ఒట్టావా : టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారు నలుగురు ప్రాణాలు తీసింది. కెనడా టొరంటో నగరం లేక్ షోర్ బౌలేవార్డ్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృత్యువాత పడ్డారు. ఓ యువతి ప్రాణపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుజరాత్‌లోని గోద్రా చెందిన ఒకే కుటుంబసభ్యులు కేట్ గోహిల్,నీల్ గోహిల్‌తో పాటు వారి స్నేహితులు ఆ కారులో ఉన్నట్లు కెనడా స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
స్థానిక పోలీసుల సమాచారం మేరకు..
టొరంటో నగరంలో బుధవారం అర్ధరాత్రి 12:15 గంటల సమయంలో లేక్ షోర్ బౌలేవార్డ్ రహదారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారులో అతి వేగతంతో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో టెస్లా కారు బ్యాటరీలో లోపాలు తలెత్తాయి. కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గార్డ్ రైల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో టెస్లా కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కారులో ఉన్న యువతి యువకులు మంటల్లో చిక్కుకున్నారు.
సరిగ్గా ప్రమాదం జరిగి వెంటనే ఆటుగా వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు టెస్లా కారు అద్దాలు పగులగొట్టి బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. కారు లోపల ఉన్న ఓ యువతిని బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు సమాచారం.
టెస్లా కారు ప్రమాదంపై స్థానికుడు ఫోర్‌మెన్ బారో మాట్లాడుతూ..ప్రమాదం జరిగిన ప్రాంతంలో నది ప్రవహిస్తుంది. ఆ నదికి ఎదురుగా మేం ఉన్నాం. కారు నుంచి 20 నుంచి 20 అడుగుల పైకి మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో వెంటనే బాధితుల్ని రక్షించేందుకు ప్రయత్నించాం. అప్పటికే ఘోరం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద ఘటనపై భారత్‌లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment