Top city
-
రిటైల్ షాపింగ్ మాల్స్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టాప్–8 పట్టణాల్లో 2024–27 మధ్య కాలంలో 18 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) గ్రేడ్–ఏ రిటైల్ షాపింగ్ మాల్స్ విస్తీర్ణం (స్పేస్/వసతి) అందుబాటులోకి వస్తుందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ అంచనా వేసింది. ఈ కాలంలో తాజా డిమాండ్‌లో ఇది మూడింట ఒక వంతుగా తెలిపింది. భారత్‌లో తలసరి రిటైల్ స్పేస్ ఇండోనేíÙయా, ఫిలిప్పీన్స్, థాయిల్యాండ్, వియత్నాం తదితర దక్షిణాసియా దేశాల కంటే తక్కువగా ఉందని.. రిటైల్ స్పేస్ భారీ వృద్ధి అవకాశాలను ఇది తెలియజేస్తోందని పేర్కొంది. ప్రస్తుతం టాప్–8 పట్టణాల్లో రిటైల్ స్పేస్ 60 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు తెలిపింది. అంటే 2027 నాటికి మొత్తం రిటైల్ మాల్స్ విస్తీర్ణం 78 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకోన్నట్టు అంచనా వేసింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో కొత్తగా ఒక్క మాల్ కూడా నిర్వహణలోకి రాలేదని తెలిపింది. భారత్ మాదిరే తలసరి ఆదాయం కలిగిన ఇండోనేíÙయాతో పోల్చి చూస్తే.. 2027 నాటికి తలసరి రిటైల్ స్పేస్ 1.0కు చేరుకునేందుకు గాను భారత్‌లో 55 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర అదనంగా రిటైల్ మాల్స్ నిరి్మంచాల్సిన అవసరం ఉంటుందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వివరించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, ఢిల్లీ ఎన్సీఆర్, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాలకు సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి. సరఫరా పెరిగేలా చర్యలు అవసరం.. ‘‘భారత రిటైల్ రంగం కీలక దశలో ఉంది. వినియోగదారుల విశ్వాసం, విచక్షణారహిత వినియోగం పెరుగుతుండడం ఈ రంగం సామర్థ్యాలను తెలియజేస్తోంది. ఈ వృద్ధి అవకాశాలను సది్వనియోగం చేసుకునేందుకు సరఫరా వైపు సవాళ్లను పరిష్కరించడం ఎంతో అవసరం. నాణ్యమైన రిటైల్ వసతులు లభించేలా చర్యలు తీసుకోవాలి. చురుకైన భారత రిటైల్ మార్కెట్ అవసరాలను తీర్చేందుకు 55 మిలియన్ ఎస్ఎఫ్టీ గ్రేడ్–ఏ వసతి అదనంగా అవసరం. ఈ దిశగా స్థిరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు పరిశ్రమ భాగస్వాముల సమిష్టి కృషి అవసరం. తద్వారా భారత రిటైల్ రంగం పూర్తి సామర్థ్యాలను అందుకోగలుగుతుంది’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ సౌరభ్ శట్దాల్ వివరించారు. గురుగ్రామ్ తదితర పట్టణాల్లో నాణ్యమైన రిటైల్ మాల్ వసతులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నట్టు సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ సైతం తెలిపారు. మెరుగైన షాపింగ్, వినోదం అన్నింటినీ ఒకే చోట వినియోగదారులు కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రీమియం షాపింగ్ డిమాండ్ ప్రస్తుత సరఫరా మించి ఉన్నట్టు ఎలారా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ వినీత్ దావర్ తెలిపారు. టైర్–2, 3 నగరాల్లో మాల్స్ విస్తరణ వేగంగా జరుగుతున్నట్టు చెప్పారు. -
ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరం
ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) తాజాగా విడుదల చేసిన గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024లో ఆస్ట్రియాలోని వియన్నా టాప్ ర్యాంక్ దక్కించుకుంది. వరుసగా మూడోసారి ఈ స్థానం సంపాదించిన నగరంగా రికార్డుల్లో నిలిచింది. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణం, విద్య, మౌలిక సదుపాయాల ఆధారంగా నగరాలకు ర్యాంక్ ఇస్తున్నారు.టాప్ 10 నివాసయోగ్యమైన నగరాలు ఇవే..1. వియన్నా, ఆస్ట్రియా2. కోపెన్హాగన్, డెన్మార్క్3. జ్యూరిచ్, స్విట్జర్లాండ్4. మెల్బోర్న్, ఆస్ట్రేలియా5. కాల్గరీ, కెనడా6. జెనీవా, స్విట్జర్లాండ్7. సిడ్నీ, ఆస్ట్రేలియా8. వాంకోవర్, కెనడా9. ఒసాకా, జపాన్10. ఆక్లాండ్, న్యూజిలాండ్జాబితాలో దిగువన ఉన్న 10 నగరాలు1. కారకాస్, వెనిజులా2. కీవ్, ఉక్రెయిన్3. పోర్ట్ మోర్స్బీ, పపువా న్యూ గినియా4. హరారే, జింబాబ్వే5. ఢాకా, బంగ్లాదేశ్6. కరాచీ, పాకిస్థాన్7. లాగోస్, నైజీరియా8. అల్జీర్స్, అల్జీరియా9. ట్రిపోలీ, లిబియా10. డమాస్కస్, సిరియా -
విలాస గృహాలకు గిరాకీ
న్యూఢిల్లీ: ప్రముఖ పట్టణాల్లో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ బలంగా కనిపిస్తోంది. హైదరాబాద్ సహా టాప్–7 పట్టణాల్లో రూ.4 కోట్లు, అంతకుమించి ఖరీదు చేసే ఇళ్ల విక్రయాలు గతేడాది (2023లో) 75 శాతం అధికంగా నమోదయ్యాయి. సంపన్నులు (హెచ్ఎన్ఐలు) లగ్జరీ ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ తన తాజా నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌లో గతేడాది విలాస గృహాల అమ్మకాలు 2,030 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది (2022)లో ఇవి 1,240 యూనిట్లు కావడం గమనార్హం. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో రూ.4 కోట్లు, అంతకుమించి విలువైన ఇళ్ల అమ్మకాలు 2023లో 12,935 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే విభాగంలో 7,395 ఇళ్లు అమ్ముడుపోయాయి. ‘‘ఖరీదైన, విలాసవంతమైన ఇళ్లకు ఉన్న ఆకర్షణ కొనసాగుతుంది. మార్కెట్ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడంతో సమీప భవిష్యత్తులో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదవుతుంది. ప్రాంతీయంగా కొంత అస్థిరతలు ఉండొచ్చు. మొత్తం మీద భవిష్యత్ మార్కెట్ అనుకూలంగానే ఉంటుంది’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజీన్ తెలిపారు. పట్టణాల వారీగా.. ► ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు 2023లో 5,530 యూనిట్లుగా ఉన్నాయి. 2022లో అమ్మకాలు 1,860 యూనిట్లతో పోలిస్తే రెండు రెట్లు పెరిగాయి. ► ముంబైలో 4,190 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఏడాదిలో అమ్మకాలు 3,390 యూనిట్లుగా ఉన్నాయి. ► పుణెలో 450 యూనిట్ల విక్రయాలు గతేడాది నమోయ్యాయి. అంతకుముందు ఏడాది ఇవి 190 యూనిట్లుగా ఉన్నాయి. ► బెంగళూరులో అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఎలాంటి మార్పు లేకుండా 265 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ► కోల్‌కతాలో 2022లో 300 యూనిట్ల లగ్జరీ ఇళ్లు అమ్ముడుపోగా, గతేడాది ఇవి 310 యూనిట్లకు పెరిగాయి. ► చెన్నైలోనూ విక్రయాలు 150 యూనిట్ల నుంచి 160 యూనిట్లకు పెరిగాయి. ► 2023లో దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో అన్ని రకాల ధరల కేటగిరీల్లో ఇళ్ల అమ్మకాలు 3,22,000 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 9 శాతం అధికం. ► మెరుగైన డిమాండ్ నేపథ్యంలో డెవలపర్లు 3,13,000 యూనిట్ల కొత్త ఇళ్ల యూనిట్లను ప్రారంభించారు. 2022తో పోలిస్తే ఇది 6 శాతం ఎక్కువ. ఆర్థిక స్థితిలో మార్పు. ‘‘బలమైన ఆర్థిక వృద్ధి నేపథ్యంలో ఖర్చు చేసే ఆదాయం పెరుగుతోంది. మెరుగైన ఉపాధి అవకాశాలు ఏ్పడుతున్నాయి. దీంతో మరింత మందికి మెరుగైన జీవనశైలి చేరువ అవుతోంది. పేరొందిన సొసైటీల్లో విలాసవంతమైన ఇళ్లను కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. వాటి కోసం ఎక్కువ ఖర్చు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు’’అని గురుగ్రామ్‌కు చెందిన రియల్టీ సంస్థ క్రిసుమి కార్పొరేషన్ ఎండీ మోహిత్ జైన్ పేర్కొన్నారు. ఈ ధోరణి ఇక ముందూ కొనసాగడమే కాకుండా, భారత్ వేగవంతమైన వృద్ధి నేపథ్యంలో మరింత విస్తరిస్తుందని అభిప్రాయపడ్డారు. -
భారత్‌లో ఎక్కువ జీతం వారికే.. సర్వేలో వెల్లడైన సంచలన నిజాలు!
ఆధునిక భారతదేశంలో నేడు ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొంతమంది రూ. వేలలో శాలరీ తీసుకుంటున్నారు, మరి కొంత మంది రూ. లక్షల్లో శాలరీలు తీసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది నిర్వహించిన ఒక సర్వేలో దేశ ప్రజల సగటు వార్షిక జీతం ఎంత.. జాబితాలో టాప్‌లో ఉన్న నగరం ఏది? హైదరాబాద్, బెంగళూరు ఎక్కడ ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఇండియాలో సుమారు 11,570 సర్వేల నుంచి తీసుకున్న డేటా ఆధారంగా ఒక నివేదిక రూపొందించారు. ఇందులో పురుషుల సగటు జీతం రూ. 19,53,055 కాగా.. మహిళలు ఇందులో రూ. 15,16,296 జీతం పొందుతున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.. మహిళల సరాసరి జీతం పురుషుల కంటే తక్కువ అని స్పష్టమవుతోంది. మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ వంటి వాటిలో పనిచేస్తున్న వారి జీతాలు బాగా ఉన్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. వీటి తరువాత న్యాయ వృత్తిలో ఉన్న వారు మూడవ స్థానంలో ఉన్నట్లు సమాచారం. ఆదాయం పరంగా ఎక్స్పీరియన్స్ అనేది కీలక పాత్ర పోషిస్తోంది. 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్నవారికి జీతాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: నారాయణ మూర్తి లాంటి భర్తకు భార్యగా ఉండటం అంత ఈజీ కాదు!) నగరాలలో ఎక్కువ జీతం పొందుతున్న జాబితాలో మహారాష్ట్రలోని టైర్ 2 నగరమైన సోలాపూర్ (రూ. 28,10,000) అత్యధిక సగటు వార్షిక వేతన ప్యాకేజీని కలిగి ఉంది. రూ. 21.17 లక్షల వార్షిక వేతనంతో ముంబై రెండో స్థానంలో ఉండగా, రూ. 21.01 లక్షల జీతంతో బెంగళూరు 3వ స్థానంలో నిలిచింది. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) సుమారు 59 మంది సీఈఓల జీతాలపై సర్వే నిర్వహించి వారి సగటు వార్షిక జీతం రూ. 60,48,703. దీని ప్రకారం అత్యధిక వేతనం పొందుతున్న వారుగా సీఈఓలు నిలిచారు. ఆ తరువాత డైరెక్టర్లు (రూ. 58,50,925) జనరల్ మేనేజర్లు (రూ. 42,35,740) కంప్యూటర్ ఆర్కిటెక్ట్‌లు (రూ. 33,37,499) ఉన్నారు. రాష్ట్రాల వారీగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలోనూ ఆ తరువాత పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు నిలిచాయి. -
ప్రీమియం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌లో బెంగళూరు టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ (గ్రేడ్–ఏ) విభాగంలో బెంగళూరు కొత్త రికార్డు నమోదు చేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2022 సెప్టెంబర్ నాటికి 1.06 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంతో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. కమర్షియల్ రియల్ ఎస్టేట్ సర్వీసుల్లో ఉన్న సీబీఆర్ఈ ఇండియా ప్రకారం.. షాంఘై, బీజింగ్, సియోల్, టోక్యో, సింగపూర్ వంటి 11 ప్రధాన నగరాలను తలదన్ని బెంగళూరు ముందు వరుసలో నిలిచింది. షాంఘై ఒక కోటి, బీజింగ్ 76 లక్షల చ.అడుగుల విస్తీర్ణంతో ఆ తర్వాతి స్థానాలను అందుకున్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఫ్లెక్సిబుల్ ఏ–గ్రేడ్ ఆఫీస్ స్థలంలో భారతదేశం ముందుంది. 12 నగరాలతో కూడిన జాబితాలో 66 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఢిల్లీ–ఎన్సీఆర్ అయిదవ స్థానంలో ఉంది. 57 లక్షల చ.అడుగులతో హైదరాబాద్ ఏడవ స్థానం ఆక్రమించింది. ఆసియా పసిఫిక్‌లో ప్రీమియం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ రంగంలో ఈ మూడు నగరాల వాటా ఏకంగా 35 శాతానికి చేరింది. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే గ్రేడ్–ఏ కార్యాలయ భవనాలలో భారత్, సింగపూర్ అత్యధిక ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్థలం కలిగి ఉన్నాయి. భారత్ అత్యధిక వృద్ధి.. మొత్తం ప్రీమియం ఆఫీస్ స్పేస్‌లో 5.5 శాతం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ వాటాతో హైదరాబాద్ తొలి స్థానంలో ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మహమ్మారి తర్వాత ఫ్లెక్సీ–ఆఫీస్ మార్కెట్లో భారత్ అత్యధిక వృద్ధిని సాధిస్తోంది. ఆసియా పసిఫిక్‌లో ఫ్లెక్సిబుల్ స్థలం 6 శాతం వార్షిక వృద్ధితో 7.6 కోట్ల చ.అడుగులు ఉంది. మహమ్మారి ముందు కాలంతో పోలిస్తే 2022 జనవరి–సెప్టెంబర్‌లో 15 శాతం వృద్ధి చెందింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొత్తం ఫ్లెక్సిబుల్ కేంద్రాల సంఖ్య సుమారు 3,000 ఉంది. ఫ్లెక్సిబుల్ స్థల వినియోగంలో సాంకేతిక కంపెనీలు 36 శాతం, బిజినెస్ సర్వీసులు 28 శాతం కైవసం చేసుకున్నాయి. ఫైనాన్స్, లైఫ్ సైన్సెస్, రిటైల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్లు స్వల్పకాలిక ఒప్పందాలు, అనువైన నిబంధనలతో సేవలు అందిస్తున్నాయి. దీంతో క్లయింట్లకు వ్యయాలు తగ్గుతున్నాయి’ అని ద్వారక ఆఫీస్ స్పేసెస్ ఎండీ ఆర్.ఎస్.ప్రదీప్ రెడ్డి తెలిపారు. ఫ్లెక్సిబుల్ కేంద్రాల్లో కార్యాలయాల నిర్వహణకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. -
ఆ స్థలాల లీజింగ్‌లో దూసుకెళ్తున్న హైదరాబాద్!
న్యూఢిల్లీ: ఆఫీసు స్థలాల లీజు అక్టోబర్ నెలలో 21 శాతం తక్కువగా నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ సేవల్లోని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో మొత్తం 6.7 మిలియన్ చదరపు అడుగుల మేర కార్యాలయాల స్థలాల లీజు నమోదైనట్టు విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణె, కోల్‌కతాకు సంబంధించి వివరాలను వెల్లడించింది. అన్ని రకాల ఆఫీసు లీజు వివరాలను పరిగణనలోకి తీసుకుంది. క్రితం ఏడాది అక్టోబర్ నెలకు సంబంధించి ఆఫీసు లీజ్ పరిమాణం 8.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. నెలవారీ లీజు పరిమాణంలో 65 శాతం వాటాతో ముంబై ముందుంది. ముంబై మార్కెట్లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ బలంగా ఉండడానికి తోడు, కొన్ని రెన్యువల్స్ (గడువు తీరిన లీజు పునరుద్ధరణ) నమోదైనట్టు జేఎల్ఎల్ నివేదిక వివరించింది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్, పుణె మార్కెట్లు అధిక వాటాతో ఉన్నాయి. ఈ మూడు మార్కెట్ల వాటా అక్టోబర్ నెలకు సంబంధించి ఆఫీసు లీజు పరిమాణంలో 93 శాతంగా ఉంది. తయారీ రంగం నుంచి డిమాండ్ తయారీ రంగం నుంచి ఎక్కువ డిమాండ్ కనిపించింది. 22 శాతం ఆఫీస్ స్పేస్‌ను తయారీ కంపెనీలే లీజుకు తీసుకున్నాయి. కన్సల్టెన్సీ రంగం 18 శాతం, బీఎఫ్ఎస్ఐ రంగం ఇంతే చొప్పున లీజుకు తీసుకున్నాయి. టెక్నాలజీ రంగ కంపెనీల వాటా 15 శాతంగా ఉంది. ఆఫీస్ స్పేస్ లీజు విషయంలో టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికీ నిదానంగా అడుగులు వేస్తున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. జేఎల్ఎల్ ఇండియా డేటా ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికి ఆఫీస్ గ్రేడ్ ఏ (ప్రీమియం) విస్తీర్ణం ఈ ఏడు పట్టణాల్లో 732 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇతర గ్రేడ్లలోని విస్తీర్ణం 370 మిలియన్ చదరపు అడుగుల మేర ఉంది. మొత్తం 1.1 బిలియన్ చదరపు అడుగులు ఉన్నట్టు ఈ నివేదిక తెలియజేసింది. చదవండి: పీఎన్బీ కస్టమర్లకు అలర్ట్.. ఇది తప్పనిసరి, లేదంటే మీ బ్యాంక్ ఖాతాపై ఆంక్షలు తప్పవ్! -
అందులో మైసూరే టాప్
న్యూఢిల్లీ: దేశంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం స్వచ్ఛ భారత్‌ను అమలు చేసే నగరాల్లో దక్షిణ భారత విశిష్ట నగరం మైసూర్ నిలిచింది. దేశంలోని మొత్తం 476 నగరాల్లో తొలిస్థానంలో నిలిచింది. దీంతోపాటు కర్ణాటక రాష్ట్రంలోని మూడు నగరాలు టాప్ టెన్ లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక ఢిల్లీలోని న్యూఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్(ఎన్డీఎంసీ) కి 16వ స్థానం దక్కగా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి 398వ స్థానం దక్కడం గమనార్హం. ఇక 100 టాప్ నగరాల్లో పశ్చిమ బెంగాల్ నుంచి 25 నగరాలు నిలిచాయి. ఈ ర్యాంకులన్నింటిని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించిన నియమనిబంధనల అనుసారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని అమలు చేసినందుకు ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి 39 నగరాలు టాప్ 100లో నిలిచాయి. బెంగళూరుకు 7వ స్థానం, పాట్నాకు 429 ర్యాంకు వచ్చింది. స్వచ్ఛ భారత్ అమలుపరిచే నగరాల్లో టాప్ టెన్ ఇవే... మైసూరు తిరుచిరాపల్లి నవీ ముంబయి కొచ్చి హస్సన్ మాంద్య బెంగళూరు తిరువనంతపురం హలిసహర్ గాంగ్ టక్