ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ సెల్ఫీ డ్రైవింగ్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైంది. మరో నాలుగేళ్లలో కారును మార్కెట్‌లో విడుదల చేసే లక్క్ష్యంగా ప్రణాళికల్ని సిద్ధం చేసినట్లు బ్లూమ్ బెర్గ్ తన కథనంలో వెల్లడించింది. అయితే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారు ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సి ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణాలు అనేకం ఉన్నాయని అంటున్నారు.
ఎలన్ మస్క్ ఫెయిల్
టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను విడుదల చేసేందుకు కిందా మీదా పడుతున్నారని అమెరికా 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' గణాంకాలు చెబుతున్నాయి. ఎలన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ టెస్లాను సెల్ఫ్ డ్రైవింగ్ కారును విడుదల చేసేందుకు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. 2023లో ఎలన్ మస్క్ వినియోగదారులకోసం సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అందుబాటులోకి తెస్తామని ఛాలెంజ్ చేశారు. అందుకోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. కానీ సెల్ఫ్ డ్రైవింగ్ కారు టెస్టింగ్‌ల్లో పెయిల్ అవుతూ వస్తుంది. అలా ఇప్పటి వరకు సుమారు 24 సార్లు ఫెయిల్ అయినట్లు, కారు ప్రమాదంలో పలువురు మరణించినట్లు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఇప్పుడు టెక్ దిగ్గజం యాపిల్ మరో అడుగు ముందుకేసి సెల్ఫ్ డ్రైవింగ్ కారును విడుదల చేస్తామని చెప్పింది. దీంతో యాపిల్ షేర్లు మూడు శాతం పెరిగినట్లు బ్లూమ్ బెర్గ్ తన కథనంలో పేర్కొంది.
యాపిల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు
యాపిల్ చేస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్ ప్రాజెక్ట్‌కు టైటాన్ అనే పేరు పెట్టింది. స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకుండా పూర్తిగా అటానమస్గా ఈ వాహనం ఉండనుంది. అంతేకాదు సెల్ఫ్ డ్రైవింగ్ కారు కోసం ప్రత్యేకంగా అదునాతన చిప్ సెట్‌ను రూపొందించనుంది. కానో సంస్థ తమ ఎలక్ట్రిక్ వెహికల్స్ లిమోసిన్ స్టైల్ సీటింగ్ ను ఏర్పాటు చేయాలని అనుకుంది. ఇప్పుడు అదే సీటింగ్ స్టైల్‌ను యాపిల్ కారుకు డిజైన్ చేయాలని భావిస్తోంది. ఈ తరహాలో కారును డిజైన్ చేసి 2025 కల్లా కారును విడుదల చేయాలని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రయత్నాలు ముమ్మరం చేశారని బ్లూమ్ బెర్గ్ తన రిపోర్ట్‌లో తెలిపింది.
చదవండి: Work From Home: చేసింది చాలు, యాపిల్ కీలక నిర్ణయం..!
Comments
Please login to add a commentAdd a comment