మంత్రి ఆది అనుచరుల హంగామా | Minister followers hulchal at police station | Sakshi
Sakshi News home page

మంత్రి ఆది అనుచరుల హంగామా

Published Fri, Feb 23 2018 7:28 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

Minister followers hulchal at police station - Sakshi

పోలీస్‌స్టేషన్‌ వద్ద మంత్రి ఆదినారాయణ రెడ్డి అనుచరులు

వైఎస్సార్ జిల్లా : మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు వీరంగం సృష్టించడంతో కొండాపురం మండలం తాళ్లపొద్దుటూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ముందు జాగ్రత్త చర‍్యగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్‌ స్టేషన్‌ వద్ద అదనపు బలగాలు మోహరించాయి.

వివరాల్లోకి వెళితే..  ఓ వివాదం విషయమై స్థానికంగా ఉన్న ఓ బెల్టుషాప్ యజమానిని తాళ్లపొద్దుటూరు ఎస్‌ఐ అదుపులోకి తీసుకున్నారు. అయితే మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరుడు పవన్‌ కుమార్‌ ...నిన్న రాత్రి ఎస్‌ఐని అడ్డుకున్నాడు. దీంతో విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో పవన్‌ కుమార్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకుని నానా హంగామా చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. అయితే ఈ వివాదానికి సంబంధించి మంత్రి ఆదినారాయణరెడ్డి ఇంకా స్పందించలేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement