సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఉబెర్‌ కారు: విషాదం | Self Driving Uber Car Killed A Woman In Arizona | Sakshi
Sakshi News home page

సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఉబెర్‌ కారు: విషాదం

Published Tue, Mar 20 2018 3:05 PM | Last Updated on Tue, Mar 20 2018 3:51 PM

Self Driving Uber Car Killed A Woman In Arizona - Sakshi

వాషింగ్టన్‌ : సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లను రోడ్లపై పరిగెత్తించే క్రమంలో విషాద సంఘటన ఒకటి కలకలం రేపింది. క్యాబ్‌ అగ్రిగేటర్‌​ ఉబెర్‌కు చెందిన  డ్రైవర్‌ లెస్‌​ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు  కోల్పోయింది.  అరిజోన రాష్ట్రంలోని టాంపెలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో సెల్ఫ్‌  డ్రైవింగ్‌ టెక్నాలజీపై  మరోసారి సందేహాలు  వ్యక్తమవుతున్నాయి.

సరికొత్త టెక్నాలజీతో  రూపొందించిన ఉబెర్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు టెస్టింగ్‌ సందర్భంగా మహిళపైకి  దూసుకెళ్లడంతో హెర్జ్‌బర్గ్‌  (49) తీవ్రంగా గాయపడింది. అనంతరం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. టెంపె ప్రాంతంలో రాత్రి పూట తన సైకిల్‌తో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫుట్‌ వే నుంచి ఆమె ఒక్కసారిగా హైవే దారిలోకి  రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారు గంటకు 40 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనపై డెమెక్రటిక్‌ పార్టీకి చెందిన సెనేటర్‌ ఎర్వర్డ్‌ స్సందిస్తూ.. ఎంత అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వాహనమైన జన సంచారం లేని ప్రాంతంలో పరీక్షించాలి కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఎలా చేశారని ప్రశ్నించారు. అయితే ఈ తరహ టెక్నాలజీతో ఉబెర్‌ రూపొందించిన స్వీయ డ్రైవింగ్‌ వాహనాలను అనుమతి కోరుతూ.. అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై చట్టసభల్లో డెమెక్రటిక్‌ పార్టీ వ్యతికేకించింది. పూర్తిగా అభివృద్ధి  చేసిన తర్వాత ఇలాంటి వాహనాలను అనుమతించాలని సభ్యులు కోరారు. కాగా నార్త్‌ అమెరికాలో ఈ తరహ వాహనాల పరీక్షను నిలిపివేస్తున్నట్టు  ఉబెర్‌  ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement