
హ్యుందాయ్, హోండా కార్స్ వాహన ధరల పెంపు
ఏప్రిల్ నుంచి కొత్త ధరలు అమల్లోకి
ముంబై: వాహన ధరల పెంపు కంపెనీల జాబితాల్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా(హెచ్‌ఎంఐఎల్), హోండా కార్స్ చేరాయి. ‘‘పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ఇన్‌పుట్ వ్యయాలను కొంత భర్తీ చేయడానికి ధరలను సవరించాల్సి వస్తుంది. అందుకే వాహన ధరలను ఏప్రిల్ నుంచి 3% వరకు పెంచుతున్నాము’’ అని హెచ్‌ఎంఐఎల్ డైరెక్టర్, సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. అమేజ్, సిటీ, సిటీ ఈ:హెచ్‌ఈవీ, ఎలివేట్‌తో సహా వేరియంట్, మోడల్ బట్టి ధరల పరిధి మారుతుందని హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహ్ తెలిపారు. మారుతీ సుజుకీ ఇండియా, కియా ఇండియా, టాటా మోటార్స్‌లు తమ వాహన ధరలు వచ్చే నెల నుంచి పెంచే యోచనలతో ఉన్నట్లు ఇప్పటికే తెలిపారు.
టఫే వైస్‌చైర్మన్‌గా లక్ష్మీ వేణు
న్యూఢిల్లీ: ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ (టఫే) వైస్ చైర్మన్‌గా లక్ష్మీ వేణు నియమితులయ్యారు. ఇప్పటికే ఆమె సంస్థ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. లక్ష్మీకి ట్రాక్టర్లు, ఆటో విడిభాగాల పరిశ్రమలో గణనీయంగా అనుభవం, వ్యాపార నిర్వహణ సామర్థ్యాలు ఉన్నట్లు సంస్థ చైర్మన్ మల్లికా శ్రీనివాసన్ తెలిపారు. వ్యూహాత్మక లక్ష్యాల సాధనలో టఫే, ఐషర్ ట్రాక్టర్స్ బృందాలతో కలిసి పని చేయనున్నట్లు లక్ష్మీ తెలిపారు. బిజినెస్ టుడే ‘వ్యాపారంలో అత్యంత శక్తివంతమైన మహిళలు‘, ఎకనమిక్ టైమ్స్ ‘యంగ్ లీడర్స్ – 40 అండర్ 40‘ జాబితాల్లో లక్ష్మీ చోటు దక్కించుకున్నారు. ఆమె సుందరం–క్లేటన్ ఎండీగా వ్యవహరిస్తున్నారు.
ఉబెర్ టూవీలర్ రైడర్లకు మరింత భద్రత
న్యూఢిల్లీ: టూ–వీలర్ డ్రైవర్లు, రైడర్లకు మరింత భద్రత కలి్పంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు రైడ్–õÙరింగ్ సంస్థ ఉబెర్ వెల్లడించింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఉబెర్ మోటో డ్రైవర్లకు సేఫ్టీ కిట్లను అందించింది. వీటిలో హెల్మెట్లు, సేఫ్టీ స్టిక్కర్లు మొదలైనవి ఉన్నాయి. ఉబెర్ మోటో యాప్‌లో హెల్మెట్లు ధరించాలంటూ ప్రయాణికులకు కూడా కోరే విధంగా ఫీచర్లు ఉంటాయని సంస్థ వివరించింది. ట్రాఫిక్‌లోను సులభంగా వెళ్లగలిగే వెసులుబాటు, సౌకర్యం, తక్కువ ఖర్చు వంటి అంశాలు బైక్ ట్యాక్సీలకు సానుకూలాంశాలుగా ఉంటున్నాయని పేర్కొంది.
ఇదీ చదవండి: ఎన్‌విడియాతో ఐటీ దిగ్గజాల జత
Comments
Please login to add a commentAdd a comment