వారి మధ్య లింకు కొత్తదేమీ కాదు!
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మధ్య లింకు కొత్తదేమీ కాదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఇద్దరి మధ్య సామాజిక ఆర్థిక పునాది ప్రపంచబ్యాంకేనని చెప్పారు. చంద్రబాబు అమలుచేసిన ఆర్థిక విధానాలే ఆయన్ని ప్రజలకు దూరంచేశాయని గుర్తు చేశారు.
ఇదివరకు మతతత్వ శక్తులతో కలవనన్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ చారిత్రక తప్పిదానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ద్వేష రాజకీయాలు, దోపిడీ ఆర్థిక విధానాల మధ్య పొత్తుకు ప్రతిరూపమే చంద్రబాబు - మోడీ అన్నారు. మతోన్మాద రాజకీయాలకు ఆధ్యుడు మోడీ అని హరగోపాల్ విమర్శించారు.