
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే చర్యలకు వ్యతిరేకంగా భారత్ అంబేడ్కర్ మహాసభ పిలుపిచ్చిన ఆగస్టు 9న బంద్‌కు సీపీఎం మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటనలో తెలిపారు. 70 ఏళ్ల స్వాతంత్య్రానంతరం కూడా కుల వివక్ష, అంటరానితనం యథేచ్ఛగా కొనసాగటం సభ్య సమాజానికి మాయని మచ్చగా ఉందన్నారు.
దేశవ్యాప్త నిరసనల తర్వాత కేంద్రం ఆలస్యంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చడంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో గోరక్షక దళాల ముసుగులో అరాచక శక్తుల దాడులు, దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. దళిత సమస్యలపై జరుగుతున్న బంద్‌కు సీపీఎం సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment