
న్యూఢిల్లీ: భారతదేశం సరిహద్దు వెంబడి ఒక భారీ గోడను నిర్మించనుంది. ఈ గోడ 1,400 కిలోమీటర్ల పొడవున ఉండనుంది. ఇది గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించి ఉంటుంది. పాకిస్తాన్(Pakistan) సరిహద్దుల్లో ఉన్న ఎడారి ప్రాంతాలను తిరిగి పచ్చగా మార్చడమే లక్ష్యంగా ఈ గోడను నిర్మించనున్నారు.
ఆరావళి పర్వత శ్రేణి(Aravalli mountain range)ని పచ్చగా మార్చడం, సహజ అడవులను కాపాడటం, చెట్లు, మొక్కల పరిరక్షణ, వ్యవసాయ భూమి, నీటి వనరులను కాపాడేందుకు ఈ భారీ గోడను నిర్మించాలని భారత్ భావిస్తోంది. ఇది చైనా గ్రేట్ వాల్ మాదిరిగా ఉంటుదనే మాట వినిపిస్తోంది. గుజరాత్‌లోని పోర్‌బందర్ నుండి ఢిల్లీలోని మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వరకు 1,400 కి.మీ పొడవైన గ్రీన్ వాల్‌ను నిర్మించనున్నారు. ఇది మహాత్మా గాంధీ జన్మస్థలం, సమాధి స్థలాలను అనుసంధానిస్తుంది.
ఇది రాజస్థాన్, హర్యానాలోని 27 జిల్లాల్లో విస్తరించి ఉన్న ఆరావళి అటవీ పునరుద్ధరణ ప్రాజెక్ట్. దీని వలన 1.15 మిలియన్ హెక్టార్లకు పైగా భూభాగంలో అడవుల పునరుద్ధరణ, చెట్లను నాటడం, వ్యవసాయ యోగ్యమైన భూమి, నీటి వనరుల పునరుద్ధరణ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఆఫ్రికన్ యూనియన్‌కు చెందిన ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ప్రాజెక్ట్ నుండి ప్రేరణ పొందింది. ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ. 7,500 కోట్లు. దీనికి కేంద్రం 78 శాతం, రాష్ట్రాలు 20 శాతం, అంతర్జాతీయ సంస్థలు రెండు శాతం నిధులు సమకూర్చనున్నాయి. ఈ ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: దర్గాలోకి బూట్లతో వచ్చిన విదేశీ విద్యార్థులపై దాడి
Comments
Please login to add a commentAdd a comment