ఓయో ట్రావెలోపీడియా నివేదిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది హైదరాబాద్‌ను సందర్శించేందుకు అత్యధికులు మొగ్గు చూపారు. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ ప్లాట్‌ఫామ్‌పై హైదరాబాద్ అత్యధిక బుకింగ్స్ నమోదు చేసుకుంది. దేశంలో ప్రయాణ తీరుతెన్నులను తెలిపే ఓయో వార్షిక నివేదిక ట్రావెలోపీడియా 2024 ప్రకారం.. పూరీ, వారణాసి, హరిద్వార్ ప్రముఖ ఆధ్యాత్మిక గమ్యస్థానాలుగా నిలిచాయి. మతపర పర్యాటకం కీలకంగా కొనసాగింది. దేవఘర్, పళని, గోవర్ధన్ గణనీయ వృద్ధిని సాధించాయి.
బుకింగ్స్ పరంగా హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో బెంగుళూరు, ఢిల్లీ, కోల్‌కతా స్థానం సంపాదించాయి. ప్రయాణానికి అత్యంత ప్రజాదరణ పొందిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ తన స్థానాన్ని కొనసాగించింది. మహారాష్ట్ర, తెలంగాణ, కర్నాటక నుండి అధిక మొత్తంలో బుకింగ్స్ నమోదయ్యాయి. 48 శాతం వార్షిక వృద్ధితో పాటా్న, రాజమండ్రి, హుబ్లీ వంటి చిన్న పట్టణాలు అద్భుత వృద్ధిని కనబరిచాయి. ఈ సంవత్సరం విహార యాత్రల్లో జోరు కనిపించింది. జైపూర్ అగ్ర పర్యాటక స్థానంగా కొనసాగింది. వరుసలో గోవా, పాండిచ్చేరి, మైసూర్ ఉన్నాయి. ఆసక్తికరంగా బుకింగ్‌లలో ముంబై తగ్గుదల చవి చూసింది. జూలై నాల్గవ వారాంతంలో ఎక్కువగా బుకింగ్‌లు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment