అందులో మైసూరే టాప్ | Mysore Tops Swachh Bharat Rankings Among 476 Cities in India | Sakshi
Sakshi News home page

అందులో మైసూరే టాప్

Published Mon, Aug 10 2015 8:34 AM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

Mysore Tops Swachh Bharat Rankings Among 476 Cities in India

న్యూఢిల్లీ: దేశంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం స్వచ్ఛ భారత్ను అమలు చేసే నగరాల్లో దక్షిణ భారత విశిష్ట నగరం మైసూర్ నిలిచింది. దేశంలోని మొత్తం 476 నగరాల్లో తొలిస్థానంలో నిలిచింది. దీంతోపాటు కర్ణాటక రాష్ట్రంలోని మూడు నగరాలు టాప్ టెన్ లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక ఢిల్లీలోని న్యూఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్(ఎన్డీఎంసీ) కి 16వ స్థానం దక్కగా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి 398వ స్థానం దక్కడం గమనార్హం.

ఇక 100 టాప్ నగరాల్లో పశ్చిమ బెంగాల్ నుంచి 25 నగరాలు నిలిచాయి. ఈ ర్యాంకులన్నింటిని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించిన నియమనిబంధనల అనుసారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని అమలు చేసినందుకు ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి 39 నగరాలు టాప్ 100లో నిలిచాయి. బెంగళూరుకు 7వ స్థానం, పాట్నాకు 429 ర్యాంకు వచ్చింది.
స్వచ్ఛ భారత్ అమలుపరిచే నగరాల్లో టాప్ టెన్ ఇవే...
మైసూరు
తిరుచిరాపల్లి
నవీ ముంబయి
కొచ్చి
హస్సన్
మాంద్య
బెంగళూరు
తిరువనంతపురం
హలిసహర్
గాంగ్ టక్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement