
ప్రజలే వారికి బుద్ధి చెబుతారు: హరీశ్ రావు
తెలంగాణ ఆత్మగౌరవంను దెబ్బతీసేలా సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం వ్యవహరిస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
హైదరాబాద్ : తెలంగాణ ఆత్మగౌరవంను దెబ్బతీసేలా సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం వ్యవహరిస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. నాడు తెలంగాణను అడ్డుకోవడానకి యత్నించి, నేడు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు.
అసెంబ్లీలో సున్నం రాజయ్యది వన్ మ్యాన్ షో అయితే మహాజన పాదయాత్రలో తమ్మినేనిది వన్ మ్యాన్ షో అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ప్రజలే వారికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.