
చంద్రబాబు 'జిత్తులమారి నక్క'
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు జిత్తులమారి నక్క అని కేసీఆర్ అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నల్గొండ జిల్లా చుండూరులో నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ... ప్రపంచంలో చంద్రబాబులా రంగులు మార్చే నాయకులు మరోకరు లేరని ఎద్దేవా చేశారు.
గతంలో గుజరాత్ అల్లర్లకు కారణమైన మోడీని అరెస్ట్ చేయిస్తానని చెప్పిన బాబు ... ఇప్పుడు అదే మోడీతో అంటకాగుతున్నారంటూ ఆరోపించారు. మోడీ పంచన చేరి బాబు.. మోడీ జపం చేస్తున్నాడని విమర్శించారు. అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర ప్రాంతాలలో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని... అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని బాబుపై కేసీఆర్ నిప్పులు చెరిగారు.