిని ఇంటర్వ్యూలు చేస్తూ అతన్ని ఓ సెలబ్రిటీగా చూపిస్తున్నాయి. వైఎస్సార్ కుటుంబంపై అక్కసుతో పాత్రికేయ విలువలను దిగజారుస్తూ ఓ హంతకుడిని హీరోగా చూపించేందుకు పడరానిపాట్లు పడుతున్నాయి. తన తండ్రి హంతకుడిని ఓ సంఘ సంస్కర్తగా టీడీపీ, ఎల్లో మీడియా చూపిస్తూ ఉంటే సునీత కనీసం అభ్యంతరం వ్యక్తం చేయకపోవటమే ఇక్కడ దారుణం. ఇదే బాబు మార్కు పన్నాగం... చంద్రబాబు ఎవరినైనా అడ్డుతొలగించుకోవాలంటే తనదైన శైలిలో పన్నాగం పన్నుతారు. లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి సొంతం కుటుంబంలోనే చిచ్చుపెట్టి సొంతవారితోనే కథ నడిపిస్తారని ఎన్టీఆర్ విషయంలో రుజువైంది. ఎన్టీ రామారావును ఆయన సొంత పిల్లలతోనే ఛీకొట్టించి మరీ పదవి నుంచి దించేసి తాను అడ్డదారిలో సీఎం అయ్యారు. అదే రీతిలో వివేకానందరెడ్డికి ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డిలతోనే పొగ పెట్టించారు. టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిల సహకారంతో కుటుంబ సభ్యులే పాత్రధారులుగా గుట్టుచప్పుడు కాకుండా కథ ముగించారు. కీలక అంశాలను విస్మరిస్తున్న సీబీఐ సున్నితమైన వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ ఆది నుంచీ దారి తప్పింది. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు...ఆయన లైంగిక అక్రమ సంబంధాలతో ఆయనపై కక్ష పెంచుకున్నవారు... వివేకాను సెటిల్మెంట్లకు వాడుకున్న స్నేహితులు, అనుచరులు...వివేకాను అడ్డుతొలగించుకుంటేనే రాజకీయంగా మనుగడ అని భావించిన చంద్రబాబు, ఆది నారాయణ రెడ్డి, బీటెక్ రవి... ఇలా ఈ కేసులో పచ్చ కుట్రను స్పష్టం చేస్తున్న అనేక కోణాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. కానీ సీబీఐ మాత్రం హంతకుడిని ఎవరో వ్యూహాత్మకంగా అప్రూవర్‌గా మారిస్తే... ఆ వాంగ్మూలం పట్టుకునే ఈ కేసు దర్యాప్తు గోదారిని ఈదేందుకు యత్నిస్తుండటం సీబీఐ తీరునే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. -
‘ఆదినారాయణరెడ్డి కడప జిల్లా పరువు తీస్తున్నాడు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆదినారాయణరెడ్డి కడప జిల్లా పరువు తీస్తున్నాడని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎల్లో మీడియాలో ప్రచారం కోసం ఆదినారాయణ ఇష్టానుసారంగా మాట్లాడటం బాధాకరమన్నారు. ‘‘పెయిడ్ ఆర్టిస్టులతో అమరావతి పేరిట యాత్ర చేయించారు. హైకోర్టు ఆధార్ కార్డులు అడిగితే యాత్ర ఎత్తేశారు. ప్రతి కుటుంబానికి మేలు జరగాలని ప్రభుత్వం పరితపిస్తోంది. సీఎం జగన్ ప్రజలకు మంచి చేస్తుంటే ఓర్వలేక దూషణలకు దిగుతున్నారు. ఆదినారాయణరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి’’ అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. చదవండి: ఎంత ఎబ్బెట్టుగా ఉందో.. ఇంతకీ లోకేష్ డైరీలో ఏముంది? -
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. ఆదినారాయణపై కేసు నమోదు చేస్తాం: ఏఎస్పీ
సాక్షి, గుంటూరు: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆదినారాయణపై కేసు నమోదు చేస్తామని ఏఎస్పీ అనిల్‌కుమార్ అన్నారు. ఆదినారాయణరెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడారన్నారు. ‘‘బహుజన పరిరక్షణ కమిటీ సభ్యులు, సత్యకుమార్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. పోలీసులు ఉండబట్టే సమస్య వెంటనే సద్దుమణిగింది. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇరువర్గాలకు సర్ది చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా విధులు నిర్వహించాం. సత్యకుమార్‌పై ఎలాంటి దాడి జరగలేదు’’ అని ఏఎస్పీ స్పష్టం చేశారు. కాగా, మందడంలో బీజేపీ నేతలు వీరంగం సృష్టించారు. దీక్ష శిబిరం వద్ద దళితులపై బీజేపీ నేత సత్యకుమార్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సత్యకుమార్ అనుచరుల తీరుపై బహుజన పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. సత్యకుమార్ వాహనాన్ని అడ్డుకున్న బహుజన పరిరక్షణ సమితి నేతలు.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బహుజన పరిరక్షణ సమితి ఆందోళనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చదవండి: ఎంత ఎబ్బెట్టుగా ఉందో.. ఇంతకీ లోకేష్ డైరీలో ఏముంది? -
మందడంలో బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి
సాక్షి, అమరావతి: మందడంలో బీజేపీ నేతలు వీరంగం సృష్టించారు. దీక్ష శిబిరం వద్ద దళితులపై బీజేపీ నేత సత్యకుమార్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సత్యకుమార్ అనుచరుల తీరుపై బహుజన పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. సత్యకుమార్ వాహనాన్ని అడ్డుకున్న బహుజన పరిరక్షణ సమితి నేతలు.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బహుజన పరిరక్షణ సమితి ఆందోళనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సత్యకుమార్ అనుచరులు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆడవాళ్లని చూడకుండా టెంట్లో నుంచి లాక్కొచ్చారన్నారు. బీజేపీ ముసుగులో టీడీపీ నాయకులు వచ్చి వీరంగం సృష్టించారని, ఆదినారాయణరెడ్డి, సత్యకుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని వికేంద్రీకరణ మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఇదంతా చంద్రబాబు వెనుకుండి నడిపిస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి ఆదినారాయణ పిచ్చొడిలా మాట్లాడుతున్నారని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. ‘‘సీఎంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు దీక్ష వద్దకు వచ్చి రెచ్చగొడుతున్నారు. సత్యకుమార్ అనుచరులు దళితులపై దాడి చేశారు’’ అని ఎంపీ సురేష్ నిప్పులు చెరిగారు. చదవండి: ఊహలే వార్తలా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా? -
నాడు సంబంధం లేదని నేడు కుటుంబంపై నిందలా?
మా కుటుంబ సభ్యులకు సంబంధం లేదు.. ‘‘మా నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో మా కుటుంబ సభ్యులకు సంబంధం లేదు. మా కుటుంబ సభ్యులకే సంబంధం ఉండి ఉంటే పోలీసులు ఇప్పటికే బయటపెట్టేవారు. హంతకులను పట్టుకోకుండా సిట్ అధికారులు ఏదో దాస్తున్నారు. విచారణ సరిగా జరగడం లేదు. వీళ్లే చేశారంటూ కొన్ని రోజుల తరువాత మా కుటుంబ సభ్యులనే నిందితులుగా చూపించే అవకాశం కూడా ఉంది. ఆ భయంతోనే చెబుతున్నా. మా కుటుంబ సభ్యులే లక్ష్యంగా ఆదినారాయణరెడ్డి ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? కుటుంబ పెద్దను కోల్పోయిన బాధలో మేముంటే మాపైనే పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ కుట్రతో, ఇతరత్రా ప్రయోజనాలు ఆశించి మా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారన్న భయం ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఉంటే ఆ అనుమానం వచ్చేది కాదు. సిట్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం లేదు. రాజకీయంగా నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు.’’ – 2019 మార్చి 26న హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో వైఎస్ వివేకా కుమార్తె సునీత ప్రకటన సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, పరమేశ్వరరెడ్డిలే తన తండ్రిని హత్య చేయించి ఉండవచ్చని గతంలో గట్టిగా ఆరోపించిన వైఎస్ వివేకా కుమార్తె సునీతమ్మ ఒక్కసారిగా మాట మార్చడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 2020 ఆగస్టులో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాల్లో గతంలో చెప్పినదానికి పూర్తి భిన్నంగా సందేహాలు వ్యక్తం చేశారు. పూర్తి అవాస్తవాలు, ఊహాజనిత అంశాల ఆధారంగా ఆమె ఆరోపణలు చేయడం విస్మయపరుస్తోంది. కడప ఎంపీ టికెట్ వైఎస్ షర్మిలకుగానీ వైఎస్ విజయమ్మకుగానీ ఇవ్వాలని వివేకా భావించినట్టు ఆమె సీబీఐకి చెప్పారు. అయితే అదే అంశాన్ని గతంలో సిట్ దర్యాప్తు సందర్భంగా ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. రాజకీయ ప్రయోజనాలే కారణమా? కడప వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాశ్‌రెడ్డి ఎన్నికల ఇన్చార్జ్గా వైఎస్ వివేకానందరెడ్డి వ్యవహరించారు. వైఎస్ అవినాశ్‌రెడ్డి అభ్యర్థిత్వంపై పార్టీలో పూర్తి ఏకాభిప్రాయం ఉంది. అవినాశ్‌రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకూ పని చేశారని 2019 ఎన్నికల ముందు సునీతమ్మ వెల్లడించడం గమనార్హం. దానికి విరుద్ధంగా ప్రస్తుతం సీబీఐకి చెప్పడం వెనుక ఎవరి ప్రమేయం ఉందన్నది ప్రశ్నార్థకంగా మారింది. వివేకా హత్యలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ సునీత సోమవారం లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. వివేకా హత్య జరిగినప్పుడుగానీ అనంతరం సిట్ దర్యాప్తు సందర్భంగాగానీ ఆమె ఇలాంటి ఆరోపణలు చేయలేదు. ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, పరమేశ్వరరెడ్డిలపైనే సందేహాలు వ్యక్తం చేశారు. తాజాగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తుండటం వెనుక రాజకీయ ప్రయోజనాలపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఇక సునీత భర్త రాజశేఖరరెడ్డి గతంలో ఎన్నడూ వైఎస్సార్ కుటుంబ సభ్యులపైగానీ వైఎస్సార్సీపీ నేతలపైగానీ సందేహాలు వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం వైఎస్ కుటుంబ సభ్యులనే లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం వెనుక ప్రలోభాలు, రాజకీయ ఒత్తిళ్లు దాగున్నాయన్నది స్పష్టమవుతోంది. -
ప్లీజ్.. బీజేపీ ఏజెంట్లుగా కూర్చోండి!
అట్లూరు: వైఎస్సార్ జిల్లా బద్వేలులో ఈనెల 30న జరగనున్న పోలింగ్‌కు తమ పార్టీ తరఫున ఏజెంట్లుగా కూర్చోవాలంటూ టీడీపీ నాయకులను బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వేడుకుంటున్నారు. ఏజెంట్లుగా కూర్చుంటే చాలు.. అన్నీ చూసుకుంటానంటూ ప్రాధేయపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం అట్లూరు మండలం గోపీనాథపురానికి చెందిన రాజారెడ్డి, కొండూరులోని బోవిళ్ల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులను కలిశారు. బీజేపీ అభ్యర్థి పనతల సురేష్‌ను వెంటబెట్టుకొని వెళ్లి.. టీడీపీ నాయకులతో మంతనాలు జరిపారు. బీజేపీ తరఫున ఏజెంట్లుగా కూర్చుంటే.. అన్ని విధాలా అండగా ఉంటామని ఆదినారాయణరెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం. -
ఆదినారాయణరెడ్డిని తరిమికొట్టాలి: నారాయణస్వామి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బీజేపీకి దళితులు ఓటు వేసే పరిస్థితి లేదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పోరుమామిళ్లలో జరిగిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. ఆదినారాయణరెడ్డిని బద్వేల్ ప్రజలు తరిమికొట్టాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి మోసం చేసి మంత్రి పదవి కోసం ద్రోహం చేసి వెళ్లారంటూ దుయ్యబట్టారు. (చదవండి: సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం) దళితులకు నాగరికత లేదని మాట్లాడిన నీకు దళితుల ఓట్లు అడిగే హక్కు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్షతో వైఎస్ జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టించిందని.. బద్వేల్ ఉపఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని’’ నారాయణస్వామి అన్నారు. చదవండి: వంద ఎల్లో చానళ్లు వచ్చినా ఆ కుటుంబంతో బంధాన్ని విడదీయలేవు -
అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలి: ఎంపీ అవినాష్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దళిత పక్షపాతి అని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. పోరుమామిళ్లలో జరిగిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, దళిత వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. దళితులు ఉన్నత చదువులు చదవాలని ప్రత్యేక పథకాలు తెచ్చారన్నారు. (చదవండి: సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం) ‘‘రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా?. రోజుకు ఒకసారి పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతున్నారు. విభజన చట్టంలో ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేదు. ఆదినారాయణరెడ్డి దళితులను అవహేళన చేస్తూ మాట్లాడారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచి మంత్రి పదవి కోసం టీడీపీలో చేరాడు. ఇలాంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని’’ ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. -
మాజీ మంత్రి ఆదికి హైకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకున్న 1+1 భద్రతను తొలగించడాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. ప్రాణహాని లేనప్పుడు భద్రత కల్పించాల్సిన అవసరం లేదన్న సింగిల్ జడ్జి తీర్పును సమర్థించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆదినారాయణరెడ్డి దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను ధర్మాసనం కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. (విజయవాడ ఘటనపై స్పందించరేం బాబూ?) -
మాజీ మంత్రి ఆది సోదరులపై కేసు నమోదు
జమ్మలమడుగు రూరల్: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరులపై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరులు ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, రామాంజనేయరెడ్డి, కుమారుడు గోవర్థన్‌రెడ్డి, మరో 80మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మధుసూదన రావు తెలిపారు. తమపై దాడి చేసినట్లు బాధితులు రెడ్డయ్య, రామాంజనేయులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా దేవగుడి గ్రామంలో 30 యాక్టు చట్టాన్ని ఉల్లంఘించి సమావేశాన్ని నిర్వహించారన్నారు. శనివారం అర్ధరాత్రి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 324, 307,147,148,188 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
ఆయనకు మ్యాన్షన్ హౌస్ గురించి బాగా తెలుసు!
సాక్షి, వైఎస్సార్ జిల్లా : మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిపై జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన విలేకరు సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగుళూరులో క్లబ్బులకు సెలవు కావడంతో జమ్మలమడుగుకు చుట్టపుచూపుగా వచ్చిన ఆదినారాయణరెడ్డి తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఆయనకు తోడబుట్టిన అన్నదమ్ములే ఆయన నిజస్వరూపం తెలుసుకొని దూరంగా ఉంచారన్నారు. అన్నదమ్ముల నుంచి కూడా ప్రస్తుతం ఆదినారాయణకు ఎలాంటి సహకారం లేదన్నారు. ఆయనకు ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే మందుల గురించి తెలియదు కానీ, ప్రతిరోజు తీసుకునే మాన్షన్ హౌస్ గురించి మాత్రం బాగా తెలుసన్నారు. తాను ఉద్యోగాలు అమ్ముకున్నానని ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి వాటిని నిరూపిస్తే ఆ క్షణమే రాజీనామా చేస్తానని, దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఇప్పటికే అన్ని పార్టీలను మార్చిన ఆయనకు ఇక మిగిలింది జనసేన పార్టీ మాత్రమేనని అన్నారు. -
టీడీపీ నేతల అండతో.. కొలువు పేరిట టోకరా..!
► ప్రొద్దుటూరుకు చెందిన జి.రాజశేఖర్, రాజుపాలెంకు చెందిన సురేష్‌తోపాటు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ఓ మహిళకు ఉద్యోగాల కోసం అడ్వాన్సుల కింద లక్షలు చెల్లించారు. కోటి రూపాయలకుపైనే వసూలు చేసినట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఏ ఒక్కరికీ ఉద్యోగం లేదు. ఒక్కపైసా తిరిగి ఇవ్వలేదు ► పులివెందులకు చెందిన ప్రదీప్ సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం రూ.3 లక్షలు ముట్టజెప్పాడు. కడపలోని ఆయనకు తెలిసిన మురళీకృష్ణ ఆచారి ద్వారా ఈ మొత్తాన్ని ఉద్యోగం ఇప్పిస్తానన్న మహిళకు అందజేశాడు. ఏడాది అవుతున్నా అతనికి జాబు రాలేదు. డబ్బులు ఇచ్చిన వ్యక్తి ద్వారా జాబు విషయమై పలుమార్లు మహిళతో మాట్లాడారు. జాబు ఇప్పించలేదు..డబ్బు ఇవ్వలేదు.. చివరకు ఐపీ నోటీసు అందింది. ► ప్రొద్దుటూరుకు చెందిన సుధాకర్ సర్వశిక్ష అభియాన్‌లో సీఆర్పీ ఉద్యోగం కోసం సదరు మహిళకు రూ. 50 వేలు ముట్టజెప్పారు. ఉద్యోగం వచ్చిన తర్వాత మిగిలిన రూ. 2 లక్షల మొత్తాన్ని చెల్లిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. అతనికి ఉద్యోగం ఇవ్వలేదు..డబ్బులూ ఇవ్వలేదు.. తీరా చూస్తే ఐపీ నోటీసు వచ్చింది. ► మండల కేంద్రమైన రాజుపాలెంకు చెందిన నాగ సురేంద్ర ఆంధ్రాబ్యాంకులో అటెండర్ ఉద్యోగం కోసం సదరు మహిళకు రూ. లక్ష ముట్టజెప్పారు. ఏడాదైనా జాబు లేదు.. డబ్బులు తిరిగి ఇవ్వలేదు.. ఇప్పుడు ఆయనకు ఐపీ నోటీసు వచ్చింది. ► కడపకు చెందిన ఆరూరు అశ్విని సీఎం రమేష్ పీఏ సుధాకర్ సూచనతో సర్వశిక్ష అభియాన్‌లో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టు కోసం రూ.80 వేలకు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్స్ కింద రూ.50 వేలు ముట్టజెప్పారు. జాబు వచ్చిన మరుక్షణమే మిగిలిన రూ.30 వేలు చెల్లించేలా మాట్లాడుకున్నారు. రూ.50 వేల మొత్తాన్ని అశ్విని బావ ఏఎం కొండయ్య ద్వారా సదరు మహిళకు ముట్టజెప్పారు. జాబు లేదు...డబ్బులు ఇవ్వలేదు. చివరకు ఐపీ నోటీసు వచ్చింది. సాక్షి ప్రతినిధి కడప : కడపకు చెందిన ఓ మహిళ గత ప్రభుత్వంలో సర్వశిక్ష అభియాన్‌తోపాటు సాఫ్ట్వేర్, బ్యాంకుఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఆశచూపి జిల్లా వ్యాప్తంగా పలువురి వద్ద కోట్లలో వసూళ్లకు పాల్పడింది. ఎస్ఎస్ఏలో సీఆర్పీ ఉద్యోగానికి రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకుంది. రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు అడ్వాన్సులు తీసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం పలువురి నుంచి రూ.3 లక్షలకు తక్కువ లేకుండా వసూలు చేసింది. బ్యాంకు ఉద్యోగాలంటూ కొందరి నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసింది. కడప నగరంతోపాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాజుపాలెం, బద్వేలు, పులివెందుల, కమలాపురం, మైదుకూరు ప్రాంతాల్లో పలువురు నిరుద్యోగుల వద్ద పెద్ద మొత్తంలో వసూలు చేసింది. ఈ మొత్తం కోట్లలోనే ఉంటుందని బాధితులు చెబుతున్నారు. అప్పట్లో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డితోపాటు పలువురు టీడీపీ నేతలు ఉద్యోగాల కోసం సదరు మహిళకు సిఫార్సు చేస్తూ పలువురిని పంపారు. వారంతా ఆ మహిళకు డబ్బులు ముట్టజెప్పారు. టీడీపీ నేతల అండతోనే సదరు మహిళ వసూళ్ల దందాకు దిగినట్లు తెలుస్తోంది. జిల్లాలో ముఖ్య అధికారుల పేర్లను సైతం వాడి ఆ మహిళ నిరుద్యోగులను మోసగించినట్లు తెలుస్తోంది. బాధితుల సొమ్ముతో సదరు మహిళ కార్లు, ఇతర వాహనాలు కొనుగోలు చేసి దర్పం వెలగబెడుతోంది. కడప నగరంలో ధనిక వర్గం ఉండే ప్రాంతంలో విలాసవంతమైన జీవితాన్ని వెలగబెడుతోంది. డామిట్ కథ అడ్డం తిరిగింది ప్రభుత్వం మారడంతో సదరు మహిళ బండారం బయటకు పొక్కింది. ఉద్యోగం ఇప్పించక, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు కొందరు నిలదీశారు. డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి తెచ్చారు. తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఆమె కొత్త ఎత్తుగడకు తెరలేపింది. వారిని వంచించేందుకు ఐపీని ఆయుధంగా వాడింది. బాధితుల్లో 16 మంది వద్ద పలు వ్యాపారాల పేరుతో అప్పులు చేసినట్లు చూపించి ఐపీ నోటీసులు పంపింది. దీంతో బిత్తర పోయిన బాధితులు ఆ మహిళను సంప్రదించారు. తాను డబ్బులిచ్చేది లేదంటూ సదరు మహిళ ఎదురు బెదిరింపులకు దిగింది. చేసేది లేక బాధితులంతా లబోదిబోమంటున్నారు. ఉద్యోగం కోసం ఆమెకు డబ్బులు ఇచ్చిన కొందరు ముఖ్యులకు మాత్రం కొంతలో కొంత డబ్బులు చెల్లిస్తానని, గొడవ చేయవద్దని సర్దుబాటు ప్రయత్నానికి దిగింది. చాలాకాలంగా ఇదే చెబుతున్నా డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వడం లేదని ముఖ్యులైన బాధితులు కొందరు ‘సాక్షి’కి తెలిపారు. ఆమెపై ఫిర్యాదు చేసేందుకు కొందరు బాధితులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వచ్చిన తర్వాత కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు. జిల్లా ఎస్పీకి సైతం రాత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు వారు సిద్దమయ్యారు. ఈ సందర్బంగా పలువురు పాత్రికేయులను కలిసి మహిళ దోపిడీని వివరించారు. ఉద్యోగం వస్తుందన్న ఆశతోనే డబ్బులు ఇచ్చామని వారు వాపోయారు. సీఎం రమేష్ పీఏ సూచనతోనే ఆలూరి అశ్విని ఉద్యోగం కోసం డబ్బులు ముట్టజెప్పినట్లు ఆమె బావ ఏఎం కొండయ్య ‘సాక్షి’ ముందు వాపోయారు. సమీప బంధువులు సీఎం రమేష్ ఇంటిలో పనిచేస్తారని, వారి సూచన మేరకే మహిళకు డబ్బులు ముట్టజెప్పినట్లు చెప్పారు. మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి సిఫార్సు చేయడంతోనే ఉద్యోగం కోసం రూ. లక్ష మహిళకు ముట్టజెప్పినట్లు బాధితుడు వివరించారు. టీడీపీ నేతల అండతోనే మహిళ కోట్లలో వసూలు చేసిందని వారంతా వాపోతున్నారు. అధికారులు స్పందించి ఉద్యోగాల పేరుతో కోట్లు వసూళ్లకు పాల్పడిన మహిళపై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.