
zPod Autonomous Driving Consept: భారతదేశంలో డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు కూడా వచ్చేసాయి. అయితే త్వరలోనే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే మన దేశంలో అక్కడక్కడా అన్యదేశ్యపు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు దేశంలోనే మొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారును బెంగళూరుకు చెందిన 'మైనస్ జీరో' (Minus Zero) సంస్థ ఆవిష్కరించింది. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇప్పటికే అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో వినియోగంలో ఉన్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు భారతదేశంలో కూడా త్వరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మైనస్ జీరో కంపెనీ విడుదల చేయనున్న ఈ కారు పేరు 'జెడ్పాడ్' (zPod). ఇది భారతీయ రోడ్ల మీద త్వరలోనే పరుగులు పెట్టే అవకాశం ఉంటుంది.
భారతదేశపు మొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు..
మైనస్ జీరో జెడ్పాడ్ వెహికల్ చూడటానికి చిన్నగా ఉంటుంది. అయితే ఇది ఎలాంటి పరిస్థితుల్లో అయినా డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇందులో స్టీరింగ్ వీల్ లేకపోవడం గమనార్హం. అయితే దీనికి బదులుగా అనేక హై- రిసొల్యూషన్ కెమెరాలు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా ట్రాఫిక్ వంటి సమయంలో డ్రైవింగ్ ఎనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది లెవెల్ 5 అటానమీ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ కారు అని కంపెనీ చెబుతోంది.
(ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. వారు చేసే బిజినెస్ ఏంటో తెలుసా?)
లెవెల్ 5 అటానమీ కలిగి ఉండటం వల్ల మనుషుల ప్రమేయం లేకుండా సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంది. ఇందులోని కెమెరా సెన్సార్లు వాహన పరిసరాలను రియల్ టైమ్ ఇమేజ్ వంటి వాటిని క్యాప్చర్ చేసుకోగలదు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, కావున వెహికిల్‌ని నావిగేట్ చేస్తుంది. అవసరమైనప్పుడు స్పీడ్ పెరుగుతుంది, ఏవైనా అడ్డంకులు వస్తే వాహనాన్ని ఆపుతుంది.
(ఇదీ చదవండి: మెట్లెక్కిన మహీంద్రా స్కార్పియో ఎన్.. వైరల్ అవుతున్న వీడియో & ఫిదా అవుతున్న జనం)
లాంచ్ టైమ్..
ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారు క్యాంపస్ లేదా పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వంటి క్లోజ్డ్ ఏరియాల్లో ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కారు గూగుల్ అండ్ టెస్లా కార్లకు ధీటుగా ఇండియాలో రూపుదిద్దుకోనుంది. ఈ కారు ఇండియన్ మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుందని వివరాలను కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు. కానీ త్వరలోనే మార్కెట్లో విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment