తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆరు కంపెనీలు మొత్తం రూ.37,870 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, చైనా ఈవీ కంపెనీ బీవైడీ తెలంగాణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. తెలంగాణలో తయారీ ప్లాంట్ల ఏర్పాటు గురించి టెస్లా, బీవైడీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
లండన్‌లోని భారత హైకమిషన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రోడ్లపై ‘స్మార్ట్‌ఫోన్ జాంబీ’లున్నాయి జాగ్రత్త..!
ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి చైనాకు చెందిన బీవైడీ సంస్థకు కేంద్రం గత ఏడాది అనుమతి నిరాకరించింది. టెస్లా రెండు సంవత్సరాలుగా భారతదేశంలోకి ప్రవేశించాలని చూస్తోంది. ట్యాక్స్ రాయితీలు ఇవ్వాలని టెస్లా డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే అందుకు కేంద్రం ఒప్పకోవడం లేదనే వాదనలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment