సాక్షి,నల్గొండజిల్లా: ాన్యం సకాలంలో కొనుగోలు చేయక రైతులను ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.నల్గొండ జిల్లాలోని మర్రిగూడలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని హరీశ్‌రావు బుధవారం(నవంబర్ 13) పరిశీలించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ‘రైతులు రూ.1800లకు క్వింటాల్ చొప్పున ధాన్యం దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. రైతుల ధాన్యం లోడ్ ఎత్తమంటే మహారాష్ట్రకు నోట్ల కట్టల లోడ్ ఎత్తుతున్నాడు ముఖ్యమంత్రి. ధాన్యానికి మద్దతుధర వస్తలేదని రైతులు మిర్యాలగూడలో రాస్తారోకో చేశారు.
కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా తరుగు పేరుతో రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు.ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో ఒక కిలో సన్న ధాన్యాన్ని కొనలేదు.ముఖ్యమంత్రికి మద్యం అమ్మకంపై ప్రేమ ఎక్కువైంది.మందు తక్కువ అమ్మిన ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇస్తున్నారు.25 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లకు మెమో జారీ చేశారు.తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు.
మహిళల పుస్తెలు తెంపుతున్నారు.రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని ప్రభుత్వం ప్రకటించింది.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదు.యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేసావ్.
రేవంత్‌రెడ్డి రాజ్యంలో రైతులు దుఃఖపడుతున్నాడు.ధాన్యం కొనుగోలులోనే కాదు పత్తి కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 15000 రూపాయల రైతుబంధు రైతులకు వెంటనే ఇవ్వాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే: మంత్రి కోమటిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment