
ఉచిత విద్యంటూనే.. పాఠశాలల మూసివేతా?
ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్: పీజీ వరకూ ఉచితంగా విద్య అందిస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఉన్న పాఠశాలలను మూసేయాలనుకోవడం తగదని సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రస్తుతం విద్యావిధానం కాషాయీకరణతోపాటు ప్రైవేటీకరణలో సంఘ్ పరివార్ భాగస్వామ్యం అవుతోంద ని ఆందోళన వ్యక్త పరిచారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో హరగోపాల్ విలేకరులతో మాట్లాడారు.
ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ సంస్థ అఖిల భారత శిక్షా సంఘర్ష్ యాత్ర-2014’ తెలంగాణలో నవంబర్ 2 నుంచి 27 వరకు అన్ని డివిజన్లలో సాగుతుందనీ చివరకు ఆదిలాబాద్ జిల్లాలో ముగిసి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందన్నా రు. సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అధ్యక్షుడు కె. చక్రధరరావు మాట్లాడుతూ విద్యను ప్రభుత్వాలు వ్యాపారంగా భావిస్తున్నాయన్నారు.