సాక్షి,హైదరాబాద్:ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇది ప్రజాపాలన కాదు,నిర్బంధ పాలన అన్నారు. ఈ విషయమై హరీశ్‌రావు సోమవారం(జనవరి20) మీడియాతో మాట్లాడారు.
‘ఆంక్షలు,కంచెలు,అరెస్టులు,నిర్బంధాలు రేవంత్ పాలనలో నిత్యకృత్యమయ్యాయి. అరెస్టు చేసిన ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నాగర్ కర్నూల్ జిల్లా,మైలారంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన హరగోపాల్‌ను అరెస్టు చేయడం అమానుషం.దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా పాలన,ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటూ గప్పాలు కొట్టి,ఇప్పుడు ప్రజల తరుపున పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల గొంతులు నొక్కడం అమానుషం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ..ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజా పాలన. ఇందిరమ్మ రాజ్యమని చెప్పిన మీరు కంచెలు,ఆంక్షలు,అరెస్టులతో నాటి ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారు. మీ సొంత జిల్లాలోనే ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటే,రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.మైలారంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?ప్రొఫెసర్ హరగోపాల్ సహా అరెస్టులు చేసిన ప్రజా సంఘాల నాయకులను తక్షణం విడుదల చేయాలి’అని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment