దేశానికి మోడీ పాలన అవసరం:చంద్రబాబు నాయుడు
మహబూబ్ నగర్:బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పొగడ్తలతో ముంచెత్తారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు ఎన్డీఏ సభలో ప్రసంగించిన చంద్రబాబు.. దేశానికి మోడీ పాలన అవసరమని అభిప్రాయపడ్డారు. అవినీతి బారిన పడ్డ దేశాన్ని కాపాడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ఈ సభలో చంద్రబాబు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సభను చూస్తుంటే మోడీ దేశానికి ప్రధాని ప్రమాణ స్వీకారం చేయబోయే రోజులని గుర్తుకు తెస్తుందంటూ తన విధేయతను చాటుకున్నారు.
కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయమని బాబు జోస్యం చెప్పారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం సర్వ నాశనం అయ్యిందని విమర్శించారు. ఇటు తెలంగాణలోనూ, సీమాంధ్ర్లలోనూ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.