తెలంగాణ సర్కార్‌పై వరవరరావు, ప్రొఫెసర్ హరగోపాల్ ధ్వజం
హైదరాబాద్: రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక సదస్సును భగ్నం చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక స్వభావం బహిర్గతమైందని, సభ నిర్వహణ హక్కులను కాలరాసి, అక్రమ అరెస్ట్‌లు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాజకీయప్రత్యామ్నాయ వేదిక కన్వీనర్ వరవ రరావు అన్నారు. సోమవారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సదస్సు ఏర్పాటు నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ర్యాలీకి, ఇందిరాపార్క్ వద్ద బహిరంగ సభలో మైకు వినియోగించేందుకు అనుమతించాలంటూ తాము పోలీసులకు సెప్టెంబర్ 2న వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. పోలీసులు 19న అనుమతి నిరాకరిస్తూ, అభ్యంతరకరమైన కారణాలు చెబుతూ తమకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. తమ వేదిక మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘమని ఆరోపించారని మండిపడ్డారు. మావోయిస్టు రాజకీయాలతో ఏకీభవించని దేశవ్యాప్త ప్రజాస్వామికవాదులు, రచయితలు, గాంధేయవాదులు వేదికలో ఉన్నారని ఆయన తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒక్కటై ప్రజాస్వామ్య వాదులపై ఉక్కుపాదం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపి అనురాగ్‌శర్మ, కమిషనర్ మహేందర్‌రెడ్డిల అనుమతి అవసరం లేదన్నారు. తమ వేదిక ప్రభుత్వాలను కూల్చడానికి కాదని, రాజ్యాలను కూల్చడానికన్నారు. ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చామని, బంగారు తెలంగాణ నిర్మించడమే లక్ష్యమని ప్రకటించుకున్న కేసీఆర్ ఇవేవీ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ధార్మిక సంస్థ యిన తుల్జాభవన్ మేనేజర్‌ను బెదిరించారన్నారు. జార్ఖండ్ నుంచి వచ్చిన ప్రముఖ ఆదివాసీ కళాకారుడు జితేన్ మారాండీని, ఆయన బృందాన్ని అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. నాయకురాలు దేవేంద్ర ఇంటికి మగ పోలీసులు వెళ్లి అరెస్ట్ చే సేందుకు యత్నించి, హౌస్ అరెస్ట్ చేశారని తెలిపారు. హక్కుల నేతలు ప్రొఫెసర్ హరగోపాల్, రఘునాధ్‌లను గృహనిర్భందం చేశారని, ఏ సీఎం చేయని సాహసాన్ని కేసీఆర్ చేశారని మండిపడ్డారు. పోలీసులు మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తుంటే మీడియా కనీసం తమను వివరణ అడగకుండా తప్పుడు ప్రసారాలు చేస్తోందన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అందరి ఆకాంక్ష అని ఇక్కడి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాపాడుతుందని చెప్పిన కే సీఆర్ దానికి విరుద్ధంగా చేస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ సర్కారుది దమననీతి: తెలంగాణ ఉద్యమంలో నక్సల్స్ ఎజెండా తన ఎజెండా అని ప్రకటించి, సీఎం పదవి కంటె పౌరహక్కులసంఘం అధ్యక్షుడిగా పనిచేసేందుకు ఇష్టపడతాన న్న కె.చంద్రశేఖరరావు అధికారంలోకి రాగానే ప్రజలు, పౌరహక్కులపై దాడిని ప్రారంభించడం దారుణమని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రెండు వర్గాల నేతలు రాయల సుభాష్‌చంద్రబోస్, చంద్రన్న వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. గతంలో సీమాంధ్ర పాలకులు సాగించిన నిర్బంధకాండ, రాజ్యహింస, దమననీతినే కేసీఆర్ ప్రభుత్వం సాగిస్తోందని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నల్లమాస కృష్ణ, నేతలు మండిపడ్డారు.
ప్రజా వ్యతిరేక స్వభావం వెల్లడైంది
Published Tue, Sep 23 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM
Advertisement
Advertisement