fake police
-
ఐసీసీసీలోకి గుర్తుతెలియని వ్యక్తి.. అలా ఎలా వెళ్లాడబ్బా!
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)కు ఇటీవల కాలంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షా సమావేశాలకు హాజరవుతున్నారు. ఇంతటి కీలకమైన ఐసీసీసీలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి.. టాస్క్‌ఫోర్స్ పోలీసునంటూ తిరగడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశం అయింది.ఐసీసీసీలోకి ఎవరు వెళ్లాలన్నా చెకింగ్ పాయింట్లో అన్ని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు (identity card) కూడా చూపించాలి. ఎవరిని కలవాలో చెప్పాలి. నకిలీ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ ఐసీసీసీలోకి మూడుసార్లు వెళ్లి రావడం పట్ల పోలీసులు ఆరా తీస్తున్నారు. లోపలికి ఎలా వచ్చాడు ఎవరిని కలిశాడు, ఏం చెప్పి వచ్చాడు అన్నదానిపై ఉన్నతాధికారులు, నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.కూకట్‌పల్లికి చెందిన జ్ఞాన సాయి ప్రసాద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను ఎదురుగా ఉన్న నిలోఫర్ కేఫ్‌లో కలుసుకున్న నకిలీ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్.. తన పేరు హరిజన గోవర్ధన్‌గా పరిచయం చేసుకొని హోటల్ బిజినెస్‌లో లాభాలు వస్తాయంటూ రూ.2.82 లక్షలు వసూలు చేశాడు. మూడు విడతలుగా ఇదే హోటల్లో బాధితుడు చెల్లించడం జరిగింది. ఈ మూడుసార్లు నిందితుడు హరిజన గోవర్దన్ ఐసీసీసీ (ICCC) నుంచి బయటికి వచ్చి బాధితుడిని నమ్మించాడు. బాధితుడు కూడా నేరుగా కమాండ్ కంట్రోల్‌సెంటర్ (command and control centre) నుంచి సదరు వ్యక్తి వస్తుండటంతో అందులో పని చేస్తున్న వ్యక్తిగానే భావించాడు. ఇక్కడే బాధితుడు దెబ్బతిన్నాడు. అడిగినంత డబ్బు చెల్లించుకొని తీరా మోసపోయిన తర్వాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐసీసీసీలో సీసీ ఫుటేజీలు పరిశీలించగా నిందితుడు మూడుసార్లు రావడం పోలీసులు గుర్తించారు.చదవండి: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నారా.. ఇవి తెలుసుకోండిఇంతటి కీలకమైన కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి అది కూడా సీఎం రోజూ హాజరవుతున్న ప్రాంతంలోకి నకిలీ పోలీసు వెళ్ళడం దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికకారులు లోతుగా విచారిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుడి నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు. గతంలో నిందితుడు ఇలాంటి మోసాలకు పాల్పడి ఉంటాడా.. అనే కోణంలో కూడా పాత నేరస్తుల కదలికలపై దృష్టి పెట్టారు. మొన్నటికి మొన్న సచివాలయంలో నకిలీ అధికారులు సంచలనం సృష్టించగా తాజాగా సీఎం సమీక్షలకు వస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ ఘటన పోలీసులకు సవాల్‌గా మారింది. -
పోలీసులమని చెప్పి దొంగ వేశాలు..
-
అడ్డంగా దొరికిన నకిలీ పోలీసులు...
-
పెళ్లి చూపులకు వెళ్లి.. కటకటాలపాలై..
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐ ఉద్యోగం రాకపోవడంతో నకిలీ ఎస్ఐగా అవతారం ఎత్తిన యువతిని నార్కెట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐనని చెప్పుకుని శంకర్‌పల్లిలో విధులకు సైతం మాళవిక హాజరైంది. ఎస్ఐ డ్రెస్‌లో పెళ్లి సంబంధానికి కూడా వెళ్లింది. అప్పుడే అసలు గుట్టు రట్టయ్యింది. జరిగింది ఇదీ.. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పోలీసు కావాలనేది ఆమె కోరిక. అందుకోసం 2018లో జరిగిన ఆర్పీఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ రాసింది. కంటి చూపు సరిగా లేకపోవడం ఉద్యోగానికి ఎంపిక కాలేదు. దీంతో ఆర్పీఎఫ్ ఎస్ఐ అవతారమెత్తిన మాళవిక విధులకు వెళ్తున్నట్టు ఏడాది పాటు కుటుంబ సభ్యులను నమ్మించింది. పెళ్లి చూపులకు కూడా అదే యూనిఫాంలో వెళ్లి చివరికి జైలుపాలైంది. అబ్బాయి తరఫు బంధువులు ఆర్పీఎఫ్లో అధికారులను ఆరా తీయగా ఆమె అసలు గుట్టు బట్టబయలైంది. ఎల్బీ నగర్‌లోని ఆర్పీఎఫ్ పోలీసులు ధరించే యూనిఫాం కొనుగోలు చేసింది. రైల్వే ఎస్సైగా నల్గొండ లో విధులు నిర్వహిస్తున్నట్లు దాదాపు ఏడాది పాటు ప్రజలను నమ్మించి మోసాలకు తెరతీసింది. దేవాలయాలకు వెళ్లి, ప్రముఖులను కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసేది. వెంటనే అప్రమత్తమైన నల్గొండ ఆర్పీఎఫ్ సిబ్బంది మాళవికను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అసలు విషయం బయటపడింది. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: ప్రణీత్‌రావు విచారణలో వెలుగులోకి సంచలనాలు -
డబ్బు కోసం నకిలీ ఎస్ఐ అవతారం
-
హైదరాబాద్‌లో మరికొందరు ‘పోలీస్ దొంగ’లు!.. విమానాల్లో తిరుగుతూ సెటిల్మెంట్లు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ మేకల ఈశ్వర్ వ్యవహారంతో నగర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సిటీలో ఈ తరహా దందాలకు పాల్పడుతున్న ‘పోలీసు దొంగ’ల్లో మరో ముగ్గురిని గుర్తించారు. వీరిలో ఇద్దరు నగర కమిషనరేట్‌లో పని చేస్తుండగా... మరొకరు సైబరాబాద్‌లో ఉన్నట్లు తెలిసింది. వీరి వ్యవహారాలకు సంబంధించిన నివేదికలు అందిన తర్వాత చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ అధికారులకు సహకరించిన, సహరిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్ల వ్యవహారాన్నీ సీరియస్‌గా తీసుకున్నారు. సమాచారంతో మొదలై సహవాసం వరకు... పోలీసులకు, దొంగలకు మధ్య పరిచయాలు ఉండటం కొత్త విషయం కాదు. వీరికి సమాచారం ఇచ్చే వారిలో పాత నేరగాళ్లే ఎక్కువగా ఉంటారు. ఎంత ఎక్కువ మంది నేరగాళ్లతో పరిచయాలు ఉంటే అంత ఎక్కువ సమాచారం అందుతుంది. ఈశ్వర్ సహా నగరంలో పని చేస్తున్న/చేసిన ముగ్గురు ఇన్స్పెక్టర్లు సమాచారం స్థాయిని దాటి సహవాసం వరకు వెళ్లారు. వీళ్లలో కొందరు పిక్ పాకెటింగ్, స్నాచింగ్స్ గ్యాంగ్స్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు ఏకంగా వారికి సంబంధించిన సెటిల్మెంట్లు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. జేబు దొంగలకు చెందిన ఓ బడా నాయకుడు ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. అతడు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఓ అధికారి వెళ్లి పరామర్శించడంతో వారి మధ్య సంబంధం బయటపడింది. పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్‌ను పట్టుకున్న ఠాణాలు, ప్రత్యేక విభాగాల వద్దకు వెళ్లే మరో అధికారి వాళ్లను అరెస్టు చూపకుండా వదిలేసేలా పైరవీలు చేయడంలో సిద్ధహస్తుడిగా మారాడు. విమానాల్లో తిరుగుతూ సెటిల్మెంట్లు... ప్రస్తుతం సైబరాబాద్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి ఈ వ్యవహారాల్లో సిద్ధహస్తుడు. తన మాట వినని, తన గ్యాంగ్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న ముఠాలను అరెస్టు చేయడంతోనే ఇతడి సక్సెస్ రేటు పెరిగిపోయింది. ఈ సక్సెస్‌ను మాత్రమే చూసిన ఉన్నతాధికారులకు ఇప్పుడిప్పుడే అతడి పూర్తి వ్యవహారాలు తెలుస్తున్నాయి. అంతర్రాష్ట్ర పిక్ పాకెటింగ్ ముఠాలో ఈ అధికారికి సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఏ నగరంలోని పోలీసులకు వీరు చిక్కితే ఈయనే వెళ్లి విషయం సెటిల్ చేసి వచ్చేవాడు. దీనికోసం లీవ్ కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా విమానాల్లో వెళ్లి వస్తూ పని పూర్తి చేసేవాడు. నగరంలో సుదీర్ఘకాలం పని చేసిన ఈయన ఎప్పుడూ ఫోకల్ పోస్టు కోసం ప్రయత్నించలేదు. కేవలం ఠాణాల్లోని డిటెక్టివ్, క్రైమ్ వింగ్స్‌లో పని చేయడానికే పైరవీలు చేసుకునేవాడు. ఈశ్వర్‌తో పాటు అలాంటి వ్యవహారాలు చక్కబెట్టిన కొందరు కానిస్టేబుళ్లకు అధికారులు సహకారాలు అందిస్తూ వారిని బందోబస్తు డ్యూటీలకు దూరంగా ఉంచేవారని తెలిసింది. అంతర్జాతీయ చోరీ ఫోన్ల నెట్‌వర్క్‌లో ఈశ్వర్.. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలు కూడా ఈశ్వర్‌కు ఆ పరిధిలోని ఠాణాలో పోస్టింగ్ వచ్చాక క్రైమ్ ప్రోన్ ఏరియాలుగా మారిపోయేవని తెలిసింది. ఆ పోలీస్ స్టేషన్లో ఉండే మార్కెట్లు, అనువైన ప్రాంతాలను గుర్తించే ఇతగాడు తన గ్యాంగ్స్‌ను దింపి నేరాలు చేయించేవాడు. ఇలా కొందరు దొంగలను తమ కంట్రోల్లో పెట్టుకోవడం, రికవరీల్లో సెటిల్మెంట్లు చేయడంలో ఈశ్వర్‌తో పాటు మరికొందరూ నిష్ణాతులని తెలుస్తోంది. చోరీ ఫోన్లు ట్రాక్ కాకుండా ఉండటానికి ఈశ్వర్ అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. తన గ్యాంగ్ ద్వారా తన వద్దకు చేరిన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లు క్లోనింగ్ చేసేవాడు. అలా కుదరని పక్షంలో బయటి దేశాలకు... ప్రధానంగా నేపాల్‌కు పంపేవాడని సమాచారం. గతంలో ఈశ్వర్‌తో పాటు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారి ఒకే ఠాణాలో పని చేశారు. అçప్పట్లోనూ ఈ గ్యాంగ్స్ నిర్వహణ, సెటిల్మెంట్లకు సంబంధించి ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయి. చదవండి: Viral: కుటుంబంతో సేదతీరేందుకు వ్యవసాయక్షేత్రంలో రెడీమేడ్ ఇల్లు -
యువతుల కోసం అపార్ట్‌మెంట్‌కు సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఇంతలోనే షాకింగ్ ట్విస్ట్
అమీర్‌పేట(హైదరాబాద్): ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని నకిలీ పోలీసులు బురిడీ కొట్టించారు. పశ్చిమగోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన మౌళి నగరంలోని బల్కంపేట వెన్నం అపార్ట్మెంట్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఓ యాప్‌లో యువతుల కోసం ఆరా తీసి బీకేగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. చదవండి: భర్త కోసం భార్య మౌన పోరాటం ఇద్దరు యువతులతో మాట్లాడుతుండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. తాము పోలీసులమని బెదిరించి అతడి సెల్‌ఫోన్ లాక్కున్నారు. ఫోన్ పే ద్వారా తన అకౌంట్లో నుంచి రూ.14500 బదిలీ చేసుకుని సెల్ తీసుకుని వెళ్లి పోయారు. వచ్చిన వ్యక్తులు నకిలీ పోలీసులని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. -
ఏం తెలివిరా నాయనా?.. ఏకంగా నకిలీ ‘పోలీస్ స్టేషన్’ పెట్టేశాడు
పాట్నా: నకిలీ వస్తువులు, కల్తీ ఆహారపదార్థాలు తయారు చేసే కేంద్రాలను పోలీసులు పట్టుకున్న సంఘటనలు చాలానే చూసుంటారు. కానీ, ఓ గ్యాంగ్ ఏకాంగా నకిలీ పోలీస్ స్టేషన్‌నే ఏర్పాటు చేసింది. పోలీసుల దుస్తుల్లో ఎనిమిది నెలలుగా వసూళ్లకు పాల్పడుతోంది. ఈ సంఘటన బిహార్‌లోని బాంగా జిల్లాలో వెలుగు చూసింది. అయితే, స్థానిక పోలీస్ స్టేషన్‌కు కేవలం 500 మీటర్ల దూరంలోనే ఈ నకిలీ పోలీస్ స్టేషన్ ఉండటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు భోలా యాదవ్ ఓ గెస్ట్ హౌస్‌లో నకిలీ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశాడు. ముందుగా రూ.వేలు వసూలు చేసి అనిత, జూలీ అనే ఇద్దరు మహిళల్ని పోలీసులుగా నియమించుకున్నాడు. మరో ముగ్గురిని తన గ్యాంగ్‌లో చేర్చుకుని డీఎస్పీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ లాంటి హోదాలు కట్టబెట్టాడు. వారికి యూనిఫాంలతో పాటు నాటు తుపాకీలు ఇచ్చాడు. వారు చెకింగ్‌ల పేరుతో భయపెట్టి ప్రజల నుంచి డబ్బులు వసూళు చేసేవారు. బుధవారం సాయంత్రం టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన శంభు యాదవ్ నాటు తుపాకులతో ఉన్న నకిలీ పోలీసులను చూశారు. అతడికి అనుమానం వచ్చి ఆరా తీయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: బాయ్‌ఫ్రెండ్‌ని మార్చినంత ఈజీ అతనికి పార్టీలు మార్చడం! -
Fake Police: చిన్న పని వుంది... ఒక్కసారి బైక్ ఇస్తే వెళ్లి వచ్చేస్తా..
అల్లిపురం (విశాఖ దక్షిణ): పోలీస్ అని చెప్పుకుంటూ పలు నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని టూ టౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ కె.వెంకటరావు తెలిపిన వివరాల ప్రకారం... మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన జి.ఈశ్వరరావు శనివారం ఉదయం పని నిమిత్తం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు తన ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఆ సమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లా, శంకవరం మండలం, రేలంగ గ్రామానికి చెందిన వెలుగుల వెంకట రమణ (42) పోలీస్ యూనిఫాంలో అతని దగ్గరికి వచ్చాడు. తాను పోలీస్ కానిస్టేబుల్‌నని చెప్పి నకిలీ ఐడీ కార్డు చూపించాడు. చదవండి: లవ్ ఫెయిల్యూర్.. యువతి ఆత్మహత్య.. మృతిపై భిన్న కథనాలు.. తన పేరు సీహెచ్ రాహూల్ అని, తాను ఆర్టీసీ కాంప్లెక్స్ ఔట్ పోస్టులో పనిచేస్తున్నానని నమ్మించాడు. చిన్న పని వుంది... ఒక్కసారి బైక్ ఇస్తే వెళ్లి వచ్చేస్తానని చెప్పడంతో ఈశ్వరరావు బైక్ తాళాలు ఇచ్చాడు. అయితే గంటలు గడుస్తున్నప్పటికీ బైక్ తీసుకెళ్లిన కానిస్టేబుల్ రాకపోవడంతో బాధితుడు ఔట్‌పోస్టులో విచారణ చేశాడు. అయితే రాహుల్ అనే పేరు గల వారు ఎవరూ ఇక్కడ పనిచేయడం లేదని చెప్పడంతో తాను మోసపోయానని తలచి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈశ్వరరావు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఈస్ట్ ఇన్చార్జి ఏసీపీ వై.గోవిందరావు ఆదేశాల మేరకు సీఐ వెంకటరావు సూచనలతో ఎస్ఐ సల్మాన్ బెయిగ్ విచారణ చేపట్టారు. నిందితుడిని సీసీ కెమెరా పుటేజీ ద్వారా పాత నేరస్తుడు వెలుగుల వెంకటరమణగా గుర్తించి, ఫోన్ నంబర్ ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి బైక్, పోలీస్ నేమ్‌ప్లేట్, పోలీస్ యూనిఫాం, ఐడీ కార్డులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి విడుదలై... నిందితుడు వెలుగుల వెంకటరమణ కాకినాడలో పోలీస్ యూనిఫాం కొని పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. జీఆర్పీ కేసులో 50 రోజులు జైలు శిక్ష ఏలూరు జైలులో అనుభవించి గత నెల 24న విడుదలయ్యాడు. నిందితుడిపై కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, కొయ్యూరు, డుంబ్రిగుడ, ఎస్.కోట, అరుకు, కంచరపాలెం పోలీస్ స్టేషన్లలో పలు కేసులున్నాయి. -
వ్యాపారులను వణికిస్తోన్న ఫేక్ పోలీసులు
-
నకిలీ పోలీసుల ముఠా అటకట్టించిన పోలీసులు
-
పోలీసులమంటూ బురిడీ: పక్కా స్కెచ్.. రూ.50 లక్షలు దోపిడీ
గుడ్లూరు(ప్రకాశం జిల్లా): పోలీసులమంటూ బంగారు వర్తకులను బురిడీ కొట్టించి వారి నుంచి రూ.50 లక్షలను దోచుకెళ్లిన ఘటన ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని జాతీయ రహదారిపై ఆగస్టు 31న జరిగింది. బాధితులు శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. నెల్లూరుకు చెందిన బంగారం వర్తకులు చిరంజీవి, హరి, వెంకటేష్ విజయవాడలో బంగారం కొనుగోలు చేసేందుకు ఆగస్టు 31న రూ.85 లక్షలతో కారులో బయలుదేరారు. ఈ కారు ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతినగర్ వద్దకు రాగానే పోలీస్ యూనిఫాంలో ఉన్న నలుగురు కారును ఆపారు. తాము డీఎస్పీ ఆఫీసు నుంచి వచ్చామని, బ్లాక్ మనీ తరలిస్తున్నట్టుగా సమాచారం అందిందంటూ వారిని బెదిరించారు. నలుగురిలో ముగ్గురు వారి కారులో కూర్చుని దానిని జాతీయ రహదారి మీదుగా నడపాలని చెప్పారు. నాలుగో వ్యక్తి వారు తెచ్చిన కారులో వారి వెనకాలే వచ్చాడు. మీ మీద కేసు లేకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని ముగ్గురు దొంగలు వారితో బేరమాడుతూ శింగరాయకొండ వరకూ వచ్చి కందుకూరు రోడ్డులో కారును ఆపించారు. వర్తకులు వారికి నగదు ఇచ్చేందుకు బ్యాగులోంచి రూ.50 లక్షలు ఉన్న పార్శిల్‌ను బయటకు తీశారు. ఆ వెంటనే దొంగలు మొత్తం నగదును లాక్కుని వెనుక వచ్చిన కారులో ఎక్కి పరారయ్యారు. అనంతరం వర్తకులు తాము మోసపోయామని గ్రహించి.. గుడ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నలుగురు దొంగలూ నెల్లూరు నుంచే పక్కా ప్రణాళికతో వర్తకుల కారును వెంబడించి దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కందుకూరు సీఐ శ్రీరామ్ చెప్పారు. ఇవీ చదవండి: వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ.. గూఢచారి ‘ధ్రువ్’ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలివే.. -
పోలీస్‌నంటూ వైద్యుడిని బెదిరించి రూ.75 లక్షలు కాజేయబోయిన కిలాడి దొంగ
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఓ ప్రముక ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వైద్యుడు బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం ఆ వైద్యుడి వద్ద మహేశ్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేశాడు. ఆ సమయంలోనే ఆ వైద్యుడికి సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి అతను సేకరించాడు. ఈ విషయం తెలిసుకున్న ఆ వైద్యుడు అతన్ని పనిలో నుంచి తీసేశాడు. ఆ తర్వాత కొంత కాలానికి మహేశ్ ఓ ప్రైవేటు సంస్థలో హెచ్ఆర్గా పని చేస్తున్న గౌతం నాయర్ వద్ద డ్రైవర్‌గా చేరాడు. అయితే మహేశ్ తన జల్సాల కోసం గౌతం నాయర్ వద్ద నుంచి మొత్తం రూ.15 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పు చెల్లించ లేని మహేశ్ తప్పుడు మార్గంలో అధిక మొత్తం సంపాదంచే ఓ ప్రణాళికను గౌతం నాయర్‌కు చెప్పాడు. గతంలో తాను ఓ వైద్యుడి వద్ద పని చేశానని, వైద్యుడు తన భార్యను చంపుతానని మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి తన వద్ద ఉందని దానిని ఆసరాగా చేసుకొని ఆ వైద్యుడిని బెదిరించి డబ్బు సంపాదిద్దామని గౌతం నాయర్‌కు ప్లాన్ చెప్పాడు. మహేశ్ మాటలు విని ఈ నెల 14న గౌతం నాయర్ వైద్యుడికి ఫోన్ చేసి తాను ఖమ్మం సీఐనని మీ ఆడియో క్లిప్ ఒకటి తన వద్ద ఉందని రూ.75 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరించాడు. దీంతో ఆ వైద్యుడు వెంటనే పోలీస్‌లను ఆశ్రయించాడు. కేసు నమొదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆ వైద్యుడితో గౌతం నాయర్‌కు రూ.75 లక్షలు కాదని రూ.20 లక్షలు చెల్లిస్తానని తన ఆడియో క్లిప్ తనకి ఇవ్వవలసిందిగా పోలీసులే దగ్గరుండి ఫోన్ చేయించారు. అలాగే డబ్బులు తీసుకోడానికి బంజారాహిల్స్‌లోని ఓ ప్రముక ఆలయం వద్దకు రావాల్సిందిగా సూచించారు. అయితే గౌతం నాయర్ పోలీస్ స్టిక్కర్ వేసిన కారులో ఆలయానికి వచ్చాడు. అప్పటికే పోలీసులు ఆ ఆలయం వద్ద కాపు కాశారు. ఈ క్రమంలోనే ఆ వైద్యుడితో గౌతం నాయర్ మాట్లాడుతుండగానే అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇక ఇదే సమయంలో ప్రధాన నిందితుడు మహేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్నారు. ఇక అనంతరం పోలీసులు మాట్లాడుతూ ఇలా ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తే భయపడకుండా ధైర్యంగా తమకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. -
తమిళనాడులో ఫేక్ పోలీస్ అరెస్ట్
-
నకిలీ పోలీస్ కమిషనర్ గాథ.. ఎంత చెప్పినా తక్కువేనయా!
సాక్షి, చెన్నై: ఆయనో నకిలీ పోలీస్ కమిషనర్. ఐడీ కార్డు, సైరన్‌తో కూడిన పోలీస్ వాహనం, యూనిఫాం అన్నీ నకిలీవే. అసలు పోలీసులతో సమానంగా చలామణి అవడమే కాకుండా అడ్డగోలుగా సంపాదించాడు. చివరకు వాహనాల తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసుల కథనం.. చెన్నైకి చెందిన విజయన్ (42)కు లారీ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇంటిపట్టునే ఉండిపోయాడు. దీంతో అతని భార్య ఏ పనీచేయకుండా ఉంటే ఎలా అని నిలదీస్తూ ఉండడంతో గెటప్ మార్చాడు. గ్రూప్–1 పాసై, డీఎస్పీ అయ్యానని, ఇటీవలే పోలీస్ కమిషనర్‌గా ఉద్యోగోన్నతి పొందినట్లు నమ్మబలికాడు. ఆ తర్వాత స్నేహితురాలి సహకారంతో జీప్ కొనుగోలు చేసి సైరన్‌తో కూడిన పోలీస్ వాహనంగా మార్చాడు. కేసుల విచారణకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి పలు ప్రాంతాలకు వెళ్లేవాడు. పోలీస్ అధికారి అవతారమెత్తాక పలువురి వద్ద డబ్బులు గుంజాడు. చివరకు పోలీస్ కమిషనర్ గెటప్‌లో వెళ్తుండగా దిండుగల్లు జిల్లా లక్ష్మీపురం టోల్గేట్ వద్ద అతని బండారం బట్టబయలైంది. వాహనాల తనిఖీలో ఇతను పోలీసులకు పట్టుబడ్డాడు. అతని నుంచి వాహనం, నకిలీ ఐడీ కార్డు, యూనిఫాం, తుపాకీ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో దిగిన ఫొటోలు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సన్నిహితంగా ముచ్చట్లాడుతున్న ఫొటో సైతం ఉండడం గమనార్హం! అయితే తాను ఒక ప్రైవేట్ న్యూస్ చానల్లో విలేకరిగా పనిచేసేటపుడు వారితో ఫొటోలకు దిగినట్లు నిందితుడు విచారణలో పేర్కొన్నాడు. మరోవైపు– ఈ కేసు విచారణ సమయంలో పలువురు ఫోన్ ద్వారా ఒత్తిళ్లకు గురిచేసినట్లు పోలీసులు చెప్పడం గమనించతగ్గ అంశం. ప్రముఖుల పేర్లను, ఫొటోలను విజయన్ వాడుకున్నాడా? ఇతడిని అడ్డుపెట్టుకుని ప్రముఖులు సొమ్ము చేసుకున్నారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబును సైతం విచారించనున్నట్లు సమాచారం. -
నేనే పోలీస్ అన్నాడు, జైల్లో వేశారు!
ముంబై: పోలీస్ అవ్వాలన్న కోరిక ఉంటే ఆ శాఖ నిర్వహించే పరీక్షలు రాసి సెలక్ట్ అవ్వాలి. కానీ.. ఇక్కడ ఒక క్యాబ్ డ్రైవర్ మాత్రం పెద్దగా కష్టపడకుండానే తనకు తానే పోలీస్ అని ప్రకటించుకున్నాడు, కానిస్టేబుల్ అని అందరితో చెప్పుకున్నాడు. ట్యాక్సీకి పోలీస్ స్టిక్కర్ అతికించాడు. అంతటితో ఆగకుండా ఖాకీ దుస్తులు ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకే ముంది ఫేమస్ అయిపోదామనుకున్న అతగాడు పోలీసులు అరెస్టు చేయడంతో కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. విజయ్ గుండ్రె ముంబైలోని ఘన్సోలీలో నివసించేవాడు. క్యాబ్ నడుపుతూ జీవనం సాగించేవాడు. అయితే చుట్టుపక్కల వారితో పోలీస్ అని చెప్పుకునేవాడు. ఈ క్రమంలో ఒక రోజు పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. విజయ్ గుండ్రె పట్టుబడ్డాడు. పోలీసులకు టోకరా ఇచ్చి తప్పించుకుందాం అనుకున్నాడు. తాను కూడా డిపార్ట్మెంట్ అని కవర్ చేశాడు. కానీ అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయడంతో అతడు నకిలీ పోలీసన్న విషయం బయటపడింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు పలు సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశారు. చదవండి: వాహన దారులకు షాక్: శాశ్వతంగా లైసెన్సు రద్దు -
సీఎం కేసీఆర్ గన్‌మెన్ అంటూ..
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ గన్‌మెన్ అంటూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ నకిలీ పోలీసును వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేవారు. నగరానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి ఫేక్ ఐడీ కార్డుతో ఎస్సైగా చలామణి అవుతున్నాడు. ప్రస్తుతం తాను సీఎం కేసీఆర్ వద్ద గన్‌మెన్‌గా పని చేస్తున్నాని చెప్పకుంటూ అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు. జౌట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెబూతూ నిరుద్యోగ యువత దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. టాస్క్‌పోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో సంతోష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి నకిలీ తుపాకీ, ఫేక్ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. -
రాచకొండలో నకిలీ డాక్టర్ హల్చల్
సాక్షి, హైదరాబాద్ : రాచకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో నకిలీ డాక్టర్ హల్చల్ చేశాడు. తేజారెడ్డి అనే వ్యక్తి నకిలీ సర్టిఫికెట్స్ సృష్టించి ఏకంగా పోలీసులకే మస్కా కొట్టి లాక్డౌన్ సమయంలో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో డాక్టర్‌గా విధులు నిర్వర్తించాడు. అదే సమయంలో రాచకొండ పరిధిలోని పలువురు పోలీసులకు కరోనా మందులు కూడా అందించినట్లు తెలిసింది. అయితే తేజారెడ్డి వ్యవహారంపై పోలీసులకు అనుమానం రావడంతో అతని బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. గతంలో బెంగుళూరులోనూ ఇదే తరహాలో అక్కడి పోలీసులను బురిడీ కొట్టించాడు. తాను ఒక ఐపీఎస్ ఆఫీసర్ నంటూ.. సీనియర్ ఐపీఎస్ కుమారుడినంటూ చెప్పుకుంటూ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహించి శిక్షణ అందించేవాడు. ఈ కేసులో తేజారెడ్డిని బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తేజారెడ్డి హైదరాబాద్‌కు తన మకాం మార్చాడు. (చదవండి : మూగ ప్రేమజంట బలవన్మరణం) లాక్డౌన్ సమయంలో తేజారెడ్డి డాక్టర్ అవతారమెత్తి రాచకొండ పరిధిలోని కోవిడ్ కంట్రోల్ రూమ్‌లో వలంటీర్‌గా విధులు నిర్వహించాడు. అంతేగాక తేజారెడ్డి పలు బ్యాంకుల నుంచి దాదాపు రూ. 15 లక్షలకు పైగా రుణాలు తేజారెడ్డి ఎగ్గొట్టినట్లు తేలింది. మరోవైపు తేజారెడ్డి తన వ్యక్తిగత జీవితంలో.. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడు. తేజారెడ్డి తనపై వేధింపులకు గురి చేస్తున్నట్లు అతని రెండవ భార్య ఈ మధ్యనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా తేజారెడ్డి ఇటీవలే ఒక రౌడీషీటర్‌కు చెందిన వాహనానికి ప్రభుత్వ వాహనంగా స్టికర్ అంటించి తిరుగుతున్నాడు. అతని కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా తేజారెడ్డి జీవిత చరిత్ర బయటపడింది. -
నకిలీ పోలీసుల గుట్టురట్టు
శ్రీకాకుళం రూరల్: వారిని చూస్తే అచ్చం పోలీసులే అని భ్రమపడతాం. ఒకరు టక్..టైతో హుందాగా కారులో కూర్చుంటారు. మిగిలిన వారు పోలీసు గెటప్, సివిల్ డ్రస్సుల్లో ఉంటూ హడావుడి చేస్తుంటారు. రైడ్ పేరుతో లూటీలు చేయడం.. బెదిరింపులకు పాల్పడడం.. అవసరమైతే రెండు లాగి జీపులో ఎక్కించడం చూస్తే వీరు పోలీసులు కాదని ఎవరూ గుర్తించలేరు. అయితే పాపం పండటంతో వీరి గుట్టు రట్టయ్యింది. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకునే క్రమంలో రోడ్డుపై వీరు వ్యవహరించిన తీరుతో అనుమానం వచ్చిన సింగుపురం గ్రామస్తులు చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణ జరిపిన పోలీసులు మొత్తం ఐదుగురు యువకులను రిమాండ్‌కు తరలించారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సింగుపురం, కరజాడ, బైరి, బట్టేరు పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చామని, ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులుగా తమను నియమించిదంటూ గార మండలం అంబటివానిపేటకు చెందిన ఐదుగురు వ్యక్తులు వారం రోజులుగా ఇన్నోవా కారులో తిరుగుతు హడావుడి చేస్తున్నారు. వీరిలో కుంచాల సంతోష్ 2017లో ఎక్సైజ్ శాఖకు పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేసేవాడు. 2018–19 కాలంలో హైదరాబాద్‌లో సీసీ కెమెరాలు తయారు చేసే కంపెనీలో పనిలో చేరాడు. 2020 ఫిబ్రవరిలో స్వస్థలం వచ్చేసి జల్సాలకు అలవాటుపడ్డాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టాడు. గతంలో ఎక్సైజ్‌శాఖకు ఇన్ఫార్మర్గా పనిచేసిన అనుభవం ఉండడంతో ఎక్కడెక్కడ మద్యం బెల్టుషాపులు నిర్వహించేవారో, మందు ఎక్కడి నుంచి వస్తుందో తదితర విషయాలు తెలియడంతో నకిలీ పోలీసు అవతారమెత్తాడు. అదే గ్రామానికి చెందిన మర్రి రమణ, కొనుము రమణ, ధనాల జ్ఞానప్రసాద్, నక్క రంగారావు(వప్పంగి) సహాయంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులపేరుతో బెల్టుషాపుల వద్ద దందాలు మొదలుపెట్డాడు. పోలీస్ స్టిక్కరింగ్ వాహనంతో.. రెండు నెలలు క్రితం సంతోష్ ఇన్నోవా కారును కొనుగోలు చేశాడు. దాని వెనక, ముందు భాగంలో పోలీస్ అని స్టిక్కరింగ్ చేసి టోల్‌ప్లాజాలు, సంతలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ దందాలు చేసేవాడు. ఇదే వాహనాన్ని ఉపయోగిస్తూ బైరి, సింగుపురం, కరజాడ పరిసర ప్రాంతాల్లో బెల్టుషాపులు నిర్వహించే వారివద్దకు వెళ్లి మద్యం సీసాలు లాక్కోవడమే కాకుండా కేసులు నమోదు చేస్తామని బెదిరించేవారు. భయపడి వారు ఇచ్చిన నగదును తీసుకొని అదే బెల్టుషాపు నిర్వాహకుడి నుంచి మరింత సమాచారం సేకరించి వేరే ప్రాంతంలో బెల్టుషాపులు నిర్వహించే వారి వద్ద దాడులకు తెగబడేవారు. ఎలా పట్టుబడ్డారంటే... ఈ నెల 25న బుధవారం రాత్రి సింగుపురం, బైరి పరిసర ప్రాంతంలో ఒకే చోట నాలుగు బెల్టు షాపుల వద్ద దందాలకు పాల్పడ్డారు. జితేష్‌కుమార్ అనే ఓ వ్యాపారి వద్ద మూడు క్వార్టర్ బాటిళ్లు ఉన్నాయని తెలుసుకుని బలవంతంగా లాక్కొనేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో రహదారి మీదుగా వెళ్తున్న సింగుపురం గ్రామస్తులు చూసి పోలీసులైతే ఇలా రోడ్డుపై దాడులకు తెగబడరని సందేహించి ఇద్దరిని అక్కడికక్కడే పట్టుకున్నారు. మిగిలిన ముగ్గురు పరారవ్వడంతో రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంబేడ్కర్, రూరల్ ఎస్ఐ లక్ష్మణరావులు సంఘటనా స్థలానికి చేరుకుని మిగిలిన ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. 18 మద్యం బాటిళ్లతో పాటు రూ.1500 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. -
చిత్తూరు జిల్లాలో నకిలీ పోలీసులు హల్చల్
-
నకిలీ పోలీసులు హల్చల్..
సాక్షి, చిత్తూరు: జిల్లాలో గుడుపల్లి మండలం కనమనపల్లిలో నకిలీ పోలీసులు హల్చల్ చేశారు. గంజాయి అమ్ముతున్నారంటూ ఇళ్లలో సోదాలు చేసిన నలుగురు వ్యక్తులు.. నగదు,బంగారం దోచుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ వ్యక్తులను చెట్టుకు కట్టేసి స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ నలుగురిలో ఒకరు.. హత్యకేసులో ముద్దాయిగా ఉన్న రౌడీషీటర్ రత్నగా పోలీసులు గుర్తించారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హత్యాయత్నం కుట్ర కేసులో ప్రధాన నిందితుడిగా రత్న ఉన్నారని, కొన్నాళ్ల క్రితం జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చాడని పోలీసులు తెలిపారు. -
ఏడు పెళ్లిళ్లు.. 24 మందిపై లైంగిక దాడి
సాక్షి చెన్నై: యువతులను మోసగించేందుకు అతడు ఎంచుకోని మార్గం లేదు. లైంగికవాంఛ తీర్చుకునేందుకు చేయని మోసం లేదు. నగలు, డబ్బులు కాజేసేందుకు ఎత్తని అవతారం లేదు. ఏడు పెళ్లిళ్లు చేసుకుని, మరో 24 మంది యువతులపై లైంగికదాడికి పాల్పడిన ఘరానా మోసగాడిని చెన్నై పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. పోలీసు కథనం మేరకు.. చెన్నై ఎగ్మూరుకు చెందిన 23 ఏళ్ల యువతి చెన్నై అమైందకరై నెల్సన్‌మాణిక్యం రోడ్డులోని కవిన్స్ మేనేజ్మెంట్ సొల్యూషన్ అనే ప్రయివేటు కంపెనీలో పనిచేస్తోంది. ఈ ఏడాది జూన్ 30న ఆఫీసుకు వెళుతున్నట్లు చెప్పి బయలుదేరిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. స్నేహితులు, బంధువులను విచారించినా సమాచారం లేకపోవడంతో ఎగ్మూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను వెతికిపెట్టాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో అడ్వకొనర్వ్ పిటిషన్ వేశారు. సీసీటీవీ కెమెరాల ద్వారా గాలింపు చర్య ప్రారంభించగా సదరు యువతి పనిచేస్తున్న కంపెనీ యజమాని రాజేష్‌పృథ్వీ (29) జూన్ 30న తన కారులో ఎక్కించుకుని కిడ్నాప్‌కు పాల్పడిన దృశ్యాలు నమోదయ్యాయి. అతడు కూడా కనిపించకుండా పోవడంతో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి తీవ్రస్థాయిలో వెతుకులాట చేపట్టగా తిరుప్పూరు నొచ్చిపాళయం ప్రాంతంలోని ఒక ఇంటిలో బందీగా ఉన్న యువతిని ఇటీవల రక్షించారు. యజమాని రాజేష్‌పృథ్వీ తనను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని, ఇంటిలో బందీగా పెట్టి వేధింపులకు గురిచేశాడని పోలీసుల వద్ద బోరున విలపించింది. ఈనెల 9న ఆ యువతిని కోర్టులో ప్రవేశపెట్టి న్యాయమూర్తి ఆదేశాల మేరకు తల్లిదండ్రులకు అప్పగించారు. ఇదిలా ఉండగా, ఆదివారం రాత్రి చెన్నై ఎగ్మూరులోని యువతి ఇంటికి వచ్చిన రాజేష్‌పృథ్వీ తన భార్యను అప్పగించాలి్సందిగా తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. తల్లిదండ్రుల ద్వారా సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీసు బృందం తిరుప్పూరు నొచ్చిపాళయం పడమర వీరపాండిలోని ఒక ఇంటిలో ఉన్న నిందితుడిని అదే రోజు రాత్రి అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఎస్ఐ యూనిఫాం, నకిలీ ఐడీ, నకిలీ ఆధార్‌కార్డు, నకిలీ పాన్‌కార్డు, నకిలీ ఓటరు కార్డు, బేడీలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడి గురించి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. తిరుప్పూరు నొచ్చిపాళయంకు చెందిన రాజేష్‌పృథ్వీ 7వ తరగతి వరకు చదివాడు. ప్రయివేటుగా పదోతరగతి పరీక్షలు రాసాడు. అయితే యువతులను, గృహిణిలను ఆకర్షించడంలో మహాదిట్టయిన అతడు గ్రామంలోని పలువురిని బెదిరించి, ముగ్గులోకి దించి జల్సా చేశాడు. అతడి దురాగతాలకు తల్లిదండ్రులే అడ్డుపడటంతో ఇల్లు వదిలిపారిపోయి ప్రయివేటు కంపెనీల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చిన్నపాటి మోసాలకు పాల్పడేవాడు. మోసాలతో సమకూర్చుకున్న డబ్బుతో జాబ్ కన్సల్టెన్సీని ప్రారంభించాడు. అలాగే అనాథ మహిళా శరణాలయాలను సంప్రదిస్తూ ఇంటిపనులు, కార్యాలయాల్లో పనికి కుదిరిస్తానని మాయమాటలు చెప్పి యువతులతో వాంఛతీర్చుకునేవాడు. పైగా తన కామలీలలను రహస్యంగా వీడియో తీసి డబ్బులు గుంజేవాడు. రాజకీయ వర్గాల్లో పలుకుబడి ఉందని వైద్యసీటు ఇప్పిస్తానని లక్షలు కాజేసి కనిపించకుండా పోయేవాడు. తాను పోలీసుశాఖలో ఎస్ఐ అని కొందరికి, వైద్యుడిని, ఇంజినీరునని మరికొందరికి చెప్పుకుంటూ దినేష్ శ్రీరామ్‌గురు, దీనదయాళన్, రాజేష్‌పృథ్వీ తదితర ఏడు పేర్లతో చలామణి అవుతూ ఏడుగురు యువతులను పెళ్లాడాడు. కొన్నినెలలు కాపురం చేసి అత్తింటివారిచి్చన నగలు, సొమ్ముతో కనుమరుగయ్యేవాడు. బాధిత యువతులు తమిళనాడులోని తిరుచ్చిరాపల్లి, కోయంబత్తూరు, తిరుప్పూరు, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, శ్రీకాళహస్తి పోలీసు స్టేషన్లలో రాజేష్‌పై ఫిర్యాదు చేసి ఉన్నారు. 2017లో కోయంబత్తూరులో అతడిని అరెస్ట్ చేసి తీసుకెళుతుండగా పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. ఆ తరువాత చెన్నైకి చేరుకున్న అతడు నెల్సన్‌మాణిక్యం రోడ్డులో కవిన్స్ మేనేజ్మెంట్ సొల్యూషన్ పేరుతో కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీని నమ్మి వచ్చే కొందరు మహిళకు విదేశాల్లో ఉద్యోగాల కోసం శరీర కొలతలు తీసుకోవాల్సి ఉందనే సాకుతో నగ్నంగా మారుస్తూ ‘నీవు చాలా అందంగా ఉన్నావు, పెళ్లి చేసుకుంటా’ అని నమ్మించి వాడుకుంటాడు. ఈ సమయంలో రికార్డు చేసిన నగ్న దృశ్యాలను చూపి బెదిరించి భారీ ఎత్తున సొమ్ముకాజేశాడు. ఇలా ఇతడి చేతుల్లో మోసపోయిన 24 మంది యువతులు సర్వం సమర్పించుకున్నారు. పోలీసులకు, ఇతరులకు చెబితే ఈ దృశ్యాలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించడంతో బాధిత యువతులు ఫిర్యాదు చేయలేకపోయారు. ఇలా గత ఐదేళ్లలో ఎంతోమంది యువతుల జీవితాలతో చెలగాటమాడినట్లు పోలీసులు తెలిపారు. జూన్ 30న అదృశ్యమైన యువతిని ఏడో భార్యగా వివాహమాడగా ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో అతడి బండారం బట్టబయలైంది.. రాజేష్ అరెస్టు సమాచారాన్ని తెలుసుకున్న మెడికల్ సీటు పేరుతో మోసపోయిన 15 మంది బాధితులు పోలీసులను కలుసుకున్నారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లో వీడియోదృశ్యాల ఆధారంగా బాధిత యువతులను పోలీసులు రహస్యంగా పిలిపించుకుని విచారిస్తున్నారు. -
నకిలీ పోలీసుల హల్చల్
సాక్షి, టెక్కలి రూరల్: నియోజకవర్గ కేంద్రం టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి కొడ్రవీధి జంక్షన్ వద్ద ఆదివారం పట్టపగలే నడిరోడ్డుపై వృద్ధురాలి వద్ద పోలీసుల పేరుతో(నకిలీ పోలీసులు) ఇద్దరు వ్యక్తులు బంగారాన్ని తరస్కరించారు. సీనీ ఫక్కీలో జరిగిన ఈ చోరీపై వృద్ధురాలు దండా హేమలత తెలిపిన వివరాల ప్రకారం.. హేమలత టెక్కలి మెయిన్ రోడ్డులో నివాసముంటుంది. బంధువుల ఇంటికి కొడ్రవీధి నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె ముందు ఆగారు. తాము పోలీసులమంటూ వారి దగ్గరున్న డమ్మీ ఐడీ కార్డు చూపించారు. మెడలో అంత బంగారం వేసుకోని తిరగవద్దని, ఈ ప్రాంతంలో దొంగలు ఉన్నారని చెప్పారు. బంగారమంతా తీసి ఆమెతో తెచ్చుకున్న బ్యాగ్‌లో పెట్టుకోమని చెప్పారు. ఆమె అనుమానంగా చూడటంతో వీధిలోంచి మరో వ్యక్తి వచ్చాడు. అతనికి కూడా అలాగే చెప్పారు. అతను తన చైన్, బంగార వస్తులు, డబ్బులు బ్యాగ్‌లో పెట్టుకోని వెళ్లిపోయాడు. అతనిని అనుసరిస్తూ ఆమె కూడా అదేవిధంగా తాళిబొట్టు, చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులు తీసి బ్యాగ్‌లో పెట్టింది. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు బంగారం అంతా భద్రంగా ఉందో, లేదో చూస్తానని బ్యాగ్ అడిగాడు. వస్తువులన్నీ సరిగానే ఉన్నాయని చెప్పి అక్కడ నుంచి ఆమెను పంపించేశారు. ఇంటికి వెళ్లి తాళి, గాజు లు వేసుకోడానికి బ్యాగ్ చూసేసరికి అందులో ఆ వస్తువులు కనిపించలేదు. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై టెక్కలి సీఐ నీలయ్య బాధితురాలు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేతి గాజులు, తాళిబొట్టు కలిపి సుమారు 5 తులాలు ఉంటాయని బాధితురాలు రోదిస్తోంది. సీఐ నీలయ్య, ఎస్ఐ గణేష్‌లు ఘటన స్థలానికి చేరుకొని స్థానికుల వద్ద వివరాలు సేకరించారు. బాధితురాలు హేమలత, భర్త శ్రీరామ్మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోచోట విఫలయత్నం.. పై ఘటన జరగక ముందు గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు స్థానిక సంతోషిమాత గుడి సమీపంలో భవానీనగర్‌కు చెందిన విజయలక్ష్మి అనే మహిళను కూడా ఇలాగే నమ్మబలికారని పోలీసులు తెలిపారు. ఇక్కడ దొంగలు ఉన్నారని చెప్పారు. బంగారం తీసి దాచుకోవాలని సూచించడంతో ఆమె బంగారం అంతా తీసి తన చీరలో కట్టివేసింది. దీంతో చేసేది ఏమి లేక అక్కడ నుంచి వెళ్లిపోయారు. కొంత సమయానికే వృద్ధురాలి వద్ద బంగారం అపహరించారు. -
ముగ్గురు నకిలీ పోలీసుల అరెస్ట్
సాక్షి, నెల్లూరు(కావలి) : తెలంగాణలో బేల్దారులుగా పనులు చేస్తున్న ‘పసుపులేటి’ సోదరులు ఆంధ్రలో మాత్రం నకిలీ పోలీసుల అవతారం ఎత్తి ప్రజలను బురిడీ కొట్టి అక్రమ వసూళ్లు చేస్తున్నారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కావలి డీఎస్పీ డి.ప్రసాద్ పర్యవేక్షణలో కావలి రూరల్ సీఐ టి.మురళీకృష్ణ ఆధ్వర్యంలో బిట్రగుంట ఎస్సై బి.భరత్‌కుమార్, సిబ్బంది నకిలీ పోలీసుల వేషంలో వసూళ్లకు పాల్పడుతున్న ‘పసుపులేటి’ సోదరులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ డి.ప్రసాద్ తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బోగోలు మండలం అనంతబొట్లవారి కండ్రిగ గ్రామానికి చెందిన పసుపులేటి గోపి, జలదంకి మండలం చామదల గ్రామానికి చెందిన పసుపులేటి మహేష్, పసుపులేటి తిరుమల తెలంగాణలో బేల్దారి పనులు చేస్తున్నారు. వీరు వినాయక చవితి ఉత్సవాల కోసం స్వగ్రామాలకు వచ్చారు. సోదరులైన వీరు ముగ్గురు తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన కారులో తిరుగుతూ రోడ్లుపై కనిపించిన వారిని తాము పోలీసులమని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బోగోలు మండలం సుందరగిరివారి కండ్రిగ వద్ద మోటారు సైకిల్‌పై వెళ్తున్న పాపన చెంచురామి రెడ్డి అనే వ్యక్తిని ఆపి పోలీసులమని బెదిరించి, బండి కాగితాలు చూపించమని, డబ్బులు ఇవ్వమని దబాయించారు. దీంతో బాధితుడు తన కుమారుడికి ఫోన్ చేసి సమాచారాన్ని తెలియజేశాడు. దీంతో అతని కుమారుడు గ్రామస్తులను వెంట పెట్టుకొని అక్కడికి చేరుకోగానే నకిలీ పోలీసుల అవతారంలో వసూళ్లకు పాల్పడుతున్న ‘పసుపులేటి’ సోదరులు తమ కారులో పరారీ అయ్యారు. ఈ ఘనటపై బాధితుడు బిట్రగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకొన్న పోలీసులు విచారించి నకిలీ పోలీసులను గుర్తించి ఆదివారం బిట్రగుంటలోని రైల్వేగేటు సమీపంలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న కారును స్వాధీనం చేసుకొన్నారు. -
ఇస్మార్ట్ ‘దొంగ’ పోలీస్!
కాళేశ్వరం: రూ.30వేల జీతం.. పేరైన కంపెనీలో ఆపరేటర్ ఉద్యోగం.. యువకున్ని చూస్తే అచ్చం పోలీసులాగా ఉండే దేహదారుఢ్యం.. ఇదంతా బాగానే ఉన్నా పోలీస్ యూనిఫాంను పోలిన డ్రెస్సుతో అందరిని ఇస్మార్ట్‌గా బెదిరిస్తున్నాడు ఈ దొంగ పోలీస్!. అసలు విషయం ఏమిటంటే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లిపంపుహౌస్లో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అమర్జిత్సింగ్ భూమ్ప్రెసర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి నెలకు రూ.30వేల జీతం కూడా వస్తుంది. కానీ వక్రబుద్ధితో పోలీస్‌లా డ్రెస్సు వేసుకొని అంతర్రాష్ట్ర వంతెన వద్ద వచ్చిపోయే ఆటోవాలాలను బెదిరిస్తూ డబ్బులు వసూళ్లకు పూనుకున్నాడు. అనుమానం వచ్చిన ఆటోవాలాలు శనివారం సాయంత్రం కాళేశ్వరం పోలీసులకు దొంగ పోలీస్‌పై సమాచారం ఇవ్వగా స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన పద్ధతిలో లాఠీకి పని చెప్పారు. అయితే అతడిపై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో కంపెనీ వారు రావడంతో వదిలిపెట్టారు. గతంలోనూ మద్యం తీసుకు వెళ్తున్న వ్యక్తులను ఇదే డ్రెస్సులో వచ్చి మద్యం బాటిళ్లు లాక్కున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇతగాడి వ్యవహారం వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అయింది. -
కానిస్టేబుల్‌నంటూ ప్రేమ జంటపై దాడి
సాక్షి, రాజేంద్రనగర్ : పోలీస్ కానిస్టేబుల్ని అంటూ గండిపేట పార్కులో ప్రేమజంటను భయబ్రాంతులకు గురి చేసి ఫొటోలు తీయడంతో పాటు నగదు లాక్కెళ్లిన దుండగుడిపై బాధితుడు నార్సింగి పోలీసులకు శనివారం ఉదయం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రెడ్‌హిల్స్ ప్రాంతానికి చెందిన సయ్యద్ హుస్సేన్(21) విద్యార్థి. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో గండిపేట ప్రాంతానికి తన ప్రేయసితో కలిసి వచ్చాడు. పార్కు వద్ద ప్రేమికులిద్దరూ మాట్లాడుకుంటుండగా సివిల్ డ్రెస్‌లో వచ్చిన ఓ వ్యక్తి తాను నార్సింగి పోలీస్‌స్టేషన్ సివిల్ కానిస్టేబుల్ హుస్సేన్‌గా పరిచయం చేసుకున్నాడు. అనంతరం సాయంత్రం సమయంలో మీకేమి పని అంటూ వారి ఫొటోలను సెల్ఫోన్లో చిత్రీకరించాడు. అనంతరం వారి వివరాలను స్వీకరించి భయబ్రాంతులకు గురిచేశాడు. హుస్సేన్ దగ్గర ఉన్న రూ. 6500 నగదు లాక్కొని వెళ్లిపోయాడు. ఈ విషయమై సయ్యద్ హుస్సేన్ నార్సింగి పోలీసులకు శనివారం ఉదయం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. -
వీడో సూడో!
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు తన్వీర్ రజ్వీ... చదివింది పదో తరగతి... టర్నర్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. జల్సాలకు అవసరమైన డబ్బు కోసం సూడో పోలీసుగా మారాడు... టాస్క్‌ఫోర్స్/సీసీఎస్/లా అండ్ ఆర్డర్లో పని చేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు... పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తానని, వేలం వేసే వాహనాలు తక్కువ ధరకు ఇప్పిస్తానని పలువురి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు... దీనిపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో అరెస్టు చేశారు. ఇతను చివరకు తన కుటుంబాన్ని సైతం పోలీసుననే చెప్పుకుని మోసం చేశాడు. అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ బుధవారం వివరాలు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడి.. హుస్సేనిఆలం ప్రాంతానికి చెందిన సయ్యద్ తన్వీర్ హుస్సేన్ రజ్వీ పదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. ఓ కార్ఖానాలో కొన్నాళ్ల పాటు టర్నర్‌గా పని చేశాడు. ఇతడికి ఐదురుగు సంతానం. టర్నర్‌గా వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణే కష్టంగా మారింది. దీనికి తోడు తన్వీర్ విలాసాలకు అలవాటు పడటంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో డ్రైవర్‌గా, సెక్యూరిటీ గార్డుగా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ సంపాదించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 2014లో హోంగార్డుగా (డ్రైవర్) దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఉద్యోగం రాకపోవడంతో మళ్లీ తన పనులు మొదలెట్టాడు. అయితే భార్య, పిల్లలతో మాత్రం తాను హోంగార్డుగా పని చేస్తున్నట్లు నమ్మించేవాడు. ఇందుకుగాను ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో సఫారీ డ్రస్ ధరిస్తుండేవాడు. ఇతడి పర్సనాలిటీ సైతం పోలీసు మాదిరిగానే ఉండటంతో అంతా తేలిగ్గా నమ్మేశారు. వాకీటాకీ, మొబైల్ యాప్‌లు వాడి... సూడో పోలీసుగా తిరుగుతున్న తన్వీర్ తాను నగర టాస్క్‌ఫోర్స్‌లో అసిస్టెంట్ సబ్–ఇన్స్పెక్టర్ (ఏఎస్సై) అని కొందరితో, నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారినని మరికొందరితో, సెంట్రల్ జోన్ డీసీపీ ఆఫీస్‌లో కానిస్టేబుల్‌గా మరికొందరితో చెప్పుకున్నాడు. ఎదుటి వారిని పూర్తిగా నమ్మించేందుకుగాను స్నాప్‌డీల్ యాప్ నుంచి ఓ డమ్మీ వాకీటాకీ (వైర్లెస్ సెట్) ఖరీదు చేసుకున్నాడు. ఇది డమ్మీది కావడంతో పోలీసు వాకీటాకీలో వచ్చే శబ్ధాలు, మాటలు, సైరన్ మోతల కోసం ‘స్మార్ట్’గా ఆలోచించిన అతను గూగుల్ ప్లేస్టోర్స్ నుంచి ‘పోలీసు రేడియో యాప్’ను తన స్మార్ట్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ వాకీటాకీని బయటకు తీసిన ప్రతిసారీ ఎవరూ గమనించకుండా ఈ యాప్‌ను ఆన్ చేసేవాడు. దీంతో ఎదుటి వారికి అది పోలీసులు వాడే వైర్లెస్ సెట్టే అని భ్రమ కలిగేది. ఇలా పోలీసునంటూ చెప్పుకుని తిరిగే తన్వీర్ ఓ దశలో మోసాలు చేయడం ప్రారంభించాడు. అతను గతంలో సెక్యూరిటీ గార్డుగానూ పని చేసి ఉండటంతో పోలీసుల హావభావాలు, పని తీరుపై పట్టు ఉంది. దీనిని ఆధారంగా చేసుకునే మోసాలకు పాల్పడ్డాడు. ఉద్యోగాలు, వేలం పేరుతో... ఐదేళ్ల క్రితం హోంగార్డు పోస్టుకు దరఖాస్తు చేసి, ఎంపిక కాకుండా భంగపడిన తన్వీర్ ఆ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. కొందరికి కానిస్టేబుల్ పోస్టులంటూ ఎర వేశాడు. పోలీసు విభాగం బహిరంగ వేలంపాట ద్వారా విక్రయించే వాహనాలను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ పలువురిని ఆకర్షించాడు. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష–రూ.3 లక్షల వరకు వసూలు చేశాడు. దీంతో ఇతడిపై హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలోని వివిధ పోలీసు స్టేషన్లలో ఐదు కేసులు నమోదయ్యాయి. తన్వీర్ కొన్ని సందర్భాల్లో తాను ఉర్దూ పత్రికలో జర్నలిస్ట్ అని, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అధ్యక్షుడినని చెప్పుకున్నాడు. ఇతడి వ్యవహారాలపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, కేఎన్ ప్రసాద్ వర్మ, మహ్మద్ థక్రుద్దీన్ తమ బృందాలతో వలపన్నారు. బుధవారం నిందితుడు తన్వీర్‌ను పట్టుకుని అతడి నుంచి పోలీసు, జర్నలిస్ట్, హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ పేర్లతో ఉన్న నాలుగు నకిలీ గుర్తింపు కార్డులు, డమ్మీ వాకీటాకీ, సెల్‌ఫోన్, నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమత్తం నిందితుడిని హుస్సేనిఆలం పోలీసులకు అప్పగించారు. -
గంజా మత్తులో ఉన్న యువతిపై నకిలీ పోలీసు..
సాక్షి, చెన్నై : తిరుచ్చిలో ఎన్ఐటీ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన నకిలీ పోలీసును అరెస్టు చేశారు. తిరుచ్చి తువాక్కకుడిలోని ఎన్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన విద్యార్థిని హాస్టల్లో ఉంటూ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ విద్యార్థిని చెన్నై కల్పాక్కంకు చెందిన డిప్లొమో చదివిన విద్యార్థిని ప్రేమిస్తోంది. ఆదివారం రాత్రి కళాశాల ముందు ఉన్న బస్టాప్ వద్ద ప్రియుడితో కలిసి కూర్చొని మాట్లాడుతోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన 30 ఏళ్ల ఓ వ్యక్తి తాను పోలీసునని విచారణ చేయాలని చెప్పాడు. ఆ సమయంలో ప్రేమికులిద్దరూ గంజా మత్తులో ఉన్నారు. దీంతో నకిలీ పోలీసు వారిపై దాడి చేయడంతో ప్రియుడు పారిపోయాడు. ప్రియురాలిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన ఆ యువకుడు ఆమెపై లైంగిక దాడి చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న తువాక్కడి పోలీసులు సీసీటీవీ కెమెరాల మూలంగా దుండగుడిని గుర్తించారు. అతను తిరుపెరంబూరుకు చెందిన మణికంఠన్ అని తెలిసింది. దీంతో మణికంఠన్‌ను మంగళవారం పట్టుకోవడానికి ప్రయత్నించారు. అతను పరిగెడుతున్న సమయంలో కిందపడడంతో చేతులు, కాళ్ల ఎముకులకు ఫ్రాక్చర్ అయింది. అరెస్టు చేసి చికిత్సకోసం ఆస్పత్రిలో చేర్పించారు. -
నకిలీ పోలీస్ ఆటకట్టు
నాగోలు: ఒంటరిగా వెళుతున్న వృద్ధులను టార్గెట్ చేసుకుని పోలీసునని బెదిరించి బంగారం, నగదు దోచుకుంటున్న వ్యక్తిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 10 తులాల బంగారు నగలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా, దిండి మండలం, టి.గౌరారం గ్రామానికి చెందిన రమావత్ నరేష్ నగరానికి వలస వచ్చి రామాంతపూర్‌లో ఉంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన అతను గతంలో పలు దొంగతనాల కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు గాను పోలీస్ అవతారం ఎత్తిన అతను ఒంటరిగా వెళుతున్న వృద్దులను లక్ష్యంగా చేసుకుని బైక్‌పై వారిని వెంబడించి పోలీసునని బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు లాక్కునేవాడు. ఇదే తరహాలో ఎల్బీనగర్ పోలీస్టేషన్ పరిధిలో ఐదు, కాచిగూడ పరిధిలో ఒక దోపిడీకి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఎల్బీనగర్ పోలీసులు శుక్రవారం అతడిని అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.3.50లక్షల విలువైన బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎల్బీనగర్ ఏసీపీ పృథ్వీధర్‌రావు, ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి,డీఐ కృష్ణ మోహన్, క్రైమ్ ఎస్ఐ మారయ్య పాల్గొన్నారు. -
నకిలీ పోలీసు అరెస్టు..!
సాక్షి, విజయనగరం : నిరుద్యోగ యువకులను బురిడీ కొట్టించిన ఓ నకిలీ పోలీసును భీమవరం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. చీపురుపల్లికి చెందిన ప్రసాద్ ఎస్ఐగా చలామణి అవుతూ గుట్లపాడుకు చెందిన ముగ్గురు యువకులకు హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. వారివద్ద నుంచి రూ.24వేల చొప్పున వసూలు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రసాద్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి పోలీస్ యూనిఫామ్, బొమ్మతుపాకీ, లాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. -
నకిలీ ఎస్సై హల్చల్
సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : పోలీస్ యూనిఫాం అంటే ఇష్టం ఉన్న యువకులు కష్టపడి చదివి పోలీస్ ఉద్యోగాన్ని సాధిస్తారు. కాని ఈ ఇద్దరు యువకులు మాత్రం అలా కష్టపడి చదవే ఓపిక లేక ఇష్టపడే పోలీస్ యూనిఫాంను వేసుకోవడం మొదలు పెట్టారు. అలా పోలీస్ యూనిఫాం వేసుకోవడం అలవాటుగా చేసుకుని తొలుత ఫేస్బుక్, వాట్సాప్‌ల్లో ఫొటోలు పెట్టడం తర్వాత ఏకంగా యూనిఫాంతో పబ్లిక్‌లో రావడం మొదలుపెట్టారు. ఇలా సమాజాన్ని మాత్రమే కాదు ఏకంగా వారిని కన్న తల్లిదండ్రులను కూడా తాము పోలీసులమే అంటూ నమ్మించి మోసం చేశారు. అందులో ఒకరు చీపురుపల్లి మండలంలోని గొల్లలపాలెం గ్రామానికి చెందిన బంకపల్లి ప్రసాద్ అలియాస్ ప్రశాంత్ కాగా.. మరొకరు మచిలీపట్నంనకు చెందిన అంకాల బాబు. ప్రసాద్ ఎస్సై అవతారం ఎత్తగా... అంకాలబాబు కానిస్టేబుల్ అవతారం ఎత్తాడు. ఫేస్బుక్ ఖాతాల్లో వీరి ఫొటోలు చూసి పరిచయమైన ఓ ముగ్గురు యువకులకు హోంగార్డ్ ఉద్యోగాలు వేయిస్తామని వారి నుంచి అడ్వాన్స్‌గా రూ.24 వేలు తీసుకున్నారు. ఉద్యోగాల్లో చేరాక మిగిలిన డబ్బు ఇవ్వాలని ఒ ప్పందం కుదుర్చుకున్నారు. ఇంతలో నకిలీ ఎస్సై ప్రసాద్ తన స్వగ్రామానికి రావడంతో చీపురుపల్లి పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మొత్తం వ్యవహారం బయిటకొచ్చింది. దీనికి సంబంధించి ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తుపాకీ, వాహనంతో గొల్లలపాలెంలో ప్రత్యక్షం.... గొల్లలపాలెం గ్రామానికి చెందిన బంకపల్లి ప్రసాద్ అలియాస్ ప్రశాంత్ గతంలో ఓ చోరీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అదే సమయంలో ఊరి నుంచి వెళ్లిపోయిన ప్రసాద్ భీమవరంలో డీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో 2017లో డిగ్రీలో చేరాడు. అక్కడ ఎన్సీసీలో ఉంటూ భీమవరం పోలీస్ స్టేషన్లో కమ్యూనిటీ పోలీస్‌గా స్వచ్ఛంద సేవలు అందించేవాడు. అదే సమయంలో పోలీస్ యూనిఫాంపై ప్రసాద్‌కు మక్కువ పెరిగింది. అయితే ఒక ఏడాది మా త్రమే డిగ్రీ చదివి తర్వాత మానేసి విజయవాడ వెళ్లిపోయి అక్కడ సర్కార్‌గ్రాండ్ అనే హోటల్లో ఎగ్జిక్యూటివ్‌గా పనిలో జాయిన్ అయ్యాడు. అయితే ఎస్సై యూనిఫాంతో ఫొటోలు తీసుకుని ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేస్తుం డడం ప్రసాద్‌కు అలవాటుగా మారింది. అంతా ఎస్సై అనుకుంటుండడంతో ప్రసాద్ కూడా తాను ఎస్సైననే అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అకస్మాత్తుగా ఈ నెల 13న ఎస్సై యూనిఫాంలో, తుపాకీతో పోలీస్ అని రాసి ఉన్న సుమో వాహనంలో గొల్లలపాలెంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ గ్రామంలో కొం తమంది అనుమానించి చీపురుపల్లి ఎస్సైకు సమాచారం అందించారు. దీంతో సిబ్బంది వెళ్లి ప్రసాద్‌ను చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా అసల కథ బయిటకొచ్చింది. డబ్బులు వసూలు.. ఎస్సైగా చలామణీలో ఉన్న బంకపల్లి ప్రసాద్‌కు ఫేస్బుక్ ద్వారా మచిలీపట్నానికి చెందిన అంకాల బాబు పరిచయమయ్యాడు. ఆయన కూడా అప్పటికే కాని స్టేబుల్ దుస్తులు వేసుకుని నకిలీ కాని స్టేబుల్‌గా విజయవాడలో అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఈ ఇద్ద రు కలిసి ఫేస్బుక్ ఖాతాలో విపరీతంగా ఫొటోలు పెడుతుండడంతో పశ్చిమగోదావరి జి ల్లా భీమవరం మండలంలోని గొట్లపాడు గ్రామానికి చెందిన కె.స్వామి అనే డిగ్రీ విద్యార్థికి వీరు ఫేస్బుక్లో పరిచమయ్యారు. వీరు స్వామికి హోమ్‌గార్డు ఉ ద్యోగాలిప్పిస్తామని చెప్పారు. ఒక్కో పోస్టుకు రూ. లక్ష అవుతుందని, అడ్వాన్స్‌గా రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని చెప్పారు. దీంతో స్వామితో పాటు మరో ఇద్దరు మిత్రులు కలిసి ఒక్కొక్కరు రూ.8 వేలు చొప్పున 24 వేలు నకిలీ ఎస్సై ప్రసాద్ పంపించిన భాను అనే వ్యక్తి చేతికి ఈ నెల 11న ఇచ్చారు. హోమ్‌గార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని అడ్వాన్స్ తీసుకున్న అభ్యర్థులకు నిందితులు డీజీపీ కార్యాలయం పేరుతో నకిలీ ఉత్తరాలు కూడా పంపించారు. అయితే ఉత్తరాల్లో తప్పులు ఉండడంతో అప్పటికే వారికి అనుమానం వచ్చింది.చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌లో నకిలీ ఎస్సై ప్రసాద్‌ను విచారించే సమయంలో ఆయన మొబైల్లో బాధితుల ఫోన్ నంబర్లు స్థానిక ఎస్సైకు లభించాయి. దీంతో ఎస్సై వారితో ఫోన్లో మాట్లాడగా.. ఇదంతా మోసం అని తెలుసుకున్న స్వామి అనే యువకుడు భీమవరం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేసి చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌కు వివరాలు పంపించారు. అంతేకాకుండా హోంగార్డు ఉద్యోగం కోసం డబ్బులు సమర్పించుకున్న స్వామి కూడా చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన వాంగ్మూలాన్ని స్థానిక పోలీసులకు ఇచ్చాడు. -
పేరుకే పోలీస్..వృత్తి మాత్రం దొంగతనం
ఆయనో పోలీస్. ఖాకీ డ్రెస్‌ను అడ్డంగా పెట్టుకుని దందాలు సాగిస్తున్నాడు. దోచుకున్న దొంగలనే దోచుకోవడం నుంచి తాను పనిచేసే పోలీస్‌స్టేషన్ పాత భవనం నుంచి విలువైన టేకు కలపను దొంగలించడం వరకు అత్యంత వివాదాస్పద వ్యవహారాలు నెరుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సై పోస్టుల్లో కొనసాగుతున్న ఆయన కింగ్ మేకర్‌గా మారి స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని డమ్మీ చేసి, అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. తన దందాలకు కానిస్టేబుళ్లను వాడుకుంటున్నాడని సిబ్బంది వాపోతున్నారు. టీడీపీ మద్దతుదారుడిగా వ్యవహరిస్తూ బోగోలు మండలంలోని పలు గ్రామాల్లో రాజకీయ కక్షలకు ప్రేరేపించినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, కావలి(నెల్లూరు) : కావలి సబ్ డివిజన్ పరిధిలోని బిట్రగుంట పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా పని చేస్తున్న ఆళ్ల శ్రీనివాసులు అవినీతి, దందాలు పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. దొంగతనాలు చేసే దొంగలను పట్టుకోవాల్సిన సదరు ఏఎస్సై ఏకంగా తాను పనిచేసే పోలీస్‌స్టేషన్‌కు సంబంధించి శిథిలావస్థకు చేరిన బ్రిటిష్ కాలం నాటి భవనంలోని విలువైన టేకు కలపను గుట్టు చప్పుడు కాకుండా తరలించుకుని వెళ్లిన వైనం ఇప్పుడు ఆ శాఖలో అలజడి సృష్టిస్తోంది. కప్పరాళ్లతిప్పలో బ్రిటిష్ కాలంలో పోలీస్‌స్టేషన్ భవనాన్ని నిర్మించారు. వందల ఏళ్ల నాటి కప్పరాళ్లతిప్ప పోలీస్‌స్టేషన్ నిర్మాణంలో అత్యంత నాణ్యత, గట్టిదనం కలిగిన టేకును వినియోగించారు. కాగా ఈ పోలీస్‌స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరుకొంది. దీంతో నూతన భవనాన్ని నిర్మించడంతో అక్కడే కార్యకలాపాలు సాగిస్తున్నారు. సదరు ఏఎస్సై తన సొంతూరు వింజమూరులో కొత్తగా ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తన ఇంటికి అవసరమైన కలప కోసం పాత పోలీస్‌స్టేషన్ భవనంలోని అత్యంత విలువైన టేకు దూలాలను గడ్డి మాటున ట్రాక్టర్లు, ఆటోల్లో తరలించుకుపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం ఇప్పటికే సర్కిల్, సబ్ డివిజనల్ పోలీస్ బాస్‌ల దృష్టికి కూడా వెళ్లడం, స్థానిక ప్రజానీకానికి సైతం తెలియడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద పోలీస్‌గా పేరు రెండేళ్లుగా కప్పరాళ్లతిప్ప పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ఆళ్ల శ్రీనివాసులు అత్యంత వివాదాస్పదమైన పోలీస్‌గా పేరు గడించారు. ప్రతి ఒక్క వ్యవహారంలో తలదూర్చడం, నేరగాళ్లకు వత్తాసు పలకడం, పోలీసుల కార్యకలాపాలను నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు తెలియజేయడం వంటి ఒప్పందాలు చేసుకొంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించే ఇతర సిబ్బంది తన వ్యవహారాలకు సహకరించకుంటే వారికి సమస్యలు సృష్టిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతని ఒత్తిళ్లు తట్టుకోలేక కొందరు సిబ్బంది సెలవు పెట్ట వెళ్లిపోయినట్లు తెలిసింది. బిట్రగుంట పోలీస్‌స్టేషన్‌కు ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఎస్సైను నియమించారు. అతనికి పోలీస్ విధులు కొత్త కావడంతో ఆయన్ను డమ్మీ చేసి అంతా తానై స్టేషన్ ఏఎస్సై వ్యవహారాలు నెరుపుతున్నట్లు పోలీస్ సిబ్బంది గుసగుసలాడుతున్నారు. ఎవరైనా ఈ ఏఎస్సై చెప్పినట్లుగా నడుచుకోవాలని, లేకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఏఎస్సై అంటే పోలీస్ సిబ్బందే హడలి పోతుంటారు. ఈ పోలీస్‌స్టేషన్‌లో అంతా ఈయన పెత్తనమే కావడంతో పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన అత్యంత విలువైన కలపను దర్జాగా తరలించుకుని పోతున్నా.. స్టేషన్ బాస్‌తో సహా మిగతా సిబ్బంది సైతం నోరు మెదపలేకపోతున్నారని తెలిసింది. ఇక పోలీస్‌స్టేషన్ వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులు ముందు తనను కలుసుకోవాలని, అలా చేయకుండా వారిని టార్గెట్ చేసుకొని మరిన్ని ఇబ్బందులు పెట్టడానికి నిందితులతో చేతులు కలిపి పబ్బం గడుపుకుంటాడని విమర్శలు ఉన్నాయి. దొంగలే ఇతని టార్గెట్ కప్పరాళ్లతిప్ప అంటే చిన్న చిన్న దొంగల నుంచి గజ దొంగల ఊరనే పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఇక్కడి స్థానికులు కొందరు వివిధ జిల్లాలు, రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తూ ఉంటారు. వీరితో ఈ పోలీస్‌కు ఏ టూ జెడ్ పరిచయం. ఎక్కడెక్కడో దొంగతనాలు చేసి ఇక్కడికి వచ్చి తలదాచుకుంటున్న దొంగల విషయాన్ని తెలుసుకుని వారి నుంచి పెద్ద పెద్ద మొత్తాల్లోనే డబ్బులు తీసుకుని వారికి అండదండలు అందిస్తున్నాడనే ఆరోపణలు లేకపోలేదు. ఈ దొంగలను వెతుక్కుంటూ వచ్చే పరాయి జిల్లాలు, రాష్ట్రాల పోలీసుల సమాచారాన్ని ముందుగానే ఉప్పందించి తప్పిస్తాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బయట దొంగతనాలకు పాల్పడుతున్న స్థానికులు ఏటా డిసెంబరులో క్రిస్మస్ సందర్భంగా స్వగ్రామానికి చేరుకుంటారు. వారే ఇతని టార్గెట్. దొంగగా ముద్రపడిన ప్రతి వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది డిసెంబరులో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.30 వేల వంతున సుమారు రూ.12 లక్షలు మామూళ్లు వసూలు చేసినట్లు తెలిసింది. కప్పరాళ్లతిప్పకు చెందిన ఒక దొంగ సహకారంతో ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. ఏఎస్సైకు ఈ దొంగ తన ఇంటిపై ఒక గది కట్టించి అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు కూడా తెలిసింది. ఇటీవల ఒక దొంగను పట్టుకుంటే అతని వద్ద ముప్పావు కేజీ బంగారం, వజ్రాల వాచీ దొరికింది. వాటితో పాటు ఆ దొంగ దగ్గర నుంచి రూ.60 వేల డబ్బులు కూడా గుంజినట్లు విశ్వసనీయ సమాచారం. కప్పరాళ్లతిప్పకు చెందిన చదువుకునే విద్యార్థుల వద్ద నుంచి దొంగల దగ్గర కొన్నారంటూ బెదిరించి ఆరు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
నకిలీ పోలీసులు హల్చల్
సాక్షి, విజయవాడ : పోలీసులమంటూ చిరువ్యాపారస్తుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తోన్న ఇద్దరు నకిలీ పోలీసులు గుట్టురట్టయ్యింది. గుంటూరుకు చెందిన ఓగుల వీరనారాయణ మరో వ్యక్తితో కలిసి స్పెషల్ బ్రాంచ్ పోలీసులమంటూ వ్యాపారస్తుల వద్ద డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చిన వ్యాపారస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వీరి గుట్టు రట్టయ్యింది. వ్యాపారస్తుల ఫిర్యాదుతో పెనమలూరు పోలీసులు వీరనారాయణను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 65 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో నకిలీ పోలీస్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
ఏం తమాషానా ‘డీసీపీ రెడ్డి’ని మాట్లాడుతున్నా..!
సాక్షి, సిటీబ్యూరో: ఐపీఎస్ నుంచి ఎస్ఎస్బీ వరకు వివిధ విభాగాల పేర్లు, అనేక హోదాలు వాడేసి మోసాలకు పాల్పడుతూ గురువారం మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన సూడో కర్నాటి గురువినోద్‌కుమార్ రెడ్డి తన పేరును ట్రూకాలర్ యాప్‌లో ‘డీసీపీ రెడ్డి సార్’గా సేవ్ చేసుకున్నాడు. దీనికి తోడు కేవలం బీఎస్ఎన్ఎల్కు చెందిన నెంబర్లనే వాడి ఫోన్లు చేయడంతోనే ఎక్కువ మంది అతడి బుట్టలో పడ్డారు. ఇతని తొలిసారి కటకటాల్లోకి పంపింది అతడి స్వస్థలమైన గిద్దలూరు పోలీసులే. అప్పట్లో అక్కడ స్టేషన్ విజిట్‌కు వెళ్లి బుక్కయ్యాడు. ఈ మోసగాడి చేతిలో దగా పడిన వారు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. ఆన్లైన్లో జాబితా చెక్ చేయడంతో... వినోద్ ప్రకాశం జిల్లా, గిద్దలూరు నుంచి 2017లో హైదరాబాద్‌కు వచ్చి సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు. ఏ పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోయాడు. అప్పటికే బంధువులు, స్నేహితులకు ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నట్లు చెప్పుకున్నాడు. 2016లో సివిల్స్ రాసి ఐపీఎస్‌కు ఎంపికైనట్లు బోగస్ ఐడీ కార్డు తయారు చేశాడు. దీనిని తీసుకుని తన స్వస్థలానికి వెళ్లి అందరినీ నమ్మించాడు. తన తండ్రితో పాటు మేనమామనూ ఓసారి హైదరాబాద్ తీసుకువచ్చి జాతీయ పోలీసు అకాడమీ (ఎన్పీఏ) వద్దకు తీసుకువెళ్లాడు. విజిటింగ్ అవర్స్‌లో అకాడమీ లోపలికి తీసుకెళ్లి తిప్పడంతో పాటు తాను ఐపీఎస్ అయినందుకే లోపలకు వచ్చే అనుమతి వచ్చిందని, ఇందులోనే తాను శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్పాడే. మరోసారి తన ఊరికి వెళ్లినప్పుడు మరింత బిల్డప్ ఇవ్వాలనే ఉద్దేశంతో గిద్దలూరు ఠాణాను సందర్శించాడు. అక్కడి ఎస్సైకి తాను ఐపీఎస్ అని చెప్పడంతో ఆయన ఏకంగా తన కుర్చీనే ఇచ్చి కూర్చోబెట్టారు. ఇతడి మాటతీరు, వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన అతను ఆపై అతడి స్నేహితుల వద్ద ఆరా తీశారు. ఈ నేపథ్యంలో వినోద్ తాను 2016లో ఐపీఎస్‌కు ఎంపికైనట్లు చెప్పినట్లు తెలిసింది. ఆ ఏడాది ఐపీఎస్‌కు ఎంపికైన వారి జాబితాను ఎన్పీఏ అధికారిక వెబ్సైట్లో పరిశీలించిన ఎస్సై జరిగిన మోసాన్ని గ్రహించాడు. వెంటనే వినోద్‌ను తన ఠాణాకు పిలిచి అరెస్టు చేసి జైలుకు పంపాడు. వివాహితనూ ట్రాప్ చేసిన వినోద్... ఈ సూడోగాడు రైళ్లల్లో ప్రయాణించిన ప్రతిసారీ అక్కడ ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బందికి తన బోగస్ ఐడీ కార్డు చూపించే వాడు. ఇటీవల చెన్నై నుంచి ప్రయాణిస్తూ నకిలీ గుర్తింపుకార్డుతో పాటు మాజీ మేజర్ ఇంటి నుంచి చోరీ చేసిన డమ్మీ పిస్టల్ చూపించి ఐపీఎస్ అధికారిగా నమ్మించాడు. దీంతో వారు అతడికి రాచమర్యాదలు చేయడంతో పాటు ఆ కంపార్ట్మెంట్లో ఉన్న వారికీ ఈ విషయం చెప్పి నిశ్శబ్ధంగా ఉండాలని, ఆయన్ను డిస్ట్రబ్ చెయ్యవద్దంటూ హడావుడి చేశారు. అదే బోగీలో వినోద్‌తో కలిసి ప్రయాణించిన ఓ వివాహిత ఈ హంగామాకు ఆకర్షితురాలైంది. ఇద్దరూ తమ ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. తన ఫేస్బుక్ పేజ్‌లో ఎయిర్‌ఫోర్స్ నుంచి వివిధ విభాగాల యూనిఫాంతో కూడిన ఫొటోలు చూసిన ఆమె పూర్తిగా అతడి వల్లో పడిపోయింది. అప్పటి నుంచి తరచూ ఫోన్లో, సోషల్‌మీడియా ద్వారా ఆమెతో సంప్రదింపులు కొనసాగించిన వినోద్ మాయమాటలు చెప్పి ట్రాప్ చేశాడు. ఈ మాటల నేపథ్యంలోనే ఆమె భర్త శామీర్‌పేట్ జినోమ్ వ్యాలీలోని ఓ సంస్థలో సైంటిస్ట్‌గా పని చేస్తున్నట్లు తెలుసుకున్నాడు. అతడి ఉద్యోగం పోగొట్టడంతో పాటు వివాహిత కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తే ఆమె తనతో వస్తుందని వినోద్ భావించాడు. జినోమ్ వ్యాలీ డేటా పొంది... దీంతో రంగంలోకి దిగిన వినోద్ జినోమ్ వ్యాలీలో ఉన్న ఆ సంస్థ నిర్వాహకుల వివరాలు సంగ్రహించాలని భావించాడు. వెంటనే శామీర్‌పేట్ పోలీసులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదనపు ఎస్పీగా ఫోన్ చేసి ఆ వ్యాలీలో ఉన్న అన్ని సంస్థల వివరాలు కావాలని కోరడంతో పోలీసులు ఈ–మెయిల్ ద్వారా పంపారు. అందులో తనకు కావాల్సిన కంపెనీ వివరాలు ఎంచుకున్న వినోద్ సదరు సంస్థ నిర్వాహకుడి ఫోన్ చేశాడు. ఫలానా వ్యక్తిపై (సదరు వివాహిత భర్త) కేసు దర్యాప్తులో ఉందని, పూర్తి వివరాలు తెలపాలని కోరాడు. ఇలా చెప్తే ఆయన ఉద్యోగం పోతుందని పథకం వేశాడు. అయితే ఫోన్‌కాల్‌లో వివరాలు ఇవ్వడానికి నిరాకరించిన సంస్థ నిర్వాహకుడు నేరుగా అధికారిక లేఖ తీసుకుని లేదా స్థానిక పోలీసుల ద్వారా రావాలంటూ స్పష్టం చేశాడు. దీంతో వెంటనే శామీర్‌పేట పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతడి మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు తమ నుంచి కంపెనీల డేటా తీసుకున్న ‘ఐపీఎస్ అధికారి’ ప్రమేయాన్ని శంకించారు. అప్పట్లో ఆయన కాల్ చేసిన నెంబర్‌కు కాల్‌బ్యాక్ చేయగా, ట్రూకాలర్‌లో ‘డీసీపీ రెడ్డి సార్’గా ఉన్నప్పటికీ ఎన్నిసార్లు ప్రయత్నించినా, స్పందన లేకపోవడంతో లోతుగా ఆరా తీసి నకిలీ పోలీసుగా గుర్తించారు. దీంతో వినోద్‌పై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పీటీ వారెంట్‌పై అరెస్టు చేయనున్నారు. ఒకే ఒక్క మంచిపని.. తన కుటుంబంతో పాటు స్నేహితులు, అపరిచితులను మోసం చేసిన వినోద్ ఒక్క మంచిపని చేశాడు. అతడి స్నేహితుడైన ఓ ప్రభుత్వ ఉద్యోగి సోదరి అనారోగ్యానికి గురైంది. కరీంనగర్లో ఆమెకు చికిత్స చేసిన వైద్యులు రూ.1.2 లక్షల బిల్లు వేశారు. వారికి కాల్ చేసిన ‘డీసీపీ రెడ్డి సార్’ బేరసారాలు లేకుండా రూ.40 వేల కన్సెషన్ ఇప్పించాడు. వినోద్‌ను అరెస్టు చేసిన మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు నకిలీ ఐడీ కార్డులు, ల్యాప్‌టాప్ తదితరాలతో పాటు శక్తిమంతమైన బైనాక్యులర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని దేని కోసం సంగ్రహించాడనే కోణంపై ఆరా తీస్తున్నారు. వీటిని వినియోగించి ప్రైవేట్ గూçఢచర్యం నిర్వహించడం వంటివి చేశాడా అనే విషయమై ఆధారాలు సేకరిస్తున్నారు. ఇతడి మూడు ఎన్ఐఏ డైరీలను గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అవి ఇతడికి ఎలా చేరాయనే అంశాన్నీ పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇతగాడు బోగస్ ఐడీ కార్డులు తయారు చేయించిన ప్యారడైజ్‌లోని దుకాణం ఇప్పుడు మూతపడినట్లు పోలీసులు గుర్తించారు. వినోద్‌ను గాంధీనగర్ పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
నాలుగు ప్రభుత్వ విభాగాలను వాడేసిన ఘనుడు
సాక్షి, సిటీబ్యూరో: ఒకసారి ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్... మరోసారి పోలీసు అధికారి... హఠాత్తుగా ఎన్ఐఏ ఏఎస్పీ... ఈవేవీ కాకపోతే శశస్త్ర సీమా బల్ డిప్యూటీ కమాండెంట్... ఇలా అవసరం, అవకాశాన్ని బట్టి అవతారం ఎత్తుతూ మోసాలకు పాల్పడుతున్న ‘సూడోగాడిని’ మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఐదు విభాగాల పేర్లు వాడేసిన ఈ ఘరానా మోసగాడు ఇప్పటికే రెండుసార్లు జైలుకు వెళ్లాడు. అయినా తన పంథా మార్చుకోకుండా మోసాలు కొనసాగిస్తూ మరోసారి చిక్కినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గురువారం పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు, ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావుతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఐపీఎస్ అధికారి కావాలని... వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన గురివిరెడ్డి ఆర్మీలో పని చేసి పదవీ విరమణ చేసిన తర్వాత ప్రకాశం జిల్లా గిద్దలూరులో స్థిరపడ్డాడు. అతడి కుమారుడైన కర్నాటి గురు వినోద్‌కుమార్ రెడ్డి 2012–15లో గిద్దలూరులోనే డిగ్రీ పూర్తి చేశాడు. పోలీసు విభాగం పట్ల మక్కువ ఉన్న వినోద్ చిన్ననాటి నుంచి ఐపీఎస్ అధికారి కావాలని కలలుగన్నాడు. ఈ నేపథ్యంలో 2017లో హైదరాబాద్‌కు వచ్చి అశోక్‌నగర్‌లోని ఓ ప్రముఖ సంస్థలో ఎనిమిది నెలల పాటు సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు. ఆ సమయంలో మరికొందరు స్నేహితులతో కలిసి ఓ గదిలో అద్దెకు ఉండేవాడు. ఇతడి స్నేహితుల్లో పలువురు వివిధ విభాగాల్లో ఉద్యోగాలు సాధించారు. ఇతను మాత్రం యూపీఎస్సీ, ఐఎఫ్ఎస్, ఎస్ఎస్సీ, సీజీఎల్, ఏపీపీఎస్సీలతో పాటు చివరకు ఎస్సై పరీక్ష రాసినా విజయం సాధించలేకపోయాడు. స్నేహితులు, బంధువుల కోసమని... ఆయా పోటీ పరీక్షల్లో తాను విజయం సాధించలేదని చెప్పుకోవడానికి వినోద్ సిగ్గుపడ్డాడు. దీంతో ఇతడు ఉద్యోగం సా«ధించాడని భావించిన కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు అక్కడకు వెళ్లినప్పుడల్లా వివరాలు అడిగేవారు. దీంతో పథకం వేసిన వినోద్ తనను ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా పేర్కొంటూ తొలిసారిగా ఓ బోగస్ గుర్తింపుకార్డు తయారు చేశాడు. దీనిని పట్టుకుని తన గ్రామానికి వెళ్లిన ఇతగాడు అది చూపించి మోసం చేశాడు. 2016లో మళ్లీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యాడు. ఈ విషయాన్నీ తన వారి దగ్గర దాచిన వినోద్ ఈసారి ఏకంగా ఐపీఎస్ అధికారిగా బోగస్ ఐడీ కార్డు తయారు చేశాడు. దీనికితోడు ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణకు అవకాశం వచ్చినట్లు కాల్ లెటర్ కూడా సృష్టిం చాడు. ఇతడి వ్యవహారాలు బయటికి పొక్కడంతో 2017లో గిద్దలూరు పోలీసులు అరెస్టు చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఎన్ఐఏ కార్డుతో ‘డిఫెన్స్’లోకి... ఈ కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన వినోద్ ఈసారి ఏకంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదనపు కమాండెంట్ అవతారం ఎత్తి ఆ గుర్తింపుకార్డు తయారు చేశాడు. దీనిని ధరించి నేరేడ్మెట్ పరిధిలో డిఫెన్స్ ఆధీనంలో ఉండే డిఫెన్స్ మేనేజ్మెంట్ కాలేజ్‌లోకి (డీఎంసీ) ప్రాంగణంలోకి అనుమతి లేకుండా ప్రవేశించాడు. అతడిని పట్టుకున్న డిఫెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించడంతో జైలుకు వెళ్ళాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన వినోద్ మళ్లీ‘సివిల్స్ యుద్ధం’ ప్రారంభించాడు. మరోసారి అశోక్‌నగర్‌లోని అదే సంస్థలో కోచింగ్‌కు చేరాడు. అక్కడ సోషియాలజీ ఫ్యాకల్టీగా పని చేస్తున్న మాజీ మేజర్‌తో ఎన్ఐఏ అదనపు ఎస్పీగా పరిచయం చేసుకున్నాడు. ఇతడిని పూర్తిగా నమ్మిన ఆయన తనకు పరిచయస్తులైన కొందరు అధికారుల వద్దకూ తీసుకువెళ్ళాడు. ఈ ఏడాది తన ఇంటికి తీసుకువెళ్లగా అదను చూసుకుని అక్కడ ఉన్న ఓ డమ్మీ పిస్టల్‌తో పాటు ఇతర వస్తువులను చోరీ చేశాడు. మాజీ మేజర్ ఆరా తీయడంతో... ఈ విషయం గుర్తించిన ఆ మాజీ మేజర్ ఎన్ఐఏ కార్యాలయానికి వెళ్లి వినోద్ వ్యవహారంపై ఆరా తీశారు. దీంతో అలాంటి అధికారి తమ వద్ద లేరని చెప్పడంతో మోసం బయటపడింది. దీంతో ఆయన గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే వినోద్ శామీర్‌పేటలో చేసిన మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఐపీఎస్ అధికారిగా అక్కడకు వెళ్లి కొంత డేటా సంగ్రహించాడని బయటపడటంతో మరో కేసు నమోదైంది. మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై కె.శ్రీనివాసులుతో కూడిన బృందం గాలింపు చేపట్టి వినోద్‌ను అదుపులోకి తీసుకుంది. విచారణ నేపథ్యంలో తన బోగస్ హోదాలను రైల్వే రిజర్వేషన్లు, సినిమా టిక్కెట్లు, పార్కులు, షాపింగ్ మాల్స్‌తో పాటు దేవాలయాల్లో వీఐపీ దర్శనాలకు వినియోగించినట్లు వెల్లడైంది. అతడి నుంచి పోలీసులు శశస్త్ర సీమా బల్ డిప్యూటీ కమాండెంట్ ఐడీ కార్డు, ల్యాప్‌టాప్, డమ్మీ పిస్టల్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. -
అమ్మాయినంటూ చాటింగ్... ఆపై..
సాక్షి, బెంగళూరు : పోలీసు అధికారినని చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ ఎస్ఐని బుధవారం ఉదయగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. హుబ్లి నగరానికి చెందిన సిద్దప్ప ఫేస్బుక్లో భవిక పేరుతో నకిలీ ఖాతా తెరచి యువకులతో అమ్మాయినని చాటింగ్ చేసేవాడు. యువకుల మొబైల్ నంబర్లు తీసుకొని వాయిస్ ఛేంజర్ సాఫ్ట్‌వేర్‌తో అమ్మాయిలా మాట్లాడుతూ వ్యక్తిగత వివరాలు సేకరించి ప్రేమ పేరుతో వారిని ముగ్గులోకి దించేవాడు. ఇలా కొద్ది రోజులు గడచిన అనంతరం అసలు నాటకానికి తెర తీసేవాడు. భవిక అనే అమ్మాయి ఫిర్యాదు చేసిందంటూ పోలీసు వేషధారణతో యువకులను బెదిరించి కేసు నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసేవాడు. ఇలా మైసూరుతో పాటు బెంగళూరు తదితర ప్రాంతాల్లో యువకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. మైసూరు మహిళకు బెదిరింపులు ఇదే క్రమంలో కొద్ది రోజుల క్రితం మైసూరు నగరంలోని శక్తి నగర్‌కు చెందిన శారదమ్మ అనే మహిళతో ఫేస్బుక్లో పరిచయం పెంచుకున్న నిందితుడు మాటల్లో శారద కుమారుడు బెంగళూరులో పని చేస్తున్నట్లు తెలుసుకున్నాడు. అనంతరం మంగళవారం ఎస్ఐ వేషంలో కారులో శారదమ్మ ఇంటికి వచ్చిన సిద్దప్ప బెంగళూరులో మీ కుమారుడు ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను మోసం చేసినట్లు తమకు ఫిర్యాదులు అందాయని అందుకు సంబంధించి విచారణకు వచ్చామంటూ నమ్మించాడు. అయితే తనకు రూ.50వేలు లంచం ఇస్తే మీ కుమారుడిని కేసు నుంచి తప్పిస్తానంటూ సూచించాడు. సిద్దప్ప మాటలు నిజమేనని నమ్మిన శారదమ్మ ఇంట్లో ఉన్న రూ.5వేల నగదును అతడికి ఇచ్చింది. అయితే మొత్తం ఇవ్వాల్సిందేనంటూ సిద్దప్ప డిమాండ్ చేయడంతో ఇంట్లోనే ఉన్న శారదమ్మ భర్త నారాయణగౌడకు నిందితుడి ప్రవర్తనపై అనుమానం కలగడంతో ఇక్కడే ఉండాలని బ్యాంకు నుంచి డబ్బులు తెస్తానంటూ నమ్మించి బయటకు వచ్చి ఉదయనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఇంటెలిజెన్స్ ఎస్సైనని బుకాయింపు సమాచారం అందుకున్న ఉదయనగర ఎస్ఐ జైకీర్తి సిబ్బందితో అక్కడికి చేరుకొని ప్రశ్నించగా తాను ఇంటలిజెన్స్ విభాగ ఎస్ఐనని యువతి ఫిర్యాదు మేరకు ఇక్కడికి విచారణకు వచ్చినట్లు చెప్పాడు. అయితే ఐడీ కార్డు చూపించాలని అడగడంతో పాటు ఇంటలిజెన్స్ విభాగానికి సంబంధించి పలు ప్రశ్నలు అడగడంతో సిద్దప్ప పూర్తిగా తడబడ్డాడు. దీంతో సిద్దప్పను స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగు చూడడంతో సిద్దప్పపై కేసు నమోదు చేసుకున్నారు. -
క్రైం పోలీసులమని టోకరా..
విశాఖపట్నం, అక్కిరెడ్డిపాలెం(గాజువాక): దుండగులు కొత్తరకం ఎత్తుగడలతో జనాన్ని బురిడీ కొట్టించి బంగారం అపహరించుకుపోయారు. ఏకంగా క్రైం పోలీసులమని చెప్పి సుమారు పదమూడున్నర తులాల బంగారం దోచుకుపోయారు. ఈ ఘటనలు కొత్త గాజువాక, నగరంలోని సిటీ సెంట్రల్ పార్కు వద్ద గురువారం చోటుచేసుకున్నాయి. గాజువాక క్రైం సీఐ పైడపునాయుడు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం, కంచిలి గ్రామానికి చెందిన పోలేశ్వరరావు గాజువాక పైడిమాంబకాలనీలో తన మనుమరాలి పుష్పవతి కార్యక్రమానికి వచ్చాడు. కార్యం అనంతరం తన స్వగ్రామం వెళ్లేందుకు గురువారం ఉదయం వరుసకు తమ్ముడైన శంకర్రావుతో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లేందుకు కొత్తగాజువాక హైస్కూల్ రోడ్డు జంక్షన్ వద్ద వేచి ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు వారి వద్దకు వచ్చి... తాము క్రైం పోలీసులమని చెప్పి పరిచయం చేసుకున్నారు. పోలేశ్వరరావును ఉద్దేశించి మెడలో బంగారు చైను, రెండు చేతులకు ఉన్న నాలుగు ఉంగరాలు చూసి దొంగలున్నారు జాగ్రత్త అని చెప్పారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న వ్యక్తిని పిలిచి అతడి చెంపపై కొట్టి మెడలో బంగారు చైను తీసి దాచుకోవాలని చెప్పాను కదా అంటూ ఓవర్ యాక్షన్ చేశారు. (ఆ వ్యక్తి దొంగతనానికి పాల్పడిన వారికి సంబంధించిన వాడేనని పోలీసులు అనుమానిస్తున్నారు). అనంతరం అగంతకులు పోలేశ్వరరావు మెడలో ఉన్న చైను, చేతులకు ఉన్న నాలుగు ఉంగరాలు, మనుమరాలి కోసం తెచ్చి తిరిగి తీసుకెళ్లిపోతున్న నక్లెస్, తన సోదరుడు శంకరావు చేతికి ఉన్న రెండు ఉంగరాలను తీయించి ఒక గుడ్డలో మూటకట్టారు. అనంతరం పోలేశ్వరరావు వద్ద గల బ్యాగులో పెడుతున్నట్లు నటించే సమయంలో ఒక చేతి రుమాలును దుండగులు తీసి గట్టిగా దులిపారు. ఆ సమయంలో అన్నదమ్ములిద్దరికీ కొంత మగతగా ఉన్నట్లు అనిపించడంతో అగంతకులు ద్విచక్ర వాహనంపై బంగారంతో ఉడాయించారు. దీంతో అవాక్కయిన బాధితులు లబోదిబోమంటూ గాజువాక పోలీసులను ఆశ్రయించారు. జరిగిన ఘటనలో 12 తులాలు బంగారం ఆపహరణకు గురైందని పోలీసులు తెలిపారు. సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీని సీఐ పరిశీలించారు. నిందితులను గుర్తించమని బాధితులకు కూడా ఫుటేజీ చూపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోర్నింగ్ వాక్ నుంచి వెళ్తుండగా... అల్లిపురం(విశాఖ దక్షిణం): పోలీసులమని చెప్పి బంగారం అపహరించిన ఘటన టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. క్రైం ఎస్ఐ భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం... అల్లిపురం ప్రాంతానికి చెందిన మజ్జి వెంకటరావు(85) గురువారం ఉదయం మోర్నింగ్ వాక్కు సెంట్రల్ పార్కుకు వెళ్లారు. తిరిగి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వస్తుండగా సుమారు 9.20 గంటల ప్రాంతంలో సౌత్ జైలురోడ్డులో నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై అతని వద్దకు వచ్చి ఆపారు. తాము క్రైం పోలీసులమని చెప్పి పరిచయం చేసుకున్నారు. బంగారం కనిపించే విధంగా పెట్టుకుని వెళ్తే దొంగల బెడద ఎక్కువుగా ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అతని మెడలో గల చైన్, చేతికి ఉన్న ఉంగరాలు (సుమారు తులమున్నర బరువు) తీయించి రుమాలులో కట్టి జేబులో పెట్టుకోవాలని సూచించి వెళ్లిపోయారు. అనంతరం అక్కడి నుంచి కొంత దూరం వెళ్లిన వెంకటరావు తన జేబులోని రుమాలు తీసి చూసుకోగా అందులో బంగారు వస్తువులు కనిపించలేదు. రాళ్లు ఉండడంతో అవాక్కై పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే క్రైం ఎస్ఐ భాస్కరరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. జరిగిన ఘటనను బట్టి దోపిడీకి పాల్పడిన వారు పాతనేరస్తులుగా భావిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాహన తనిఖీల్లో పట్టుబడ్డ నకిలీ పోలీసు
శృంగవరపుకోట రూరల్: మండలంలోని బొడ్డవర చెక్‌పోస్టు వద్ద సోమవారం సాయంత్రం స్థానిక పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో తూర్పుగోదావరి జిల్లా శంకవరం మండలం వేలంగి గ్రామానికి చెందిన సివేరి రాము అలియాస్ వెలుగుల వెంకటరమణ అనే నకిలీ పోలీసు పట్టుబడ్డాడు. తహసీల్దార్ ఎం.అరుణకుమారి సమక్షంలో నిందితుడి నుంచి నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి సాకె జ్యోతి నిందితునికి 14 రోజుల రిమాండ్ విధించినటుట ఎస్ఐ ఎస్.అమ్మినాయుడు తెలిపారు. పట్టుబడ్డ నకిలీ పోలీసును విచారించగా పలువు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు గత నెల డిసెంబరు మూడునే జైలు నుంచి బయటకు వచ్చాడు. అదే నెల 9న రంపచోడవరం సమీపంలో రోడ్డు పక్కన ద్విచక్ర వాహనంలో వేచి ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి తాను కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకుని నకిలీ ఐడెంటిటీ కార్డును చూపి అతని నుంచి బైక్ తీసుకుని ఉడాయించాడు. ఇటీవల ఎస్.కోట గ్రామంలో 220 సీసీ పల్సర్ మోటారుసైకిల్‌తో వేచి ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి కానిస్టేబుల్ అని పరిచయం చేసుకొని దొంగిలించిన బైక్‌ను వదిలేసి అక్కడ నుంచి కొత్త బైక్‌ను తీసుకుని పరారయ్యాడు. అలా వెళ్తూనే మార్గమధ్యలో ఓ కళాశాల విద్యార్థి నుంచి సామ్సంగ్ సెల్‌ఫోన్‌ను దొంగలించుకుపోయినట్టు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. విజయవాడ, బెంగళూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, బిలాస్పూర్, ఖమ్మం పోలీసుస్టేషన్ల పరిధిలో పలు గంజాయి కేసుల్లో నేరం చేసినట్టు...పలువురి నుంచి మోటారుసైకిళ్లు, సెల్ఫోన్లు, పర్సులు దొంగిలించినట్టు శిక్షలు కూడా అనుభవించినట్టు నిందితుడు సివేరి రాము పోలీసుల విచారణలో వివరించాడు. నిందితుడి నుంచి 220 సీసీ పల్సర్‌బైక్, సామ్సంగ్ సెల్‌ఫోన్, నాలుగు కిలోల గంజాయిని ఎస్ఐ అమ్మినాయుడు స్వాధీనం చేసుకున్నారు. ఎస్.కోట సీఐ బి.వెంకటరావు నిందితుడు రామును అరెస్టు చేసి స్థానిక జేఎఫ్‌సీఎం కోర్టు హాజరుపరచగా న్యాయమూర్తి జ్యోతి 14 రోజులు రిమాండ్ విధించినట్టు తెలిపారు. -
పోలీసుల అదుపులో నకిలీ పోలీస్?
ఏలూరు (సెంట్రల్): పోలీసు కానిస్టేబుల్‌గా చెలామణి అవుతూ పేకాట స్థావరాల నుంచి వసూళ్లుకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఓ వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో మొత్తం డొంక అంత కదిలినట్టు తెలిసింది. ఏలూరు ఆర్ఆర్ పేటకు చెందిన సదరు వ్యక్తి నుంచి పోలీసు దుస్తుల్లో దిగిన ఫొటోలు, నకిలీ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సదరు వ్యక్తిని మూడు రోజులుగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్సై, సీఐల తలలో నాలుకలా ఉంటూ.. నిందితుడు గతంలో నగరంలోని ఓ స్టేషన్లో పనిచేసి బదిలీపై వెళ్లిన ఇన్స్పెక్టర్కు తలలో నా లుకలా ఉండేవాడు. ఆ అధికారి జీపులోనే తిరుగుతూ బయటవారికి కానిస్టేబుల్‌గా పరిచయం అయ్యాడు. సదరు అధికారికి మామూళ్లను తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించేవాడని కొందరు పోలీసు సిబ్బంది చెబుతున్నారు. సదరు ఇన్స్పెక్టర్ అక్కడ నుంచి బదిలీ అయిన కొన్ని రోజులకు ఏలూరుకు ఆనుకొని ఉన్న ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ వద్దకు మకాం మార్చాడు. ఆ అధికారి వద్దనే తిరుగుతూ ఆ సర్కిల్ పరిధిలో జరిగే పేకా ట, కోడి పందాల స్థావరాల నుంచి డబ్బులు వ సూళ్లకు పాల్పడేవాడు. ఈ విషయం సదరు అధికారికి తెలియడంతో మందలించి పంపించి వేసినట్టు సమాచారం. వివాహిత ఫిర్యాదుతో కదిలిన డొంక నిందితుడు తాను పోలీసు కానిస్టేబుల్ని అని చెబుతూ ఓ వివాహితతో పరిచయం పెంచుకుని ఆమెను లొంగదీసుకున్నాడు. సదరు వివాహితను కొన్నిరోజులుగా వేధింపులకు గురి చేయడంతో పాటు ఆమెకు సంబంధించిన ఆస్తి పత్రాలపై సం తకాలు చేయించుకోవడంతో ఆమె టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పం దించిన పోలీసులు అతడిని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. నగరంలోని పలువురు పోలీసు సిబ్బందినీ అతడు జిల్లాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ అని బురిడీ కొట్టించినట్టు విచారణలో తేలింది. రాత్రిళ్లు ఓ వ్యక్తి వాహనచోదకుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులతో సదరు వ్యక్తికి దీనికి సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చరణ్.. ఓ నకిలీ పోలీస్
విశాఖ క్రైం, పీఎం పాలెం(భీమిలి): రోడ్డు పక్కన మద్యం తాగేవారు... అబ్బాయిలతో కలిసి ఉండే అమ్మాయిలు... రాత్రి వేళ ఒంటరిగా కనిపించే వారినే లక్ష్యంగా చేసుకుని పోలీస్ ఆఫీసర్ని అని బెదిరిస్తూ దోపిడీకి పాల్పడుతున్న నకిలీ పోలీస్‌ను పీఎం పాలెం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.8లక్షల నగదుతో పాటు రూ.17లక్షల విలువ చేస్తే సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో నగర క్రైం డీసీపీ దామోదర్ బుధవారం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన మరాటీ సృజన కుమార్ అలియాస్ చరణ్(39) దొంగతనాలనే వృత్తిగా చేసుకున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న 12 పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడడంతో కేసులు నమోదయ్యాయి. అక్కడ పోలీస్ కేసులతోపాటు నిఘా పెరగడంతో విశాఖ నగరానికి మకాం మార్చేశాడు. నగర శివారులోని పోతిన మల్లయ్యపాలెం కేంద్రంగా దోపిడీలకు తెగబడ్డాడు. ఇక్కడే ఇల్లు తీసుకుని కుటుంబంతో కలిసి నివసిస్తూ నకిలీ పోలీస్ అవతారమెత్తాడు. రోడ్డు పక్కన మద్యం తాగేవారు, అబ్బాయిలతో కలిసి తిరిగే అమ్మాయిలను భయపించి వారి నుంచి రూ.10వేల నుంచి భారీగా రూ.5లక్షల వరకూ దోచుకునేవాడు. దోచుకున్న నగదుతో విలాసవంతమైన జీవితం గడపడంతోపాటు ఇంటిలోకి అవసరమైన ఆధునిక వస్తువులు కొనుక్కున్నాడు. పెద్దలకు భయపడి కొందరు, పరువు పోతుందని కొందరు ఈ దోపిడీ విషయాలను ఎవరికీ చెప్పకపోవడంతో చరణ్ ఆటలు సాగిపోయాయి. చివరకు ఓ బుల్లెట్ కొనుక్కుని దానిపై పోలీస్ ఆఫీసర్ని అంటూ లోగో స్టిక్కర్ కూడా అంటించాడంటే ఎంతకు తెగించాడో అర్థం చేసుకోవచ్చు. అత్యాశకు పోవడంతో చిక్కాడు జూలై 29న మధురవాడ ఉడా కాలనీ నుంచి వెళ్లే ఐటీ రోడ్డులో ఓ మహిళతో కారులో ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లిన చరణ్ వారిని బెదిరించాడు. తాను పోలీస్ ఆఫీసర్‌ను అని, ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారని గట్టిగా ప్రశ్నించడంతో సదరు జంట బెదిరిపోయారు. వారి మెడలోని బంగారు చైన్ లాక్కున్న తర్వాత... సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి బీరువాలోని నక్లెస్ కూడా లాక్కున్నాడు. అక్కడితో ఆగకుండా మరో రూ.5లక్షల నగదు ఇవ్వాలని బెదిరించడంతో సదరు వ్యక్తి స్నేహితుల నుంచి ఆ రాత్రి వేళ నగదు సమీకరించి చరణ్‌కు అందజేశాడు. జరిగిన ఘటనపై బాధితుడు పీఎం పాలెం పోలీస్‌లను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుని ఆనవాళ్లు, బుల్లెట్ వివరాలు ఆధారంగా నేర విభాగం సిబ్బంది చురుగ్గా స్పందిం చారు. నిందితుడిని గుర్తించిన పోలీసులు నిఘా పెట్టి అనుమానం రాకుండా నార్త్ సబ్ డివిజన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో మంగళవారం సాయంత్రం పోతిన మల్లయ్యపాలెంలో చరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై ఇప్పటికే పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, ఆరిలోవ పీఎస్‌లో రెండు, త్రీ టౌన్ పీఎస్‌లో ఒక కేసు నమోదయ్యాయి. చరణ్ వద్ద నుంచి 6 సెల్ ఫోన్లు, 87.84గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.8.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నిందితుని ఇంటిలోని వాషింగ్ మెషీన్, టీవీ, కూలర్, బుల్లెట్, మరో బైక్, కారు, ç2 కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.17 లక్షలకు పైనే ఉంటుందని నిర్థారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని గుర్తించి ఆధారాలతో అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు రికవరీ చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన పీఎం పాలెం పోలీస్ స్టేసన్ సిబ్బంది పి.చిన్నరాజు, ఎం.శేఖర్, ఎస్ఐ జి.అప్పారావు, నార్త్ జోన్ సీఐలకు నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా తరఫున డీసీపీ దామోదర్ రివార్డులు అందజేసి అభినందించారు. -
డీజీపీ ఆఫీస్‌లో హెడ్ కానిస్టేబుల్‌నంటూ టోకరా!
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్) : నున్న రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. డీజీపీ కార్యాలయంలో తాను హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నానని చెప్పి ఓ ఇంట్లో అద్దెకు దిగి అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల నుంచి ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద సుమారు రూ.4 లక్షలు అప్పులు చేసి ఓ వ్యక్తి పరారైన ఘటన నగరంలో మంగళవారం చర్చనీయాంశంగా మారింది. నున్న రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాయకాపురం ఎల్బీఎస్ నగర్‌లోని ఓ ఇంట్లో ఆర్నెలల క్రితం అశోక్ అనే వ్యక్తి అద్దెకు దిగాడు. తాను డీజీపీ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తానని అందరితో పరిచయం పెంచుకున్నాడు. ప్రతి రోజూ హుందాగా పోలీసుల వలె సఫారీ డ్రస్‌లు ధరించి వస్తూ, వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో తనకు ప్రమోషన్ వచ్చిందని, రెండు నెలలుగా వేతనాలు రావడం లేదని చెప్పి వేగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.1.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. అలానే చుట్టుపక్కల నివసిస్తున్న మరో ఆరుగురి వద్ద ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద దాదాపు రూ.2.50 లక్షల వరకూ అప్పులు చేశాడు. అయితే కొన్ని రోజుల నుంచి అశోక్ ఇంటి వద్దకు రాకుండా ఉండడం, ఫోను పని చేయకపోవడంతో అప్పులు ఇచ్చిన వారంతా ఆయన కోసం విచారణ చేస్తున్నారు. ఎక్కడా అతని ఆచూకీ లభించకపోవడం.. అసలు అతను హెడ్ కానిస్టేబుల్ కాదని తెలియడంతో బాధితులు తాము మోసపోయినట్లు గ్రహించి నున్న రూరల్ పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
నకిలీ మహిళా సీఐ అరెస్ట్
తిరువణ్ణామలై: తండ్రాంబట్టులో నకిలీ మహిళా సీఐను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా తండ్రాంబట్టు పోలీస్ స్టేషన్‌కు సోమవారం రాత్రి ఒక మహిళా సీఐ వచ్చారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసుల వద్ద తాను చెన్నైలో సీఐగా పనిచేస్తున్నా. ఒక కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ పుస్తకాన్ని చూడాలని.. ఆ పుస్తకాన్ని ఇవ్వాలని కోరింది. ఆ సీఐ యూనిఫామ్‌పై పేరులేదు. కాలుకు షూ ధరించలేదు. దీంతో సిబ్బంది అనుమానంతో దండపాణి స్టేషన్ ఎస్ జయచంద్రన్కు సమాచారం అందజేశారు. ఎస్ఐ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఆ నకిలీ పోలీస్ వద్ద విచారణ చేశారు. విచారణలో ఆమె తండ్రాంబట్టు గ్రామానికి చెందిన గంగ(24) అని తెలిసింది. పోలీస్ కావాలన్న ఆశయంతో రెండేళ్ల కిందట జరిగిన పోలీస్ ఎంపికకు జరిగిన రాత పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఉద్యోగం రాలేదు. అవమానమని భావించి ఆరణిలోని పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా చేరానని అందరితో చెప్పా. ఖర్చులకు నగదు అవసరమైతే ఒంటరిగా వస్తున్న వాహనాలను నిలిపి నగదు తీసుకుంటా. తిరువణ్ణామలై నుంచి తండ్రాంబట్టుకు ప్రైవేట్ బస్సులో టికెట్ తీసుకోకుండా వచ్చా. కండక్టర్‌కి అనుమానం రాకుండా బస్సును పోలీస్ స్టేషన్ ఎదుటే ఎక్కి, దిగే దాన్ని’అని తెలిపింది. పోలీసులు గంగను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
‘నకిలీ’ వెనుక అసలు ఎవరు?
నకిలీ పోలీసుల ముసుగులో ఉన్న అసలు వ్యక్తుల కోసం సీసీఎస్ పోలీసులు వేట ప్రారంభించారు. పెదపులిపాక ఘటన నేపథ్యంలో బాధితురాలు చెప్పిన ఆనవాళ్ల మేరకు పోలీసులు నిందితుల ఊహాచిత్రాలు విడుదల చేశారు. విజయవాడ : నగరంలో మళ్లీ నకిలీ పోలీసుల హడావిడి మొదలైంది. నకిలీ పోలీసుల ముసుగులో ఉన్న అసలు వ్యక్తుల కోసం సీసీఎస్ పోలీసులు వేట ప్రారంభించారు. మూడేళ్ల క్రితం నకిలీ పోలీసులు రకరకాల దొంగతనాలు, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. కొద్ది రోజుల క్రితం నగరంలో నకిలీ పోలీసులు భవానీపురం ఏరియాలో తాము ఎస్‌ఐలమని బెదిరించి పట్టుపడ్డారు. వీరిద్దరూ స్థానికంగా ఉండే యువకులు. తాజాగా పెనమలూరు పోలీస్ స్టేషన్ ఏరియాలో పెదపులిపాకలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న ముసునూరు సుజాతమ్మ (70) అనే వృద్ధురాలిని పోలీసులమని బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం ఇద్దరు అగంతకులు ఖాకీ యూనిఫాంతో ఆమె ఇంట్లో ప్రవేశించి సేవ పేరుతో ఆమెను పొగుడుతూ మాటల్లో పెట్టి దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాధితురాలు ఇచ్చిన ఆనవాళ్ల ప్రకారం ఇద్దరి నిందితులలో ఒకరి ఊహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. ఈ ఊహాచిత్రంతో పోలీసులు పాత రికార్డులు తిరగేస్తున్నారు. ఇద్దరు పాత నేరస్తులు జైలు నుంచి విడుదలై ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన కొందరు పాత నేరస్తులు ఈ తరహా నేరాలకు పాల్పడుతుంటారని వారు అనుమానిస్తున్నారు. కాగా ఊహాచిత్రంతో పోలి ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే, వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పోలీస్ కంట్రోల్ రూం డయల్ – 100, పెనమలూరు ఇన్స్పెక్టర్ 9490619468, సెంట్రల్ జోన్ ఏసీపీ 9440627035కు సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు కోరారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనర్ డి. గౌతం సవాంగ్ హెచ్చరించారు. తమ ప్రాంతాల్లో అనుమానితులు, అపరిచితుల సంచారం గమనించిన వెంటనే పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. -
పెదపులిపాకలో నకిలీ ఖాకీల హల్చల్
పెనమలూరు : మండలంలోని పెదపులిపాక గ్రామంలో నకిలీ పోలీసులు హల్చల్ చేశారు. తాము పోలీసులమని, నైట్ బీట్‌లో వచ్చామని, తాగటానికి మంచినీళ్లు అడిగి ఓ వృద్ధురాలిని నమ్మించి ఇంట్లోకి ప్రవేశించి ఆమెను బంధించి బంగారు ఆభరణాలు చోరీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. పెదపులిపాకలో ముసునూరు సుజాత (70) తన ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆమె కుమారుడు విశ్వేశ్వరరావు అమెరికాలో ఉంటాడు. శనివారం రాత్రి 11 గంటలకు ఇద్దరు వ్యక్తులు పోలీసు దుçస్తులు ధరించి ఆమె ఇంటికి వచ్చారు. ఆమెను పిలిచి మామ్మ గారు బాగున్నారా అని అడిగారు. తాము పెనమలూరు పోలీసులమని, కరకట్టపై రాత్రి డ్యూటీకి వచ్చామని చెప్పారు. గత పుష్కరాల్లో మీతో పరిచయమైందని, పలకరించి వెళదామని వచ్చామని నమ్మించారు. తాగటానికి నీళ్లు ఇవ్వమని అడిగారు. దీంతో ఆమె తలుపులు తీసింది. వచ్చిన ఇద్దరు వ్యక్తులు నీళ్లు తాగి కొద్ది సమయం టీవీ చూస్తామని కూర్చున్నారు. అర గంట తర్వాత వృద్ధురాలు తనుకు నిద్ర వస్తోందని చెప్పింది. దీంతో ఇద్దరు వ్యక్తులు వెళ్లిపోవటానికి లేచి వెళ్లినట్లు వెళ్లి హఠాత్తుగా తలుపు మూశారు. ఆమెను ప్యాకింగ్‌కు ఉపయోగించే ప్లాస్టర్‌తో బంధించి ఇంట్లో సొమ్ము ఉంటే ఇవ్వాలని బెదిరించారు. తన వద్ద సొమ్ము లేదని, తనను ఏమీ చేయవద్దని వృద్ధురాలు ప్రాధేయపడింది. దీంతో వారు ఆమె ఒంటిపై ఉన్న 12 కాసుల బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్లిపోయారు. ఆమె వద్ద ఉన్న ఫోన్‌తో బంధువులకు ఘటనపై సమాచారం ఇచ్చింది. దీంతో వారు వచ్చి ఆమెను బంధ విముక్తి చేశారు. పోలీసుల హడావుడి.. సమాచారం తెలుసుకున్న పోలీసు అధికారులు అర్థరాత్రి పెదపులిపాక వచ్చారు. జరిగిన ఘటనపై వివరాలు సేకరించారు. క్లూస్ టీం సభ్యులు వేలిముద్రలు సేకరించారు. దొంగలు ఖాకీ దుస్తుల్లో వచ్చి ఈ విధంగా చోరీ చేయటంతో పోలీసుల్లో కలకలం రేగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఫేక్ పోలీస్!
ఒంటరి మహిళల లక్ష్యంగా నగలు దోచుకెళ్తున్న దుండగులు పంథా మార్చారు. పోలీసుల్లా తనిఖీలు చేపడుతున్నట్లు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు నటిస్తూ ఒంటరిగా వెళ్లే మహిళలు, వృద్ధుల వద్ద నగలు దోచుకెళ్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. నకిలీ పోలీసుల దోపిడీ ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నా.. అసలు పోలీసులు దృష్టి సారించకపోవడంతో వారు చెలరేగిపోతున్నారు. పట్టణంలో నెల వ్యవధిలో నకిలీ పోలీసులు ఇద్దరు మహిళలను ఏమార్చి 18 సవర్ల నగలు దోచుకెళ్లారు. గూడూరు: పథకం ప్రకారం సినీ ఫక్కీలో ఇద్దరు..ముగ్గురు వ్యక్తుల ముఠా జన సంచారం తక్కువగా ఉండ ప్రాంతాలను ఎంచుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. పోలీసుల్లా నటిస్తూ నగలు దండిగా వేసుకుని వెళ్లే ఒంటరి మహిళను లక్ష్యంగా చేసుకుని నగలు దోచుకెళ్తున్నారు. డక్కిలి మండలం దగ్గవోలు గ్రామానికి చెందిన ఇస్కపల్లి వసంతమ్మ అనే అంగనవాడీ కార్యకర్త స్టేట్ బ్యాంక్‌లో పనిమీద ఈ ఏడాది మార్చి 13వ తేదీన గూడూరుకు వచ్చింది. తన పని పూర్తయ్యాక ఆమె తిరిగి పాత బస్టాండ్‌కు నడుచుకుంటూ వస్తుండగా, రైల్వేస్టేషన్ దాటిన తర్వాత ముత్యాలపేట మలుపు సమీపంలో ఓ వ్యక్తి ఏమ్మా.. నిన్ను పోలీస్ సార్ పిలుస్తున్నాడు.. లెక్కలేకుండా వెళ్తున్నావే అని కేకేసి చెప్పాడు. దీంతో వెనుదిరిగి చూసిన వసంతమ్మ ఏంటని ప్రశ్నించగా పోలీస్ సార్ పిలుస్తున్నారమ్మా అంటూ బాగా పొడుగ్గా బుర్ర మీసాలతో నుదుటన బొట్టు పెట్టుకుని ఉన్న ఓ వ్యక్తిని చూపించాడు. ఆయన వాలకం చూసిన వసంతమ్మ ఆయన్ను పోలీసే అనుకుంది. అంతలోనే ఆ డ్రామాలో రెండో పాత్ర పోషిస్తున్న మరో (దొంగ) వ్యక్తి మెడలో చైను, ఉంగరాలతో అటుగా వెళ్తున్నాడు. అతన్ని ఆపి పోలీస్‌లా నటిస్తున్న వ్యక్తి ఏంరా మెడలో చైన్, ఉంగరాలు వేసుకుని భయం లేకుండా తిరుగుతున్నావే.. ఎవడోకడు కొట్టి నీ ఒంటి మీద ఉన్నవి మొత్తం గొరిగేస్తారు.. తీసి జాగ్రత్తగా దాచుకో అంటూ హెచ్చరించాడు. దీంతో ఆ వ్యక్తి అలాగే సార్.. అంటూ భయాన్ని నటిస్తూ తన మెడలోని చైన్‌తో పాటు, ఉంగరాలు కూడా తీసి కాగితంలో పొట్లాం కట్టి తన జేబులో వేసుకుని వెళ్లిపోయాడు. అది చూసిన వసంతమ్మ ఆయన నిజమైన పోలీసే అనుకుంది. ఇదే అదనుగా పోలీస్‌లా ప్రవర్తిస్తున్న వ్యక్తి ఆ బంగారం తీసివ్వమ్మా అని చెప్పడంతో వసంతమ్మ తన మెడలో ఉన్న నాలుగన్నర సవర్ల బంగారు సరుడుతో పాటు, 4 సవర్ల రెండు గాజులు, ఒకటన్నర సవర్ల రెండు ఉంగరాలు తీసి ఆయన చేతికిచ్చింది. ఆయన తన వద్ద ఉన్న కాగితంలో ఆ బంగారు ఆభరణాలను చుట్టి, వాటిని ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో వేసే క్రమంలో ఆమె కళ్లు కప్పి వాటికి బదులుగా రాళ్లు ఉంచిన పొట్లాన్ని ఆమె బ్యాగులో వేశాడు. వసంతమ్మ పాత బస్టాండ్ వద్దకు చేరుకుని తన ఊరికెళ్లే బస్సులో ఎక్కి బ్యాగులో చూసుకోగా అందులో ఆ ప్యాకెట్ ఏమీ కనిపించలేదు. దీంతో తాను మోసపోయానని లబోదిబో మంటూ ముత్యాలపేట అంతా గాలించింది. చివరికి 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తాజాగా అదే తరహాలో స్థానిక ఐసీఎస్ రోడ్డు ప్రాంతంలోని మైథిలి ఆస్పత్రి కూడలి ప్రాంతం వద్ద శనివారం మధ్యాహ్నం వృద్ధురాలి వద్ద నుంచి ఎనిమిది సవర్లు నగలు కాజేసిన విషయం తెలిసిందే. వాములమిట్ట ప్రాంతానికి చెందిన దువ్వూరు ఈశ్వరమ్మ అనే వృద్ధ మహిళ మార్కెట్ ఇంటికి వెళ్తున్న క్రమంలో ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు సార్ పిలుస్తారమ్మా అనడంతో ఆమె వెనక్కు తిరిగి చూడగా, అక్కడున్న వ్యక్తి పోలీస్‌లా వ్యవహరించి. ఏమ్మా గొంతులు కోసి నగలు దోచుకెళ్లే వారు తిరుగుతుంటే బంగారం వేసుకుని ఒంటరిగా వెళుతున్నావే.. భయం లేదా అంటూనే అవి తీసి ఈ కాగితంలో పొట్లాం కట్టుకుని వెళ్లు అని చెప్పాడు. ఇలా ఆమె వద్ద నుంచి నగలు తీసుకుని పొట్లాం కట్టి ఇస్తామని తీసుకుని రాళ్లున్న పొట్లాం ఇచ్చి పంపారు. కొంచెం దూరం వెళ్లి పొట్లాం విప్పి చూసుకుని మోసపోయినట్లు గ్రహించిన ఈశ్వరమ్మ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
పోలీసు పేరుతో వరుస చోరీలు
తణుకు : పోలీసు శాఖలో పని చేసిన అనుభవం... హోంగార్డుగా కొన్నేళ్ల పాటు పని చేసిన అతడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు... దీంతో ఉద్యోగం నుంచి బయటకు వచ్చి విద్యార్థులు, ఒంటరిగా ఉన్న యువకులను బెదిరించి వారి నుంచి బంగారు ఆభరణాలను అపహరించుకుపోవడమే ప్రవృత్తిగా మరల్చుకున్నాడు. విజయవాడ గాంధీనగర్‌కు చెందిన కాళిదాసు విజయకృష్ణ 2004 వరకు హోంగార్డుగా పని చేసి మానేశాడు. అనంతరం సెక్యూరిటీగా పని చేశాడు. ఆ సమయంలో ఒక యువతిని మోసం చేసి పెళ్లి చేసుకున్న ఘటనలో అతడిపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఈ కేసులో జైలుశిక్ష అనుభవించి 2010లో పలు చోరీలకు పాల్పడి మరోసారి జైలుకు వెళ్లాడు. 2016లో జైలు నుంచి బయటకు వచ్చిన అతడు ఏలూరులో మరో మహిళను వివాహం చేసుకుని జీవిస్తున్నాడు. ఈ క్రమంలో కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వారి నుంచి చాకచక్యంగా బంగారు ఆభరణాలను అపహరించుకుపోతున్నాడు. ఇలా తణుకు, భీమవరం, వీరవాసరం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో పలు నేరాలకు పాల్పడిన అతడిని మంగళవారం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.2 లక్షలు విలువైన 84 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కేఏ స్వామి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
నకిలీ పోలీసు అరెస్టు
ఆదిలాబాద్ రూరల్: పోలీసు అధికారిగా చెబుతూ ఆదిలాబాద్ ప్రాంతంలో చెలామణీ అవుతున్న నకిలీ పోలీసును జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నర్సింహారెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారిగా చెబుతూ మోసానికి పాల్పడుతున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన రంగస్వామి కన్నన్ గోపాలకృష్ణన్‌ను పట్టణంలోని ఎన్టీఆర్‌చౌక్‌లో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన గత పది సంవత్సరాల క్రితం ఆదిలాబాద్‌లో నివాసం ఉండి ఈ మధ్యనే వెళ్లిపోయినట్లు తెలిపారు. గత వారం రోజుల నుంచి పట్టణంలోని ఓ లాడ్జిలో ఉంటూ ఉన్నత పోలీసు అధికారిగా చెలామణీ అవుతూ ఆదిలాబాద్ రైల్వే పోలీసుల వద్ద బెదిరించి రూ.2వేలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. 15 రోజుల కిందట రామగుండం రైల్వే పోలీసు అధికారితో డీఎస్పీగా పరిచయం చేసుకొని అనంతరం రైల్వే పోలీసులు విధులు సక్రమంగా నిర్వహించడం లేదని, రూ.2వేలు అవసరం ఉందని నగదు తీసుకున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో రైల్వే పోలీసులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు వారి వద్ద నుంచి వాకిటాకీ (మ్యాన్ ప్యాక్) దొంగిలించినట్లు వివరించారు. ఇలా పలు నేరాలు చేస్తూ ఆదిలాబాద్‌లో నకిలీ పోలీసు అధికారిగా చెలామణీ అయిన రంగస్వామిని ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ ఆదేశాల మేరకు వన్‌టౌన్ సీఐ సురేశ్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఆయన నుంచి మ్యాన్‌ప్యాక్, గ్రీన్ పెన్, పోలీసు బెల్ట్, లాఠీ, రెండు సెల్ఫోన్లు, డైరీ, ఆధార్ కార్డు, పోలీసు విజిల్, తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నకిలీ పోలీసుగా చెలామణీ అవుతూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే 83339 86898 నెంబర్‌కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. సమావేశంలో వన్‌టౌన్ సీఐ సురేశ్, ఎస్సైలు బి.అనిల్, ఎల్వి రమణారావు, ఐడీ పార్టీ పోలీసులు రమణ, రాంరెడ్డి, రాహత్, ఎంఏ కరీం ఉన్నారు. -
ఏసీపీ, డీసీపీ, కమిషనర్ ఆఫ్ పోలీస్.. అన్నీ అతడే!
ఇన్స్పెక్టర్..ఏసీపీ...డీసీపీ.. కమిషనర్ ఆఫ్ పోలీస్ అన్నీ అతడే...కనిపించని నాలుగో సింహం అవతారమెత్తి ఎందరినో బురిడీ కొట్టించాడు. పోలీస్ కావాలనే తన కోరికకు సూడో ముద్ర వేసుకుని వీళ్లూ..వాళ్లూ అనే తేడా లేకుండా దోచుకున్నాడు కాచిగూడకు చెందిన రాఘవేంద్ర సత్యపాల్. చివరకు పోలీసులకు చిక్కాడు. సాక్షి, సిటీబ్యూరో: ఓసారి సీసీఎస్ ఇన్స్పెక్టర్... మరోసారి సూర్యాపేట ఏసీపీ... ఇంకోసారి పోలీసు హెడ్–క్వార్టర్స్ డీసీపీ... అవసరమైనప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్... ఇదేదో సినిమాలో క్యారెక్టర్ అనుకుంటున్నారా..? కానే కాదు. కాచిగూడకు చెందిన ఓ సూడో పోలీసు అవతారాలు. ఈ ముసుగులో బంధువులు, స్నేహితుల్ని మోసం చేయడమే కాకుండా టోల్‌ప్లాజాలు, దేవాలయాల నిర్వాహకులనూ బురిడీ కొట్టించాడు. తన కార్లకే కాదు.... చివరకు యాక్టివాకు కూడా పోలీసు స్టిక్కర్, సైరన్లు పెట్టి అధికారులకే మతిపోగొట్టాడు. ఈ సూడో పోలీసును మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. డిపార్ట్మెంట్లో చేరాలనే కోరిక తీరని ఇతగాడు పలు అవతారాలు ఎత్తినట్లు వివరించారు. రెండుసార్లు కానిస్టేబుల్ పరీక్షకు హాజరై... కాచిగూడ టూరిస్ట్ హోటల్ సమీపంలోని ఎంజే టవర్స్‌కు చెందిన రాఘవేంద్ర సత్యపాల్ జౌర్ఖర్కు చిన్నప్పటి నుంచి పోలీసు విభాగంలో చేరాలనే కోరిక బలంగా ఉండేది. 1990, 1992లో కానిస్టేబుల్ పరీక్షకు హాజరైన విజయం సాధించలేదు. తనకు డిపార్ట్‌మెంట్‌పై ఉన్న మోజుతో 2004లో కాచిగూడ ఠాణా మైత్రి సంఘం సభ్యుడిగా చేరి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇదే అతడికి పోలీసు విభాగాన్ని పూర్తిస్థాయిలో పరిచయం చేసింది. దీంతో తానే పోలీసు అధికారి అవతారం ఎత్తాలని పథకం వేశాడు. కవాడిగూడకు చెందిన ఓ టైలర్ వద్ద మూడు యూనిఫామ్స్ కుట్టించుకుని ఓ దానికి ఎస్పీ ర్యాంకు, మరోదానికి డీఎస్పీ హోదా, ఇంకోదానికి ఇన్స్పెక్టర్కు ఉండే బ్యాడ్జీలు తగిలించుకున్నాడు. తరచూ తాను నివసించే చోట ఈ యూనిఫామ్స్ ధరించి తిరగడంతో పాటు ఒక్కో సందర్భంలో ఒక్కో హోదాను, పోస్టింగ్‌ను చెప్పేవాడు. ఎక్కడిక్కడ ఉన్నతాధికారుల పేర్లు చెప్పి... ఈ సూడో పోలీసులు ఏదైనా పని మీదో, వస్తువులు ఖరీదు చేయడానికో, వాహనాలను మరమ్మతులు చేయించుకోవడానికో వెళ్ళినప్పుడు పెద్ద బిల్డప్ ఇచ్చేవాడు. ఆయా దుకాణాల యజమానులు, మెకానిక్స్‌కు పోలీసు అధికారిగా పరిచయం కావడంతో పాటు ఇప్పుడే ఫలానా ఉన్నతాధికారి వద్దకు వెళ్ళి వస్తున్నానని, ఏవైనా పని ఉంటే సెక్రటేరియేట్‌లోని తన కార్యాలయానికి రావాలని చెప్పేవాడు. ఇది నమ్మిన ఎవరైనా సచివాలయానికి వెళ్ళి ఇతగాడికి ఫోన్ చేస్తే తాను క్యాంప్‌లో ఉన్నానంటూ తప్పిం చుకునేవాడు. ఈ తరహాలో రెచ్చిపోతున్న రాఘవేంద్ర వ్యవహారంపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావుకు సమాచారం అందడంతో అత డిని వలపన్ని పట్టుకున్నారు. మూడు వాహనా లు, నాలుగు బోగస్ గుర్తింపుకార్డులు, బుగ్గ బ ల్బులు, పోలీసు యూనిఫామ్స్ తదితరాలు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని కాచిగూడ పోలీసులకు అప్పగించారు. నాలుగు గుర్తింపుకార్డులు.. రాఘవేంద్ర ఇంటర్నెట్ నుంచి సేకరించిన నమూనాలను వినియోగించి తన కంప్యూటర్ పైనే నాలుగు గుర్తింపు కార్డులు తయారు చేసుకున్నాడు. ఆర్ఎస్ జౌర్ఖర్, ఐపీఎస్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు, హోమ్ డిపార్ట్మెంట్, ఏపీ సెక్రటేరియేట్, హైదరాబాద్... ఆర్ఎస్ జౌర్ఖర్, ఐపీఎస్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు పోలీసు హెడ్–క్వార్టర్స్ హైదరాబాద్, తెలంగాణ... అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు... సీసీఎస్ ఇన్స్పెక్టర్ హోదాలతో వీటిని రూపొందించుకున్నాడు. తన కారుతో పాటు రెండు బైక్‌లపైనా పోలీసు, గవర్నమెంట్ వెహికిల్ అని రాయించుకోవడంతో పాటు కారుకు యాక్టివా వాహనానికీ పోలీసు సైరన్లు బిగించుకున్నాడు. కారులో తిరుగుతున్న సమయంలో టోల్ ప్లాజాలకు డబ్బులు ఎగ్గొట్టడంతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక దేవాలయాల్లో తన బోగస్ గుర్తింపుకార్డులు చూపించి రాచమర్యాదలు పొందాడు. స్థానికులకు సూర్యాపేట ఏసీపీగా... కాచిగూడలోని తన ఇంటి పరిసరాల్లో సూర్యాపేట ఏసీపీగా చెప్పుకుంటూ చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసేవాడు. తన ఇంటి గోడపై ‘చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (బ్లాక్ క్యాట్ కమాండో), టీఎస్ రెసిడెన్సీ అని రాయడంతో పాటు ఏకంగా తాను నివసించే ఫ్లోర్లోకే ఇతరులెవరూ ప్రవేశించకూడదంటూ పేర్కొ న్నాడు. దీన్ని చూసిన స్థానికులు భయపడుతుండగా... సంబంధం లేని హోదా లు, డిపార్ట్మెంట్స్ కలయిక చూసిన పోలీసులు అవాక్కయ్యారు. రాఘవేంద్ర జగదీష్ మార్కెట్లో వివిధ రకాలైన వస్తువులకు ఖరీదు చేయడానికి వెళ్ళినప్పుడు డీసీపీగా ‘మారిపోయి’ రాయితీలు, కానుకలు పొందేవాడు. తన కారుపై ఏకంగా ఎర్రరంగు బుగ్గబల్బు బిగించుకున్నాడు. గత నెలలో ఘట్కేసర్లోని శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి టోకరా వేశాడు. తాను స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన డీసీపీగా పరిచయం చేసుకుని నెలకు రూ.40 వేల జీతానికి సెక్యూరిటీ అధికారి ఉద్యోగం పొందాడు. -
భార్య ఫిర్యాదుతో భర్త బాగోతం బట్టబయలు
బెంగళూరు: కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నానని ఓ యువతిని నమ్మించి వివాహం చేసుకున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మైసూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. పరసయ్యహుండి గ్రామానికి చెందిన శివమూర్తి అనే యువకుడు నగరానికి చెందిన దేవిక అనే యువతిని పరిచయం చేసుకొన్నాడు. తాను డీఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నానంటూ ఆమెను నమ్మించి వివాహం చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత తాను సిద్ధం చేసుకున్న నకిలీ ఐడీ కార్డు, యూనిఫాంతో విధులకు వెళ్తున్నట్లు నటించేవాడు. అదే విధంగా ఇతరుల వద్ద కూడా తనను తాను పోలీస్ కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకొని రూ. 2 కోట్ల మేరకు అప్పులు చేశాడు. పెళ్లై ఇంత కాలమైనా తాను ఏ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నది చెప్పకపోవడంతో అనుమానం వచ్చిన దేవిక, భర్త ఉద్యోగం గురించి వాకబు చేయగా మోసం చేశాడని తేలింది. భర్తపై మైసూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం శివమూర్తిని అరెస్ట్ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. -
వీడికి జైలు.. అత్తారిల్లే !
- 60 కేసుల్లో నిందితుడు - 11 సార్లు అరెస్ట్, బెయిల్‌పై విడుదల - ప్రేమ జంటలు కనిపిస్తే పండుగే - పోలీసునంటు బెదిరించి నగలు, సొమ్ము దోపిడీ - నకిలీ పోలీసు నాగేంద్ర మళ్లీ దొరికాడు - 24 తులాల బంగారు ఆభరణాలు రికవరీ పోలీసు అంటే వీడేరా.. అనే విధంగా హేర్ కటింగ్.. నాజూకైన మీసాలు.. మఫ్టీ పోలీసు తరహాలో టీషర్టు, జీన్స్‌ఫ్యాంటు ధరించి ఉదయం, సాయంత్రం వేళల్లో నగర శివారుల్లో సంచరిస్తుంటాడు. మాటు వేసి ప్రేమ జంటల కోసం గంటల తరబడి నిరీక్షిస్తాడు. తాను మఫ్టీ పోలీసునంటూ ప్రేమ జంటలను బెదిరించి, వారి వద్ద ఉన్న నగదు, నగలు, సెల్ఫోన్లు లాక్కొని ఉడాయిస్తుంటాడు. అతడెవరో ఇప్పటికే గర్తొచ్చుంటుంది. కర్నూలు నగర శివారుల్లోని ముజఫర్‌నగర్‌లో నివాసం ఉంటున్న గొర్లగుట్ట నాగేంద్రకుమార్. దాదాపు 60 కేసుల్లో ఇతను నిందితుడు. అత్తారింటికి వెళ్లినంత సులువుగా జైలుకెళ్లి బెయిల్‌పై రావడం.. మళ్లీ నేరాలకు పాల్పడటం వీడి నైజం. 11సార్లు పట్టుబడి జైలుకెళ్లినా మారలేదు. బెయిల్‌పై బయటకు వచ్చి తన పంథాను మార్చుకోలేదు. దోపీడీ సొమ్మును అమ్ముతుండగా పోలీసులు మళ్లీ పట్టుకున్నారు. - కర్నూలు బేతంచెర్ల మండలం గొర్లగుట్ట గ్రామానికి చెందిన నాగేంద్రకుమార్ చిన్నప్పటి నుంచే నేరాల బాటపట్టాడు. జైలులో పరిచయమైన కొందరి దొంగలతో జతకట్టి బేతంచెర్ల, డోన్, వెల్దుర్తి, కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్, నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిల్లో ఇటీవల ఇళ్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. బేతంచెర్ల సీఐ కంబగిరిరాముడు, ఎస్ఐ తిరుపాలు నేతృత్వంలో నాగేంద్రకుమార్‌ను అనుమానంపై అదుపులోకి తీసుకొని విచారించగా నేరాల చిట్ట బయటపడింది. దాదాపు రూ.8.35 లక్షల బంగారు ఆభరణాలను దోపిడీ చేయగా, రూ.6.70 లక్షల విలువగల 24 తులాల బంగారు నగలను అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకొని శుక్రవారం ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలను వెల్లడించారు. కర్నూలు శివారుల్లోని జగన్నాథగట్టు, వెంగన్నబావి, వెంకటరమణకాలనీ పంప్‌హౌస్, పుల్లారెడ్డి కాలేజి, సఫా కాలేజ్ పరిసర ప్రాంతాల్లో అనేక నేరాలకు పాల్పడ్డాడు. ప్రేమ జంటలు కనిపించగానే తాను పోలీసునని చెప్పి డబ్బులు, ఆ భరణాలు దోచుకుంటాడు. ఈ విధమైన నేరాల్లో అనేక సార్లు జైలుకు వెళ్లినా అతనిలో మార్పు రాలేదు. జైలులో పరిచయమైన అనంతపురం వాసులు జొన్నగడ్డల ప్రభాకర్, గంగాధర్‌తో ముఠాగా ఏర్పడి బేతంచెర్ల, గొర్లగుట్ట ప్రాంతాల్లో 2016 డిసెంబరు, 2017 జనవరి, మార్చి మాసాల్లో ఇళ్ల దొంగతనాలకు పాల్పడ్డారు. ఇతని వాటా కింద వచ్చిన దోపిడి సొమ్మును డోన్‌లో విక్రయిస్తుండగా, పక్కా సమాచారం మేరకు పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఇతనిపై నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్, తాలుకా పోలీస్ స్టేషన్లో ఇంకా పలు కేసులు ఉన్నాయి. వాయిదాల ప్రకారం కోర్టుకు హాజరవుతుంటాడు. ఇతనితో జతకట్టి చోరీలకు పాల్పడిన అనంతపురం వాసులు జొన్నలగడ్డ ప్రభాకర్, గంగాధర్‌ల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని, త్వరలో వారిని కూడా అరెస్టు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి భారీ మొత్తంలో సొమ్మును రికవరీ చేసినందుకు బేతంచెర్ల హెడ్ కానిస్టేబుళ్లు గోవిందనాయక్, వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు పెద్దయ్య, శ్రీనివాసులు, నందునాయక్, రామలక్ష్మణ్ తదితరులను ఎస్పీ అభినందించారు. -
రేణిగుంటలో నకిలీ పోలీసుల అరెస్ట్
-
పెద్ద నోట్ల మార్పిడి పేరిట మోసం
►ఐదుగురు నిందితుల అరెస్టు ►రూ.23.50 లక్షలు కాజేసిన వైనం ►రూ.9 లక్షల నగదు స్వాధీనం చిత్తూరు (అర్బన్): పెద్ద నోట్ల రద్దు సమయంలో పాత నోట్లు తీసుకుంటామని పలువురిని మోసం చేసి నగదు పారిపోయిన అంతర్రాష్ట్ర ముఠాను చిత్తూరు పశ్చిమ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుల్లో పుత్తూరుకు చెందిన కోదండరాజు (40), కర్ణాటకలోని కేజీఎఫ్‌కు చెందిన అశ్వర్థనారాయణ (45), బంగారుపేటకు చెందిన ప్రభాకర్ (48), వినోద్ (30), చిన్నరాజ (45) ఉన్నారు. మంగళవారం డీఎస్పీ లక్ష్మీనాయుడు, సీఐ ఎం.ఆదినారాయణ ఈ వివరాలను వెల్లడించారు. చిత్తూరులోని మిట్టూరుకు చెందిన శేఖర్ నాయుడు, కాణిపాకానికి చెందిన రఫి స్నేహితులు. వీళ్లకు ఈ ఏడాది జనవరిలో ఓ ఫోన్‌కాల్ వచ్చింది. రద్దు చేసిన రూ.500, రూ.1000 వెయ్యి నోట్లు తమ వద్ద రూ.17 లక్షల వరకు ఉన్నాయని, వీటిని తీసుకుని కొత్త నోట్ల రూపంలో రూ.9 లక్షలు ఇవ్వాలని బేరం కుదుర్చుకున్నారు. నమ్మకం కలిగించేందుకు హైదరాబాద్‌కు చెందిన మధ్యవర్తి రాణి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు సాయిచరణ్‌ను చిత్తూరుకు పంపించారు. శేఖర్‌నాయుడు, రఫి రూ.9 లక్షలు సిద్ధం చేసుకుని జనవరి 4న కాణిపాకం ఆలయ శివారు వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడున్న రాణి, ఆమె కుమారుడు పాత నోట్ల తీసుకురావాలని ఫోన్ చేయడం.. హఠాత్తుగా ఐదుగురు వ్యక్తులు ఓ కారులోంచి దిగి, తాము పోలీసులమని చెప్పి శేఖర్, రఫి వద్ద ఉన్న రూ.9 లక్షలు లాక్కున్నారు. స్టేషన్‌కు వచ్చి వివరాలు చెప్పి నగదు తీసుకెళ్లాలని చెప్పి వెళ్లిపోయారు. బాధితులు తేరుకుని వచ్చింది నకిలీ పోలీసులని గుర్తించి కాణిపాకం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన చిత్తూరు పశ్చిమ సీఐ ఆదినారాయణ.. ఘటనలో సంబంధమున్న రాణి, సాయిచరణ్‌లను అప్పట్లో అరెస్టు చేశారు. మిగిలిన నిందితులను పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. తాజాగా కాణిపాకం రోడ్డులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రూ.9 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం పది మందిలో ఏడుగురిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. పలు చోట్ల మోసాలు : నిందితులు ఇదే తరహాలో కుప్పంలో ఓ వ్యక్తి నుంచి రూ.2.5 లక్షలు, తిరుపతి ఎంఆర్.పల్లెలో రూ.5 లక్షలు, చిత్తూరులోని బాన్స్ సమీపంలో రూ.7 లక్షలు మోసం చేసి కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ మూడు ఘటనలపై ఎక్కడా బాధితులు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం! కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన కాణిపాకం ఎస్ఐ నరేష్‌బాబు, సిబ్బంది శివ, వినోద్, రమేష్, సీపీవోలు సోమేష్, దుర్గ తదితరులకు డీఎస్పీ, సీఐలు నగదు రివార్డులను అందచేశారు. -
దొంగ పోలీసు అడ్డంగా బుక్కయ్యాడు!
హైదరాబాద్ సిటీ: నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా ఉన్న మహిళల వద్ద నుంచి డబ్బులు, నగలు దోచుకుంటున్న ఓ నకిలీ పోలీసు (సూడో పోలీసు) ఆటకట్టించారు. మంగలే సుభాష్ మిట్టల్ అనే పాత నేరస్తుడు గతంలో ఎన్నో చోరీలకు పాల్పడ్డాడు. అయితే ఈ మధ్యకాలంలో ఆ దొంగ.. ఏకంగా పోలీసు అవతారం ఎత్తాడు. నేర ప్రవృత్తికి అలవాడు పడ్డ సుభాష్ మిట్టల్.. గత కొన్ని రోజులుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలు, వృద్ధులను టార్గెట్ చేసుకున్నాడు. పోలీస్‌నంటూ చెప్పి ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధులను బెదిరించేవాడు. ఆపై తనిఖీల పేరుతో వారి వద్ద నుంచి డబ్బులు, బంగారాన్ని దోచుకొని క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యేవాడు. ఈ క్రమంలో చోరీ చేసి పారిపోతుండగా మాదాపూర్ పోలీసులు ఆ దొంగ పోలీసును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రెండు బంగారు ఉంగరాలు, ఒక బంగారు గొలుసు, 15 తులాల వెండి పట్టాల గొలుసులు, రూ.23 వేల నగదు, ఒక బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడు సుభాష్ మిట్టల్‌ను రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
దొంగ పోలీసు అడ్డంగా బుక్కయ్యాడు!
-
గోదావరిఖనిలో నకిలీ పోలీస్ అరెస్ట్
బొమ్మ తుపాకీ, పోలీస్ డ్రెస్, నకిలీ ఐడీ కార్డు స్వాధీనం గోదావరిఖని: మద్యం తాగి బిల్లు అడిగిన బార్ యజమానిని తుపాకీ చూపించి పోలీస్ అధికారినంటూ బెదిరించిన కేసులో ఓ నకిలీ పోలీసును గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. మంథని ప్రాంతానికి చెందిన వేగోళపు శ్రీధర్‌గౌడ్ హైదరాబాద్‌లోని ఫార్మ్డ్ లిమిటెడ్ కంపెనీకి నాచారం ఏరియా మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. 2006 నుంచి 2010 వరకు సబ్ ఇన్స్పెక్టర్ కావాలని పరీక్షలకు హాజరైనా అర్హత సాధించలేదు. అరుుతే బంధువులకు, స్నేహితులకు తాను ఎస్సైనని, హైదరాబాద్‌లో పనిచేస్తున్నానని నమ్మించాడు. ఇందుకోసం నకిలీ ఐడీ కార్డు తయారు చేరుుంచుకుని పోలీస్ సిరీస్ వచ్చేలా సెల్ నంబర్ కూడా సంపాదిం చాడు. పోలీస్ యూనిఫాంను కుట్టించుకుని బొమ్మ తుపాకీ(లైటర్)ని కొనుగోలు చేసి అందరిని నమ్మించాడు. ఈ నెల 24న సాయంత్రం గోదావరిఖనిలోని హైకింగ్ బార్ అండ్ రెస్టారెంట్లో శ్రీధర్‌గౌడ్‌తో పాటు అతని స్నేహితులు మద్యం తాగగా.. రూ.4,175 బిల్లు అరుుంది. బార్ యజమాని బొల్గం సురేశ్‌గౌడ్ బిల్లు చెల్లించాలని కోరగా.. ‘తాను కరీంనగర్ క్రైం బ్రాంచ్ డీఎస్పీనని, నన్నే డబ్బులు అడుగుతావా’ అంటూ బొమ్మ తుపాకీని గురిపెట్టి చంపుతానని బెదిరించాడు. బార్లో ఉన్న మరో మద్యం బాటిల్‌తో ఉడారుుంచాడు. సురేశ్‌గౌడ్ ఫిర్యాదు చేయడంతో ఆదివారం నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి కారు, బొమ్మ తుపాకీ, పోలీసుడ్రస్ను స్వాధీనం చేసుకున్నారు. -
గోదావరిఖనిలో నకిలీ పోలీస్ అరెస్ట్
-
పోలీసులమంటూ రూ.50లక్షలు ఎత్తుకెళ్లారు..
-
పోలీసులమని రూ. 1.40 లక్షలతో ఉడాయింపు
నాగోలు: నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని పోలీసులమని బెదిరించి బ్యాగులో ఉన్న రూ.1.40 లక్షలు కాజేసిన ఘటన ఎల్బీనగర్ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.... నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన డీ.శ్రీనివాస్ (44) అదే ప్రాంతానికి చెందిన కోళ్ల దాణా వ్యాపారి నరేందర్ వద్ద గుమాస్తా. మంగళవారం మధ్యాహ్నం నగరానికి వచ్చి వివిధ ప్రాంతాల్లోని వ్యాపారుల నుంచి దాదాపు రూ.3 లక్షలు వసూలు చేశాడు. అనంతరం దేవరకొండ వెళ్లేందుకు సాగర్‌రింగ్‌రోడ్డుకు వచ్చి యజమాని నరేందర్‌కు ఫోన్ చేశాడు. ఆయన అష్టలక్ష్మీ ఆలయం వద్ద పని ఉంది, అక్కడికి వెళ్లాలని చెప్పాడు. దీంతో శ్రీనివాస్ తిరిగి సాగర్‌రింగురోడ్డు నుంచి ఎల్బీనగర్ వైపు వస్తుండగా గెలాక్సీ ఆసుపత్రి సమీపంలో ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చి స్పెషల్ ఐడీ పార్టీ పోలీసులమని, నీ బ్యాగును తనిఖీ చేయాలని బెదిరించారు. వారిలో ఒకడు మీ యజమానికి ఫోన్ చెయ్యి మాట్లాడాలి అన్ని అన్నాడు. ఫోన్ మాట్లాడుతుండగా మరొకడు బ్యాగులో ఉన్న రూ.1.40 లక్షలు తీసుకుని పారిపోయారు. శ్రీనివాస్ బ్యాగులో చూడగా రూ.1.40 లక్షలు కనిపించలేదు. వెంటనే అతను యజమానికి విషయం చెప్పాడు. ఆయన వచ్చాక మంగళవారం రాత్రి ఎల్బీనగర్ పోలీస్స్టేన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్వామిరారా.. సినిమాను మరిపించే దొంగలు
-
స్వామిరారా.. సినిమాను మరిపించే దొంగలు
రాంగోపాల్‌పేట: నగరంలో కాస్త విరామం తర్వాత సూడో పోలీసులు అలజడి చేశారు. సికింద్రాబాద్‌లోని మహంకాళి ఠాణా పరిధిలో బుధవారం ఉదయం పంజా విసిరిరారు. బ్రౌన్‌షుగర్ అక్రమ రవాణా అనుమానమంటూ తనిఖీలు చేసి చెన్నైకి చెందిన వ్యాపారి నుంచి రూ.7.5 లక్షలు తస్కరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే సూడో పోలీసుల ‘డెన్’ ఉందనే అనుమానంతో ఆరా తీస్తున్నారు. తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉన్న సేలంకు చెందిన జ్యువెలరీ వ్యాపారి గోపీనాథ్ అక్కడ వెండి ఆఖరణాలు తయారు చేసుకువచ్చి, నగరంలో వ్యాపారస్తులకు విక్రయిస్తుంటారు. చెన్నై–హైదరాబాద్ మధ్య వెండి ధరలో రూ.మూడునాలుగొందల వ్యత్యాసం ఉంటోంది. దీంతో ఇక్కడే వెండి ఖరీదు చేసుకుని వెళ్లే గోపీనాథ్... ఆభరణాలు, వస్తువులు తయారు చేసి మళ్లీ నగరానికే తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. దీనికోసం వారానికి ఓ రోజు హైదరాబాద్ రావడం పరిపాటి కావడంతో బస చేయడానికి సుభాష్‌రోడ్‌లో ఒక చిన్న గది అద్దెకు తీసుకున్నాడు. గది సమీపంలోనే ఘటన... ఎప్పటిలానే సేలం నుంచి ప్రైవేట్ బస్సులో వచ్చిన గోపీనాథ్ బుధవారం ఉదయం 8.30 గంటలకు లక్డీకపూల్లో దిగాడు. రెండు బ్యాగులతో వచ్చిన ఆయన అక్కడ నుంచి ఆటోలో సుభాష్‌రోడ్‌కు చేరుకున్నాడు. తాను నివసించే గది సమీపంలోనే బటర్‌ఫ్లై బేకరీ వద్ద ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే సైకిళ్లపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గోపీనాథ్‌ను ఆపి తాము పోలీసులమని పరిచయం చేసుకున్నారు. మీ బ్యాగులో మాదకద్రవ్యమైన బ్రౌన్‌షుగర్ ఉన్నట్లు సమాచారం వచ్చిందంటూ బెదిరించారు. తనిఖీలు చేయాలంటూ బ్యాగు తెరిచి చూపించాలని ఆదేశించారు. దీంతో గోపీనాథ్ అలానే చేయగా... ఒక దాంటో ఉన్న 25 కేజీల వెండి ఆభరణాలు, మరో బ్యాగ్‌లో రూ.20 లక్షల నగదు ఉన్నాయి. ఓపక్క తనిఖీలు చేస్తున్నట్టు నటిస్తున్న ఆ ద్వయం అదును చూసుకుని బాధితుడి దృృష్టి మరల్చింది. బ్యాగ్‌లో ఉన్న రూ.20 లక్షల నుంచి రూ.7.50 లక్షలు తస్కరించింది. ఆపై యథావిధిగా గోపీనా«థ్‌ను పంపేసింది. తన రూమ్‌కు వెళ్ళాక విషయం గుర్తించిన బాధితుడు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ రమేష్ దర్యాప్తు చేపట్టారు. వివిధ కోణాల్లో దర్యాప్తు... ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న మహంకాళి పోలీసులు ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలోనే సైకిళ్లపై వస్తున్న ఇద్దరు అనుమానితుల్ని గుర్తించారు. ఆ ఇద్దరిలో ఒకరు 50 ఏళ్లు, మరొకరు 40 ఏళ్ల వయస్కులని పోలీసులు అంచనా వేశారు. వీరు ఎక్కువ దూరం నుంచి సైకిల్ పైన రాలేరని, ఆ సమీపంలోనే వీరి డెన్ ఉంటుందని అనుమానిస్తూ ఆరా తీస్తున్నారు. మరోపక్క ఈ నేరం ఉదయం జరగడం, అప్పుడో గోపీనాథ్‌కు సేలం నుంచి రావడంతో ఆయనకు తెలిసిన వారి ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. -
తల్లిది ఆశయం.. తనయుడిది మోసం
♦ నకిలీ పోలీస్ రిమాండ్ ♦ యూనిఫాం ధరించి వసూళ్లకు పాల్పడిన వ్యక్తి ♦ కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ స్వామి మోమిన్‌పేట: పోలీస్‌నని నమ్మబలికి డబ్బు వసూళ్లు చేసిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు వికారాబాద్ డీఎస్పీ స్వామి తెలిపారు. మంగళవారం మోమిన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నవాబుపేట మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన ధన్నారం బాలయ్య యూనిఫాం వేసుకొని పోలీస్‌నని చెప్పుకుంటూ కొంతకాలంగా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈక్రమంలో ఆయన సోమవారం సాయంత్రం మెదక్ జిల్లా సదాశివపేట మండలం కోనాపురం గ్రామానికి చెందిన మెల్గిరిపేట దావిద్ తన బైక్‌పై తన అత్తను తీసుకొని సదాశివపేట మోమిన్‌పేట మీదుగా శంకర్పల్లి వైపు వెళ్తున్నాడు. మోమిన్‌పేట సమీపంలో పోలీస్ యూనిఫాంలో ఉన్న బాలయ్య అతడి బైక్‌ను నిలిపాడు. వాహనానికి సంబంధించిన కాగితాలు చూపించాలని దావిద్‌ను కోరాడు. ఆర్సీ బుక్ ఉందని, మిగతా పత్రాలు లేవని ఆయన బదులిచ్చాడు. కాగితాలు లేకపొతే రూ.1000 జరిమానా చెల్లించాలని బాలయ్య స్పష్టం చేశాడు. అంతడబ్బు తన వద్ద లేదని దావిద్ చెప్పగా బైక్‌ను సీజ్ చేస్తానని బెదిరించాడు. తన వద్ద కేవలం రూ.350లు ఉన్నాయని చెప్పగా మొత్తం డబ్బులు అతడు లాక్కున్నాడు. బాలయ్య ప్రవర్తనపై అనుమానం రావడంతో దావిద్ పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్ఐ రాజు వెంటనే అక్కడికి చేరుకొని బాలయ్యను ఆదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. పోలీస్‌ను కావాలని తన తల్లి మాణెమ్మ కోరిక అని.. దీంతో యూనిఫాం కొనుగోలు చేసినట్లు జంగయ్య చెప్పాడు. ఈక్రమంలో జల్సాలకు అలవాటు పడి వసూళ్లకు పాల్పడినట్లు అంగీకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. కార్యక్రమంలో సీఐ ఏవీ రంగా, ఎస్ఐ రాజు తదితరులు ఉన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు యూనిఫాం వేసుకొని అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని డీఎస్పీ స్వామి ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇలాంటి వారి వల్లే పోలీసుల పరువుపోతుందని ఆయన పేర్కొన్నారు. పోలీసులమంటూ బెదిరించిన వారి తీరుపై అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. -
కృష్ణాలో నకిలీ పోలీసుల కలకలం
-
నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్
వైన్స్, కల్లు కాంపౌండ్, వ్యభిచార గృహాల వద్ద పోలీసులమని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు సభ్యుల నకిలీ పోలీసుల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.5 తులాల బంగారం, రూ.20 వేల నగదు, ఒక నకిలీ ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, మీర్పేట్, చైతన్యపురి పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీసుల పేరు చెప్పి.. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించిన పోలీసులు.. వలపన్ని పట్టుకున్నారు. నిందితుల్లో ఓ హోంగార్డు కూడా ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎల్బీ నగర్లో నకిలీ పోలీసులు అరెస్ట్
హైదరాబాద్ : ఎల్బీ నగర్లో ఇద్దరు నకిలీ పోలీసులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో పలువురు వ్యక్తులను ఈ నకిలీ పోలీసులు బెదిరించి బలవంతంగా నగదు వసూళ్లు చేస్తున్నారు. దీంతో స్థానికులు, బాధితులు ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
మోసపోయిన సినీ నటుడు, ఆరుగురి అరెస్టు
హైదరాబాద్: సీఐడీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న హోంగార్డు ఎస్ఐ అవతారం ఎత్తాడు. ఓ ఛానెల్లో పనిచేస్తున్న డ్రైవర్ కానిస్టేబుల్ అవతారం ఎత్తాడు. ఇద్దరు వ్యభిచారిణులలో ఒకరు మహిళా రిపోర్టర్ అవతారం ఎత్తారు. అంతా కలిసి ఓ సినీ నటుడి ఇంట్లోకి ప్రవేశించి వ్యభిచారం గృహం నిర్వహిస్తున్నావంటూ బెదిరించి డబ్బులు లాక్కున్నారు. అంతేకాకుండా ఇంకా డబ్బు కావాలంటూ కిడ్నాప్‌కు పాల్పడి పోలీసులకు చిక్కారు. వివరాల్లోకి వెళితే శ్రీకృష్ణానగర్‌లో నివసించే సినీ నటుడు కాలెపు శ్రీనివాసరావు(48) నివాసంలోకి గత నెల 31వ తేదీన ఉదయం 10.30 గంటలకు అయిదుగురు యువకులు, ఇద్దరు యువతులు ప్రవేశించారు. తమను తాము పోలీసులమని, న్యూస్ఛానెల్ ప్రతినిధులమంటూ లాఠీతో పాటు డమ్మీ పిస్టల్, ఛానెల్ లోగోతో లోనికి ప్రవేశించి శ్రీనివాసరావును వ్యభిచారగృహం నిర్వహిస్తున్నావంటూ కెమెరా ఆన్‌చేసి బెదిరించారు. ఇంటి బీరువాలో ఉన్న డబ్బు దొంగిలించారు. బలవంతంగా కారులో తీసుకుని వెళ్లి ఏటీఎం కార్డు ద్వారా మరింత డబ్బును డ్రా చేయించారు. రూ. 2 లక్షలు ఇస్తే టీవీ ఛానెల్లో రాకుండా చేస్తామంటూ నగరమంతా తిప్పారు. వారి బారినుంచి తప్పించుకొని బయటపడ్డ శ్రీనివాసరావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసుల విచారించగా.. సీఐడీ విభాగంలో హోంగార్డుగా పని చేస్తున్న రాజు ఎస్ఐగా బిల్డప్ ఇచ్చాడు. ఓ టీవీ ఛానెల్ డ్రై వర్గా పని చేస్తున్న మధు కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు వ్యభిచారిణులలో ఒకరు ఛానెల్ విలేకరినంటూ అదరగొట్టారు. ఛానెల్ యజమానే మీ జీతాలు మీరే సంపాదించుకోండి నాక్కూడా నెలకు ఒక్కొకరు రూ.25 వేలు తెచ్చివ్వండి అని చెప్పడంతో తామంతా రోడ్డు కెక్కామని నిందితులు తెలిపారు. ఛానెల్ ప్రతినిధులమంటూ చెప్పుకున్న జలీల్, జగదీష్, మధు, సంజయ్‌రెడ్డి, లక్ష్మి, దుర్గ, హోంగార్డు రాజులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఛానెల్ ఎండీని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
పోలీసులమంటూ వచ్చి..దోచుకుపోయారు
మేదరమెట్ల: బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులమంటూ అడ్డుకుని తీవ్రంగా కొట్టి డబ్బు దోచుకు పోయారు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలివీ... ఒంగోలులోని వీఎన్ఎస్ దాల్‌మిల్లులో కొప్పర్తి సుబ్బారావు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయన శుక్రవారం రాత్రి అద్దంకి నుంచి బైక్‌పై ఒంగోలు బైక్‌పై వెళ్తున్నాడు. మేదరమెట్ల వద్ద ఆయన్ను బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు అడ్డుకున్నారు. పోలీసులమని చెప్పి డబ్బులివ్వాలని బెదిరించారు. కానీ, ఎదురు తిరగటంతో వారు అతనిని తీవ్రంగా కొట్టి, అతని వద్ద ఉన్న రూ.1.52 లక్షలను దోచుకుని పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత అటుగా వచ్చిన స్ధానికులు సుబ్బారావును ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుపతిలో ఐదుగురు నకిలీ పోలీసుల అరెస్టు
తిరుపతి : టాస్క్‌ఫోర్స్ పోలీసులమని చెప్పి లారీలు, ఆటోలు నిలిపి.. డ్రైవర్లను బెదిరించి అందినకాడికి వసూలు చేసే ముఠాను తిరుపతి పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. తిరుపతి అర్బన్ ఎస్సీ గోపీనాథ్ జెట్టీ మంగళవారం ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. తిరుపతి సబ్‌డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ, తిరుచానూరు సీఐ సురేంద్రనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం రాత్రి చైతన్యపురం వద్ద తనిఖీ చేస్తుండగా ఓ ఆటోలోని వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించారు. వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారు తిరుపతికి చెందిన విజయ్, షేక్‌షౌకత్ అలీ, వెంకటేశ్, బాలరాజు, ఢిల్లీరాజు. పాత కేసుల్లో నిందితులు. ఈ ఐదుగురూ కలసి ఇటీవల పోలీసులమని చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నట్టు విచారణలో అంగీకరించారు. -
ఎస్ఆర్ నగర్లో నకిలీ పోలీస్ అరెస్టు
హైదరాబాద్: విద్యార్థులు, మహిళలను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీసును ఎస్సార్ నగర్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. స్పెషల్ పార్టీ పోలీసునంటూ గత కొన్ని రోజులుగా ప్రేమ జంటలను, హోటళ్ల నిర్వాహకులను బెదిరిస్తున్నాడు. బెదిరింపులకు పాల్పడుతున్నట్టు అతడిపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన ఎస్ఆర్ నగర్ పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఈ మేరకు అప్పలనాయుడు అనే యువకుడిని అదుపులోకి తీసుకుని, అతడి నుంచి డమ్మీ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
పోలీసునంటూ రూ.10 లక్షల దోపిడీ
నాచారం (హైదరాబాద్) : బ్యాంక్ నుంచి రూ.10 లక్షలు డ్రా చేసుకుని తీసుకువెళుతున్న ఓ వ్యక్తిని తాను లోకల్ పోలీస్‌నంటూ ఓ వ్యక్తి అడ్డగించి ఆ నగదుతో పరారయ్యాడు. ఈ ఘటన నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం కొలుటూరుకు చెందిన రైతు మల్లారెడ్డి (65)... మంగళవారం ఉదయం శామీర్‌పేటలోని సెంట్రల్ బ్యాంకు నుంచి రూ.10 లక్షలు డ్రా చేసుకున్నాడు. అనంతరం నాచారం హెచ్ఎంటీ కాలనీలోని తన స్నేహితుడిని కలిసేందుకు బైక్‌పై వెళుతున్నాడు. హబ్సిగూడ దాటిన తర్వాత ఓ వ్యక్తి మల్లారెడ్డిని ఆపాడు. తాను స్థానిక పోలీస్‌నని, బండి కాగితాలు చూపించాలని కోరాడు. దీంతో మల్లారెడ్డి బండిలో ఉన్న కాగితాలను చూపించే పనిలో ఉండగా నగదు బ్యాగుతో ఆ నకిలీ పోలీస్ పరారయ్యాడు. మల్లారెడ్డి లబోదిబోమంటూ నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
శంషాబాద్‌లో నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్
శంషాబాద్: పోలీసుల వేషంలో రహదారుల్లో కాపుకాసి రేషన్ బియ్యం తరలిస్తున్న లారీలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను శంషాబాద్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఏడుగురు సభ్యుల ముఠా గత కొంతకాలంగా పోలీసుల వేషంలో జాతీయ రహదారిలో కాపుకాసి వాహనాలను ఆపి, బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. గత నెల 28న హైదరాబాద్‌కు చెందిన ఒక రేషన్ డీలర్ నుంచి బలవంతంగా రూ.80 వేలు వసూలు చేశారు. అనుమానం వచ్చిన లారీ యజమాని శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాదు. నిఘా వేసిన పోలీసులు హైవేపే లారీలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసులను మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఏడుగురి ముఠాలో ఇద్దరు జర్నలిస్టులు ఉండడం గమనార్హం. మాదిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, మాదిరెడ్డి రాజేందర్‌రెడ్డి ఒక ప్రముఖ దినపత్రికలో విలేకరులుగా పనిచేస్తున్నారు. వీరితో పాటు వెంకటరెడ్డి, గోవర్దన్‌రెడ్డి, శివకుమార్, శివకుమార్‌రెడ్డి, శ్రీనివాస్ ముఠాగా ఏర్పడి గత కొంత కాలంగా పోలీసుల వేషంలో దారిదోపిడీలకు పాల్పడుతున్నారు. మంగళవారం ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుపడగా, జర్నలిస్ట్ మాదిరెడ్డి రాజందర్‌రెడ్డి పరారయ్యాడు. అదుపులోకి తీసుకున్న ఆరుగురిని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నారు. వీరందరూ శంషాబాద్‌కు చెందినవారే. -
పోలీసులమంటూ వసూళ్లు చేస్తున్న ఇద్దరి అరెస్ట్
చిట్యాల(నల్లగొండ): పోలీసులమని చెప్పుకుంటూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీసుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామశివారులో మంగళవారం రాత్రి జరిగింది. వివరాలు.. ఆంజనేయులు, రామస్వామి అనే ఇద్దరు వ్యక్తులు లారీ డ్రైవర్లుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు మరో ముగ్గురితో కలిసి బక్రీద్ పండగ సందర్భంగా.. లారీలో తరలుతున్న గొర్రెలు, ఆవులను లక్ష్యంగా చేసుకొని పోలీసులమంటూ చెప్తూ.. వారి వద్ద నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మాటు వేసి నకిలీ పోలీసులను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా.. ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అదనపు సమాచారం కోసం విచారణ చేపడుతున్నారు. -
ఇద్దరు నకిలీ పోలీసుల అరెస్ట్
విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలో ఇద్దరు నకిలీ పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని నక్కపల్లి వద్ద మంగళవారం రాత్రి పోలీసులమని చెప్పి లారీ డ్రైవర్ల నుంచి మామూళ్లు వసూలు చేస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. యాదగిరి, అప్పారావు అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘దొంగపోలీస్’
పోలీసు వేషంలో వరుస చోరీలు రూ.12 లక్షల విలువైన బైక్‌లు, బొలెరో వాహనం స్వాధీనం హైటు, పర్సనాలిటీ, హెరుుర్స్టైల్... చేతిలో ఎరుుర్ పిస్టల్... అచ్చం పోలీసులా...! బొలెరో వాహనం... దానికి సైరన్... పోలీసు వాహనంలా...! అంతకు ముందు బీఎస్ఎఫ్లో శిక్షణ పొందిన అనుభవం...! పోలీసుగా నమ్మించడానికి ఇవి చాలనుకున్నాడో ఏమో...!! వేములవాడ భగవంతరావునగర్‌కు చెందిన నామాల నరేందర్(23) నకిలీ పోలీసు అవతారమెత్తాడు. ఎస్సైనని చెప్పుకుంటూ దొంగిలించిన బొలెరా వాహనంలో తిరుగుతూ వరుస చోరీలకు పాల్పడుతూ చివరకు కటకటాల పాలయ్యూడు. కరీంనగర్ డీఎస్పీ రామారావు మంగళవారం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ‘దొంగపోలీస్’ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ క్రైం : వేములావాడలోని భగవంతరావునగర్‌కు చెంది న నామాల నరేందర్(23) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో జనరల్ సోల్జర్‌గా ఎంపికై శిక్షణకు వెళ్లా డు. అక్కడ వాతావరణం పడక ఇంటికి తిరిగి వచ్చా డు. కొద్ది రోజులు పోలీసులకు సన్నిహితంగా మెదిలిన నరేందర్ వారి వ్యవహార శైలిని గమనించాడు. ఈ క్రమంలో వేములావాడ నుంచి హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ జల్సాలకు అలవాటుపడి చోరీలు చేయడం ప్రారంభించాడు. మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో గతేడాది అక్టోబర్ ఒకటో తేదీన బొలెరో వాహనం చోరీ చేశాడు. జిల్లాలో కొత్తగా ఎస్సైలకు బొలెరో వాహనాలు ఇవ్వడంతో తాను చోరీ చేసిన బొలెరో వాహనం పైన సైరన్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఎయిర్‌పిస్టల్ కొనుగోలు చేశాడు. వేములావాడలో మానకొండూరు ఎస్సైగా, మిగతా చోట్ల వేములావాడ ఎస్సైగా చెబుతూ చోరీలు చేయడం ప్రారంభించాడు. చిక్కిన వైనమిది... కరీంనగర్ త్రీటౌన్ పరిధిలో గతనెల 11, 31 తేదీల్లో రెండు బైకులు చోరీ అయ్యాయి. వేములవాడలో గతంలో పని చేసిన రిటైర్డ్ ఉద్యోగి మృతి చెందిన విషయం తెలుసుకున్న నరేందర్ వీరి ఇంటికి వచ్చి రెండు బైకులు చోరీ చేశాడు. వాటిని నగరంలోని సివిల్ ఆస్పత్రి పార్కింగ్‌లో దాచి ఉంచాడు. ఈ నెలలో బండారు వేణు ఇంట్లో చొరబడి ఐదు తులాల బంగారు చైన్ దొంగిలించాడు. రెండు సంఘటనలో ఒకే వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడంతో త్రీటౌన్ సీఐ సదానందం ఆధ్వర్యంలో ఎస్సై నరేష్, హెడ్‌కానిస్టేబుల్ పోచయ్య, కానిస్టేబుళ్లు జాకీర్, ప్రతాప్, శ్రీకాంత్‌రెడ్డి బృందం రంగంలోకి దిగింది. నరేందర్‌పై అనుమానం రాగా అతడి కదలికలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో అతడిని కలిసి వివరాలు అడగుగా ఒకరితో మానకొండూరు ఎస్సైగా, మరొకరితో మెదక్ ఐబీ కానిస్టేబుల్‌గా, ఇంకొరితో వేములావాడ ఎస్సైగా పేర్కొనడంతో అనుమానం బలపడింది. మంగళవారం మంచిర్యాల చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండడగా బొలెరో వాహనంలో వస్తున్న నరేందర్‌ను ఆపి పత్రాలు తనిఖీ చేయగా సరిగా లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసుల విచారణలో తాను చేసిన చోరీల వివరాలు వెల్లడించాడు. వెంటనే రూ.12 లక్షల విలువైన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరేందర్‌తో పాటు అతడికి సహకరించిన వేములావాడ మండలం హన్మక్కపల్లికి చెందిన చంద్రగిరి అనిల్(24)పై కేసు నమోదు చేసి, నరేందర్‌ను మంగళవారం రిమాండ్ చేశారు. చోరీల చిట్టా ఇదీ... కరీంనగర్ త్రీటౌన్ పరిధిలో గతనెల 10న ఒక మారుతి కారును, 31న ఒక బైకును దొంగిలించాడు. ఈ నెల ఒకటిన మరో బైకును అపహరించిన నరేందర్ 12న బండారు వేణు ఇంట్లో దూరి ఐదు తులాల బంగారం దొంగిలించాడు. గతేడాది సెప్టెంబర్ ఒకటిన హైదారాబాద్‌లోని మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో బొలెరో వాహనాన్ని అపహరించాడు. నిరుడు జూన్ 27న బేగంపేటలో కరిజ్మా బైక్, ఈ ఏడాది మార్చి 26న కేపీహెచ్‌బీకాలనీలో హోండాషైన్, జనవరి 10న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలు చోరీ చేశాడు. వాటిని ఇతరులకు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం ప్రారంభించాడు. నరేందర్‌కు చోరీల్లో సహకరించిన చంద్రగిరి అనిల్ కొద్ది రోజుల క్రితమే దుబాయ్ వెళ్లిపోయాడని తెలిసింది. పోలీసులకు రివార్డులు పోలీసు వేషంలో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్న నరేందర్‌ను చాకచక్యంగా పట్టుకున్న సీఐ సదానందం, ఎస్సై నరేష్, హెడ్‌కానిస్టేబుల్ పోచయ్య, కానిస్టేబుళ్లు జాకీర్, ప్రతాప్, శ్రీకాంత్‌రెడ్డిలకు డీఎస్పీ రామారావు నగదు రివార్డులను అందజేశారు. వారిని ఉన్నతాధికారులు అభినందించారు. -
పోలీసులమంటూ మస్కా.. అరెస్టు
అనంతపురం(క్రైం): పోలీసులమంటూ బైక్‌పై వెళుతున్నవారి దగ్గర నుంచి జరిమాన రూపంలో డబ్బులు గుంజిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు జిల్లాలోని పలుచోట్ల ద్విచక్రవాహనదారుల దగ్గర నుంచి జరిమాన రూపంలో భారీగా డబ్బులు వసూలు చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు బైకులు, 3 సెల్ఫోన్లు, రూ. 29,400లను స్వాధీనం చేసుకున్నారు. -
దోపిడీని ఛేదించిన పోలీసులు
-
రూ.82లక్షల దోపిడీని ఛేదించిన పోలీసులు
కావలి : నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో పోలీసులమని చెప్పి వ్యాపారుల నుంచి భారీగా నగదు దోచుకున్న కేసును పోలీసులు ఛేదించారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం అలవలపాడు వద్ద దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దోపిడీ చేసిన రూ.82 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఓ కొత్త కోణం వెలుగు చూసింది. వ్యాపారులను బెదిరించి వారి వద్ద నుంచి రూ.82 లక్షలు దోచుకు వెళ్లిన నలుగురు దుండగుల్లో ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులు కావటం విశేషం. వీరంతా ప్రకాశం జిల్లాకు చెందినవారు. కాగా కావలికి చెందిన వ్యాపారులు కొందరు గురువారం బంగారం కొనేందుకు నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో నెల్లూరుకు బయలుదేరారు. అదే రైలులో ఎక్కిన నలుగురు వ్యక్తులు పోలీసులమంటూ వారి వద్దకు వచ్చారు. తనిఖీ చేయగా వ్యాపారుల వద్ద నగదు కనిపించింది. అందుకు సంబంధించి రుజువులు చూపాలని ఆగంతకులు వారిని బెదిరించారు. వ్యాపారుల వద్ద ఉన్న మొత్తం రూ.82 లక్షలను లాక్కుని...నెల్లూరు నుంచి వారందరినీ కారులో ఎక్కించుకుని దగదర్తి మండలం దామవరం దగ్గర వదిలేశారు. అనంతరం ఆగంతకులు ప్రకాశం జిల్లా గుడ్లూరు వైపు వెళ్లి, కారును అక్కడ వదిలేశారు. బాధితులు కావలి చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు దోపిడీని కొన్ని గంటల్లోనే ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. -
పోలీసుల పేరుతో రూ.82 లక్షల దోపిడీ!
నెల్లూరు: కొందరు దుండగులు పోలీసుల పేరుతో 82 లక్షల రూపాయలు దోపిడీ చేశారు. నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో నకిలీ పోలీసులు హల్చల్ చేశారు. రైలులో పలువురిని వారు తనిఖీ చేశారు. ఇద్దరు బంగారు వ్యాపారులు రామయ్య, మరొకరిని కూడా తనిఖీ చేశారు. రైలు పడుగుపాడు వద్దకు రాగానే విచారణ పేరుతో వారు ఆ వ్యాపారులను కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. కారు దామవరం వద్దకు వెళ్లిన తరువాత, వ్యాపారుల వద్ద ఉన్న 82 లక్షల రూపాయలను తీసుకొని వారిని కిందకు తోసి పారిపోయారు. వ్యాపారులు కావలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వ్యాపారులు బంగారం కొనుగోలుకు చెన్నై వెళుతుంటారు. ఈ విషయం తెలిసినవారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. -
నకిలీ పోలీసుల చేతివాటం
యాకుత్‌పురా (హైదరాబాద్ సిటీ) : నకిలీ పోలీసులు స్వర్ణకారుడి దృష్టి మళ్లించి 2.5 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ యాదగిరిరెడ్డి కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన రామాచారి (49) స్వర్ణకారుడు. బంగారు ఆభరణాలపై డిజైన్లు వేయించేందుకు రోజూ గుల్జార్‌హౌస్ కాలికమాన్ వస్తుంటాడు. ఇదే క్రమంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గుల్జార్‌హౌస్ ప్రాంతంలోని ఇరానీ కేఫ్ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు దుండగులు పోలీసులమని చెప్పి అడ్డుకున్నారు. అతడి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేస్తున్నట్టు నటించి 2.5 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత గొలుసు చోరీ అయిన విషయం గమనించిన రామాచారి మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీకి గురైన నగను డిజైన్ మోడల్ చూపించేందుకు తీసుకొచ్చానని బాధితుడు తెలిపాడు. బ్యాగ్‌లో ఉన్న రూ. 12 వేలు, మరో 4 గ్రాముల బంగారాన్ని దుండగులు వదిలేశారని చెప్పాడు. ఘటనా స్థలంలోని వ్యాపార సంస్థల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే గుల్జార్‌హౌస్, కాలికమాన్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఇరాన్ నుంచి వచ్చి... నకిలీ పోలీసు అవతారం ఎత్తి
బెంగళూరు : వృద్ధులను మోసగించి బంగారు నగలు లూటీ చేస్తున్న అంతర్రాష్ట్ర నేరస్తుడిని బెంగళూరు సీసీబీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పట్టుబడిన వ్యక్తిని మహారాష్ట్రలోని ఠాణా జిల్లా మోమిన్‌పురకు చెందిన రహంతుల్లా సైఫుల్లా జాఫ్రీ అలియాస్ రహంతుల్లాగా గుర్తించారు. నిందితుడి నుంచి మూడు కేజీల రెండు వందల గ్రాముల బంగారు నగలు, జీపు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ దేశానికి చెందిన ఇతను బెంగళూరు చేరుకుని పోలీస్ అవతారం ఎత్తాడు. నగరంలోని పలు నిర్జన ప్రదేశాల్లో పోలీస్ దుస్తుల్లో సంచరిస్తూ ఒంటరిగా వెళుతున్న వృద్ధులను పలకరించి, పక్క వీధిలో భయానక వాతావరణం నెలకొందని, విలువైన ఆభరణాలు వేసుకుని వెళితే ప్రమాదమని బెదిరించేవాడు. నగలు తీసి బ్యాగ్‌లో పెట్టుకుని వెళ్లాలని సూచిస్తూ, వారిచేత బలవంతంగా నగలు తీయించి తానే పేపర్లో చుట్టి ఇచ్చేవాడు. ఆ సమయంలో తన హస్తలాఘవంతో బంగారు నగలు అపహరించి, మహారాష్ట్రకు చేరుకుని విక్రయించి, జల్సాలు చేసేవాడు. ఈ తరహా కేసులు ఎక్కువకావడంతో రంగంలో దిగిన సీసీబీ పోలీసులు రహంతుల్లా అనుచరులు లాలా సమీర్ జాఫర్, ఉస్మాన్, గులాం, అబ్బాస్, లాలాను ఇటీవల అరెస్ట్ చేశారు. వీరు తెలిపిన ఆధారాల మేరకు రహంతుల్లాను బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడిపై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 81 కేసులు నమోదయ్యాయి. అతని బృందంపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పది రాష్ట్రాలలో పలు కేసులు నమోదయ్యాయని సీసీబీ పోలీసులు తెలిపారు. -
పట్టుబడిన నకిలీ పోలీసులు
రూ. 60 లక్షల విలువైన సొత్తు స్వాధీనం ముంబాయి నుంచి వచ్చి చోరీలు పలు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి బెంగళూరు : పోలీసు ముసుగులో మహిళలను మోసం చేస్తున్న ఐదుగురు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లను ఇక్కడి బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు లాల్ సమీర్ జాఫర్ హుస్సేన్ అలియాస్ జాఫర్, జాఫర్ ఆలీ సయ్యద్, ఉస్మాన్, గులాం ఆలీ సయ్యద్, అబ్బాస్ ఆలీలను అరెస్టు చేశామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి రూ. 60 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అరెస్టయిన నిందితులు ఇరాన్ సంతతికి చెందిన వారు. ఉస్మాన్, అబ్బాస్ కర్ణాకలోని గుల్బర్గాలో నివాసం ఉండగా మిగిలిన వారు ముంబాయిలోని ఇందిరానగరలోని కల్యాణ్ ప్రాంతంలోని రైల్వేస్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్నారు. వీరు తరచూ బెంగళూరుకు వచ్చి దొంగతనాలకు పాల్పడేవారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను గుర్తించి తాము పోలీసులమని, దొంగలు ఉన్నారు జాగ్రత్తగా ఉండాలని మాయమాటలు చెబుతారు. అనంతరం వారిని మాటల్లో దింపి వారి వద్ద ఉన్న బంగారు నగలు లాక్కొని ఉడాయిస్తారు. ఒక్క రోజులో 10కి పైగా వీరు ఈ విధంగా లూటీలు చేసి వాహనంలో ముంబాయి పారిపోయే వారని పోలీసుల విచారణలో బయటపడింది. 2013లో బెంగళూరు న గరంలో నకిలీ పోలీసుల ముసుగులో ఉన్న అసాదుల్లా జాఫరి అలియాస్ ఖాలియా, సమీర్ సద్యద్ అనే ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులకు వారిని విచారణ చేయగా మిగలిన నిందితులపై నిఘా ఉంచి ముంబయిలో అరెస్ట్ చేశామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి చెప్పారు. నిందితులపై బెంగళూరులో వివిధ పోలీస్ స్టేషన్లలో 60 కేసులు నమోదు అయ్యాయని అన్నారు. బెంగళూరు సహ మంగళూరు, మైసూరు, ఉడిపి, కుందాపుర, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, గోవా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో కూడా కేసులు నమోదయ్యాయని, ఈ ఐదుగురు మోస్ట్ వాంటెడ్ క్రిమిన ల్స్ అని రెడ్డి తెలిపారు. సమావేశంలో బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్ కుమార్‌తో సహ సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
శివారులో నకిలీ పోలీసుల ఆగడాలు
ఏలూరు(టూటౌన్), న్యూస్‌లైన్ : నగరంలోని శివారు ప్రాంతాలలో నకిలీ పోలీసులు హల్చల్ చేస్తున్నారు. రాత్రి సమయంలో వాహనాలపై వెళుతున్న వారిని నిలిపి పోలీసులమని చెప్పి తనిఖీల పేరుతో నిలువుదోపిడీ చేస్తున్నారు. స్థానిక వట్లూరు రోడ్డు, మినిబైపాస్, వట్లూరు నుంచి పెదపాడు వైపుగా వెళ్లే మార్గాల్లో ఎక్కువగా ఈ దోపిడీలు జరుగుతున్న సమాచారం. ఇటీవలే రెండు రోజుల క్రితం వట్లూరు నుంచి పెదపాడు వెళుతున్న ఓ జంటను త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ పోలీసులమంటూ చెప్పి వాళ్లను భయపెట్టి వారి వద్ద ఉన్న రూ.1000 నగదు దోచుకున్నారు. ఇటీవంటి ఘటనలు శివారు ప్రాంతాలలో తరచూ జరుగుతున్నాయని బాధితులు చెబుతున్నారు. వట్లూరు శివారు, మినిబైపాస్ రోడ్డులో ఎక్కువగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండడంతో కొందరు అక్కడ మాటువేసి పోలీసులమంటూ చెప్పుకుంటూ క్యాష్ చేసుకుంటున్నారు. ఈ ప్రాంత పరిధిలోని పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నకిలీ పోలీసు అగడాలు ఎక్కువయ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నకిలీ పోలీసు అగడాలను ఆరికట్టాలని పలువురు కోరుతున్నారు. దీనిపై త్రీటౌన్ సీఐ పి.శ్రీనివాసరావును ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ పోలీసులమని చెప్పి డబ్బులు గుంజుతున్న వారు, లేదా అనుమానితుల వివరాలను వెంటనే త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ నంబర్ 08812-223833కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. వెంటనే సిబ్బందిని అక్కడికి పంపిస్తామని, నకిలీల ఆగడాలను అరికడతామన్నారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలను నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. మినిబైపాస్, వట్లూరు పరిసర ప్రాంతాలలో గస్తీని పెంచుతామని చెప్పారు. -
డ్రైవరే సూత్రధారి
మరో ముగ్గురితో కలిసి రూ. 10.90 లక్షల దోపిడీ పోలీసుల ముసుగులో ఎత్తుకెళ్లిన నిందితులు ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు మెహిదీపట్నం, న్యూస్‌లైన్: ఎల్లారెడ్డిగూడ వద్ద నకిలీ పోలీసులు ఈనెల 21వ తేదీ రాత్రి ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన రూ.10.90 లక్షలు దోచుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. ఆ సంస్థ కారు డ్రైవరే ఈ దోపిడీకి సూత్రధారిగా తేల్చారు. ఇతడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... యూసుఫ్‌గూడ శ్రీరాంనగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఇస్తియాక్ అలీ (26) టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ రిత్విక్ కన్స్రక్షన్స్లో కొన్ని రోజులుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మహబూబ్‌నగర్ సింగాటం గ్రామానికి కారు డ్రైవర్ పుట్ట రాము (25), అదే గ్రామానికి చెందిన హోంగార్డు ఎం.నాగరాజు(34), జియాఉద్దీన్ ఇతనికి స్నేహితులు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అరికట్టేందుకు పోలీసులు చేస్తున్న సోదాలను ఆసరా చేసుకొని భారీగా డబ్బు తరలించేవారిని దోచుకోవాలని ఇస్తియాక్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి పథకం వేశాడు. ఇందులో భాగంగా మొదట తాను పని చేస్తున్న సంస్థనే టార్గెట్ చేశాడు. రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా రిత్విక్ సంస్థ వారు ఈనెల 21వ తేదీ రాత్రి బషీర్‌బాగ్‌లోని ఆమ్వే కన్స్ట్రక్షన్స్ నుంచి రూ.25 లక్షలు తీసుకొని కారులో బంజారాహిల్స్ బయలుదేరారు. ఇదే అదనుగా భావించిన డ్రైవర్ మహ్మద్ ఇస్తియాక్ డబ్బు తరలిస్తున్న విషయాన్ని తమ ముఠాకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు ఎల్లారెడ్డిగూడ వద్ద మాటు వేశారు. డబ్బు తరలిస్తున్న కారు రాగానే రాము, నాగరాజు, జియా ఉద్దీన్ ఆపారు. తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని, వాహన తనిఖీలు చేస్తున్నామని కారులో ఎక్కారు. సంస్థ మేనేజర్ ఏసుబాబును బెదిరించి వెనుకాల ఉన్న డబ్బు బ్యాగులోంచి రూ.10 లక్షల 90 వేలు తీసుకొని వెళ్లిపోయారు. ఈ ఘటనపై రిత్విక్ సంస్థ యాజమాన్యం మరునాడే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ దోపిడీకి సూత్రధారుడైన మహ్మద్ ఇస్తియాక్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. కాగా, అతడి తీరుపై పోలీసులకు అనుమానం వచ్చి.. అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. అతను ఇచ్చిన సమాచారంతో నిందితులు పుట్టా రాము, నాగరాజులను శనివారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 7.95 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు జియా ఉద్దీన్ పరారీలో ఉన్నాడు. నిందితుల్లో ఒకడైన నాగరాజు మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు ఠాణాలో హోంగార్డ్‌గా పని చేస్తున్నాడని, అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని డీసీపీ తెలిపారు. దోపిడీ చేసే స్థలంలో కేవలం నిలబడితేనే రూ.40 వేలు ఇస్తామనడంతో అతను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇస్తియాక్పై గతంలో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు కార్ల దొంగతనాలు ఉన్నాయన్నారు. అలాగే జియాఉద్దీన్పై కూడా మహబూబ్‌నగర్, వనపర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో చీటింగ్ కేసు, రాముపై కూడా మహబూబ్‌నగర్, నల్లగొండజిల్లాల్లో పలు పోలీస్‌స్టేషన్‌లో కిడ్నాప్, చోరీ వంటి నేరాలున్నాయన్నారు. నిందితులు ముగ్గురినీ రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో అడిషినల్ డీసీపీ నాగరాజు, పంజగుట్ట ఏసీపీ రవివర్మ, డీఐ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
'ప్రేమ కోసం పోలీస్ అవతారం'
హైదరాబాద్ : ప్రేమ కోసం ఓ యువకుడు పోలీస్ అవతారమెత్తాడు. సినిమాను తలపించిన ఈ ఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎంబీఏ చదివిన శ్రీకాంత్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. అయినా తాను ఇష్టపడిన అమ్మాయికి నచ్చలేదు. దీంతో పోలీస్ గెటప్‌లో వెళితే, ఆమె ఫ్లాట్ అవుతుందనుకున్నాడు. అంతే రాయల్ ఎన్ఫీల్డ్ బైకుపై పోలీసులా పోజిస్తూ ... నెచ్చలి ఎదుట ప్రత్యక్షమైయ్యాడు. పోలీస్ బాస్ అయ్యానంటూ కబుర్లు చెప్పాడు. ఇదంతా ఆమె నమ్మిందో లేదోగానీ .. ఎర్రగడ్డలో ఈ నకిలీ పోలీస్ తతంగాన్ని చూసిన అసలు పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చింది. విషయం ఏంటని ఆరా తీయగా ... అసలు విషయం బయటకొచ్చింది. దాంతో నకిలీ పోలీస్‌ని అరెస్ట్ కేసు నమోదు చేశారు. -
నకిలీ పోలీసుల పేరుతో నిలువ దోపీడీ
గిద్దలూరు: నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలి నుంచి పోలీసులమని చెప్పి రూ. 2 లక్షల విలువైన ఏడు తులాల బంగారు ఆభరణాలను నకిలీ పోలీసులు దోచుకెళ్లిన సంఘటన స్థానిక సుంకమ్మవీధిలో ఆదివారం జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. ముండ్లపాడుకు చెందిన విశ్రాంత ఉద్యోగిని గిద్దలూరు బాలసుబ్బమ్మ తన స్వగ్రామం నుంచి గిద్దలూరులోని బ్యాంకుకు పింఛన్ తీసుకునేందుకు వచ్చింది. సుంకమ్మ వీధి మీదుగా బ్యాంకుకు వెళ్తున్న సమయంలో ఇద్దరు గుర్తుతెలియని యువకులు బాలసుబ్బమ్మ వద్దకు వచ్చి తాము పోలీసులమని, ఇంత బంగారం మెడలో వేసుకుని బయట తిరగడం మంచిది కాదని, ఇదే స్థలంలో ఈ మధ్య గుర్తు తెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలిని చంపి ఆమె ధరించిన బంగారం ఎత్తుకుపోయారని నమ్మబలికారు. ఒంటిపై బంగారం ఉంటే ప్రాణహాని అని ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల సరుడు, నాలుగు బంగారు గాజులు తీసి ఓ పేపరులో చుట్టారు. ఇంతలో వారి వద్ద ఉన్న రెండు నకిలీ బంగారు గాజులు, ఓ రాయిని పేపరులో చుట్టి ఆమె చేతిలో పెట్టారు. పేపరును ఇంటికి వెళ్లాకే విప్పాలని సూచించారు. దీంతో బాధితురాలు అక్కడి నుంచి నేరుగా బ్యాంకుకు వెళ్లి పింఛన్ తీసుకుంది. అనంతరం స్వగ్రామం ముండ్లపాడుకు ఆటోలో వెళ్లింది. ఇంటికెళ్లి పేపరు తెరిచి చూసేసరికి అందులో రెండు నకిలీ బంగారు గాజులు, రాయిని చూసి మోసపోయానని బాలసుబ్బమ్మ గుర్తించింది. వెంటనే గిద్దలూరు వచ్చి వెతికినా నిందితుల ఆచూకీ తెలియలేదు. చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఖాకీనంటూ క్యాష్తో పరార్
నాగోలు: ‘నేను పోలీసును..వాహనపత్రాలు చూపించడని’ ఓ వృద్ధుడి నుంచి రూ.2.90 లక్షలు కాజేసిన ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. ఉప్పల్ ప్రశాంత్‌నగర్‌కు చెందిన పెద్దిబొట్ల భాస్కరశర్మ (79) రిటైర్డ్ లెక్చరర్. స్థానికంగా ఫ్లాటు కొనుగోలు చేసేందుకు చైతన్యపురిలోని ఆంధ్రాబ్యాంకు, ఎస్బీహెచ్లకు వెళ్లి మంగళవారం రూ.2.90 లక్షలు డ్రా చేసుకొని..తన స్కూటీ (ఏపీ29ఏపీ 9714) డిక్కీలో పెట్టారు. తన వాహనంపై ఉప్పల్‌కు వెళ్తుండగా నాగోలు బ్రిడ్జి సమీపంలోకి రాగానే బైక్‌పై వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి తాను పోలీసునని భాస్కరశర్మను పరిచయం చేసుకుని వాహనం పత్రాలు చూపించాలని అడిగాడు. అనంతరం మీ వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారమందిందని, వాహనాన్ని తనిఖీ చేయాలని డిక్కీ తెరిచాడు. అప్పటికే డిక్కీ కవర్లో ఉన్న రూ.2.90 లక్షలు తీసుకొని రెప్పపాటులో ఉడాయించాడు. ఘటన నుంచి తేరుకున్న భాస్కర్‌శర్మ వెంటనే ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో టాస్క్‌ఫోర్స్ పోలీసునంటూ.. ఖైరతాబాద్: గతంలో బ్రోకర్ కేసులో అరెస్టయ్యావు..నీపై కేసులున్నాయని ఓవ్యక్తిని తాను టాస్క్‌ఫోర్స్ పోలీసునంటూ నమ్మించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాగ్‌అంబర్‌పేట్‌లో నివాసముండే కలహరిరెడ్డి(24) ఈవెంట్ మేనేజర్ . చెన్నమల్లప్ప అనే వ్యక్తికి తాను టాస్క్‌ఫోర్స్ పోలీసునని బెదిరించి..నీవు గతంలో బ్రోకర్ కేసులో అరెస్టయ్యావు..అయినా అదే దందా కొనసాగిస్తున్నావు మళ్లీ నీపై కేసు లేకుండా చేయాలంటే రూ.లక్ష కావాలని చెన్నమల్లప్పను డిమాండ్ చేశాడు. దీంతో ఈనెల 15న షాదాన్ కాలేజీ సమీపంలోని కుషాల్ టవర్స్ వద్దకు స్కార్పియోకారు (ఎపి36ఎఫ్6688)లో వచ్చి చెన్నమల్లప్ప వద్ద ఉన్న రూ.30వేల నగదు, ఏటీఎం కార్డులోంచి మరో రూ.7వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా డబ్బులివ్వాలంటూ వేధిస్తుండడంతో అనుమానంతో చెన్నమల్లప్ప సోమవారం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. నిఘా ఉంచిన పోలీసులు మంగళశారం కలహరిరెడ్డిని అరెస్ట్‌చేసి అతడ్నించి రూ.37వేలు నగదు, సెల్‌ఫోన్, కారును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. -
పోలీసుల అదుపులో నకిలీ పోలీసులు ?
మరిపెడ, న్యూస్‌లైన్ : సీఐ, ఎస్సైలమంటూ మండలంలోని పలుగ్రామాల్లో వసూళ్లకు పాల్పడుతున్న కొందరు నకిలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... మండలంలోని ఉల్లెపల్లి, విస్సంపల్లి శివారు తండాల్లో సుమా రు ఆరుగురు వ్యక్తులు రెండు రోజులుగా తిరుగుతూ ప్రజలను పోలీసుల పేరిట భయభ్రాంతులకు గురిచే స్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే గతంలో గంజాయి వ్యాపారంతో సంబంధమున్న ఓ వ్యక్తిని బెదిరించినట్లు సమాచారం. మూడు రోజుల క్రితం వచ్చి ఆయనతోపాటు మరో ఇద్దరిని బెదిరించి రూ లక్ష ఇవ్వాలని, లేదంటే పాత కేసుల్లో ఇరికిం చి జైలుకు పంపిస్తామని బెదిరించినట్లు తెలిసింది. దీంతో వారు రూ 80 వేలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. డబ్బులు ఇస్తామని చెప్పడంతో నకిలీ పోలీసు లు మరిపెడకు గురువారం రాత్రి చేరుకున్నారు. అనంతరం మాదాపురం, ఉల్లేపల్లి శివారు భూక్యతండాకు చెందిన ఇద్దరు వ్యక్తులను నకలీలు తీసుకెళ్లి డబ్బుల కోసం వేధించసాగారు. వారి బంధువులకు సమాచారం అందించడంతో వారు నకిలీ పోలీసులను వెంబడించడమేగాక పోలీసులకు సమాచారమిచ్చారు. వారిలో ము గ్గురిని మండలంలోని ఎల్లంపేట స్టేజీ చాకచక్యంగా ప ట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ రూరల్‌ఎస్పీ లేళ్ల కాళిదాసు రంగారావు మరిపెడ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్రైం రేటును అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీ లించారు. పోలీసులందరిని మండలంలోని పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాంతిభద్రత ల విషయమై ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశా రు. ఆయన వెంట మహబూబాబాద్ డీఎస్పీ రమాదేవి, కురవి సీఐ రవీందర్, మరిపెడ ఎస్సై వెంకయ్య ఉన్నారు. -
‘సూడో’ల ఆటకట్టు
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసులతో పాటు సిటీ పోలీసుల్నీ ముప్పతిప్పలు పెడుతున్న సూడో పోలీసుల కోసం నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) వేట ముమ్మరం చేసింది. పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఏర్పాటైన ఏడు బృందాలు దేశ వ్యాప్తంగా 14 ప్రాంతాల్లో దాడులు చేసి.. తొమ్మిది మంది సూడో పోలీసులను పట్టుకున్నాయని డీసీపీ లేళ్ల కాళిదాస్ వేంకట రంగారావు ఆదివారం వెల్లండించారు. అదనపు డీసీపీ ఎంవీ రావుతో కలిసి ఆయన విలేకరులకు పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ ముఠాలు 2008 నుంచి దేశ వ్యాప్తంగా 50కి పైగా నేరాలు చేసినట్లు ఆయన తెలిపారు. చిరువ్యాపారుల ముసుగులో బస... రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలకు చెందిన ఇరానీ తదితర గ్యాంగులు ‘సూ డో నేరాలు’ చేస్తున్నాయి. దేహ దారుఢ్యమే పె ట్టుబడిగా రెచ్చిపోయే ఈ ముఠాలు ఒంటరిగా వెళ్తున్న మహిళలు, బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేసుకుని వస్తున్న వారినే ఎక్కువగా టా ర్గెట్ చేసి.. బంగారు నగలు, నగదును ఎత్తుకుపోతుంటాయి. వరుస నేరాలు చేయడం కోసం ఒక నగరాన్ని ఎంచుకొని.. ఎనిమిది నుంచి పది మంది ఓ ముఠాగా ఏర్పడి అక్కడ కు చేరుకుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉం డేందుకు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న తక్కువ ఖరీదైన లాడ్జిల్లో విడివిడిగా దిగుతారు. కళ్లజోళ్లు, రంగురాళ్లు అమ్మడానికి వచ్చినట్లు అందరినీ నమ్మిస్తారు. ఈ ముఠాకే చెందిన కొందరు రోడ్డు మార్గంలో ద్విచక్ర, తేలికపాటి వాహనాలనూ తీసుకుని వస్తారు. వెంటే నకిలీ వస్తువులు... సూడోల అవతారంలో ప్రజల్ని మోసం చేసేందుకు వీరు తమ వెంట నకిలీ బంగారు గాజులు, పుస్తెల తాడులు, నగలు, రంగు రాళ్లను తెచ్చుకుంటారు. రెక్కీ చేసి నేరం చేయడానికి అనువుగా ప్రాంతాన్ని గుర్తించి.. టార్గెట్లను ఎంచుకున్న తర్వాత పోలీసులుగా రంగంలోకి దిగి, జాగ్రత్తలు చెప్తున్నట్లు నటిస్తూ దోచుకుంటారు. సాధారణ ప్రజలను తేలిగ్గా బట్టులో వేసుకోవడానికి ఖాకీ రంగు లేదా అదే షేడ్స్‌తో ఉన్న ప్యాంట్లు, జర్కిన్లు, బెల్టులు, రేబాన్ కళ్లద్దాలు ధరిస్తారు. పోలీసులకు తమపై అనుమానం రాకుండా ఉండేందుకు చొక్కాలను మాత్రం సాధారణ రంగులవే వేసుకుంటారు. దృష్టి మరల్చి సొత్తు కాజేయడంతో పాటు చైన్‌స్నాచింగ్స్ కూడా పాల్పడుతుంటారు. భార్యల సహకారంతో విక్రయం... ‘పని’ పూర్తయ్యాక సూడో పోలీసులు నేరస్థలికి సమీపంలో సిద్ధంగా ఉంచుకున్న బైక్, తేలికపాటి వాహనాల్లో ఉడాయిస్తాయి. చోరీ సొత్తును తమ ప్రాంతాలకు తీసుకెళ్లి, భార్యల ద్వారా తమవే అని చెప్పించి విక్రయించి సొమ్ము చేసుకుంటారు. గత నెల్లో ఒకే రోజు నగరంలోని తొమ్మిది చోట్ల పంజా విసిరిన సూడో పోలీసులు అరకేజీకి పైగా బంగారం ఎత్తుకెళ్లారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు కమిషనర్ సీసీఎస్ అధికారుల నేతృత్వంలో ఏడు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలకు పంపారు. ఇన్స్పెక్టర్లు వి.శ్యాంబాబు, పి.రాజు, ఎంబీ శ్రీధర్, రమేష్, అర్జున్, కె.సుబ్బరామిరెడ్డి, మధుమోహన్‌రెడ్డి ఏకకాలంలో దాడులు చేసి తొమ్మిది మందిని పట్టుకున్నారు. చోరీ సొత్తు రికవరీ కోసం కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. చిక్కిన గ్యాంగులకు సంబంధించి పరారీలో ఉన్న వారితో పాటు నగరంలో పంజా విసురుతున్న మరికొన్ని ముఠాల కోసం గాలింపు కొనసాగుతోందని డీసీపీ రంగారావు తెలిపారు. దాడులు చేసిన ప్రాంతాలివీ.. రాష్ట్రంలోని గుంతకల్, వాయల్పాడు, మదనపల్లి, హిందూపూర్ కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా, బెంగళూరు, గదర్ మహారాష్ట్రలోని ముంబ్రా, భివండి, అంబేవలి, శివాజీనగర్, లోని, కౌసా, హరాప్సర్, నాగ్‌పూర్ మధ్యప్రదేశ్‌లోని పివరియా అరెస్టు చేసింది వీరినే... అబాలు జాఫర్ ఇరానీ, ఔలాద్ హుస్సేన్, ఖాదిమ్ హుస్సేన్, మాషల్లా గరీబ్ షా సయ్యద్, మొహ్మద్ అలీ, అబ్బాస్ అలీ, సాధిక్ హుస్సేన్, మొగల్ అబ్బాస్ అలీ, సయ్యద్ జాఫర్ అలీ