దేవినేని ఉమకు హరీశ్ రావు ఫోన్ | Minister harish rao phone call to devineni uma over projects | Sakshi
Sakshi News home page

దేవినేని ఉమకు హరీశ్ రావు ఫోన్

Published Wed, May 4 2016 12:36 PM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

దేవినేని ఉమకు హరీశ్ రావు ఫోన్

దేవినేని ఉమకు హరీశ్ రావు ఫోన్

హైదరాబాద్ : నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న అనిశ్చితికి తెర దించేందుకు ఏపీ సర్కార్తో చర్చించాలని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఫోన్ కాల్ చేశారు.

నీటి పారుదల ప్రాజెక్టులపై చర్చించేందుకు సమావేశం అవుదామని ఈ సందర్భంగా హరీశ్ కోరారు. ఆర్డీఎస్తో పాటు తెలంగాణ నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించుకుందామని సూచించారు. అందుకు మంత్రి దేవినేని ఉమ కూడా అంగీకారం తెలిపారు. సమావేశం ఏర్పాటు చేయాలని హరీశ్కు దేవినేని ఉమ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement