highest salary package
-
భారత్‌లో ఎక్కువ జీతం వారికే.. సర్వేలో వెల్లడైన సంచలన నిజాలు!
ఆధునిక భారతదేశంలో నేడు ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొంతమంది రూ. వేలలో శాలరీ తీసుకుంటున్నారు, మరి కొంత మంది రూ. లక్షల్లో శాలరీలు తీసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది నిర్వహించిన ఒక సర్వేలో దేశ ప్రజల సగటు వార్షిక జీతం ఎంత.. జాబితాలో టాప్‌లో ఉన్న నగరం ఏది? హైదరాబాద్, బెంగళూరు ఎక్కడ ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఇండియాలో సుమారు 11,570 సర్వేల నుంచి తీసుకున్న డేటా ఆధారంగా ఒక నివేదిక రూపొందించారు. ఇందులో పురుషుల సగటు జీతం రూ. 19,53,055 కాగా.. మహిళలు ఇందులో రూ. 15,16,296 జీతం పొందుతున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.. మహిళల సరాసరి జీతం పురుషుల కంటే తక్కువ అని స్పష్టమవుతోంది. మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ వంటి వాటిలో పనిచేస్తున్న వారి జీతాలు బాగా ఉన్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. వీటి తరువాత న్యాయ వృత్తిలో ఉన్న వారు మూడవ స్థానంలో ఉన్నట్లు సమాచారం. ఆదాయం పరంగా ఎక్స్పీరియన్స్ అనేది కీలక పాత్ర పోషిస్తోంది. 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్నవారికి జీతాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: నారాయణ మూర్తి లాంటి భర్తకు భార్యగా ఉండటం అంత ఈజీ కాదు!) నగరాలలో ఎక్కువ జీతం పొందుతున్న జాబితాలో మహారాష్ట్రలోని టైర్ 2 నగరమైన సోలాపూర్ (రూ. 28,10,000) అత్యధిక సగటు వార్షిక వేతన ప్యాకేజీని కలిగి ఉంది. రూ. 21.17 లక్షల వార్షిక వేతనంతో ముంబై రెండో స్థానంలో ఉండగా, రూ. 21.01 లక్షల జీతంతో బెంగళూరు 3వ స్థానంలో నిలిచింది. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) సుమారు 59 మంది సీఈఓల జీతాలపై సర్వే నిర్వహించి వారి సగటు వార్షిక జీతం రూ. 60,48,703. దీని ప్రకారం అత్యధిక వేతనం పొందుతున్న వారుగా సీఈఓలు నిలిచారు. ఆ తరువాత డైరెక్టర్లు (రూ. 58,50,925) జనరల్ మేనేజర్లు (రూ. 42,35,740) కంప్యూటర్ ఆర్కిటెక్ట్‌లు (రూ. 33,37,499) ఉన్నారు. రాష్ట్రాల వారీగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలోనూ ఆ తరువాత పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు నిలిచాయి. -
అత్యధిక సాలరీ ప్యాకేజీ: రూ.1.8 కోట్లు!
సాధారణంగా ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చదివిన విద్యార్థులు అత్యధిక సాలరీ ప్యాకేజీలు దక్కించుకుని వార్తల్లో నిలుస్తుంటారు. అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) పాట్నా విద్యార్థి అభిషేక్ కుమార్ 2022లో అమెజాన్ (Amazon) నుంచి రూ. 1.8 కోట్ల ప్యాకేజీతో జాబ్ ఆఫర్‌ను అందుకుని రికార్డ్ సృష్టించాడు. అభిషేక్ కుమార్ అందుకున్న రూ.1.8 కోట్ల ప్యాకేజీనే ఇప్పటివరకు అత్యధిక శాలరీ ప్యాకేజీగా భావిస్తున్నారు. ఐఐటీలు, ఐఐఎంల విద్యార్థులకు కూడా ఈ స్థాయిలో ప్యాకేజీ లభించలేదు. బిహార్‌లోని ఝఝా నగరానికి చెందిన అభిషేక్ కుమార్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ విద్యార్థి. 2022 ఏప్రిల్ 21న అమెజాన్ నుంచి తన నియామకానికి సంబంధించిన ధ్రువీకరణను అందుకున్నాడు. 2021 డిసెంబర్లో కోడింగ్ పరీక్షలో పాల్గొన్న అభిషేక్ కుమార్ ఆపై 2022 ఏప్రిల్ 13న మూడు రౌండ్ల ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. నివేదికల ప్రకారం.. అభిషేక్‌ని జర్మనీ, ఐర్లాండ్ దేశాలకు చెందిన నిపుణులు ఇంటర్వ్యూ చేశారు. బ్లాక్‌చెయిన్‌లో తనకున్న పరిజ్ఞానంతో వారిని ఆకట్టుకుని అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. అభిషేక్ నైపుణ్యాలివే.. తన నైపుణ్యాల గురించి అభిషేక్ కుమార్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో పేర్కొన్నాడు. దాని ప్రకారం.. అభిషేక్ కుమార్‌కు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఒక సంవత్సరం అనుభవం ఉంది. Java, C++, Spring boot, Javascript, Linuxతోపాటు వివిధ డేటాబేస్‌లలో అనుభవం ఉంది. నెట్వర్కింగ్, బ్యాకెండ్ అండ్ డేటాబేస్ ఇంజనీరింగ్ గురించి లోతైన పరిజ్ఞానం ఉంది. అభిషేక్ కుమార్ కంటే ముందు నిట్ పాట్నాకు చెందిన అదితి తివారీ ఫేస్బుక్ నుంచి అత్యధికంగా రూ.1.6 కోట్ల వేతన ప్యాకేజీ, పాట్నా అమ్మాయి సంప్రీతి యాదవ్ గూగుల్ నుంచి రూ.1.11 కోట్ల ప్యాకేజీని అందుకున్నారు. -
హయ్యస్ట్ సాలరీతో మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టేసిన అవని మల్హోత్రా
న్యూఢిల్లీ: ఐఐఎం సంబల్పూర్ విద్యార్థులు ప్లేస్మెంట్లు, వేతనాల విషయంలో సరికొత్త రికార్డ్ సాధించారు. గత 7 సంవత్సరాల మాదిరిగానే, ఈ సారి 2021-2023 ఏడాదికి గాను 100శాతం ప్లేస్‌మెంట్స్‌తో సంస్థ చరిత్ర సృష్టించింది. 2023లో ఎంబీఏ ఉత్తీర్ణులైన 167 మంది విద్యార్థులు వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు పొందగా, వీరిలో 80మంది విద్యార్థినులున్నారు. వీరిలో 65 లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సాధించి అవని మల్హోత్రా టాప్ ప్లేస్ కొట్టేసింది. హయ్యస్ట్ ప్యాకేజీ అందుకున్న వరుసలో తమిళనాడు, రాజస్థాన్ విద్యార్థులు నిలిచారు. (రెడ్మి 12సీ, రెడ్మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే) అవని మల్హోత్రా ఎవరు? జైపూర్‌కు చెందిన అవనిమల్హోత్రా మైక్రోసాఫ్ట్‌లో భారీ ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధించి వార్తల్లో నిలిచింది. ఏకంగా 64.61 లక్షల వార్షిక జీతాన్ని అందుకోనుంది. పట్టుదల, కృషి ఉంటే విజయం వచ్చి వరిస్తుందనే మాటకు నిదర్శనంగా తన డ్రీమ్ జాబ్‌ను కొట్టేసింది అవని. ఐదారు రౌండ్ల ఇంటర్వ్యూల్లో విజయం సాధించి జాక్‌పాట్ కొట్టేసింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో మూడేళ్లపాటు సేవలందించిన అనుభవం, సంస్థాగత సామర్థ్యం కారణంగా ఆమెను ఎంపిక చేశారట. దీంతోపాటు కంప్యూటర్ సైన్స్‌లో బీ.టెక్ చదవడం ప్రత్యేకంగా నిల బెట్టిందని చెప్పింది. ఈ చాలెంజ్‌ను ఛేదించడంలో సాయం చేసిన ప్రొఫెసర్లకు, తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. (ఇదీ చదవండి: అచ్చం యాపిల్ స్మార్ట్‌వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!) ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ, తమ విద్యార్థుల గొప్ప ప్లేస్మెంట్ సాధించారని ఐఐఎం సంబల్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మహదేవ్ జైస్వాల్ సంతోషం ప్రకటించారు. తమ సంస్థలో సంవత్సరానికి అత్యధిక జీతం రూ. 64.61 లక్షలుండగా, సగటు జీతం రూ. 16 లక్షలుగా ఉందని తెలిపారు. మైక్రోసాఫ్ట్, వేదాంత, తోలారం, అమూల్, అదానీ, ఈవై, యాక్సెంచర్, కాగ్నిజెంట్, డెలాయిట్, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థల్లో తమ విద్యార్థులు ప్లేస్ అవుతున్నారన్నారు. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) -
కాన్పూర్ ఐఐటీ విద్యార్థులకు బంపర్ ఆఫర్
కాన్పూర్: కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఇద్దరు విద్యార్థులకు బంపర్ ఆఫర్ లభించింది. ఐటీ దిగ్గజం ఒరాకిల్ కంపెనీ వీరిని ఏడాదికి రూ.1.2 కోట్ల భారీ వేతన ప్యాకేజీతో ఉద్యోగాల్లోకి తీసుకుంది. కాన్పూర్ ఐఐటీలో సాగుతున్న క్యాంపస్ రిక్రూట్మెంట్లో సోమవారం వీరికి కొలువులు ఇచ్చింది. మరో 76 మందికి గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ తదితర కంపెనీలు ఏడాదికి రూ.8 లక్షల నుంచి రూ.24 లక్షల వేతనం గల ఉద్యోగాలు ఇచ్చాయి. ఈ రోజు వరకు 180 మంది ఆఫర్ లెటర్లు అందుకున్నారు. 1,100 మంది బీటెక్, ఎమ్ టెక్, ఎంబీఏ, ఎమ్మెస్సీ విద్యార్థులు ఉద్యోగాల కోసం ప్లేస్ మెంట్ సెల్ లో పేర్లు నమోదు చేసుకున్నారు.