
ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ నిర్లక్ష్యం వల్లే...
అటవీశాఖ ఆధీనంలోని ఎర్రచందనం దుంగలు బయటకు వెళ్లిన నేపథ్యంలో నూజివీడు అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్
నిర్ధారించిన అటవీశాఖ ఉన్నతాధికారులు
ఎర్రచందనం తరలింపులో చర్యకు రంగం సిద్ధం
పోలీసు దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు
విజయవాడ సిటీ : అటవీశాఖ ఆధీనంలోని ఎర్రచందనం దుంగలు బయటకు వెళ్లిన నేపథ్యంలో నూజివీడు అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ హరగోపాల్‌పై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. విధుల నిర్వహణలో ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు అటవీ శాఖ ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. ఇప్పటికే పోలీసు కేసు నమోదైనందున దర్యాప్తులో వెలుగు చూసే అంశాల ఆధారంగా మిగిలిన వారిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 2012లో మల్లవల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన 11 టన్నుల బరువైన 465 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకొని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. అక్రమంగా తరలించే కలపను ప్రత్యేకంగా భద్రపరిచేందుకు తగిన గోదాములు లేకపోవడంలో అటవీశాఖ కార్యాలయాల్లోనే వాటిని ఉంచుతున్నారు. ఎర్రచందనం సహా ఏ విధమైన కలపనైనా సంబంధిత సెక్షన్ అధికారి కస్టడీలో ఉంచుతారు.
ఈ క్రమంలోనే మల్లవల్లిలో పట్టుబడిన ఎర్రచందనం దుంగలను నూజివీడు సెక్షన్ ఆఫీసర్ కస్టడీలో భద్రపరిచారు. బుధవారం అటవీశాఖ కార్యాలయానికి కొద్ది దూరంలోని పొదల్లో 25 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. వాటిని పరిశీలించిన జిల్లా అటవీశాఖ అధికారులు మల్లవల్లిలో స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలుగా నిర్థారించారు. పట్టుబడిన లారీలోని దుంగలను లెక్కించగా 440 దుంగలు మాత్రమే ఉన్నాయి. పైగా అప్పట్లో అటవీ అధికారులు వేసిన నంబర్లు కూడా పట్టుబడిన దుంగలపై ఉన్నాయి. వీటిని సరిపోల్చుకున్న అధికారులు లారీలోని దుంగలను తరలించిన వ్యక్తులు సమీపంలోని పొదల్లో నిల్వ చేసినట్టు నిర్థారించారు. ఇందుకు సెక్షన్ అధికారి నిర్లక్ష్యమే కారణంగా భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఆదేశాలు జారీకానున్నాయి. ఇదే సమయంలో ఇంటి దొంగలే ఎర్రచందనం దుంగలు తరలించేందుకు సిద్ధపడ్డారా? లేక ఇంటి దొంగల సహకారంతో స్మగ్లర్లు ఇందుకు ఒడిగట్టారా? అనే అంశంపై అధికారులు దృష్టిసారించారు. దీనిని నిర్థారించుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు విచారణలో వెలుగు చూసే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.
ఇంటి దొంగల సహకారమే
అటవీశాఖ ఉద్యోగుల సహకారంతోనే లారీలోని ఎర్రచందనం దుంగలు బయటకు వెళ్లినట్టు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. నూజివీడులో ఎర్రచందనం దుంగలు దొరికినట్టు తెలియగానే జిల్లా అటవీశాఖ అధికారి ఎస్.రాజశేఖర్ తదితర అధికారులు గురువారం వెళ్లి విచారణ జరిపారు. దుంగలను కప్పిపెట్టిన పట్టా(టార్ఫాలిన్ కవర్) చివికిపోయి ఉండటాన్ని బట్టి నెల రోజుల కంటే ముందే అక్కడికి చేరవేసినట్టు భావిస్తున్నారు. అక్కడ నిల్వ చేసిన తర్వాత వీలునుబట్టి తరలించేందుకు సిద్ధపడి ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో ఇటీవల కురిసన వర్షాలు, ఎండలకు పట్టా చివికిపోయి ఉంటుందని చెపుతున్నారు. ఇంతటి సాహసం బయటి వ్యక్తులు చేసే అవకాశం లేదనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. గతంలో పట్టుబడిన వ్యక్తులు పరిసర గ్రామాలకు చెందిన వారైనందున అటవీశాఖ సిబ్బం ది సహకారంతో వాటిని అక్కడికి తరలించి ఉండొచ్చనేది అధికారుల అభిప్రా యం. ఆ తర్వాత రాష్ట్రంలోని పరిణామాల నేపథ్యంలో బయటకు తరలిం చేందుకు బయపడి వదిలేసి ఉంటారని, అవకాశం లేదు కాబట్టి వాటితో పాటు మిగి లిన దుంగలు తరలిపోకుండా ఉండొచ్చం టూ ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.