self driving car
-
ప్రాణం తీసిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్.. నలుగురు భారతీయులు దుర్మరణం
ఒట్టావా : టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారు నలుగురు ప్రాణాలు తీసింది. కెనడా టొరంటో నగరం లేక్ షోర్ బౌలేవార్డ్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృత్యువాత పడ్డారు. ఓ యువతి ప్రాణపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుజరాత్‌లోని గోద్రా చెందిన ఒకే కుటుంబసభ్యులు కేట్ గోహిల్,నీల్ గోహిల్‌తో పాటు వారి స్నేహితులు ఆ కారులో ఉన్నట్లు కెనడా స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక పోలీసుల సమాచారం మేరకు..టొరంటో నగరంలో బుధవారం అర్ధరాత్రి 12:15 గంటల సమయంలో లేక్ షోర్ బౌలేవార్డ్ రహదారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారులో అతి వేగతంతో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో టెస్లా కారు బ్యాటరీలో లోపాలు తలెత్తాయి. కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గార్డ్ రైల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో టెస్లా కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కారులో ఉన్న యువతి యువకులు మంటల్లో చిక్కుకున్నారు.సరిగ్గా ప్రమాదం జరిగి వెంటనే ఆటుగా వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు టెస్లా కారు అద్దాలు పగులగొట్టి బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. కారు లోపల ఉన్న ఓ యువతిని బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు సమాచారం.టెస్లా కారు ప్రమాదంపై స్థానికుడు ఫోర్‌మెన్ బారో మాట్లాడుతూ..ప్రమాదం జరిగిన ప్రాంతంలో నది ప్రవహిస్తుంది. ఆ నదికి ఎదురుగా మేం ఉన్నాం. కారు నుంచి 20 నుంచి 20 అడుగుల పైకి మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో వెంటనే బాధితుల్ని రక్షించేందుకు ప్రయత్నించాం. అప్పటికే ఘోరం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద ఘటనపై భారత్‌లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని తెలిపారు. -
మస్క్‌కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
తన సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల మ్యాపింగ్, నావిగేషన్ ఫంక్షన్ల కోసం చైనా అతిపెద్ద సెర్చింజిన్ బైదూతో ప్రముఖ ఈవీ దిగ్గజం టెస్లా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో చైనాలో టెస్లా లేటెస్ట్ డ్రైవింగ్ ఫీచర్లను పరిచయం చేయడానికి కీలకమైన అడ్డంకిని తొలగించుకోబోతుందని తెలుస్తోంది. ఫలితంగా టెస్లా స్టాక్ ధర 10 శాతానికి పైగా పెరిగింది.బైదూ అందించే టాప్ లేన్ లెవల్ నావిగేషన్, మ్యాపింగ్ ఆధారంగా టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల సేవలను అందుబాటులోకి తెచ్చే సౌలభ్యం కలగనుందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కాగా, టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థ ఇప్పటి వరకు చైనాలో అందుబాటులో లేదు. దీన్ని అక్కడ ప్రవేశపెట్టేలా చైనా ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో చైనా కస్టమర్లకు సంబంధించిన డేటాను దేశం వెలుపలికి తీసుకెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో చైనా వెలుపలికి డేటాను బదిలీ చేసే అంశంపై కూడా మస్క్ ప్రభుత్వంతో చర్చించారు. -
సెల్ఫ్ డ్రైవింగ్ కారు తయారు చేసిన రైతు బిడ్డ, ముచ్చటపడ్డారు కానీ రిజెక్ట్!
మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన రైతు బిడ్డ 'హర్షల్ నక్షనేని' (Harshal Nakshane) హైడ్రోజన్‌తో నడిచే AI కారును రూపొందించి.. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి 'దేవేంద్ర ఫడ్నవిస్' చేత ప్రశంసలందుకున్న విషయం గతంలో తెలుసుకున్నాం. అయితే ఈ కారు అభివృద్ధికి షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3లోని పారిశ్రామిక వేత్తలు పెట్టుబడుల పెట్టడానికి నిరాకరించారు. స్టార్టప్ AI కార్స్‌కు చెందిన హర్షల్ మహదేవ్ నక్షనేని సుమారు 18 నెలలు శ్రమించి భారతదేశపు మొట్ట మొదటి ఏఐ ఆధారిత హైడ్రోజన్ కారు రూపొందించారు. ఈ కారు నిర్మాణానికి ఏకంగా రూ. 60 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ కారుని హర్షల్ షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3లోని పారిశ్రామిక వేత్తలు ముందుకు తీసుకువచ్చారు. ఏఐ కారు రీఫ్యూయలింగ్ సమయం కేవలం ఐదు నిముషాలు మాత్రమే. ఇది 1000 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుందని హర్షల్ వెల్లడించారు. ఈ ఏఐ కారు పారిశ్రామిక వేత్తలను ఎంతగానో ఆకర్శించింది, అయితే పెట్టుబడి పెట్టడానికి మాత్రం నిరాకరించారు. ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌లు పనిచేయవు! కారణం ఇదే.. హైడ్రోజన్ శక్తితో నడిచే వాహనాలకు మార్కెట్ తక్కువగా ఉండటమే కాకుండా.. ఇలాంటి వాటికి సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం కారణంగా పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపలేదు. అయితే ఈ కారు వారు స్వయంగా డ్రైవ్ చేసి 'హర్షల్' పనితీరుని ప్రశంసించారు. -
రూ.150 ఖర్చుతో 300 కిమీ ప్రయాణం.. కొత్త కారుతో సత్తా చాటిన రైతుబిడ్డ!
గత ఏడాది మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన రైతు బిడ్డ 'హర్షల్ నక్షనేని' (Harshal Nakshane) హైడ్రోజన్‌తో నడిచే కారును రూపొందించి అందరి చేత ప్రశంసలందుకున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి 'దేవేంద్ర ఫడ్నవిస్' (Devendra Fadnavis) ఈ కారుని వీక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ అందించే ఈ కారు ప్రత్యేకమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. ఇంత గొప్ప కారుని తయారు చేసిన నక్షనేనిని 'దేవేంద్ర ఫడ్నవిస్' కలిసి అభినందించారు. అంతే కాకుండా అతన్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. గ్రీన్ కలర్లో కనిపించే ఈ కారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేస్తూ 'సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్' పొందినట్లు హర్షల్ వివరించారు. ఇది ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో కారు తనకు తానుగానే ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఈ హైడ్రోజన్ కారుని తయారు చేయడానికి హర్షల్ నక్షనేనికి సుమారు రూ. 25 లక్షలు ఖర్చు అయినట్లు వెల్లడించాడు. ఈ కారు కేవలం రూ.150 హైడ్రోజన్‌తో ఏకంగా 300 కిమీ పరిధిని అందిస్తుందని తెలిపాడు. ఫెరారీ కారుని తలపించే డోర్స్, సన్‌రూఫ్ వంటివి ఇందులో మరింత ప్రత్యేకంగా కనిపిస్తాయి. గ్రీన్ కలర్ హోమ్మేడ్ హైడ్రోజన్ కారు ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండటం వల్ల ఖచ్చితమైన లాంచ్ గురించి వివరించలేదు. అంతే కాకుండా ఈ కారుకు సంబంధించిన మరిన్ని స్పెసిఫికేషన్లను వెల్లడించాల్సి ఉంది. దీనికోసం Aicars.in వెబ్సైట్లో బుకింగ్ చేసుకోవచ్చని వారు వెల్లడించారు. ఇలాంటి వాహనాలు భారతదేశంలో చట్టవిరుద్ధం హర్షల్ నక్షనేని అద్భుతమైన సృష్టి అందరి ఆకట్టుకుంటున్నప్పటికీ.. భారతదేశంలో అమలులో ఉన్న మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద ఇలాంటివి పబ్లిక్ రోడ్డుమీద ఉపయోగించడానికి ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే ఇండియాలో ఒక వాహనం రోడ్డు మీదికి రావాలంటే ఖచ్చితంగా 'ఏఆర్ఏఐ' (Automotive Research Association of India) దృవీకరించాలి. మన దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలను ప్రవేశపెడుతున్నాయి. కాబట్టి ఒక వాహనం పబ్లిక్ రోడ్ల మీదికి రావాలంటే సంబంధిత వివిధ అధికారుల నుంచి ఆమోదం పొందాలి. లేకుంటే ఇవి ప్రాజెక్ట్ కార్లుగా పరిగణించి, రేసింగ్ ట్రాక్‌లు లేదా ఫామ్‌హౌస్‌ల వంటి ప్రైవేట్ ప్రాపర్టీలకు మాత్రమే పరిమితం చేస్తారు. పబ్లిక్ రోడ్లలో ఇలాంటి వాహనాలు కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇదీ చదవండి: ఆగని యుద్ధం.. పోయిన లక్షల ఉద్యోగాలు - ఐఎల్ఓ సంచలన రిపోర్ట్ ప్రస్తుతం మన దేశంలో హైడ్రోజన్ కార్ల వినియోగానికి కావాల్సిన కనీస సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. కానీ ఫ్యూయెల్ కార్ల కంటే ఎక్కువ పరిధిని, తక్కువ కాలుష్యం కలిగించే ఇలాంటి వాహనాలను వినియోగించాలని గతంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రస్తావించారు. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో హైడ్రోజన్ కార్ల వినియోగం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. Blazing a trail from Chandrapur, Maharashtra, this AI-powered hydrogen car is a game-changer! It was great meeting Maharashtra's Innovative Genius, Harshal Nakshane, a farmer's son from Chandrapur, yesterday in Mumbai. He cracked a groundbreaking innovation - an AI-controlled… pic.twitter.com/tdANS9YNIp — Devendra Fadnavis (@Dev_Fadnavis) October 29, 2023 -
భారతదేశపు మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు - లాంచ్ ఎప్పుడంటే?
zPod Autonomous Driving Consept: భారతదేశంలో డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు కూడా వచ్చేసాయి. అయితే త్వరలోనే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే మన దేశంలో అక్కడక్కడా అన్యదేశ్యపు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు దేశంలోనే మొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారును బెంగళూరుకు చెందిన 'మైనస్ జీరో' (Minus Zero) సంస్థ ఆవిష్కరించింది. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో వినియోగంలో ఉన్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు భారతదేశంలో కూడా త్వరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మైనస్ జీరో కంపెనీ విడుదల చేయనున్న ఈ కారు పేరు 'జెడ్పాడ్' (zPod). ఇది భారతీయ రోడ్ల మీద త్వరలోనే పరుగులు పెట్టే అవకాశం ఉంటుంది. భారతదేశపు మొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు.. మైనస్ జీరో జెడ్పాడ్ వెహికల్ చూడటానికి చిన్నగా ఉంటుంది. అయితే ఇది ఎలాంటి పరిస్థితుల్లో అయినా డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇందులో స్టీరింగ్ వీల్ లేకపోవడం గమనార్హం. అయితే దీనికి బదులుగా అనేక హై- రిసొల్యూషన్ కెమెరాలు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా ట్రాఫిక్ వంటి సమయంలో డ్రైవింగ్ ఎనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది లెవెల్ 5 అటానమీ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ కారు అని కంపెనీ చెబుతోంది. (ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. వారు చేసే బిజినెస్ ఏంటో తెలుసా?) లెవెల్ 5 అటానమీ కలిగి ఉండటం వల్ల మనుషుల ప్రమేయం లేకుండా సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంది. ఇందులోని కెమెరా సెన్సార్లు వాహన పరిసరాలను రియల్ టైమ్ ఇమేజ్ వంటి వాటిని క్యాప్చర్ చేసుకోగలదు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, కావున వెహికిల్‌ని నావిగేట్ చేస్తుంది. అవసరమైనప్పుడు స్పీడ్ పెరుగుతుంది, ఏవైనా అడ్డంకులు వస్తే వాహనాన్ని ఆపుతుంది. (ఇదీ చదవండి: మెట్లెక్కిన మహీంద్రా స్కార్పియో ఎన్.. వైరల్ అవుతున్న వీడియో & ఫిదా అవుతున్న జనం) లాంచ్ టైమ్.. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారు క్యాంపస్ లేదా పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వంటి క్లోజ్డ్ ఏరియాల్లో ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కారు గూగుల్ అండ్ టెస్లా కార్లకు ధీటుగా ఇండియాలో రూపుదిద్దుకోనుంది. ఈ కారు ఇండియన్ మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుందని వివరాలను కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు. కానీ త్వరలోనే మార్కెట్లో విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. -
ఎలాన్ మస్క్‌కు ఝలక్: లెవల్-3 అటానమస్ కార్ల తొలి కంపెనీ ఏదంటే?
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్‌కు షాక్ తగిలింది.సెల్ఫ్-డ్రైవింగ్ కార్లలో టెస్లాను బీట్ చేసింది మరో టాప్ కార్‌మేకర్ మెర్సిడెస్. అమెరికాలో లెవెల్-3 అటానమస్ సర్టిఫైడ్ కార్లను అందించిన తొలి కంపెనీగా అవతరించింది. తద్వారా ఇటీవలి కీలకమైన రేసులో మెర్సిడెస్ టెస్లాపై పైచేయి సాధించింది. లెవెల్-3 ఆటోమేషన్, కండిషనల్ ఆటోమేషన్‌గా పిలిచే ఈ రేసులో మెర్సిడెస్ దూసుకొచ్చింది. సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ (SAE) ద్వారా డ్రైవింగ్ ఆటోమేషన్ లెవల్-3గా వర్గీకరించింది. ఇది నిర్దిష్ట పరిస్థితులలో కారును స్వయంగా నడపడానికి అనుమతిస్తుంది. స్టీరింగ్ పట్టుకోవాల్సిన, బ్రేక్‌ను కంట్రోల్ చేయాల్సిన అవసరం లేకుండానే కారు నడిపవచ్చు. అయితే డ్రైవర్ అప్రమత్తంగా ఉంటూ, ఏ క్షణంలోనైనా కంట్రోల్లోకి తీసుకునేలా అలర్ట్‌గా ఉండాలి. లెవల్-3 ఆటోమేషన్ కోసం ప్రంపచవ్యాప్తంగా దిగ్గజ ఆటో కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అయితే ఈ విషయంలో టెస్లా, దాని ఫుల్లీ సెల్ఫ్-డ్రైవింగ్ ఫీచర్ ముందంజలో ఉన్నప్పటికీ కానీ సమయానికి అవసరమైన ధృవపత్రాలను పొందలేకపోయినట్టు తెలుస్తోంది. అయితే నిబంధనల పరంగా లెవెల్-3 ఆటానమస్ అంతా ఆశాజనంగా లేకపోవడం గమనించదగ్గ విషయం. చాలా దేశాల్లో ఇంకా లెవల్-3 ఆటోమేషన్ వాహనాలకు నిర్దిష్ట నిబంధనలను కలిగి లేవు . అలాగే ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్, కారు తయారీదారుకు సంబంధించిన చట్టపరమైన బాధ్యతలపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో మాత్రమే అనుమతి. "ఇన్నోవేషన్ పట్ల తిరుగులేని నిబద్ధతే మెర్సిడెస్-బెంజ్‌ను మొదటి నుండి నిలకడగా మార్గ నిర్దేశనం చేసిందనీ, దీన్ని కొనసాగించడతోపాటు, లెవల్-3 షరతులతో కూడిన ఆటోమేటెడ్ డ్రైవింగ్ సర్టిఫికేట్ పొందిన తొలి ఆటోమోటివ్ కంపెనీ నిలవడం గర్వకారణమని మెర్సిడెస్ అమెరికా మార్కెటింగ్ అండ్ సేల్స్ హెడ్, సీఈవో హెడ్ డిమిట్రిస్ పిసిలాకిస్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. లెవెల్-3 స్వయంప్రతిపత్తి సాంకేతికత అభివృద్ధి పూర్తిగా ఆటోమేటెడ్ డ్రైవింగ్‌కు ప్రయాణంలో ఒక అడుగు మాత్రమే, ఇంకా చాలా పురోగతి సాధించాల్సి ఉందని ఆటో పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అయితే, మెర్సిడెస్ సాధించిన లెవెల్-3 ఆటోమేషన్ విజయం ఆటో పరిశ్రమకు కొత్త ప్రమాణాన్ని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున, లెవల్-3 నుంచి లెవల్-4,లెవల్-5 ఆటోమేషన్ ఉన్నత స్థాయి అటానమస్ డ్రైవింగ్ అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ కార్లను రోడ్లపై దూసుకుపోయేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూడాలి. -
టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అభిమానులకు ఎలాన్ మస్క్ శుభవార్త!
టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అభిమానులకు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ శుభవార్త చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్లను భారీ ఎత్తున విడుదల చేసేలా ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. 2014 నుంచి ఎలాన్ మస్క్ టెస్లా సెల్ఫ్ డ్రైవ్ ఎలక్ట్రిక్ కార్లపై పనిచేస్తున్నారు. నాటి నుంచి ఆ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో లోపాలు తలెత్తడం, టెస్ట్ డ్రైవ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. అందుకే ఈ కార్లను మార్కెట్లోకి విడుదల చేసేలా అనుమతి ఇచ్చేందుకు ఆయా దేశాలు నిరాకరిస్తూ వస్తున్నాయి. అయితే ఈ తరుణంలో యూరప్ దేశమైన నార్వేలో జరిగిన ఎనర్జీ కాన్ఫరెన్స్‌లో మస్క్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన దృష్టిని స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ స్పేస్‌క్రాఫ్ట్, సెల్ఫ్ డ్రైవింగ్ టెస్లా ఎలక్ట్రిక్ కార్లపై కేంద్రీకరించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సెల్ఫ్ డ్రైవ్ కార్లను ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేయాలని భావిస్తున్నా. ఆమోదాన్ని బట్టి అమెరికా, ఐరోపాలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నాం అని అన్నారు. చమురు, గ్యాస్ అవసరం ఈ ఎనర్జీ కాన్ఫరెన్స్‌లో అంతకుముందు, మస్క్ మాట్లాడుతూ..ప్రపంచ నాగరికత కొనసాగాలంటే చమురు, గ్యాస్ వెలికితీతను కొనసాగించాలన్నారు. అదే సమయంలో స్థిరమైన శక్తి వనరులను కూడా అభివృద్ధి చేయాలని అన్నారు. వాస్తవానికి మనం చమురు, గ్యాస్‌ను స్వల్పకాలంలో ఉపయోగించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. లేకపోతే నాగరికత (Civilization )కూలిపోతుంది అని మస్క్ స్పష్టం చేశారు. చమురు, గ్యాస్ కోసం నార్వే ఆయిల్ డ్రిల్ ప్రాసెస్ చేయాలా అని అడిగినప్పుడు, మస్క్ ఇలా అన్నాడు: "ఈ సమయంలో కొంత అదనపు అన్వేషణ అవసరమని నేను భావిస్తున్నాను."కాగా, ఇంధన సంక్షోభంతో యూరోప్ కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
సొంత వాహనాల్లోనూ మాస్క్ తప్పనిసరి! ఇంకెన్నాళ్లు?
కరోనా టైంలో ‘మాస్క్ తప్పనిసరి’ ఆదేశాలను కొన్ని రాష్ట్రాలు తూ.చా. తప్పకుండా పాటిస్తున్నాయి. ముఖ్యంగా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ప్రాంతాల్లో కఠినంగానే అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో సొంత వాహనాల్లో ప్రయాణాలపై.. అదీ ఒంటరిగా ఉన్నప్పుడూ మాస్క్ తప్పనిసరి చేయడంపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ: ఒంటరి ప్రయాణంలో.. అదీ సొంత వాహనాల్లో మాస్క్ తప్పనిసరి ఆదేశాల్ని ఢిల్లీ ప్రభుత్వం ఇంకా అమలు చేస్తోంది. దీనిపై నమోదు అయిన ఓ పిటిషన్‌పై స్పందించింది ఢిల్లీ హైకోర్టు. కొవిడ్-19 పేరుతో ఇంకా ఆ నిర్ణయాన్ని అమలు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. ‘ఇది అసలు అర్థం పర్థం లేని నిర్ణయం. ఇంకా ఎందుకు అమలు చేస్తున్నారు?. సొంత కారులో కూర్చుని ఇంకా మాస్క్ తప్పనిసరిగా ధరించడం ఏంటి? అని జస్టిస్ విపిన్‌సింగ్, జస్టిస్ జస్మిత్ సింగ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యలు చేసింది. పరిస్థితులు ఇంకా అలానే ఉన్నాయా? ఇంకా ఈ ఆదేశం ఉండడం ఏంటి? తక్షణమే చర్యలు తీసుకోండి అంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక వ్యక్తి తన తల్లితో కలిసి కారులో కూర్చుని.. అదీ కారు అద్దాలు ఎక్కించుకుని మరీ కాఫీ తాగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఫొటో తీసి.. ఛలాన్ పంపింది ఢిల్లీ ట్రాఫిక్ విభాగం. దీనిపై సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అయితే గతంలో సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఓ కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆదేశాలను తాము అనుసరిస్తామని.. అయినా ఆ తీర్పుపై మరోసారి కోర్టును ఆశ్రయించినట్లు ప్రభుత్వ తరపున న్యాయవాది రాహుల్ మెహ్రా వివరణ ఇచ్చుకున్నారు. మరి అలాంటప్పుడు.. అలాంటి ఆదేశాలను పక్కకు పెట్టే ఆలోచన ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని పేర్కొంటూ.. తక్షణమే ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ ఆదేశించింది. ఇదిలా ఉంటే వ్యక్తిగత వాహనాల్లో కాకుండా.. పబ్లిక్ ప్లేస్‌లలో ఇతర ఏ వెహికిల్స్‌లో ప్రయాణించినా మాస్క్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. -
ప్రపంచంలోని తొలి ఆటోమొబైల్ కంపెనీగా రికార్డు సృష్టించిన మెర్సిడెస్ బెంజ్..!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ మరో అరుదైన ఘనతను సాధించింది. లెవల్ 3 ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్‌కు ఆమోదం పొందిన కంపెనీగా మెర్సిడెస్ బెంజ్ నిలిచింది. ఈ అరుదైన ఘనతను సాధించిన తొలి ఆటోమోటివ్ కంపెనీగా బెంజ్ అవతరించింది. లెవెల్ 3 ఆటోనామస్ డ్రైవింగ్ సాంకేతికత ప్రమాణాలను సెట్ చేసే ఐక్యరాజ్యసమితి నియంత్రణ సంస్థ UN-R157 ఆమోదం తెలిపింది. 2022 ప్రథమార్థంలో మెర్సిడెస్ బెంజ్ ఎస్- క్లాస్, ఈక్యూఎస్ మోడల్స్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. లెవల్ 3 ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్‌ను ‘డ్రైవ్ పైలట్’గా పేరుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థతో వాహనదారులు ఆటోమేటెడ్ మోడ్‌లో 60 kmph వేగంతో డ్రైవ్ చేయగలరు. సురక్షితమైన ఆటోనామస్ డ్రైవింగ్ అనుభూతిని అందించేందుకుగాను అదనపు సెన్సార్లను డ్రైవ్ పైలట్‌లో మెర్సిడెస్ బెంజ్ అమర్చింది. వీటిలో లైడర్, వెనుక విండోలో కెమెరా, అత్యవసర వాహనాల నుంచి బ్లూ లైట్లు, ఇతర ప్రత్యేక సిగ్నల్‌లను గుర్తించడానికి రూపొందించబడిన మైక్రోఫోన్స్‌ను ఏర్పాటుచేశారు. అసాధారణమైన పరిస్థితులో ట్రాఫిక్‌ను గుర్తించడానికి డిజిటల్ హెచ్డీ మ్యాప్‌ను కూడా అందుబాటులో ఉంచారు. జర్మనీలో డ్రైవ్ పైలట్ రెడీ..! ఇప్పటికే జర్మనీలో 13,191 కి.మీ హైవేలపై డ్రైవ్ పైలట్‌ను అందిస్తున్నట్లు బెంజ్ పేర్కొంది. యూఎస్ఏ , చైనా వంటి దేశాలలో డ్రైవ్ పైలట్ సిస్టమ్ విస్తృతమైన టెస్ట్ డ్రైవ్‌లను కూడా నిర్వహిస్తోన్నట్లు వెల్లడిచింది. లెవల్-3 ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్ అంటే..! పలు దిగ్గజ కంపెనీలు ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్స్‌ను రూపొందిస్తున్నాయి. కాగా ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్స్‌లో టెస్లా ముందుంది. టెస్లా కేవలం లెవల్-2 ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. లెవల్ 2 ఆటోనామస్ కార్లను నడుపుతున్న వాహనదారులు కచ్చితంగా డ్రైవింగ్ వీల్‌పై చేతులను ఉంచుతూ ఉండాలి. ఒక వేళ అలా చేయకపోతే ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్ వాహనదారుడిని హెచ్చరిస్తుంది. కాగా ప్రస్తుతం మెర్సిడెస్-బెంజ్ డెవలప్ చేసిన లెవల్-3 డ్రైవ్ పైలట్‌తో వాహనదారుడు డ్రైవింగ్‌పై దృష్టిపెట్టాల్సిన అవసరం లేదు. చదవండి: వాహన విక్రయాలకు చిప్ సెగ -
ఎలన్ మస్క్ ఆపసోపాలు, టిమ్ కుక్ అప్పుడే ప్రకటించేశాడు..?!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ సెల్ఫీ డ్రైవింగ్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైంది. మరో నాలుగేళ్లలో కారును మార్కెట్లో విడుదల చేసే లక్క్ష్యంగా ప్రణాళికల్ని సిద్ధం చేసినట్లు బ్లూమ్ బెర్గ్ తన కథనంలో వెల్లడించింది. అయితే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారు ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సి ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణాలు అనేకం ఉన్నాయని అంటున్నారు. ఎలన్ మస్క్ ఫెయిల్ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను విడుదల చేసేందుకు కిందా మీదా పడుతున్నారని అమెరికా 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' గణాంకాలు చెబుతున్నాయి. ఎలన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ టెస్లాను సెల్ఫ్ డ్రైవింగ్ కారును విడుదల చేసేందుకు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. 2023లో ఎలన్ మస్క్ వినియోగదారులకోసం సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అందుబాటులోకి తెస్తామని ఛాలెంజ్ చేశారు. అందుకోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. కానీ సెల్ఫ్ డ్రైవింగ్ కారు టెస్టింగ్‌ల్లో పెయిల్ అవుతూ వస్తుంది. అలా ఇప్పటి వరకు సుమారు 24 సార్లు ఫెయిల్ అయినట్లు, కారు ప్రమాదంలో పలువురు మరణించినట్లు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఇప్పుడు టెక్ దిగ్గజం యాపిల్ మరో అడుగు ముందుకేసి సెల్ఫ్ డ్రైవింగ్ కారును విడుదల చేస్తామని చెప్పింది. దీంతో యాపిల్ షేర్లు మూడు శాతం పెరిగినట్లు బ్లూమ్ బెర్గ్ తన కథనంలో పేర్కొంది. యాపిల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు యాపిల్ చేస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్ ప్రాజెక్ట్‌కు టైటాన్ అనే పేరు పెట్టింది. స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకుండా పూర్తిగా అటానమస్‌గా ఈ వాహనం ఉండనుంది. అంతేకాదు సెల్ఫ్ డ్రైవింగ్ కారు కోసం ప్రత్యేకంగా అదునాతన చిప్ సెట్‌ను రూపొందించనుంది. కానో సంస్థ తమ ఎలక్ట్రిక్ వెహికల్స్ లిమోసిన్ స్టైల్ సీటింగ్ ను ఏర్పాటు చేయాలని అనుకుంది. ఇప్పుడు అదే సీటింగ్ స్టైల్‌ను యాపిల్ కారుకు డిజైన్ చేయాలని భావిస్తోంది. ఈ తరహాలో కారును డిజైన్ చేసి 2025 కల్లా కారును విడుదల చేయాలని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రయత్నాలు ముమ్మరం చేశారని బ్లూమ్ బెర్గ్ తన రిపోర్ట్‌లో తెలిపింది. చదవండి: Work From Home: చేసింది చాలు, యాపిల్ కీలక నిర్ణయం..! -
అదో బుల్లి కారు.. మనకు నచ్చినట్లు మారుతుంది.
అదో బుల్లి కారు..అర్జెంట్‌గా బయటికెళ్లాలంటే మన ముందుకే వచ్చి నిలబడుతుంది. లోపల కూర్చుని అద్దాల్లోంచి చూస్తూ వెళ్లడానికి, ఓపెన్ టాప్ తరహాలో గాలి తగులుతూ ప్రయాణించడానికి వీలవుతుంది.. స్నేహితులతోనో, వ్యాపార భాగస్వాములతోనో పిచ్చాపాటీ మాట్లాడుతూ, కావాలంటే వైన్ తాగుతూ వెళ్లాలనుకుంటే.. అదే కారు చిన్నపాటి ఫైవ్‌స్టార్ లాంజ్‌గా మారిపోతుంది. వ్యాయామం చేయడానికి టైం లేదనుకుంటే.. కారే చిన్నపాటి జిమ్‌లా రెడీ అవుతుంది. అంతేకాదు.. ఈ కారు అటానమస్/సెల్ఫ్ డ్రైవింగ్. అంటే డ్రైవర్ అవసరం లేకుండా.. మనం కోరుకున్న చోటికి అదే తీసుకెళ్తుంది. ఆ కారు పేరు.. ‘స్కేట్’. ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ సిట్రోన్ ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారును రూపొందించింది. చదవండి: మార్కెట్లోకి మరో అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు.. ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలే! పది సెకన్లలో మార్చేసుకోవచ్చు.. ‘స్కేట్’ కారు.. పేరుకు తగినట్టుగా స్కేటింగ్ బోర్డులా ఫ్లాట్‌గా ఉంటుంది. దానికి బిగించుకోవడానికి మూడు బాడీలు (పోడ్స్) వస్తాయి. ఫైవ్‌స్టార్ హోటల్ తరహాలో మెత్తని సోఫా, మినీ బార్‌తో కూడిన ‘సోఫిటెల్ వోయేజ్’ పోడ్ ఒకటికాగా.. వ్యాయామం చేయడానికి పలు పరికరాలతో కూడిన ‘పుల్‌మ్యాన్ పవర్ ఫిట్నెస్’ పోడ్ ఇంకొకటి. మూడోదేమో.. సగం క్యాబిన్, మిగతా సగం ఓపెన్ స్పేస్ ఉండే ‘సిటిజన్ ప్రొవైడర్’ పోడ్. దీనిలో ఐదుగురు ప్రయాణించవచ్చు. ఈ పోడ్లలో ఒకదానిని వదిలేసి.. మరోదానిని కేవలం పది సెకన్లలోనే అమర్చేసుకునే వీలుంటుంది. మన దగ్గరికి అదే వస్తుంది.. ఈ కారు ఇంటర్నెట్ సాయంతో మన ఫోన్లోని యాప్‌కు లింక్ అయి ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నా.. కావాలనుకున్నప్పుడు యాప్ నుంచి ఆదేశాలు ఇవ్వగానే మన దగ్గరికి బయలుదేరి వచ్చేస్తుంది. దగ్గరిలో ఉన్న చార్జింగ్ స్టేషన్‌కు వెళ్లి అదే చార్జింగ్ కూడా చేసుకుంటుందని సిట్రోన్ కంపెనీ చెప్తోంది. పక్కకూ నడపొచ్చు.. ఈ కారును ముందుకు, వెనక్కే కాదు.. పక్కలకు, ఐమూలగా ఎలాగంటే అలా నడపడానికి వీలుంటుంది. ఇందుకోసం బంతి ఆకారంలో ఉండే ప్రత్యేకమైన టైర్లను అమర్చారు. అంతేకాదు.. దీనిలో హైడ్రాలిక్ సస్పెన్షన్ ఏర్పాటు చేశారు. అంటే పెద్దగా కుదుపులు లేకుండా హాయిగా ప్రయాణిస్తుంది. దీనిలో ఉండే రాడార్, లైడార్ సెన్సర్ల ద్వారా రోడ్డును, ముందున్న వాహనాలు, మనుషులు, ఇతర అడ్డంకులను గుర్తిస్తూ.. వాటి నుంచి పక్కకు తప్పుకుంటూ దూసుకెళ్తుంది. -సాక్షి, సెంట్రల్ డెస్క్ -
చంద్రుడిని చూసి ట్రాఫిక్ లైట్‌గా పొరబడి..
కమర్షియల్ అండ్ హెవీ వెహికిల్స్ తయారీ రంగంలో దిగ్గజంగా టెస్లాకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సిలికాన్ వ్యాలీని బేస్ చేసుకుని నడుస్తున్న టెస్లా.. రెండు అమెరికా ఖండాల్లో భారీ బిజినెస్ చేస్తోంది. అయితే టెస్లా నుంచి డ్రైవర్‌లెస్ కార్ ఎప్పుడెప్పుడొస్తుందా? అని అంతా ఆత్రుతంగా ఎదురుచూస్తుండగా.. అది అంత వీజీ కాదని తేల్చేశాడు కంపెనీ సీఈవో ఎలన్ మస్క్. ఈ తరుణంలో టెస్లా టెక్నాలజీపైనే నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. తాజాగా టెస్లా టెక్నాలజీలో డొల్లతనం బయటపడింది. టెస్లా ఆటోపైలెట్ సిస్టమ్ టెక్నాలజీ వెళ్తున్న ఓ కారు.. చంద్రుడిని ట్రాఫిక్ సిగ్నల్‌గా పొరపడి వేగంగా వెళ్తున్న కారు కాస్త నిదానించింది. ఓ టెస్లా కస్టమర్ ఈ పోస్ట్‌ను ట్విటర్లో పోస్ట్ చేసి మస్క్‌కి ట్యాగ్ చేశాడు. ఇదేం సాధారణమైన సమస్య కాదని, కచ్చితంగా ఇదో సంక్లిష్టమైన సమస్యేనని పేర్కొన్నాడతను. Hey @elonmusk you might want to have your team look into the moon tricking the autopilot system. The car thinks the moon is a yellow traffic light and wanted to keep slowing down. 🤦🏼 @Teslarati @teslaownersSV @TeslaJoy pic.twitter.com/6iPEsLAudD — Jordan Nelson (@JordanTeslaTech) July 23, 2021 తన టెస్లా కంపెనీ కారులో ఈ ఆటోపైలెట్ సిస్టమ్ డివైజ్‌ను ఉంచాడతను. చంద్రుడి రంగును చూసి ఎల్లో ట్రాఫిక్ లైట్‌గా చూపిస్తూ.. నిదానించింది కారు. దీంతో అతను ఫిర్యాదు చేశాడు. సుమారు పది వేల డాలర్లు విలువ చేసే ఈ టెక్నాలజీని వంద నుంచి రెండొదల డాలర్ల ఈఎంఐపై కూడా అదిస్తోంది టెస్లా. అయితే మొదటి నుంచి ఈ ఆటోపైలెట్ సిస్టమ్ సమస్యలకు కారణమవుతూ వస్తోంది. పార్క్డ్ లైన్లను గుర్తించకపోవడం, ముందు వెహికిల్స్ ఉన్నప్పుడు నిదానించి మరీ ఢీకొట్టడం లాంటి ఎన్నో సవాళ్లు కస్టమర్లకు ఎదురవుతున్నాయి. కానీ, బోస్టన్, ఫిలడెల్ఫియా లాంటి ప్రాంతాల్లో టెస్లా కస్టమర్లకు ఎలాంటి సమస్యలు ఎదురు కావడం లేదని, అయినప్పటికీ టెక్నికల్ ఇష్యూస్‌ను సాల్వ్ చేస్తామని ఒక ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది కంపెనీ. -
డ్రైవర్‌లెస్ కారు.. తోక ముడిచిన ఎలన్ మస్క్
ఎలన్‌మస్క్ నేతృత్వంలో నడుస్తున్న టెస్లా రూపొందించిన ఎస్ ప్లెయిడ్ ఎలక్ట్రిక్ కారు ఇప్పుడు అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ ఏడాదిలోనే డ్రైవర్ లెస్ కారు కూడా తీసుకొస్తానంటూ సీఈవో ఎలన్‌మస్క్ ప్రకటించారు. మరీ ఆటో పైలెట్ కారు ప్రయోగాలు ఎక్కడి వరకు వచ్చాయి. ఎలన్ మస్క్ కల ఎప్పుడు సాకారం కావొచ్చు ? కాలిఫోర్నియా : ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌కి కొత్త అర్థం చెప్పిన వారిలో ఎలన్ మస్క్ ముందు వరుసలో ఉంటారు. పేపాల్ సీఈవోగా, స్పేస్ ఎక్స్ అధినేతగా, టెస్లా సీఈవోగా.. ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా ఎలన్ మస్క్ ఎదిగాడు. ఆటోపైలట్ మోడ్ లేదా సెల్ఫ్ డ్రైవింగ్ కారుకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పై చాన్నాళ్లుగా ఆయన వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాదే ఎస్ ప్లెయిడ్ ప్రారంభానికి ముందు 2021 జనవరిలో ఎలన్‌మస్క్ మాట్లాడుతూ.. ఈ ఏడాదిలోనే డ్రైవరు లేకుండా నడిచే కారు అందుబాటులోకి వస్తుందంటూ సంచలన ప్రకటన చేశారు. దీంతో జూన్‌లో విడుదలైన ఎస్ ప్లెయిడ్‌లో డ్రైవర్ లెస్ ఆప్షన్ కూడా ఉంటుందని అంతా భావించారు. కానీ ఆ ఫీచర్‌ని ఎస్ ప్లెయిడ్‌లో టెస్లా అందివ్వలేదు. Haha, FSD 9 beta is shipping soon, I swear! Generalized self-driving is a hard problem, as it requires solving a large part of real-world AI. Didn’t expect it to be so hard, but the difficulty is obvious in retrospect. Nothing has more degrees of freedom than reality. — Elon Musk (@elonmusk) July 3, 2021 చాలా కష్టం ఆటో పైలెట్ కారును ఇప్పుడప్పుడే మార్కెట్లోకి తీసుకురావడం కష్టమని ఎలన్ మస్క్ తాజాగా అంగీకరించారు. ‘ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ ఎంతో జటిలమైనది, దీన్ని నిజం చేయాలంటే, వాస్తవిక ప్రపంచానికి తగ్గటుగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ని రూపొందించాలి. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని, ఈ విషయం నేను ఇంతకు ముందు ఊహించలేదు. వాస్తవితకకు ఉన్నంత స్వేచ్ఛ మరి దేనికి లేదు’ అంటూ ఇటీవల ఎలన్ మస్క్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. లెవల్ 2 సెల్ఫ్ డ్రైవింగ్‌కి సంబంధించి గతంలో తాము చేసిన ప్రకటనలు అన్నీ వాస్తవికంగా అమల్లోకి తేవడానికి అనుకూలంగా లేవంటూ టెస్లా తెలిపింది. మరోవైపు ఆటో పైలెట్ ఇంకా లెవల్ 2లో ఉన్నట్టుగా కూడా చెప్పింది. లెవల్ 2 అంటే ఆటో పైలెట్ ఆప్సన్ ఉన్నప్పటికీ కారులో డ్రైవర్ ఉండాల్సిందే. కేవలం డ్రైవర్ యొక్క భారాన్ని తగ్గిస్తుందే తప్ప పూర్తిగా డ్రైవింగ్ చేయలేదని అర్థం. -
ప్రపంచంలో శక్తివంతమైన మైక్రోచిప్ అభివృద్ధి చేసిన టెస్లా
ప్రపంచ ఎలక్ట్రానిక్, ఆటోమోటివ్ పరిశ్రమ ఉత్పత్తుల సరఫరా విషయంలో ప్రధానంగా సమస్యలను ఎదుర్కొంటుంది. ప్రాసెసర్ చిప్స్ కొరత కారణంగానే సరఫరా విషయంలో ఎక్కువ అంతరాయం ఏర్పడుతుంది. ఇది పరిమాణంలో నాణెం వలె చిన్నగా ఉన్న అంతరిక్ష రాకెట్లు నుంచి విమానాలు, మొబైల్స్ వంటి ప్రతి ఎలక్ట్రానిక్ పరికరంలో దీనిని వినియోగిస్తారు. ఆటోమోటివ్ పరిశ్రమ తయారీ సంస్థలు తమ కార్ల తయారీలో ఈ చిప్‌లను వినియోగిస్తున్నాయి. అందుకోసం మిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా, అనేక ఆటో కంపెనీలు సైతం ఈ మైక్రోచిప్‌లపై ఎక్కువ శాతం ఆధారపడుతున్నాయి. ఈ చిప్‌లకు యంత్రాల కంటే చాలా ఎక్కువ శక్తి ఉంటుంది. టెస్లా అభివృద్ది చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మైక్రోప్రాసెసర్ పై సెలెక్ట్ కార్ లీజింగ్ అనే సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం మనుషులను చంద్రుడు మీదకు తీసుకెళ్లిన అపోలో 11 రాకెట్ కంటే శక్తివంతమైనదని తేలింది. లాక్‌హీడ్ మార్టిన్ రూపొందించిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్ F-35 Lightning-2 కంటే చాలా పవర్ ఫుల్ చిప్ అని సెలెక్ట్ కార్ లీజింగ్ సంస్థ తెలిపింది. ఎలోన్ మస్క్ ఇటీవల ఎన్విడియా తయారు చేసిన మునుపటి చిప్ లను టెస్లా, శామ్ సంగ్ తయారు చేసిన చిప్‌లతో భర్తీ చేశారు. ఎన్విడియా చిప్‌లతో పోలిస్తే ఇప్పుడు వాటి పనితీరు 21 సార్లు మెరుగుపడింది. ఈ రెండు 'న్యూరల్ నెట్ వర్క్ ఆర్రే'లతో తయారు చేశారు. ఇవి ప్రతి సెకనుకు 36 ట్రిలియన్ ఆపరేషన్ల చేయగలవు. అంటే రెండు కలిపితే 72 ట్రిలియన్ ఆపరేషన్లు చేస్తాయి. ఈ చిప్స్ ఒకే సమయంలో కెమెరా, సెన్సార్, రాడార్ జీపీఎస్ డేటాను ప్రాసెస్ చేయగలవు. ముఖ్యంగా టెస్లా ఆటోమేటెడ్ డ్రైవింగ్ కోసం ఇవి చాలా ఉపయోగపడుతాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల కోసం వీటిని తయారు చేసినట్లు ఎలోన్ మస్క్ పేర్కొన్నారు. అగ్రస్థానంలో ఉన్న ఏకైక ‘కంప్యూటర్’ మానవ మెదడు అని సెలెక్ట్ కార్ లీజింగ్ సంస్థ తమ పరిశోధన ద్వారా వెల్లడించింది. మన మానవ మొదడు సామర్ధ్యం 1000 ట్రిలియన్. చదవండి: మరోసారి పాన్ - ఆధార్ లింకింగ్ గడువు పొడగింపు -
6జీ టెక్నాలజీ అభివృద్ధి దిశగా ఎల్జీ కంపెనీ
ప్రపంచవ్యాప్తంగా తన మొబైల్ ఫోన్ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు ప్రముఖ ఎల్జీ కంపెనీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా 6జీ టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా యుఎస్ ఆధారిత సంస్థ కీసైట్ టెక్నాలజీస్, కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్&టెక్నాలజీలతో చేతులు కలిపినట్లు ప్రకటించింది. ఈ మూడు సంస్థలు కలిసి 6జీ టెక్నాలజీని వీలైనంత త్వరగా తీసుకొని రావడానికి పరిశోధనపై దృష్టి పెట్టాయి. ఒప్పందం ప్రకారం.. 6జీ కమ్యూనికేషన్లకు కీలకమైన ఫ్రీక్వెన్సీ బ్యాండ్ టెరాహెర్ట్జ్‌కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఒకదానికొకటి సహకారం అందించుకోనున్నాయి. 2024 నాటికి 6జీ పరిశోధనలను పూర్తి చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నట్లు యోన్హాప్ వార్తా సంస్థ నివేదించింది. 6జీ నెట్వర్క్ ను వాణిజ్య పరంగా 2029లో అందుబాటులోకి తీసుకోని రానున్నట్లు ఎల్జీ పేర్కొంది. 5జీ అన్ని దేశాలలో అందుబాటులో రాకముందే 6జీ టెక్నాలజీ అభివృద్ధిపై అనేక సంస్థలు దృష్ట్టి సారించాయి. 6జీ డేటా వేగం 5జీ పోలిస్తే అనేక రేట్లు అధికంగా ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. ఎల్జీ 2019లో కైస్ట్ తో కలిసి 6జీ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించింది. 6జీ టెక్నాలజీలను అధ్యయనం చేయడానికి కొరియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ సైన్స్ తో గత సంవత్సరం ఒప్పందం కుదుర్చుకుంది. కీసైట్ టెక్నాలజీస్ 6జీ టెరాహెర్ట్జ్ పరీక్ష పరికరాలకు ప్రధాన సరఫరాదారుడు. ఇది ఎల్జీ, కైస్ట్ యొక్క 6జీ పరిశోధన కేంద్రానికి పరికరాలను అందిస్తోంది. ఈ కొత్త తరువాతి తరం 6జీ టెక్నాలజీ వల్ల డిజిటల్ హెల్త్‌కేర్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, స్మార్ట్ సిటీలు, స్మార్ట్ ఫ్యాక్టరీలు, పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి. -
నాతో డీల్‌కు కుక్ నో చెప్పారు: మస్క్
న్యూయార్క్: ప్రస్తుతం మోడల్-3 ఎలక్ర్రిక్ కార్లతో ప్రపంచ మార్కెట్లో దూసుకెళుతున్న టెస్లా ఇంక్ ఒకప్పుడు నిధుల లేమితో సతమతమైంది. దీంతో కంపెనీ సీఈవో ఎలన్ మస్క్.. టెస్లా ఇంక్‌ను అమ్మివేసేందుకు కూడా సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని టెస్లా ఇంక్ సీఈవో ఎలన్ మస్క్ తాజాగా ట్వీట్ ద్వారా వెల్లడించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. కంపెనీ అమ్మకం కోసం ఒకప్పుడు టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఇంక్‌ను సంప్రదించినట్లు మస్క్ చెబుతున్నారు. అయితే తన ప్రతిపాదనలపై సమావేశమయ్యేందుకు యాపిల్ సీఈవో టిమ్ కుక్ నిరాకరించినట్లు వెల్లడించారు. కాగా.. 2024కల్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారును మార్కెట్లో విడుదల చేసే ప్రణాళికల్లో యాపిల్ ఉన్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో మస్క్ ట్వీట్‌కు ప్రాధాన్యత ఏర్పడినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం.. పదోవంతుకే మోడల్-3 ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ధి సమయంలో ఎదురైన ఆర్థిక సమస్యలతో టెస్లాను విక్రయించాలని భావించినట్లు మస్క్ పేర్కొన్నారు. ఇందుకు టిమ్ కుక్‌ను సంప్రదించినప్పటికీ తనతో సమావేశమయ్యేందుకు అంగీకరించలేదని తెలియజేశారు. నిజానికి కంపెనీ ప్రస్తుత విలువలో పదోవంతుకే అంటే 60 బిలియన్ డాలర్లకే టెస్లా ఇంక్‌ను యాపిల్‌కు విక్రయించాలని ఆలోచించినట్లు వెల్లడించారు. (యాపిల్ నుంచి సెల్ఫ్‌డ్రైవింగ్ కారు!) మోడల్-3 కష్టకాలం ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ ఆటో కంపెనీగా నిలుస్తున్న టెస్లా ఇంక్ రూపొందించిన మోడల్-3 కార్లను అభివృద్ధి చేసే బాటలో 2017లో కష్టకాలాన్ని ఎదుర్కొంది. కార్ల ఉత్పత్తిని పెంచేందుకు నిధులు లేకపోవడంతో మస్క్‌కు ఆర్థికంగా సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలమే కార్ల ఉత్పత్తిని చేపట్టలేకపోవచ్చని కాలిఫోర్నియాలోని ఫ్రెమంట్ ప్లాంటు ఉద్యోగులకు మస్క్ చెప్పారు. అయితే ఇది జరిగిన కొద్ది వారాలకే ఫ్యాక్టరీ పైకప్పు ప్రాంతంలో నిద్రిస్తున్న మస్క్ త్వరలోనే ఆర్థిక సవాళ్లను పరిష్కరించుకోనున్నట్లు ఉద్యోగులకు తెలియజేశారు. యాపిల్ ప్రణాళికల్లో మార్పు సరిగ్గా మూడేళ్ల క్రితమే టెస్లా ఇంక్‌కు పూర్తిస్థాయి పోటీదారుగా నిలవాలన్న ప్రణాళికలనుంచి ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు తయారీవైపు దృష్టి మరల్చుకుంది. గతంలో టెస్లా కంపెనీలో పనిచేసిన పలువురుని ప్రాజెక్ట్ టైటన్‌లో ఇటీవల ఉద్యోగులుగా యాపిల్ చేర్చుకుంది. డ్రైవ్ టెరైన్, కార్ ఇంటీరియర్, సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ తదితర విభాగాలలో ఎగ్జిక్యూటివ్స్‌ను నియమించుకుంది. అంతేకాకుండా సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీలో కార్యకలాపాలు కలిగిన కంపెనీలనూ కొనుగోలు చేసింది. తద్వారా 2024కల్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారును మార్కెట్లో విడుదల చేసే ప్రణాళికలను ఆవిష్కరించింది. కాగా.. మస్క్ వ్యాఖ్యలపై స్పందించేందుకు యాపిల్ ప్రతినిధి ఒకరు నిరాకరించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఇదే విధంగా కుక్‌ను మస్క్ ఎప్పుడు సంప్రదించారన్న అంశంపై టెస్లా సైతం జవాబివ్వలేదని తెలియజేసింది. షేరు జోరు 2017 నుంచి చూస్తే.. టెస్లా ఇంక్ షేరు 1400 శాతం ర్యాలీ చేసింది. అయినప్పటికీ యాపిల్ మార్కెట్ విలువతో పోలిస్తే మూడో వంతుకంటే తక్కువగానే ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కారు వార్తలతో ఈ వారం యాపిల్ షేరు బలపడగా.. టెస్లా షేరు డీలాపడినట్లు తెలియజేశారు. ప్రస్తుతం యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.24 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. కాగా.. ఆర్థిక సవాళ్ల నుంచి బయటపడిన టెస్లా కంపెనీ వరుసగా 4 త్రైమాసికాలలో లాభాలు ఆర్జించడం ద్వారా ఎస్అండ్పీ-500 ఇండెక్స్‌లో చోటు సంపాదించింది. తద్వారా అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాదిలోనే షేరు 700 శాతం ర్యాలీ చేయడం విశేషం! దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ) 607 బిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీగా ఆవిర్భవించింది. వెరసి అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ తదుపరి 150 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా మస్క్ అవతరించడం గమనార్హం! -
యాపిల్ నుంచి సెల్ఫ్‌డ్రైవింగ్ కారు!
న్యూఢిల్లీ, సాక్షి: ఎలక్ట్రిక్ వాహన తయారీ కోసం ఆరేళ్ల క్రితం యాపిల్ ఇంక్ ప్రారంభించిన ప్రాజెక్ట్ టైటన్.. ఇకపై మరింత స్పీడందుకోనున్నట్లు తెలుస్తోంది. వెరసి ఐఫోన్ల దిగ్గజం ఆటోమోటివ్ మార్కెట్లోనూ ప్రవేశించేందుకు దారి ఏర్పాటు చేసుకుంటోంది. ఇందుకు వీలుగా ఇటీవల బ్యాటరీ తయారీలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. నిజానికి పూర్తిస్థాయి అటానమస్ కారును రూపొందించేందుకు ప్రారంభించిన ప్రాజెక్ట్ టైటన్‌ను ప్రస్తుతం సెల్ఫ్ డ్రైవింగ్ కారు తయారీకి మార్పు చేసినట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. దీంతో 2024కల్లా ఆధునిక ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో ప్రవేశపెట్టే ప్రణాళికల్లో యాపిల్ ఉన్నట్లు తెలియజేశాయి. ఇందుకు ప్రధానంగా అటానమస్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీతో సొంత కార్లను తయారు చేస్తుందా లేక ఇతర వాహనాలకు సాఫ్ట్‌వేర్‌ను అందిస్తున్నదా అన్న విషయంలో స్పష్టత లేదని విశ్లేషకులు తెలియజేశారు. (హెల్మెట్ వాయిస్ కమాండ్స్‌తో ఇక బైకులు!) సొంత బ్యాటరీలతో ఎలక్ట్రిక్ వాహన తయారీలో బ్యాటరీలకు ప్రాధాన్యత ఎక్కువన్న సంగతి తెలిసిందే. కారు ఖరీదులో బ్యాటరీలు అగ్రభాగం వహిస్తుంటాయని ఆటో రంగ నిపుణులు చెబుతున్నారు. కాగా.. అత్యంత సమర్దవంతంగా పనిచేయగల బ్యాటరీ టెక్నాలజీకి యాపిల్ తాజాగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్లు, ఐప్యాడ్స్, మ్యాక్ కంప్యూటర్ల తయారీ దిగ్గజం యాపిల్ ఇంక్ 2014లోనే టైటన్ పేరుతో ఎలక్ట్రిక్ కార్ల తయారీకి ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్న 1,000 మందిలో 200 మందిని 2016లో తొలగించింది. దీంతోపాటు ప్యాసింజర్ కారును రూపొందించాలన్న లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా బ్యాటరీ తయారలో ప్రత్యేక తరహా మోనోసెల్ డిజైన్‌ను అభివృద్ధి చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. బ్యాటరీలో భారీగా ఇండివిడ్యుయల్ సెల్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా లోపల మరింత ఖాళీకి వీలు ఏర్పడుతుందని వివరించాయి. దీంతో యాక్టివ్ మెటీరియల్‌కు చోటులభించడం ద్వారా అధిక కాలం శక్తినిచ్చే వీలున్నట్లు తెలియజేశాయి. ఈ టెక్నాలజీతో బ్యాటరీల వ్యయాలు సైతం తగ్గే వీలున్నట్లు భావిస్తున్నాయి. (ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 బుకింగ్ షురూ) సెన్సర్ల సాయం యాపిల్ రూపొందిస్తున్న ఎలక్ట్రిక్ కారులో లిడార్ టెక్నాలజీని వినియోగించనుంది. లిడార్ సెన్సర్లను వినియోగించడం ద్వారా కారు డ్రైవింగ్‌కు 3డీ వ్యూను కల్పించాలని యాపిల్ ఆశిస్తోంది. తద్వారా రోడ్లు, ప్రజలు, దూరం, వాహనాలపై అంచనాలకు వీలుంటుందని ఆటో వర్గాలు వెల్లడించాయి. 2017లో యాపిల్ సీఈవో టిమ్ కుక్ అటానమస్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రాజెక్టులన్నిటికీ శిఖరాగ్రంగా నిలవనున్నట్లు వ్యాఖ్యానించారు కూడా. -
కారుకు దెయ్యం పట్టిందా ఏంటి?!
చెన్నై: అమెరికాకు చెందిన టెస్లా తన సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉంది. అయితే ఈ సాంకేతికత అప్పుడే భారత్‌లో ప్రవేశించింది. తమిళనాడు రోడ్ల మీద సెల్ఫ్ డ్రైవింగ్ కారు షికారు చేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఈ వీడియోలో ప్రీమియర్ పద్మిని అని పిలవబడే ఫియట్ కారు డ్రైవర్ లేకుండా రోడ్డు మీద ప్రయాణిస్తుంది. మాస్క్ వేసుకున్న ఓ వ్యక్తి ప్యాసింజర్ సీటులో ఉండగా.. డ్రైవర్ కూర్చునే స్థానం ఖాళీగా ఉండటం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ఫియట్ కారు ఎంతో నేర్పుగా ఇతర వాహనాలను అధిగమించడమే కాక సందులు, మలుపుల్లో చక్కగా వెళ్తుంది. దీని పక్కనే మరో వ్యక్తి వేరే వాహనంలో ఫాలో అవుతూ ఈ కారు షికారును వీడియో తీశాడు. తర్వాత దాన్ని ఫేస్బుక్లో షేర్ చేశాడు. ‘ఇది ఎలా సాధ్యంమవుతుంది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. (చదవండి: తంతే రైలు అయినా వెనక్కి వెళ్లాల్సిందే!) ‘కారుకు దెయ్యం పట్టిందా ఏంటి?’ అంటూ కామెంట్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజనులు. మరి కొందరు మాత్రం ఈ ఫీట్ వెనక రహ్యస్యాన్ని చేధించారు. ఈ కారు టూ వే పెడల్ సిస్టమ్ మోడల్‌ది అయి ఉంటుంది. అలాంటి కార్లలో రెండు వైపులా పెడల్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా డ్రైవింగ్ స్కూల్స్‌లో వినియోగిస్తారు. టీచర్ కూడా వాహనాన్ని నియంత్రించడానికి ఈ టూ వే పెడల్స్ మోడల్ కార్లని వాడతారు. ఇక్కడ కూడ అనుభవజ్ఞుడైన డ్రైవర్ ప్యాసింజర్ సీటులో కూర్చుని తన కూడి చేతితో స్టీరింగ్‌ని కంట్రోల్ చేస్తూ.. కారును నడుపుతున్నాడు అని తెలిపారు. మరి కొందరు ప్యాసింజర్ సీటులో కూర్చున్న వ్యక్తిని వెల్లూరు స్థానికుడిగా గుర్తించారు. అతడు చాలాసార్లు ఇలా ప్యాసింజర్ సీటులో కూర్చుని కార్ని డ్రైవ్ చేయడం తాము చూశామని తెలిపారు. -
అబ్బురపరుస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ కారు
-
5జీ టెక్నాలజీ: కొత్త తరం కార్లు
సాక్షి, న్యూఢిల్లీ : మోటారు వాహనాల రంగంలో ‘5 జి’ ఇంటర్నెట్ విప్లవాత్మక మార్పులు తీసుకరానుంది. వేగంగా దూసుకెళ్లే కార్లతోపాటు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు ‘5జీ’ నెట్‌వర్క్‌ను అనుసంధానం చేస్తున్నారు. దీని వల్ల ఓ రోడ్డు మీద వెళుతున్న వాహనాలు ఒకదానికొకటి అతివేగంగా సమాచారం ఇచ్చి పుచ్చుకుంటాయి. తద్వారా ఎదురుకానున్న ప్రమాదాలను ముందే ఊహించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వాహనాలు ప్రమాదాల నుంచి తప్పించుకోగలవు. ఎదురుగా రోడ్డుపై గుంతలు వున్నా, రోడ్డుకు అడ్డుగా ప్రమాదకరమైనవి ఏవీ ఉన్నా, ముందుగా వెళ్లిన వాహనాల ద్వారా వెనకాల వచ్చే వాహనాలు తెలుసుకోగలవు. ‘5 జీ’ సాంకేతిక పరిజ్ఞానాన్ని సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు మరింత ఎక్కువగా, సమర్థంగా ఉపయోగించుకోగలవని గ్లాస్గో కెలెడోనియన్ యూనివర్శిటీ (జీసీయూ) నిపుణలు చెప్పారు. ‘టెస్లా లాంటి కార్లు భవిష్యత్తులో 5జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని తమ చుట్టూ కొన్ని చదరపు మైళ్ల విస్తీర్ణంలో రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు తెలసుకుంటాయి. రోడ్డుపై ఎక్కడైన గుంతలు, రాళ్లు రప్పలు ఉన్నాయా ? వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్డును మంచు కప్పేసిందా ? గాలి దుమారం ఎదురుకానుందా? అన్న విషయాలను ముందుగానే తెలుసుకొని వాటికి అనుగుణంగా స్పందిస్తాయి’ భవిష్యత్ కార్ల పరిశోధనా బృందం సభ్యుడు డాక్టర్ డిమిట్రియాస్ లయరోకాపిస్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఏటా 13 లక్షల మంది మరణిస్తుంటే, ఐదు కోట్ల మంది గాయపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు తెలియజేస్తున్నాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వస్తోన్న కొత్త కార్ల వల్ల ఈ ప్రమాదాలు గణనీయంగా పడిపోతాయని డాక్టర్ డిమిట్రియా చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘ఫోర్డ్’ కంపెనీ ఇప్పటికే ఈ దిశగా పనులను చేపట్టిందని, ఈ ఏడాది చివరి నాటికి తన కార్లలో 80 శాతం కార్లకు కొత్త 5జీ నెట్‌వర్క్‌ను అనుసంధించాలని లక్షంగా పెట్టుకుంది. -
ఊహించని ప్రమాదం.. వీడియో విడుదల
శాన్ ఫ్రాన్సిస్కో : ఉబెర్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు టెస్టింగ్ ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా అభివృద్ధి చేయకుండా ఈ తరహా వాహనాలను బిజీ రోడ్ల పైకి ఎలా అనుమతించారని పలువురు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఘటనకు సంబంధించిన వీడియోను టెంపె పోలీస్ శాఖ బుధవారం విడుదల చేసింది. ప్రమాద సమయంలో వోల్వో వాహనంలోని కెమెరాల ద్వారా లోపల, బయట జరిగిన పరిణామాలు రికార్డు అయ్యాయి. చీకట్లో ఎలైనే హెర్జ్‌బర్గ్(49) తన సైకిల్‌తో రోడ్డు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో లోపల కూర్చున్న వాహనదారు కూడా ఊహించని ఆ పరిణామంతో షాక్ తినటం చివర్లో చూడొచ్చు. ఆదివారం రాత్రి అరిజోనా రాష్ట్రంలోని టెంపె ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్‌కు చెందిన డ్రైవర్ లెస్కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ హెర్జ్‌బర్గ్ ఆస్పత్రిలో మృతి చెందింది. కారులోని వ్యవస్థ పాదాచారిని గుర్తించకపోవటంతోనే ప్రమాదం జరిగినట్లు నిపుణులు వెల్లడించారు. ఘటన నేపథ్యంలో ఈ తరహా వాహనాల పరీక్షను నిలిపివేస్తున్నట్టు ఉబెర్ ప్రకటించింది. మరోవైపు వీటి పని తనంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో వీటిని అందుబాటులోకి తేకపోవటమే ఉత్తమమన్న డిమాండ్‌నూ పలువురు తెరపైకి తెస్తున్నారు. Tempe Police Vehicular Crimes Unit is actively investigating the details of this incident that occurred on March 18th. We will provide updated information regarding the investigation once it is available. pic.twitter.com/2dVP72TziQ — Tempe Police (@TempePolice) March 21, 2018 -
సెల్ఫ్ డ్రైవింగ్ ఉబెర్ కారు: విషాదం
వాషింగ్టన్ : సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను రోడ్లపై పరిగెత్తించే క్రమంలో విషాద సంఘటన ఒకటి కలకలం రేపింది. క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్‌కు చెందిన డ్రైవర్ లెస్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. అరిజోన రాష్ట్రంలోని టాంపెలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన ఉబెర్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు టెస్టింగ్ సందర్భంగా మహిళపైకి దూసుకెళ్లడంతో హెర్జ్‌బర్గ్ (49) తీవ్రంగా గాయపడింది. అనంతరం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. టెంపె ప్రాంతంలో రాత్రి పూట తన సైకిల్‌తో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫుట్ వే నుంచి ఆమె ఒక్కసారిగా హైవే దారిలోకి రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారు గంటకు 40 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై డెమెక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్ ఎర్వర్డ్ స్సందిస్తూ.. ఎంత అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వాహనమైన జన సంచారం లేని ప్రాంతంలో పరీక్షించాలి కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఎలా చేశారని ప్రశ్నించారు. అయితే ఈ తరహ టెక్నాలజీతో ఉబెర్ రూపొందించిన స్వీయ డ్రైవింగ్ వాహనాలను అనుమతి కోరుతూ.. అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై చట్టసభల్లో డెమెక్రటిక్ పార్టీ వ్యతికేకించింది. పూర్తిగా అభివృద్ధి చేసిన తర్వాత ఇలాంటి వాహనాలను అనుమతించాలని సభ్యులు కోరారు. కాగా నార్త్ అమెరికాలో ఈ తరహ వాహనాల పరీక్షను నిలిపివేస్తున్నట్టు ఉబెర్ ప్రకటించింది. -
స్మార్ట్ బస్సులు వచ్చేశాయి!
-
స్మార్ట్ బస్సులు వచ్చేశాయి!?
ఇప్పటివరకూ కలలు కంటున్న స్మార్ట్/సెల్ఫ్ డ్రైవింగ్ బస్సులు ప్రజలకు అందుబాటులోకి వచ్చేశాయి. పూర్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బస్సులు శనివారం ఉదయం నుంచి చైనాలోని షెన్జెన్ సిటీలో పరుగులు తీస్తున్నాయి. అత్యంత ఆధునాతన నగరమైన షెన్జెన్లో దాదాపు 70 శాతం ఐటీ సంస్థలున్నాయి. ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల కొసం ఈ స్మార్ట్ బస్సులును అధికారులు ప్రవేశపెట్టారు. రెండు కిలోమీటర్ల పరిధిలో.. ఈ బస్సులు ప్రయాణిస్తాయి. స్మార్ట్ బస్సులు.. కనిష్టంగా 10 కి.మీ. గరిష్టంగా 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. స్మార్ట్ బస్సులకు జీపీఎస్ ఆంటెన్నా, హై రెజ్యుల్యూషన్తో కూడిన హెచ్డీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఆటో సెన్సార్ టెక్నాలజీ ద్వారా పాదచారులను ఈ బస్సు ఢీ కొట్టే అవకాశం లేదని తెలుస్తోంది. ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడితే.. బస్సులో ఉండే డ్రైవర్.. స్మార్ట్ నుంచి మ్యాన్యువల్ డ్రైవింగ్‌కు మార్చి బస్సును నడిపిస్తాడు. ఈ స్మార్ట్ బస్సులను షెంజెన్ ఇంజినీరింగ్ టెక్నాలజీ గ్రూప్ రూపోందించడం విశేషం. -
రోడ్లపైకి ఎలక్ట్రానిక్ దిగ్గజ కార్లు
సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల టెస్టింగ్ పై టెక్ దిగ్గజాలన్నీ పోటీపడి మరి ప్రభుత్వాల నుంచి గ్రీన్ సిగ్నల్స్ తెచ్చుకుంటున్నాయి. తాజాగా స్మార్ట్ ఫోన్ల రారాజు, ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై దృష్టిసారించింది. వీటి టెస్టింగ్ కు ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా తెచ్చేసుకుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల టెస్టింగ్ కోసం ఆమోదం తెచ్చుకున్న తొలి ఎలక్ట్రానిక్స్ దిగ్గజంగా శాంసంగ్ పేరులోకి వచ్చింది. దీంతో ఈ కంపెనీ దక్షిణ కొరియా రోడ్లపై సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను చక్కర్లు కొట్టిచనుంది. హ్యుందాయ్, కియా లాంటి కార్ల కంపెనీలకు ఇప్పటికే భూమి, మౌలికసదుపాయాలు, రవాణా మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. సెన్సార్స్, కెమెరాలతో వీటి టెస్టింగ్ ను శాంసంగ్ కంపెనీ చేపట్టనుందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అడ్డంకులు ఎదురైనప్పుడు వాహనాలను ఎలా నడపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా కంపెనీ అధ్యయనం చేయనుంది. స్వయంప్రతిపత్త డ్రైవింగ్ టెక్నాలజీపై కంపెనీ 2015లోనే ఓ బిజినెస్ యూనిట్ ను ప్రారంభించింది. 2016 నవంబర్ లో కనెక్టెడ్ కార్ల కోసం సాఫ్ట్ వేర్ పరికరాలను అభివృద్ధి చేసే అమెరికా సంస్థ హర్మాన్ ను శాంసంగ్ 8 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. పెద్ద పెద్ద టెక్నాలజీ దిగ్గజాలు గూగుల్, ఆపిల్, బైడూ, సంప్రదాయ కారు తయారీ సంస్థలు జీఎం, ఫోర్డ్, రైడ్ హైలింగ్ స్టార్టప్ ఉబర్, దీదీలు ఇప్పటికే డ్రైవర్ లెస్ కారు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నాయి.