
సాక్షి,హైదరాబాద్:ఓ వైపు గ్రూప్ వన్ విద్యార్థులు,మరోవైపు ముత్యాలమ్మ గుడి భక్తుల ఆందోళనలతో వారం రోజులుగా హైదరాబాద్ అట్టుడుకుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి ఆదివారం(అక్టోబర్20) మీడియాతో మాట్లాడారు.
‘సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంపై దాడి చేస్తే సీఎం ఎందుకు స్పందించలేదు. హిందువులను కాంగ్రెస్ ఎప్పుడూ శత్రువులుగానే భావిస్తోంది. పోలీసులు చాలా మంది భక్తుల తలలు పగులగొట్టారు. హిందువుల విషయంలో అనేక నిర్బంధాలకు గురిచేస్తున్నారు. న్యాయం కోసం ఆందోళనలు చేస్తే తలలు పగులగొడతారా.
గ్రూప్ వన్ విద్యార్థులపై లాఠీఛార్జ్ సరికాదు. తెలంగాణలో మళ్లీ యువత రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ ప్రాతిపదికన విద్యార్థులు చదువుకోవాలి. వికీపీడియా ఆధారంగా విద్యార్థులకు మార్కులు ఇస్తారా’అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
ఇదీ చదవండి: సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు సెటైర్లు
Comments
Please login to add a commentAdd a comment