తన సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల మ్యాపింగ్, నావిగేషన్ ఫంక్షన్ల కోసం చైనా అతిపెద్ద సెర్చింజిన్ బైదూతో ప్రముఖ ఈవీ దిగ్గజం టెస్లా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో చైనాలో టెస్లా లేటెస్ట్ డ్రైవింగ్ ఫీచర్‌లను పరిచయం చేయడానికి కీలకమైన అడ్డంకిని తొలగించుకోబోతుందని తెలుస్తోంది. ఫలితంగా టెస్లా స్టాక్ ధర 10 శాతానికి పైగా పెరిగింది.
బైదూ అందించే టాప్ లేన్ లెవల్ నావిగేషన్, మ్యాపింగ్ ఆధారంగా టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల సేవలను అందుబాటులోకి తెచ్చే సౌలభ్యం కలగనుందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
కాగా, టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థ ఇప్పటి వరకు చైనాలో అందుబాటులో లేదు. దీన్ని అక్కడ ప్రవేశపెట్టేలా చైనా ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో చైనా కస్టమర్లకు సంబంధించిన డేటాను దేశం వెలుపలికి తీసుకెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో చైనా వెలుపలికి డేటాను బదిలీ చేసే అంశంపై కూడా మస్క్ ప్రభుత్వంతో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment