మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన రైతు బిడ్డ 'హర్షల్ నక్షనేని' (Harshal Nakshane) హైడ్రోజన్‌తో నడిచే AI కారును రూపొందించి.. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి 'దేవేంద్ర ఫడ్నవిస్' చేత ప్రశంసలందుకున్న విషయం గతంలో తెలుసుకున్నాం. అయితే ఈ కారు అభివృద్ధికి షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3లోని పారిశ్రామిక వేత్తలు పెట్టుబడుల పెట్టడానికి నిరాకరించారు.
స్టార్టప్ AI కార్స్‌కు చెందిన హర్షల్ మహదేవ్ నక్షనేని సుమారు 18 నెలలు శ్రమించి భారతదేశపు మొట్ట మొదటి ఏఐ ఆధారిత హైడ్రోజన్ కారు రూపొందించారు. ఈ కారు నిర్మాణానికి ఏకంగా రూ. 60 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ కారుని హర్షల్ షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3లోని పారిశ్రామిక వేత్తలు ముందుకు తీసుకువచ్చారు.
ఏఐ కారు రీఫ్యూయలింగ్ సమయం కేవలం ఐదు నిముషాలు మాత్రమే. ఇది 1000 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుందని హర్షల్ వెల్లడించారు. ఈ ఏఐ కారు పారిశ్రామిక వేత్తలను ఎంతగానో ఆకర్శించింది, అయితే పెట్టుబడి పెట్టడానికి మాత్రం నిరాకరించారు.
ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌లు పనిచేయవు! కారణం ఇదే..
హైడ్రోజన్ శక్తితో నడిచే వాహనాలకు మార్కెట్ తక్కువగా ఉండటమే కాకుండా.. ఇలాంటి వాటికి సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం కారణంగా పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపలేదు. అయితే ఈ కారు వారు స్వయంగా డ్రైవ్ చేసి 'హర్షల్' పనితీరుని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment