సాధారణంగా ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చదివిన విద్యార్థులు అత్యధిక సాలరీ ప్యాకేజీలు దక్కించుకుని వార్తల్లో నిలుస్తుంటారు. అయితే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) పాట్నా విద్యార్థి అభిషేక్ కుమార్ 2022లో అమెజాన్ (Amazon) నుంచి రూ. 1.8 కోట్ల ప్యాకేజీతో జాబ్ ఆఫర్‌ను అందుకుని రికార్డ్ సృష్టించాడు.
అభిషేక్ కుమార్ అందుకున్న రూ.1.8 కోట్ల ప్యాకేజీనే ఇప్పటివరకు అత్యధిక శాలరీ ప్యాకేజీగా భావిస్తున్నారు. ఐఐటీలు, ఐఐఎంల విద్యార్థులకు కూడా ఈ స్థాయిలో ప్యాకేజీ లభించలేదు. బిహార్‌లోని ఝఝా నగరానికి చెందిన అభిషేక్ కుమార్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ విద్యార్థి. 2022 ఏప్రిల్ 21న అమెజాన్ నుంచి తన నియామకానికి సంబంధించిన ధ్రువీకరణను అందుకున్నాడు. 2021 డిసెంబర్‌లో కోడింగ్ పరీక్షలో పాల్గొన్న అభిషేక్ కుమార్ ఆపై 2022 ఏప్రిల్ 13న మూడు రౌండ్ల ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. నివేదికల ప్రకారం.. అభిషేక్‌ని జర్మనీ, ఐర్లాండ్ దేశాలకు చెందిన నిపుణులు ఇంటర్వ్యూ చేశారు. బ్లాక్‌చెయిన్‌లో తనకున్న పరిజ్ఞానంతో వారిని ఆకట్టుకుని అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు.
అభిషేక్ నైపుణ్యాలివే..
తన నైపుణ్యాల గురించి అభిషేక్ కుమార్ తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో పేర్కొన్నాడు. దాని ప్రకారం.. అభిషేక్ కుమార్‌కు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఒక సంవత్సరం అనుభవం ఉంది. Java, C++, Spring boot, Javascript, Linuxతోపాటు వివిధ డేటాబేస్‌లలో అనుభవం ఉంది. నెట్‌వర్కింగ్, బ్యాకెండ్ అండ్ డేటాబేస్ ఇంజనీరింగ్ గురించి లోతైన పరిజ్ఞానం ఉంది.
అభిషేక్ కుమార్ కంటే ముందు నిట్ పాట్నాకు చెందిన అదితి తివారీ ఫేస్‌బుక్ నుంచి అత్యధికంగా రూ.1.6 కోట్ల వేతన ప్యాకేజీ, పాట్నా అమ్మాయి సంప్రీతి యాదవ్ గూగుల్ నుంచి రూ.1.11 కోట్ల ప్యాకేజీని అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment