nit students
-
అత్యధిక సాలరీ ప్యాకేజీ: రూ.1.8 కోట్లు!
సాధారణంగా ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చదివిన విద్యార్థులు అత్యధిక సాలరీ ప్యాకేజీలు దక్కించుకుని వార్తల్లో నిలుస్తుంటారు. అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) పాట్నా విద్యార్థి అభిషేక్ కుమార్ 2022లో అమెజాన్ (Amazon) నుంచి రూ. 1.8 కోట్ల ప్యాకేజీతో జాబ్ ఆఫర్‌ను అందుకుని రికార్డ్ సృష్టించాడు. అభిషేక్ కుమార్ అందుకున్న రూ.1.8 కోట్ల ప్యాకేజీనే ఇప్పటివరకు అత్యధిక శాలరీ ప్యాకేజీగా భావిస్తున్నారు. ఐఐటీలు, ఐఐఎంల విద్యార్థులకు కూడా ఈ స్థాయిలో ప్యాకేజీ లభించలేదు. బిహార్‌లోని ఝఝా నగరానికి చెందిన అభిషేక్ కుమార్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ విద్యార్థి. 2022 ఏప్రిల్ 21న అమెజాన్ నుంచి తన నియామకానికి సంబంధించిన ధ్రువీకరణను అందుకున్నాడు. 2021 డిసెంబర్లో కోడింగ్ పరీక్షలో పాల్గొన్న అభిషేక్ కుమార్ ఆపై 2022 ఏప్రిల్ 13న మూడు రౌండ్ల ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. నివేదికల ప్రకారం.. అభిషేక్‌ని జర్మనీ, ఐర్లాండ్ దేశాలకు చెందిన నిపుణులు ఇంటర్వ్యూ చేశారు. బ్లాక్‌చెయిన్‌లో తనకున్న పరిజ్ఞానంతో వారిని ఆకట్టుకుని అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. అభిషేక్ నైపుణ్యాలివే.. తన నైపుణ్యాల గురించి అభిషేక్ కుమార్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో పేర్కొన్నాడు. దాని ప్రకారం.. అభిషేక్ కుమార్‌కు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఒక సంవత్సరం అనుభవం ఉంది. Java, C++, Spring boot, Javascript, Linuxతోపాటు వివిధ డేటాబేస్‌లలో అనుభవం ఉంది. నెట్వర్కింగ్, బ్యాకెండ్ అండ్ డేటాబేస్ ఇంజనీరింగ్ గురించి లోతైన పరిజ్ఞానం ఉంది. అభిషేక్ కుమార్ కంటే ముందు నిట్ పాట్నాకు చెందిన అదితి తివారీ ఫేస్బుక్ నుంచి అత్యధికంగా రూ.1.6 కోట్ల వేతన ప్యాకేజీ, పాట్నా అమ్మాయి సంప్రీతి యాదవ్ గూగుల్ నుంచి రూ.1.11 కోట్ల ప్యాకేజీని అందుకున్నారు. -
గూగుల్‌కు నర్సీపట్నం యువకుడి ఎంపిక.. భారీ వేతనం!
విశాఖపట్నం: స్థానిక వెలమ వీధికి చెందిన జయంతి విష్ణు యాష్ భారీ వేతనంతో సాఫ్ట్వేర్ కొలువుకు ఎంపికయ్యాడు. విష్ణు హిమచల్‌ప్రదేశ్ ఎన్ఐటీలో బీటెక్ పూర్తి చేసిన అనంతరం యాక్సించర్ కంపెనీకి రూ.8.50 లక్షల వేతనంతో ఎంపికయ్యాడు. తాజాగా బెంగళూరులో ఉన్న గూగుల్ సంస్థ రూ.47.50 లక్షలు వార్షిక వేతనంతో విష్ణును ఎంపిక చేసింది. విష్ణు తండ్రి సత్యనారాయణమూర్తి రిటైర్డ్ వార్డెన్, తల్లి వేదవల్లి గృహిణి, కుమారుడు గూగుల్ సంస్థకు ఎంపిక కావటం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
బ్యూటీస్..క్యాట్‌వాక్
-
గంజా మత్తులో ఉన్న యువతిపై నకిలీ పోలీసు..
సాక్షి, చెన్నై : తిరుచ్చిలో ఎన్ఐటీ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన నకిలీ పోలీసును అరెస్టు చేశారు. తిరుచ్చి తువాక్కకుడిలోని ఎన్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన విద్యార్థిని హాస్టల్లో ఉంటూ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ విద్యార్థిని చెన్నై కల్పాక్కంకు చెందిన డిప్లొమో చదివిన విద్యార్థిని ప్రేమిస్తోంది. ఆదివారం రాత్రి కళాశాల ముందు ఉన్న బస్టాప్ వద్ద ప్రియుడితో కలిసి కూర్చొని మాట్లాడుతోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన 30 ఏళ్ల ఓ వ్యక్తి తాను పోలీసునని విచారణ చేయాలని చెప్పాడు. ఆ సమయంలో ప్రేమికులిద్దరూ గంజా మత్తులో ఉన్నారు. దీంతో నకిలీ పోలీసు వారిపై దాడి చేయడంతో ప్రియుడు పారిపోయాడు. ప్రియురాలిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన ఆ యువకుడు ఆమెపై లైంగిక దాడి చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న తువాక్కడి పోలీసులు సీసీటీవీ కెమెరాల మూలంగా దుండగుడిని గుర్తించారు. అతను తిరుపెరంబూరుకు చెందిన మణికంఠన్ అని తెలిసింది. దీంతో మణికంఠన్‌ను మంగళవారం పట్టుకోవడానికి ప్రయత్నించారు. అతను పరిగెడుతున్న సమయంలో కిందపడడంతో చేతులు, కాళ్ల ఎముకులకు ఫ్రాక్చర్ అయింది. అరెస్టు చేసి చికిత్సకోసం ఆస్పత్రిలో చేర్పించారు. -
‘గేట్’ బద్దలుకొట్టాడు!
సాక్షి, హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్‌లో (గేట్) వరంగల్ ఎన్ఐటీ విద్యార్థి సౌరవ్ కుమార్ సింగ్.. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించాడు. జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన ఐఐటీలతోపాటు ఇతర విద్యా సంస్థల్లో ఎంఈ/ఎంటెక్/పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన గేట్ ఫలితాలను ఐఐటీ గౌహతి శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో జాతీయ స్థాయి ప్రథమ ర్యాంకు సహా 100 లోపు ఏడు ర్యాంకులను వరంగల్ ఎన్ఐటీ విద్యార్థులే కైవసం చేసుకున్నట్లు ఎన్ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు వెల్లడించారు. గత నెల 3, 4, 10, 11 తేదీల్లో 23 సబ్జెక్టుల్లో గేట్‌ను ఐఐటీ గౌహతి నిర్వహించింది. ఇందులో ఎన్ఐటీ విద్యార్థులే కాకుండా ఇతర విద్యార్థుల్లోనూ ఎక్కువ మంది ర్యాంకులను సాధించినట్లు తెలిసింది. ఒక్కసారి సాధించిన గేట్ స్కోర్‌కు మూడేళ్ల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ మూడేళ్లలోగా ఎప్పుడైనా ఎంటెక్ వంటి కోర్సుల్లో ప్రవేశానికి గేట్ ర్యాంకు ఉపయోగపడుతుంది. ఉద్యోగాలకూ ‘గేట్’దాటాల్సిందే! గేట్ స్కోర్ ఉన్న వారికి ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం ఇస్తుండటంతో ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య ఇటీవల పెరిగింది. ఎన్టీపీసీ, గెయిల్, ఐవోసీఎల్, హెచ్ఏఎల్, బీహెచ్ఈఎల్ తదితర సంస్థలు గేట్లో అర్హత సాధించిన వారికే ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈసారి తెలంగాణ రాష్ట్రం నుంచి గేట్‌కు దాదాపు 15 వేల మందికి పైగా విద్యార్థులు హాజరైనట్లు అంచనా. -
20 మంది నిట్ విద్యార్థినులకు అస్వస్థత
వరంగల్: వరంగల్ నిట్‌లో కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అస్వస్థతకు గురైన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని రోహిణి ఆస్పత్రికి తరలించారు. 20 మంది నిట్ విద్యార్థినులు రెండు రోజుల క్రితం క్షిద్ర అనే హోటల్లో చికెన్ బిర్యాని తిన్నారు. దీంతోనే వారికి ఫుడ్‌పాయిజన్ అయి వుంటుందని తోటి విద్యార్థినులు చెబుతున్నారు.