hulchal
-
తూర్పు గోదావరి జిల్లాలో చైన్ స్నాచర్ల హల్ చల్
-
మధురానగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఏసీపీ సుకుమార్
-
కొడవలితో టీడీపీ నేత వీరంగం
-
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత కలకలం
-
తెలంగాణలో మావోయిస్టు పోస్టర్లు కలకలం
-
తిరుపతిలో సైకో హల్చల్.. అర్ధరాత్రి ఇనుప రాడ్డు పట్టుకుని..
సాక్షి, తిరుపతి: నగరంలో ఓ సైకో అర్ధరాత్రి హల్చల్ చేశాడు. చేతిలో గొడ్డలి పట్టుకుని అర్ధనగ్నంగా వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. సైకో వీరంగం స్థానికంగా ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యింది. కాగా, తిరుపతిలోని ఎం.ఆర్.పల్లి పీఎస్ పరిధిలో శ్రీనగర్‌కాలనీలో ఓ సైకో అర్ధరాత్రి ఇనుప రాడ్డు పట్టుకుని హల్చల్ చేశాడు. అర్ధనగ్నంగా తిరుగుతూ నాలుగు ఇళ్ల తలుపులు, కిటికీలను బద్దలు కొట్టాడు. దీనికి సంబంధించిన ఫుటేజీ స్థానికంగా ఉన్న సీసీ టీవీల్లో రికార్డు అయ్యింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. అతడి కోసం గాలిస్తున్నారు. ఇక, కొద్దిరోజులుగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తున్న తరుణంలో ఇతను కూడా ఆ గ్యాంగ్‌కు చెందినవాడేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్.. అద్దాలు ధ్వంసం
SVP Trailer: Mahesh Babu Fans Hulchal At Bramaramba Theatre: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సర్కారు వారి పాట' మూవీ ట్రైలర్ రానే వచ్చింది. పరశు రామ్ దర్శకత్వంలో మహేశ్‌కు సరసన హీరోయిన్గా మహానటి కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడు పెంచారు మేకర్స్. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన పెన్నీ, కళావతి, టీజర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై భారీగా హైప్ పెరిగింది. తాజాగా 'సర్కారు వారి పాట' మూవీ ట్రైలర్‌ను సోమవారం (మే 2)న విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్ అయిన హైదరాబాద్ కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్ చేశారు. ఈ క్రమంలో మహేశ్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో థియేటర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. పలువురు అభిమానులకు గాయాలు కూడా అయినట్లు సమాచారం. చదవండి: మహేశ్ ఫ్యాన్స్‌కు ట్రీట్, 105 షాట్స్‌తో ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ మహేశ్‌బాబు నోట ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట -
ఆఘోర వేషధారణలో హల్చల్.. నగ్నంగా చిందులేస్తూ..
నర్సీపట్నం(విశాఖ జిల్లా): ఆఘోరాల వేషధారణలో మరోసారి సన్యాసులు(సాధువులు) హాల్చల్ చేశారు. గంజాయి మత్తులో ఇటీవల కాలంలో సన్యాసులు పట్టణంలో వీరంగం సృష్టిస్తున్నారు. బుధవారం ఏకంగా టౌన్ స్టేషన్ ముందు హాల్చల్ చేశారు. చదవండి: సుబ్బలక్ష్మికి ఫోన్‌కాల్స్.. భర్త విగ్గురాజు ఏం చేశాడంటే..? చూసుకుందాం రండిరా అంటూ నగ్నంగా చిందులు వేశారు. పోలీసులు ఏమీ అనకపోవడంతో కొంత సేపు హాల్చల్ చేసి అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ విధంగా చేయడం ఇది మూడోసారి. 20 రోజుల క్రితం నగ్నంగా రోడ్డుపై నిలబడి వాహనాలను ఆపి బలవంతంగా డబ్బులు వసూలు చేశారు. రెండోసారి అదే విధంగా చేస్తే ప్రజలు దేహశుద్ధి చేశారు. ఇపుడు మరలా పోలీసు స్టేషన్ ముందు వీరంగం చేశారు. -
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పీఎస్ లో తాగుబోతు వీరంగం
-
బాలల దినోత్సవం : స్టార్ కిడ్స్‌పై ఓ లుక్కేద్దామా!
Children's Day 2021: సినీ సెలబ్రిటీల పిల్లలంటే ఫాన్స్‌కి ఎంత క్రేజో చెప్పాల్సిన పనేలేదు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల పిల్లలు కూడా అందం, అభినయం, పంచ్ డైలాగులు, ఫైట్లు, డాన్సులతో అదరగొట్టాలని ఆశిస్తుంటారు. అటు సెలబ్రిటీలు కూడా తమ పిల్లలు ఎన్నో విజయాలు సాధించి గొప్ప పేరు తెచ్చుకోవాలని కలలు కంటారు. ఎంతైనా వారుకూడా తల్లితండ్రులే కదా. అయితే కొంతమంది సెలబ్రిటీల పిల్లలు చిన్నతనంలోనే సిసింద్రీల్లా దూసుకుపోతున్నారు. సొంత వ్యక్తిత్వంతో తమకంటూ ఒక ఐడెంటిని క్రియేట్ చేసుకుంటూ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. తమదైన శైలిలో రాణిస్తున్నారు. వివాదాల్లో ఇరుకు్కంటున్నవారు కూడా కూడా ఉన్నారు. నవంబరు 14 ‘చిల్డ్రన్స్ డే’ సందర్భంగా సినీ ఇండస్ట్రీలోని స్టార్ కిడ్స్‌పై ఒక లుక్కేద్దాం. -
బ్లేడ్‌తో చేయి కోసుకుని, తల పగులగొట్టుకొని, కప్పు పెంకులు నమిలి..
సాక్షి, మలక్‌పేట: వైట్నర్ మత్తులో ఓ యువకుడు కరెంట్ స్తంభం ఎక్కి హల్చల్ చేశాడు. విజయవాడ జాతీయ రహదారిపై దిల్సుఖ్నగర్ సీఎంఆర్ షోరూమ్ ఎదురుగా ఈ ఘటన జరిగింది. మలక్‌పేట పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సలీంనగర్ ఆఫ్జల్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్ (28) పాతనేరస్తుడు. మలక్‌పేట పీఎస్ పరిధిలో 2016లో చోరీ చేసి జైలుకెళ్లి వచ్చాడు. ఇలా ఉండగా, సోమవారం ఉదయం తనను గుర్తు తెలియని వ్యక్తు కొట్టారంటూ హంగామా చేశాడు. వైట్నర్ మత్తులో ఉన్న అతగాడు బ్లేడ్‌తో చేతులు కోసుకుని, కట్టెతో తల పగులగొట్టుకున్నాడు. చాయ్ కప్పు పెంకులు నమిలాడు. నన్ను ఎందుకు కొట్టారు..ఏం తప్పు చేశానంటూ వీరంగం చేశాడు. అంతటితో ఆగకుండా లోకల్ బస్టాండ్‌పైకి ఎక్కాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలోనే ఇర్ఫాన్ బస్టాండ్ పక్కనే ఉన్న కరెంట్ స్తంభం ఎక్కాడు. అక్కడి నుంచి దూకేస్తానని అరిశాడు. పోలీసులు వెంటనే విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం అందించి సరఫరాను నిలిపివేయించారు. అతడికి నచ్చజెప్పి కరెంట్ స్తంభం మీది నుంచి కిందికి దింపి స్టేషన్‌కు తరలించారు. మానస్థిక స్థితి సరిగా లేదని గ్రహించిన పోలీసులు అతడి కుటుంబసభ్యులను పిలిపించి ఆసుపత్రికి తరలించారు. -
వేడుకల్లో తల్వార్లు,పిస్టల్స్ తో హంగామా
-
సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం
-
బోడుప్పల్ లో ముగ్గురు యువకుల హంగామ
-
విజయవాడ పడమట లో సైకో కలకలం
-
ప్రగతిభవన్ ఎదుట యువతి హల్చల్
సాక్షి, పంజగుట్ట: ప్రగతిభవన్‌లో దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ కోసం అఖిలపక్ష సమావేశం జరుగుతున్న సందర్భంలో ఓ యువతి హల్చల్ చేసింది. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని, డబుల్బెడ్రూంలు ఇవ్వాలని గట్టిగా కేకలు వేస్తూ ప్రగతిభవన్ ఎదుట బైఠాయించింది. వివరాలివీ... ఆర్మూర్‌కు చెందిన తలారి రాజ్యలక్ష్మి(21) కేపీహెచ్‌బీలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. ఆదివారం ఉదయం 11:40 గంటల ప్రాంతంలో సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి బైఠాయించింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, డబుల్బెడ్రూం ఇవ్వాలని ముఖ్యమంత్రి పేదల గురించి పట్టించుకోవాలంటూ గట్టిగా నినాదాలు చేసింది. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చదవండి: యూపీలో 100 స్థానాల్లో పోటీ చేస్తాం: అసదుద్దీన్ బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం.. మార్గదర్శకాలివే -
గుంటూరులో సైకో వీరంగం
గుంటూరు ఈస్ట్: కొరిటెపాడు పార్కు ఎదురుగా ఉన్న లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం వద్ద సైకో వీరంగం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అరండల్‌పేట ఎస్హెచ్ఓ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం... సమీపంలో నివసించే ఆటో డ్రైవర్ శివ మద్యం మత్తులో శనివారం మధ్యాహ్నం తిరుపతమ్మ ఆలయం వద్దకు వచ్చాడు. తొలుత రెండు సీసీ కెమెరాలు పగుల కొడుతుండగా స్థానికులు గమనించి అడ్డుకోబోయారు. అయినా వారిని లెక్క చేయకుండా ఆలయం గేటు దూకి లోపలకు వెళ్లి చేతితో అద్దాలు పగులకొట్టాడు. గుడిలోని గంటలను ఊడపీకేందుకు ప్రయత్నించాడు. అడ్డు వచ్చిన వారందరినీ కొడుతూ ఉన్మాదిలా కేకలు వేస్తూ నానా రభస చేశాడు. గర్భగుడి తలుపులను సైతం పగుల కొట్టేందుకు ప్రయత్నించాడు. శివ చేతి నుంచి కారిన రక్తం గుడి గంటలకు , గోడలకు అంటుకుంది. అరండల్‌పేట ఎస్హెచ్ఓ నరేష్ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గర్భగుడి తలుపులు బలవంతగా తెరిచేందుకు ప్రయత్నించిన శివను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇటీవల ఇదే ఆలయంలో హుండీని సైతం దొంగలు అపహరించారు. సీసీ కెమెరాలున్నా చోరీ వాటిలో రికార్డుకాకపోవడం విశేషం. చదవండి: దారుణంగా హత్య చేసి.. గుంతలో పడేసి.. ఆ కుటుంబంపై కరోనా పడగనీడ -
ఎయిర్‌గన్‌తో వ్యక్తి హల్చల్
సాక్షి, శంషాబాద్: కొంతకాలంగా ఎయిర్‌గన్‌తో హల్చల్ చేస్తూ స్థానికులను బెదిరిస్తున్న ఓ వ్యక్తిని ఆర్జీఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ పట్టణంలోని తొళ్లబస్తీకి చెందిన సోహైల్(22) గత కొన్ని రోజులుగా తుపాకీ వెంట పెట్టుకొని సీఐఎస్ఎఫ్లో పనిచేస్తున్నానని స్థానికులను బెదిరిస్తున్నాడు. శుక్రవారం రాత్రి సున్నంబట్టి సమీపంలో కొందరు వ్యాపారులను మామూళ్లు ఇవ్వాలంటూ బెదిరించడంతో వారు ఆర్జీఐఏ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సోహైల్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న తుపాకీని పరిశీలించగా ఎయిర్గన్గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: పీపీఈ కిట్‌తో వ్యక్తి హల్చల్.. పరుగో పరుగు -
పీపీఈ కిట్‌తో వ్యక్తి హల్చల్.. పరుగో పరుగు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మన్యంలో పీపీ కిట్‌తో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. అతన్ని చూసిన జనాలు భయంలో పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. పాడేరు రహదారిపై శనివారం ఉదయం ఓ వ్యక్తి రోడ్డుపై పీపీఈ కిట్ ధరించి కనిపించాడు. కనిపించిన వారందరిని పలకరిస్తూ దగ్గరకు వెళ్లాడానికి ప్రయత్నించాడు. దీంతో ప్రజలు అతను కోవిడ్ రోగిగా భావించి దూరంగా పరుగులు తీశారు. విషయం తెలిసిన వైద్య అధికారులు తమ ఆసుపత్రిలో ఉన్న రోగులను సరి చూసుకున్నారు.అందరూ ఉండడంతో ఆ వ్యక్తి రోగి కాదని గుర్తించారు. చదవండి: ఈ చిన్నారి నా హృదయాన్ని దోచుకున్నాడు: కేటీఆర్ అయితే వ్యర్థాలతో పడేసిన పీపీఈ కిట్‌ను ధరించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు రెండు గంటల పాటు పాడేరు మెయిన్ రోడ్డుపై ఈ అపరిచితుడు సంచరించడంతో ప్రజలకు కొంత ఆందోళనకు గురయ్యారు. తీరా అతన్ని ఆపి దూరం నుంచే ప్రశ్నించగా.. ఆ వ్యక్తి చెప్పిన సమాధానం విని అందరూ షాక్‌కు గురయ్యారు. చలి తీవ్రత తట్టుకోలేక పీపీఈ కిట్ వేసుకున్నానని చెప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం అతనితో పీపీఈ కిట్ విప్పించి అక్కడి నుంచి పంపించి వేశారు. -
నకిలీ పోలీసులు హల్చల్..
సాక్షి, చిత్తూరు: జిల్లాలో గుడుపల్లి మండలం కనమనపల్లిలో నకిలీ పోలీసులు హల్చల్ చేశారు. గంజాయి అమ్ముతున్నారంటూ ఇళ్లలో సోదాలు చేసిన నలుగురు వ్యక్తులు.. నగదు,బంగారం దోచుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ వ్యక్తులను చెట్టుకు కట్టేసి స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ నలుగురిలో ఒకరు.. హత్యకేసులో ముద్దాయిగా ఉన్న రౌడీషీటర్ రత్నగా పోలీసులు గుర్తించారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హత్యాయత్నం కుట్ర కేసులో ప్రధాన నిందితుడిగా రత్న ఉన్నారని, కొన్నాళ్ల క్రితం జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చాడని పోలీసులు తెలిపారు. -
విజయ్ సేతుపతిలా పేరు తెచ్చుకోవాలి
‘‘సినిమా తీయడం చాలా ఈజీ. కానీ దాన్ని రిలీజ్ చేయడం నరకం’ అనే విషయాన్ని ‘హల్ చల్’ సినిమా ద్వారా తెలుసుకున్నాను’’ అన్నారు రుద్రాక్ష్.. శ్రీపతి కర్రి దర్శకత్వంలో రుద్రాక్ష్, ధన్యా బాలకృష్ణ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హల్ చల్’. గణేష్ కొల్లూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 3న విడుదలైంది. ఈ సందర్భంగా రుద్రాక్ష్ మాట్లాడుతూ– ‘‘గ్రాడ్యువేషన్ పూర్తయ్యాక సినిమాల్లో నటించాలని యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. ‘బొమ్మరిల్లు, షాక్, యువత, రక్త చరిత్ర, హైదరాబాద్ నవాబ్స్’ వంటి సినిమాల్లో నటించాను. ‘యువత’ నాకు ఎక్కువ గుర్తింపు తెచ్చింది. ‘లాస్ట్ బెంచ్ స్టూడెంట్, ఓం శాంతి’ సినిమాల్లో విలన్‌గానూ నటించాను. సహాయ నటుడిగా గుర్తింపు రాగానే వరుసగా ఆఫర్స్ అన్నీ నా దగ్గరకు వస్తాయనుకున్నాను. కానీ అలా జరగదని తెలియడానికి టైమ్ పట్టింది (నవ్వుతూ). తమిళంలో విజయ్ సేతుపతిలా విభిన్నమైన స్క్రిప్ట్‌లు చేసి, ఆయనలా పేరు తెచ్చుకోవాలన్నది నటుడిగా నా ఆశయం’’ అన్నారు. -
పరాన్నజీవులు..!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కొందరు జనం మీద పడి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.. ఫలానా అధికారి తనకు బాగా తెలుసునని, మాతో వస్తే మీ పని సులభంగా జరిగిపోతుందని జనాన్ని నమ్మిస్తున్నారు.. ఆ తర్వాత అందినకాడికి వారి నుంచి సొమ్ములు గుంజుతున్నారు.. ఇంకొందరు.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై పడుతున్నారు.. నిబంధనల పేరుతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.. జిల్లాలో ఇలాంటి వారు చాలా మంది హల్ చేస్తూ ప్రజలకు, ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారారు. కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాల పేరుజెప్పి అధికారులను ఇబ్బందులకు గురిచేస్తూ, జనాన్ని మాయచేస్తున్నారు. కొందరిని ’స్పందన’ సాక్షిగా కలెక్టర్ హరిజవహర్‌లాల్ హెచ్చరించారు. నిజానికి కొన్ని ప్రభుత్వ విభాగాలనే అలాంటి వ్యక్తులు తమ గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారంటే అతిశయోక్తికాదు. విజయనగరం జిల్లా అంటేనే మంచి తనంతో కూడిన అమాయకత్వం కలిగిన ప్రజలకు పెట్టింది పేరు. ఇక్కడి ప్రజల అవసరాలను గుర్తించి చేతనైన సాయం, అవసరమైన సేవ చేస్తున్న ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు చాలానే ఉన్నాయి. జిల్లా సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుతూ, ప్రకృతిని, పచ్చదనాన్ని పరిరక్షిస్తూ ఆయా సంఘాలు, సంస్థల ప్రతినిధులు, సభ్యులు తమవంతు కృషిచేస్తున్నారు. అయితే, ఇలాంటి వారికి భిన్నంగా అలాంటి సంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీ ల ముసుగులో మరికొందరు ధనార్జనే ధ్యేయంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారిలో ప్రముఖులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. రాజకీయ పదవి లేకపోయిన, కనీసం ఆ పార్టీకి డిపాజిట్లు రాకపోయినా, ప్రజాప్రతినిధిగా ఏ పదవీ చేపట్టకపోయినా పార్టీ రాష్ట్ర పదవులు అనుభవిస్తూ అమరావతి నుంచి విజయనగరం వరకూ తనకు అందరితోనూ పరిచయాలున్నాయని చెప్పుకుంటున్న ఓ నాయకుడున్నారు. జిల్లా అధికారులు నిత్యం ఎక్కడికి వెళుతుంటారు?, ఏ సమయంలో ఏ ప్రదేశంలో ఉంటారు? ఎవరెవరిని కలుస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అనే విషయాలను తెలుసుకోవడమే అతని పని. ఇదంతా తెలుసుకుని ఏం చేస్తాడనేగా మీ అనుమానం. అధికారుల కదలికలపై అవగాహన వచ్చిన తర్వాత వారికి అతను ఫోన్ చేస్తాడు. కలవాలని చెబుతాడు. కలిసిన తర్వాత ఆ అధికారి గురించి అతను తెలుసుకున్నదానిని వివరిస్తాడు. వ్యక్తి విషయాలను బయటపెడతానని బెదిరిస్తాడు. మంచి అంశాన్ని కూడా చెడుగా ప్రచారం చేస్తానని బ్లాక్ మెయిల్‌కు దిగుతాడు. అతని చర్యలకు భయపడిపోయిన అధికారి అతనికి లొంగిపోతున్నాడు. ఆ తర్వాత అతను ఆడించినట్లుగా ఆడటం తప్ప ఆ అధికారికి మరో మార్గం ఉండదు. వారి నుంచి సమాచారం తెలుసుకుని రేపు వారు మంజూరు చేయబోయే ప్రాజెక్టులు, రుణాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు, లబ్ధిదారులను ఈ నాయకుడు ముందురోజే అధికారి వద్దకు తీసుకువెళ్లి పని జరిపించాల్సిందిగా వినతిపత్రం ఇస్తారు. మర్నాడు ఆ పని జరగగానే తన వల్లనే ఆ పని జరిగిందని చెప్పి లబ్ధిదారుల నుంచి సొమ్ములు తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని కలెక్టర్ ఇటీవల పసిగట్టారు. అతని దుర్భుద్ధిని గ్రహించి జాగ్రత్త పడుతున్నారు.మరో వ్యక్తి ఉన్నాడు.. అతనూ ఒక పార్టీ నేతనని, ఒక సామాజిక వర్గానికి ప్రతినిధినని చెప్పుకుంటున్నాడు. కానీ ఇంతవరకూ ఎన్నికల్లో ఏనాడూ గెలిచింది లేదు. అయినా, నిత్యం ఏదోఒక పనిజెప్పి జిల్లా అధికారుల వద్దకు వెళుతుంటాడు. సమస్యలతో ఉన్న ప్రజలను వెంటబెట్టుకుని అధికారులకు వినతిపత్రం ఇస్తుంటాడు. ఆ సమస్య పరిష్కారం అయితే తనగొప్పతనమేనని చెప్పి తానూ ఆర్థిక లబ్ధి పొందుతుంటాడు. ఈ మధ్య ఒకడుగు ముందుకువేసి వివాదాల్లో ఉన్న భూ సమస్యలను అధికారులచేత పరిష్కారం చేయించేస్తానంటూ మొదలుపెట్టాడు. అతను అనుకున్నది జరిగితే సరే లేదంటే బయటకు వచ్చి ‘ఇక్కడ ఏ సమస్య పరిష్కారం కాదు. అధికారులు పనిచేయడం లేదు’.. అంటూ ప్రచారం చేస్తుంటాడు. తద్వారా అధికారులను నైతికంగా కుంగదీసి పనులు జరిపించుకోవాలనేది అతని ఎత్తుగడ. అయితే, ఈ ప్రయత్నాలను కూడా కలెక్టర్ పసిగట్టారు. నలుగురి ముందు అతని దుర్భుద్ధిని నిలదీశారు. పద్ధతి మార్చుకోవాల్సిందిగా హెచ్చరించారు. వీరిద్దరూ కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి వారు జిల్లాలో చాలా మంది ఉన్నారు. సమాచారహక్కు చట్టం, మానవహక్కులు, విద్యార్థి, మహిళా సంఘాల పేరుతో అధికారులు, ప్రజలను దోచుకుతినడమే పనిగాపెట్టుకున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలైతే ఇలాంటి వారిపట్ల తీవ్ర వేదనకు గురవుతున్నాయి. సెలవుల్లో తరగతులు పెడుతున్నారనో, కంప్యూటర్ ల్యాబ్‌లు లేవనో, ఆట స్థలాలు లేవనో విద్యా సంస్థలను నిలదీస్తుంటారు. ఆ సౌకర్యాలను రప్పించడం కోసమైతే పర్లేదు. కానీ కాదు. అలా నిర్వాహకులను బెదిరించి ఎంతో కొంత డబ్బు తీసుకుని సైలెంట్‌గా వచ్చేస్తారు. ఆ తర్వాత ఆ సౌకర్యాల ఊసెత్తరు. ఎవరైనా తమకు అనుకూలంగా లేకపోతే ఆ విద్యాసంస్థల ముందు ధర్నాలు, ఆందోళనలు అంటూ హడావిడిగా చేసేస్తుంటారు. ఈ గోలంతా ఎందుకని నిర్వాహకులు వారితే సయోధ్య కుదుర్చుంటున్నారు. అలాగే, సంక్షేమ హాస్టళ్లపైనా పడుతున్నారు. నిజానికి వీరంతా నిజాయితీగా పోరాటం చేస్తే హాస్టళ్లు ఎప్పుడో బాగుపడేవి. కానీ కేవలం ఆ శాఖ అధికారులు, వార్డెన్లను భయపెట్టి అందినకాడికి సొమ్ముచేసుకోవడంతోనే సరిపెడుతున్నారు. ఇష్టంలేకపోయినా కొందరు విద్యార్థులు వీరివెంట తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనల్లో పాలుపంచుకుని చిక్కుల్లో పడుతున్నారు. ఉపేక్షించం.. కొందరు వ్యక్తులు జిల్లా అధికారులను, ప్రజలను వేధిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. నేను కూడా స్వయంగా చూశాను. అలాంటి వారిని ఉపేక్షించేది లేదు. అవినీతి రహిత పాలన అందించాలని సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చాలా స్పష్టంగా చెబుతున్నారు. అధికార యంత్రాంగమంతా సీఎం ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తాం. కాబట్టి ఇలాంటి బ్లాక్మెయిలర్లకు భయపడాల్సిన పనిలేదు. ప్రజలు ఎవరైనా ఎలాంటి సమస్యలు ఉన్నా మా వద్దకు నేరుగా వచ్చి ‘స్పందన’ కార్యక్రమంలో చెప్పుకోవచ్చు. ఎలాంటి మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అలాంటి వారిని నమ్మి మోసపోయి డబ్బులు పోగొట్టుకోవద్దు. – డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, కలెక్టర్, విజయనగరం జిల్లా -
ఖైదీల వీరంగం : అధికారులపై వేటు
లక్నో : నాలుగు గోడల మధ్య బందీలుగా జైలు జీవితం గడపాల్సిన ఖైదీలు నానా హంగామా సృష్టించారు. యూపీలోని ఉన్నావ్ జైలులో కొందరు ఖైదీలు మద్యం సేవిస్తూ, బహిరంగ హెచ్చరికలు చేస్తూ..ఆయుధాలు చేపట్టిన వీడియోలు కలకలం రేపాయి. ఈ ఘటనకు సంబంధించి నలుగురు అధికారులను యూపీ ప్రభుత్వం బదిలీ చేసింది. వీడియోలో నానా రచ్చ చేసిన ఖైదీలను వేరే జైళ్లకు బదలాయించారు. బహిర్గతమైన వీడియోల్లో ఓ ఖైదీ ఏకంగా తుపాకీని చూపుతూ ‘మీరట్ జైలు లేదా ఉన్నావ్ జైలు..జైలు ఏదైనా తాను ఇలాగే ఉంటానని, జైలు లోపల వెలుపల ఎవరినైనా హతమారుస్తా’ అంటూ రెచ్చిపోయాడు. మరో ఖైదీ హిందీ సినిమాలో డైలాగ్ వల్లెవేస్తూ తనపై ఏ ఒక్కరూ చర్య తీసుకునే ధైర్యం చేయబోరని చెప్పుకొచ్చాడు. తాను దేవ్ ప్రతాప్ సింగ్‌నని చెబుతూ అధికారులకే సవాల్ విసిరాడు. తనకు జైలు అంటే కార్యాలయమేనని, ఏ జైలులో అయినా తాను దర్జాగా బతికేస్తానని ఈ ఖైదీ చెప్పడం గమనార్హం. ఖైదీల వీరంగంపై యూపీ జైళ్ల మంత్రి జై కుమార్ సింగ్ స్పందిస్తూ ఈ ఉదంతంపై డీఐజీ విచారణకు ఆదేశించారని, నలుగురు అధికారులపై శాఖాపరమైన విచారణ ప్రారంభమైందని, వారిని వేరే ప్రాంతానికి బదిలీ చేశామని చెప్పారు. వీడియోలో వీరంగం వేసిన ఇద్దరు ఖైదీలను వేరే జైళ్లకు తరలించామని వివరణ ఇచ్చారు. కాగా ఖైదీలు చూపిన తుపాకులు నిజమైనవి కావని అవి ఆటవస్తువులని జైలు అధికారులు పేర్కొన్నారు. -
వేసవిలో క్రైమ్ కామెడీ
రుద్రాక్ష , ధన్యా బాలకృష్ణ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హల్చల్’. శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై గణేష్ కొల్లురి నిర్మించిన ఈ సినిమా సెన్సార్‌కి సిద్ధమవుతోంది. గణేష్ కొల్లురి మాట్లాడుతూ– ‘‘క్రైమ్ కామెడీ జోనర్లో తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకులను మెప్పించేలా తీర్చిదిద్దారు శ్రీపతి. మా బ్యానర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది. అనుకున్న ప్లానింగ్, బడ్జెట్లో సినిమాను పూర్తి చేశాడు దర్శకుడు. హనుమాన్, భరత్ చక్కటి సంగీతం అందించారు. రాజ్ తోట అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఈ వేసవికి సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. కృష్ణుడు, మధునందన్ ఇతర పాత్రల్లో నటించారు. -
టీడీపీ కార్యకర్తల హల్చల్: నరసరావుపేటలో ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు: అధికార టీడీపీకి చెందిన కార్యకర్తలు హద్దుమీరుతున్నారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర టీడీపీ కార్యకర్తలు హల్చల్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ఇంటిముందుకు చేరుకున్న కార్యకర్తలు ఆ పార్టీ నాయకుడు కోడెల శివరామ్ పుట్టిన రోజు వేడుకలను జరిపారు. టీడీపీ ఫ్లెక్సీలు చూపుతూ.. నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇది సరైన పద్దతి కాదంటూ అభ్యంతరం వ్యకం చేసిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి యత్నించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను తరిమికొట్టారు.