- ప్రొఫెసర్ హరగోపాల్ చైర్మన్‌గా 27 మందితో ఏర్పాటు
- ప్రొఫెసర్ కోదండరాం, చుక్కా రామయ్య తదితరులకు చోటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్షల విధి విధానాల్లో మార్పులు, చేర్పులపై అధ్యయనానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్‌సీ) కమిటీని ఏర్పాటు చేసింది. 27 మంది నిపుణులతో కూడిన ఈ కమిటీకే సిలబస్ మార్పుల అంశాన్నీ అప్పగించింది. ఈ మేరకు టీఎస్ పీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీకి సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
పోటీ పరీక్షల విధి విధానాలతో పాటు సిలబస్‌లో మార్పులను కూడా ఈ కమిటీ సిఫారసు చేస్తుందని.. అయితే ముందుగా పరీక్ష విధివిధానాలకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుందని చక్రపాణి తెలిపారు. సిఫారసులతో కూడిన అధ్యయన నివేదికను మూడు వారాల్లో ఇవ్వాలని కమిటీకి స్పష్టం చేశామని చెప్పారు. నివేదిక వచ్చిన వెంటనే కమిషన్ దానిని పరిశీలించి ఈ నెలాఖరులో ప్రభుత్వ ఆమోదానికి పంపుతుందని వెల్లడించారు.
కమిటీలో సభ్యులు వీరే: కమిటీలో విద్యావేత్త చుక్కా రామయ్య, ఓయూ ప్రొఫెసర్లు ఎం.కోదండరాం, కె.నాగేశ్వర్, రమా మేల్కొటే, జీబీ రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఎస్.మల్లేశ్, తెలుగు వర్సిటీ వీసీ శివారెడ్డి, న్యాక్ మాజీ డెరైక్టర్ వీఎస్ ప్రసాద్, కాకతీయ వర్సిటీ మాజీ వీసీ లింగమూర్తి, రిటైర్డ్ ప్రొఫెసర్లు అడపా సత్యనారాయణ, బీనా, భూపతిరావు, సెస్ నుంచి డాక్టర్ ఇ.రేవతి, ఐసీఎస్‌ఎస్‌ఆర్ దక్షిణ భారత రీజియన్ చైర్మన్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి, ఏపీ సెట్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సి.గణేష్, మౌలానా ఆజాద్ ఉర్దూ వర్సిటీ ప్రొఫెసర్ వహీదుల్లా సిద్ధిఖీ, డాక్టర్ కనకదుర్గ, అంబ్కేదర్ వర్సిటీ ప్రొఫెసర్ సి.వెంకటయ్య, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన నిశాంత్ డోంగరి, రిటైర్డ్ లెక్చరర్ నందిని సిధారెడ్డి, సెంట్రల్ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ రాజశేఖర్, కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్ భద్రూనాయక్, హైదరాబాద్ వర్సిటీ ప్రొఫెసర్ జె.మనోహర్‌రావు, కాకతీయ వర్సిటీ నుంచి డాక్టర్ టి.శ్రీనివాస్, గజ్వేల్ జీఎంఆర్ పాలిటెకి ్నక్ విభాగాధిపతి డాక్టర్ భైరి ప్రభాకర్, నల్సార్ నుంచి డాక్టర్ ఎన్.వసంత్ తదితరులను కమిటీ సభ్యులుగా నియమించారు.