
సాక్షి, చిత్తూరు: జిల్లాలో గుడుపల్లి మండలం కనమనపల్లిలో నకిలీ పోలీసులు హల్‌చల్ చేశారు. గంజాయి అమ్ముతున్నారంటూ ఇళ్లలో సోదాలు చేసిన నలుగురు వ్యక్తులు.. నగదు,బంగారం దోచుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ వ్యక్తులను చెట్టుకు కట్టేసి స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ నలుగురిలో ఒకరు.. హత్యకేసులో ముద్దాయిగా ఉన్న రౌడీషీటర్ రత్నగా పోలీసులు గుర్తించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హత్యాయత్నం కుట్ర కేసులో ప్రధాన నిందితుడిగా రత్న ఉన్నారని, కొన్నాళ్ల క్రితం జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చాడని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment