harishrao
-
గ్యారెంటీలలోనే కాంగ్రెస్ సమాధి: హరీశ్‌రావు
సాక్షి,సిద్దిపేట:సన్నవడ్లు అమ్ముకున్న రైతులకు రెండు నెలలైనా బోనస్ డబ్బులు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.ఈ విషయమై హరీశ్‌రావు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆదివారం(ఫిబ్రవరి 9) బహిరంగ లేఖ రాశారు. ‘అన్ని పంటలకు బోనస్ అన్న మాటలను కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ చేసింది. రూ2 లక్షల రుణమాఫీ,రైతు భరోసాను మోసం చేశారు.వరంగల్ రైతు డిక్లరేషన్‌ను తుంగులో తొక్కారు.రుణమాఫీ,రైతు భరోసా,వడ్ల బోనస్ పైసలు కూడా ఇవ్వలేదు. ఇక రైతులు రెండో పంట ఎలా వేస్తారు.బోనస్ ఇంకా రూ. 432 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. మాకు సంస్కారం ఉంది మీకు సంస్కారం లేదు.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటలు,ఉత్తర మాటలు అయ్యాయి.చేతకాని మాటలు ఎందుకు మాట్లాడతావు. పొద్దున లేస్తే బీఆర్ఎస్ పైన ఎందుకు మాట్లాడతావ్. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పాలాభిషేకం చేయాలి.రైతు కందులు పండిస్తే మూడు క్వింటాల్లే కొంటున్నారు. కంది రైతుల మీద ఎందుకు పగ మీకు.క్రాప్ బుకింగ్‌లో మిస్సయిన రైతులకు అనుమతి ఇవ్వండి.రేవంత్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావుని డిమాండ్ చేస్తున్న రైతు పండించిన మొత్తం కందులను కొనుగోలు చేయడానికి ఆదేశాలు ఇవ్వాలి.విదేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకోవడం వలన విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతుంది. పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు.కాంగ్రెస్ కోతల ప్రభుత్వం. ఓ రైతుకు 31 గంటలకు భూమి ఉంటే రూ. 1650 మాత్రమే రైతు బంధు పడతదా.సీఎం ఇచ్చిన రూ 250 కోట్ల రూపాయల చెక్కు ఎందుకు పడడం లేదు.ఉత్తుత్తి చెక్కు ఇచ్చినవా.కొత్త పాస్ బుక్ వచ్చిన వాళ్లకు రైతుబంధు పడడం లేదు.ప్రభుత్వం మోసం చేసిందని అన్ని గ్రామాలలో మాట్లాడుకుంటున్నారు.ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలు చూస్తున్నారు.తాను తవ్వుకున్న గ్యారంటీల సమాధిలోనే కాంగ్రెస్ సమాధి అవుతుంది.ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌ను గాలిలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీది జగమంతా పాలన,కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన.మాది అసలు పాలన మీది కొసరు పాలన.సంతృప్తి, సంక్షేమం బిఆర్ఎస్ పాలన,సంక్షోభం,అసంతృప్తి అసహనం కాంగ్రెస్ విధానం’అని హరీశ్‌రావు మండిపడ్డారు. -
ఆదిలాబాద్‌లో రైతు ఆత్మహత్య.. హరీశ్‌రావు కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలానికి చెందిన రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. రైతు మామిళ్ల నర్సయ్య ఆత్మహత్యపై హరీశ్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు హరీశ్‌రావు శనివారం(జనవరి25)ఒక ప్రకటన విడుదల చేశారు.‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? కాంగ్రెస్ పాలనలో రైతన్నకు భరోసా లేక మనోధైర్యం కోల్పోతున్నడు. అందరికి అన్నం పెట్టే అన్నదాతకు సున్నం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచి, నమ్మక ద్రోహం చేస్తున్నది. రుణమాఫీ పూర్తి చేసినట్లు రంకెలేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులకు ఏమని సమాధానం చెబుతారు. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఆత్మహత్యలు పరిష్కారం కావు, బతికుండి కొట్లాడుదాం. అధైర్య పడొద్దు, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది’అని హరీశ్‌రావు తెలిపారు. -
ఇదేనా సో కాల్డ్ ప్రజాపాలన: హరీశ్‌రావు సెటైర్లు
సాక్షి,హైదరాబాద్:ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇది ప్రజాపాలన కాదు,నిర్బంధ పాలన అన్నారు. ఈ విషయమై హరీశ్‌రావు సోమవారం(జనవరి20) మీడియాతో మాట్లాడారు.‘ఆంక్షలు,కంచెలు,అరెస్టులు,నిర్బంధాలు రేవంత్ పాలనలో నిత్యకృత్యమయ్యాయి. అరెస్టు చేసిన ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నాగర్ కర్నూల్ జిల్లా,మైలారంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన హరగోపాల్‌ను అరెస్టు చేయడం అమానుషం.దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా పాలన,ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటూ గప్పాలు కొట్టి,ఇప్పుడు ప్రజల తరుపున పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల గొంతులు నొక్కడం అమానుషం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ..ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజా పాలన. ఇందిరమ్మ రాజ్యమని చెప్పిన మీరు కంచెలు,ఆంక్షలు,అరెస్టులతో నాటి ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారు. మీ సొంత జిల్లాలోనే ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటే,రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.మైలారంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?ప్రొఫెసర్ హరగోపాల్ సహా అరెస్టులు చేసిన ప్రజా సంఘాల నాయకులను తక్షణం విడుదల చేయాలి’అని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కేసీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్(kcr), మాజీ మంత్రి హరీశ్‌రావు(HarishRao)కు తెలంగాణ హైకోర్టులో మంగళవారం(డిసెంబర్24) ఊరట లభించింది. మేడిగడ్డ ప్రాజెక్టు పై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ అంశంలో తదుపరి విచారణను జనవరి ఏడో తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. కాగా, మేడిగడ్డ(Medigadda) బ్యారేజీలో పగుళ్లకు కేసీఆర్,హరీశ్‌రావే కారణమని భూపాలపల్లి కోర్టు(Bhupalapalli Court)లో స్థానిక న్యాయవాది ఒకరు గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన భూపాలపల్లి సివిల్ కోర్టు కేసీఆర్,హరీశ్‌రావులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను క్వాష్ చేయాల్సిందిగా కేసీఆర్,హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు భూపాలపల్లి కోర్టు నోటీసులపై కేసీఆర్,హరీశ్‌రావులకు ఊరటనిచ్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారునికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కేటీఆర్ తొలి విజయం సాధించారు: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ రేసుల కేసు వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని మాజీ మంత్రి,బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం(డిసెంబర్ 20) హరీశ్‌రావు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘తొలి అడుగులోనే కేటీఆర్ విజయం సాధించారు. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నాం.రేవంత్ అక్రమంగా బనాయించిన కేసులో అరెస్టు చేయవద్దని హైకోర్టు చెప్పింది. ఇది డొల్ల కేసు అని హైకోర్టు చెప్పింది. ఈ కార్ రేసుల వల్ల తెలంగాణకు లాభం జరిగింది.రూ.600 కోట్ల నష్టం కాదు..రూ.600 కోట్ల లాభం జరిగింది. అవినీతి జరగలేదని స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినప్పుడు ఇక ఏసీబీ కేసు ఎందుకు. హామీలపై ప్రజల దృష్టిని మరల్చి జిమ్మిక్కులు చేస్తున్నారు’అని హరీశ్‌రావు మండిపడ్డారు. కాగా, ఫార్ములా ఈ కార్ రేసుల కేసులో ఏసీబీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1 చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో కేటీఆర్ కేసు కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసులో హైకోర్టు కేటీఆర్‌కు ఊరటనిచ్చింది. ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. -
రేవంత్‌కు అదానీతో ఢిల్లీలో దోస్తీ..గల్లీలో కుస్తీ: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్:రేవంత్ రెడ్డి సర్కస్ ఫీట్లు చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతోందని, అదానీతో ఆయన ఢిల్లీలో దోస్తీ,గల్లీలో కుస్తీ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ిమర్శించారు. బుధవారం(డిసెంబర్ 18) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.‘రాజ్ భవన్ ముట్టడిలో కేసీఆర్ గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. మేము అదానీ ఫొటోతో అసెంబ్లీకి వస్తే మమ్మల్ని అడ్డుకున్నారు. అదానీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న 12 వేల కోట్ల రూపాయల ఒప్పందాలను రద్దు చేసుకోవాలి. అదానీపై రేవంత్ పోరాటం నిజమైతే ఒప్పందాలు ఎందుకు రద్దు చేసుకోవడం లేదు. రామన్నపేటలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి రేవంత్ అనుమతులు ఇస్తున్నారు. అదానీకి రేవంత్ కొమ్ముకాస్తున్నారు.రోడ్డుపై రేవంత్ సర్కస్ ఫీట్లు చేస్తున్నారు.రేవంత్ అదానీకి ఏజెంట్లా పని చేస్తున్నారు.అదానీకి రెడ్‌కార్పెట్ వేసి తెలంగాణ పరువును రాహుల్ గాంధీ పరువును రేవంత్ రెడ్డి మంటకలిపారు. రేపు అసెంబ్లీలో అదానీ,రేవంత్‌రెడ్డి లింకుపై చర్చ పెట్టాలి. రాజ్ భవన్ ముట్టడిలో అదానీ గురించి రేవంత్ మాట్లాడలేదు. రేవంత్‌రెడ్డిని పార్టీ తిడితే 100 కోట్లు అదానీకి వాపస్ ఇచ్చారు.చట్టం అందరికీ సమానం అయితే రోడ్డుపై ధర్నా చేసిన కాంగ్రెస్ నేతలపై సీవీ ఆనంద్ కేసులు పెట్టాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.మీడియాతో చిట్‌చాట్‌లో హరీశ్‌రావు కామెంట్స్..సీఎం ప్రకటన చేస్తే అమలు చేయాలి కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు..నవంబర్ 30 న 3 లక్షల 13 వేల మంది రైతులకు రెండో సారి రుణ మాఫీ చేసున్నం అన్నాడుఇంత వరకు 3 లక్షల 13 మంది రైతులకు 2474 కోట్లు ఖాతాలో పడలేదు19 నవంబర్ వరంగల్ స్వయం సంఘాల ఖాతాల్లో నగదు పడలేదుఆర్టీసీ కార్మికులకు ఫిబ్రవరిలో రూ.281 పీఆర్సీ బకాయిలు కూడా జమ కాలేదుఅది చివరకు ఆర్టీసీ సంస్థనే మళ్ళీ వారి ఖాతాలో వేసిందిలక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తాం అని చాలా సార్లు చెప్పారు.కానీ ఇదో పెద్ద బోగస్ అని తేలిపోయింది.2015లోనే బీఆర్ఎస్ 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చినం..ఇప్పుడు కాంగ్రెస్ ఇదే ఇస్తోంది.రూ.5 లక్షల వరకు మాత్రమే వడ్డీలేని రుణాలు. మిగత వాటికి వడ్డీ కట్టాల్సిందే.లక్ష కోట్లు అని చెప్పింది అంత అబద్ధంఆడబిడ్డలకు ఇవ్వాల్సిన ఏ ఒక్కటీ ఇవ్వడం లేదుతులం బంగారంలేదు,స్కూటీ లేదు,న్యూట్రిషన్ కిట్ లేదుఆడబిడ్డలకు ఇవ్వాల్సిన ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు.అన్ని ఉత్త మాటలేబతుకమ్మ చీరలు లేవురూల్స్ ప్రకారం సభను నడపడం లేదు.నాడు భట్టి,శ్రీధర్ బాబు ప్లకార్డులు పట్టుకోలేదా..ఇవాళ ఇదేం న్యాయం.పార్లమెంట్ లో మాత్రం ప్రియాంక గాంధీ రోజు ఒక బ్యాగ్ వేసుకోవచ్చు,రాహుల్ గాంధీ రోజు టీ షర్ట్ వేసుకోవచ్చు -
‘చాయ్ బిస్కట్’ సమావేశాలు కాదు: హరీశ్‌రావు ఫైర్
సాక్షి,హైదరాబాద్:బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అసెంబ్లీని కనీసం 15 రోజుల పాటు నడపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఎన్ని రోజులు సభ నడుపుతారో క్లారిటీ ఇవ్వకపోవడంతో వాకౌట్ చేసినట్లు బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తెలిపారు. బీఏసీ నుంచి బయటికి వచ్చిన సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని ఎద్దేవా చేశారు.‘అసెంబ్లీ సమావేశాలపై ఏమీ తెల్చకపోవడంతో బయటకు వచ్చినం.ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పక పోవడంతో బీఏసీ నుంచి వాకౌట్ చేశాం. రేపు లగచర్ల అంశంపై చర్చకు బీఅర్ఎస్ పట్టు పట్టింది. ఒక రోజు ప్రభుత్వానికి,మరొక రోజు విపక్షానికి ఇవ్వడం సంప్రదాయం. లగచర్లపైన చర్చకు పట్టుపట్టినం. రైతులకు బేడీలు వేసిన అంశం మాకు చాల కీలకం.కచ్చితంగా ఈ అంశంపైన చర్చకు అవకాశం ఇవ్వాల్సిందే.బీఏసీకి కేవలం సూచన చేసే అధికారం మాత్రమే ఉందన్న సీఎం వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హౌస్ కమీటీ ఏర్పాటుచేయాలి. బీఏసీపైన తమ పార్టీ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసకుంటారని స్పీకర్‌ను అడిగాం. బీఏసీలో లేకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడంపైన అభ్యంతరం వ్యక్తం చేశాం’అని హరీశ్‌రావు చెప్పారు.కాగా, సోమవారం అసెంబ్లీలో లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. దీనికి ఒప్పుకోని ప్రభుత్వం టూరిజం పాలసీని చర్చకు పెట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగి సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. -
రేవంత్‌కు మాటలెక్కువ..పని తక్కువ: హరీశ్‌రావు
సాక్షి,మహబూబ్‌నగర్:రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాలకుడు ప్రజలను మోసం చేయకుండా చేయాలని కురుమూర్తి స్వామిని కోరుకున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుధవారం(నవంబర్ 20) హరీశ్‌రావు మహబూబ్‌నగర్‌లోని కురుమూర్తిస్వామిని దర్శించుకున్నారు.‘కురుమూర్తి స్వామి సాక్షిగా ఇచ్చిన హామీని మరిచి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసగించారు.రేవంత్‌రెడ్డికి పని తక్కువ మాటలెక్కువ. ఆయనకు సీఎం కేసీఆర్ భయం పట్టుకుంది. పాలకుడే మాటతప్పితే రాజ్యానికి అరిష్టం. రాష్ట్రంలో సగానికి పైగా మంది రైతులకు రుణమాఫీ చేయలేదు.వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ఒక్క గ్యారెంటీపైన ప్రకటన చేయని సీఎం వరంగల్‌లో కేసీఆర్ మీద తిట్ల పురాణం పెట్టాడు. రేవంత్‌కు తెలిసింది ఒట్లు లేకుంటే తిట్లు. రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు చెడ్డ పేరు తెస్తున్నారు. అబద్దాలు,మోసం చేయడం సీఎం రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే ఉంది. ప్రతిపక్షాల మీద పగ..రైతులు,ప్రజలకు దగా..తప్ప రేవంత్ చేసిందేమీ లేదు. రేవంత్‌రెడ్డి వచ్చాకా బీ ట్యాక్స్ వచ్చింది.బిల్లుల చెల్లింపులకు కమిషన్లు వసూలు చేస్తున్నారు.ఆరు గ్యారెంటీలు అమలు చేసేంత వరకు రేవంత్ మెడలు వంచుతాం. ఏడాది పాలనలో ఒక్క ఇల్లు నిర్మించలేదు.మూడునాలుగు నెలలు పనులు చేయిస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తయి రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండేది.66 ఏళ్లు కాంగ్రెస్, టీడీపీలు పాలమూరు జిల్లాను దగా చేశాయి. కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేశాడు.గత పాలనలో ఇచ్చిన పథకాలను రేవంత్ ఎగ్గొడుతున్నాడు.కేసీఆర్ కలుపు మొక్కకాదు..కల్ప వృక్షం.రేవంత్‌రెడ్డి గురించి ప్రజలకు భ్రమలు తొలగిపోయాయి.రియల్ఎస్టేటను కుప్పకూల్చాడు’అని హరీశ్‌రావు ఫైరయ్యారు. -
లిక్కర్ అమ్మకాలపై రేవంత్‌రెడ్డికి ప్రేమ ఎక్కువైంది: హరీశ్‌రావు
సాక్షి,నల్గొండజిల్లా: ాన్యం సకాలంలో కొనుగోలు చేయక రైతులను ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.నల్గొండ జిల్లాలోని మర్రిగూడలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని హరీశ్‌రావు బుధవారం(నవంబర్ 13) పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ‘రైతులు రూ.1800లకు క్వింటాల్ చొప్పున ధాన్యం దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. రైతుల ధాన్యం లోడ్ ఎత్తమంటే మహారాష్ట్రకు నోట్ల కట్టల లోడ్ ఎత్తుతున్నాడు ముఖ్యమంత్రి. ధాన్యానికి మద్దతుధర వస్తలేదని రైతులు మిర్యాలగూడలో రాస్తారోకో చేశారు.కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా తరుగు పేరుతో రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు.ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో ఒక కిలో సన్న ధాన్యాన్ని కొనలేదు.ముఖ్యమంత్రికి మద్యం అమ్మకంపై ప్రేమ ఎక్కువైంది.మందు తక్కువ అమ్మిన ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇస్తున్నారు.25 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లకు మెమో జారీ చేశారు.తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు.మహిళల పుస్తెలు తెంపుతున్నారు.రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని ప్రభుత్వం ప్రకటించింది.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదు.యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేసావ్.రేవంత్‌రెడ్డి రాజ్యంలో రైతులు దుఃఖపడుతున్నాడు.ధాన్యం కొనుగోలులోనే కాదు పత్తి కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 15000 రూపాయల రైతుబంధు రైతులకు వెంటనే ఇవ్వాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే: మంత్రి కోమటిరెడ్డి -
సీఎం రేవంత్ మహారాష్ట్రలో చెప్పినవన్నీ అబద్ధాలే: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్:హామీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు సవాల్ విసిరారు.ఆదివారం(నవంబర్ 10) తెలంగాణభవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.‘మహారాష్ట్రలో కూడా సీఎం రేవంత్ అబద్ధాలాడుతున్నారు. తెలంగాణలో ఏ ఒక్క రైతుకైనా బోనస్ వచ్చిందా. రైతుబంధు ఇవ్వడం లేదని రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలో ఎందుకు చెప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలి.రేవంత్‌రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడు. తెలంగాణలో 40 లక్షల మందికి రుణమాఫీ అయిందని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కట్టలేదు.ఉన్న ఇళ్లు కూలగొట్టింది’అని హరీశ్‌రావు విమర్శించారు.ఇదీ చదవండి: ఎనుముల వారి ఏడాది ఏలికలో తెలంగాణలో బతుకులు చీలికలు పీలికలే: కేటీఆర్ -
రాహుల్.. ‘శోక్’నగర్‌కు వెళ్లండి: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైరయ్యారు.ఈ మేరకు హరీశ్‌రావు మంగళవారం(నవంబర్ 5) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించింది.రాహుల్ గాంధీ మీరు సందర్శిస్తున్న ప్రదేశంలోనే విద్యార్థులను మీ ‘ప్రజా సర్కార్’ కొట్టిందని మీకు తెలుసా? వాగ్దానం చేసిన 2 లక్షల ఉద్యోగాల్లో 10 శాతం కూడా భర్తీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చారు. అలాగే జాబ్ క్యాలెండర్‌ను ఉద్యోగం లేని క్యాలెండర్‌గా మార్చితే సరిపోయేది.యువ వికాసం కింద రూ.5 లక్షల హామీ ఖాళీ గ్యారెంటీగా మారడంతో తెలంగాణ యువతకు అభద్రతాభావం ఏర్పడింది.అశోక్ నగర్‌ని మళ్లీ సందర్శించండి.కాంగ్రెస్ ప్రభుత్వం అశోక్ నగర్ ను 'శోక్ నగర్’గా ఎలా మార్చిందో కళ్లారా చూడండి’అని హరీశ్‌రావు రాహుల్ హైదరాబాద్ పర్యటనపై సెటైర్లు వేశారు. ఇదీ చదవండి: రాహుల్ రెండు గంటల పర్యటన -
సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు సెటైర్లు
సాక్షి,కరీంనగర్జిల్లా: ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు మరో ఉద్యమం రావాల్సిందేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం(అక్టోబర్20) తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన అలయ్ బలయ్ సభలో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు.‘కాంగ్రెస్ వాళ్లు మోసపూరితంగా అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు ప్రజలను గోస పెడుతున్నారు. కరోనా సమయంలోనూ రైతులకు రైతుబంధు పడాలన్న ఆశయంతో నడిచింది కేసీఆర్ ప్రభుత్వం.రూ.10వేలు వద్దు..రూ.15వేలు ఇస్తా అన్న రేవంత్ ఏం చేస్తున్నాడు.రేవంత్ రైతు వ్యతిరేకి. యాసంగికైనా రైతుబంధు కావాలంటే అందరూ సంఘటితం కావాలి.ఆరు గ్యారెంటీ పథకాలు ఏమయ్యాయి రేవంత్. ఫించన్‌లో కూడా దగా చేస్తుండు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. చీఫ్ మినిస్టర్ కాదు చీటింగ్ మ్యాన్. బోనస్ ఇస్తా అంటివి..ఏడపోయింది? దేవుడి మీద ఒట్టు పెట్టి రాజకీయం చేసే నాయకుడిని ఇప్పటి వరకు నేను చూడలేదు.రేవంత్ రెడ్డి చేసిన పాపాలకు ప్రజల్ని కాపాడు అని లక్ష్మినరసింహ స్వామి ఆలయానికి వెళితే నాపై కేసు పెట్టారు. నిరుద్యోగులను దేశ ద్రోహుల్లా చూస్తున్నారు.2లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి ఏమయ్యాయి. జీఓ 29 రద్దు చేయడమే గ్రూప్ 1 సమస్యకు పరిష్కారం.రాజ్యాంగాన్ని అమలు చేస్తా అన్న రాహుల్ గాంధీ ఏడబోయిండు.?ఎన్నికల ముందు వచ్చిన గాంధీలు ఏడబోయారు’అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇదీ చదవండి: రేవంత్ నువ్వు రాహుల్ కాంగ్రెస్‌లో లేవా -
కేటీఆర్,హరీశ్‌రావులకు సీతక్క కౌంటర్
సాక్షి,హైదరాబాద్:కేటీఆర్,హరీశ్‌రావు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన పేరుతో సీఎం రేవంత్ రియల్ఎస్టేట్ చేస్తున్నారన్న కేటీఆర్,హరీశ్‌రావు వ్యాఖ్యలపై సీతక్క అక్టోబర్ 18(శుక్రవారం) మీడియాతో మాట్లాడారు.‘హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ పేరుతో కేటీఆర్ ప్లాట్లు అమ్ముకున్నారు. అప్పుడు ఫ్లాట్లు అమ్ముకోవడం వల్లే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ పునర్జీవనం అని మాట్లాడినటువంటి హరీశ్‌రావు అది ఎక్కడ చేశారో చెప్పాలి.హరీష్ రావు ఏ చెరువుకు పునర్జీవనం పోశారో చూపించాలి. పేద ప్రజలకు న్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు.సీఎం రేవంత్ ఏం చూపించినా ఏం చేసినా పేదల కోసమే ఆలోచిస్తారు’అని సీతక్క అన్నారు.ఇదీ చదవండి: సెక్యూరిటీ లేకుండా రండి: హరీశ్‌రావు సవాల్ -
TG: ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్
సాక్షి,హైదరాబాద్:ఉన్న పథకాలు బంద్ పెట్టడమే తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో బుధవారం(అక్టోబర్ 16) మీడియాతో హరీశ్‌రావు చిట్‌చాట్‌గా మాట్లాడారు.‘ఒక చీర కాదు..రేవంత్ రెడ్డి రెండు చీరలు అన్నాడు.దసరా పండుగకు అక్క చెల్లెళ్ళను ప్రభుత్వం నిరుత్సహపరిచింది.రూ.15వేలు రైతుబంధు అన్నాడు..గుండు సున్నా చేశాడు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని పేద గర్బిణి స్త్రీలను మోసం చేశాడు.ముదిరాజ్,గంగపుత్రులంటే సీఎం రేవంత్‌కు చిన్నచూపు.ఆగస్టులో పోయాల్సిన చేప పిల్లలను అక్టోబర్ వచ్చినా పోయలేదు.మేం రూ. 100కోట్లు ఖర్చు చేస్తే..కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల కోసం బడ్జెట్లో పెట్టిందే రూ.16కోట్లు.ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు’అని ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రా -
కేటీఆర్,హరీశ్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
సాక్షి,నల్గొండజిల్లా:కేసీఅర్ ఫామ్‌హౌస్‌లో పడుకుంటే కేటీఆర్,హరీష్‌రావు అనే పిల్లలు మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని గందంవారి గూడెంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు కోమటిరెడ్డి శుక్రవారం(అక్టోబర్11) శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ‘నేను రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు కేటీఆర్ పదో తరగతి చదువుతున్నాడు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వలేదు. పదేళ్లలో తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పు చేశాడు.రుణమాఫీ కానీ రైతులకు త్వరలోనే మాఫీ చేస్తాం. రెండేళ్లలో ఎస్ఎల్బీసీ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇస్తానని కేసీఆర్ మాట తప్పాడు. కేసీఆర్ మాటల్ని మేం నిజం చేస్తున్నాం. వైఎస్సార్ హయాంలో ఇచ్చినట్లు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం’అని కోమటిరెడ్డి చెప్పారు. ఇదీ చదవండి: ఆశపెట్టి నిరుద్యోగితో ఆడుకున్నారు -
పరువునష్టం దావాకు సిద్ధం కండి: హరీశ్‌రావు వార్నింగ్
సాక్షి,హైదరాబాద్: తనపై తప్పుడు ఆరోపణలు, బురద జల్లే ప్రయత్నాలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేసినవారు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని సోమవారం(సెప్టెంబర్30) ఎక్స్(ట్విటర్)లో చేసిన ఒక పోస్టులో హెచ్చరించారు.‘ప్రజా సమస్యలపై పోరాడుతున్న నా పై బురద చల్లె వికృత రాజకీయాలకి తెరలేపినట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు.ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత ను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాల్ని ఆశ్రయిస్తున్నట్లున్నారు.గోల్కొండ కోట, చార్మినార్‌లో కూడా హరీశ్‌రావుకు వాటాలు ఉన్నాయి అని అంటారేమో?అబ్బద్దపు ప్రచారాలు చేస్తున్నందుకు గాను లీగల్ నోటీస్ పంపుతున్నా.బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి’అని హరీశ్‌రావు ట్వీట్లో పేర్కొన్నారు.కాగా, ఆనంద కన్వెన్షన్ సెంటర్లో హరీశ్‌రావుకు వాటాలున్నాయని, దానిని కూల్చకుండా అడ్డుకోవడానికే పేద ప్రజలను అడ్డం పెట్టుకుని వారిని రెచ్చగొడుతున్నారని రాజ్యసభ ఎంపీ అనిల్‌యాదవ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనికి కౌంటర్‌గా హరీశ్‌రావు పరువునష్టం దావా పోస్టు పెట్టారు. -
TG: ప్రభుత్వానికి హరీశ్‌రావు డెడ్‌లైన్
సాక్షి,సిద్ధిపేటజిల్లా:రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్‌రావు డెడ్‌లైన్ విధించారు.దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని అల్టిమేటం ఇచ్చారు. శుక్రవారం(సెప్టెంబర్27) సిద్దిపేట జిల్లా నంగునూరు వేదికగా రైతు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. దసరా లోపు రుణమాఫీ చేయకుంటే రైతులతో కలిసి హైదరాబాద్‌లోని సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఇదీచదవండి: నిజాం కన్నా దుర్గార్గుడు సీఎం రేవంత్: ఈటల -
‘ఎల్ఓపీ’ సీటు కోసం కేటీఆర్, హరీశ్ ఫైట్: విప్ ఐలయ్య
సాక్షి,హైదరాబాద్: ప్రతిపక్షహోదా కోసం బావబామ్మర్దులు హరీశ్‌రావు,కేటీఆర్ కొట్టుకుంటున్నారని ప్రభుత్వవిప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. సోమవారం(సెప్టెంబర్23) ఐలయ్య మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు.‘కేసీఆర్ రైతులను ముంచాడు.హరీష్ డెయిరీలను నాశనం చేశాడు.ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం బావబామ్మర్ధులు కొట్టుకుంటున్నారు. ప్రజారోగ్యంపై కేటీఆర్ కమిటీ వేయడం సిగ్గుమాలిన పని.ప్రజాపాలనకి వస్తున్న ఆదరణ చూసి రంగా,బిల్లాలు ఓర్వలేకపోతున్నారు.గాంధీ హాస్పిటల్ సిబ్బంది మనోధైర్యం దెబ్బతీసేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు.పడేండ్లలో ఒక్కసారైనా గాంధీ హాస్పిటల్ గురించి ఆలోచించారా? డీప్యూటీ సీఎం గా పనికిరాని రాజయ్య ఈరోజు అవసరం వచ్చారా? దళితున్ని ముందు పెట్టి డ్రామాలాడుతున్నారు. పదేండ్లలో ఉస్మానియా హాస్పిటల్ ఎందుకు కట్టలేకపోయారు?స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మరోసారి బుద్ధి చెప్తారు.హరీశ్‌రావు డెయిరీ కోసం విజయ డైరీ,మదర్ డైరీని గత పదేళ్లలో పూర్తిగా నిర్వీర్యం చేశారు.గత పదేళ్లలో డెయిరీల్లో బీఆర్ఎస్ నాయకులు పంది కొక్కుల్లా మెక్కారు.డెయిరీల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపిస్తాం’అని తెలిపారు.ఇదీ చదవండి.. హైడ్రా పేరుతో హైడ్రామాలు: హరీశ్‌రావు -
‘పొన్నం’కు అవగాహన లేదు: హరీశ్‌రావు
సాక్షి,సిద్దిపేటజిల్లా: తనను విమర్శించే క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్ అవగాహనారాహిత్యం బయటపడిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టుపై పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం వృథా ప్రాజెక్టు కాదని కాంగ్రెస్ ప్రభుత్వమే నిరూపించిందని హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. కాగా, శనివారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ హరీశ్‌రావుపై కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. దీనికి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. ఇదీ చదవండి.. హరీశ్హార్డ్వర్కర్.. మాకు సలహాలివ్వొచ్చు: పొన్నం ప్రభాకర్ -
27న సిద్దిపేటలో బీఆర్ఎస్ రైతుధర్నా
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో రైతన్నకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ రైతు ధర్నాకు పిలుపునిచ్చింది.రుణమాఫీ,రైతు బంధు,పంట బోనస్ కోసం రైతుధర్నా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయనుంది.సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం నాడు సిద్దిపేట జిల్లా నంగునూరు వేదికగా రైతు ధర్నా నిర్వహించనున్నట్లు మాజీమంత్రి హరీశ్‌రావు తెలిపారు.రైతు ధర్నాకు పెద్ద ఎత్తున కదిలి రావాలని రైతన్నలకు మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టబోమని చ్చరించారు.రైతు ధర్నాపై హరీశ్‌రావు శనివారం(సెప్టెంబర్21) రైతులు,పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇదీ చదవండి.. హరీశ్ హార్డ్‌వర్కర్..సలహాలివ్వొచ్చు: మంత్రి పొన్నం -
నెల జీతం విరాళంగా ఇస్తాం: హరీశ్‌రావు
సాక్షి,సిద్దిపేట: కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీల అందరి నెల జీతం వరద బాధితులకు ఇస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ల నెల జీతం కూడా ఇస్తామని చెప్పారు. ‘ఖమ్మం వరద బాధితులకు సహాయం చేయడానికి అందరు ముందుకు రావాలి. సిద్దిపేట మున్సిపల్ కమిషర్ రూ.11 వేల విరాళం ఇచ్చారు. రేపు సిద్దిపేట నుంచి వెళ్లే సరుకులను ఖమ్మం వరద బాధితుల ఇంటింటికి అందిస్తాం. 6 లారీల్లో ఖమ్మంకు సరుకులను పంపుతున్నాం. రాష్ట్రంలో వరదలు వచ్చాయి. నేను ఖమ్మం వెళ్ళాను. వరద బాధితులు 24 గంటలు నీటిలో ఉన్నారు. వాళ్ళను చూస్తే నా కళ్లలో నీళ్లు వచ్చాయి. వాళ్లకు ఏమి లేవు. అన్నీ కొట్టుకుపోయాయి. వాళ్లకు మన సిద్దిపేట నుంచి 500 గ్రాసరి కిట్లు పంపించడానికి అమర్ నాథ్ సేవా సమితి ముందుకు వచ్చింది. అమర్నాథ్ సేవా సమితికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సిద్దిపేట నిలయం. చెరువులను కాపాడం మన అందరి బాధ్యత. ఆకర్షణ కన్నా ఆధ్యాత్మికత ముఖ్యం..మట్టి వినాయకులను పూజిద్దాం’అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. -
రుణమాఫీపై చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్
సాక్షి,హైదరాబాద్: ‘తెలంగాణలో ఏ ఊరికైనా వెళ్లి రుణమాఫీ జరిగిందా లేదా అనే చర్చ పెడదాం. సంపూర్ణ రుణమాఫీ అయిందని తేలితే నేను దేనికైనా సిద్ధం. నా సవాల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమేనా’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు సవాల్ విసిరారు. తెలంగాణభవన్‌లో శనివారం(ఆగస్టు17) జరిగిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘రూ.31 వేల కోట్లని చెప్పి రూ.17 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారు. 25 లక్షల మందికి రుణమాఫీ చేయకుండా ఎగనామం పెట్టారు. రూ.14 వేల కోట్లు కోత పెట్టారు. రైతులను నిట్టనిలువునా ముంచారు. పంచపాండవుల కథలా కాంగ్రెస్ రుణమాఫీ ఉంది’అని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. హరీశ్‌రావు ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు.. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దాం.. కుల్లం కుల్లా రైతులను అడుగుదాంసిద్దిపేట మండలం తడకపల్లిలో రుణమాఫీకి అర్హులు 720 మంది రైతులు కాగా.. రుణమాఫీ అయ్యిందికేవలం 350 మంది రైతులకేరుణమాఫీ పై తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు లక్షా 16 వేల 460 మంది రైతులు ఫిర్యాదు చేశారుమాట తప్పింది రేవంత్రెడ్డినాడు కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారురేవంత్ నాడు మాట నిలబెట్టుకున్నారా ? రైతుల నెత్తిన టోపీ పెడుతున్నారు రేవంత్ రెడ్డిఅధికారం దక్కించుకోవడానికి మోసం.. వచ్చిన అధికారం కాపాడుకోవడానికి రేవంత్ మోసం చేస్తున్నారు ఆగష్టు 20వ తేది వచ్చింది ఇప్పటి వరకు రైతు భరోసా పై నిర్ణయం తీసుకోలేదు రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టి రుణ మాఫీ సగం చేశారు రుణ మాఫీ పై శ్వేత పత్రం విడుదల చేయాలినీటి పారుదల, అప్పుల మీద శ్వేత పత్రాలు పెట్టిన రేవంత్‌రెడ్డి.. రుణ మాఫీ పై ఎందుకు శ్వేత పత్రం విడుదల చేయడం లేదుసాక్షి పత్రికలో వచ్చిన రుణం తీరలే అన్న వార్త కథనాన్ని చూపిన హరీష్ రావురేవంత్ రెడ్డి పరిపాలన లో ప్లాప్ తొండి చేయడంలో తోపుబూతులు తిట్టడంలో టాప్ రంకెలు వేస్తే అంకెలు మారిపోవు పాలకుడిగా రేవంత్ రెడ్డి పాపాలు మూట కట్టుకున్నారు దేవుళ్ళ మీద ఒట్ట్లు పెట్టారు.. తెలంగాణ ప్రజలకు శాపం కావొద్దని కోరుకుంటున్న అన్ని దేవాలయాల దగ్గరకు వెళ్ళి తెలంగాణ ప్రజలకు పాపం తగలవద్దని కోరుకుంటున్న దేవుళ్ళను పాపాల రేవంత్ రెడ్డిని క్షమించమని కోరుకుంటా ముఖ్యమంత్రి నన్ను తాటిచెట్టులా పెరిగావని నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు రుణ మాఫీ పై రేవంత్ ది ప్లాప్ షో భౌతిక దాడులకు పురి గొల్పుతున్నారు రేవంత్ గాడ్ ఫాదర్లకే భయపడలేదు చావాలని కోరుకుంటున్న వారు.. రేపు మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తారేమో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు రైతుల పక్షాన పోరాటం చేస్తాం రుణ మాఫీ పై బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం త్వరలో ప్రకటన చేస్తాం -
కాంగ్రెస్VSబీఆర్ఎస్..సిద్దిపేటలో హైటెన్షన్
సాక్షి,హైదరాబాద్: సిద్దిపేట పట్టణంలో శనివారం(ఆగస్టు17) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంపు ఆఫీసుపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. దాడిని నిరసిస్తూ క్యాంప్‌ఆఫీస్‌ముందు బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. హరీశ్‌రావుపై వెలసిన ఫ్లెక్సీలను బీఆర్ఎస్ కార్యకర్తలు చింపివేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పోటీగా నగరంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవ హై టెన్షన్‌కు దారితీసింది.కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవ హై టెన్షన్‌కు దారితీస్తోంది. దీంతో పట్టణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్..తన సిద్దిపేట క్యాంప్‌ఆఫీస్‌పై శుక్రవారం(ఆగస్టు16) అర్ధరాత్రి వేళ కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు శనివారం హరీశ్‌రావు ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయమని పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమని, వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీపీని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
రాజీనామా ఏది..? హరీశ్‌రావుపై వెలసిన ఫ్లెక్సీలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావుపై హైదరాబాద్ నగరంలో శుక్రవారం(ఆగస్టు16) ఫ్లెక్సీలు వెలిశాయి. రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా ఏడబోయే అంటూ ఫ్లెక్సీల్లో హరీశ్‌రావును ప్రశ్నించారు. ఫ్లెక్సీలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేర్లున్నాయి. కాగా, ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని గతంలో హరీశ్‌రావు ప్రకటించారు. తుదివిడత రూ.2 లక్షల రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా హరీష్‌రావు రాజీనామా అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం వైరా సభలో ప్రస్తావించారు. మొత్తం 3 విడతల్లో రూ. 2లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కుక్కలదాడి ఘటనలపై హరీశ్‌రావు కీలక ట్వీట్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా కుక్కల దాడి ఘటనలు జరిగినా ప్రభుత్వం చలించకపోవడం అమానవీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు శనివారం(ఆగస్టు 10) ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు.‘బతికున్న మనుషులను సైతం కుక్కలు చంపి పీక్కుతిన్న ఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు చిన్నారులపై కుక్కల దాడులు నిత్యకృత్యం అవుతున్నాయి. రాష్ట్రంలో కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడం అనేది ఒక సాధారణ అంశంగా ప్రభుత్వం భావిస్తుండటం దుర్మార్గం. కుక్క కాటు కేసులు నమోదైన వెంటనే తగిన చర్యలు తీసుకొని ఉంటే రాష్ట్రంలో గడిచిన 8 నెలల కాలంలో 343 కుక్కకాటు సంఘటనలు జరిగి ఉండేవి కావు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు. ఇప్పటికే ఈ విషయంలో పలుమార్లు హైకోర్టు హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వదలడం లేదు. ప్రభుత్వం వెంటనే కుక్కల దాడులు అరికట్టే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
కేసీఆర్, హరీశ్‌రావుకు భూపాలపల్లి కోర్టు నోటీసులు
సాక్షి,భూపాలపల్లి: బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు సోమవారం(ఆగస్టు5) నోటీసులు జారీ చేసింది. కేసీఆర్‌తో పాటు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన నీటిపారుదల శాఖ అధికారులు సెప్టెంబరు 5న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు వారందరికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై రాజలింగమూర్తి అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను భూపాలపల్లి కోర్టు విచారించింది. అనంతరం కేసీఆర్, హరీశ్‌రావులకు నోటీసులిచ్చింది. -
సీఎం రేవంత్‌పై ప్రివిలేజ్ మోషన్: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తామని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. సోమవారం(జులై 29) అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘గవర్నమెంట్ డిఫెన్స్‌లో పడినప్పుడు సీఎం ఏదో పేపర్ పట్టుకొని సభలోకి వచ్చి డైవర్ట్ చేస్తున్నారు. సభా నాయకుడు మిస్ లీడ్ చేస్తున్నారు. మోటార్లకు మీటర్ల అంశంలో మెటీరియల్‌లో అదర్ దేన్ అగ్రికల్చర్ మీటర్స్ అనే పదాలను కావాలని ఎగరగొట్టి చదివారు. అప్పులు 7 లక్షల కోట్లు అని తప్పుగా చెబుతున్నారు. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేయలేదని చెప్పే ప్రయత్నం నేను చేస్తుండగా... మోటర్లకు మీటర్లు పెట్టడానికి సంతకం చేశారని రేవంత్ లేచి సభను మిస్ లీడ్ చేశారు.దబాయింపు చర్యలకు సీఎం పాల్పడుతున్నారు. ఇండియా కూటమి 28 పార్టీల కలయికతో కాంగ్రెస్‌కు ఆ మాత్రం ఎంపీ సీట్లు వచ్చాయి. 28 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు 21 శాతం ఓట్లు వచ్చాయి. రేవంత్ పనితీరు బాగోలేకపోవడంతోనే మహబూబ్ నగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆయన ఎంపీగా గెలిచిన మల్కాజిగిరి పార్లమెంట్లో కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. రేవంత్ సొంత జిల్లాలో లోకల్ బాడి ఎమ్మెల్సీ స్థానం కూడా ఓడిపోయారు.గతంలో 20 మంది ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 39 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాలేదా ? చీమలు పెట్టిన పుట్టలో పాము దురినట్లు రేవంత్ కాంగ్రెస్‌లతో చేరి సీఎం అయ్యారు. అసలు కాంగ్రెస్‌లో హనుమంత్ రావు లాంటి నేతలు ఏమయ్యారు ? జైపాల్ రెడ్డి కనీసం రేవంత్ రెడ్డిని దగ్గరకు కూడా రానివ్వలేదు’అని హరీశ్‌రావు అన్నారు. -
బడ్జెట్లో తెలంగాణకు గుండుసున్నా: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదమే ఉచ్ఛరించలేదని, కాంగ్రెస్,బీజేపీ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం(జులై 23) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘ఏపీలో వెనుకబడిన జిల్లాలపై కేంద్ర బడ్జెట్లో మాట్లాడారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు లేవా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు. కిషన్‌రెడ్డి,బండి సంజయ్ ఏం చేస్తున్నారు ? ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచి ఏం ప్రయోజనం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ,బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ లేదు. తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం చేసింది. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా’అని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కనీసం 15 రోజులు జరపాలని కోరితే ప్రభుత్వం దానిని కేవలం 4 రోజులకు కుదించిందని మండిపడ్డారు. తమ హయాంలో బడ్జెట్ సమావేశాలు 9 రోజులు నిర్వహించి డిమాండ్లపైనా చర్చించేవాళ్లమని గుర్తుచేశారు. -
‘రైతు ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం’
హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన రైతు బోజడ్డ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి చనిపోతున్నానని చెప్పాడని, సీఎం పేరు ప్రస్తావిస్తూ రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.ప్రభాకర్ ఆత్మహత్య కారకులను వదిలేసి, వీడియో తీసినవారిపై కేసు పెట్టడం విడ్డూరమన్నారు హరీష్‌రావు. ప్రభాకర్ కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసిన హరీష్‌రావు.. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. అదే సమయంలో ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలన్నారు.రైతు ఆత్మహత్యపై స్పందించిన సీఎం రేవంత్రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. -
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు అకౌంట్లలో నెలకు 2500 రూపాయలు వేస్తున్నామని రాహుల్ గాంధీ నిసిగ్గుగా నిర్మల్ సభలో చెప్పుకోవడాన్నితీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాహుల్ గాంధీ మాటలు రాజు గారు దేవతా వస్త్రాల కథను గుర్తుకు తెస్తున్నాయని ఎక్స్(ట్విటర్)లో హరీశ్‌రావు ట్వీట్ చేశారు.‘తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలపై రాహుల్ గాంధీకి కనీస అవగాహన లేదు. ఆయన దొంగలకు సద్ది కడుతున్నారు. గ్యారెంటీలకు గ్యారెంటీగా ఉండాల్సిన రాహుల్ గాంధీ కంచే చేను మేసేలా ప్రవర్తిస్తే ఎట్లా? అమలు కానీ గ్యారెంటీలు అమలవుతున్నట్టు ప్రకటించిన రాహుల్ గాంధీ తక్షణమే తప్పు జరిగింది అని క్షమాపణ చెప్పాలి.తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి లేదా తన మాట నిజమే అయితే గ్యారెంటీల అమలు పై నాతో బహిరంగ చర్చకు రావాలి’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
Ts: ప్రభుత్వానిది వైట్ పేపర్ కాదు.. ఫాల్స్‌పేపర్: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కేఆర్ఎంబీకి అప్పగించబోని బీఆర్ఎస్ చెప్పించిందని, ఇది బీఆర్ఎస్ పార్టీ విజయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మీడియాపాయింట్లో హరీశ్‌రావు మాట్లాడారు. తాము గొంతు విప్పాకే అసెంబ్లీలో కేఆర్ఎంబీపై ప్రభుత్వం తీర్మానం చేసిందని చెప్పారు. ‘ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఖరిపై నిలదీశాం. ప్రతిపక్షం మీద దాడి చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. వారి ప్రెజెంటేషన్లన్నీ తప్పుల తడకలుగా ఉన్నాయి. మేము కూడా ఫ్యాక్ట్ షీట్ విడుదల చేస్తున్నం. మీడియా ప్రచారం చేయాలి. వాస్తవాలు తెలియజేయాలి.మీరు చెప్పింది తప్పు అని ప్రొటెస్ట్ చెప్తామంటే వినడం లేదు. కాగ్ పనికి రాదు అని మేము అనలేదు. మాజీ ప్రధాని మీ మన్మోహన్ సింగ్ గారే కాగ్ నివేదిక తప్పుల తడక అన్నారు. గతంలో సీఎంలుగా పనిచేసిన వైఎస్‌రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కాగ్‌ను తప్పుపట్టారు. ఇదే కాగ్ మమ్మల్ని ఎన్నో సార్లు మెచ్చుకున్నది. ప్రాణహిత టెండర్లు కూడా వేయకుండా పనులు ప్రారంభించారని కాగ్ మిమ్మల్ని తిట్టింది. ప్రభుత్వం పెట్టింది వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్. నాలుగు ఎంపీ సీట్ల కోసం చిన్న పొరపాట్లను భూతద్దం పెట్టీ చూపే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల సంక్షేమం చూడాలి. లేదంటే ఆగం అవుతారు. మీకు పుట్టగతులు ఉండవు. పరిపాలన మీద దృష్టి పెట్టాలి. మమల్ని ఇరికించబోయి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక మేడిగడ్డ అంటున్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మీ హయాంలో నీళ్ళు, కరెంట్, రైతు బంధు రావడం లేదు. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. ఏనాటికైనా కంచు కంచే. మేము ప్రజల మధ్య ఉన్నాం. మంద బలంతో తిట్టించే ప్రయత్నం చేశారు. నేను సభలో మాట్లాడితే 8 మంది మంత్రులు అడ్డుకున్నరు. ప్రజలు చూశారు. మీదగ్గర సమాధానం లేక తప్పించుకున్నారు. వాస్తవాలు బయటికి రాకుండా అడ్డుకున్నారు. సభలో అడ్డుకున్నా ప్రజల్లో అడ్డుకోలేరు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌లో చేరిక.. బీజేపీ నేత ఈటల క్లారిటీ -
ఆటోడ్రైవర్లకు బీఆర్ఎస్ సంఘీభావం
సాక్షి, హైదరాబాద్: ఆటో డ్రైవర్లను ఆదుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టి తెచ్చే లక్ష్యంతో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ చేరుకున్నారు. సుమారు 20కి పైగా ఆటోల్లో మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, సబిత, సునీత లక్ష్మారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి తదితరులు అసెంబ్లీకి వచ్చారు. ప్లకార్డులతో అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పబ్లిక్ గార్డెన్స్ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆటోలను లోపలికి అనుమతించేందుకు పోలీసులు అభ్యంతరం చెప్పడంతో బీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ప్లకార్డులను లాక్కునే క్రమంలో కేపీ వివేకానందతో జరిగిన తోపులాటలో కారు అద్దం పగిలింది. ఆటో కార్మి కుల కుటుంబాలను ఆదుకోవాలని నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభకు, ఎమ్మెల్సీలు శాసనమండలికి కాలినడకన చేరుకున్నారు. నల్ల కండువాలతో శాసనమండలిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంపై ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. -
Ts: బీఏసీ మీటింగ్ వివాదం.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలిరోజు గురువారం మాజీ మంత్రి హరీశ్‌రావుకు అసెంబ్లీలో వింత అనుభవం ఎదురైంది. బీఏసీ సమావేశానికి హాజరయ్యే విషయంలో ఏర్పడిన గందరగోళంపై హరీశ్‌రావు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘గతంలో లేని సంప్రదాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తోంది. జాబితాలో పేర్లు ఉన్న వారు మాత్రమే బీఏసీ సమావేశానికి రావాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అంటున్నారు. కడియం శ్రీహరితో పాటు హరీశ్‌రావు బీఏసీకి వస్తారని నిన్ననే స్పీకర్‌కు బీఆర్ఎస్ఎల్పీ లీడర్ కేసిఆర్ తెలియజేశారు. స్పీకర్ రమ్మన్నారు కాబట్టే వెళ్ళాను. ఒక్క ఎమ్మెల్యే ఉన్న సీపీఐని బీఏసీ సమావేశానికి పిలిచారు’ అని హరీశ్‌రావు మీడియాకు తెలిపారు. అంతకుముందు బీఏసీ సమావేశానికి వెళ్లిన హరీశ్‌రావు సమావేశం మధ్యలో నుంచే బయటికి వచ్చేశారు. జాబితాలో పేరున్న కేసీఆర్‌కు బదులుగా పేరున్న హరీశ్‌రావు బీఏసీకి వెళ్లారు. హరీశ్‌రావు బీఏసీ సమావేశానికి రావడంపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం తెలపడంతో హరీశ్‌రావు మధ్యలోనే బయటికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. తాము ఎవరినీ వ్యక్తిగతంగా బీఏసీ నుంచి బయటికి వెళ్లమని కోరలేదన్నారు. స్పీకర్ నిర్ణయం మేరకే బీఏసీ నడిచిందని, పార్టీల నుంచి ముందుగా ప్రతిపాదించిన సభ్యులే బీఏసీకి రావాలని స్పీకర్ కోరారని చెప్పారు. జాబితాలో పేరున్న కేసీఆర్‌కు బదులుగా హరీశ్‌రావు వస్తారని బీఆర్ఎస్ తెలిపిందన్నారు. గవర్నర్ ప్రసంగంలో గ్యారెంటీల జాడ లేదు అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగంపై అసెంబ్లీ మీడియా పాయింట్లో హరీశ్‌రావు స్పందించారు. ఒక విజన్‌లా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం అందరినీ నిరాశపరిచిందన్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వం ఏం చేస్తుందో గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా లేదని విమర్శించారు. ‘కొత్త ఆసరా పెన్షన్లు, మహిళలకు నెలకు రూ. 2500 ఎప్పుడిస్తారో తెలియని ప్రసంగం నిరాశపరిచింది. రైతులకు బోనస్, రైతు బంధు ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. నిరుద్యోగ భృతి ప్రస్తావన లేనేలేదు. ప్రజావాణి కార్యక్రమం తుస్సుమంది. మంత్రులు, ఐఏఎస్‌లు తీసుకోవాల్సిన అప్లికేషన్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీసుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పినట్టు 2 గ్యారెంటీలు అమలవ్వడం లేదు. త్వరలో ఎన్నికల కోడ్ అమలవనుంది. అప్పుడు ఈ కొత్త హామీలు ఎలా అమలు చేస్తారు’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇదీచదవండి.. ప్లీజ్ కేటీఆర్..కాంట్రవర్సీ వద్దు -
నెల రోజుల్లో కేంద్రం ఆధీనంలోకి ప్రాజెక్టులు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్(కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ అంశంపై సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో జరిగిన కేఆర్ఎంబీ రెండో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కేఆర్ఎంబీ రెండో మీటింగ్ మినట్స్‌లోనే ఉన్నాయన్నారు. తాము నిలదీశాకే ప్రాజెక్టులపై ఢిల్లీకి లేఖ రాశారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కృష్ణాపై ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని, కేవలం రెండు నెలల పాలనలోనే రేవంత్ సర్కారు ఆ పని చేసిందని విమర్శించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకే సర్కారు పెద్దలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి తెలంగాణను అడుక్కునే స్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి అర్థ సత్యాలు, అసత్యాలు మితి మీరిన భాష కనిపించాయన్నారు. ఉదయం పద్మ అవార్డుల గ్రహీతల సభలో హుందాగా మాట్లాడాలని చెప్పిన రేవంత్‌రెడ్డి మధ్యాహ్నానికి మాట మార్చారని, నీచమైన భాషతో కేసిఆర్‌ను దూషించారన్నారు. ప్రాజెక్టులు అప్పగించేది లేదని సీఎం అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఇక నుంచి ప్రాజెక్టులపైకి వెళ్లాలంటే సీఆర్పీఎఫ్ అనుమతి తప్పనిసరన్నారు. ప్రాజెక్టుల అప్పగింత వల్ల ఏపీ లాభం జరుగుతుందని పత్రికలో వచ్చినా ఈ ముఖ్యమంత్రి నుంచి ఉలుకు పలుకు లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇదీచదవండి.. లిక్కర్ స్కాం కేసు.. కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా -
TS: బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’లో ఏముంది?
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ రిలీజ్ చేయనున్న స్వేద పత్రం ఆసక్తి రేపుతోంది. తమ తొమ్మిదేళ్ల తమ పాలనలో తెలంగాణలో అభివృద్ధి చేసిన ఆస్తులు, అప్పులపై గులాబీ పార్టీ కాసేపట్లో స్వేదపత్రం పేరిట వైట్‌పేపర్ రిలీజ్ చేయనుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషేన్ ద్వారా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్తులు, అప్పులను వివరించనున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్‌గా బీఆర్ఎస్ ఈ స్వేద పత్రం విడుదల చేయనుంది. తొమ్మిదేళ్లలో ప్రభుత్వంలో తాము,తెలంగాణప్రజలు కలిసి చెమటోడ్చి ఆస్తులు సృష్టించుకున్నందునే వైట్‌పేపర్‌కు స్వేదపత్రం అని పేరు పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆస్తుల సృష్టికే అప్పులు చేశామని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకే ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. నిజానికి శనివారమే స్వేదపత్రం రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ కేటీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా కార్యక్రమానికి నేటికి వాయిదా వేశారు. స్వేదపత్రం రిలీజ్ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు పలువురు హాజరవనున్నారు. ఇదీచదవండి..లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్! -
రేవంత్ ప్రసంగానికి అడ్డు తగిలిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు పలుమార్లు అడ్డుతగిలారు. రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తుండటంతో రెండుసార్లు మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో పలువురు బీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ ‘సిగ్గుతో తలదించుకోవలసిందే’నని రేవంత్ వ్యాఖ్యానించగా హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాగంటి గోపీనాథ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్ తదితరులు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. మీకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ ప్రసాద్‌కుమార్ తెలపడంతో సీట్లలో కూర్చున్నారు. ► రేవంత్ ప్రసంగంలో బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను విమర్శిస్తున్నప్పుడు సభ్యులు పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ పలుమార్లు అరుస్తూ అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ► రేవంత్ మాటలకు కౌశిక్‌రెడ్డి అడ్డు తగులుతుంటే స్పీకర్ ప్రసాద్‌కుమార్ జోక్యం చేసుకుంటూ ‘కౌశిక్‌రెడ్డి.. కొత్త సభ్యుడివి. సభ నాయకుడు మాట్లాడుతుంటే వినాల్సిందే’అని స్పష్టం చేశారు. ► డ్రగ్స్ మాఫియా గురించి రేవంత్ మాట్లాడుతూ యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ గురించి మాట్లాడుతుంటే సపోర్ట్ చేసేందుకు మనసు రాలేదా అని ప్రశ్నించగా, ‘వుయ్ సపోర్ట్ యూ’అని పాడి కౌశిక్‌రెడ్డి అరిచారు. దానికి రేవంత్ స్పందిస్తూ ‘ఆయనకు తెలియక మాట్లాడుతున్నాడు. తరువాత ఆయన కష్టాలు ఆయనకుంటాయి’అని వ్యాఖ్యానించారు. కాగా తమ ప్రభుత్వ హయాంలో కూడా డ్రగ్స్ కట్టడికి సీవీ ఆనంద్ నేతృత్వంలో చర్యలు తీసుకున్నామని మాజీ మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. ► రేవంత్ మాటలకు కౌశిక్‌రెడ్డి అడ్డు తగిలిన సమయంలో ‘గట్టిగా అరుస్తున్న ఆయన కూడా మేనేజ్మెంట్ కోటానే’అని వ్యాఖ్యానించారు. -
కరెంట్ కావాలా..కాంగ్రెస్ కావాలా: హరీశ్‌రావు
సాక్షి, నారాయణఖేడ్: బీఆర్ఎస్ ర్యాలీకి హాజరైన ప్రజలను చూస్తే కాంగ్రెస్ వాళ్లకు గుండెలో గుబులు పుడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ ఖేడ్ రోడ్ షోలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ భూపాల్ రెడ్డి 50 వేల మెజారిటీతో గెలుస్తారని చెప్పారు. కర్ణాటకలో 9 గంటలు ఉన్న కరెంటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 3 గంటలకు వచ్చిందని ఎద్దేవా చేశారు. బ్రిటీష్ వాళ్లు వెళ్లేటపుడు స్వాతంత్రం ఇచ్చిపోయారని, కాంగ్రెస్ పార్టీ నుంచి దేశానికి ప్రధానమంత్రి అయ్యారంటే అది బ్రిటీష్ వాళ్ల భిక్షేనన్నారు. ‘కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా తేల్చుకోండి. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు. కర్ణాటకలో ఖజానా ఖాళీ అయింది. కరెంట్ బంద్ అయ్యింది. కేసీఆర్ వచ్చిన తరువాత తెలంగాణలో కర్ఫ్యూ లేదు. 30 వ తేదీన కాంగ్రెస్ వాళ్ళకు దిమ్మ తిరగాలె. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన భూములను పట్టా భూములుగా మారుస్తాం. కాంగ్రెస్ వాళ్లు అధికారంలో ఉంటే ,ప్రభుత్వ ఆస్పత్రులు మూతపడతాయి. ప్రైవేట్ ఆస్పత్రులు ఓపెన్ అవుతాయి. నారాయణఖేడ్ మున్సిపాలిటీ లో పెరిగిన టాక్స్‌లను తగిస్తాం. బీఆర్ఎస్ పవర్లోకి వస్తే తెల్లకార్డుపై సన్నబియ్యం ఇస్తాం’ అని హరీశ్‌రావు తెలిపారు. ఎల్లారెడ్డి రోడ్ షోలో మాట్లాడుతూ.. ‘ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అమెరికా నుంచి వచ్చి సంతలో పశువులను కొన్నట్టు నాయకులను కొంటున్నాడు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అని ఊదర గొట్టారు. ఇప్పుడు అక్కడ జనాలు లబో దిబో మొత్తుకుంటున్నారు. రెండు మూడు గంటలు మించి అక్కడ కరెంట్ రావటం లేదట. రేవంత్‌రెడ్డి 10 హెచ్‌పీ మోటార్ పెడితే 3 గంటల కరెంట్ చాలంటున్నాడు. 10 హెచ్‌పీ ఆయన తాత కొనిస్తాడ రైతులకు. కాంగ్రెస్ వాళ్లు రైతు బంధు కాపీ కొట్టిండ్రు. ఖర్గే కర్ణాటకలో నీ ఊళ్ళో మంచి నీళ్లు వస్తున్నయా? యువశక్తి కింద ఒక్క రూపాయి ఇస్తున్నవా? కబర్దార్ నోరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు’ అని హరీశ్‌రావు హెచ్చరించారు. ఇదీచదవండి..కొల్లాపూర్‌లో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ వద్ద నిరసనలు -
సీఎం కేసీఆర్, హరీశ్‌రావులపై ఈసీకి ఫిర్యాదు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారిపై చర్యలు తీసవుకోవాలని కోరింది. ప్రజా ఆశీర్వాద సభల పేరిట బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. వరంగల్ బహిరంగ సభలో కాంగ్రెస్‌ను దోకేబాజి పార్టీ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని ఫిర్యాదులో కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కాంగ్రెస్ మేనిఫెస్టోను 420 మేనిఫెస్టో అంటూ హరీష్ రావు విమర్శలు చేశారని, ఇది కూడా కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని కంప్లయింట్లో తెలిపింది. కాగా, ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రేవంత్‌రెడ్డి బహిరంగ సభల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఈవోకు బీఆర్ఎస్ లీగల్ సెల్ కంప్లయింట్ ఇచ్చింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఇంతేగాక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అడ్వర్టైజ్‌మెంట్‌లపైనా బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ అడ్వర్టైజ్మెంట్లలో కేసీఆర్‌ను కించపరుస్తున్నారని పేర్కొంది. ఇప్పటికే ఈ యాడ్లు ఆపాలని ఈసీ ఆదేశాలిచ్చింది. ఇదీచదవండి.. ఆయన రేవంత్ రెడ్డి కాదు..రైఫిల్ రెడ్డి : సీఎం కేసీఆర్ ఫైర్ -
సీతక్కకు ప్రచారం ఎక్కువ..పని తక్కువ: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్ : ములుగు ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియాలో మాత్రమే ఉంటారని, ఆమెకు పని తక్కువ ప్రచారం ఎక్కువ అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణభవన్‌లో ములుగుకు చెందిన బీజేపీ నేత రాములు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు హరీశ్‌రావు కండువా కప్పి ఆహ్వానించారు. చేరికల సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ‘ నిరుపేద అమ్మాయి నాగజ్యోతి. ములుగులో ఈసారి ఆమెను గెలిపించాలని కోరుతున్న. ఓడిపోతున్నానని తెలిసి కోపంతో సీతక్క ఇష్టం వచ్చినట్లు నోరు జారుతోంది. ఆమె ఓటమి ఖాయం. 5 గంటల కరెంట్ ప్రచారంతో అబాసుపాలైంది. ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? వ్యవసాయానికి ఎంత హెచ్‌పీ మోటార్ వాడుతారో కూడా తెలియని అజ్ఞాని రేవంత్ రెడ్డి. కర్ణాటక లో రెండు గంటల కరెంట్ కూడా రావటం లేదని అక్కడి మాజీ సీఎం కుమార స్వామి చెప్తున్నాడు. వంద అబద్ధాలు ఆడైనా సీఎం కుర్చీ దక్కించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. 11సార్లు అవకాశం ఇచ్చినా కనీసం బిందె నీళ్ళు ఇవ్వడం కాంగ్రెస్‌కు చేతకాలేదు. బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం పక్కా. కేసీఆర్‌ను కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. మేం తిట్టలేమా’ అని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఇదీ చదవండి.. నా భర్తపై దాడిని ఖండిస్తున్నా: ఎమ్మెల్యే గువ్వల భార్య -
ఆ పార్టీ మాయమాటలు నమ్మొద్దు! : మంత్రి హరీశ్‌రావు
సాక్షి, మెదక్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉందని, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆగమవుతారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతారెడ్డి మంత్రి హరీశ్‌రావుతో కలిసి నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు భారీ ర్యాలీతో వెళ్లారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటే వంచన.. మోసమని, కేసీఆర్ అంటే నమ్మకం అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రాష్ట్రం ఆగమైతదని, ఆ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్తారని విమర్శించారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ కట్ అవుతుందని విమర్శించారు. కొడంగల్‌లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో చెప్పిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. 2018లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే తాను గడ్డం తీసుకోనని ఆ పార్టీ నాయకుడు ఉత్తంకుమార్‌రెడ్డి ప్రకటించి మాట తప్పారని విమర్శించారు. మాట తప్పే నాయకులు కావాలా మాట మీద ఉండే కేసీఆర్ అవసరమా ఆలోచించాలని కోరారు. రేవంత్‌రెడ్డి పట్టపగలు రూ.50లక్షలు లంచం ఇస్తూ దొరికారని ఆరోపించారు. రైతులను కేసీఆర్ రాజులుగా చేస్తే రైతు బంధు బిచ్చమేసినట్లుగా ఉందని రేవంత్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఉత్తదేనని, కేసీఆర్ మాట మీద ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ డకౌట్ అవుతుందని, కాంగ్రెస్ రనౌట్ అవుతుందని, కేసీఆర్ సెంచరీ చేస్తారని హరీశ్ జోస్యం చెప్పారు. నర్సాపూర్‌ను మరింత అభివృద్ధి చేస్తాం! నర్సాపూర్‌ను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతులు ఈలవేస్తే కొండపోచమ్మ గేట్లు ఎత్తి నీళ్లు అందిస్తున్నారని, హల్దీవాగు నిండటంతో ఎకరం పొలం ఎండటం లేదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి మంత్రిగా పనిచేశారని, ఆమెను గెలిపిస్తే నర్సాపూర్ అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం కేసీఆర్ నర్సాపూర్ వచ్చినప్పుడు పట్టణ అభివృద్ధికి రూ.65 కోట్లు విడుదల చేశారని గుర్తుచేస్తూ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ఇంతవరకు గ్రామ పంచాయతీ వార్డు మెంబరుగా గెలవలేదని, ఆయన ఏమి చేస్తారని ప్రశ్నించారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, నాయకులు సమష్టిగా సునీతారెడ్డి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. నర్సాపూర్‌లో సునీతారెడ్డిని గెలిపిస్తే అక్కడ కేసీఆర్ సీఎం అవుతారన్నారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని ఎంపీగా పోటీ చేయిస్తామని చెప్పారు. సునీతారెడ్డిని 60 వేల మెజారిటీతో గెలిపించే బాధ్యత మదన్‌రెడ్డితో పాటు నియోజకవర్గంలోని కార్యకర్తలదన్నారు. అలాగే ఎంపీ ఎన్నికల్లో నర్సాపూర్‌లో లక్ష మెజార్టీ తేవాల్సిన బాధ్యత సునీతారెడ్డిపై ఉంటుందన్నారు. తాను సిద్దిపేటలో లక్ష మెజార్టీ ఇస్తానని ప్రకటించారు. అనంతరం సునీతారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం సేవ చేస్తానన్నారు. ర్యాలీలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర కార్మిక బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ఇవి చదవండి: కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే.. : ఎంపీ బండి సంజయ్‌కుమార్ -
హుజురాబాద్‌లో బీజేపీకి మూడో స్థానమే : హరీశ్‌రావు
సాక్షి, హుజురాబాద్ : హుజురాబాద్‌లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉందని, బీజేపీ అయితే మూడో స్థానానికి పడిపోయిందని చెప్పారు. హుజురాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కౌశిక్ రెడ్డి ప్రజా జీవితంలో ఆల్ రౌండర్. కౌశిక్ రెడ్డి అంటే ముఖ్యమంత్రికి చాలా ఇష్టం. కౌశిక్ రెడ్డి గెలిచిన తర్వాత సీఎం వద్దకు వెళ్లి నియోజకవర్గ కోసం నిధులు తీసుకొస్తాడు. ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఈటల గెలిచిన నియోజకవర్గంలో తట్టెడు మన్ను కూడా పోయలేదు. ఇక్కడి ప్రజలను పూర్తిగా విస్మరించాడు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ గెలిచినా తెలంగాణ మరోసారి అంధకారంలోకి వెళ్లిపోతుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 3వేల రూపాయలు అందిస్తాం. ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతాం. గ్యాస్ సిలిండర్‌ను కేవలం రూ. 400కు అందిస్తాం. కేసీఆర్ ధీమా ఇంటింటికి బీమా కింద రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఎవరైనా మరణిస్తే 5 లక్షలు ఇస్తాం. ఇదీ చదవండి..సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?: రేవంత్ సవాల్ హుజురాబాద్‌లో పేదలకిచ్చిన అసైన్ భూములన్నిటికీ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత పట్టాలు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఏది కావాలన్నా ఢిల్లీ దగ్గర మోకరిల్లాల్సిందే. మొన్న కర్ణాటక నుంచి డీకే శివకుమార్ వచ్చి అక్కడ రోజుకు 5 గంటల కరెంటు ఇస్తున్నాం అని చెప్పాడు. డీకేకు తెలంగాణలో 24 గంటల కరెంటు ఉన్నది అనే విషయం కూడా తెలియదు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ వస్తే మోటర్లు జీపులో వేసుకొని పోతారు. దొంగ రాత్రి కరెంటు వస్తుంది. కాంగ్రెసోళ్లు కర్ణాటకలో ఆరు నెలలు గడవకముందే ఇచ్చిన హామీలను ఎగ్గొడుతున్నారు. కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అని మాట్లాడారు. రైతుకు రైతుబంధు ఇవ్వడం దుభారా అవుతుందా.. అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చే రైతు బంధును బిచ్చమేస్తున్నాం అన్నాడు. రైతుబంధు తీసుకునే రైతులను బిచ్చగాళ్ళ తో పోలుస్తూ మాట్లాడటం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ప్రజల పరిస్థితి అధోగతి పాలవుతుంది’ అని హరీశ్ రావు హెచ్చరించారు. ఇదీ చూడండి.. మిషన్ తెలంగాణ -
ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కత్తిదాడికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉంటే ప్రతిపక్ష నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. మంగళవారం ఆయన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడి ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయనతో కొద్దిసేపు ముచ్చటించి ధైర్యం చెప్పారు. అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ.. కత్తితో పొడవడంతో కత్తి 3 అంగుళాలు లోపలికి వెళ్లగా 4 చోట్ల చిన్నపేగుకు గాయమైందన్నారు. 15 సెం.మీ. చిన్న పేగును తొలగించి, మూడున్నర గంటలపాటు వైద్యులు శస్త్ర చికిత్స చేశారని చెప్పారు. ఇటువంటి సమయంలో సీనియర్ నాయకులు కూడా దీన్ని అపహాస్యం చేసేలా కోడి కత్తి అంటూ మాట్లాడటం దురదృష్టకరమన్నారు. దివాళాకోరు రాజకీయాలు చేస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వ్యక్తులను నిర్మూలించి రాజకీయాలు చేయాలనుకోవడం తెలంగాణలో ఎప్పుడూ లేదని, తాము అధికారంలో ఉన్న ఏ రోజూ పగతో వ్యవహరించలేదన్నారు. పగతో రాజకీయాలు చేస్తే గతంలో హౌజింగ్ స్కీముల్లో స్కాములు చేసిన కాంగ్రెస్ నాయకులు, ఓటుకు నోటుకు కేసులో దొరికిన వాళ్లు ఎప్పుడో జైలుకు వెళ్లేవారని చెప్పారు. రాష్ట్రంలో ఏదోరకంగా అల్లర్లు చేయాలని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేయాలని ప్రతిపక్ష నాయకులు చూస్తున్నారని, ప్రజలు వీటిని గమనించాలని సూచించారు. ప్రచారంలో ఉన్న అభ్యర్థులపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, అభ్యర్థులకు భద్రత పెంచాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ కేసులో కుట్రకోణం రెండు మూడు రోజుల్లో బయటకు వస్తుందని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించిన వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మరో నాలుగు రోజులు ఐసీయూలో మరో నాలుగు రోజుల పాటు ప్రభాకర్‌రెడ్డిని ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుందని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి హెడ్ డాక్టర్ విజయ్‌కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు ప్రసాద్‌బాబు తెలిపారు. ప్రస్తుతం ఆయన స్పృహలోనే ఉన్నాడని, మరో మూడు నాలుగు రోజులు గడిస్తేనే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందో లేదో చెప్పగలమన్నారు. -
‘నిమ్స్ ది గ్రేట్’ : మంత్రి హరీష్‌రావు ప్రశంసలు..!
హైదరాబాద్: అవయవ మార్పిడి ఆపరేషన్లలో నిజాం వైద్య విజ్ఞాన సంస్ధ(నిమ్స్) తన ప్రత్యేకతను మరోసారి చాటి చెప్పింది. గతంలో ఎన్నో విజయాలను పదిలపర్చుకున్న నిమ్స్ తాజాగా మారో అరుదైన రికార్డు సృష్టించి వైద్య రంగాలలోనే సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఎనిమిది నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా చేసి అరుదైన రికార్డును వైద్యులు సొంతం చేసుకున్నారు. ఇందులో 61 లైవ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయగా, 39 దాతల ద్వారా సేకరించినవి.. గ్రహీతల్లో 11, 12 ఏళ్ల వయసువారు కూడా ఉండడం చెప్పుకోదగ్గ అంశం. శుక్రవారం వందో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసిన వైద్య బృందంలో యూరాలజీ వైద్యనిపుణులు ప్రొఫెసర్ రామ్‌రెడ్డి, విద్యాసాగర్, రామచంద్రయ్య, తదితరులు ఉన్నారు. వీరంతా యూరాలజీ హెచ్ఓడీ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స మార్పిడిలు చేస్తున్నారు. గత నెలలో రూ.32 కోట్లతో సమకూర్చుకున్న అడ్వాన్స్డ్ పరిజ్ఞానం ఉన్న రోబోటిక్స్ సాయంతో యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాల్లో అత్యంత సంక్లిష్టమైన నెల రోజుల వ్యవధిలోనే 30 అపరేషన్లను చేశారు. గాల్‌బ్లాడర్, హెర్నియా, ఆచలాసియా కార్డియా సర్జరీలను చిన్న రంధ్రంతో సులువుగా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తున్నారు. సాధారణ పద్దతుల్లో చేసే సర్జరీలతో పోల్చితే రోబోటిక్ సర్జరీలు కూడా చాలా కచ్చితంగా జరుగుతున్నాయి. ఆపరేషన్ జరిగిన మూడు రోజుల్లోనే రోగి డిశ్చార్జి కావడం విశేషం. హరీష్‌రావు మంత్రి ప్రశంసలు.. అత్యధిక మార్పిడి ఆపరేషన్లు చేసి నిమ్స్ వైద్యులు చెప్పుకోదగ్గ రికార్డును నెలకొల్పారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ప్రశంసించారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ల్లో రికార్డు బ్రేక్ చేసి యూరాలజీ వైద్యులను మంత్రి ఎక్స్(ట్విట్టర్)లో అభినందించారు. ఈ అసాధారణ అవయవ మార్పిడి ద్వారా ప్రాణాలను కాపాడాలనే తమ అచంచలమైన నిబద్ధతను హైలైట్ చేస్తోందన్నారు. ఎంత పెద్ద శస్త్రచికిత్స అయినా.. ఎంత పెద్ద శస్త్రచికిత్సనైనా సులువుగా చేయవచ్చు. రోబోటిక్ సర్జరీలను ప్రారంభించిన అనతికాలంలోనే పెద్ద సంఖ్యలో విజయవంతంగా ఆపరేషన్లు చేయడం నిమ్స్ వైద్యుల ప్రతిభకు తార్కాణం. ఇప్పడు ఆస్పత్రిలో నొప్పి తక్కువతో.. ఇన్ఫెక్షన్లకు తావులేకుండా చేస్తున్నాం. – ప్రొఫెసర్ నగరి బీరప్ప, సంచాలకులు, నిమ్స్ -
పిల్లలు తక్కువుంటే విలీనమే..!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మెస్ చార్జీల పెంపునకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతిగృహాలను క్రమబద్దీకరించే అంశాన్ని పరిశీలిస్తోంది. హాస్టళ్ల వారీగా విద్యార్థుల సంఖ్యను సమీక్షించడంతో పాటు సమీపంలో ఉన్న హాస్టళ్లలో సర్దుబాటు చేసే అవకాశాలపై నివేదిక తయారు చేయాల ని సంక్షేమ శాఖలను ఆదేశించింది. రెండ్రోజుల క్రితం సంక్షేమ వసతిగృహాలు, గురుకుల వి ద్యా సంస్థలతో పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో కొనసాగుతున్న విద్యా సంస్థల్లో డైట్ చార్జీల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రు లు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ పా ల్గొన్నారు. డైట్ చార్జీలను 25 శాతం పెంచాలని ప్రభుత్వానికి సూచిస్తూ కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు పంపింది. ఇదే క్రమంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న హాస్టళ్లను సమీపంలోని హాస్టళ్లలో విలీనం చేసి మెరుగైన వసతులు కల్పించే అంశంపైనా చర్చించారు. కనీసం 50 మంది విద్యార్థులుంటే.. సగటున ఒక సంక్షేమ హాస్టల్లో కనీసం 50 మంది విద్యార్థులుండాలి. దాదాపు వంద మందికి వసతులు కల్పిస్తూ హాస్టల్‌ను అందుబాటులోకి తెచ్ఛినప్పటికీ... అందులో కనీసం సగం మంది పిల్లలుంటేనే మెరుగైన సర్విసులు కల్పించవచ్చు. అలాకాకుండా 15 నుంచి 25 మంది విద్యార్థులుంటే ఖజానాపైనా భారం అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న హాస్టళ్లను గుర్తించాలని, అదేవిధంగా వాటిని సమీప హాస్టళ్లలో విలీనం చేసే అంశాలపై పూర్తిస్థాయి నివేదికను జిల్లాల వారీగా రూపొందించాలని మంత్రులు ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరు కల్లా జిల్లాల వారీగా నివేదికలు తయారు చేసి రాష్ట్ర కార్యాలయాలకు పంపించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,550 సంక్షేమ వసతిగృహాలున్నాయి. పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య సంతృప్తికరంగా ఉన్నప్పటికీ చాలాచోట్ల ప్రీమెట్రిక్ హాస్టళ్లలో మాత్రం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో కొన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ అనుమతితో ప్రీమెట్రిక్ హాస్టళ్లను పోస్టుమెట్రిక్ హాస్టళ్లుగా మార్పు చేశారు. ఇంకా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రులు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
రద్దుల ఘనత బీజేపీది.. పద్దుల ఘనత టీఆర్ఎస్ది: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: చేనేత రంగానికి, కార్మికులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన వెసులుబాటులు, వారి కోసం ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రం చేనేత రంగాన్ని విస్మరిస్తూ అన్నీ రద్దు చేస్తుంటే.. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పద్దులు ఇస్తూ ఆ రంగాన్ని ఆదుకుంటోందని చెప్పారు. బుధవారం హైదరాబాద్ నారాయణగూడలోని వీవర్స్భవన్లో తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావుతో పాటు మంత్రి కేటీఆర్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. చేనేత రంగంపై కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగట్టారు. కేంద్రానివి అన్నీ రద్దులే... 1992లో అప్పటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్స్ బోర్డు, పవర్లూమ్ బోర్డులను 2020లో బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని హరీశ్‌రావు తెలిపారు. దేశంలోని స్పిన్నింగ్ మిల్స్‌లో ఉత్పత్తి అయ్యే నూలులో 40 శాతం చేనేత రంగానికి ఇవ్వాలనే నిబంధన ఉండగా, దానిని బీజేపీ ప్రభుత్వం 15 శాతానికి కుదించిందని చెప్పారు. ఆసరా పెన్షన్ కింద తాము రూ.2,016 ఇస్తుంటే దీనిలో కేంద్రానిది ఒక్క రూపాయి వాటా కూడా లేదన్నారు. మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టుకుంటున్నామని చెప్పినా ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. రద్దులు చేసిన వారివైపు ఉండాలా? పద్దులు ఇచ్చిన వారివైపు ఉండాలా? అనేది పద్మశాలీలు ఆలోచించుకోవాలని హరీశ్ అన్నారు. ఇదేనా మేక్ ఇన్ ఇండియా? ‘మీరు ఏ ఒక్క రంగాన్నైనా అభివృద్ధి చేశారా? ఒక్క నాడైనా చేనేత గురించి మాట్లాడారా?’అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని నిలదీశారు. మేక్ ఇన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పిన ప్రధాని మోదీ.. జాతీయ జెండాలను చైనా నుంచి తెప్పించారని మండిపడ్డారు. ‘ఆ జెండాల తయారీని దేశంలోని చేనేత రంగానికి ఇస్తే బాగుండేది కదా? ఇదేనా మోదీ మేక్ ఇన్ ఇండియా?’అంటూ ఎద్దేవా చేశారు. చేనేతకు రాష్ట్రం చేయూత చేనేత రంగంపై, కార్మికులపై అభిమానం కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని హరీశ్ పేర్కొన్నారు. రాష్ట్రం వచ్చాక నేతన్న ఎంత నేస్తే అంత బట్టని ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ నష్టాన్ని భరిస్తోందన్నారు. చేనేత మిత్ర పథకం ద్వారా 40 శాతం సబ్సిడీతో నూలును అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 40 వేల మరమగ్గాలు ఉన్నాయని, రూ.350 కోట్ల విలువైన బతుకమ్మ చీరల ఆర్డర్‌ను కార్మికులకే ఇచ్చి వారిని యజమానులను చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. నేతన్నలకు రూ.5 లక్షల బీమాను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. -
ఏడున్నరేళ్లు..742 ఆపరేషన్లు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం నిమ్స్‌లో రికార్డు స్థాయిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. తెలంగాణ రాకముందు 25 ఏళ్లలో కేవలం 649 మాత్రమే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరగ్గా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడున్నరేళ్లలో ఏకంగా 742 ఆపరేషన్లు జరగడం గమనార్హం. ఇప్పటికే ప్రభుత్వాస్పత్రుల్లో అధునాతన వైద్య పరికరాలను, తగినంత వైద్య సిబ్బందిని అందుబాటులోకి తేవడంతో శస్త్రచికిత్సలు పెరిగాయ ని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఒక్కో శస్త్రచికిత్సకు రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఏడాదిలో జరిగిన వంద కిడ్నీ మార్పిడి చికిత్సలో 97 ప్రభుత్వమే ఉచితంగా నిర్వహించగా, అందు లో 90 ఆరోగ్యశ్రీ ద్వారానే నిర్వహించడం గమనార్హం. జీవితాంతం ఉచితంగా మందులు... ప్రభుత్వం అవయవదానాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 7,800 మంది అవయవాల మార్పిడి కోసం జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఎదురుచూస్తున్నారు. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడంతోపాటు అనంతరం అవసరమయ్యే మందులను జీవితకాలానికి ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. ఇలా ఉచితం గా మందులు అందించే రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని వైద్య వర్గాలు వెల్లడించాయి. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలకు అవసరమైన మౌలిక సదుపాయాలను, యంత్రాలను గాంధీ, నిమ్స్, ఉస్మానియా ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉంచింది. కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలు: హరీశ్‌రావు ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధగా వ్యవహరిస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కలలుగన్న ఆరోగ్య తెలంగాణగా మన రాష్ట్రం మారుతోందన్నారు. కిడ్నీ మార్పిడి చికిత్సలు చేయడంలో రికార్డు సాధించామని, ఇదే స్ఫూర్తితో మరిన్ని శస్త్రచికిత్సలు నిర్వహించి రోగులకు ప్రాణదానం చేయాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ రంగంలోని ఆస్పత్రులు కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడేలా వైద్య సేవలుండాలన్నారు. అందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెస్తుందన్నారు. ప్రభుత్వ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని, ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. -
సంజయ్వి క్షుద్ర రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము చర్యలు తీసుకుంటుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్షుద్ర, స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. పదవుల కోసం రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలు దెబ్బతీసేలా చేయడం దారుణమని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర జలశక్తి శాఖ అన్ని అనుమతులు ఇచ్చేవరకు పర్యావరణ, అటవీ అనుమతులు ఇవ్వొద్దని, ఇందుకు ఓ ప్రత్యేక చట్టాన్ని తెలంగాణ కోసం తీసుకురావాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు బండి సంజయ్ లేఖ ఇచ్చారని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో జలవనరుల శాఖ పద్దుపై చర్చకు సమాధానమిస్తూ.. బండి సంజయ్ రాసిన లేఖను సభలో చూపించారు. జల శక్తి శాఖ మంత్రి షెకావత్‌కు కూడా మరో లేఖ ఇచ్చారని తెలిపారు. ఏ రాష్ట్రానికి లేని నిబంధనను, అవసరమైతే చట్టాన్నే తెలంగాణ కోసం తీసుకురావాలని అడిగితే రాష్ట్ర ప్రాజెక్టులు ఎలా ముందుకు సాగుతాయని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలు ప్రాజెక్టులను వేగంగా కట్టుకోవా అని అడిగారు. తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయడమేంటని మండిపడ్డారు. రాష్ట్రంపై ప్రేమ ఉంటే, చేతనైతే జాతీయ ప్రాజెక్టులు తీసుకురావాలని లేదా జాతీయ హోదా తేవాలని సవాల్ విసిరారు. ఎవరైనా రాష్ట్ర ప్రాజెక్టులకు తొందరగా అనుమతులు ఇవ్వాలని అడగాలే తప్ప ఇలాంటివి చేయడమేంటని ప్రశ్నించారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా అని ఆవేదన వ్యక్తం చేశారు. చేతనైతే సాయం చేయాలి కానీ.. రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొట్టడమేంటని దుయ్యబట్టారు. బీజేపీ నేతల స్వరాష్ట్ర భక్తి ఎక్కడికి పోయిందంటూ ఎద్దేవా చేశారు. వారికి రాజకీయ భుక్తిపైనే దృష్టి తప్ప రాష్ట్ర భక్తి లేదని మండిపడ్డారు. డీపీఆర్ ఇవ్వకుండా సెంట్రల్ వాటర్ కమిషన్, పర్యావరణ శాఖ, 18 డైరెక్టరేట్ల టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఎలా అనుమతులు ఇస్తాయని ప్రశ్నించారు. ఏపీ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేశాం.. ఏపీ సర్కారు కడుతున్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటం కొనసాగిస్తోందని హరీశ్‌రావు వెల్లడించారు. వివిధ పద్దులపై చర్చ అనంతరం సీఎం తరఫున సాగునీటి పద్దులపై హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ ప్రాజెక్టుల విషయంలో స్వయంగా సీఎం అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారని, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశారని, కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని, సుప్రీంకోర్టులో కేసు వేశారని గుర్తుచేశారు. గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేసి ఉత్తర్వులు తెచ్చామని, అయినా ఏపీ ప్రాజెక్టు ఆపకపోతే ధిక్కరణ కేసు వేశామని, దానిపై గ్రీన్ ట్రిబ్యునల్ కమిషన్ వేసినట్లు చెప్పారు. 2007లో ప్రాణహిత చేవెళ్లకు రూ.17,875 కోట్లతో జీవో ఇస్తే 19 నెలల తర్వాత రూ.38,500 కోట్లకు చేరిందని, 2010లో రూ.40,300 కోట్లతో కేంద్రానికి డీపీఆర్ పంపినట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 1 లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని, వీలైతే ఎక్కువే ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆయకట్టు 6.64 లక్షల ఎకరాలు ఉంటే రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి, రీడిజైన్ చేసుకొని, కొత్తవి చేపట్టి 44.37 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణను సాధించామన్నారు. ఐఏఎస్‌లకు శిక్షణలో పాఠ్యాంశంగా రాష్ట్ర ప్రాజెక్టులు మారాయంటే అంతకంటే గౌరవం ఏముంటుందని పేర్కొన్నారు. కాగా, టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టే ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో ఉర్దూలో రాసే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. -
నిబంధనల మేరకే అప్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ కేంద్రం, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు లోబడే ఉన్నాయని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర జీఎస్డీపీకి అనుగుణంగా కేంద్రం నిర్దేశించిన పరిమితుల మేరకే అప్పులున్నాయని స్పష్టం చేశారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో.. అప్పుల్లో తెలంగాణ 25వ స్థానంలో ఉందని తెలిపారు. అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉందని చెప్పారు. దేశ జీడీపీతో పోలిస్తే కేంద్రం అప్పులు 62.2 శాతం ఉండగా, రాష్ట్ర అప్పులు కేవలం 22.8 శాతంగానే ఉన్నాయని వెల్లడించారు. వచ్చే ఏడాదిలో అప్పులు, వడ్డీలు కలిపి రూ.50 వేల కోట్లు ఉంటాయన్న కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలని ఖండించిన హరీశ్.. వచ్చే ఏడాది అప్పులు, వడ్డీలు కలిపి చెల్లించేది రూ.26,624 కోట్లేనని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర బడ్జెట్‌పై చర్చలో మంత్రి హరీశ్ సుదీర్ఘ సమాధానమిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని.. ఆయా రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని హరీశ్ చెప్పారు. ప్రభుత్వ కీలక రంగాల్లో జాతీయ సగటు కన్నా తెలంగాణలో నిధుల కేటాయింపు తక్కువగా ఉందంటూ భట్టి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చిన మంత్రి.. శాఖల వారీగా చేసిన కేటాయింపులను వివరించారు. విద్యారంగంలో గత ఆరేళ్లలో 14.15 శాతం నిధుల వెచ్చింపు జరగ్గా, వ్యవసాయ రంగంలో 11.4 శాతం, విద్యుత్ రంగంలో 7.3 శాతం, ఇరిగేషన్ రంగంలో 8.4 శాతం, హౌసింగ్‌లో 1.8 శాతం మేర నిధులను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. జాతీయ సగటు కన్నా ఎక్కువగానే నిధుల ఖర్చు జరుగుతోందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం సైతం జాతీయ సగటు కన్నా రెట్టింపు ఉందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందంటూ భట్టి సభను తప్పుదారి పట్టించారని, అయితే సీఎంఐఈ సర్వే ప్రకారం 2019–20లో జాతీయ స్థాయిలో సగటు నిరుద్యోగం 7.63 శాతమైతే.. తెలంగాణలో 4.53 శాతంగా ఉందన్నారు. 2020–21లో జాతీయ సగటు 10.35 శాతం కాగా, తెలంగాణలో 6.15 శాతంగా ఉందని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్, బీజేపీలు అమ్ముతూ పోతుంటే, ఆర్టీసీ, విజయ డెయిరీ వంటి సంస్థలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటూ రాష్ట్రం నమ్మకం కలిగిస్తోందని వెల్లడించారు. నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం ఇవ్వలేదు.. ఇదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశాన్ని హరీశ్ ప్రస్తావించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను కేంద్రం 30 రోజుల్లో ఇస్తోందంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఎక్కడ, ఎప్పుడు ఇచ్చిందో చెప్పాలని సూచించారు. ‘మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు, భగీరథకు రూ.19,205 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ ఇవ్వాలని చెప్పినా కేంద్రం ఇవ్వలేదు.. 13వ ఆర్థిక సంఘం నుంచి ఆరేళ్లుగా రూ.1,129 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నుంచి రెండేళ్లుగా రూ.817 కోట్లు రాలేదు. విభజన చట్టంలో పేర్కొన్న వెనకబడిన ప్రాంతాల నిధి కింద రూ.350 కోట్లు రాలేదు. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంటుగా రూ.2,350 కోట్లు ఇవ్వాలని చెప్పినా రాలేదు. మొత్తంగా కేంద్రం నుంచి రూ.28,225 కోట్లు రావాల్సి ఉంది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ నిధులపై మాట్లాడాలి..’అని అన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకుంటామని, అయితే రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోమని వెల్లడించారు. -
శంకర్ పల్లికి భారీగా పెట్టుబడులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంకర్ పల్లి మండలం కొండకల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ‘జిల్లాకు రూ.800 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీని ద్వారా వందలాది మందికి ఉద్యోగావకాశాలు కలగనున్నాయి. జిల్లా ఫార్మా, ఐటీ, సాప్ట్వేర్ కంపెనీలకు నెలవుగా మారనుంది. నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ ఘనత సాధించింది. ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మాసిటీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, హార్డ్‌వేర్ పార్కులతో పాటుగా ఉన్నత విద్యా సంస్థలు, వర్శిటీలు, పర్యాటకరంగాలకు కేంద్ర బిందువుగా రంగారెడ్డి జిల్లా మారింది. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు ఆసక్తి చూపిస్తున్నారు. టెక్స్టైల్ పరిశ్రమ రైలు కోచ్‌లు, డీజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ల తయారీదారు కంపెనీ మేధా సర్వో డ్రైవ్స్ రూ.800 కోట్ల పెట్టుబడితో శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో తమ యూనిట్‌ను నెలకొల్పనున్నది. ఇందుకోసం 2017లోనే ప్రభుత్వంతో మేధా ఒప్పందం కుదుర్చుకోవడంతో టీఎస్ఐఐసీ వంద ఎకరాల భూ సేకరణ చేపట్టింది’ అని తెలిపారు. చదవండి: సోషల్ మీడియా పోస్టు; గీత దాటితే చర్యలు తప్పవు! -
సీఎం కేసీఆర్ లక్ష్యం అదే..: హరీశ్‌రావు
సాక్షి, సిద్ధిపేట: రైతు సంస్కరణలలో సిద్ధిపేట ఆదర్శం కావాలని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నియంత్రిత పంటల సాగుపై శుక్రవారం జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, ఒడితెల సతీష్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు రఘోత్తం రెడ్డి, బొడకుంట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. (వివాదంగా మారిన ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకలు) పంట మార్పిడితో రైతులకు మేలు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంటల మార్పిడి ద్వారా దిగుబడి పెరిగి రైతుకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రజల మేలు కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి ఒక తండ్రిలాగా రైతుల సంక్షేమానికి పరితపిస్తున్నారని చెప్పారు. రైతులను సంఘటిత శక్తిగా మార్చడమే సీఎం లక్ష్యమని పేర్కొన్నారు. మార్కెట్, అంతర్జాతీయంగా పంటలకు ఉన్న డిమాండ్ ఆధారంగా సాగు చేయాలని ఆయన సూచించారు. (పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల) ప్రభుత్వం ఉద్దేశ్యం అది కాదు.. రైతు బంధు పథకం ఆపాలని ప్రభుత్వ ఉద్దేశం కాదని, ప్రతి రైతుకు రైతు బంధు అందిస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. రైతు బంధు కోసం రూ.7 వేల కోట్లు బడ్జెట్ లో పెట్టామని చెప్పారు. వానాకాలం లో మొక్కజొన్న దిగుబడి బాగా తగ్గుతుందని.. అందుకే ఇతర పంటలపై దృష్టి పెట్టాలని ఆయన వివరించారు. యాసంగిలో వరికి రాళ్ళ వానతో నష్టం జరుగుతుందని.. అదే మొక్కజొన్న అయితే ఎలాంటి నష్టం ఉండదన్నారు. మొదటి పంటలో రైతుకు లాభం జరగడమే లక్ష్యంగా సర్కార్ పని చేస్తోందన్నారు. ఇది రైతులపై బలవంతంగా రుద్దడం కాదని స్పష్టం చేశారు. కొత్త వంగడాలు వచ్చాయి.. కందిలో కొత్త వంగడాలు వచ్చాయని.. ఆరు నెలలకే పంట కాలం పూర్తయి దిగుబడి పెరుగుతుందన్నారు. ఆ తరువాత రెండో పంటగా మొక్కజొన్న సాగు చేసుకోవచ్చన్నారు. సిద్దిపేట రిజర్వాయర్ల ఖిల్లా అని.. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు ఏడాది కాలం జలకళను సంతరించుకుంటాయన్నారు. తెలంగాణలో ఎరువులు, విత్తనాలు, నీళ్లకు కొరత లేదన్నారు. గోదావరి జలాలపై ఆధారపడి పంటల సాగు చేస్తామన్నారు. పత్తికి డిమాండ్ పెరిగింది.. కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మాస్క్ ల తయారీకి భారీ డిమాండ్ పెరిగిందని, పత్తికి డిమాండు ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 6.3 ఎంఎం పొడవు ఉన్న ధాన్యానికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉందన్నారు. సిద్ధిపేట జిల్లాలో 9,500 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు చేస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో ఫామ్ ఆయిల్ సాగు ఎక్కువగా చేస్తారన్నారు. వారి మాటలు రైతులు విశ్వసిస్తారా..? జిల్లాలో సాగుకు భూసార పరీక్షలు, సర్వే చేయించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని కోరామని తెలిపారు. కంది పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని విపక్షాల మాటలు రైతులు విశ్వసిస్తారా అని మంత్రి ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లేనని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. -
‘రైతుల మేలుకే కొత్త విధానం’
సాక్షి, సంగారెడ్డి: రైతులకు మేలు కలిగించేందుకు కొత్త వ్యవసాయ విధానం అమలు చేస్తున్నామని, వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం ఆయన మంత్రి నిరంజన్ రెడ్డితో పటాన్చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ... పదవి రావడం గొప్పకాదు, పదవి నిర్వహించడం గొప్ప. రైతులకు మేలు జరిగేందుకు కొత్త వ్యవసాయం విధానం అమలు చేస్తున్నాం. వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత సంగారెడ్డి జిల్లాలో కొత్తగా రెండు వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేశాం అని తెలిపారు. (కందిపప్పు.. ఇక్కడ నచ్చకుంటే అమరావతికి వెళ్లు!) ఇక మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ మహానగర అవసరాలు తీర్చేలా పటాన్ చెరువు మార్కెట్‌ను అభివృద్ధి చెయ్యాలి. దేశంలోనే అత్యుత్తమ మార్కెట్‌గా పటాన్ చెరువు మార్కెట్‌ను మార్చాలి. మార్కెట్ వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంట్లో కూర్చొనే కావల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నాం.మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టంలోని నిబంధనలు సైతం మార్చుతాం. ఆన్లైన్ మార్కెట్ ప్రజలకు సౌకర్యవంతంగా మారింది. హైదరాబాద్ మహానగరానికి నలుదిక్కులా సమీకృత మార్కెట్లు అభివృద్ధి చేస్తాం. సిద్ధిపేట మార్కెట్లు రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నాయి. సిద్దిపేట మార్కెట్లను చూసే నా నియోజకవర్గంలో మార్కెట్లను అభివృద్ధి చేశాను. రాబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చాం. ఒకప్పుడు తినడానికి సరిపోయే పంట కూడా పండని పరిస్థితి రాష్టంలో ఉండేది. అరేళ్లలో ఆ పరిస్థితిని అధిగమించాం. ప్రస్తుతం నిల్వ చేయడానికి గోదాముల లేని స్థాయిలో పంటలు పండుతున్నాయి. ఈ సంవత్సరం 39 లక్షల 40 వేల ఎకరాల్లో వరి పంట పండింది. జనాభా అవసరాలకు అనుగుణంగా ఏ పంటలు ఏ స్థాయిలో అవసరమో, విశ్వవిద్యాలయాలతో సర్వే చేయించాం. ప్రస్తుతం కేరళ, తమిళనాడు మాత్రమే బియ్యం కోసం మనపై ఆధారపడ్డాయి. కొత్త వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు, పండిన పంటకు కొనుగోలుకు హామీ ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితి కంటే మెరుగైన పరిస్థితి రావాలి అన్న లక్ష్యంతో కొత్త విధానం రూపొందిస్తున్నాం. ఒక పంట పండిన తర్వాత అది ఆహారంగా మారే వరకు వందల మందికి ఉపాధి దొరుకుతుంది. జిన్నారం, గుమ్మడిదళ గోదాములకు నిధులు మంజూరు చేశాం అని తెలిపారు. (మీ బిడ్డలకోసమైనా.. తీరు మార్చుకోండి) -
అందరికీ ఆరోగ్య కార్డులు
సాక్షి, సంగారెడ్డి: రాష్ట్రం లోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కార్డులు అందించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.3.5 కోట్లతో ఏర్పాటు చేసిన కార్డియాలజీ, యూరాలజీ విభాగాలను బుధవారం ఆయన ప్రారంభిం చారు. సంబంధిత విభాగాలను పరిశీలించి ఆస్పత్రి సూపరింటెండెంట్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డులు అందించాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. త్వరలో ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చనుందని తెలిపారు. ప్రపంచంలోని ఒక్క అమెరికాలోనే ఈ తరహా హెల్త్ కార్డుల విధానం అమలులో ఉందని, తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని సీఎం భావిస్తున్నారని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలోనే కార్డియాలజీ, యూరాలజీ విభాగాల ఏర్పాటుతో జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్‌ల ప్రజలను హైదరాబాద్‌కు తరలించకుండా ఇక్కడే మెరుగైన వైద్యం అందించ్చవచ్చన్నారు. మరణాలు తగ్గి ప్రసవాలు పెరిగాయి.. కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి మాతా శిశు మరణాలు తగ్గాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గతంలో సాధారణ ప్రసవాలు 30 నుంచి 35% మాత్రమే జరిగేవని, ప్రస్తుతం అవి 65 నుంచి 70 శాతానికి పెరిగాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
చెట్టుని కూల్చినందుకు రూ. 9,500 జరిమానా
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో భాగంగా పెరిగి పెద్దదైన చెట్టును తన వాహనంతో ఢీకొట్టి కూల్చివేసిన వాహనదారుడికి రూ. 9,500 జరిమానా విధించారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని వైద్య కళాశాల వద్ద హరితహారంలో భాగంగా పెరిగిన చెట్టును తన వాహనంతో రాకేశ్ ఢీ కొట్టడంతో పడిపోయింది. దీన్ని గమనించిన పోలీసులు హరితహారం అధికారి ఐలయ్యకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఆయన.. రాకేశ్‌కి జరిమానా విధించారు. హరితహారంలో భాగంగా పెంచుతున్న మొక్కలకు నెలకు లక్షల రూపాయలు వెచ్చించి కాపాడుతున్నామని, వాటికి ఎవరు హాని కలిగించినా జరిమానా చెల్లించాల్సిందేనని ఐలయ్య తెలిపారు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు సిద్దిపేటని హరిత సిద్దిపేటగా మార్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. హరితహారం చెట్ల భద్రత విషయంలో ప్రత్యేకంగా సహకరిస్తున్న సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ శాఖ ఉన్నతాధికారులకు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, డీఈలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
అమీన్‌పూర్‌కు పండుగ రోజు
సాక్షి, పటాన్చెరు: అమీన్ పూర్‌కు ఈ రోజు నిజమైన పండుగ రోజని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీరంగూడ– కిష్టారెడ్డిపేట రోడ్డు పనులను ప్రారంభిస్తూ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత రూ.61 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను అమీన్ పూర్‌కు వచ్చినప్పుడు స్థానికులు మంచినీటి సమస్య ఉందని చెప్పారని గుర్తు చేశారు. రెండు వేల ఫీట్ల లోతు వరకు బోరు వేసినా నీరు రాని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి జలాలు ఇంటింటికీ అందిస్తున్నామన్నారు. అమీన్ పూర్లోని 67 కాలనీలకు లాభం చేకూర్చే విధంగా నిర్మించిన 30 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఓహెచ్‌ఎస్‌ఆర్‌ను ప్రారంభించామని చెప్పారు. పటాన్ చెరు నియోజకవర్గంలో 20 ఏళ్ల వరకు జనాభా పెరిగినా ఇబ్బంది లేని విధంగా మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయన్నారు. మహిళలకు నీటి కష్టాలు ఎక్కువగా తెలుస్తాయంటూ అమీన్ పూర్ మహిళలకు నీటి కష్టాలు తప్పుతాయన్నారు. ఎమ్మెల్యే కోరిన ఒకే కోరిక.. బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వరకు రోడ్డు కావాలని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చాలా కాలంగా అడుగుతూ వస్తున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారం కేసీఆర్ పటాన్ చెరుకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే కోరిన ఒకే కోరిక బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట మీదుగా సుల్తాన్ ఫూర్ వరకు రోడ్డు మాత్రమేనని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇప్పటికే పటాన్ చెరులో అన్ని ప్రధాన రోడ్లు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిర్మించామని ఆయన తెలిపారు. అయితే అమీన్ పూర్లోని బీరంగూడ కమాన్ నుంచి సుల్తాన్పూర్ జంక్షన్ వరకు రూ.49 కోట్లతో రోడ్డు నిర్మాణానికి కేసీఆర్ సూచనలతో కేటీఆర్ మంజూరు చేశారని మంత్రి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోడ్డు పనులను ప్రారంభించామని, త్వరలోనే ఆ రోడ్డు నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. పటాన్ చెరులో రోడ్డుపై అంగడి జరిగేదని, ఆ సమస్యను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యేకు డబుల్ ధమాకా పటాన్ చెరు నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తవుతున్నాయని తెలిపారు. త్వరలోనే పటాన్ చెరులోని పేదలకు ఇళ్లను ఇస్తామన్నారు. పటాన్ చెరు జీహెచ్ఎంసీ పరిధిలో ఉందని, దాంతో ఎమ్మెల్యేకు డబుల్ ధమాకాలా రెండు కోటాలు దక్కాయని మంత్రి చమత్కరించారు. నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి రావాల్సిన డబుల్ బెడ్రూంకోటాతోపాటు, జీహెచ్ఎంసీ కోటా కింద కూడా ఈ ప్రాంతానికి ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. అధికారులకు అభినందనలు మిషన్ భగీరథ పనులు నిర్వహిస్తున్న అధికారులను మంత్రి హరీశ్‌రావు అభినందించారు. రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తున్నారని గుర్తు చేశారు. రెండున్నరేళ్లలోనే ప్రతీ ఇంటికి యావత్ రాష్ట్రంలో నీటిని అందించే కార్యక్రమానికి అధికారులు గొప్పగా సేవలందించారని హరీశ్‌రావు వారిని అభినందించారు. ఇదిలా ఉండగా అమీన్పూర్లో మండల్ లెవల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జారీ అయిన ఉత్తర్వులను మంత్రి ఆర్డీఓకు అందించారు. అలాగే అమీన్ పూర్లో డంప్ యార్డు ఏర్పాటుకు కూడా మరో పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జారీ అయిన ఉత్తర్వులను కమిషనర్ వేమనరెడ్డికి అందించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ బీరంగూడ రోడ్డు మంజూరు నిధులు ఇచ్చిన ప్రభుత్వానికి, దాని పనుల ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి హరీశ్‌రావుకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్మంజుశ్రీ,, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
అందుకే హరీష్ రావును కలిశా: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి గురువారం ఆర్థిక మంత్రి హరీష్‌రావుతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్టాడుతూ ..సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ది కోసమే మంత్రిని కలిసినట్లు పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల అభివృద్దే తమ ధ్యేయమన్నారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం 14సంవత్సరాల తరువాత హరీష్‌ను కలిసినట్లు ఆయన వెల్లడించారు. జగ్గారెడ్డి పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మంత్రి సమస్యల పరిష్కారం పై సానుకూలంగా స్పందించినట్లు అయన మీడియాకు తెలిపారు. కాగా నిన్న, మొన్నటివరకూ విమర్శలు గుప్పించిన జగ్గారెడ్డి తాజాగా హరీష్ రావును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
సర్కారు బడుల్లో ట్యూషన్
సిద్దిపేట రూరల్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు దత్తత గ్రామం ఇబ్రహీంపూర్ మళ్లీ ఒక వినూత్న కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రైవేటు తరహాలో సాయంత్రం వేళ అదనంగా ట్యూషన్ ప్రక్రియను నిర్వహించే పద్ధతిని గ్రామంలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోనే సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు అదనపు తరగతుల బోధనలను బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను విద్యాశాఖ వేగవంతం చేసింది. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారాన్ని అందించే ప్రక్రియను చేపట్టిన ఎమ్మెల్యే హరీశ్‌రావు సాయంత్రం వేళల్లో విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగేలా అదనపు తరగతుల బోధనకు శ్రీకారంచుట్టారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ట్యూషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో మొదట ఆయన దత్తత గ్రామం ఇబ్రహీంపూర్‌ను ఎంచుకున్నారు. గ్రామానికి చెందిన నిరుద్యోగ బీఈడీ యువత, రిటైర్డ్ టీచర్లతో ప్రతీ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో సాయంత్రం అదనపు తరగతులకు బోధించనున్నారు. -
సొంతూరుకు సీఎం..
తమ కళ్ల ఎదుటే తిరిగిన వ్యక్తి నేడు ముఖ్యమంత్రి హోదాలో ఆత్మీయంగా, ఆప్యాయంగా పలకరించనున్నాడనే ఆనందం కొందరిలో.. తమతో ఆటలు ఆడి, పాటలు పాడిన బాల్యమిత్రుడు వస్తున్నాడనే సంతోషం మరి కొందరిలో.. వెరసి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో చింతమడక గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ముఖ్యమంత్రి గ్రామంలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య శోభారాణి, కుమారుడు కేటీఆర్ ఇతర కుటుంబ సభ్యులు రానున్నారు. గ్రామ ప్రజలతో సభ, ఆత్మీయ సమావేశం, సహపంక్తి భోజనం, పలు అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందడితో చింతమడక మురవనుంది. ఆదివారం పర్యటన ఏర్పాట్లను మాజీ మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. సాక్షి, సిద్దిపేట: సీఎం కేసీఆర్ గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అభివృద్ధి, సంక్షేమ పథకాల నిర్వహణను పూర్తి చేసింది. గ్రామంలో రూ.20 కోట్లతో బీసీ సంక్షేమ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అలాగే అర్హులైన నిరుపేదలకు 54 డబుల్ బెడ్రూం ఇళ్లను సీఎం చేతుల మీదుగా పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించారు. మరోవైపు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణం, పెద్దమ్మ దేవాలయం, రామాలయం వాటిని ప్రారంభించనున్నారు. మరోవైపు గ్రామంలో ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డును అందించేందుకు ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ పరమైన సమస్యలు ఉండకుండా ఇప్పటికే రెవెన్యూ అధికారులు, కుటుంబ సర్వే ఆధారంగా పూర్తి నివేదికను తయారు చేశారు. చిన్నప్పటినుంచే అన్నింటా దిట్ట.. చిన్నతనం నుంచే కేసీఆర్ అన్ని రంగాల్లో చలాకీగా ముందు ఉండేవాడు. దుబ్బాక పాఠశాలలో చదువుకునే రోజుల్లో క్లాస్‌లో మొదటి వరసలో కూర్చొని శ్రద్ధగా పాఠాలను వినేవాడు. పరీక్షలకు కూడా సన్నద్ధం కాకుండా పరీక్షలు రాసి మంచి మార్కులు పొందేవాడు. కేసీఆర్ మొదట 5వ తరగతి వరకు గ్రామంలో చదువుకున్నప్పటికీ, అనంతరం తొమ్మిది వరకు దుబ్బాకలో చదువుకున్నాడు. అనంతరం 10వ తరగతి పుల్లూరులో, ఇంటర్మీడియట్ సిద్దిపేటలో పూర్తి చేశాం. నేను కేసీఆర్‌తో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. తాను పుట్టి పెరిగిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, ఊరు రుణం తీర్చుకోవడానికి సీఎం హోదాలో గ్రామానికి వస్తుండడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. –భైరి కృష్టారెడ్డి, కేసీఆర్ స్నేహితుడు గ్రామ రూపురేఖలు మారుతున్నాయి.. చాలా రోజుల తరువాత చింతమడక బిడ్డ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు రావడంతో గ్రామ రూపురేఖలు మారుతున్నాయి. అదేవిధంగా ఒక రోజంతా మాతోనే గడిపి మా బాగోగులను తెలసుకుని గ్రామ ప్రజలకు బంగారు భవిష్యత్‌ను అందించేందుకు కేసీఆర్ గ్రామానికి రావడం చాలా సంతోషం. చిన్నతనంలో కేసీఆర్‌కు చింతమడకలో ప్రధానోపాధ్యాయునిగా పాఠాలు బోధించాను. గ్రామంలోని అందరి గురించి ఇప్పటికి కేసీఆర్ గుర్తుంచుకున్నారు. ఎదైనా విషయం ఉంటే దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునేవాడు. రాష్ట్ర ఉద్యమం చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరిగి గ్రామానికి వçస్తుండడతో మాకు సంతోషంగా ఉంది. కేసీఆర్ పుట్టుక మాఊరు ఏదో ఒక గొప్పపుణ్యం చేసుకున్నట్లుగా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, గ్రామ భవిష్యత్‌ను చూస్తుంటే తెలుస్తోంది. –ప్రతాప్‌రెడ్డి, కేసీఆర్ చిన్ననాటి ప్రధానోపాధ్యాయుడు -
ప్రతి కుటుంబానికి చిరకాలం గుర్తుండాలి
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో జరిగే అభివృద్ధి ప్రజలు చిరకాలం సీఎంను వారి హృదయాల్లో ఉంచుకునేలా ఉండాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో చింతమడకలో చేయనున్న ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కుటుంబానికి మంచి ఇళ్లు ఉండాలన్నదే కేసీఆర్ ఆలోచన అన్నారు. ఇళ్లు లేని ప్రతీ కుటుంబానికి యజమానులు ఇష్టం ఉన్నట్లుగా వారి స్థలంలో కట్టుకునేలా అవకాశం కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ప్రతి కుటుంబానికి రూ.8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం గ్రామంలోని ప్రతీ కుటుంబంతో సుదీర్ఘంగా చర్చించి వారి అవసరాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఎంపీడీఓలకు సూచించారు. అలాగే అసైన్డ్ భూముల్లో ఎస్సీలకు మోటార్లు, బోరుబావుల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్‌దాస్‌ను ఆదేశించారు. పంచాయతీ శాఖతో గ్రామంలోని పాఠశాల అదనపు తరగతి గదులు, భూమి లేనివారికి ట్రాక్టర్స్ ఇవ్వడం, భూమి ఉంటే డైరీ, రూ. 10 లక్షలతో హార్వేస్టర్, హర్టీకల్చర్తో మల్బరిసాగు, చెరువు సుందరీకరణ, గ్రామంలోని ప్రతీ కుటుంబం వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించాలని సూచించారు. అన్ని వివరాలతో నివేదిక అలాగే గ్రామంలోని నిరుద్యోగ యువత కోసం వారితో చర్చించి ఆటోలు, కార్లు, వంటి వాహనాలు అందించే ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అధికారులు చేసిన సర్వేను ర్యాండమ్ పద్ధతిన ఎంపిక చేసి స్వయంగా తానే విచారణ చేస్తానని తెలిపారు. గ్రామంలో 100 ఎకరాల్లో అడవి అభివృద్ధి కోసం ప్రణాళికలను తయారు చేయాలని జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్‌కు సూచించారు. అనంతరం కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ చింతమడక గ్రామ ప్రజల సుస్థిరమైన అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికలు నివేదిక రూపంగా జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం చేస్తుందన్నారు. జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు, ఎంపీడీఓల బృందతో కలిసి చింతమడక గ్రామ సమగ్ర సర్వే నిర్వహించినట్లు వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పద్మాకర్, డీఆర్ఓ చంద్రశేఖర్, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, జిల్లా అదికారులు పాల్గొన్నారు. నేడు చింతమడకకు హరీశ్‌రావు.. చింతమడక గ్రామానికి సీఎం కేసీఆర్ వస్తున్న క్రమంలో నేడు ఉదయం 7 గంటలకు హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డిలు గ్రామంలో పర్యటించనున్నారు. మూడు రోజులుగా అధికారులు చేపట్టిన గ్రామ సమగ్ర కుటుంబ సర్వే, అక్కడి ప్రజల అవసరాలు క్షేత్రస్థాయిలో తెలుసుకుని , ప్రత్యేక ప్రజా అవసరాలపై, జీవన స్థితిగతులపై ఆరా తీయనున్నట్లు తెలిపారు. -
హ్యాట్రిక్‌ల సిద్దిపేట
సాక్షి, సిద్దిపేట : సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పలువురు అభ్యర్థులు హ్యాట్రిక్ కొట్టారు. ఇక్కడి నుంచి 1967 ఎన్నికల్లో పోటీ చేసిన జి.వెంకటస్వామి.. 1971, 1977లోనూ గెలిచి వరుసగా మూడుమార్లు గెలిచారు. ఆయన తరువాత నంది ఎల్లయ్య 1989, 1991, 1996 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజనలో సిద్దిపేట లోక్‌సభ స్థానం రద్దయి.. మెదక్ లోక్‌సభ స్థానంలో అంతర్భాగమైంది. ఇక, సిద్దిపేట అసెంబ్లీ స్థానంలోనూ హ్యాట్రిక్‌ల మోత మోగుతోంది. అనంతుల మదన్మోహన్ 1972, 1978, 1983 శాసనసభ ఎన్నికల్లో తొలి హ్యాట్రిక్ కొట్టారు. ఆయన తరువాత టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1985, 1989, 1994, 1999, 2001, 2004 ఎన్నికల్లో వరుసగా గెలుపొంది డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అదే పార్టీకి చెందిన ముఖ్యనేత టి.హరీశ్‌రావు కూడా 2004, 2008, 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసి డబుల్ హ్యాట్రిక్ సాధించారు. -
తెలంగాణపై బాబు, లగడపాటి కుట్రలు
సాక్షి, జనగామ/మహబూబాబాద్/కామారెడ్డి/ యాదాద్రి: నాడు ఉద్యమ సమయంలో తెలంగాణ రాకుండా అడ్డుపడిన చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్ మరోసారి కుట్రలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. శనివారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడికొండ, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, కామారెడ్డి జిల్లా గాంధారి,యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం, ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారంలో ఆయన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ కుట్రలు ప్రారంభమయ్యాయని, ఇందుకుగాను ఆంధ్రా శక్తులన్నీ ఒక్కటయ్యాయని పేర్కొన్నారు. ఆంధ్రా నుంచి చంద్రబాబు నోట్ల కట్టలు పంపుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లగడపాటి రహస్య ఎజెండాతో వస్తున్నారని తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరించారు. మోసపోతే గోసపడుతామని, వారి కుట్రలను తిప్పికొ ట్టాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ గెలిస్తే నీటిపారుదల, హోం, పరిశ్రమలు శాఖలు తమకే అని టీడీపీ వారు అంటున్నారని, తెలంగాణ నీళ్లు ఆంధ్రా కు తరలించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. కూటమికి ఓటేస్తే కాళేశ్వరం ఆగినట్లే.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే పోలవరానికి నీళ్లు తగ్గు తాయంటూ ఇప్పటికే చంద్రబాబు అడ్డు తగులుతున్నాడని హరీశ్ ఆరోపించారు. కూటమికి ఓటేస్తే బాబు కచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటాడని, దీంతో మనకు నీళ్లు రావన్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే కాళేశ్వరం వస్తుందని కూటమికి ఓటేస్తే శనేశ్వరం వస్తుందని అన్నారు. మరో ఏడాదిన్నర రెండేళ్ల లో కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ చీకటి తెలంగాణ అవుతుందన్నారు. చంద్రబాబువి దుర్మార్గపు ఆలోచనలు చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలు చేసే వ్యక్తి అని, అలాంటి కూటమికి ఓటు వేయొద్దని హరీశ్ కోరారు. విద్యుత్ చార్జీలు తగ్గించమని అడిగితే ప్రజల్ని పిట్టల్లా కాల్చి చంపిన నరహంతకుడని ధ్వజమెత్తారు. కాం గ్రెస్, బాబు తోడుదొంగలు, మాట తప్పిన వాళ్లన్నా రు. బాబు ఇచ్చిన పైసలతో రోజూ పేపర్లు, టీవీలలో ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మం చోడని తెలంగాణకు మేలు చేస్తాడని కోదండ రాం అనడం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అన్నారు. తెలంగాణ మేధావి లోకం కోదండరాంను చూసి జాలిపడుతుందన్నారు. డిసెంబర్ 11 తర్వాత వచ్చే ఫలితాలతో కేసీఆర్ ఇరగదీసే పర్సన్ అని రుజువు అవుతుందన్నారు. కూటమి నేతల కల్లబొల్లి మాటలు వినకుండా టీఆర్ఎస్కు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తమ్‌కే నమ్మకం లేదు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం లేదని హరీశ్ ఎద్దేవా చేశారు. దేనికోసం కూటమికి ఓటు వేయాలో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. కూటమిలోని నలుగురికి తోకలే సక్రమంగా లేవని విమర్శించారు. కోదండరాంను కోదండం ఎక్కించారని, ఆయన ఏమి మాట్లాడుతున్నాడో అర్థంకాని పరిస్థితి ఉందన్నారు. కుడితిలో పడిన ఎలుక లెక్క కోదండరాం పరిస్థితి అయిందని విమర్శించారు. పౌరసంఘం హక్కుల నేత అని చెప్పుకునే కోదండరాం, నరహంతకుడు, ఎన్కౌంటర్లు చేయించిన బాబు కడుపులో తలపెట్టి గౌరవం తగ్గించుకున్నారని మండిపడ్డారు. కోదండరాంను చూసి మేధావిలోకం సిగ్గు పడుతుందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు చెవ్వులో పూలు పెట్టుకున్నారు కావచ్చు.. ప్రజల కళ్లకు గంతలు కట్టలేరని పేర్కొన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్కు మళ్లీ పట్టం కట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. -
మీ బిడ్డగా చెప్తున్నా..
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, అం దోలు నియోజకవర్గాలకు సింగూరు ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు తెస్తా. హరీశ్‌రావు నీటి పారుదల శాఖ మంత్రిగా, నేను సీఎంగా ఉన్నప్పుడు నీళ్లు రాకుంటే.. ఇంకా ఎప్పటికీ రావు.. మెదక్ జిల్లా బిడ్డగా, కేసీఆర్‌గా ఇది నా బాధ్యత. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘నేను మీ బిడ్డగా చెప్తున్నా.. పాత మెదక్ జిల్లా పరిధిలోని సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాలకు సింగూరు ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు తెస్తా. పాత మెదక్ జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన సంగారెడ్డి ప్రాంతానికి సింగూరు నుంచే సాగు నీరు రావాలి. హరీశ్‌రావు నీటి పారుదల శాఖ మంత్రిగా, నేను సీఎంగా ఉన్నప్పుడు నీళ్లు రాకుంటే.. ఇంకా ఎప్పటికీ రావు.. మెదక్ జిల్లా బిడ్డగా, కేసీఆర్‌గా ఇది నా బాధ్యత’ అని టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించారు. ‘సింగూరు నీరు మన జన్మహక్కు. హైదరాబాద్‌కు సింగూరు జలాల తరలింపును నిలిపివేసి, కృష్ణా, గోదావరి నుంచి తెస్తున్నం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాది జూన్ తర్వాత నీళ్లు వస్తున్నాయి. రాత్రింబగళ్లు కష్టపడుదాం’ అని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తోందని, సంపద పెంచి ప్రజలకు పంచుతుండటంతో.. అనూహ్యమైన అభివృద్ధి జరుగుతోందన్నారు. మేనిఫెస్టోలో లేని 76 పథకాలను అమలు చేయడంతో పాటు, జాతి, మత వివక్ష లేకుండా అందరికీ మేలు చేసే పనిలో టీఆర్ఎస్ ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల్లో పార్టీలు, వ్యక్తులు, అభ్యర్థులు గెలవడం ముఖ్యం కాదు.. ప్రజలు గెలిస్తేనే ప్రజల ఎజెండా అమలవుతుంది. ఓటర్లు గందరగోళానికి తావు లేకుండా వివేచనతో ఓటు వేయాలని’ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ఓవైపు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి నాలుగున్నరేళ్లు పాలించిన టీఆర్ఎస్ మరో వైపు ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నాయని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని’ పిలుపునిచ్చారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ‘సంగారెడ్డికి ప్రధానంగా రెండు పనులు కావాలి. సంగారెడ్డిలో వచ్చే టర్మ్‌లో నూటికి నూరుశాతం ఏర్పాటు చేస్తాం. దినదినాభివృద్ధి చెందుతున్న సంగారెడ్డి పట్టణం చుట్టూ నాలుగులేన్ల రింగు రోడ్డును నిర్మిస్తాం. త్వరలో వచ్చి ఈ పనులకు శంకుస్థాపన చేస్తానని’ కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని సర్వేలు చెప్తున్నయి. సంగారెడ్డిలో గతంలో అణువణువు తిరిగిన అనుభవం నాకు ఉంది. క్రియాశీల కార్యకర్త చింత ప్రభాకర్ చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, కౌన్సిలర్, చైర్మన్, ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఈ సందర్భంలో ఇతరత్రా చిల్లర మల్లర విషయాలు మాట్లాడదలచు కోలేదు. ఎవరి వ్యక్తిత్వం ఏంటో, ఎవరి గౌరవం ఏంటో మీకు తెలుసు. ఎవరు ఎలాంటి వాళ్లో మీకు తెలుసు, చెడ్డవాళ్లను గెలిపించుకుంటే మీకు చాలా చెడు జరుగుతుంది.’ అంటూ హెచ్చరించారు. ‘ఆర్.సత్యనారాయణ క్రియాశీల కార్యకర్త. ఉద్యమం పొడవునా నాతో పనిచేసిన వ్యక్తి, త్వరలోనే ఆయనకు మరింత గుర్తింపు వస్తుంది. ఉద్యమంలో పనిచేసిన అందరికీ గుర్తింపు ఉంటుంది’ అని కేసీఆర్ భరోసా ఇచ్చారు. నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభల్లో మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, ఫరీదుద్దీన్, మహ్మద్ సలీం, బి.వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, పార్టీ అభ్యర్థులు ఎం.భూపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, కె.మాణిక్‌రావు, క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. మోసపోతే గోస పడతం: మంత్రి హరీశ్‌రావు నారాయణఖేడ్: ఎన్నికల్లో ప్రజలు మోసపోవద్దని గోసపడతామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నారాయణఖేడ్‌లోని రహమాన్ గార్డెన్ ఫంక్షన్‌హాల్ ఆవరణలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. క్వార్టర్ సీసాలు, కల్లుపెట్టెలు, నోట్ల కట్టలు చూసి మోసపోవద్దని సూచించారు. కాల్వ నీళ్లు కావాలా, క్వార్టర్ సీసాలు కావాలా అని ప్రశ్నించారు. నారాయణఖేడ్ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కాళేశ్వరం నీటిని తీసుకు వచ్చి సింగూరును నింపుతామని, ఖేడ్, కల్హేర్, పెద్దశంకరంపేట్ మండలాలకు కాల్వల ద్వారా, మనూరు, కంగ్టికి ఎత్తిపోతల ద్వారా మొత్తం లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తామని హరీశ్ తెలిపారు. తండాలు, పల్లెల్లో భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు. ఖేడ్‌లో 54గిరిజన తండాలు పంచాయతీలుగా మారాయని గుర్తు చేశారు. ఖేడ్‌లో మార్కెట్ యార్డును నిర్మించినట్లు తెలిపారు. కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఇక్కడ సంజీవరెడ్డి రాత్రికి రాత్రి జెండా మార్చాడని, ఆయన జంప్ కొడితే ప్రజలు జంప్ కొడతారా అని ప్రశ్నించారు. ఆయన ఆస్తులు పెరిగాయే తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. కాంగ్రెస్‌కు ఏం చూసి ఓట్లు వేయాలని ప్రశ్నించారు. షెట్కార్‌లు స్వలాభం చూసుకున్నారు తప్ప ఖేడ్‌కు చేసిందేమీలేదన్నారు. నాలుగేళ్ల క్రితం నారాయణఖేడ్ ఎలా ఉందో ప్రస్తుతం ఎలా మారిందో గుండెలమీద చేయివేసుకొని ఓట్లు వేయాలని కోరారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, టీఆర్ఎస్ అభ్యర్థి ఎం.భూపాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సువర్ణ షెట్కార్, జిల్లా రైసస సమన్వయకర్త వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బాపు మల్శెట్టి, మోహిద్‌ఖాన్, రామాగౌడ్, రవీందర్‌నాయక్, పార్శెట్టి సంగప్ప, నజీబ్, మూఢ రామకష్ణ, ముజమ్మిల్, నాలగతా అశోక్ తోర్నాల్, గుండు మోహన్, రవీందర్‌నాయక్, ప్రభాకర్, శ్రీనివాస్‌గౌడ్, సత్యపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
పార్టీలో చేర్చేందుకేనా...!
సాక్షి, జహీరాబాద్: తాజా మాజీ మంత్రి టి.హరీశ్‌రావు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీసీసీబీ మాజీ చైర్మన్ జైపాల్‌రెడ్డిని సోమవారం రాత్రి హైదరాబాద్‌లో కలిశారు. జైపాల్‌రెడ్డి సుడోకు పోటీల్లో పాల్గొని విదేశాల నుంచి తిరిగి వచ్చారు. ఈ మేరకు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లినట్లు చెబుతున్నా రాజకీయ కోణంలో వెళ్లి ఉంటారనే ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్లో చేరాల్సిం దిగా ఆహ్వానించి ఉంటారనే అభిప్రాయాన్ని జైపాల్‌రెడ్డి సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా జహీరాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే జె.గీతారెడ్డితో జైపాల్‌రెడ్డికి విభేదాలు ఉండడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దసరా మరుసటి రోజున గీతారెడ్డి జైపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్‌కి కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఎలాగైనా టీఆర్ఎస్ పాగా వేయాలనే ఉద్ధేశంతో మంత్రి వూహ్యాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లోకి వెళ్లారు. మాజీ మంత్రి ఎం.డీ ఫరీదుద్దీన్ సైతం టీఆర్ఎస్లో చేరగా అధిష్టానవర్గం ఎమ్మెల్సీ పదవితో సత్కరించింది. జైపాల్‌రెడ్డిని సైతం టీఆర్ఎస్లోకి తేవాలనే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఈ విషయమై జైపాల్‌రెడ్డి మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. -
కొడంగల్ కు బావ.. పట్నంకు బామ్మర్ది
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధికార పార్టీలో నంబర్–2 స్థానంలో ఉన్న బావ, బామ్మర్దులకు మరో కొత్త సవాల్ ముందుకొచ్చింది. మన జిల్లాలో రెండు స్థానాల్లో గెలుపు బాధ్యతలను ఇరువురు మంత్రులు భుజాన వేసుకోవడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గాలపైనే పడింది. ప్రధానంగా కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి పోటీచేస్తున్న కొడంగల్ స్థానంలో గులాబీ పార్టీని విజయతీరాలకు చేర్చే బాధ్యతలను బావ హరీష్‌రావు చేపట్టగా.. రియల్ ఎస్టేట్, విద్య, వాణిజ్య, ఐటీ రంగానికి నెలవైన ఇబ్రహీంపట్నంలో కారు జోరు పెంచే బాధ్యతను బావమరిది కేటీఆర్ స్వీకరించారు. ఇద్దరూ అధికార పార్టీకి స్టార్ క్యాంపెయినర్లే కావడం.. అదీ స్వయానా బావామరదులు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.æ రాష్ట్రవ్యాప్తంగా 20 కీలక నియోజకవర్గాలను గుర్తించిన గులాబీ బాస్ కేసీఆర్.. వీటిలో ప్రచార వ్యూహాలను అమలు చేసే బాధ్యతను ముఖ్యనేతలకు అప్పగించారు. ప్రత్యర్థి బలంగా ఉన్న, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్న, సొంతపార్టీలో అసమ్మతి తీవ్రంగా ఉన్న స్థానాలను ఎంపిక చేశారు. ఇందులో మన జిల్లాలో కొడంగల్, ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లను గుర్తించారు. ఈ రెండు స్థానాలను ప్రతిష్టాత్మకంగా భావించిన గులాబీ అధినాయకత్వం.. వీటి గెలుపు బాధ్యతలను హరీష్‌రావు, కేటీఆర్‌కు కట్టబెట్టింది. పట్నంలో కేటీఆర్ గత ఎన్నికల్లో ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈ స్థానం నుంచి గెలుపొందిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(టీడీపీ) గులాబీ గూటికి చేరినా.. ప్రత్యర్థి పార్టీ బలంగా ఉన్నట్లు టీఆర్ఎస్ హైకమాండ్ గుర్తించింది. కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలున్నప్పటికీ సొంత పార్టీ నేతల్లోనూ లుకలుకలుండడం, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నట్లు అంతర్గత సర్వేలో తేలడంతో ఈ సెగ్మెంట్‌పై పట్టు సాధించేందుకు మంత్రి కేటీఆర్‌ను టీఆర్ఎస్ రంగంలోకి దించింది. ముఖ్యంగా పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను సద్దుమణిగేలా చేయడం, ప్రత్యర్థులను బలహీనపరిచే బాధ్యతను ఆయనకు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లో విజయ పతాకం ఎగురవేయడం కేటీఆర్‌కు సవాలుగా మారింది. రేవంత్ ఓటమే ధ్యేయంగా.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఓటమే ధ్యేయంగా టీఆర్ఎస్ నాయకత్వం వ్యూహాలకు పదునుపెడుతోంది. ఆర్నెల్ల క్రితమే టీడీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్‌ను ఉప ఎన్నికల్లో ఓడించాలని భావించింది. అయితే, ఆయన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్‌కు కాకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు ఇవ్వడంతో ఉప ఎన్నికకు చాన్స్‌లేకుండా పోయింది. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే చావుదెబ్బ తీయాలని అధికారపార్టీ అనుకుంది. అందుకనుగుణంగా కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. దాదాపు రాష్ట్ర కేబినెట్ అంతా ఏదో ఒక సందర్భంలో నియోజకవర్గంలో పర్యటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. అంతేగాకుండా 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన గురునాథ్‌రెడ్డి స్థానే ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డిని బరిలో దించనున్నట్లు సంకేతాలిచ్చారు. ఈ క్రమంలో గురునాథ్ వర్గీయుల నుంచి అసమ్మతి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఎన్నికలొప్పుడొచ్చినా టికెట్ ఖాయమని తేలడంతో నరేందర్‌రెడ్డి పూర్తిస్థాయిలో కొడంగల్‌పైనే దృష్టిపెట్టారు. మరోవైపు సోదరుడు, మంత్రి మహేందర్‌రెడ్డి కూడా నరేందర్‌ను గెలిపించడం కోసం తనదైన శైలిలో వ్యూహాలు రూపొందించారు. అనూహ్యంగా శాసనసభ రద్దు కావడం.. ఎన్నికలకు నగారా మోగడంతో ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవడం టీఆర్ఎస్కు తప్పనిసరి అయింది. శాసనసభ లోపల, బయటా మాటల చాతుర్యంతో కొరకరాని కొయ్యగా మారిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డిని ఓడించకపోతే చికాకు తప్పదని గులాబీ దళపతి కేసీఆర్ అంచనా కొచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్‌ని మట్టికరిపించేందుకు ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్‌రావును తెరమీదకు తెచ్చారు. స్టార్ క్యాంపెయినర్‌గా నరేందర్‌రెడ్డిని గెలుపు తీరాలకు చేర్చే బాధ్యతను అప్పగించారు. -
కేసీఆర్‌కు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయం : హరీష్‌రావు
గజ్వేల్ : ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు గజ్వేల్‌లో లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. తూప్రాన్‌ను మున్సిపాలిటీగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పుకొచ్చారు. రీజినల్ రింగ్ రోడ్‌తో ఈ ప్రాంతం అభివృద్ధి వేగం పుంజుకుందన్నారు. గురువారం తూప్రాన్ రోడ్‌షోలో పాల్గొన్న హరీష్ రావు రూ 6వేల కోట్లతో గజ్వేల్‌లో ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. కంటివెలుగులతో పేదలకు వైద్యం దరిచేర్చిన కేసీఆర్‌కు ఓటేయాలని, గజ్వేల్ గెలుపుపై అనుమానం లేదని ఇండియా టుడే సర్వే కూడా ఇదే విషయం వెల్లడించిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో విజయఢంకా మోగించి తిరిగి టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపడతుందని హారీష్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. తాగునీరు, విద్యుత్‌ను అందించడంతో పాటు గోదావరి నీటితో తూప్రాన్‌ను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. టీఆర్ఎస్ది జనం యాత్ర విపక్షాలు టికెట్ల కోసం జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారిది ఢిల్లీ, అమరావతి యాత్ర అయితే టీఆర్ఎస్ది జనం యాత్రని అన్నారు. గతంలో పలుమార్లు కాంగ్రెస్, టీడీపీలను గెలిపించినా ఆయా పార్టీలు కనీసం తాగునీటిని సైతం కల్పించలేకపోయాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
కేసీఆర్, హరీశ్‌రావులపై చర్యలేవి?’
హైదరాబాద్: మనుషుల అక్రమ రవాణా కేసులో కీలక పాత్రధారులుగా ఉన్న కేసీఆర్, హరీశ్‌రావు, కాశీపేట లింగయ్యలపై చర్యలేవని తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. పద్నాలుగేళ్ల నాటి కేసును వెలికితీసి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్ట్ చేయడం హర్షించదగ్గ అంశమేనని, కేసీఆర్‌పై ఉన్న అభియోగాలపై చట్టం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష నాయకులపై కేసులు బనాయించి కేసీఆర్ లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బుధవారం ఇక్కడి తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కొండగట్టు ప్రమాదం చోటుచేసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ ఇంటిపార్టీ నాయకులు పాల్గొన్నారు. -
అన్నదాతకు అందలం
సాక్షి, సిద్దిపేట : రైతుల కష్టాలు స్వయంగా చూసిన ముఖ్యమంత్రిగా ప్రతి అడుగూ రైతు కోసం.. ప్రతీ పథకం రైతు సంక్షేమం కోసం.. ప్రవేశపెడుతూ అన్నదాతను అందలానికి ఎత్తుతున్న ఏకైన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేట గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రైతులు బీమా పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గతంలో పహానీ నఖలు, పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం రైతులు.. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగే వారని అన్నారు. కానీ ఇప్పుడు భూ ప్రక్షాళన చేసిన పట్టాదారు పాస్‌పుస్తకాలు రైతుల ఇంటికి తెచ్చి ఇస్తున్నారని ఆయన అన్నారు. అడగకుండానే రైతు బంధు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా.. అంటూ రైతుల అవసరాలు తీరుస్తున్నారని వివరించారు. దీంతో రైతుల్లో తమకు ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం పెరిగిందని అన్నారు. ఒక్క సాగునీటి సమస్య తీరితే తెలంగాణ ప్రాంతం కోనసీమను తలదన్నే విధంగా మారుతుందని అన్నారు. అందుకోసమే గోదావరి జలాలు తెలంగాణ పొలాలకు పారించాలనే తపనతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నామని అన్నారు. కాళేశ్వరం పూర్తి చేసి తీరుతాం.. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పోచంపల్లి, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కట్టిందని.., అదే టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తుందని చెప్పారు. ఇప్పటికే మిషన్ కాకతీయ పనులతో పూర్వ వైభవం సంతరించుకున్న చెరువుల్లో గోదావరి జలాలు నింపే రోజులు దగ్గరకు వచ్చాయని.. వచ్చే వానాకాలం వరకు చెరువులు నింపి మత్తడి దునికేలా చేస్తామని అన్నారు. రైతులకు మంచి పనులు చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోవడంలేదని, వారి వక్రబుద్ధిని ప్రదర్శించి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ వారికే సంక్షేమ పథకాలు వర్తింపజేసేవారని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలు, అన్ని పార్టీల వారికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులైన జీవన్‌రెడ్డి, షబ్బీర్ అలీకి కూడా రైతు బంధు చెక్కులు అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నాగిరెడ్డి, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, సిద్దిపేట, నంగునూరు ఏఎంసీ చైర్మన్లు వెంకట్‌రెడ్డి, సురేందర్, పీఏసీఎస్ చైర్మన్లు రమేష్‌గౌడ్, సోమిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘సేఫ్ సిద్దిపేట’ను రూపొందిద్దాం సిద్దపేటజోన్: శాంతి భద్రత పరిరక్షణలో పోలీస్‌శాఖకు తోడ్పాటుగా ఆయా వార్డుల్లో స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సేఫ్ సిద్దిపేటగా మారుద్దామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని 14వ వార్డును వందశాతం సీసీ కెమెరాల ఏర్పాటు చేసిన తొలి వార్డుగా ప్రకటించి నిఘా వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా ఐదుగురు పోలీస్‌లతో సమానమని అన్నారు. ఇప్పటికే సిద్దిపేటలో 200పైగా కెమెరాలు ఏర్పాటు చేసి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 14వ వార్డులో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన సంపత్‌రెడ్డితో పాటు వైద్యులను మంత్రి అభినందించారు. జనవరి 1నాటికి జిల్లాలో అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో వందశాతం సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి రాష్ట్రంలోనే మెట్టమొదటి జిల్లాగా చరిత్ర సృష్టించాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా పోలీస్‌శాఖ చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు 2000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని జనవరి 1నాటికి ప్రతి గ్రామంలో మొత్తంగా 10వేల కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. నేను సైతం కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రజలను, వ్యాపారులను, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏసీపీ నర్సింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, చిప్ప ప్రభాకర్‌రెడ్డి, మరుపల్లి శ్రీనివాస్‌గౌడ్, తాళ్లపల్లి సత్యనారాయణ, నాయకులు శర్మ, చంద్రం, భీమసేన,Ðð వైద్యులు భాస్కర్‌రావు, గాయత్రి రవీంద్రనాథ్, వీవీరావు, పెద్దిరాజు, లక్ష్మీశ్రీనివాస్, చంద్రశేఖర్, గణేష్, మురళీక్రిష్ణ, చందర్‌తో పాటు వార్డు ప్రతినిధులు పాల్గొన్నారు. -
సిద్దిపేట ప్రజలకు హరీశ్‌రావు గ్రీన్ చాలెంజ్..
సాక్షి, సిద్దిపేట: ‘నాడు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన యువత.. నేడు బంగారు తెలంగాణలో భాగస్వామ్యులు కావాలి. అంతేకాకుండా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడండతో పాటు సర్కార్ పనితీరును ప్రజలకు వివరించే వారధులు మీరే’ అని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్వీ రాజకీయ శిక్షణ తరగతులను మంత్రి ప్రారంభించారు. ముందుగా తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది యువకులే అంటూ వారి త్యాగాలను గుర్తుచేశారు. అనతి కాలంలోనే తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తోందని స్వయానా ప్రధాన మంత్రి చెప్పారన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించడం, వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్, విద్యార్థులకు సన్నబియ్యం భోజనం, 570 ఇంగ్లిష్ మీడియం గురుకులాల ఏర్పాటు, విదేశాల్లో విద్య అభ్యసించే వారికి రూ.20 లక్షల ప్రోత్సాహకం.. ఇలా తెలంగాణలో ప్రవేశపెట్టిన ప్రతి పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రం కోసం చావు నోటి వరకు వెళ్లొచ్చిన కేసీఆర్.. ముఖ్యమంత్రి కావడంతోనే ఈ పథకాలు అమలవుతున్నాయన్నారు. మరోవైపు రాష్ట్రంలో అన్నింటా సిద్దిపేట ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ఉత్తమ మున్సిపాలిటీగా, ఉత్తమ మండంగా, ఉత్తమ గ్రామంగా సిద్దిపేట నియోజకవర్గంలోని గ్రామాలు నిలిచాయన్నారు. గతంలో ఎంప్లాయిమెంట్ కార్డు కోసం, డీఈఓను కలిసేందుకు, కలెక్టర్‌ను కలిసేందుకు సంగారెడ్డి వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు సిద్దిపేట జిల్లా కావడంతో ఇబ్బందులు తీరాయని మంత్రి చెప్పారు. సిద్దిపేటలో మెడికల్ కళాశాల ఏర్పాటు చరిత్రలో మిగిలిపోతుందన్నారు. నాలుగు పాలిటెక్నిక్ కళాశాలలు, ముగులులో హార్టికల్చల్, ఫారెస్టు యూనివర్సీటీల ఏర్పాటు, రూ.18 కోట్లతో పీజీ కళాశాల అభివృద్ధి, రూ.2.5 కోట్లతో మహిళా డిగ్రీకళాశాల నిర్మాణం, ఇర్కోడులో ఐటీఐ ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా పోటీ పరీక్షల్లో మన యువత ముందు ఉండేందుకు ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు, ఉచిత భోజనంతో కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో యువత పాల్గొని హరిత సిద్దిపేటగా మార్చాలని కోరారు. ఉత్సాహం నింపిన దేశపతి మాట.. పాట టీఆర్ఎస్వీ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌రావు తన ఆటా.. పాటలతో యువతలో ఉత్సాహం నింపారు. మధ్యమధ్యలో నందినీ సిధారెడ్డి రాసిన ‘నాగేటి సాలల్ల నా తెలంగాణ.. నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ..’ అని పాడుతూనే తెలంగాణ ప్రజలకు పాలపిట్ట ఎంత ఇష్టమో చెప్పారు. అదేవిధంగా ‘జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి..’ అంటూ అందె శ్రీ పాటను దేశపతి పాడుతుండగా మంత్రి హరీశ్‌రావు, విద్యార్థులు కోరస్ ఇవ్వడం విశేషం. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, టీఆర్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ శర్మ, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్ సారయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం, బర్ల మల్లికార్జున్, టీఆర్ఎస్వీ నాయకులు మహేశ్, శేఖర్‌గౌడ్, మాదాస్ శ్రీనివాస్, ప్రొఫెసర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. నా ప్రయత్నానికి మీరు అండగా నిలవాలి సిద్దిపేటజోన్ : ప్రతి ఒక్కరూ హరిత ఉద్యమంలో కలిసి వచ్చి నా ప్రయత్నానికి అండగా నిలిచి కాలుష్య భూతాన్ని తరుముదామంటూ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి మున్సిపల్ కార్యాలయంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో ఎక్కడ చూసిన ప్లాస్టిక్‌గా మారిందని, దీనివల్ల పర్యావరణానికి ఇబ్బందిగా మారడంతో పరోక్షంగా క్యాన్సర్ లాంటి వ్యాధులు కారకాలుగా మారుతున్నాయన్నారు. ఈ భూతాన్ని తరిమేందుకు ప్రతి ఒక్కరు మొక్క నాటాలని పిలుపునిచ్చారు. మీరంతా కలిసి వస్తే సిద్దిపేట, తెలంగాణ నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తొలగించే అవకాశం ఉందన్నారు. సిద్దిపేట ప్రజలకు మంత్రి గ్రీన్ చాలెంజ్... ఇటీవల హరిత ఉద్యమాన్ని చేపట్టామని ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని గ్రీన్ చాలెంజ్ చేస్తున్నామని, తనతో పాటు మీరు కూడా తప్పని సరిగా మొక్కలు నాటాలని మంత్రి హరీశ్‌రావు ప్రజలకు చాలేంజ్ విసిరారు. దీని ద్వారా హరితసిద్దిపేటగా మారే అవకాశం ఉందన్నారు. నిజాయితీ గల గడ్డ సిద్దిపేట... మంత్రి ప్రసంగిస్తూ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి పథకం చెక్కులను ఇస్తున్న తనకు మీరు ఒక హామీ ఇవ్వాలని, ఇస్తారా అంటూ సభా ముఖంగా ప్రశ్నించారు. తాను అడిగేది ఏమిటో తెలుసా.... మాట ఇచ్చాక మరచిపోవద్దని షరతు విధించారు. నేను అడిగేది ఏమిటో తెలుసా అంటూ వారిని ప్రశ్నించగా అందులో కొందరు ఓటు ఇవ్వామంటారా అని చెప్పడంతో మంత్రి నవ్వుతూ సిద్దిపేట ప్రజలు ఎంతో మంచివారని, సిద్దిపేట నిజాయితీ గల గడ్డ అని, పనిచేసే వారిని ఆశీర్వదించే గుణం మీదని అందుకే పలు ఎన్నికల్లో నన్ను గెలిపించారన్నారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని మరోసారి పిలుపునిచ్చారు. అనంతరం రంగనాయక సాగర్ కాలువ కోసం భూములు ఇచ్చిన 163మందికి రూ.10.11కోట్లు, అదేవిధంగా 276 లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ. 2.26కోట్లు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్, కౌన్సిలర్లు మల్లికార్జున్, ఆనంద్, వెంకట్‌గౌడ్, చిన్న, మోహిజ్, కనకరాజు, నర్సయ్య, ఎంపీపీబీ మాణిక్యరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి ,యాదయ్య, తహసీల్దార్లు పరమేశం, జానకీ,రాజిరెడ్డి, తదితరులు ఉన్నారు. హరిత సమాజాన్ని నిర్మిద్దాం చిన్నకోడూరు(సిద్దిపేట) : జన్మనిచ్చిన నేలకు నేనేమిచ్చాని ఆలోచన చేసి అందరం చెట్లు పెంచుదామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల మహిళా సమాఖ్య 9వ వార్షికోత్సవ సభలో మాట్లాడారు. 27 మహిళా గ్రామ సమాఖ్య సంఘ సభ్యులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. 74 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీమూబారక్ చెక్కులు అందజేశారు. మండల గ్రామైఖ్య సంఘ మహిళలు పొదుపు చేసుకుంటున్న తీరు తెన్నులపై ఆరా తీశారు. ప్రభుత్వ సేవలు విస్తరించాలి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిని చాలా బాగా చేశాం. ఆసుపత్రుల సేవలు వినియోగించుకునేలా ప్రజల్లో చైతన్యం తేవాలని, ఆస్పత్రి సేవలపై నమ్మకం కలిగేలా విస్తరింపజేయాల్సిన బాధ్యత మీపై ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట ఆస్పత్రిలో సకల సదుపాయాలు సమకూర్చి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నామని రక్తశుద్ధి కేంద్రం, ఐసీయూ, కిడ్ని వ్యాధి గ్రస్తులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. పేదరికంలో ఉన్న వారికి బాలసదనం, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో చదివిస్తామని, అలాంటి వారు ఎవరైనా ఉంటే తమ దృష్టికి , స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తేవాలన్నారు. హరిత సమాజాన్ని నిర్మిద్దాం..అందుకు అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, జెడ్పీటీసీ కమల, మార్కెట్ కమిటీ చైర్మన్ కుంట వెంకట్‌రెడ్డి, సర్పంచ్ కాముని ఉమేష్, టీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త రాధాకృష్ణశర్మ, తహసీల్దార్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వాళ్లు జిల్లాకు ఏం జేసిండ్రు?
నల్లగొండ: ‘తెలంగాణ రాష్ట్రం రావడం నల్లగొండ జిల్లా ప్రజల అదృష్టం. ఇన్నేళ్లూ కాంగ్రెస్ నాయ కులకు ఓట్లేసి పెద్ద నాయకులుగా తయారు చేస్తే వారంతా కలిసి జిల్లాను ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా మార్చారు. ఈ జిల్లాను ముంచి పులిచింతల ప్రాజెక్టు నిర్మించి ఆంధ్రాకు బహుమానంగా ఇచ్చారు’ అని ఆ జిల్లా కాంగ్రెస్ నాయకులపై నీటి పారుదల, మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టుకు గండికొట్టి నాగార్జునసాగర్‌కు నీరు రానివ్వకుండా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణానికి పాటుపడ్డారే తప్ప.. జిల్లా అభివృద్ధికి వారు చేసింది ఏంటని ప్రశ్నించారు. ఆదివారం నల్లగొండ జిల్లాలో మంత్రి జగదీశ్‌రెడ్డి, రైతు సమన్వయతి సమితి కార్పొరేషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి ఆయన నకిరేకల్‌లో నిమ్మ, నల్లగొండలో బత్తాయి మార్కెట్లను ప్రారంభించారు. అనంతరం నల్లగొండ మార్కెట్ యార్డులో జరిగిన సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో మరేమంత్రి చేపట్టలేని మంత్రి పదవులు అనుభవించిన జానారెడ్డి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి రైట్ హ్యాండ్‌గా తిరిగిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నా అంత పవర్ఫుల్ మంత్రి లేడని గర్వంగా చెప్పుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ జిల్లాకు ఏం చేసిండ్రు? అని ప్రశ్నించారు. ఇన్నేళ్లలో కాంగ్రెస్ నాయకులు చేయలేని అభివృద్ధి పనులు నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ, మూసీ కాలువల ఆధునీకరణ, బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయడంలో కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. పెద్ద నాయకులమని చెప్పుకునే వీరు జిల్లాకు మెడికల్ కాలేజీని ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు అధికారంలో కొనసాగితే మరో పులిచింతల ప్రాజెక్టు నిర్మించి ఆంధ్రాకు అప్పగించేవారని ఎద్దేవా చేశారు. ఆంధ్రా ఏజెంట్లుగా పనిచేశారు... జిల్లా కాంగ్రెస్ నేతలు ఆంధ్రా పాలకులకు ఏజెంట్లుగా పనిచేశారని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించా రు. వారంతా జిల్లాలోని ఫ్లోరైడ్ నిర్మూలనకు కృషి చేయలేదన్నారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు వీరేశం, కిషోర్, ఫైళ్ల శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైట్.. రైట్..!
సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఆర్టీసీ సమ్మె అంశం సానుకూలంగా పరిష్కారమైంది. గుర్తింపు కార్మిక సంఘం డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. 16% మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చేందుకు అంగీకరించింది. మిగతా అంశాలపైనా సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. దీంతో సోమవారం తెల్లవారు జాము (11వ తేదీ) నుంచి తాము తలపెట్టిన సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్టు గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రకటించింది. దీంతో ఆర్టీసీ సర్వీసులు యథాతథంగా కొనసాగనున్నాయి. మరోవైపు టీఎంయూ నేతల తీరుపై ఆర్టీసీలోని ఇతర కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. వేతన సవరణ కాకుండా ఐఆర్‌కు అంగీకరించడం సరికాదని, ఇది కార్మికులను దగా చేయడమేనని ఆరోపించాయి. కొద్దిరోజులుగా టెన్షన్.. కొంతకాలంగా వేతన సవరణ కోసం డిమాండ్ చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు.. ఈ నెల 11 నుంచి సమ్మెకు దిగుతామని నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం, కార్మిక సంఘాలు పట్టుదలకు పోవడంతో కొద్దిరోజులుగా ఉత్కంఠ నెలకొంది. 2015లో ఎనిమిది రోజులు సమ్మె తర్వాతగానీ రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణకు అంగీకరించలేదు. ఈసారి కూడా అదే తరహా పరిస్థితి నెలకొనేలా కనిపించింది. ముఖ్యంగా సమ్మెకు వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, సమ్మెలో పాల్గొనే ఉద్యోగులను తొలగిస్తామని, ఆర్టీసీని మూసివేసే పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్ హెచ్చరించడం ఒక్కసారిగా వేడి రగిలించింది. దీనిపై కార్మిక సంఘాలు తొలుత ఆందోళన చెందినా.. సీఎం బెదిరింపులకు బెదరబోమని, సమ్మె చేసి తీరుతామని ప్రకటించాయి. కానీ హరీశ్ నేతృత్వం లోని మంత్రుల బృందం రంగంలోకి దిగి.. అటు కార్మిక సంఘాలతో, ఇటు సీఎంతో చర్చలు జరపడం ప్రారంభించాక పరిస్థితిలో మార్పు వచ్చింది. శాంతించిన సీఎం.. కార్మిక సంఘాల తీరుపై తొలుత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చివరికి సానుకూలంగా స్పందించారు. మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించేందుకు అంగీకరించారు. దీంతో ఆదివారం గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ, మంత్రుల బృందానికి మధ్య ఇదే అంశంపై ప్రధానంగా చర్చలు జరిగాయి. తొలుత 25% ఐఆర్ ఇవ్వాలని కోరిన కార్మిక సంఘం నేతలు.. కనీసం 18 శాతానికి తగ్గకుండా ప్రకటించాలని పట్టుబట్టారు. ఇటు సీఎం అనుమతి మేరకు మంత్రులు తొలుత 10 శాతం ఐఆర్ ఇస్తామని కార్మిక సంఘం నేతలకు చెప్పారు. కానీ కార్మిక సంఘం నేతలు వెనక్కి తగ్గలేదు. దీంతో రెండు మూడు సార్లు అటు సీఎంతో, ఇటు కార్మిక సంఘంతో సమావేశమైన మంత్రులు.. చివరికి 16 శాతం ఐఆర్ ఇస్తామని, సమ్మె విరమించుకోవాలని కోరారు. దీనికి టీఎంయూ నేతలు సమ్మతించడంతో సమస్య సానుకూలంగా పరిష్కారమైనట్టయింది. ఆదివారం సాయంత్రం మంత్రులు, టీఎంయూ నేతలు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి, చర్చలు సఫలమైనట్టు ప్రకటించారు. తమ డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున.. సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు టీఎంయూ నేతలు వెల్లడించారు. ఇక ‘ఆర్టీసీ’ని సరిదిద్దే చర్యలు! ప్రస్తుతం ఆర్టీసీకి రూ.3 వేల కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. సాలీనా రూ.680 కోట్ల నష్టాల్లో కొనసాగుతోంది. తాజాగా 16 శాతం ఐఆర్ ఇవ్వనుండటంతో ఏటా రూ.200 కోట్ల మేర అదనపు భారం పడుతుందని అంచనా వేశారు. ఇది సంస్థపై పెనుభారం చూపే అంశం కావడంతో.. ఆర్టీసీలో దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టీసీకి ఉన్న అప్పులను తీర్చడంలో వన్‌టైం సెటిల్మెంట్ కింద కొంత బాధ్యత తీసుకోవాలని నిర్ణయించింది. ఆర్టీసీకి డీజిల్ ధరల పెరుగుదల పెనుభారంగా మారిన నేపథ్యంలో... డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని, మోటారు వాహనాల పన్ను మినహాయింపు ఇవ్వాలని భావిస్తోంది. కొంతకాలంగా నియామకాలు లేక ఖాళీగా ఉన్న దాదాపు 5 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇలాంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆర్టీసీ అధికారులు, కార్మిక సంఘం నేతలు, ఐఏఎస్ అధికారులు, పౌర సమాజం నుంచి ప్రతినిధులు అందులో సభ్యులుగా ఉంటారు. రెండు మూడు రోజుల్లో ఈ కమిటీ ఏర్పాటు ప్రకటన ఉంటుందని మంత్రుల బృందం వెల్లడించింది. కమిటీ అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఇక చిన్నచిన్న విషయాలపై కండక్టర్లు, డ్రైవర్లను సస్పెండ్ చేస్తుండటంతో వారి ఉద్యోగ భద్రతకు భంగం కలుగుతోందన్న కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఈ అంశాల్లో క్రమబద్ధమైన నిర్ణయాలు తీసుకునేందుకు మరో కమిటీ వేయనున్నట్టు ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సకల జనుల సమ్మెకు సంబంధించి 27 రోజుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించాలన్న డిమాండ్ కూడా అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. దీనిపై గతంలోనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయినా అమలుకాకపోవడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని, వెంటనే అమలు చేయాలని ఆదేశించారని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. దానికి సంబంధించి బకాయిలను నగదు రూపంలో చెల్లించనున్నట్టు చెప్పారు. ఈ మేరకు దాదాపు రూ.80 కోట్లను కార్మికులకు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇది కార్మికులను దగా చేయడమే.. టీఎంయూపై ఇతర కార్మిక సంఘాల ఆగ్రహం: కేవలం మధ్యంతర భృతికి అంగీకరించి సమ్మె విరమించడం గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ వైఫల్యమేనని ఆర్టీసీలోని ఎన్ఎంయూ, ఈయూ, టీజేఎంయూ తదితర ఏడు కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు వేతన సవరణ దిశగా ప్రభుత్వం అడుగులేస్తున్నప్పుడు.. ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర భృతితో సరిపుచ్చటం వారిని దగా చేయడమేనని విమర్శించాయి. టీఎంయూ మరోసారి కార్మికులను మోసం చేసిందని, కార్మికుల ఆశలపై నీళ్లు చల్లి తక్కువ మధ్యంతర భృతికి అంగీకరించిందని ఎన్ఎంయూ నేతలు నాగేశ్వరరావు, కమల్‌రెడ్డి, నరేందర్, మౌలానా తదితరులు ఆరోపించారు. టీఎంయూ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి నిరసనగా సోమవారం తమ సంఘం నిరసన ప్రదర్శనలు చేస్తుందని ప్రకటించారు. ఇక టీఎంయూ ప్రభుత్వ బెదిరింపులకు భయపడి తక్కువ ఐఆర్‌కు అంగీకరించిందని టీజేఎంయూ నేత హనుమంతు ఆరోపించారు. తమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం అన్ని డిపోల ఎదుట టీఎంయూ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని చెప్పారు. ఆర్టీసీ లెక్కలివీ.. 54,000 కార్మికుల సంఖ్య 3,000 కోట్లు..ప్రస్తుతం ఆర్టీసీ అప్పులు గత వేతన సవరణ 44% ఫిట్మెంట్ దానితో ఆర్టీసీపై పడిన భారం750కోట్లుసాలీనా 680కోట్లు గత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు 200కోట్లు..తాజాగా ఐఆర్‌తో ఏటా అదనపు భారం -
అనాథ చిన్నారుల మధ్య హరీశ్ జన్మదిన వేడుకలు
గజ్వేల్ : అనాథ చిన్నారుల మధ్య నీటి పారుదల శాఖామంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. దుబ్బాక పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఆదివారం రాత్రి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆశాజ్యోతి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు చిన్నారుల మధ్య కేక్‌ను కట్ చేసి తినిపించారు. చిన్నారుల సంక్షేమం కోసం రూ. 25వేల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ భాస్కర్, కేసీఆర్ యువసేన అధ్యక్షుడు అనూప్, ఆశాజ్యోతి డైరెక్టర్ ఫాదర్ ఆల్వీన్ తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రికి ‘కాళేశ్వరం’ జలాలు
సాక్షి, హైదరాబాద్: కరువుపీడిత యాదాద్రి భువ నగిరి జిల్లాకు వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు జలాలందుతాయని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఈ మేరకు గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల నిర్మాణపనులను వేగవంతం చేయాలని అధికార యంత్రాంగాన్ని, ఏజెన్సీలను ఆదేశించారు. యాదాద్రి జిల్లాలో చేపట్టిన కాళేశ్వరం ప్యాకేజీ 15, 16 పనులను గురువారం జలసౌధలో సమీక్షించారు. గంధమల రిజర్వాయర్ పూర్తికాకపోయినా డిస్ట్రిబ్యూటరీల పనులు మాత్రం పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తే, వాటి ద్వారా 100 చెరువులు నింపి యాదాద్రి జిల్లాలో కనీసం 21 వేల ఎకరాలకు సాగునీరివ్వొచ్చని చెప్పారు. ఇంకా కృషి చేస్తే దాదాపు 40 వేల ఎకరాలకు కూడా సాగునీరిచ్చే అవకాశాలున్నాయన్నారు. ఈ డిస్ట్రిబ్యూటరీల కోసం వారం, పది రోజుల్లో భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే మూడు నెలల్లో డిస్ట్రిబ్యూటరీల పనులు, స్ట్రక్చర్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. గంధమల్ల చుట్టుపక్కల ఎన్ని గొలుసుకట్టు చెరువులున్నాయి.. ఎంత ఆయకట్టుకు సాగునీటిని అందించవచ్చో వెంటనే వివరాలివ్వాలని సూచించారు. మల్లన్నసాగర్ నుంచి గంధమల్ల వరకు 35 కిలోమీటర్ల మేర కాలువ తవ్వాలని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వవిప్ గొంగిడి సునీతారెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఈఎన్సీ మురళీధర్ రావు, కాళేశ్వరం సీఈ హరిరామ్ తదితరులు పాల్గొన్నారు. -
హరీష్‌రావు లేఖకు దేవినేని స్పందన
అమరావతి: ఆర్డీఎస్ సమస్య పరిష్కారంపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఇటీవల రాసిన లేఖకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారం సాంకేతిక అంశాలతో ముడిపడి ఉన్న అంశం అంటూ హరీష్‌రావుకు రాసిన లేఖలో దేవినేని పేర్కొన్నారు. మంత్రుల స్థాయి సమావేశం జరగడానికి ముందే ఇరిగేషన్ ఇంజనీర్లు, అధికారుల స్థాయిలో సమావేశం జరపాలని హరీష్‌కు సూచించారు. -
అవకాశాలను అందిపుచ్చుకోండి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రపంచీకరణతో వస్తున్న అవకాశాలను యువత అందిపుచ్చుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విద్యను ఉపాధి మార్గంగా కాకుండా సాధికారత సాధించే సాధనంగా చూడాలన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీ (హైదరాబాద్) ఎనిమిదో స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారత్‌లో వృత్తి నైపుణ్యాలకు కొదవలేదని, నైపుణ్యాలను మెరుగు పరచుకునేందుకు అన్నివర్గాల వారు ప్రయత్నించాలన్నారు. ఉన్నత విద్య, ఉపాధి కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి తాను వ్యతిరేకం కాదన్నారు. విదేశాలకు వెళ్లిన విద్యార్థులు చదువుకుని, సంపాదించుకుని మాతృదేశా నికి తిరిగి రావాలన్నారు. తెలంగాణ లో సీఎం కేసీఆర్ తెలుగును తప్పని సరి చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అందరికీ ఉద్యోగాలు అసాధ్యం: మంత్రి హరీశ్‌రావు ఒకటిన్నర నుంచి 3% మందికి మాత్రమే ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం సాధ్యమవుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలుగు విద్యార్థులు అఖిల భారత సర్వీసుల్లో ఎక్కువ సంఖ్యలో చేరాలని పిలుపునిచ్చారు. మిషన్ భగీరథ, విద్యుత్, మిషన్ కాకతీయ, హరితహారం తదితర పథకాల ద్వారా ప్రభుత్వం తాగునీరు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల సమస్యలను తీర్చే దిశగా అడుగులు వేసిందన్నారు. పర్యావరణ మార్పులపై యువ ఇంజినీర్లు పరిశోధనలు చేసి పరిష్కారం చూపాలని పిలుపునిచ్చారు. గీతం యూనివర్సిటీ 8వ స్నాతకోత్సవం సందర్భంగా వైస్ చాన్సలర్ ఎం.ఎస్. ప్రసాదరావు వార్షిక నివేదిక సమర్పించగా, చాన్సలర్ ప్రొఫెసర్ కె.రామకృష్ణారావు స్వాగతోపన్యాసం చేశారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో గీతం వ్యవస్థాపకులు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి, మాజీ ఎంపీ కేఎస్ రావు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్లు పాల్గొన్నారు. -
‘డిండి’పై సభలో దుమారం
సాక్షి, హైదరాబాద్: ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు నీటిని తరలించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు అలైన్మెంట్ అంశంపై గురువారం శాసనసభ కాసేపు అట్టుడికింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతో దీన్ని అనుసంధానించకుండా వేరుగా చేపట్టాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం గతంలో ఇదే విషయమై సీఎంకు లేఖ రాశారంటూ కాంగ్రెస్ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ఈ ప్రాజెక్టుపై 10 నిమిషాలకుపైగా ఆయన ప్రశ్నలు వేయడంతో వంశీ మైక్ కట్ కావడం, ఆయన పోడియంలోకి దూసుకెళ్లడం, మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగడంతో సభ గరంగరంగా సాగింది. శ్రీశైలం నుంచి నీరు తీసుకుంటామని.. ప్రశ్నోత్తరాల సందర్భంగా వంశీచంద్ మాట్లాడుతూ ‘‘డిండికి శ్రీశైలం నుంచే నీటిని తీసుకుంటామని జీవో ఇచ్చారు. 2015లో శంకుస్థాపన సందర్భంగా ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అలైన్మెంట్ కూడా ఖరారు కాలేదు. అప్పుడు శ్రీశైలం ఫోర్‌షోర్ అని చెప్పి ఇప్పుడు పాలమూరుకు అనుసంధానించారు. మేమే దీన్ని వ్యతిరేకిస్తున్నాం. పాలమూరుతో అనుసంధానిస్తే రాజకీయ అశాంతి నెలకొంటుందని మంత్రులు ఆందోళన వెలిబుచ్చారు’’అని పేర్కొన్నారు. ఈ సమయంలో వంశీచంద్ మైక్‌ను స్పీకర్ మధుసూదనాచారి కట్ చేసి అధికార పార్టీ సభ్యుడు గువ్వల బాలరాజుకు ఇచ్చారు. దీంతో వంశీచంద్ నిరసన వ్యక్తం చేశారు. అయినా స్పీకర్ మైక్ ఇవ్వకపోవడంతో వంశీ పోడియంలోకి దూసుకెళ్లగా ఆయనకు స్పీకర్ మైక్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిండికి వేరుగా నీటిని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం వంశీచంద్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి సభలోనే కొట్టొచ్చినట్లు కనబడుతోంది. నల్లగొండ జిల్లాకు సంబంధించి డిండిపై చర్చ జరుగుతుంటే జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతిరెడ్డి సభలో లేరు. కాంగ్రెస్ నేతలు జిల్లాకో మాట మాట్లాడుతున్నారు. ఇది వారి కుటిలనీతి’’అని దుయ్యబట్టారు. డిండి ప్రాజెక్టు ఆలస్యంపై ఎమ్మెల్యే వంశీ ప్రశ్నించాల్సింది గాంధీభవన్‌లో కానీ సభలో కాదని విమర్శించారు. ‘‘ఆ పార్టీ నేతలు హర్షవర్దన్‌రెడ్డి, పవన్‌కుమార్‌లు గండుపిల్లి కూడా లేని దగ్గర పెద్ద పులులున్నాయని, ఆముదం మొక్క కూడా లేనిచోట మహా వృక్షాలు ఉన్నాయని ట్రిబ్యునల్, కోర్టుల్లో కేసులు వేశారు. నిజంగా నీళ్లు రావాలని కాంగ్రెస్ కోరుకుంటే మొదట కేసులు ఉపసంహరించుకొని ప్రాజెక్టుకు సహకరించాలి’’అని సూచించారు. ప్రజాధనం వృథా కావొద్దనే.. : హరీశ్ శ్రీశైలం నుంచి డిండికి నీటిని వేరుగా తీసుకుంటే అదనంగా పంప్‌హౌస్, సర్జ్‌పూల్ వంటి నిర్మాణాలతో అధిక మొత్తం ఖర్చవుతుందని, దీనికితోడు భూసేకరణ, ఇతర అనుమతులతో ఆలస్యం జరుగుతుందని హరీశ్‌రావు పేర్కొ న్నారు. ఈ దృష్ట్యా పాలమూరులో భాగంగా నిర్మిస్తున్న పంప్‌హౌస్ ద్వారానే 2 టీఎంసీల నీటిని తీసుకొని అందులో 1.5 టీఎంసీలను పాలమూరు అవసరాలకు, మరో 0.5 టీఎంసీ డిండి అవసరాలకు మళ్లించాలని నిర్ణయించామని, దీని ద్వారా ప్రజాధనం వృథా కాదన్నారు. డిండి ప్రాజెక్టు ద్వారా నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎలాంటి నష్టం ఉండదని, అన్ని జిల్లాలకు సమానంగా నీటి సరఫరా జరుగుతుందన్నారు. కృష్ణాలో రాష్ట్రానికి కేటాయింపులు పెరగనున్నాయన్నారు. ‘డిండి’కి వ్యతిరేకం కాదు మీడియాతో వంశీచంద్ డిండి ప్రాజెక్టును పాలమూరు ప్రాజెక్టుతో అనుసంధానించడాన్నే తాము వ్యతిరేకిస్తున్నాం తప్ప డిండి ప్రాజెక్టును కాదని వంశీచంద్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన మాట్లాడుతూ డిండి ప్రాజెక్టును పాలమూరుతో అనుసంధానం చేస్తే మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగానికి నష్టం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు శాసనసభలోనే అబద్ధాలు చెప్పారని విమర్శించారు. డిండితో పాలమూరు ప్రాజెక్టును అనుసంధానిస్తే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో రాజకీయ అశాంతి నెలకొంటుందని హెచ్చరించారు. -
స్థలాలు చూపిస్తే రైతు బజార్లు: హరీశ్
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో ప్రస్తుతం 48 ప్రాంతాల్లో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసి తక్కువ ధరకు కూరగాయాలు విక్రయిస్తున్నామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. త్వరలో మరో 52 ప్రాంతాలకు ఈ సేవలను విస్తరింపజేస్తామని చెప్పారు. రహదారులకు సమీపంలో స్థలాలను సమీకరించి ఇస్తే రైతు బజార్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మండలిలో సభ్యుల ప్రశ్నలకు బదులిచ్చారు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు కాంగ్రెస్ పాలకులు రాష్ట్రానికి అనుకూలం గా వాదనలు వినిపించకుండా అన్యాయం చేశారని, ఈ నష్టాన్ని పూడ్చేందుకు ట్రిబ్యునల్తోపాటు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నామన్నారు.ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున వాదనలు వినిపించడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్ష నేత షబ్బీర్ అలీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ స్వామిగౌడ్ తిరస్కరించారు. -
ఏడాదిలోగానే ‘పునరుజ్జీవం’!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్‌కు నీటిని ఎత్తిపోసేలా చేపట్టిన పునరుజ్జీవ పథకంతో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద రెండు పంటలకు నీళ్లు అందుతాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పునరుజ్జీవ పథకాన్ని 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. సంవత్సర కాలంలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో టీఆర్ఎస్ సభ్యులు మనోహర్‌రెడ్డి, కె.విద్యాసాగర్‌రావు, బీజేఎల్పీనేత జి.కిషన్‌రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. ప్రభుత్వం పునరుజ్జీవ పథకానికి రూ.1,067 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చిందని, వరద కాల్వ ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి తరలిస్తామని చెప్పారు. దీనికితోడు ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు సైతం నీళ్లిచ్చేలా కాల్వల ఆధునీకరణ చేపట్టామన్నారు. ప్రజలపై భారం పడుతుందనే.. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ల విలువ పెంచితే 99 శాతం ప్రజలపై తీరని భారం పడుతుందని.. అందువల్లే పెంచడం లేదని హరీశ్‌రావు తెలిపారు. రిజిస్ట్రేషన్ విలువ పెంచకపోవడంతో ప్రాజెక్టుల కింద భూమిని కోల్పోతున్న నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్ సభ్యుడు టి.జీవన్‌రెడ్డి సభ దృష్టికి తేగా.. హరీశ్ సమాధానమిచ్చారు. కాంగ్రెస్ హయాంలో భూసేకరణకు రూ.60 వేల నుంచి రూ.2 లక్షలకు మించి పరిహారం చెల్లించలేదని.. తాము ప్రస్తుతం రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం చెల్లిస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ విలువ రూ.60 వేల వరకే ఉన్న చోట మూడింతల పరిహారం లెక్కన రూ.1.80 లక్షలు మాత్రమే వస్తాయని.. కానీ తమ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వారికి సైతం రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల పరిహారం అందిస్తోందని పేర్కొన్నారు. ఇక మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ కోసం రూ.65.56 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేశామని మరో ప్రశ్నకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. ఈ పనులను 18 నెలల్లో పూర్తిచేసి, చివరి ఆయకట్టు వరకు నీరిందిస్తామన్నారు. ప్రభుత్వాస్పత్రులపై విమర్శలొద్దు: కేసీఆర్ ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితులపై వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయొద్దని కేసీఆర్ పేర్కొన్నారు. పడకల సంఖ్యకు మించి రోగులు వస్తున్నారని, వైద్యులు మానవతా దృక్పథంతో వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ సభ్యుడు జలగం వెంకటరావు అడిగిన ప్రశ్నపై సీఎం స్పందించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల భయంకరమైన స్థితిలో కూరుకుపోయిన వైద్యారోగ్య శాఖకు తాము జీవం పోస్తున్నామన్నారు. ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న వైద్య రంగాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, విమర్శలు చేయడం సరికాదని సూచించారు. ఇటీవల తాను ఓ పత్రికలో ఒక వార్తను చూశానని.. ఓ ప్రభుత్వాస్పత్రిలో బెడ్లు లేవని, కిటికీకి సెలైన్ బాటిల్ కట్టి చికిత్స అందిస్తున్నారని ఫొటోతో సహా ఓ కథనాన్ని ప్రచురించారని చెప్పారు. దానిపై తాను వైద్యారోగ్య మంత్రి, ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడితే.. అసలు విషయం తెలిసిందన్నారు. ప్రతి ఆస్పత్రిలో నిర్ణీత సంఖ్యలో పడకలు ఉంటాయని, అంతకు మించి రోగులు రావడంతో వైద్యులు, సిబ్బంది అలా చేయాల్సి వచ్చినట్లుగా వెల్లడైందని చెప్పారు. అందరికీ వైద్యం అందించాలన్న సదుద్దేశం, మానవతా దృక్పథంతో వైద్యులు వ్యవహరిస్తే.. విమర్శిస్తూ కథనాలు ప్రచురించడం సరికాదన్నారు. తర్వాత తాను సదరు పత్రిక యాజమాన్యానికి ఫోన్ చేశానన్నారు. విషయం తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు రాయొద్దని.. వైద్యులను ప్రోత్సహించాలని సూచించినట్లు తెలిపారు. రోగుల సంఖ్య పెరిగినా చిత్తశుద్ధితో వైద్యం అందిస్తున్న ప్రభుత్వ వైద్యులను అభినందిస్తున్నానన్నారు. సమయ పాలనపై వద్దా? శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయపాలన అంశంపై బుధవారం అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రశ్నోత్తరాల్లో ఎక్కువ సమయం తీసుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, జీవన్‌రెడ్డిలను సభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు తప్పుబట్టారు. వారు 15 నిమిషాలకు పైగా సమయం తీసుకుని.. సంబంధం లేకుండా ప్రశ్నలు వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకే మంత్రికి 30 నిమిషాల సమయం పడుతుందన్నారు. అయినా కాంగ్రెస్ సభ్యులు బయటకు వెళ్లి అధికారపక్షం తమకు సమయం ఇవ్వడం లేదంటోందని విమర్శించారు. ప్రశ్న సూటిగా వేస్తే మంత్రి క్లుప్తంగా సమాధానం ఇస్తారన్నారు. ఖమ్మం జిల్లాలో బోదకాలు వ్యాధిపై మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడితే.. మీరేమో జహీరాబాద్, జగిత్యాల జిల్లాల్లో ప్రబలిన వ్యాధులను ప్రస్తావిస్తున్నారని, ఇది సరికాదని పేర్కొన్నారు. దీంతో హరీశ్‌రావు తీరును కాంగ్రెస్ సభ్యులు తప్పుబట్టడంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం కూడా పలువురు సభ్యులు ఇదే తీరులో ప్రశ్నలు సంధిస్తుండటంతో స్పీకర్ వారి మైక్ కట్ చేశారు. బోదకాలు బాధితులకు పింఛన్లు: లక్ష్మారెడ్డి రాష్ట్రంలో బోదకాలు (పైలేరియా)ను శాశ్వతంగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఆ వ్యాధి లక్షణాలున్న వారికి, వ్యాధి సోకిన వారికి మందులు అందజేస్తున్నామన్నారు. బోదకాలు సోకి అంగవైకల్యం వచ్చిన వారికి పింఛన్లు ఇవ్వాలని శాసనసభ్యులు కోరిన నేపథ్యంలో.. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు, పైలేరియాను పూర్తిగా అరికట్టామని తెలిపారు. -
‘కాంగ్రెస్ నేతలు ఒత్తిడిలో ఉన్నారు’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు ఒక రకమైన ఒత్తిడిలో ఉన్నారని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మొదటిరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహర శైలిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా అనంతరం ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘సభ సజావుగా సాగేందుకు సహకరించాలని డిప్యూటీ స్పీకర్ విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్ సభ్యులు వినలేదు. చర్చకంటే రచ్చకే కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రైతులు ఆనందంగా ఉంటే కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రైతు సమస్యలపై చర్చించే సత్తా వారికి లేదు. అందుకు రైతుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదు. సభ సజావుగా జరుగుతుంటే కాంగ్రెస్ సభ్యులు ఎందుకు పోడియంలోకి వచ్చి సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే సభలో మిగతా ఏ పార్టీలు కూడా కాంగ్రెస్‌ను పట్టించుకోలేదు. దీంతో ఆ పార్టీ ఏకాకిగా మారిపోయింది. ఏ అంశం మీదైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే సభలో గందరగోళం సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తాం.’ అని స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ నేతలు సెల్ప్ గోల్ కొట్టుకున్నారు..
-
రైతుల ఆత్మహత్యలు కొనసాగాలా?
► ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు: హరీశ్‌రావు ► ప్రజాభిప్రాయ సేకరణకు ఆటంకం కలిగిస్తున్నారు సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగాలని కాంగ్రెస్ నాయ కులు కోరుకుంటున్నారా? రైతుల ఆత్మహ త్యలకు అడ్డుకట్ట వేసేందుకు, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను చేపడుతుంటే.. ఆ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు.. ట్రిబ్యునళ్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆటంకం కలిగిస్తు న్నారు. ఇటు ప్రజాభిప్రాయ సేకరణను విచ్చిన్నం చేసే చర్యలకు పాల్పడుతున్నారు..’’ అని సాగునీటిశాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా కాంగ్రెస్ మాజీ మంత్రి శ్రీధర్‌బాబు పెద్దపల్లిలో చేసిన దాదాగిరీని, రౌడీయిజాన్ని.. ఆ పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ సమర్థించడం విడ్డూరమని పేర్కొన్నారు. ఈ మేరకు హరీశ్ రావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు 11 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ సజావుగా ముగిసిందని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రాజె క్టుకు అనుకూలంగా ఉన్నట్టు ప్రజలు స్పష్టం చేశారని, వేగంగా పూర్తి చేయాలని కూడా కోరారని వివరించారు. ప్రజలు, రైతులు, రాజకీయ పక్షాల ప్రతినిధులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే వాతావరణాన్ని కల్పించినా.. కాంగ్రెస్ పార్టీ చౌకబారు ప్రచారం కోసం ప్రయత్నిస్తోందని విమర్శించారు. అడ్డుకోవడానికి కుట్రలు ప్రాజెక్టులను అడ్డుకోవడమే ఏకైక ఎజెండాగా పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజాభి ప్రాయ సేకరణ ప్రక్రియ ఇష్టం లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. పెద్దపల్లిలో ప్రజాభి ప్రాయ సేకరణను భగ్నం చేయడానికి శ్రీధర్‌బాబు ప్రయత్నించారన్నారు. అందువల్లే పోలీసులు అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణ వేదికను రాజకీయం చేయడానికి ప్రయత్నిం చారని విమర్శించారు. అసలు ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన అన్ని జిల్లాల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం తదితర పార్టీల నేతలు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారని.. మెదక్‌లో కాంగ్రెస్ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా మాట్లాడారన్నారు. మరోవైపు నిబంధన లకు విరుద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందంటూ కేంద్రానికి కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఫిర్యాదు చెయ్యడం కూడా కుట్రలో భాగమేనన్నారు. ఇలా ప్రాజెక్టును అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రలపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని తెలంగాణవాదులు, ప్రజలు, రైతులకు పిలుపునిచ్చారు. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ పడరాని పాట్లు పడుతోందని... ఆ చిట్టా విప్పితే ఆశ్చర్యం కలుగుతుందని హరీశ్ పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రక్రియను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిందని.. తమ్మిడిహెట్టి నుంచే నీటిని తరలించాలంటూ మొండి వాదన చేసిందని, మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను పట్టించుకోలేదని వివరించారు. మహారాష్ట్రతో గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై ప్రాజెక్టుల నిర్మాణానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని స్వాగతించలేక అక్కసుతో విమర్శలు చేసిందని మండిపడ్డారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో టెంట్లు వేసి, కార్యకర్తలను బయటి నుంచి తరలించి ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. కాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్లు వేసి జీవో 123 అమలుపై స్టే తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో భూసేకరణ మందగించి పనులు జాప్యమయ్యాయన్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే 30కి పైగా పిటిషన్లు వేశారని, పాలమూరు, డిండి ప్రాజెక్టులపైనా కేసులు వేశారని పేర్కొన్నారు. చివరకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి ప్రాజెక్టులకు అడ్డుపడ్డారని హరీశ్ మండిపడ్డారు. -
సరైన వాదనలు లేకనే పెండింగ్ కేసులు
► అపరిష్కృత కేసులతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం: హరీశ్ ► ప్రాజెక్టుల నిర్మాణంలో న్యాయపర చిక్కులు త్వరగా అధిగమించాలని సూచన సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన కేసుల్లో సమర్థవంతమైన వాదనలు లేకపోవడంతోనే ఈ కేసులు కోర్టుల్లో సుదీర్ఘకాలం కొనసాగుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఏళ్లతరబడి ఈ కేసులు అపరిష్కృతంగా ఉండటంతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతోందని.. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలన్నారు. శనివారం జలసౌధలో ప్రభుత్వ న్యాయవాదులు, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి న్యాయపరమైన చిక్కులను త్వరగా అధిగమించాలని కోరారు. జిల్లాల్లోని వివిధ కోర్టు కేసుల్లో ప్రభుత్వం తరఫున సమర్థవంతంగా వాదించేందుకు హైదారాబాద్, ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదులను నియమించుకోవాలని సూచించారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలను నివారించడానికి సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు. దేవాదుల, ఏ.ఎం.ఆర్.పి, కల్వకుర్తి తదితర ప్రాజెక్టుల్లో పలు చోట్ల పది, ఇరవై ఎకరాల భూసేకరణ సమస్యలు కోర్టు కేసుల్లో చిక్కుకున్న కారణంగా వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించలేకపోతున్నట్టు మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మిడ్ మానేరు ప్రాజెక్టు వ్యయం రూ.400 కోట్లు కాగా పరిహారం చెల్లింపుల కోసం ఏకంగా రూ.1,400 కోట్లు ఖర్చు చేయవలసి వచ్చిందన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, లా కార్యదర్శి నిరంజన్ రావు, ఈఎన్సీ మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.