Haragopal
-
ఇదేనా సో కాల్డ్ ప్రజాపాలన: హరీశ్‌రావు సెటైర్లు
సాక్షి,హైదరాబాద్:ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇది ప్రజాపాలన కాదు,నిర్బంధ పాలన అన్నారు. ఈ విషయమై హరీశ్‌రావు సోమవారం(జనవరి20) మీడియాతో మాట్లాడారు.‘ఆంక్షలు,కంచెలు,అరెస్టులు,నిర్బంధాలు రేవంత్ పాలనలో నిత్యకృత్యమయ్యాయి. అరెస్టు చేసిన ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నాగర్ కర్నూల్ జిల్లా,మైలారంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన హరగోపాల్‌ను అరెస్టు చేయడం అమానుషం.దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా పాలన,ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటూ గప్పాలు కొట్టి,ఇప్పుడు ప్రజల తరుపున పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల గొంతులు నొక్కడం అమానుషం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ..ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజా పాలన. ఇందిరమ్మ రాజ్యమని చెప్పిన మీరు కంచెలు,ఆంక్షలు,అరెస్టులతో నాటి ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారు. మీ సొంత జిల్లాలోనే ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటే,రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.మైలారంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?ప్రొఫెసర్ హరగోపాల్ సహా అరెస్టులు చేసిన ప్రజా సంఘాల నాయకులను తక్షణం విడుదల చేయాలి’అని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అమరావతి పేరుతో మళ్లీ అదే తప్పు
కడప సెవెన్‌రోడ్స్: ‘నవ్యాంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో తెలంగాణ విడిపోయినప్పుడు రాజధానిని కోల్పోవాల్సి వచి్చంది. ఆ తర్వాత అమరావతిలోనే రాజధాని ఉండాలనే ఆ ప్రాంత వాసుల ఆకాంక్షల మేరకే చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేశారు. అయితే అమరావతిపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడమంటే తెలంగాణ విషయంలో చేసిన తప్పే మళ్లీ చేయడం. అభివృద్ధి అంతా ఒకేచోట పోగు వేయడం సరైంది కాదు. అభివృద్ధి కేంద్రీకరణ విషయంలో గతంలో ఉన్న న్యాయ భావన ఇప్పుడు లేదు. నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాక ఆ భావనకు తావు లేకుండాపోయింది. ఇప్పుడు అంతా సంపద సృష్టే తప్ప ప్రజలను పట్టించుకునే పరిస్థితులు లేవు’ అని ప్రొఫెసర్ జి.హరగోపాల్ కుండబద్దలు కొట్టారు. పౌరహక్కుల ఉద్యమ నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రొఫెసర్ హరగోపాల్ ఓ సదస్సులో పాల్గొనేందుకు వైఎస్సార్ జిల్లా కడపకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వెనుకబడ్డ రాయలసీమ సమగ్రాభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం కూడా బాగా వెనుకబడి ఉంటుందని, ఆ ప్రాంత అభివృద్ధి కోసం బడ్జెట్ అనుమతులు, నిర్వహణ వంటివి గవర్నరే చేపడతారని చెప్పారు. రాయలసీమకు కూడా అలాంటి పరిపాలనా ఏర్పాటు జరగాలన్నారు. ఒకప్పుడు తెలంగాణ అభివృద్ధి బోర్డు ఉండేదని, ఆ తర్వాత దాన్ని రద్దు చేశారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ డిమాండుకు ఇది కూడా ఓ కారణమైందని చెప్పారు. అలాంటివి పునరావృతం కాకుండా రాయలసీమ సమగ్రాభివృద్ధికి నీటి పారుదల, పరిశ్రమలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలు తెలియజేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి అవసరం ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి లేకుండా, సామాజిక న్యాయం జరగకుండా భాష ఒక్కటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేదన్న విషయం తెలంగాణ అనుభవం రుజువు చేసింది. అమరావతిలోనే అభివృద్ధి మొత్తం కేంద్రీకరించడం ద్వారా తెలంగాణ విషయంలో చేసిన తప్పే మళ్లీ చేస్తున్నారు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీలో వెనుకబడిన రాయలసీమకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ దిశగా కొంతమేరకు కృషి చేశారు. విదర్భ తరహాలో ఈ ప్రాంతానికి బడ్జెట్ కేటాయింపు కోసం ఒక పరిపాలనా ఏర్పాటు జరగాలి. అభివృద్ధినంతా ఒకే చోట పోగేయడం సరికాదు. ఒకసారి రాష్ట్ర విభజన జరిగినా, ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకోకుండా మళ్లీ అదే తప్పు చేయడం సమంజసం కాదు. ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అసమానతలు ఉన్నప్పుడు భావ సమైక్యత ఎలా ఉంటుంది? సామాజిక న్యాయం జరగకుండా భాష ఒక్కటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేదు. అందువల్లే ప్రాంతీయ అసమానతలు ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ కరువు పీడిత ప్రాంతం. ఉత్తరాంధ్రలో నీళ్లు ఉన్నా వెనుకబడి ఉంది. కోస్తాలో కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నా ఒకప్పుడు అది కరువు ప్రాంతంగా ఉండేది. కరువును పారదోలడం, వరదల ముప్పు తప్పించడం కోసం 1852లో సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్టలు నిర్మించడంతో ఆ ప్రాంతం సస్యశ్యామలమైంది.అక్కడి రైతులు వ్యవసాయంలో వచ్చిన అదనపు ఉత్పత్తిని మద్రాసులోని సినిమా రంగం, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టారు. అలా సంపద పెరుగుతూ ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. నదీ జలాల్లో వెనుకబడ్డ ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ అలా జరగకపోవడం ప్రాంతీయ అసమానతలను పెంచింది. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు ఉన్న రాజకీయ ప్రాబల్యం వెనుకబడ్డ ప్రాంతాలకు ఉండదు. అందుకే రాయలసీమకు చెందిన వారు ఎక్కువ మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ కోస్తాంధ్రుల ప్రాబల్యం వల్ల ఆ ప్రాంతానికే ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. విభజన అనుభవాలు మరువకముందే.. రాజకీయ ప్రాబల్యాన్ని అనుసరించే అభివృద్ధి నమూనా ఉంటోంది. రాష్ట్ర విభజన అనుభవాలు ఇంకా మరిచిపోకమునుపే మళ్లీ అవే తప్పులు మళ్లీ చేస్తున్నారు. ఇక్కడి నాయకులు కూడా ఈ ప్రాంత సమస్యలు పట్టించుకోవడం లేదు. వివిధ చారిత్రక, రాజకీయ కారణాలతో రాయలసీమలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి.గతంతో పోలిస్తే ఫ్యాక్షన్ ప్రభావం చాలా మేరకు తగ్గినప్పటికీ రక్షణ ఉండదని భావిస్తున్న ప్రజలు నేటికీ ఏదో ఒక నాయకుడి ప్రాబల్యం కింద ఉన్నారు. వీటి నుంచి బయట పడాల్సిన అవసరం ఉంది. చైతన్యవంతమైన ప్రజా ఉద్యమం ద్వారానే రాయలసీమకు న్యాయం జరుగుతుంది. సీమకు నదీ జలాల విషయంలో వైఎస్సార్ శ్రద్ధ రాయలసీమకు నదీ జలాలను మళ్లించే విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కొంతమేర కృషి చేయగలిగారనేదానిని కాదనలేం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వెడల్పు పనులు చేపట్టడంతో పాటు సీమ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. అయితే ఆయనపై కూడా అనేక ఒత్తిళ్లు వచ్చాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 290 కిలోమీటర్ల పరివాహక ప్రాంతమున్న కృష్ణా నీటిలో మా తెలంగాణ వాటా ఏమిటని మేము కూడా అడిగాం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరుగా జరుగుతున్న సందర్భంలో కృష్ణా జలాలు పునః పంపిణీ చేయాలని కోరారు. పునః పంపిణీకి కోస్తాంధ్ర వాళ్లు ససేమిరా ఒప్పుకోరన్న విషయం రాజకీయ పరిణితి చెందిన వైఎస్‌కు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల పంపిణీ అయిపోయిందని ఆయన మాతో అన్నారు. ఏది ఎలా ఉన్నా సీమకు నదీ జలాలు ఇచ్చే విషయంలో ఆయన శ్రద్ధ తీసుకున్నారు. కొన్ని త్యాగాలు తప్పవు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉన్నాయి. వీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతైనా సముచితం. అన్ని ప్రాంతాలు కలిసి ఉండాలనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు తప్పవు. కోస్తాంధ్రులు తమ నీటి వినియోగాన్ని కొంతమేర తగ్గించుకోవడానికి ఇష్టపడరు. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న విజన్ ఇప్పుడు ఎవరికి ఉంది? ఒక ప్రాంతం వెనుకబడి ఉండటానికి చారిత్రక, రాజకీయ కారణాలు ఉంటాయి. విధాన పరంగా, ఒత్తిడి లేకుండా ఒక ప్రాంత అభివృద్ధిని పట్టించుకునే పరిస్థితులు లేవు. -
నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వం నీట్ అవకతవకలపై సీబీఐతో కాకుండా సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిటీతో విచారణ జరిపించాలని పౌరహక్కుల నేత, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ జి.హరగోపాల్ డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందని నీట్లో జరిగిన అక్రమాలకు ఈ విద్యా విధానమే కారణమని ఆయన ఆరోపించారు. బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిటీ కార్యనిర్వాహక కార్య దర్శి ప్రొఫెసర్ కె.లక్ష్మీనారా యణ, ఉపాధ్యక్షుడు కె.నారాయణలతో కలిసి హరగోపాల్ మాట్లాడారు. నీట్ అక్రమాల వల్ల 24 లక్షలమంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, నీట్ పరీక్షలను పూర్తిగా రద్దు చేసి గతంలో మాదిరిగా వీటి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగస్టు 15లోగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, టీచర్ల కొరత వంటి సమస్యలను పరిష్కరించి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని సూచించారు. సమావేశంలో డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
AP: హరగోపాల్ భార్య శిరీష అరెస్టు
సాక్షి, అమరావతి: కుల నిర్మూలన పోరాట సమితి నేత దుడ్డు ప్రభాకర్‌తో పాటు దివంగత మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్(ఆర్కే) భార్య కందుల శిరీష అలియాస్ పద్మక్కను కూడా అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 2019లో ఛత్తీస్‌గఢ్‌లోని ట్రియ గ్రామంలో భద్రతా దళాలపై మావోయిస్టులు జరిపిన దాడి కేసులో వారిద్దరినీ అరెస్టు చేసినట్టు వెల్లడించింది. దీనిని ఆర్కే డైరీ కేసుగా ఎన్ఐఏ పరిగణిస్తోంది. శిరీష, దుడ్డు ప్రభాకర్‌తో పాటు ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. శిరీషను ప్రకాశం జిల్లా ఆలకూరపాడులోని ఆమె నివాసంలో, ప్రభాకర్‌ను విజయవాడలో ఆయన నివాసంలో ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల నుంచి నిధులు పొందుతూ.. ఆ పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు వీరిద్దరూ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని ఎన్ఐఏ తెలిపింది. మావోయిస్టు పార్టీ అనుబంధ విభాగాల పటిష్టత కోసం పనిచేస్తున్నారని పేర్కొంది. ఇది కూడా చదవండి: ఆంధ్రజ్యోతికి హైకోర్టులో చుక్కెదురు -
హరగోపాల్ పై ఉపా కేసు ఎత్తివేసిన తెలంగాణ ప్రభుత్వం
-
భువనగిరిలో వెలుగుచూసిన దాన శాసనం
సాక్షి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని గాందీనగర్‌లో అభివృద్ధి పనుల కోసం శనివారం చేపట్టిన తవ్వకాల్లో బయటపడిన పురాతన ఆలయ ఆనవాళ్లను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఆలయాన్ని శ్రీ వీరభద్రేశ్వర క్షేత్రంగా, తెలుగు శాసనాన్ని దాన శాసనంగా గుర్తించింది. దాన శాసనంపై చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఆదివారం వెల్లడించిన వివరాలివి. ఆచంద్రార్కం.. అంటే సూర్యచంద్రులు ఉన్నంతకాలం శ్రీవీరభద్రేశ్వర దేవరకు, గర్భగుడిలో నిర్వహించే పూజాదికాలు, ఇతర సేవల నిర్వహణకు వ్యాపారులు విక్రయించే సరుకులపై సుంకం వసూలు చేయాలని నిర్ణయించారు. దేవుని ధూపదీప నైవేద్యాలకు నిత్యం సోలెడు గానుగ నూనె ఉచితంగా ఇవ్వాలని భువనగిరికి చెందిన అష్టాదశ ప్రజలు (పద్దెనిమిది కులాలు) నిర్ణయించారు. భువనగిరి ప్రజలకు పుణ్యం కలిగేందుకు సుంకం ఇవ్వడానికి వ్యాపారులు, ఉచితంగా నూనె ఇవ్వడానికి అష్టాదశ ప్రజలు ముందుకొచ్చారు. దీనికోసం ఏర్పాటు చేసిందే దాన శాసనమని హరగోపాల్ వివరించారు. మహామండలేశ్వరుడైన కాకతీయ ప్రతాపరుద్ర దేవ మహారాజు పరిపాలనా కాలం శక సంవత్సరం 1240 కాళయుక్తి సంవత్సరం ఆషాడ శుద్ధ 15 పౌర్ణమి గురువారం (క్రీ.శ 1318 జూన్ 14న) దాన శాసనం వేసినట్లు హరగోపాల్ తెలిపారు. -
సోషల్ మీడియాకు బందీ కావొద్దు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి తరాన్ని స్మార్ట్ ఫోన్ నిర్వీర్యం చేస్తోందని.. సోషల్ మీడియా బందీగా మార్చిందని ప్రముఖ కవి, రచయిత, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో మునిగిపోయినప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నట్టే అనిపిస్తుందని.. కానీ ఏమీ తెలియకుండా పోతుందని చెప్పారు. శుక్రవారం ఆయన కాళోజీ నారాయణరావు స్మారక పురస్కరాన్ని అందుకున్నారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘నేను ఎనిమిదో తరగతి నుంచి కవిత్వం రాయడం అలవాటు చేసుకున్నా. అది నాలో ఆలోచనా శక్తిని ఉత్తేజపర్చింది. సమాజాన్ని అన్ని కోణాల్లో చూసే తత్వాన్ని కలిగించింది. అన్యాయం జరిగితే ప్రశ్నించడం, బాధితుల పక్షాన నిలదీయటం, ఎదిరించటం అలవాటు చేసింది. ఇప్పటితరంలో ఇది లోపించింది. రాయకున్నా కనీసం చదివే లక్షణమైనా ఉండాలి..’’ అని శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. భాషను ముందు తరాలకు అందించాలి తెలంగాణ భాషను రేపటి తరానికి పదిలంగా అందించాల్సిన బాధ్యత మనపై ఉందని.. అది రచనలతోనే ముందుకు సాగుతుందని శ్రీరామోజు హరగోపాల్ అన్నారు. ‘బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలని కాళోజీ చెప్తూ చేసి చూపించారని.. ఆ దిశగానే తానూ ముందుకు సాగానని చెప్పారు. తమ రచన సాహితీ కళావేదిక తొలి వార్షికోత్సవానికి కాళోజీ ముఖ్య అతిథిగా వచ్చి ఓ రోజంతా తమతో గడిపారని గుర్తు చేసుకున్నారు. సమాజంలో చోటుచేసుకునే పరిణామాలకు మనం స్పందించగలగాలని.. ఆ తత్వం మనసుకు ఉండాలని చెప్పారు. చాలా మందిలో ఈ తత్వం ఉన్నా దాన్ని గుర్తించరని.. రచనా వ్యాసంగం వైపు మళ్లినప్పుడు అది ఉత్తేజం పొందుతుందని తెలిపారు. సమాజాన్ని గమనించటం, పుస్తకాలు చదవడం మేధస్సుకు పదును పెడుతుందన్నారు. దీనిని నేటి తరం గుర్తించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వైతాళికులను గుర్తించి వారికి సముచిత గౌరవాన్ని కల్పిస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కాళోజీ జయంతిని అధికారికంగా నిర్వహించడంతోపాటు ఆ రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించిందని గుర్తు చేశారు. శుక్రవారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి శ్రీరామోజు హరగోపాల్‌కు కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, కవి గోరటి వెంకన్న, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరీశంకర్ పాల్గొన్నారు. – గన్‌ఫౌండ్రి ఇదీ చదవండి: పాన్ ఇండియా పార్టీ.. దరసరాకు విడుదల! -
విద్యాభివృద్ధితోనే సామాజిక ఎదుగుదల
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అన్ని వర్గాల వారిని ప్రోత్సహించి విద్యాభివృద్ధికి కృషి చేయడం ద్వారానే జ్ఞాన సముపార్జన జరిగి సామాజిక ఎదుగుదల సాధ్యమవుతుందని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ జయతీఘోష్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర తృతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సభలకు ముఖ్య అతిథిగా హాజరైన జయతీఘోష్ మాట్లాడుతూ.. కులం, మతం, లింగ ఆర్థిక విషయాల్లో పాలకులు ప్రజల్లో విభే దాలను సృష్టిస్తున్నారన్నారు. భిన్నత్వాన్ని నిర్వీ ర్యం చేసేందుకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భిన్నత్వాన్ని ప్రోత్సహించే యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలపై జరుగుతున్న దాడులే దీనికి కారణమన్నారు. హైదరాబాద్ తదితర యూనివర్సిటీల్లో జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వం చేయిస్తున్న దాడులకు నిదర్శనమని చెప్పారు. విద్యావ్యవస్థలో భయంకర పరిస్థితి: చుక్కా రామయ్య ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ..ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో విద్యావ్యవస్థలో భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. మనసులోని మాటను కూడా చెప్పలేని స్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ఛాందస భావాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గురుకులాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలన్నీ బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులంతా విద్యా వ్యవస్థను మెరుగుపర్చేలా పోరాడాలని కోరారు. ప్రతీ విద్యార్థిలో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలని, అందుకు తగిన విధంగా ఉపాధ్యాయుల బోధనలు ఉండాలని సూచించారు. రాజ్యాంగ లక్ష్యాలకు తూట్లు: ప్రొఫెసర్ నాగేశ్వర్, హరగోపాల్ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ..రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అదే రాజ్యాంగ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ..పాఠశాలల్లో ఆట స్థలాలే ఏర్పాటు చేయని దేశంలో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, చావా రవి, ఉపాధ్యక్షురాలు దుర్గాభవాని, బి.నర్సింహారావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగమల్లేశ్వరరావు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘మహబూబ్‌నగర్ ప్రజా ఎజెండా’ విడుదల
హైదరాబాద్: అత్యంత వెనుకబడిన జిల్లా పాలమూరుకు తెలంగాణ వచ్చాక న్యాయం జరుగుతుందని భావించామని, కాని పాలకులు నిరాశకు గురిచేశారని పాలమూరు అధ్యయన వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలమూరు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వారికి ఏం కావాలి వంటి అంశాలతో పాలమూరు అధ్యయన వేదిక ‘మహబూబ్‌నగర్ ప్రజా ఎజెండా’ను రూపొందించింది. దీనిని బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాలమూరులో కృష్ణానది 300 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్నా, తుంగభద్ర లాంటి రెండు జీవనదులు ఉన్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ నీరు లేకపోవడమే కాకుండా, జోగినీ వ్యవస్థ, అనారోగ్య సమస్యలు, విద్యా వ్యవస్థ సరిగా లేకపోవడం, పరిశ్రమలు లేకపోవడం వంటి వాటి వల్ల వెనుకబడిన జిల్లాగా మారిందన్నారు. ఎన్నికల సమయంలో పాలమూరు సమస్యను అన్ని పార్టీల దృష్టికి తీసుకెళ్లేందుకు, ఓట్ల కోసం వచ్చేవారికి అక్కడి ప్రజలు ప్రశ్నించేందుకు ఈ ఎజెండాను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేదిక కన్వీనర్ రాఘవాచారి, మల్లయ్య, ప్రొఫెసర్ వనమాల, ఎ.రాజేంద్రబాబు, మోహన్‌సింగ్ పాల్గొన్నారు. -
ప్రైవేట్ విద్య నాగరికతకే ప్రమాదం
విశ్లేషణ విద్యారంగానికి పునాది, మూలస్తంభం పాఠశాల విద్య. కేజీ టు పీజీ అని కేసీఆర్ అన్నప్పుడు స్కూల్ విద్య పూర్వవైభవాన్ని పొందుతుందని ఆశించాం. విద్యారంగం ప్రక్షాళన చెంది ప్రభుత్వ పాఠశాలలు కొత్త భవనాలతో, అన్ని ఆధునిక హంగులతో అర్హులైన ఉపాధ్యాయినీఉపాధ్యాయులతో కళకళలాడుతాయని అనుకున్నాం. కార్పొరేటు స్కూళ్లను రద్దుచేసి లేదా ప్రభుత్వపరం చేసి, ప్రభుత్వ స్కూళ్లను పరిపుష్టం చేస్తారని భావించాం. ఇవేవీ జరగలేదు. గత నాలుగేళ్లలో కార్పొరేటు స్కూళ్ల సంఖ్య పెరిగిందే తప్ప తరగలేదు. ప్రైవేటు స్కూళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్య ప్రైవేటీకరణ మానవ నాగరికత పరిణామానికే ప్రమాదం అని మనందరం గ్రహించాలి. విద్యను ప్రభుత్వరంగం నుంచి తప్పించి ప్రైవేట్‌పరం చేయడం ప్రపంచీకరణలో భాగం. దేశ వ్యాప్తంగా ఈ ధోరణి ప్రబలిపోయిన నేపథ్యంలో తెలంగాణలో కేజీ టు పీజీ దాకా ఉచిత విద్య అనే భావనను ప్రవేశపెట్టడం నిజంగానే సాహసోపేతమైన చర్య. ఇది విద్యను సంపూర్ణంగా ప్రభుత్వరంగంలోకి తీసుకువచ్చే చర్య. అయితే ప్రభుత్వ విద్యకు జీవం పోసే కొత్త ప్రయోగం అనుకున్న కేజీ టు పీజీ భావన వాస్తవానికి ప్రభుత్వ విద్యను కళకళలాడించటానికి బదులుగా కార్పొరేట్ విద్యను, ప్రైవేట్ స్కూళ్లను పెంచడానికే ఉపయోగ పడింది. ప్రభుత్వ విద్యకు పట్టం కట్టాలని తెలంగాణలో విద్యాపోరాట యాత్రను మొదలెడితే వేలాదిమంది విద్యార్థులను, అధ్యాపకులను అరెస్టు చేశారు. ప్రభుత్వ విద్యకు పట్టం కట్టడం అనేది సమానత్వ భావనకు, ప్రజాస్వామ్య భవి ష్యత్తుకు, నాగరికత ముందుకు పోవడానికి, సామాజిక పరిణామానికి సంబంధించిన సమస్య. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అంటే 2014లో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ విద్యాపోరాట యాత్రను అప్పట్లో పదిజిల్లాల్లో నిర్వహించింది. తెలంగాణ ఉద్యమకాలంలోనే టీఆర్ఎస్ పార్టీ నేత కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య అనే నినాదాన్ని ఇవ్వడమే కాక దానిని గత ఎన్నికల్లో తమ మేనిఫెస్టోలో కూడా చేర్చారు. రాజకీయ అర్థశాస్త్రం తెలిసిన వారికెవ్వరికైనా ఇపుడున్న పరిస్థితిలో విద్య సంపూర్ణంగా ప్రభుత్వ రంగంలోకి తీసుకురావడం అనేది చాలా సాహసోపేతమైన చర్య. ఆయన వాగ్దానాన్ని అందరం ఆహ్వానించాలి. వాస్తవానికి నూతన ఆర్థిక వ్యవస్థ పుణ్యమా అని సేవారంగం వ్యాపారీకరణ చెందిన నేపధ్యంలో ప్రభుత్వ సేవలను ఉచితంగా అందించటం అనేది ప్రపంచీకరణ విధానంలో ఇమడదు. సేవలను వ్యాపారీకరించి వాటిని ప్రపంచ వ్యాప్తంగా అమ్మడం అమెరికా అవసరంగా మారింది. ఇందులో విద్యారంగం చిక్కుకుపోయింది. ఆయా దేశాల్లోని సేవారంగాలను ప్రైవేటీకరించాలని అంతర్జాతీయ ద్రవ్యసంస్థల ద్వారా ఒత్తిడిపెట్టి, ప్రైవేటీకరణ, ఉదారీకరణ, ప్రపంచీకరణను ప్రోత్సహించారు. అందుకే మన దేశంలో 1980ల వరకు ప్రభుత్వ రంగంలో ప్రధానంగా ఉన్న విద్యను తర్వాత ప్రైవేటీకరించడం ప్రారంభమైంది. అంతర్జాతీయ పెట్టుబడిని ఈ రంగంలోకి ఆహ్వానించడం కూడా అప్పుడే ప్రారంభమైంది. దీంతో భారత రాజ్యాంగపు ఆదేశిక సూత్రాలను కూడా కాదని విద్యారంగంలో ప్రైవేట్ పెట్టుబడులను అనుమతించారు. లాభాలు చేసుకోవడానికి విద్య సులువైన మార్గాన్ని తెరిచింది. దాని పేరిట ఇంజనీరింగ్ కాలేజీలో పుట్టగొడుగులుగా పుట్టుకొచ్చాయి. ఈ ప్రైవేటీకరణ సునామీలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రభాగాన ఉండేది. మొత్తం 700 నుంచి 800 ఇంజనీరింగ్ కాలేజీలు 4 మాత్రమే ప్రభుత్వం రంగంలో ఉన్నాయి. ఇంజనీరు కావాలని ప్రతి యువతీయువకుడికి కోరిక కలిగింది. ఈ విద్య మొదట సంపన్న కుటుంబాలకు చెందిన యువతీయువకులకు చేరితే తర్వాత మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి అంటే వెనుకబడిన తరగతులు.. అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్ కుటుంబాలకు చెందిన పిల్లలు అందిపుచ్చుకున్నారు. కానీ వీరి తల్లిదండ్రులకు మాత్రం ప్రైవేట్ కాలేజీలలో ఫీజులు భరించే పరిస్థితి లేదు. బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం ఒక మార్గం. అయితే ప్రభుత్వమే రీయింబర్స్మెంట్ పేరిట కోట్లాది రూపాయలను ఈ కాలేజీలకు ఇచ్చే ఒక కొత్త పద్ధతి రావడంతో ప్రభుత్వ రంగ విద్య మీద చేయవలసిన ఖర్చును ప్రైవేట్ రంగానికి పీపీపీ అనే పేరుతో తరలించడం ప్రారంభమైంది. దీంతో ప్రైవేట్ రంగానికి విశ్వవిద్యాలయాల మీద కన్నుపడి అది ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు దారులు తెరి చింది. వీటిలో ఫీజులు లక్షల రూపాయలు కావడంతో తల్లిదండ్రులు అప్పులు చేయడంతోపాటు నానా చాకిరీ చేసి తమ కష్టార్జితాన్ని ప్రైవేట్ పాలు చేసే ఒక పాడు సంప్రదాయం ప్రారంభమయింది. ఇలా లక్షలు, కోట్లు ఫీజులు కట్టి చదువుకొన్న యువతీయువకులు వ్యాపారస్తుల్లా మారతారే తప్ప సామాజిక స్పృహ కలిగిన బాధ్యతాయుత పౌరులుగా ఎదగరు. దేశంలో అవినీతి పెరిగిందని గగ్గోలు పెట్టే వాళ్లకు, అవినీతి వ్యతిరేక పోరాటం చేపట్టిన అన్నాహజారేకు ఈ సంక్లిష్టత అర్థం కాలేదు. ఎంతసేపటికీ లోక్‌పాల్ వ్యవస్థను స్థాపిస్తే అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని అమాయకంగా ఆలోచించాడు తప్ప, అవినీతి మూలాలు మనం తయారు చేసే విద్యాప్రక్రియలో కూడా ఉంటాయనే విషయాన్ని ఆలోచించలేదు. విద్య ప్రైవేటీకరణ మానవ నాగరికత పరిణామానికే ప్రమా దమని అర్థం చేసుకుంటే తప్ప విద్యా పోరాట ఉద్దేశం అర్థం కాదు. విద్యారంగానికి పునాది, మూలస్తంభం పాఠశాలవిద్య. కేసీఆర్ కేజీ టు పీజీ అన్నప్పుడు స్కూల్ విద్య పూర్వ వైభవాన్ని పొందుతుందని ఆశించాం. విద్యారంగం ప్రక్షాళన చెంది ప్రభుత్వ పాఠశాలలు కొత్త భవనాలతో, అన్ని ఆధునిక హంగులతో సరిపోయినంతమంది అర్హులైన ఉపాధ్యాయినీఉపాధ్యాయులతో కళకళలాడుతాయని అనుకున్నాం. కార్పొరేటు స్కూళ్లను రద్దుచేసి లేదా ప్రభుత్వపరం చేసి ప్రైవేటు స్కూళ్లను నియంత్రించి, ప్రభుత్వ స్కూళ్లను పరిపుష్టం చేస్తారని భావించాం. ఇవేవీ జరగలేదు. గత నాలుగు ఏళ్లలో కార్పొరేటు స్కూళ్ల సంఖ్య పెరి గిందే తప్ప తరగలేదు. ప్రైవేటు స్కూళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫీజులు విపరీతంగా పెరగడంతో తల్లిదండ్రులు ఫీజుల తగ్గింపు కోసం ఉద్యమించి ప్రభుత్వం ఒక కమిటీని నియమించేలా ఒత్తిడి పెట్టారు. ఈ కమిటీ తల్లిదండ్రుల వైపునుంచి కాక యాజమాన్యాల తరఫున ఆలోచించి, ఫీజులు నియంత్రించే బదులు వాటిని కొంత పెంచాలని సూచిం చారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విశ్వాసం తగ్గి మరోవైపు ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు సతమతమౌతున్నారు. ఈ పరి స్థితిలో దిగువ మధ్యతరగతి పడుతున్న బాధ వర్ణించడం కష్టం. విద్యా పరిరక్షణ కమిటీ అలాగే అఖిల భారత విద్యా హక్కు ఫోరం కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని రాజీలేని పోరాటం చేస్తున్నది. ఆర్థికంగా, సామాజికంగా అంతరాలున్న సమాజంలో ఒక ఆవాస ప్రాంతంలోని పిల్లలందరూ ఒకే స్కూలుకు వెళ్లడం వలన పిల్లల మధ్య పరస్పర అవగాహనే కాక కొఠారి కమిషన్ చెప్పినట్లు సంపన్నుల పిల్లలకు పేదలపట్ల ఏర్పడే సానుభూతి అలాగే పేద పిల్లలకు సంపన్నుల పట్ల ఏర్పడే సానుకూల దృక్పథంవల్ల పేదరికం, సంపద సహజీవనం చేయడానికి పరోక్షంగా తోడ్పడుతుంది. వర్గ సమాజంలో ఇంత దూరదృష్టితో సలహా ఇవ్వడం సంపన్నులకు ఎంతో శ్రేయోదాయకం. కానీ దూరదృష్టి కోల్పోయిన పాలక వర్గానికి కొఠారి ప్రతిపాదనలోని అంతరార్థం పూర్తిగా అవగాహన కాలేదు. కామన్ స్కూల్ స్థానంలో తెలంగాణలో గురుకుల స్కూళ్లను తెరిచారు. గురుకుల స్కూళ్లకు డిమాండ్ బాగానే పెరిగింది. దాదాపు రెండు, రెండున్నర లక్షలమంది పిల్లలు స్కూళ్లలో చేరారు. మొత్తం 60 లక్షల మంది పిల్లల్లో ఒక్క శాతం మందికి నాణ్యమైన విద్య ఇస్తే సరిపోతుందా? మరి మిగతా పిల్లల సంగతేమిటి అనే ప్రశ్న గురించి గతంలోనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అఖిల భారత విద్యా హక్కు పోరాట వేదిక వంద రోజుల పోరాట యాత్రకు పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు తెలం గాణ విద్యా పరిరక్షణ కమిటీ మొత్తం 15 డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా 14 నుంచి డిసెంబర్ 6 వరకు నిర్వహించాలని తలపెట్టింది. ఈ ఉద్యమానికి పోలీసులు అడ్డం వస్తారని ఊహించలేదు. ఇది పోలీసు పిల్లలకు కూడా సంబంధించిన సమస్య. ఈ నెల 14న విద్యా పరిరక్షణ కమిటీ గన్ పార్క్‌లోని అమరవీరుల స్తూపం దగ్గర ప్రారంభించడానికి నిర్ణయించి ఆ మేరకు సంబంధిత పోలీసు కమిషనర్ ఆఫీసుకు ఒక వారం ముందే సమాచారం ఇవ్వడానికి వెళితే సంబంధిత సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు కూడా సమాచారం ఇవ్వమని కమిషనర్ ఆఫీసు ఇచ్చిన సలహా మేరకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు ఈ యాత్రకు అభ్యంతరం చెప్పరని, చెప్పలేదని భావించి పరిరక్షణ కమిటీ సభ్య సంఘాల బాధ్యులుగా సమావేశమయ్యాం. అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అది రొటీన్ వ్యవహారం అని భావించి పోరాట యాత్రలో ప్రారంభ ఉపన్యాసం చుక్కా రామయ్యకు ఇచ్చారు. ఆ తర్వాత నేను ప్రొ‘‘ చక్రధర్ రావు, ప్రొ‘‘ లక్ష్మీనారాయణ మాట్లాడిన తర్వాత పీఓడబ్ల్యూ సంధ్య, సాంబశివరావుగారు మాట్లాడుతున్నప్పుడు కొంత పోలీసు హడావుడి ప్రారంభమయ్యింది. ఎవరో వచ్చి అరెస్టులు చేస్తారని చెబితే నేను నమ్మలేదు. విద్యా పోరాట యాత్రకు అదీ ఇంత శాంతియుతంగా జరుగుతున్న సమావేశాన్ని ఎందుకు అడ్డుకుంటారని భావించాం. అంతలో ఒక పోలీసు అధికారి నన్ను పోలీసు వాహనంలో కూర్చోమని చెప్పడంతో నేను అటువైపు నడుస్తున్నప్పుడు విద్యార్థులు, కార్యకర్తలు అడ్డుకొనడంతో పోలీసులు బలప్రయోగం ప్రారంభించారు. దీన్ని ఊహించలేదు. తెరాస పార్టీ నాలుగు ఏళ్ల పాలనలో ఎంత మారిందో ఊహించు కుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరగడానికి ఇతర కారణాలతో బాటు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్న నిర్బంధం ఒక ప్రధాన కారణం. ఉద్యమాల ద్వారా వచ్చిన తెలంగాణ రాజకీయ నాయకులకు కొన్ని ప్రజాస్వామ్య విలువలుంటాయని అనుకున్నాను. కానీ పాలకులు మారలేదు. పోలీసులు మారలేదు. పోరాటయాత్రను భగ్నం చేయడం దిగజారుతున్న ప్రజాస్వామ్య విలువలకు పరాకాష్ట. విద్యా పోరాట యాత్రలో ప్రజలు విస్తృతంగా పాల్గొనాలి. ఇది మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిందే కాదు, తెలంగాణ రాష్ట్రానికే సంబంధించిన సమస్య కాదు. ఇది దేశంలో సమానత్వ భావనకు, ప్రజాస్వామ్య భవిష్యత్తుకు, నాగరికత ముందుకుపోవడానికి, సామాజిక పరిణామానికి సంబంధించిన సమస్య. వ్యాసకర్త ప్రొఫెసర్ జి. హరగోపాల్ విజిటింగ్ ప్రొఫెసర్, ఎన్ఎల్ఎస్ఐయు, బెంగళూరు ఈమెయిల్ : profharagopal@gmail.com -
‘ప్రజాభీష్టం మేరకే పాలకులు నడుచుకోవాలి’
షాద్‌నగర్: ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల అభీష్టం మేరకు పాలకులు నడుచుకోవాలని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామాన్ని మండలంగా ప్రకటించాలంటూ గ్రామస్తులు చేపట్టిన రిలే దీక్షలు 18వ రోజుకు చేరాయి. ఈ దీక్షకు సంఘీభావం కోదండరామ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలు, మండలాల విభజన శాస్త్రీయ పద్ధ్దతిలో జరగాలన్నారు. ఆయా ప్రాంతాల పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే విభజన చేయాలన్నారు. లేని పక్షంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. ఫరూఖ్‌నగర్ మండలాన్ని రెండుగా చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఏ ప్రమాణాలు పాటించి మండలాలను ఏర్పాటు చేశారో ముఖ్యమంత్రి వెల్లడించాలని కోరారు. మొగిలిగిద్దను మండలంగా ప్రకటించకపోవడానికి గల కారణాలను కూడా ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ఉందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చకు పిలిస్తే తాను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. -
జీఎస్టీతో విద్యారంగంపై ప్రభావం
దోమలగూడ: నాణ్యమైన విద్యను అందించాలనే ప్రజల అకాంక్షను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గత విద్యా విధానాన్నే అవలంబిస్తే తెలంగాణ సాధించుకుని ఏం లాభమని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధానకార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రభుత్వ బడుల మూసివేతను వ్యతిరేకిస్తూ, ‘రేషనలైజేషన్‌ను అడ్డుకుందాం.. విశ్వవిద్యాలయాలను కాపాడుకుందాం’ పేరుతో శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విద్యావిధానం కార్పొరేట్, సామ్రాజ్యవాద శక్తులకు ఊడిగం చేసేలా ఉందన్నారు. తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక టాక్స్ విధించి విద్యాభివృద్ధికి ఖర్చు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీఎస్టీ బిల్లు విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వ విద్యా బోధన సరిగా జరగదని కార్పొరేట్, మార్కెట్ శక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. వీసీలను నియమించకుండా, నిధులు ఇవ్వకుండా యూనివర్సిటీలను ధ్వంసం చేస్తున్నారని, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. రాష్ట్రంలో దాదాపు 12 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రొఫెసర్ కె చక్రధరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు నిధులు లేవంటున్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ప్రైవేట్ విద్యా సంస్థలను పోషిస్తుందన్నారు. ప్రభుత్వం ఆర్ధిక లావాదేవీలు జరిగే రంగాలనే ప్రోత్సాహిస్తుందని, విద్యరంగం బలోపేతం పట్ల నిబద్దత లేదని అన్నారు. కేంధ్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం పేరుతో ప్రైవేటీకరణను, విదేశీ సంస్థల పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు హిందూత్వ ఆలోచనలను రుద్దాలని చూస్తుందన్నారు. ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని, కామన్ స్కూలు విధానాన్ని తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
సాయిబాబాను అడ్డుకోవడం తగదు
- ప్రొఫెసర్ హరగోపాల్ సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు బేషరతు బెయిల్ పొందిన హక్కుల కార్యకర్త, సహాయ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను తిరిగి విధుల్లో చేర్చుకోకుండా రామ్‌లాల్ కళాశాల యాజమాన్యం అడ్డుకోవడాన్ని ‘కమిటీ ఫర్ డిఫెన్స్.. రిలీజ్ ఆఫ్ డాక్టర్ సాయిబాబా’ చైర్మన్ ప్రొఫెసర్ జి.హరగోపాల్, హనీబాబు ఎం.టీ మంగళవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. విధుల్లో చేరేందుకు అనుమతి కోరుతూ సాయిబాబా కళాశాల ప్రిన్సిపాల్‌కు లేఖ రాశారని... మహారాష్ట్రలో నమోదైన క్రిమినల్ కేసు పరిష్కారమయ్యే వరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందని ప్రిన్సిపాల్ బదులిచ్చారని వారు తెలిపారు. తదుపరి ఆదేశాల వరకు సాయిబాబా ప్రవేశంపై నిషేధం కొనసాగుతుందని పేర్కొనడం దారుణమన్నారు. అణచివేతకు గురైనవారి హక్కుల కోసం పోరాడుతున్న సాయిబాబాను నేరారోపణతో భయపెట్టేందుకు కళాశాల యాజమాన్యం ప్రయత్నించినట్లు లేఖలో వాడిన పరుష పదజాలం ద్వారా తెలుస్తోందన్నారు. -
'కోదండరామ్‌కు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి'
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రెండేళ్ళలో చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతున్న కోదండరామ్‌పై మంత్రులు ఎదురుదాడి చేయడం సరికాదని పొరహక్కుల సంఘం నేత హరగోపాల్ హితవు పలికారు. కోదండరామ్ చేసిన విమర్శల్లో వాస్తవాలను గ్రహించి లోపాలను సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం వ్యక్తిగత దూషణలకు దిగడం శోచనీయమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోదండరామ్‌పై మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. -
పునాదిలోనే పగుళ్లు
పాఠశాల విద్యలో నానాటికీ పెరుగుతున్న అంతరాలు ♦ సర్కారీ బడులు, ప్రైవేటు స్కూళ్లుగా చీలిక ♦ ఒక్కో స్కూల్లో ఒక్కో రకమైన బోధన ♦ సమాన విద్య కరువవడంతో సమాజంలో పెరుగుతున్న వ్యత్యాసం ♦ దేశంలో ‘కామన్ స్కూల్’ విధానం ఉండాలని యాభై ఏళ్ల కిందటే చెప్పిన కొఠారీ కమిషన్ ♦ కనీసం ఐదో తరగతి వరకైనా ఆ విధానం అమలు చేయాలి: చుక్కా రామయ్య ♦ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వారి పిల్లల్ని ♦ సర్కారు బడులకే పంపాలి: ప్రొఫెసర్ హరగోపాల్ ♦ చాలా దేశాల్లో పేద, ధనిక తేడా లేకుండా చదువులు సాక్షి, హైదరాబాద్: అందరికీ సమాన విద్య.. ఇది ప్రతి విద్యార్థి హక్కు! కానీ నేడు అది గగనమైపోయింది. చదువులు పేద, ధనికగా నిలువునా చీలిపోయాయి. బుడిబుడి నడకల బడి అడుగుల్లోనే విభజనకు బీజాలు పడుతున్నాయి. విద్యా విధానంలో ఈ అసమానతల పునాదులు, అశాస్త్రీయ విధానాలు క్రమేణా సమాజంలో అంతరాలకు దారితీస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రాథమిక విద్యను పూర్తిగా గాలికొదిలేసి.. ప్రైవేటుకు బాటలు పరచడంతో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఒక్కో స్కూల్లో ఒక్కో రకమైన విద్యా బోధన ఉండటంతో విద్యార్థుల సామర్థ్యాల్లో వ్యత్యాసం పెరిగిపోతోంది. ఇది చివరకు విద్యార్థుల్లో మానసిక ఒత్తిళ్లకు, అవాంఛనీయ పరిస్థితులకు దారితీస్తోందని నిపుణులు చెబుతున్నారు. అంతరాలకు ఆదిలోనే బీజం: అన్నివర్గాల పిల్లలకు సమాన విద్యావకాశాలు అందించాల్సిన ప్రభుత్వాలు ఆ బాధ్యతను విస్మరించడంతో.. కాస్త స్థోమత కలిగిన వారికి ప్రైవేటు స్కూళ్లు, పేద, బడుగు వర్గాలకు సర్కారీ బడులు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. చివరకు ప్రభుత్వ స్కూళ్లంటే అట్టడుగువర్గాలకే పరిమితం అన్న భావన నెలకొంది. చదువులకు పునాది పడే దశలోనే విద్యార్థుల మధ్య ఈ విభజన మొగ్గ తొడగడంతో అది పెరిగి పెద్దదై చివరకు సమాజంలో అంతరానికి దారితీస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఒక్క పాఠశాల విద్యనే తీసుకుంటే ప్రభుత్వ స్కూళ్లలో 29.84 లక్షల మంది, ప్రైవేటు స్కూళ్లలో 32.70 లక్షల మంది (ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 4,500 ప్రైవేటు స్కూళ్లలో 13 లక్షల మంది చదువుతున్నారు) చదువుతున్నారు. ఏటా ప్రభుత్వ స్కూళ్లలో లక్ష మంది విద్యార్థులు తగ్గిపోతుంటే.. ప్రైవేటు స్కూళ్లలో ఆ మేరకు పెరుగుతున్నారు. సమాన విద్య ఎందుకందడం లేదు? ప్రభుత్వ స్కూళ్లలో ఎన్నో రకాలు. మోడల్ స్కూళ్లు, సక్సెస్ స్కూళ్లు, బీసీ గురుకులాలు, గిరిజన గురుకులాలు, విద్యాశాఖ గురుకులాలు, మైనారిటీ గురుకులాలు.. ఇలా చాలానే ఉన్నాయి. వాటితోపాటు ప్రముఖుల పిల్లల కోసం పబ్లిక్ పాఠశాలలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్రీయ విద్యాలయాలు, గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం నవోదయ విద్యాలయాలున్నాయి. ఇవన్నీ మొత్తం స్కూళ్లలో 40 శాతం మాత్రమే. మిగతా 60 శాతం కనీస వసతులకు నోచుకోని ప్రభుత్వ, పురపాలక, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు. ఇక ప్రైవేటులో అరకొర వసతులు, ఓ మోస్తరు ఫీజులతో పేద, దిగువ మధ్యతరగతికి కొన్ని స్కూళ్లు అందుబాటులో ఉండగా, పేద, మధ్య తరగతి ప్రజలకు అందని ఖరీదైనవి స్కూళ్లు మరికొన్ని. ఇక మూడోరకం స్కూళ్లు లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేస్తూ పోటీ పరీక్షల కోసమే నడిచే కార్పొరేట్ స్కూళ్లు. ఇలాంటివి కొద్దిమంది స్థితిమంతులకే అందుబాటులో ఉన్నాయి. ఇలా ఎన్నో వైవిధ్యాలు, వైరుధ్యాలతో కూడిన విద్యాబోధన వల్ల పిల్లలకు సమాన విద్య అందడం లేదు. రెండింటా సమస్యలే.. ప్రభుత్వ స్కూళ్లను సక్రమంగా నడుపుతూ ప్రైవేటు స్కూళ్లను నియంత్రించాల్సిన విద్యాశాఖ తన బాధ్యతను గాలికొదిలేయడంతో సర్కారీ బడుల్లో నాణ్యత దెబ్బతింది. మౌలిక వసతుల లేమి, టీచర్ల కొరత.. బాధ్యతారాహిత్యం.. ఒక్కటేమిటి సవాలక్ష సమస్యలతో ప్రభుత్వ బడులు సతమతమవుతున్నాయి. అటు ప్రైవేటు పాఠశాలలపై అజామాయిషీ కరువవడంతో అవి కూడా ఇష్టారాజ్యంగా తయారయ్యాయి. ఆ స్కూళ్లకు ప్రభుత్వ విధానాలు పట్టవు. నిబంధనలు ఎన్నో ఉన్నా.. అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడే ఆటలు, పాటలు, వ్యాసరచన, వకృ్తత్వం వంటి సహ పాఠ్య కార్యక్రమాలైతే అమలుకే నోచుకోవు. కేవలం కొన్ని పేరున్న స్కూళ్లు మినహా మిగతా 90 శాతం ప్రైవేటు స్కూళ్లు కేవలం మార్కులు, ర్యాంకులే పరమావధిగా తయారయ్యాయి. విద్యార్థులను సమగ్ర వికాసానికి దూరం చేసి మర యంత్రాలుగా మార్చేస్తున్నాయి. ఫలితంగా అనేక మంది పిల్లల్లో సామాజిక స్పృహ కొరవడుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సమాన విద్య అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పాఠశాల విద్య అందరికీ సమానమే. కార్మికుల పిల్లలకు.. ఉన్నతాధికారుల బిడ్డలకు సమాన వసతులతో, ఒకే రకమైన విద్య అందుతోంది. అక్కడే కాదు.. ఫిన్‌ల్యాండ్, స్కాట్‌ల్యాండ్ వంటి దేశాల్లోనూ అంతే. భిన్న సమాజాలున్న మనదేశంలో కూడా కామన్ స్కూలు విధానం ఉంటే ఒకే రకమైన సామర్థ్యం, మానసిక స్థాయితో పిల్లలు ఎదుగుతారని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ, ఏపీలతో పోల్చుకుంటే పక్కనున్న కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల విద్యావిధానం కాస్త మెరుగ్గా ఉంది. ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగంలోనే ఎక్కువ పాఠశాలలున్నాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వ స్కూళ్లు మౌలిక వసతుల కల్పనలో ప్రైవేటుతో పోటీపడుతున్నాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు తిష్ట వేయగా.. ప్రైవేటు స్కూళ్లు మార్కులు, ర్యాంకులకు ప్రాధాన్యం పెంచి విద్యార్థుల్లో మానసిక ఒత్తిడికి కారణం అవుతున్నాయి. నాడే చెప్పిన కొఠారీ కమిషన్.. దేశంలో పేద, ధనికుల వారీగా విద్య అందడంపై యాభై ఏళ్ల కిందటే కొఠారీ కమిషన్ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ పరిణామం అటు పేద పిల్లలకు, ఇటు వేలు, లక్షలు పోసి ప్రైవేటులో చదివించే ఉన్నత వర్గాలకు కూడా హాని చేస్తుందని హెచ్చరించింది. ‘‘విద్యాపరంగా ఉన్నత వర్గాల పిల్లలు, పేద పిల్లలు వేర్వేరుగా ఉండడంతో వారి మధ్య దూరం పెరుగుతుంది. ధనికులైన పిల్లలు పేద పిల్లలతో కలవరు. దీంతో వారిలో సామాజిక పరిణతి, సమగ్ర వికాసం లోపిస్తుంది. అలాంటి విద్య అసంపూర్ణం’’ అని కేంద్రానికి 1966లో సమర్పించిన నివేదికలో కొఠారీ కమిషన్ స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా కామన్ స్కూల్ సిస్టం(సీఎస్ఎస్)ను తీసుకురావాలన్నది కమిషన్ చేసిన ప్రధానమైన సిఫారసు. అన్ని సౌకర్యాలు, వసతులు, సరిపడా టీచర్లతో ప్రతి వాడలో ప్రభుత్వ స్కూలు అవతరించాలని కమిషన్ సూచించింది. అందులో కుల, మత, ఆర్థిక, సామాజిక బేధాలకు అతీతంగా అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలని పేర్కొంది. తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లకు పంపాలన్న భావన తల్లిదండ్రుల్లో ఏ కోశానా రానీయకుండా వీటి నిర్వహణ ఉండాలని పేర్కొంది. ప్రభుత్వ, స్థానిక, ప్రైవేటు, ఎయిడెడ్ ఏ పాఠశాల అయినా.. కచ్చితంగా పాటించాల్సిన కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. కానీ రాజకీయ సంకల్పం లోపించడం వల్లే కామన్ స్కూలు విధానం మనదేశంలో అమలుకు నోచుకోవడం లేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఐదో తరగతి వరకైనా కామన్ స్కూల్ విధానం తేవాలి: చుక్కా రామయ్య, విద్యావేత్త అనేక దేశాల్లో 12వ తరగతి వరకు కామన్ స్కూల్ విధానం ఉంది. దాంతో పేద, ధనిక తేడా లేకుండా అందరికీ నాణ్యమైన, ఒకే ప్రమాణాలతో కూడిన విద్య అందుతోంది. ఇక్కడ 12వ తరగతి వరకు కాకపోయినా కనీసం ప్రాథమిక స్థాయి (5వ తరగతి వరకు) వరకైనా అన్ని వర్గాల పిల్లలు ఒకే గొడుగు కింద చదువుకునేలా కామన్ స్కూల్ విధానం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఐదో తరగతి వరకు బోధన కేవలం ప్రభుత్వం అధీనంలోనే ఉండాలి. ప్రైవేటు స్కూళ్లు బోధించడానికి వీల్లేకుండా ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఐదో తరగతి తర్వాతే ప్రైవేటు స్కూళ్లకు అనుమతులు ఇవ్వాలి. వారి పిల్లలంతా సర్కారీ బడుల్లోనే చదవాలి: ప్రొఫెసర్ హరగోపాల్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సర్కారు నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం పొందే ఎవరైనా తమ పిల్లల్ని కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేలా నిబంధన తీసుకురావాలి. అప్పుడే అన్ని వర్గాల పిల్లలకు సమాన విద్య అందడంతోపాటు ప్రభుత్వ విద్యారంగం పరిపుష్టం అవుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కామన్ విద్య అమలు తీరులో కాస్త అటూ ఇటూ తేడాలున్నా సమాన విద్యే లక్ష్యంగా అనేక అభివృద్ధి చెందిన దేశాలు ప్రాథమిక స్థాయిలో ‘కామన్ స్కూలు’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, స్కాండినేవియన్ దేశాలుగా పేర్కొనే డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్లతోపాటు కెనడా, జపాన్ కామన్ విద్యను అందిస్తున్నాయి. - అమెరికాలో 87 శాతం విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలోనే విద్యనభ్యసిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లకు 10 శాతం మంది మాత్రమే వెళ్తున్నారు. - స్వీడన్లో స్థానిక మున్సిపాలిటీల ఆధ్వర్యంలోనే మెజారిటీ స్కూళ్లు నడుస్తున్నాయి. - జపాన్‌లో ప్రాథమిక విద్య పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఉంది. - నార్వేలో ప్రైవేటు స్కూళ్ల సంఖ్య చాలా తక్కువ. మెజారిటీ విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకే వెళ్తారు. - డెన్మార్క్‌లో ప్రభుత్వ స్కూళ్లు 75 శాతం ఉండగా.. ప్రైవేటు స్కూళ్లు 25 శాతమే ఉన్నాయి. - బ్రిటన్‌లో ప్రభుత్వ పాఠశాలలే ఎక్కువ. 80 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుతున్నారు. -
చేతకాకుంటే తప్పుకోండి
టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆశించిన ఫలితాలు రాలేదు: కోదండరాం ► ప్రజల బతుకుదెరువు విస్తరించే ప్రయత్నాలు ఒక్కటీ లేవు ► వ్యవసాయం, కుల వృత్తులపై అధ్యయనం లేదు ► హైదరాబాద్ చుట్టూ తిరిగి జిల్లాలను విస్మరిస్తే ప్రజలు ఆమోదించరు ► కాంట్రాక్టు, రియల్ ఎస్టేట్‌కు అనుగుణంగా పనిచేస్తే ప్రయోజనం ఉండదు ► వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే రైతు ఆత్మహత్యలు ► పాలీహౌస్లతో పేద రైతులకు ప్రయోజనం శూన్యం ► ప్రజల కోసమే నిలబడ్డాం..లేకపోతే సంస్థను ఎప్పుడో టీఆర్ఎస్లో కలిపేవాళ్లం సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ అభివృద్ధి చేయడం పాలకులకు చేతకాకపోతే పక్కకు తప్పుకోండి. మేం చేసి చూపిస్తాం. రెండేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రజల బతుకుదెరువు విస్తరించే ప్రయత్నం ఒక్కటీ జరగలేదు. వ్యవసాయం, కుల వృత్తుల విధానాలపై అధ్యయనమే మొదలవలేదు. ప్రజలకు ఫలితాలు ఎప్పుడు అందుతాయి? మాకు దురాశ, పేరాశ లేదు. ప్రజలు బాగుండాలనేది మా అంతిమ లక్ష్యం. ఆ సోయి ఉండబట్టే నిలబడ్డాం. లేకపోతే ఈపాటికి సంస్థను ఎప్పుడో పార్టీలో కలిపేసి వాళ్ల వెనక తిరిగేవాళ్లం..’’ అని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తన అస్తిత్వాన్ని కాపాడుకునే దిశగా పయనించినప్పుడే లక్ష్యం నెరవేరినట్లు అవుతుందని స్పష్టంచేశారు. ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు జి.రవీందర్రావు ఆధ్వర్యంలో ‘రెండేళ్ల తెలంగాణ- ప్రజా ఆకాంక్షలు- ప్రభుత్వ తీరుతెన్నులు’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ‘రెండేళ్ల టీఆర్ఎస్ పాలన-ఒక పరిశీలన’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా కాంట్రాక్టు, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా పనిచేస్తే ప్రయోజనం ఉండదన్నారు. కేవలం హైదరాబాద్ చుట్టూనే తిరుగుతూ మిగతా జిల్లాలను విస్మరిస్తే ప్రజలు ఆమోదించే పరిస్థితి లేదన్నారు. అత్యధిక మంది ఆధారపడే వ్యవసాయ రంగం, సూక్ష్మ పరిశ్రమల అవకాశాలను పెంచి ఆర్థిక స్థోమత కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే రైతు ఆత్మహత్యలు పెరిగాయని, అందుకే తాము కోర్టులను ఆశ్రయించామన్నారు. పాలీహౌస్ వంటి వాటి వల్ల పేద రైతులకు ఏమాత్రం ప్రయోజనం ఉండదన్నారు. కుల వృత్తుల విషయంలో ప్రభుత్వ యంత్రాంగానికి స్పష్టత లేదని, తాటిచెట్టు ఏ డిపార్టుమెంట్ కిందకు వస్తుందో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఇటీవల ఒక గీతకార్మికుడు తాటిచెట్టు పైనుంచి పడి చనిపోతే అది తమ పరిధి కాదంటూ హార్టికల్చర్, ఎక్సైజ్ శాఖలు తప్పించుకున్నాయన్నారు. విద్యను ఉచితంగా అందించి, ప్రజల రోగాలకు సరైన చికిత్సలు అందిస్తే తెలంగాణలో మూడోవంతు ఆత్మహత్యలను నివారించవచ్చన్నారు. పనితీరుకు గెలుపే నిదర్శనం కాదు: ప్రొఫెసర్ హరగోపాల్ రాష్ట్రంలో జరిగే వరుస ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అది పనితీరుకు నిదర్శనం కాదని, కేవలం ప్రభుత్వంపై విశ్వాసంతోనే ప్రజలు ఓట్లు వేస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలు కాకుండా అంతా తమకే తెలుసునని సీఎం, మంత్రులు భావించడం మంచి పద్ధతి కాదని అన్నారు. అలా భావిస్తే అది వారి అవివేకమే అవుతుందని పేర్కొన్నారు. దేశం మొత్తంలో తెలంగాణకు ప్రత్యేకత ఉందని, నక్సల్బరి, భూస్వామ్య, ఆంధ్ర పెట్టుబడిదారి విధానాలపై తిరగబడిన చరిత్ర ఇక్కడి ప్రాంత సొంతమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఉస్మానియా యూనివర్సిటీలోనే సభలు పెట్టుకోవద్దని డిక్టేట్ చేయడం సరికాదన్నారు. మల్లన్నసాగర్ కింద భూములు కోల్పోతున్న గ్రామాల ప్రజలు కొంత కాలంగా ఉద్యమిస్తున్నా... ఏ ఒక్క మీడియా బయటి ప్రపంచానికి చూపకపోవడం దురదృష్టకరమని సామాజిక వేత్త ఎన్.వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో ప్రజల గొంతు వినిపించకుండా నొక్కేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ప్రాజెక్టులు గుదిబండలే: రఘు ప్రభుత్వం నూతనంగా చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులు భవిష్యత్తులో ప్రజలకు గుదిబండగా మారుతాయని విద్యుత్ జేఏసీ నేత రఘు స్పష్టంచేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మణుగూరు విద్యుత్ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.10 వేల కోట్ల భారం పడుతుందని, పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం లోపభూయిష్టంగా ఉందని, ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలపై రూ.9 వందల కోట్ల భారం పడుతుందన్నారు. దామరచర్ల ప్రాజెక్టు వల్ల రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లనుందన్నారు. ఇలా విద్యుత్ రంగంలోనే 32 సమస్యలను లేవనెత్తితే ప్రభుత్వం ఒక్కదానికి పరిష్కారం చూపలేదని పేర్కొన్నారు. పైగా రెగ్యులేటరీ కమిషన్‌కు వెళ్లరాదంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా జరగలేదన్నారు. వ్యవసాయానికి 40 శాతం విద్యుత్ తగ్గడం వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో కరెంట్ సమస్య కనిపించడంలేదని చెప్పారు. -
విరసం నేతల అరెస్టు
ఘట్కేసర్ : రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం కేపాల్ వద్ద విరసం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వరంగల్‌లో ఓ మీటింగ్‌కు బయలు దేరిన విరసం నేత వరవరరావు, పౌరహక్కులనేత హరగోపాల్, ఆయన సతీమణి వనమాలినిని అడ్డుకున్నారు. మీటింగ్‌కు పర్మిషన్ ఉన్నా పోలీసులు అడ్డుకోవడం అన్యాయమన్నారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. -
విద్యుత్ గ్రీవెన్స్‌కు భారీగా అర్జీలు
నల్లగొండ జిల్లా మోత్కూరులో సోమవారం ట్రాన్స్‌కో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల సదస్సుకు భారీగా వినతులు వచ్చాయి. వినియోగదారులు తమ సమస్యల పరిష్కారానికి క్యూకట్టారు. మొదలైన రెండు గంటల్లోనే అధికారులకు 30 మంది వరకూ దరఖాస్తులు అందజేశారు. ఎస్సీ భిక్షపతి, గ్రీవెన్స్ సెల్ సీజీఎం హరగోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కొత్త పుస్తకాలు
మట్టిమనసు తన కథలకు బహుమతులు కూడా అందుకున్న రామదుర్గం, వృత్తిరీత్యా పాత్రికేయుడు. భాష మీద మక్కువ గలవాడు. పదేళ్ల పైచిలుకు కాలంలో రాసిన 18 కథల్ని సంకలనంగా తెచ్చారు. ‘జీవితమే ముడిపదార్థం’గా ‘మంచి యన్నది పెంచడానికి’ రాసిన కథలివి. ఇందులో వెల్లడయ్యే స్త్రీ సాధికారత, సీమ రైతుల కష్టాలు రచయిత దృక్పథాన్ని పట్టిస్తాయి. పాత్రోచిత రాయలసీమ మాండలికం అదనపు అందం. రచన: రామదుర్గం మధుసూదనరావు; పేజీలు: 176; వెల: 120; ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలతోపాటు, ఆర్.జయలక్ష్మి, ప్లాట్ నం. 304, కౌస్తుభ టవర్స్, మోహన్‌నగర్, కొత్తపేట, హైదరాబాద్-36; ఫోన్: 9912199557 రెండు దోసిళ్ళ కాలం కవి: (శ్రీరామోజు) హరగోపాల్; పేజీలు: 168; వెల: 100; ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు. కవి ఫోన్: 9949498698 ఇది హరగోపాల్ మూడో కవితాసంపుటి. ‘ఒక వస్తువుని కవిత చేసేటప్పుడు- హరగోపాల్ పద్ధతి వేరు. తనది మనమీద ఇంపోజ్ చేయడు. ఆత్మగతం. స్వగతంగా మాట్లాడుకుంటూ కవితా నిర్మాణం జరుగుతుంది’. ‘చాల మామూలు ఘటనల గురించే, చాల మామూలు పదచిత్రాలతోనే చెపుతున్నప్పటికీ, అంతర్గతంగా దాగిన ప్రగాఢమైన, సాంద్రమైన తాత్విక దృక్పథం’ ఆలోచనలు రగిలిస్తుంది. శబ్దభేది కవి: ఎమ్మెస్ సూర్యనారాయణ; పేజీలు: 184; వెల: 100; ప్రతులకు: ఎం.రత్నమాల, ఆదిత్య కుటీర్, పొదలాడ - 533242, రాజోలు, తూర్పు గోదావరి; ఫోన్: 08862-220408 ఐదు కవిత్వ, మూడు కథా సంపుటాల ఎమ్మెస్ తాజా సంపుటి ఇది. కాలాన్ని తవ్వుతూ రాత్రుళ్లుగా, పగళ్లుగా... దాచిపెట్టిన కలల్ని ధారపోస్తున్నాడు. కాఫ్కా మూలుగుల్నీ, కోకిలని పొదిగిన హృదయాన్నీ వినిపిస్తున్నాడు. ‘తాత్వికునితో సర్దుబాటంటే/ తనలాగా తర్జుమా కావడం/ మన లోపల/ తామరాకు పుట్టడం’ అని ప్రేమగా హెచ్చరిస్తున్నాడు. అలౌకికం లలితానంద్ కవిత; పేజీలు: 304; వెల: 200; ప్రతులకు: బి.లలితానంద ప్రసాద్, 12-24, ‘సృజన’ రాధశాల వీధి, దుగ్గిరాల- 522330; ఫోన్: 08644-277559 ‘హృదయ మూలంలో జీవం పోసుకుని, మేధో మథనంతో రాటు తేలి అక్షర చిత్రాలుగా రూపు దిద్దుకున్న కవితలివన్నీ’. ‘భూమి పొరల మాటున లోతుగా చెలమ త్రవ్వి అందుకోవలసిన కవితా గంగ ఇది. మనసు పెట్టి ఆ గంగను చేదుకోవాలేకాని, ఆ తర్వాత మనకు అందేదంతా అపురూపమైన భావ సంచయమే’. -
’తెలంగాణ ప్రజలు సహించరు’
-
'ప్రపంచ బ్యాంకు విధానాలను వైఎస్సార్ తిరస్కరించారు'
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): ప్రపంచ బ్యాంకు షరతులను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరస్కరించి వారి విధానాలను వ్యతిరేకించడంతో ఆంధ్రప్రదేశ్‌కు అప్పు ఇవ్వబోమని వెళ్లిపోయిందని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. వైఎస్సార్.. ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గకుండా నిక్కచ్చిగా వ్యవహరించటం వల్లనే రాష్ట్రానికి కొంత మేలు జరిగిందన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో 'ఉచిత విద్య- ప్రభుత్వ బాధ్యత' అంశంపై శనివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ.. వైఎస్సార్ ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ ఎత్తివేయాలని, సంక్షేమ పథకాల్లో కోత విధించాలని, ఉద్యోగాల భర్తీ నిలిపివేయాలని ప్రపంచబ్యాంక్ షరతులు విధించటంతో వైఎస్సార్ తీవ్రంగా వ్యతిరేకంచారని చెప్పారు. దీంతో ప్రపంచ బ్యాంకు ఏపీకి రుణం ఇచ్చేందుకు తిరస్కరించిందని.. ఆంధ్రప్రదేశ్‌కు అప్పు ఎందుకు ఇవ్వలేదో ప్రపంచ బ్యాంకు స్వయంగా తయారు చేసిన నివేదికలో పేర్కొందని హరగోపాల్ వెల్లడించారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకోవాలని సూచిస్తున్నట్లు చెప్పారు. అలా తీసుకుంటే వారు పెట్టే షరతులతో మన ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన సూచించారు. విద్యారంగాన్ని ప్రభుత్వమే సంపూర్ణంగా నిర్వహించాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎలాంటి ఖర్చు లేకుండా చదువుకునేలా చేయటం ప్రభుత్వ బాధ్యతని ఆయన చెప్పారు. విద్యార్ధులకు ప్రామాణికమైన విద్యను అందించాలని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. ప్రభుత్వ పరంగా నాణ్యమైన విద్య లేకపోవటం వల్లనే కార్పొరేట్ విద్య వచ్చిందని అన్నారు. -
ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ నిర్లక్ష్యం వల్లే...
నిర్ధారించిన అటవీశాఖ ఉన్నతాధికారులు ఎర్రచందనం తరలింపులో చర్యకు రంగం సిద్ధం పోలీసు దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు విజయవాడ సిటీ : అటవీశాఖ ఆధీనంలోని ఎర్రచందనం దుంగలు బయటకు వెళ్లిన నేపథ్యంలో నూజివీడు అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ హరగోపాల్‌పై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. విధుల నిర్వహణలో ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు అటవీ శాఖ ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. ఇప్పటికే పోలీసు కేసు నమోదైనందున దర్యాప్తులో వెలుగు చూసే అంశాల ఆధారంగా మిగిలిన వారిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 2012లో మల్లవల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన 11 టన్నుల బరువైన 465 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకొని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. అక్రమంగా తరలించే కలపను ప్రత్యేకంగా భద్రపరిచేందుకు తగిన గోదాములు లేకపోవడంలో అటవీశాఖ కార్యాలయాల్లోనే వాటిని ఉంచుతున్నారు. ఎర్రచందనం సహా ఏ విధమైన కలపనైనా సంబంధిత సెక్షన్ అధికారి కస్టడీలో ఉంచుతారు. ఈ క్రమంలోనే మల్లవల్లిలో పట్టుబడిన ఎర్రచందనం దుంగలను నూజివీడు సెక్షన్ ఆఫీసర్ కస్టడీలో భద్రపరిచారు. బుధవారం అటవీశాఖ కార్యాలయానికి కొద్ది దూరంలోని పొదల్లో 25 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. వాటిని పరిశీలించిన జిల్లా అటవీశాఖ అధికారులు మల్లవల్లిలో స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలుగా నిర్థారించారు. పట్టుబడిన లారీలోని దుంగలను లెక్కించగా 440 దుంగలు మాత్రమే ఉన్నాయి. పైగా అప్పట్లో అటవీ అధికారులు వేసిన నంబర్లు కూడా పట్టుబడిన దుంగలపై ఉన్నాయి. వీటిని సరిపోల్చుకున్న అధికారులు లారీలోని దుంగలను తరలించిన వ్యక్తులు సమీపంలోని పొదల్లో నిల్వ చేసినట్టు నిర్థారించారు. ఇందుకు సెక్షన్ అధికారి నిర్లక్ష్యమే కారణంగా భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఆదేశాలు జారీకానున్నాయి. ఇదే సమయంలో ఇంటి దొంగలే ఎర్రచందనం దుంగలు తరలించేందుకు సిద్ధపడ్డారా? లేక ఇంటి దొంగల సహకారంతో స్మగ్లర్లు ఇందుకు ఒడిగట్టారా? అనే అంశంపై అధికారులు దృష్టిసారించారు. దీనిని నిర్థారించుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు విచారణలో వెలుగు చూసే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇంటి దొంగల సహకారమే అటవీశాఖ ఉద్యోగుల సహకారంతోనే లారీలోని ఎర్రచందనం దుంగలు బయటకు వెళ్లినట్టు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. నూజివీడులో ఎర్రచందనం దుంగలు దొరికినట్టు తెలియగానే జిల్లా అటవీశాఖ అధికారి ఎస్.రాజశేఖర్ తదితర అధికారులు గురువారం వెళ్లి విచారణ జరిపారు. దుంగలను కప్పిపెట్టిన పట్టా(టార్ఫాలిన్ కవర్) చివికిపోయి ఉండటాన్ని బట్టి నెల రోజుల కంటే ముందే అక్కడికి చేరవేసినట్టు భావిస్తున్నారు. అక్కడ నిల్వ చేసిన తర్వాత వీలునుబట్టి తరలించేందుకు సిద్ధపడి ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో ఇటీవల కురిసన వర్షాలు, ఎండలకు పట్టా చివికిపోయి ఉంటుందని చెపుతున్నారు. ఇంతటి సాహసం బయటి వ్యక్తులు చేసే అవకాశం లేదనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. గతంలో పట్టుబడిన వ్యక్తులు పరిసర గ్రామాలకు చెందిన వారైనందున అటవీశాఖ సిబ్బం ది సహకారంతో వాటిని అక్కడికి తరలించి ఉండొచ్చనేది అధికారుల అభిప్రా యం. ఆ తర్వాత రాష్ట్రంలోని పరిణామాల నేపథ్యంలో బయటకు తరలిం చేందుకు బయపడి వదిలేసి ఉంటారని, అవకాశం లేదు కాబట్టి వాటితో పాటు మిగి లిన దుంగలు తరలిపోకుండా ఉండొచ్చం టూ ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. -
ప్రపంచీకరణపై ఐక్యపోరాటం ఆవశ్యం
భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) 8వ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్‌లో ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరగనున్నాయి. దేశ ప్రజల నవనాడు లనూ పెకిలించివేస్తున్న సామ్రాజ్యవాద, ప్రపంచీక రణలకు వ్యతిరేకంగా అన్ని ప్రజాపోరాట శక్తులను కలుపుకుని పోరాడటం అత్యంత ఆవశ్యకమైన పరి స్థితుల్లో ఇఫ్టూ మహాసభలు జరగనున్నాయి. మార్చి 13న హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కునుంచి ఉదయం 11 గంటలకు కార్మికుల ప్రదర్శన మొదలవుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఇంది రాపార్కులో బహిరంగ సభ జరుగుతుంది. ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణ సభకు అధ్యక్షత వహిస్తారు. విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్, టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్, ఇఫ్టూ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్, న్యూడెమో క్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వేములపల్లి వెంక ట్రామయ్య ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, ఉపా ధ్యక్షులు జె.శ్రీనివాస్, రాష్ట్రకమిటీ సభ్యులు ఎస్. ఎల్.పద్మ, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు జి. ఝాన్సీ ఈ బహిరంగ సభలో వక్తలుగా ఉపన్యసించను న్నారు. మార్చి 14, 15 తేదీల్లో కా॥యు.రాములు నగర్ (వీఎస్టీ ఫంక్షన్ హాల్)లో జరిగే ప్రతినిధుల సభకు ప్రముఖ పాత్రికేయులు సతీశ్‌చందర్ ఆహ్వా నం పలుకగా, ఇఫ్టూ జాతీయ కార్యదర్శి పి. ప్రసాద్, ఇఫ్టూ జాతీయ అధ్యక్షులు డి.వి. కృష్ణ ప్రారంభ, ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. ఈ సభ నేపథ్య విషయానికి వస్తే...విదేశీ ప్రత్యక్ష పాలన వీడినా దేశానికి స్వతంత్రత చేకూర లేదు. కేవలం అధికార మార్పిడి జరిగింది. నాటి నుంచి నేటివరకు ప్రభుత్వాలు మారుతూనే ఉన్నా యి. మెజారిటీగా కాంగ్రెస్ పార్టీ పాలించినా బీజేపీ, ఇతర పార్టీలు కూడా అధికారంలో ఉన్నాయి. పదేళ్ల యూపీఏ పాలన అన్నిరంగాల్లో భ్రష్టు పట్టిపోయిం ది. లక్షల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయింది. ప్రజల్లో పేరుకు పోయిన అసం తృప్తిని సొమ్ము చేసుకుని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తు న్నారు. బహుళజాతి సంస్థలకూ, పెట్టుబడిదారు లకూ వకాల్తా పుచ్చుకున్నారు. చవక శ్రమ ద్వారా దోపిడీని మరింత పెంచుకోమంటున్నారు. వారికి అవసరమైన కార్మిక చట్టాలను మార్చేస్తున్నారు. రైతుల అభీష్టంతో సంబంధం లేకుండా భూమిని లాక్కునే ఆర్డినెన్స్‌ను సవరించాడు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పాలన మాటలు కోట లు దాటినా కాళ్లు గడపదాటవు చందంగా సాగుతోం ది. ఇంటికో ఉద్యోగం, కాంట్రాక్టు కార్మికుల క్రమబ ద్ధీకరణ, అసంఘటిత కార్మికుల కనీస వేతన నిర్ణ యం గుర్తున్నట్లు కనబడటం లేదు. 125 కోట్ల భారతదేశంలో 44 కోట్లమంది కార్మికులు జీవిస్తున్నారు. ఇందులో తగిన జీవన భద్రత కలిగిన సంఘటిత కార్మిక వర్గం కేవలం 4 కోట్లు మాత్రమే. మిగతా 40 కోట్లమంది కార్మిక వర్గం హక్కులు లేని, కనీస వేతనం లేని ఉద్యోగ భద్రత లేని జీవులుగా మిగిలి ఉన్నారు. దేశజనాభా లో 40 శాతానికి పైగా కార్మిక వర్గం ఏ అవసరాలు తీరని, పోషకాహార లేమితో అనారోగ్యంతో, దారి ద్య్రంతో, బతుకులీడుస్త్తున్నారు. ఈ స్థితికి వ్యతిరేకం గా పోరాడాల్సిన ఆవశ్యకత మనపై ఉంది. భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) రాష్ట్రంలో అనేక పోరాటాలు నిర్వహించింది. కార్మిక వర్గాన్ని కూడగట్టింది. అనేక రంగాల కాంట్రాక్ట్ వర్కర్స్, సింగరేణి, బీడీ, భవన, జూట్, మోటారు, విద్యుత్ తదితర అనేక రంగాల్లో యూనియన్ నిర్మా ణం చేసింది. తక్షణ కర్తవ్యంగా అసంఘటిత కార్మికు లకు 15 వేల వేతనం, షరతులు లేకుండా బీడీ కార్మి కులందరికీ వెయ్యి రూపాయల జీవన భృతి కోసం పోరాడాల్సి ఉంది. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా అన్ని శక్తులను కలుపుకుని పోరాడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మార్చి 13, 14, 15 తేదీల్లో జరుగుతున్న ఇఫ్టూ 8వ మహాసభల సందర్భంగా గత ఉద్యమాన్ని సమీక్షించుకుని భవి ష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవాలి. అందుకు గానూ మార్చి 13న వేలాదిగా కార్మికులు హాజరయి ప్రదర్శనను, బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. మార్చి 14, 15 తేదీల్లో జరగనున్న ప్రతినిధుల సభకు అండగా నిలవాల్సిం దిగా విజ్ఞప్తి చేస్తున్నాం. (నేటి నుంచి హైదరాబాద్‌లో ఇప్టూ 8వ రాష్ట్ర మహాసభల సందర్భంగా) భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) తెలంగాణ రాష్ట్ర కమిటీ -
ఆకాంక్షలు నెరవేర్చేలా ఒత్తిడి
వరంగల్ : 'పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం.. మన వాళ్లే రాజకీయంగా అధికారంలోకి వచ్చారు... మన సమస్యలు తీరుతాయని ప్రజల్లో అకాంక్ష బలంగా ఉంది, ఈ మేరకు ప్రభుత్వం వాటిని నెరవేర్చాల్సి ఉంటుంది' అని ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు. తమ ఆకాంక్షలు నెరవేరాలంటే పౌర సమాజంకూడా మరింత చైతన్యవంతులై తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 'రీ కన్స్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణ ఇష్యూస్ అండ్ చాలెంజెస్' అంశంపై రెండు రోజులపాటు జరగనున్న జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. సదస్సులో హరగోపాల్ కీలకోపన్యాసం చేశారు. వ్యవసాయం బాగు పడుతుందని రైతులు, ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులు, ఏదో ఒక మేలు జరుగుతుందని ఆయా వర్గాల ప్రజలు ఆశతో ఉన్నా రని, ఇందుకనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాని సూచించారు. ప్రపంచబ్యాంకు విధానాలను కాకుండా ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజల ఆకాంక్షలకనుగుణంగా టీఆర్ఎస్ పాలన కొనసాగించాలన్నారు. 2004లో చంద్రబాబు గెలిచి ఉంటే ప్రధానమంత్రిని చేయాలని ప్రపంచ బ్యాంక్ భావిం చిందని, అయితే తెలుగు ప్రజలు చైతన్యంతో నాడు చంద్రబాబును ఓడించటం మంచిదైందన్నారు. మాట వినలేదని వైఎస్ ప్రభుత్వానికి అప్పు ఇవ్వని ప్రపంచబ్యాంక్ అప్పటి సీఎంగా రాజశేఖరరెడ్డి ప్రపంచబ్యాంకు విధానాలను అనుసరించలేదని, అభివృద్ధి నమూ నాకు మార్పులు చేసి పథకాలను కొనసాగించారని హరగోపాల్ అన్నారు. వైఎస్ తన మాట వినడం లేదని ప్రపంచబ్యాంక్ అప్పులు ఇవ్వలేదన్నారు. -
అణచివేతను తెలంగాణ ప్రజలు సహించరు
హైదరాబాద్: అణచివేతను తెలంగాణ ప్రజలు సహించరని, ఎంత ప్రజాస్వామ్యం ఉంటే అంత స్వేచ్ఛ ఉంటుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) ఆధ్వర్యంలో ‘టీవీవీ మహాసభల’పై నిర్బంధాన్ని ఖండిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి సంఘాల మీద దాడి చేసినా, అణచివేసినా ఎవరు ఏమి ప్రశ్నించరని భావించే నేతలకు కనువిప్పు కలగాలన్నారు. ఒక్క విద్యార్థి సంఘాన్ని అణచివేస్తే అన్ని విద్యార్థి సంఘాలు ఐక్యం కావటం శుభపరిణామమన్నారు. ఇలాగే కొనసాగితే ఉద్యమం చేయాల్సి వస్తుందని, ప్రజల్ని మరో ఉద్యమంలోకి నెట్టవద్దని కోరారు. మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు జీవన్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థును నిర్బంధంలోకి నెట్టటం హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమస్యపై సదస్సు నిర్వహించుకునే విద్యార్థ్ధి సంఘంపై నిర్బంధంరాజ్యాంగానికి విరుద్ధమన్నారు. టీవీవీ అధ్యక్షుడు ఎన్.మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీవీవీ కార్యదర్శి ఆజాద్, ప్రొఫెసర్ చక్రధర్ రావు, టీపీఎఫ్ అధ్యక్షుడు పులిమామిడి మద్దిలేటి, పలు ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. -
పోటీ పరీక్షల్లో మార్పులకు శ్రీకారం
* టీఎస్పీఎస్సీ చర్యలు * మొదటిసారి సమావేశమైన సమీక్ష కమిటీ * పరీక్షల విధానం, సిలబస్ మార్పులపై చర్చ * ప్రతిపాదనల రూపకల్పనకు సబ్ కమిటీలు ఏర్పాటు * ఈ నెల 17న మరో సమావేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోటీ పరీక్షల విధానం, సిలబస్‌లో మార్పులపై కసరత్తు మొదలైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యాలయంలో టీఎస్పీఎస్సీ నియమించిన కమిటీ మొదటి సమావేశం శుక్రవారం జరిగింది. సమీక్ష, మార్పుల కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పోటీ పరీక్షల్లో తీసుకురావాల్సిన వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏయే పోటీ పరీక్షలో ఎలాంటి పేపర్లు ఉండాలి.. ఎన్ని పేపర్లు అవసరం.. ఏయే పరీక్షలకు ఇంటర్వ్యూలు అవసరం.., ఇంటర్వ్యూలు ఉన్న వాటిల్లో ఎన్ని మార్కులకు పెట్టాలి.. పరీక్షల వారీగా సిలబస్ ఎలా ఉండాలి.. ఏయే పాఠ్యాంశాలను చేర్చాలి అనే అంశాలపై కమిటీ చర్చించింది. ప్రధానంగా గ్రూపు-1, గ్రూపు-2 పోటీ పరీక్షల్లో ఎలాంటి విధానాలు అమలు చేయాలన్న అంశంతోపాటు సిలబస్‌లో ఎలాంటి మార్పులు అవసరమో చర్చించారు. కాగా, ఇంటర్వ్యూలు ఉంటే అందులో కనీస, గరిష్ట మార్కుల విధానం తప్పనిసరిగా ఉండాలన్న అంశంపై ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలిసింది. వీటన్నింటిపై మరింత లోతుగా అధ్యయనం చేసి, మార్పులపై పూర్తి స్థాయి ప్రతిపాదనలను రూపొందించేందుకు సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఒక కమిటీని, ప్రొఫెసర్ లింగమూర్తి నేతృత్వంలో మరో కమిటీని ఏర్పాటు చేశారు. వీటితోపాటు మరో మూడు సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈనెల 17న మరోసారి సమావేశమై సబ్ కమిటీలు చేసే మార్పులపై తుది నివేదికను రూపొందించి సర్వీసు కమిషన్‌కు అందజేయాలని నిర్ణయించారు. ఆ నివేదికలోని అంశాలపై సర్వీసు కమిషన్ చర్చించి ప్రభుత్వ ఆమోదానికి పంపుతుంది. ప్రభుత్వ ఆమోదం రాగానే ఇదే కమిటీ పూర్తి స్థాయి సిలబస్‌ను ప్రతిపాదించనుంది. ఆ తరువాత శాఖల వారీగా ఇండెంట్లు వస్తే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేస్తారు. కాగా, ఈ కమిటీ రెండు నివేదికలను కమిషన్‌కు అందజేయనుంది. అందులో ఇప్పటికిప్పుడు చేపట్టాల్సిన మార్పులపై ఒకదాన్ని, 2016 నాటికి తీసుకురావాల్సిన పూర్తిస్థాయి మార్పులపై మరొకదానిని కమిషన్‌కు అందజేస్తుందని సమాచారం. టీఎస్పీఎస్సీని సందర్శించిన సీఎస్ తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యాలయాన్ని శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సందర్శించారు. సర్వీసు కమిషన్ ఆహ్వానం మేరకు సీఎస్‌తోపాటు సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ప్రభుత్వ సలహాదారు పాపారావు సర్వీసు కమిషన్‌కు వచ్చారు. వారికి కమిషన్ చైర్మన్ చక్రపాణి, సభ్యులు విఠల్, చంద్రావతి సాదరంగా స్వాగతం పలికారు. తాము చేపట్టిన కార్యక్రమాలను సీఎస్‌కు వివరించారు. అవసరం మేర మార్పులు: హరగోపాల్ ప్రతి ఐదేళ్లు, పదేళ్లకోసారి సర్వీసు కమిషన్ సిలబస్‌లో మార్పులు చేస్తుంది. విద్యా విషయాలు, సమాజ విజ్ఞానంలో వచ్చిన మార్పులపై నిపుణుల కమిటీలను ఏర్పాటు చేసి, వాటి సిఫారసులను సర్వీసు కమిషన్లు తీసుకుంటాయి. వివిధ పోటీ పరీక్షల్లో ఇన్నాళ్లు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వగా, కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఇకపై తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. ఈ మార్పులు ఆంధ్రప్రదేశ్-తెలంగాణకు సంబంధించిన అంశాల్లోనే ఉంటాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, భౌగోళిక అంశాలు, ఎకానమీ, తెలంగాణ సంస్కృతి తదితర అంశాలు సిలబస్‌లో చేరే అవకాశం ఉంటుంది. మిగిలిన అంశాల్లో కొత్తగా చోటు చేసుకున్న పరిణామాల మేరకు (ఆవిష్కరణల ప్రకారం) బయాలజీ వంటి వాటిల్లో మార్పులు ఉంటాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్లే ఇలాంటి మార్పులు ఉంటాయి. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక ప్రభుత్వ అవసరాల మేరకు ఆయా శాఖల నుంచి ఇండెంట్లు వచ్చాక, సర్వీసు కమిషన్ నోటిఫికేషన్లను జారీచేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మా తరఫున ఎలాంటి జాప్యం లేకుండా సాధ్యమైనంత త్వరగా నివేదికలు అందజేస్తాం. అయితే పరీక్షల విధానంలో ఇప్పటికిప్పుడే భారీగా మార్పులు ఉండకపోవచ్చు. మొత్తం సిస్టంను మార్చే సాహసం మేము చేయం. తర్వాత కాలంలో మాత్రం పూర్తి స్థాయిలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అప్పటి అభ్యర్థులకు ఇబ్బందేమీ ఉండదు. మా కమిటీ ఎలాంటి నిర్ణయాలు చేయదు.. కమిషన్‌కు సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తుంది. తెలంగాణ పునర్నిర్మాణం కోసం చాలా మంది ఉద్యోగులు అవసరం. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన వీలైనంత త్వరగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి మా సలహా. -
పోటీ పరీక్షలపై నిపుణుల కమిటీ
ప్రొఫెసర్ హరగోపాల్ చైర్మన్‌గా 27 మందితో ఏర్పాటు ప్రొఫెసర్ కోదండరాం, చుక్కా రామయ్య తదితరులకు చోటు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్షల విధి విధానాల్లో మార్పులు, చేర్పులపై అధ్యయనానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) కమిటీని ఏర్పాటు చేసింది. 27 మంది నిపుణులతో కూడిన ఈ కమిటీకే సిలబస్ మార్పుల అంశాన్నీ అప్పగించింది. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీకి సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. పోటీ పరీక్షల విధి విధానాలతో పాటు సిలబస్‌లో మార్పులను కూడా ఈ కమిటీ సిఫారసు చేస్తుందని.. అయితే ముందుగా పరీక్ష విధివిధానాలకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుందని చక్రపాణి తెలిపారు. సిఫారసులతో కూడిన అధ్యయన నివేదికను మూడు వారాల్లో ఇవ్వాలని కమిటీకి స్పష్టం చేశామని చెప్పారు. నివేదిక వచ్చిన వెంటనే కమిషన్ దానిని పరిశీలించి ఈ నెలాఖరులో ప్రభుత్వ ఆమోదానికి పంపుతుందని వెల్లడించారు. కమిటీలో సభ్యులు వీరే: కమిటీలో విద్యావేత్త చుక్కా రామయ్య, ఓయూ ప్రొఫెసర్లు ఎం.కోదండరాం, కె.నాగేశ్వర్, రమా మేల్కొటే, జీబీ రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఎస్.మల్లేశ్, తెలుగు వర్సిటీ వీసీ శివారెడ్డి, న్యాక్ మాజీ డెరైక్టర్ వీఎస్ ప్రసాద్, కాకతీయ వర్సిటీ మాజీ వీసీ లింగమూర్తి, రిటైర్డ్ ప్రొఫెసర్లు అడపా సత్యనారాయణ, బీనా, భూపతిరావు, సెస్ నుంచి డాక్టర్ ఇ.రేవతి, ఐసీఎస్ఎస్ఆర్ దక్షిణ భారత రీజియన్ చైర్మన్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి, ఏపీ సెట్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సి.గణేష్, మౌలానా ఆజాద్ ఉర్దూ వర్సిటీ ప్రొఫెసర్ వహీదుల్లా సిద్ధిఖీ, డాక్టర్ కనకదుర్గ, అంబ్కేదర్ వర్సిటీ ప్రొఫెసర్ సి.వెంకటయ్య, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన నిశాంత్ డోంగరి, రిటైర్డ్ లెక్చరర్ నందిని సిధారెడ్డి, సెంట్రల్ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ రాజశేఖర్, కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్ భద్రూనాయక్, హైదరాబాద్ వర్సిటీ ప్రొఫెసర్ జె.మనోహర్‌రావు, కాకతీయ వర్సిటీ నుంచి డాక్టర్ టి.శ్రీనివాస్, గజ్వేల్ జీఎంఆర్ పాలిటెకి ్నక్ విభాగాధిపతి డాక్టర్ భైరి ప్రభాకర్, నల్సార్ నుంచి డాక్టర్ ఎన్.వసంత్ తదితరులను కమిటీ సభ్యులుగా నియమించారు. -
'ప్రపంచ బ్యాంకు షరతులు ఒప్పుకోని వైఎస్ఆర్'
-
'ప్రపంచ బ్యాంకు షరతులు ఒప్పుకోని వైఎస్ఆర్'
హైదరాబాద్: పేదలకు మేలుచేసే అభివృద్ధి విధానాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసినందునే ఆయన రెండవసారి గెలిచారని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కమిటీ హాలులో తెలంగాణ పీసీసీ 'భవిష్యత్ తెలంగాణ' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. సంక్షేమానికి కోతపెట్టాలన్న ప్రపంచ బ్యాంకు షరతులకు వైఎస్ ఒప్పుకోలేదన్నారు. ప్రపంచ బ్యాంకు షరతులకు అంగీకరించి, సంక్షేమానికి తిలోదకాలు ఇచ్చినందునే అప్పట్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయారని గుర్తు చేశారు. విద్య ప్రైవేటీకరణ, కార్పోరేషన్ కాలేజీల వల్ల పేదలకు నష్టమే తప్ప లాభంలేదన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత కార్పోరేషన్ కాలేజీలు ఇక ఉండవేమో అనుకున్నానని, అయితే ఎందుకో ఇంకా ఆ కాలేజీలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాన్ని గౌరవించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. గత అయిదేళ్లలో కాంగ్రెస్ దేశాన్ని రిటైల్‌గా అమ్మితే ఇప్పుడు బీజేపీ హోల్‌సేల్‌గా అమ్మాలనుకుంటుందని విమర్శించారు. ఇదేవిధంగా కొనసాగితే 2019లో బీజేపీ గెలవదని చెప్పారు. యుపీఏ హయాంలో చిదంబరం అపరిమిత అధికారాలు అనుభవించారని అన్నారు. కానీ ఇప్పుడాయన బీజేపీ ప్రతినిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారని హరగోపాల్ తెలిపారు. ఈ సదస్సులో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనరసింహ, ప్రొఫెసర్ కోదండరామ్, పలువురు కాంగ్రెస్ నేతలు, మేథావులు ప్రసంగించారు. ** -
ఉచిత విద్యంటూనే.. పాఠశాలల మూసివేతా?
ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: పీజీ వరకూ ఉచితంగా విద్య అందిస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఉన్న పాఠశాలలను మూసేయాలనుకోవడం తగదని సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రస్తుతం విద్యావిధానం కాషాయీకరణతోపాటు ప్రైవేటీకరణలో సంఘ్ పరివార్ భాగస్వామ్యం అవుతోంద ని ఆందోళన వ్యక్త పరిచారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో హరగోపాల్ విలేకరులతో మాట్లాడారు. ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ సంస్థ అఖిల భారత శిక్షా సంఘర్ష్ యాత్ర-2014’ తెలంగాణలో నవంబర్ 2 నుంచి 27 వరకు అన్ని డివిజన్లలో సాగుతుందనీ చివరకు ఆదిలాబాద్ జిల్లాలో ముగిసి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందన్నా రు. సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అధ్యక్షుడు కె. చక్రధరరావు మాట్లాడుతూ విద్యను ప్రభుత్వాలు వ్యాపారంగా భావిస్తున్నాయన్నారు. -
ప్రజా వ్యతిరేక స్వభావం వెల్లడైంది
తెలంగాణ సర్కార్‌పై వరవరరావు, ప్రొఫెసర్ హరగోపాల్ ధ్వజం హైదరాబాద్: రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక సదస్సును భగ్నం చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక స్వభావం బహిర్గతమైందని, సభ నిర్వహణ హక్కులను కాలరాసి, అక్రమ అరెస్ట్‌లు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాజకీయప్రత్యామ్నాయ వేదిక కన్వీనర్ వరవ రరావు అన్నారు. సోమవారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సదస్సు ఏర్పాటు నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ర్యాలీకి, ఇందిరాపార్క్ వద్ద బహిరంగ సభలో మైకు వినియోగించేందుకు అనుమతించాలంటూ తాము పోలీసులకు సెప్టెంబర్ 2న వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. పోలీసులు 19న అనుమతి నిరాకరిస్తూ, అభ్యంతరకరమైన కారణాలు చెబుతూ తమకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. తమ వేదిక మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘమని ఆరోపించారని మండిపడ్డారు. మావోయిస్టు రాజకీయాలతో ఏకీభవించని దేశవ్యాప్త ప్రజాస్వామికవాదులు, రచయితలు, గాంధేయవాదులు వేదికలో ఉన్నారని ఆయన తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒక్కటై ప్రజాస్వామ్య వాదులపై ఉక్కుపాదం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపి అనురాగ్‌శర్మ, కమిషనర్ మహేందర్‌రెడ్డిల అనుమతి అవసరం లేదన్నారు. తమ వేదిక ప్రభుత్వాలను కూల్చడానికి కాదని, రాజ్యాలను కూల్చడానికన్నారు. ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చామని, బంగారు తెలంగాణ నిర్మించడమే లక్ష్యమని ప్రకటించుకున్న కేసీఆర్ ఇవేవీ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ధార్మిక సంస్థ యిన తుల్జాభవన్ మేనేజర్‌ను బెదిరించారన్నారు. జార్ఖండ్ నుంచి వచ్చిన ప్రముఖ ఆదివాసీ కళాకారుడు జితేన్ మారాండీని, ఆయన బృందాన్ని అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. నాయకురాలు దేవేంద్ర ఇంటికి మగ పోలీసులు వెళ్లి అరెస్ట్ చే సేందుకు యత్నించి, హౌస్ అరెస్ట్ చేశారని తెలిపారు. హక్కుల నేతలు ప్రొఫెసర్ హరగోపాల్, రఘునాధ్‌లను గృహనిర్భందం చేశారని, ఏ సీఎం చేయని సాహసాన్ని కేసీఆర్ చేశారని మండిపడ్డారు. పోలీసులు మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తుంటే మీడియా కనీసం తమను వివరణ అడగకుండా తప్పుడు ప్రసారాలు చేస్తోందన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అందరి ఆకాంక్ష అని ఇక్కడి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాపాడుతుందని చెప్పిన కే సీఆర్ దానికి విరుద్ధంగా చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సర్కారుది దమననీతి: తెలంగాణ ఉద్యమంలో నక్సల్స్ ఎజెండా తన ఎజెండా అని ప్రకటించి, సీఎం పదవి కంటె పౌరహక్కులసంఘం అధ్యక్షుడిగా పనిచేసేందుకు ఇష్టపడతాన న్న కె.చంద్రశేఖరరావు అధికారంలోకి రాగానే ప్రజలు, పౌరహక్కులపై దాడిని ప్రారంభించడం దారుణమని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రెండు వర్గాల నేతలు రాయల సుభాష్‌చంద్రబోస్, చంద్రన్న వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. గతంలో సీమాంధ్ర పాలకులు సాగించిన నిర్బంధకాండ, రాజ్యహింస, దమననీతినే కేసీఆర్ ప్రభుత్వం సాగిస్తోందని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నల్లమాస కృష్ణ, నేతలు మండిపడ్డారు. -
'కేసీఆర్ చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ'
తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని విరసం నేత వరవరవరావు, మానవహక్కుల ఉద్యమనేత హరగోపాల్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచేయాలని ఆయన చూస్తున్నారన్నారు. ప్రజాసంఘాల నేతల అరెస్టును తాము తీవ్రస్థాయిలో ఖండిస్తున్నట్లు చెప్పారు. అర్ధరాత్రి సమయంలో ఉద్యమనాయకులను అరెస్టు చేసి.. ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న కార్యక్రమాలను అడ్డుకోవడం తగదన్నారు. భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి వైఖరినే అవలంబిస్తే మాత్రం తెలంగాణలో మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కాళోజీ, జయశంకర్ లాంటి వాళ్లు ఎవరూ ఇలాంటి నిర్బంధాలతో కూడిన తెలంగాణను కోరుకోలేదని, ఈ విషయంలో కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవాలని వరవరరావు, హరగోపాల్ స్పష్టం చేశారు. -
నాయిని ఏమీ చేయలేకపోతున్నారు: హరగోపాల్
తెలంగాణ వికాస సమితి ఆవిర్భావ సభలో హరగోపాల్ సాక్షి,హైదరాబాద్: సీమాంధ్ర పాలక వర్గాల కుట్రలను తిప్పి కొట్టకపోతే తెలంగాణ రాష్ట్రం అస్థిరత్వం పాలై మళ్లీ 1956 మాదిరిగానే వలస పాలనలోకి వచ్చే ప్రమాద ఉందని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ హెచ్చరించారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎంతో బలహీన పడ్డారని, ఏం చెప్పినా వినడం లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ప్రతిఒక్కరూ ఇలానే వ్యవహరిస్తారని అభిప్రాపడ్డారు. ఆదివారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ‘తెలంగాణ వికాస సమితి’ ఆవిర్భావసభలో హరగోపాల్ మాట్లాడారు. కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న దేశపతి శ్రీనివాస్ కన్వీనర్‌గా ఈ సమితిని ఏర్పాటు చేయడం విచిత్రంగా ఉందని, టీఆర్ఎస్ వాళ్లే పెట్టించారనే ప్రచారం బయట జరుగుతోందన్నారు. కవి నందిని సిధారెడ్డి, ఉద్యోగ సంఘాల నేత విఠల్, టీయూడబ్ల్యూజె కార్యదర్శి విరాసత్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
సైకిలెక్కి.. ఫైన్ కట్టి..
ప్రొఫెసర్ హరగోపాల్: హక్కుల ఉద్యమకారుడు జ్ఞాపకం: హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసే హరగోపాల్ సిటీలో రెండుసార్లు తప్పులు చేశారట. సైకిల్ రూల్స్ అతిక్రమించి కోర్టులో ఫైన్ కట్టారట. తన ఊరి గుట్టెక్కి చూసిన సిటీ విద్యుత్ వెలుగులు.. ఈ మహానగరంలో డబుల్ డెక్కర్‌లో పైన కిటికీ పక్కనే కూర్చుని ఎంజాయ్ చేసిన వైనం.. నాలుగు రూపాయల కిరాయి ఇంట్లో, కిరోసిన్ స్టవ్‌తో వంట చేసుకున్న సందర్భం ఎన్నటికీ మరువలేనంటారు. అక్షరాభ్యాసం నుంచి హైదరాబాద్ సిటీలో చదువు వరకు ప్రొఫెసర్ హరగోపాల్‌కు కేవలం రూ. 2400 ఖర్చయిందట. పౌర ఉద్యమాల రథసారథి జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే.. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు సమీపంలోని మొగిలిగిద్ద మా ఊరు. అక్కడి నుంచి హైదరాబాద్ రావడం అంటే అమెరికా వెళ్లినట్టే. ఒకే ఒక బస్సుండేది. ఉదయం బయల్దేరితే రాత్రికి హైదరాబాద్‌కు వచ్చేదా బస్సు. ఊరి బయట ఓ పెద్ద గుట్టమీద నిలబడి సరిగ్గా రాత్రి 7 గంటల సమయంలో రోజూ హైదరాబాద్ వైపే చూసేవాణ్ణి. ‘అబ్బ ఎంత కరెంటు.. ఎంత వెలుగు.. పున్నమి చంద్రుడిలా ఉంది కదా?’ అని ఫ్రెండ్స్‌తో అనేవాణ్ణి. హైదరాబాద్ వెలుగు చూడ్డానికే ఆ టైంలో గుట్టెక్కేవాళ్ళం. అబ్బ.. ఏం సిటీ! అదేమి అదృష్టమో 1960లో పీయూసీ కోసం 15 ఏళ్లకే హైదరాబాద్ వచ్చాను. భారీ భవంతులు, నిజాం కట్టడాలు, కళాకృతులు.. ఆ సంస్కృతి ఆనవాళ్లు, ఎటు చూసినా చెరువులు, చెట్లు.. పచ్చందనాలు అబ్బురపరిచేవి. వారానికోసారైనా పబ్లిక్ గార్డెన్‌కు వెళ్లడం అలవాటు. సిటీలో కేవలం నాలుగే థియేటర్లు ఉండేవి. అవి సాగర్ (అబిడ్స్), కమల్ (చాదర్‌ఘాట్), దీపక్ (చిక్కడపల్లి).. ఇంకోటి గుర్తులేదు. వాటిల్లో ఇంగ్లీష్ సినిమాలే ఆడేవి. బెస్ట్ సెలక్ట్ చేసుకుని చూసి కథను ఫ్రెండ్స్‌కు చెప్పేవాణ్ణి. మెహందీలో.. అద్దె గది వెదికి వెదికి మెహందీలో ఓ అద్దె గది తీసుకున్నా. దానికి కిరాయి నెలకు 4 రూపాయలు. స్వయం పాకమే ఆధారం. అమ్మ ఇచ్చిన పచ్చళ్లు, అప్పుడప్పుడు వండుకునే ఆకుకూరలు, ఇవే నా భోజనంలో ప్రధానం. తర్వాత సుల్తాన్‌బజార్‌లోని ఐడియల్ హోటల్ భోజనం గురించి విని.. ఓ వ్యక్తితో రోజూ కేరియర్ తెప్పించుకోవడం మొదలుపెట్టా. అతనికి నెలకు రూ.2 ఇచ్చేవాణ్ణి. హోటల్లో నెలకు రూ.10 ఇచ్చి ఒక్కసారే టిక్కెట్లు కొనేవాణ్ణి. ఒక పూట తెచ్చే కేరియరే రెండు పూటలా తినేవాణ్ణి. దాంతో నా కిరోసిన్ స్టౌ నా రూమ్‌లో గెస్ట్‌గానే మిగిలిపోయింది. అమ్మో.. పోలీస్ ఓ సైకిల్ కొనుకున్నాను. అప్పుడది ఫ్యాషన్. స్టేటస్ సింబల్ కూడా. సిటీలో డబుల్ డెక్కర్ బస్సులే ఉండేవి. అందులో పై అంతస్తులో ఎక్కి, కిటికీ పక్కన కూర్చుని సిటీని చూస్తుంటే మనసు పులకించేది. ద్విచక్ర వాహనాలు చాలా తక్కువ. కార్లు చూడటం ఓ వింతే. ముంబై మాదిరి ట్యాక్సీలుండేవి. నా సైకిల్‌కు ఓసారి ైలైట్ లేక.. మరోసారి సురేశ్ అనే ఫ్రెండ్‌ను ఎక్కించుకుని డబుల్ సవారీ చేయడంతో పోలీస్‌కు దొరికిపోయి, తర్వాత కోర్టుకు వెళ్లి రూ.5 చొప్పున జరిమానా కట్టాను. మదీనాకెళ్లానమ్మా! హైకోర్టుకు దగ్గరలో ఉండే మదీనాకు వెళ్లడం అప్పట్లో గొప్ప. అక్కడ టీ రేటెక్కువ. బన్‌తో కలిపి రూ.1 ఉండేది. చాలామంది వచ్చేవాళ్లు. ఆ కాసేపు వాళ్ల కళ్లల్లో స్టార్ హోటల్‌కు వెళ్లినంత ఫీలింగ్ ఉండేది. నేనూ ఎంతో గ్రేట్‌గా టీ తాగేవాణ్ణి. ఆ విషయాలన్నీ అమ్మకు ఉత్తరంలో రాసేవాణ్ణి. మా వాడు మదీనకు వెళ్లాడు అని అందరికీ అమ్మ చెప్పేదట. సాయంవేళ.. అదో అనుభవం ఇప్పుడున్న బిర్లామందిర్ ప్రాంతాన్ని అప్పట్లో నౌబత్పహడ్ అని పిలిచేవాళ్లు. అదో పెద్ద గుట్ట. అక్కడ కూర్చుంటే సిటీ మొత్తం కన్పించేది. సాయంత్రం వేళ ఫ్రెండ్స్‌తో వెళ్లేవాణ్ణి. చాలా విషయాలు తెలిసేవి. అబ్బ.. ఆ ఇడ్లీ ఇంకా గుర్తే ఇప్పుడు రవీంద్రభారతి ఉన్న పరిసరాల్లో గోపీ హోటల్ ఉండేది. అక్కడ కేవలం ఇడ్లీ మాత్రమే అమ్మేవాళ్లు. ఇది తినడానికి హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్లంతా వచ్చేవాళ్లు. ఎంత బాగుండేదో. అమ్మాయిలను.. కన్నెత్తి చూడలేదు స్కూల్ లైఫ్‌లో పదేళ్లూ ఓ అమ్మాయి నా క్లాస్మేట్. ఒక్కసారి కూడా మాట్లాడిన పాపానపోలేదు. సిటీకొచ్చాక కూడా అదే పరిస్థితి. బీఏ చదివేటప్పుడు ముగ్గురమ్మాయిలు క్లాస్‌లో ఉండేవాళ్లు. ఒకరివైపు ఒకరం చూసుకున్నదే లేదు. నాటి సామాజిక పరిస్థితులు అలా చేశాయేమో? ఇప్పటి దారుణాలను చూస్తే అదే మంచిదేమో అన్పిస్తోంది. ఆ జ్ఞాపకం.. మరువలేనిది అమ్మా క్షేమం అంటూ.. ఊరికి ఉత్తరం పంపడం, నాన్న నుంచి ఉత్తరం ఎప్పుడొస్తుందాని కాలేజీ పోస్టుబాక్సు వైపు ఎదురు చూడటం.. ఈ జ్ఞాపకం ఎప్పటికీ గుర్తే. - వనం దుర్గాప్రసాద్ -
వారి మధ్య లింకు కొత్తదేమీ కాదు!
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మధ్య లింకు కొత్తదేమీ కాదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఇద్దరి మధ్య సామాజిక ఆర్థిక పునాది ప్రపంచబ్యాంకేనని చెప్పారు. చంద్రబాబు అమలుచేసిన ఆర్థిక విధానాలే ఆయన్ని ప్రజలకు దూరంచేశాయని గుర్తు చేశారు. ఇదివరకు మతతత్వ శక్తులతో కలవనన్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ చారిత్రక తప్పిదానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ద్వేష రాజకీయాలు, దోపిడీ ఆర్థిక విధానాల మధ్య పొత్తుకు ప్రతిరూపమే చంద్రబాబు - మోడీ అన్నారు. మతోన్మాద రాజకీయాలకు ఆధ్యుడు మోడీ అని హరగోపాల్ విమర్శించారు. -
ప్రైవేటు విద్య అనాగరికం:ప్రొ..హరగోపాల్
ఏఐఎస్ఎఫ్ జాతీయ మహాసభలో ప్రొ.హరగోపాల్ హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రైవేటు విద్య అనాగరికమని సామాజిక వేత్త ప్రొ.హరగోపాల్ అన్నారు. ఓయూ క్యాంపస్ ఠాగూర్ ఆడిటోరియంలో జరుగుతున్న ఏఐఎస్ఎఫ్ జాతీయ మహాసభ రెండో రోజు శుక్రవారం ‘నయా ఉదార విధానాలు విద్యారంగంపై ప్రభావం’ అనే అంశంపై సదస్సు జరిగింది. కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభయ్ టెక్సాస్ అధ్యక్షత వహించగా ప్రొ. హరగోపాల్, ప్రొ.రమామెల్కొటే, ప్రొ.నాగేశ్వర్ వక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ దేశంలో 300 ప్రైవేటు విద్యా సంస్థలు నడిపిస్తున్న వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. వీరు దేశంలోకి విదేశీ వర్సిటీల ప్రవేశం కోసం యత్నిస్తున్నారని తెలిపారు. ప్రైవేటు విద్య వల్ల మానవతావాదులు కాకుండా వ్యాపార ధోరణి గల వ్యక్తులు తయారవుతారని చెప్పారు. కామన్ స్కూల్, నైబర్ స్కూల్ విద్యా విధానం కోసం పోరాడాలన్నారు. ఉన్నత విద్య బలోపేతానికి వర్సిటీలకు అధిక నిధులు కేటాయించాలని ప్రొ.నాగేశ్వర్ అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బయ్యన్న, అధ్యక్షులు అలీ ఉల్లా ఖాద్రీ, సహాయ కార్యదర్శి స్టాలిన్, జాతీయ అధ్యక్షులు పరంజీత్ ధాబా, కార్యదర్శి లెనిన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
అదే వారి భయం
కామారెడ్డి, న్యూస్‌లైన్ : 1967-69 తెలంగాణ ఉద్యమ సమయం లో, 1971-72 జైఆంధ్ర ఉద్యమ సమయంలో సీమాం ధ్రులు హైదరాబాద్ గురించి మాట్లాడలేదని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. 1972 తర్వాత ముల్కీ రూల్స్, తెలంగాణ రీజినల్ కమిటీలను తొలగించిన తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారు హైదరాబాద్‌లో అక్రమంగా ఉద్యోగాలు పొందారని ఆరోపించారు. 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాక వారి బలం మరింత పెరిగిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్‌లోని భూములను ఆక్రమిం చడం మొదలు పెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పా టైతే ఆ భూములపై హక్కు వదులుకోవాల్సి వస్తుందని భయపడి సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి న మూనా ప్రజలకు వ్యతిరేకమని తేలిపోయిందని హరగోపాల్ పేర్కొన్నారు. దేశ అభివృద్ధి సూచి 2.5 శాతం ఉన్నప్పుడు ఉద్యోగాలు లభించాయని, ఉద్యోగులకు పింఛన్లు సక్రమంగా ఉండేవని పేర్కొన్నారు. అభివృద్ధి సూచి 8 శాతానికి పెరిగాక కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతులు వచ్చాయని, ఉద్యోగుల పెన్షన్ తొలగించారని ఆరోపించారు. అందుకే తెలంగాణ ప్రజలు అభివృద్ధి నమునాకు వ్యతిరేకమన్నారు. విలువల పునర్నిర్మాణం జరగాలి ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోందని నిజాం కళాశాల ప్రొఫెసర్ కాశీం పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కన్నా ముందు ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో విలువలను పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ప్రజల శ్రమ ద్వారా ప్రభుత్వానికి అందే పన్నుల నుంచి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వేతనాలు అందుతున్నాయని, అయితే వారు చీకట్లో ఉన్న ఆ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నించకపోవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. కోస్తాంధ్ర పెట్టుబడిదారులు తమ డబ్బు, పలుకుబడితో రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, చివరకు రాష్ట్రపతి ద్వారానే బిల్లును వెనక్కి పంపే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రజాపోరాటాలను గుర్తించి రాష్ట్రం ఇస్తున్నారని అయితే పునర్నిర్మాణం విషయంలో ముందే జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయుల బాధ్యత మరింత ఎక్కువగా ఉందన్నారు. విష సంస్కృతి పల్లెలకు వ్యాపించింది కోస్తాంధ్ర పెట్టుబడిదారుల వల్లే మన పల్లెలకు విష సంస్కృతి వ్యాపించిందని కాశీం పేర్కొన్నారు. 60 ఏళ్ల కాలంలో మన సంస్కృతిని ధ్వంసం చేశారని, ప్రభుత్వ విద్యను మనకు అందకుండా చేశారని ఆరోపించారు. ఉపాధ్యాయులు రాబోయే తెలంగాణలో తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి, విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులకు ఐలమ్మ, కొమురం భీం, దొడ్డి కొమురయ్య, బందగి, షోయబుల్లాఖాన్లాంటి వీరుల త్యాగాలను వివరించాలన్నారు. అసలు పోరాటం ఇపుడే మొదలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాతే అసలు పోరాటం మొదలైందని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల భూమయ్య అన్నారు. తెలంగాణ వనరులను, ఉద్యోగాలను కొల్లగొట్టిన సీమాంధ్ర పాలకు లు హైదరాబాద్‌పై హక్కులు పొందేందుకు రకరకాల కుట్రలు పన్నుతున్నారన్నారు. ఇప్పటికే తెలంగాణలో లక్షన్నర మంది సీమాంధ్ర ఉద్యోగులు అక్రమంగా ఉన్నారని, అయితే 42 శాతం మంది ఇక్కడే ఉండే విధంగా కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వాటిని తిప్పికొట్టేందుకు తీవ్రమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకుతో తెలంగాణకు ముప్పన్నారు. ఖమ్మం జిల్లా ముంపునకు గురవుతుందని, దీంతో లక్షలాది ఆదివాసీలు నిర్వాసితులు అవుతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బూటకపు ఎన్కౌంటర్లు ఉండకూడదని, మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండాలని, దళితుల వర్గీకరణ జరగాలని, విద్య, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ ఉండకూడదని ప్రజలు కోరుతున్నారన్నారు. సమావేశంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.లక్ష్మణ్, ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే.వేణుగోపాల్, రిటైర్డ్ డైట్ లెక్చరర్ డాక్టర్ జి.లచ్చయ్య, తెరవే జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీఆర్.శర్మ, కర్షక్ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కే.రశీద్, టీపీఎఫ్ జిల్లా కన్వీనర్ పీవీఎస్.ఎన్.రాజు, ఎస్సీ, ఎస్టీ టీచర్స్ యూనియన్ నేత కొంగల వెంకటి, జేఏసీ నేతలు కొమ్ముల తిర్మల్‌రెడ్డి, వీఎల్ నర్సింహారెడ్డి, భూమన్న తదితరులు పాల్గొన్నారు. -
ఇదేనా కలిసుండే సంస్కృతి?
జనగామ, న్యూస్‌లైన్: ప్రజాతంత్ర హక్కుల పరిరక్షణలో పాలకులు వివక్ష చూపుతున్నారని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ ధ్వజమెత్తారు. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా జనగాంలోని జూబ్లీగార్డెన్స్లో ఆదివారం జరిగిన తెలంగాణలో ప్రజాతంత్ర హక్కులు అంశంపై ఆయన మాట్లాడారు. సభ పెట్టుకునే హక్కు ఉన్నట్లుగానే.. అభిప్రాయం తెలియజేసే స్వేచ్ఛ కూడా ఇతరులకుందన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లో నిర్వహించిన సభలో తెలంగాణకు చెందిన వ్యక్తి తన అభిప్రాయాన్ని వెలువరించినందుకు కొట్టించారని, కడప జిల్లాలో యూనివర్సిటీలో ఉపన్యాస కార్యక్రమానికి రాకుండా తనను అడ్డుకున్నారని తెలిపారు. ఇదేనా కలిసుందామనే సంస్కృతి అని ప్రశ్నించారు. ఇరువైపులా నుంచి కలుసుండాలనే భావన ఉంటేనే ఐక్యత సాధ్యమవుతుందని, ఒకరు విడిపోదామని చెబుతుంటే.. బలవంతంగా కలుసుందామనే భావన సరి కాదన్నారు. తెలంగాణ పౌరులు తమ ప్రాంతంలో సభ పెట్టుకుంటామని అడిగితే అనుమతివ్వని ప్రభుత్వం, సీమాంధ్రుల సభ విజయవంతానికి అన్నివిధాలా సహకరించిందన్నారు. వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ..పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని సీడబ్ల్యూసీలో చేసిన తీర్మానంలోనే కుట్ర దాగి ఉందని అన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం కోసమే సీమాంధ్ర పెట్టుబడి దారులు కుట్రతో ఉమ్మడి రాజధాని ప్రకటన చేయించారన్నారు. 1956లో తెలంగాణ రాష్ట్రం విలీనమైన సమయంలో పెట్టిన షరతులు అమలు కాకపోవడంతో విలీనం మాత్రమే రద్దవుతుందని ఆయన వివరించారు. -
లౌకిక ప్రజాస్వామ్యం నిర్మించాలి: వరవరరావు
హైదరాబాద్, న్యూస్‌లైన్: హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నిర్మించాలని దేశ ప్రజలకు విరసం(విప్లవ రచయితల సంఘం) సభ్యుడు వరవరరావు పిలుపునిచ్చారు. గుజరాత్ సీఎం నరేంద్రమోడీ హైదరాబాద్ రాకను నిరసిస్తూ ‘హిందూ ఫాసిస్టు వ్యతిరేక కలాల, గళాల, కవి, గాయక సమయం’ కార్యక్రమాన్ని స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వరవరరావు మాట్లాడుతూ.. హిందూ మతోన్మాదంతో దేశానికి అభివృద్ధి కంటే ప్రమాదమే ఎక్కువని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ అధికార దాహంతో ప్రధాని పదవి కోసం అర్రులు చాస్తున్నారని విమర్శించారు. మార్కెట్ ప్రేరేపిత విధ్వంసకర అభివృద్ధి నమూనాతో ముందుకు వస్తున్న మోడీని దేశ ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. తెలంగాణలో ముస్లింలు సవాలుగా మారారని భావించిన ఆర్ఎస్ఎస్, బీజేపీలు మోడీని రప్పించాయని ఆరోపించారు. విరసం రూపొందిం చిన ‘ఖబడ్దార్, గుజరాత్ గాయం-2’ ఫోల్డర్‌ను ప్రముఖ కవి దేవీ ప్రియ ఆవిష్కరించారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైన మోడీని ఆహ్వానించడాన్ని నిర్మొహమాటంగా వ్యతిరేకించాలని దేవీప్రియ అన్నారు. కార్యక్రమంలో అరుణోదయ విమలక్క, వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్, విర సం సభ్యులు గీతాంజలి, కృష్ణబాయి, ప్రజా కళామండలి నాయకులు కోటి, ఇంద్రవెల్లి రమేష్, రవిచంద్ర, వివేర, తెలంగాణ విద్యావంతుల వేదిక నేతలు శ్రీధర్ దేశ్‌పాండే, పిల్లలమర్రి రాములు, జంధ్యాల సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.