తెలంగాణాలో ప్రముఖ టెక్ దిగ్గజం 'ఇన్ఫోసిస్' (Infosys) మరింత విస్తరించనుంది. దీనికోసం కంపెనీ దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే పోచారం క్యాంపస్‌ను విస్తరించనున్నట్లు, తద్వారా 17,000 కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్లు వెల్లడించింది.
దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో తెలంగాణ ఐటీ మినిష్టర్ శ్రీధర్ బాబుతో.. ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ జయేష్ సంఘ్‌రాజ్ భేటీ తరువాత ఈ ప్రకటన చేశారు. పోచారం క్యాంపస్ విస్తరణ ప్రణాళికలో భాగంగానే ఫేజ్ 1లో రూ. 750 కోట్ల పెట్టుబడితో.. కొత్త ఐటీ భవనాలను నిర్మించనున్నారు. ఇవి పూర్తి కావడానికి మరో రెండు - మూడేళ్లు పట్టే అవకాశం ఉంది.
తెలంగాణను ఐటీ రంగంలో అగ్రగామిగా చేయడానికి, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మా భాగస్వామ్యం సంతోషంగా ఉందని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ జయేష్ సంఘ్‌రాజ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ప్రాణం కాపాడిన చాట్‌జీపీటీ: ఆశ్చర్యపోతున్న నెటిజన్స్
Comments
Please login to add a commentAdd a comment