
సాక్షి,కరీంనగర్‌జిల్లా: ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు మరో ఉద్యమం రావాల్సిందేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం(అక్టోబర్20) తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన అలయ్ బలయ్ సభలో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు.
‘కాంగ్రెస్ వాళ్లు మోసపూరితంగా అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు ప్రజలను గోస పెడుతున్నారు. కరోనా సమయంలోనూ రైతులకు రైతుబంధు పడాలన్న ఆశయంతో నడిచింది కేసీఆర్ ప్రభుత్వం.రూ.10వేలు వద్దు..రూ.15వేలు ఇస్తా అన్న రేవంత్ ఏం చేస్తున్నాడు.రేవంత్ రైతు వ్యతిరేకి. యాసంగికైనా రైతుబంధు కావాలంటే అందరూ సంఘటితం కావాలి.
ఆరు గ్యారెంటీ పథకాలు ఏమయ్యాయి రేవంత్. ఫించన్‌లో కూడా దగా చేస్తుండు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. చీఫ్ మినిస్టర్ కాదు చీటింగ్ మ్యాన్. బోనస్ ఇస్తా అంటివి..ఏడపోయింది? దేవుడి మీద ఒట్టు పెట్టి రాజకీయం చేసే నాయకుడిని ఇప్పటి వరకు నేను చూడలేదు.
రేవంత్ రెడ్డి చేసిన పాపాలకు ప్రజల్ని కాపాడు అని లక్ష్మినరసింహ స్వామి ఆలయానికి వెళితే నాపై కేసు పెట్టారు. నిరుద్యోగులను దేశ ద్రోహుల్లా చూస్తున్నారు.2లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి ఏమయ్యాయి. జీఓ 29 రద్దు చేయడమే గ్రూప్ 1 సమస్యకు పరిష్కారం.రాజ్యాంగాన్ని అమలు చేస్తా అన్న రాహుల్ గాంధీ ఏడబోయిండు.?ఎన్నికల ముందు వచ్చిన గాంధీలు ఏడబోయారు’అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: రేవంత్ నువ్వు రాహుల్ కాంగ్రెస్‌లో లేవా
Comments
Please login to add a commentAdd a comment