ఆధునిక భారతదేశంలో నేడు ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొంతమంది రూ. వేలలో శాలరీ తీసుకుంటున్నారు, మరి కొంత మంది రూ. లక్షల్లో శాలరీలు తీసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది నిర్వహించిన ఒక సర్వేలో దేశ ప్రజల సగటు వార్షిక జీతం ఎంత.. జాబితాలో టాప్‌లో ఉన్న నగరం ఏది? హైదరాబాద్, బెంగళూరు ఎక్కడ ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, ఇండియాలో సుమారు 11,570 సర్వేల నుంచి తీసుకున్న డేటా ఆధారంగా ఒక నివేదిక రూపొందించారు. ఇందులో పురుషుల సగటు జీతం రూ. 19,53,055 కాగా.. మహిళలు ఇందులో రూ. 15,16,296 జీతం పొందుతున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.. మహిళల సరాసరి జీతం పురుషుల కంటే తక్కువ అని స్పష్టమవుతోంది.
మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ వంటి వాటిలో పనిచేస్తున్న వారి జీతాలు బాగా ఉన్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. వీటి తరువాత న్యాయ వృత్తిలో ఉన్న వారు మూడవ స్థానంలో ఉన్నట్లు సమాచారం. ఆదాయం పరంగా ఎక్స్పీరియన్స్ అనేది కీలక పాత్ర పోషిస్తోంది. 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్నవారికి జీతాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: నారాయణ మూర్తి లాంటి భర్తకు భార్యగా ఉండటం అంత ఈజీ కాదు!)
నగరాలలో ఎక్కువ జీతం పొందుతున్న జాబితాలో మహారాష్ట్రలోని టైర్ 2 నగరమైన సోలాపూర్ (రూ. 28,10,000) అత్యధిక సగటు వార్షిక వేతన ప్యాకేజీని కలిగి ఉంది. రూ. 21.17 లక్షల వార్షిక వేతనంతో ముంబై రెండో స్థానంలో ఉండగా, రూ. 21.01 లక్షల జీతంతో బెంగళూరు 3వ స్థానంలో నిలిచింది.
(ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!)
సుమారు 59 మంది సీఈఓల జీతాలపై సర్వే నిర్వహించి వారి సగటు వార్షిక జీతం రూ. 60,48,703. దీని ప్రకారం అత్యధిక వేతనం పొందుతున్న వారుగా సీఈఓలు నిలిచారు. ఆ తరువాత డైరెక్టర్లు (రూ. 58,50,925) జనరల్ మేనేజర్లు (రూ. 42,35,740) కంప్యూటర్ ఆర్కిటెక్ట్లు (రూ. 33,37,499) ఉన్నారు. రాష్ట్రాల వారీగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలోనూ ఆ తరువాత పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment