job openings
-
ఐటీ జాబ్ కోసం వేచిచూస్తున్నారా.. టెకీలకు శుభవార్త
కాస్ట్‌కటింగ్ పేరిట, అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో గత కొంతకాలంగా ఐటీ కంపెనీలు ఆశించినమేర నియామకాలు చేపట్టలేదు. అయితే క్రమంగా ఈ పరిస్థితులు మారుతున్నాయని యూఎస్‌లోని కంప్యూటింగ్ టెక్నాలజీ ఇండస్ట్రీ అసోసియేషన్ డేటా ద్వారా తెలుస్తుంది. ఇకపై యూఎస్‌లో టెక్ కంపెనీల నియామకాలు పుంజుకోనున్నాయని ఈ డేటా నివేదించింది. సమీప భవిష్యత్తులో ఐటీ కంపెనీలకు ప్రాజెక్ట్‌ల సంఖ్య పెరుగబోతున్నట్లు డేటా విశ్లేషించింది. అమెరికాలో కార్యాకలాపాలు సాగిస్తున్న భారత టెక్ కంపెనీలకు ఇది శుభపరిణామమని నిపుణులు చెబుతున్నారు. ఆయా కంపెనీల్లో త్వరలో నియామకాలు ఊపందుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు. అమెరికాలోని టెక్ కంపెనీలు గత నెలలో 6,000 మంది ఉద్యోగులను కొత్తగా చేర్చుకున్నాయని డేటా ద్వారా తెలిసింది. యూఎస్‌లోని భారత కంపెనీల్లో ప్రధానంగా టీసీఎస్‌లో 50,000 మంది, ఇన్ఫోసిస్‌లో 35,000, హెచ్‌సీఎల్ టెక్‌లో 24,000, విప్రోలో 20,000, ఎల్ అండ్ టీ మైండ్‌ట్రీలో 6,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. త్వరలో ఈ సంఖ్య మరింత పెరుగబోతున్నట్లు తెలిసింది. ఐటీ కంపెనీల్లో ప్రధానంగా సాంకేతిక సేవలు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లో భారీ నియామకాలు ఉండబోతాయని సమాచారం. యూఎస్‌లో వివిధ పోజిషన్‌ల్లో పనిచేయడానికి మార్చిలో తమకు దాదాపు 1,91,000 కొత్త టెక్ ఉద్యోగులు అవసరమని కంపెనీలు పోస్ట్ చేశాయి. అంతకుముందు నెల కంటే ఈ సంఖ్య 8,000 అధికంగా ఉండడం గమనార్హం. మొత్తంగా మార్చిలో 4,38,000 యాక్టివ్ టెక్ జాబ్స్ ఉన్నాయని అంచనా. సాఫ్ట్వేర్ డెవలపర్లు, ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్‌ల నియామకాల్లో ఫిబ్రవరి-మార్చి మధ్య కాలంలో పెరుగుదల కనిపించింది. న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, చికాగో, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీలు మార్చిలో అత్యధిక నియామకాలు చేపట్టినట్లు నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: పాతబడేకొద్దీ మరింత ప్రమాదం యూఎస్‌లోని భారత కంపెనీల ఉద్యోగులకు సంబంధించి హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఆసక్తికర నివేదిక వెల్లడించింది. దాని ప్రకారం.. యుఎస్ టెక్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న మొత్తం శ్రామికశక్తిలో భారత కంపెనీలు 2 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2023లో యుఎస్‌లో టెక్ ఉద్యోగుల ఉపాధి 1.2% పెరిగింది. 2023 వరకు టెక్ కంపెనీలు దాదాపు 5 లక్షల ఉద్యోగులను తొలగించాయని అంచనా. అప్పటి నుంచి తొలగింపుల పర్వం కాస్త నెమ్మదించిందని నివేదిక తెలిపింది. ప్రస్తుతం కంపనీలు నియామకాల ప్రక్రియ ప్రారంభించడంతో ఉద్యోగులకు డిమాండ్ ఏర్పడి కంపెనీల రాబడి సైతం పెరుగబోతుందని తెలిసింది. రాబోయే క్యూ4 ఫలితాల్లో కంపెనీలు మెరుగైన ఫలితాలు పోస్ట్ చేస్తాయని, ఇక నుంచి కంపెనీల్లో వృద్ధి కనిపిస్తుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అంచనా వేసింది. -
CDFD Recruitment 2021: సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్(సీడీఎఫ్‌డీ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 05 ► కన్సల్టెంట్(రీసెర్చ్ మేనేజ్మెంట్): అర్హత: పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం: 3ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.50,000 నుంచి రూ.75,000 వరకు చెల్లిస్తారు. వయసు: 50 ఏళ్లు మించకూడదు. ► కన్సల్టెంట్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్): అర్హత: గ్రాడ్యుయేషన్(కామర్స్) ఉత్తీర్ణులవ్వాలి. 5ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.30,000 నుంచి 40,000 వరకు చెల్లిస్తారు. వయసు: 64 ఏళ్లు మించకూడదు. ► సైకాలజిస్ట్: అర్హత: ఎంఫిల్/పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. 4ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.25,000 వరకు చెల్లిస్తారు. వయసు: 50ఏళ్లు మించకూడదు. ► హిందీ ట్రాన్స్‌లేటర్: అర్హత: హిందీ సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి. డిప్లొమా(ట్రాన్స్లేషన్) ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.15,000 నుంచి 20,000 వరకు చెల్లిస్తారు. వయసు: 62 ఏళ్లు మించకూడదు. ► కన్సల్టెంట్ లైబ్రేరియన్: అర్హత: డిగ్రీ(లైబ్రరీ సైన్సెస్) ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.10,000 నుంచి 20,000 వరకు చెల్లిస్తారు. వయసు: 62 ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021 ► వెబ్సైట్: http://www.cdfd.org.in మరిన్ని నోటిఫికేషన్లు EFLU Recruitment: ఇఫ్లూలో టీచింగ్ పోస్టులు పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి ఎన్జీఆర్ఐ, హైదరాబాద్‌లో 38 టెక్నికల్ ఉద్యోగాలు -
నిరుద్యోగులకు ఐబీఎమ్ గుడ్‌న్యూస్
బెంగుళూరు: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను టెక్ దిగ్గజం ఐబీఎమ్ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐబీఎమ్ వెబ్సైట్ లింకిడ్ ఇన్ పేజీలో 500 ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఐబీఎమ్‌లో 3,50,00మంది ఉద్యోగులు పనిచేస్తుంటే, అందులో మూడో వంతు భారత్‌లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఐబీఎమ్ తన మాతృదేశమైన (అమెరికా)లో 400 ఉద్యోగులను నియమించునున్నట్లు తెలిపింది. ఐబీఎమ్ కంపెనీ ఇండియాలో కంటే తక్కువ నియామకాలు చేపట్టడం పట్ల అమెరికాకు చెందిన నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐబీఎమ్‌లో మేనేజర్లు, మిడిల్‌వేర్ అడ్మినిస్టేటర్లు(పరిపాలన విభాగం), డేటా సైంటిస్ట్‌లు, నెట్వర్క్ , క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లు తదితర కేటగిరీలలో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ఐబీఎమ్ ప్రకటించింది. ఈక్విటీ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి బోర్‌గియస్ స్పందిస్తూ.. ఐబీఎమ్ లాంటి దిగ్గజ కంపెనీలు భారత్‌లోని ఐటీ నిపుణులకు ప్రాధాన్యత ఇస్తున్నాయని, యూఎస్, యూరప్‌లో వారికి ఐటీ నిపుణుల కొరత వేదిస్తుందని తెలిపారు. మరోవైపు కంపెనీలు ఖర్చులు తగ్గించడానికి దేశీయ ఐటీ నిపుణులు వైపు ఆలోచిస్తున్నట్లు బోర్‌గియస్ పేర్కొన్నారు. (చదవండి: ఐబీఎం పోటీలో భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగుల సత్తా) -
స్టెమ్ ఉద్యోగాలకు భలే గిరాకీ..
ముంబై: దేశ వ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్(స్టెమ్) కోర్సులకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని ఇండీడ్ వెబ్సైట్ పేర్కొంది. గత మూడేళ్లుగా ఈ కోర్సులకు విపరీతమైన ఆదరణ పెరిగిందని, ఎక్కువ ఉద్యోగ నియామకాలు ఈ కోర్సులు అభ్యసించిన వారికే దక్కాయని తెలిపింది. స్టెమ్ కోర్సులు చేసిన వారికి 2016 నవంబరు నుంచి 2019 నవంబరు వరకు 44 శాతం ఉద్యోగ నియామకాలు పెరిగాయని ఇండీడ్ వెబ్సైట్ పేర్కొంది. నివేదిక ప్రకారం..2016 నవంబరు నుంచి 2019 నవంబరు వరకు ఇండీడ్ వెబ్సైట్లో జరిగిన పోస్టింగ్స్ ఆధారంగా నివేదిక రూపొందించారు. దేశంలో స్టెమ్ కోర్సులకు భారీగా డిమాండ్ ఉందని, నియామకాల వృద్ధి స్థిరంగా కొనసాగుతుందని ఇండీడ్ వెబ్సైట్ డైరెక్టర్ వెంకట మాచవరపు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), రోబోటిక్స్ వంటి రంగాల్లో వస్తున్న అత్యాధునికి సాంకేతిక వల్ల విద్యార్థులు స్టెమ్ కోర్సుల పట్ల ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. ఈ కోర్సుల్లో నైపుణ్యం పెంచుకుంటే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఇండీడ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మొత్తం స్టెమ్ ఉద్యోగాల్లో ఢిల్లీ 31శాతం నియామకాలతో అగ్రస్థానంలో నిలవగా ముంబై (21శాతం), బెంగళూరు (14శాతం), పుణె (12శాతం), హైదరాబాద్ (12శాతం), చెన్నై (10శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతాల వారిగా విశ్లేషిస్తే పశ్చిమ ప్రాంతాలు 34 శాతం ఉద్యోగాలతో అగ్రస్థానంలో నిలవగా, ఉత్తర, దక్షిణ రాష్ట్రాలు 31శాతం ఉద్యోగాలు పొందాయని..ఈశాన్య ప్రాంతాల్లో కేవలం 4శాతం ఉద్యోగాలకు మాత్రమే పరిమమితయ్యాయని నివేదిక తెలిపింది. విద్యార్థులు సాఫ్ట్వేర్ ఇంజనీర్, పీహెచ్‌పీ డెవలపర్, నెట్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్ వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలను అందిపుచ్చుకోవడానికి స్టెమ్ కోర్సులు నేర్చుకుంటున్నారని నివేదిక తెలిపింది. -
ఉద్యోగవకాశాలకు భారీగా గండి!
ఫెడరల్ రిజర్వు రేట్ల పెంపుపై ఓ వైపు భారీగా అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగావకాశాలు(జాబ్ ఓపెనింగ్స్) భారీగా పడిపోయినట్టు వెల్లడైంది. లేబర్ డిపార్ట్మెంట్ రిపోర్టు ప్రకారం ఆగస్టు నెలలో ఉద్యోగవకాశాలు ఎనిమిది నెలల కనిష్టానికి పతనమయ్యాయి. ఆర్థిక పునరుద్ధరణ క్రమంలో లేబర్ మార్కెట్ పరిస్థితుల్లో కొంత మార్పులు చోటుచేసుకుంటున్నాయని రిపోర్టు తెలిపింది. లేబర్ డిపార్ట్మెంట్స్ నెలవారీ ఉద్యోగవకాశాలు, లేబర్ టర్నోవర్ సంయుక్తంగా ఈ రిపోర్టును విడుదలచేశాయి. ఈ రిపోర్టు ప్రకారం లేబర్ డిమాండ్ 3,88,000 తగ్గి, 5.4 మిలియన్లగా రికార్డు అయ్యాయి. డిసెంబర్ నుంచి ఇదే కనిష్ట స్థాయి. ఈ ఏడాది జూలై నెలలో ఉద్యోగవకాశాలు గణనీయంగా పెరిగి రికార్డు స్థాయిలో 5.83 మిలియన్లగా నమోదయ్యాయి. నెలవారీ క్షీణతను చూసుకుంటే 2015 ఆగస్టు తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. ఉద్యోగ నియామకాలు సైతం 5.26 మిలియన్ల నుంచి 5.21 మిలియన్లకు పడిపోయాయి. 2.98 మిలియన్ అమెరికన్లు తమ ఉద్యోగాల నుంచి వైదొలిగినట్టు వెల్లడైంది. ఉద్యోగాల కోత 1.64 మిలియన్ నుంచి 1.62 మిలియన్‌కు చేరాయి. స్వచ్చందంగా ఉద్యోగాలను వదులుకోవడం, ఉద్యోగ తొలగింపుల్లో క్షీణత వంటివి ఓ వైపు స్థిరమైన జాబ్స్ మార్కెట్ కొనసాగింపుతో పాటు మరోవైపు బెటర్ ఎంప్లాయిమెంట్ వెతుకులాట కోసం విశ్వాసం పెరుగుతుందని సంకేతాలను సూచిస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ జాబ్ ఓపెనింగ్స్ డేటా ఎప్పడికప్పుడూ మారుతూ ఉంటుందని, కానీ జాబ్ ఓపెనింగ్స్ రేట్ ఇప్పటికీ గరిష్టంగానే(3.6 శాతంగానే) ఉన్నట్టు న్యూయార్క్‌లోని ఆర్డీక్యూ ఎకనామిక్స్ చీఫ్ ఎకనామిస్ట్ జాన్ రైడింగ్ చెప్పారు. ఒకవేళ ఈ క్షీణత ఇలానే కొనసాగినా.. వ్యాపారులు మాత్రమే జాగ్రత్త వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఫైనాన్స్, ప్రొఫెన్సియల్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ వంటి ఎక్కువ వేతన ఉద్యోగాల్లో ఈ క్షీణత ఎక్కువగా కనబడుతున్నట్టు చీఫ్ ఎకనామిస్ట్ జెడ్ కోల్కో తెలిపారు. ఉద్యోగనియమాకాల్లో కొంత మార్పులు సంభవించినా.. నియామకాల రేటు మాత్రం స్థిరంగానే కొనసాగుతుందన్నారు. ఫెడ్ రేట్ల నిర్ణయంలో ఫెడరల్ రిజర్వు చైర్పర్సన్ జానెట్ యెల్లెన్ లేబర్ టర్నోవర్ రిపోర్టును కూడా పరిగణలోకి తీసుకుంటారు. మరోవైపు డిసెంబర్లో ఫెడ్ రేట్ల పెంపుపై సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ జాబ్ ఓపెనింగ్స్ డేటాను పరిగణలోకి తీసుకుని జానెట్ యెల్లెన్ ఫెడ్ రేట్లపై ఎలాంటి ప్రకటన వెలువరుచనున్నారో వేచిచూడాలి.