సాక్షి, చెన్నై : తిరుచ్చిలో ఎన్‌ఐటీ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన నకిలీ పోలీసును అరెస్టు చేశారు. తిరుచ్చి తువాక్కకుడిలోని ఎన్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన విద్యార్థిని హాస్టల్‌లో ఉంటూ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ విద్యార్థిని చెన్నై కల్పాక్కంకు చెందిన డిప్లొమో చదివిన విద్యార్థిని ప్రేమిస్తోంది. ఆదివారం రాత్రి కళాశాల ముందు ఉన్న బస్టాప్ వద్ద ప్రియుడితో కలిసి కూర్చొని మాట్లాడుతోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన 30 ఏళ్ల ఓ వ్యక్తి తాను పోలీసునని విచారణ చేయాలని చెప్పాడు. ఆ సమయంలో ప్రేమికులిద్దరూ గంజా మత్తులో ఉన్నారు. దీంతో నకిలీ పోలీసు వారిపై దాడి చేయడంతో ప్రియుడు పారిపోయాడు. ప్రియురాలిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన ఆ యువకుడు ఆమెపై లైంగిక దాడి చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న తువాక్కడి పోలీసులు సీసీటీవీ కెమెరాల మూలంగా దుండగుడిని గుర్తించారు. అతను తిరుపెరంబూరుకు చెందిన మణికంఠన్ అని తెలిసింది. దీంతో మణికంఠన్‌ను మంగళవారం పట్టుకోవడానికి ప్రయత్నించారు. అతను పరిగెడుతున్న సమయంలో కిందపడడంతో చేతులు, కాళ్ల ఎముకులకు ఫ్రాక్చర్ అయింది. అరెస్టు చేసి చికిత్సకోసం ఆస్పత్రిలో చేర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment