ఉద్యోగం ఇచ్చేవాళ్లు విద్యార్హత చూస్తారు.. లేదా స్కిల్స్ చూస్తారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ మాత్రం దీనికి భిన్నమైన రూల్స్ పెట్టింది. లవ్‌లో కనీస ఒకసారైనా బ్రేకప్ అయి ఉండాలని కూడా ఒక కండిషన్ పెట్టింది. ఇంతకీ ఆ జాబ్ ఏంటి? దానికి కావాల్సిన మరిన్ని అర్హతలు ఏమిటనేవి ఇక్కడ తెలుసుకుందాం.
బెంగళూరుకు చెందిన మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ 'చీఫ్ డేటింగ్ ఆఫీసర్' (CDO) కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రేమ, ఆన్‌లైన్ డేటింగ్ వంటి వాటిలో నైపుణ్యం కలిగి ఉండాలని పేర్కొంది. కనీసం ఒక్కసారి బ్రేకప్, రెండు సిట్యుయేషన్‌షిప్‌లు, మూడు డేట్‌లు వంటివి ఉండాలని నిబంధన పెట్టింది. ఇలాంటి వారు ఆ ఉద్యోగానికి అర్హులని స్పష్టం చేసింది.
కొత్త డేటింగ్ నిబంధనల సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి. కొత్త వాటిని సృష్టించడానికి కూడా తగినంత ధైర్యం కలిగి ఉండాలి. కనీసం 2-3 డేటింగ్ యాప్‌లను ప్రయత్నించి ఉండాలి. ఇందులో అనుభవం ఉండాలి, కానీ క్యాట్‌ఫిషింగ్‌కు తావులేదని స్పష్టం చేసింది. అవసరమైన అన్ని లవ్ ఇంటెలిజెన్స్ ఉన్నవారు.. ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది.
ఇదీ చదవండి: పనిగంటలపై 78 శాతం మంది అభిప్రాయమిదే..
ఇప్పుడు జాబ్ ఆఫర్ చేసిన బెంగళూరు కంపెనీలో ఉద్యోగం చేయడానికి ప్రత్యేకంగా ఎంబీఏ, ఎంసీఏ వంటివి అవసరం లేదు. ఉద్యోగానుభవం అంతకంటే అవసరం లేదు. ప్రేమ పిపాసులై, ప్రేమ భాషలో నిష్ణాతులైన వారు ఎవ్వరైనా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అయితే జీతం గురించి ఎలాంటి వివరాలను సంస్థ వెల్లడించలేదు. ఉద్యోగానికి అప్లై చేసుకున్న వ్యక్తికి సంబంధించిన పూర్వాపరాలను కంపెనీ పరిశీలిస్తుంది.
Hiring Alert!
We are looking for a Chief Dating Officer.
Are you the go-to friend for dating advice? We’re hiring someone who lives and breathes dating culture.
The self-proclaimed matchmaker who can decode “ghosting,” “breadcrumbing,” and every new dating buzzword in the… pic.twitter.com/yqyJJiCVJy— Nimisha Chanda (@NimishaChanda) January 29, 2025
Comments
Please login to add a commentAdd a comment