టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ 'చాట్‌జీపీటీ' (ChatGPT) యూజర్లకు చాలా ఉపయోగపడుతోంది. ఏ ప్రశ్న అడిగినా.. దాదాపు ఖచ్చితమైన, వేగవంతమైన జవాబును ఇస్తోంది. ఇప్పటికే ఎన్నెన్నో అద్భుతాలు చేసిన చాట్‌జీపీటీ.. తాజాగా ఓ మనిషికి ఉన్న రోగాన్ని సైతం కనిపెట్టింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఓ సోషల్ మీడియా యూజర్ పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం.. కొన్ని రోజుల క్రితం నేను వ్యాయామం చేసాను. ఒళ్ళంతా చాలా నొప్పులుగా.. ఏదో యాక్సిడెంట్ అయిన ఫీలింగ్ కలిగింది. రెండు రోజులైనా ఆరోగ్యం కుదుటపడలేదు. నాకున్న లక్షణాలను చాట్‌జీపీటీకి వివరించాను. లక్షణాల ఆధారంగా రాబ్డోమయోలైసిస్ (Rhabdomyolysis) ఉన్నట్లు వెల్లడిస్తూ.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సిపార్సు చేసింది.
చాట్‌జీపీటీ చెప్పింది నిజమా? కాదా? అని నిర్దారించుకోవడానికి నేను ఆసుపత్రికి వెళ్ళాను. డాక్టర్లు కూడా టెస్ట్‌లు చేసి రాబ్డోమయోలైసిస్ ఉందని నిర్థారించారు. నా ల్యాబ్ ఫలితాలను విశ్లేషించడానికి కూడా.. నేను ChatGPTని ఉపయోగించాను. అది వైద్య బృందం చెప్పిన దానితో సమానంగా చెప్పింది. సరైన సమయానికి చికిత్స తీసుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాను.
చాట్‌జీపీటీ సామర్థ్యం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో కూడా.. చాట్‌జీపీటీ ఇతరుల ప్రాణాలను కాపాడటం సంఘటనల గురించి విన్నాను. ఇప్పుడు చాట్‌జీపీటీ నన్ను కూడా కాపాడింది.
ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాట్‌జీపీటీ లక్షణాల ఆధారంగా రోగ నిర్దారణ చేయడం చాలా గొప్పగా ఉందని పలువురు ప్రశంసించారు. వైద్య సలహా కోసం కూడా దీనిని ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు.
రాబ్డోమయోలైసిస్
రాబ్డోమయోలైసిస్ అనేది ఓ అరుదైన సమస్య. విశ్రాంతి తీసుకోకుండా ఎక్కువసేపు వ్యాయామం చేయడం వల్ల.. కండరాలు కలిగిపోతాయి. దీంతో రక్తంలోకి విడుదలయ్యే ప్రోటీన్లు కిడ్నీలలో పేరుకుపోతాయి. ఇది పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఇది ప్రాణాంతకం కూడా.
ఇదీ చదవండి: ఆరోగ్యం కోసం నవవిధ మార్గాలు - చాట్‌జీపీటీ సలహాలు
Comments
Please login to add a commentAdd a comment