Tesla electric car
-
టెస్లా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్ ఆవిష్కరణ
టెస్లా సీఈఓ ఇలొన్‌మస్క్ ఐ రోబోట్ ఈవెంట్లో రోబోవ్యాన్, సైబర్ క్యాబ్‌ను ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ లాట్లో జరిగిన ఈ ఈవెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్ పట్ల టెస్లా చేస్తున్న ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు వేదికగా నిలిచింది.కంపెనీ సీఈఓ ఇలోన్ మస్క్ ఈ ఈవెంట్‌ను ‘ఫ్యూచర్ వరల్డ్’గా అభివర్ణించారు. ఈ రోబోవన్ కారులో 20 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇది డ్రైవర్‌లెస్ కారు. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఆటోమేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. వాణిజ్య, వ్యక్తిగత అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు.టెస్లా కంపెనీ ఇప్పటివరకు కార్లను తయారు చేయడంలోనే నిమగ్నమైంది. కానీ ఇక నుంచి ప్యాసింజర్ వాహనాలపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తుంది. ఈమేరకు సంస్థ వాహనాల సీటింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. రోబోవ్యాన్లో డ్రైవర్ క్యాబిన్ ఉండకపోవడం గమనించవచ్చు.వ్యక్తిగత అవసరాలతోపాటు వాణిజ్య అవసరాల కోసం, పెద్ద మొత్తంలో రవాణా చేయాల్సి వచ్చినప్పుడు ఉపయోగించేందుకు వీలుగా టెస్లా వాహనాలను తయారు చేయాలని నిర్ణయించుకుంది. సైబర్ క్యాబ్‌ను 2026లో ఉత్పత్తి చేయనున్నట్లు మస్క్ తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు చాలా కంపెనీలు ఈవీలను తయారు చేస్తున్నాయి. అందులో టెస్లాకు ప్రత్యేక స్థానం ఉంది.గతంలో వార్షిక సాధారణ సమావేశంలో చెప్పిన విధంగానే కంపెనీ భవిష్యత్తు కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఏఐలో విప్లవాత్మక మార్పు రాబోతుందని, భవిష్యత్తు అంతా ఏఐదేనని మస్క్ చెప్పారు. అందుకు అనుగుణంగా కంపెనీ ఏఐ ఉత్పత్తులను తయారు చేస్తుందని తెలిపారు. రోబోటాక్సీగా ఉద్దేశించిన ఈ సైబర్‌క్యాబ్‌ను ఇండక్టివ్ ఛార్జర్ ద్వారా వైర్లెస్ విధానంలో ఛార్జ్ చేసేలా రూపొందించారు. ఈవీల్లో బ్యాటరీలకు ఎక్కువగా ఖర్చు అవుతుంది. బ్యాటరీల సామర్థ్యాన్ని పెంచి వాటి తయారీకి అయ్యే ఖర్చు తగ్గించేందుకు చాలా కంపెనీలు ప్రయోగాలు చేస్తున్నాయి. -
టెస్లా రోబో కారు
‘ఐ రోటోట్’ సినిమా చూశారా..? అందులో కార్లు డ్రైవర్ ప్రమేయం లేకుండానే వాటికవే ప్రయాణిస్తుంటాయి. వాటంతటవే పార్క్ చేసుకుంటాయి. అచ్చం టెస్లా కంపెనీ అలాంటి కార్లను తయారు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా తాజాగా ‘రోబోవన్’ అనే కారును ఆవిష్కరించారు. టెస్లాకు చెందిన ‘వి రోబోట్’ ఈవెంట్లో కంపెనీ సీఈఓ ఇలోన్‌మస్క్ ఈ కారుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ లాట్లో జరిగిన ఈ ఈవెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్ పట్ల టెస్లా చేస్తున్న ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు వేదికగా నిలిచింది. కంపెనీ సీఈఓ ఇలోన్ మస్క్ ఈ ఈవెంట్‌ను ‘ఫ్యూచర్ వరల్డ్’గా అభివర్ణించారు. ‘ఈ రోబోవన్ కారులో 20 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇది డ్రైవర్‌లెస్ కారు. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఆటోమేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. వాణిజ్య, వ్యక్తిగత అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు’ అని మస్క్ తెలిపారు.Robovan seats 20 & can be adapted to commercial or personal use – school bus, RV, cargo pic.twitter.com/CtjEfcaoHI— Tesla (@Tesla) October 11, 2024ఈమేరకు రోబోవన్ రోడ్లపై పరుగెత్తిన వీడియోను వివిధ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇందులో డ్రైవర్ క్యాబిన్ ఉండకపోవడం గమనించవచ్చు. ఈ ఈవెంట్లో సైబర్ క్యాబ్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ సైబర్ క్యాబ్‌ను 2026లో ఉత్పత్తి చేయనున్నట్లు ఇలొన్‌మస్క్ తెలిపారు. రోబోటాక్సీగా ఉద్దేశించిన ఈ సైబర్‌క్యాబ్‌ను ఇండక్టివ్ ఛార్జర్ ద్వారా వైర్లెస్ విధానంలో ఛార్జ్ చేసేలా రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు.Robotaxi pic.twitter.com/zVJ9v9yXNr— Tesla (@Tesla) October 11, 2024 -
కొత్త ఈవీ పాలసీ
న్యూఢిల్లీ: టెస్లా వంటి అంతర్జాతీయ విద్యుత్ వాహనాల దిగ్గజాల నుంచి పెట్టుబడులను ఆకర్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీకి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం దేశీయంగా తయారీ యూనిట్లపై కనీసం 500 మిలియన్ డాలర్లు (రూ. 4,150 కోట్లు) ఇన్వెస్ట్ చేసే సంస్థలకు సుంకాలపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. అధికారిక ప్రకటన ప్రకారం ఈవీ ప్యాసింజర్ కార్లను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 డాలర్లకు పైబడి విలువ చేసే వాహనాలపై 15 శాతం సుంకాలతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వం అనుమతి లేఖ ఇచి్చన తేదీ నుంచి అయిదేళ్ల వ్యవధికి ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి కారును (సీబీయూ)ని దిగుమతి చేసుకుంటే.. ఇంజిన్ పరిమాణం, ఖరీదు, బీమా, రవాణా (సీఐఎఫ్) మొదలైనవి కలిపి విలువను బట్టి 70 శాతం నుంచి 100 శాతం దాకా కస్టమ్స్ సుంకాలు ఉంటున్నాయి. దీనికి 40,000 డాలర్ల విలువను ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి భారత్‌ను గమ్యస్థానంగా మార్చేందుకు, పేరొందిన అంతర్జాతీయ ఈవీల తయారీ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పాలసీ ఉపయోగపడగలదని కేంద్రం పేర్కొంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పెరుగుతుండటం, అమెరికాకు చెందిన టెస్లా, వియత్నాం సంస్థ విన్‌ఫాస్ట్ మొదలైనవి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో కొత్త విధానం ప్రాధాన్యం సంతరించుకుంది. స్కీముకి సంబంధించి మరిన్ని వివరాలు.. ► ఆమోదం పొందిన దరఖాస్తుదారులు ఎలక్ట్రిక్ 4 వీలర్ల ఉత్పత్తి కోసం భారత్‌లో కనీసం రూ. 4,150 కోట్ల (500 మిలియన్ డాలర్ల) పెట్టుబడితో తయారీ ప్లాంటు నెలకొల్పాలి. ► కేంద్ర భారీ పరిశ్రమల శాఖ అనుమతి మంజూరు చేసిన తేదీ నుంచి 3 సంవత్సరాల్లోగా ప్లాంటును ఏర్పాటు చేయాలి. ప్రాథమికంగా దేశీయంగా కనీసం 25 శాతం విలువను (డీవీఏ) జోడించాలి. అయిదేళ్లలో దీన్ని 50 శాతానికి పెంచాలి. డీవీఏని 50 శాతానికి పెంచి, కనీసం రూ. 4,150 కోట్లు ఇన్వెస్ట్ చేయడం పూర్తయిన తర్వాతే బ్యాంక్ గ్యారంటీలను ప్రభుత్వం వాపసు చేస్తుంది. ► తక్కువ సుంకాలతో గరిష్టంగా ఏడాదికి 8,000 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లను దిగుమతి చేసుకోవచ్చు. వార్షిక పరిమితి కన్నా తక్కువగా దిగుమతి చేసుకుంటే మిగతాది తర్వాత ఏడాదికి క్యారీఫార్వార్డ్ చేసుకునేందుకు వీలుంటుంది. ► స్కీమును నోటిఫై చేసిన సుమారు 120 రోజుల్లో దరఖాస్తులను ఆహా్వనిస్తారు. కంపెనీలు దరఖాస్తు చేసుకున్న 120 రోజుల్లోగా వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. -
టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..?
టెస్లా తన కార్ల తయారీ పరిశ్రమను గుజరాత్లో స్థాపించే అవకాశం ఉన్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. గుజరాత్లో జనవరి 2024లో జరిగే సమ్మిట్‌లో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెస్లా చాలా రోజులుగా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి కేంద్రం ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తున్నందున ఈ అంశం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మీడియా కథనాల ప్రకారం..గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సనంద్, ధోలేరా, బెచరాజీ ప్రదేశాల్లో ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దేశీయ, అంతర్జాతీయ డిమాండ్లను తీర్చేందుకు టెస్లా గుజరాత్ ప్లాంట్‌ను వినియోగించనున్నట్లు తెలిసింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సమక్షంలో గుజరాత్లో టెస్లా ప్లాంట్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని కథనాల ద్వారా తెలుస్తుంది. టెస్లా 2021 నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని కోరుతోంది. పూర్తిగా విదేశాల్లో తయారై భారత్‌కు వచ్చే వాహనాలపై ప్రస్తుతం 100 శాతం వరకు సుంకం వర్తిస్తోంది. విలువతో సంబంధం లేకుండా ఈ సుంకాన్ని 40 శాతానికి తగ్గించాలని టెస్లా గతంలో కోరింది. దీనికి ససేమిరా అన్న ప్రభుత్వం దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలను కొనుగోలు చేయాలని షరతు విధించింది. దీంతో టెస్లా ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఇదీ చదవండి: ‘ఎక్స్’లో కొత్త చాట్‌బాట్.. ప్రత్యేకతలివే.. ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ, ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం గతంలో కాలిఫోర్నియాలోని టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించారు. దీంతో టెస్లా ఎంట్రీకి సంబంధించిన ప్రయత్నాలు ఊపందుకున్నాయి. -
మంత్రికి క్షమాపణలు చెప్పిన మస్క్.. కారణం ఇదేనా..
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌మస్క్‌కు చెందిన దిగ్గజ సంస్థ టెస్లా ప్లాంట్‌ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం సందర్శించారు. కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్‌లోని ఈ కేంద్రంలో విద్యుత్ కార్ల తయారీని మంత్రి పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంత్రి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అయితే మంత్రి వెంట టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కనిపించలేదు. దీనిపై ఎక్స్ వేదికగా మంత్రికి మస్క్ క్షమాపణలు చెప్పారు. మంత్రి తన సందర్శనను ఉద్దేశించి ఎక్స్ ఖాతాలో ఇలా పోస్ట్ చేశారు. ‘కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్‌లో ఉన్న టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించాను. ఇక్కడ సీనియర్ హోదాలో పనిచేస్తోన్న భారత ఇంజినీర్లు, ఆర్థిక నిపుణులను కలవడం ఆనందంగా ఉంది. టెస్లా ప్రయాణంలో వారు అందిస్తోన్న సహకారం గర్వకారణం. టెస్లా తయారీలో ఇండియా నుంచి దిగుమతులు పెంచడం సంతోషంగా ఉంది. ఈ పర్యటనలో మస్క్‌ను మిస్ అవుతున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలి’ అని మంత్రి అన్నారు. మంత్రి ట్వీట్‌పై మస్క్ స్పందించారు. ‘మీరు టెస్లాను సందర్శిచడం మాకు గొప్ప గౌరవం. ఈ రోజు కాలిఫోర్నియాకు రాలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నాను. త్వరలో మీతో జరగబోయే భేటీకి ఎదురుచూస్తున్నాను’ అని టెక్ దిగ్గజం పోస్ట్ చేశారు. టెస్లా విద్యుత్ కార్లు త్వరలోనే భారత్‌లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంలో జరిగిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఎలాన్ మస్క్ సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని వెల్లడించారు. ఈవీ వాహనాల తయారీకోసం దేశంలోని కొన్ని నిబంధనలు సడలించనున్నట్లు సమాచారం. తాజా పర్యటనలో గోయల్-మస్క్ భేటీ జరుగుతుందని, భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు, దేశీయంగా పరికరాల కొనుగోలు, ఛార్జింగ్ మౌలిక వసతుల ఏర్పాటు, సుంకాల గురించి ప్రధానంగా చర్చిస్తారని వార్తలు వచ్చాయి. అయితే మస్క్ అనారోగ్యంతో ఈ భేటీ సాధ్యం కాలేదు. Visited @Tesla’s state of the art manufacturing facility at Fremont, California. Extremely delighted to see talented Indian engineers & finance professionals working at Senior positions and contributing to Tesla’s remarkable journey to transform mobility. Also proud to see… pic.twitter.com/FQx1dKiDlf — Piyush Goyal (@PiyushGoyal) November 14, 2023 -
భారత్‌లో టెస్లా.. కేంద్రంపై పంతం నెగ్గించుకున్న ఎలాన్ మస్క్?
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ కార్లపై విధించే దిగుమతి సుంకం(ఇంపోర్ట్ ట్యాక్స్)పై 15 శాతం తగ్గించేందుకు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కొన్నేళ్ల క్రితం మస్క్ టెస్లా కార్లను చైనా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని భారత్‌లో అమ్మాలని ఉవ్విళ్లూరారు. కానీ, కేంద్రం దీన్ని వ్యతిరేకించింది. భారత్‌లో టెస్లా కార్లను అమ్ముకోవచ్చు. చైనా నుంచి లేదంటే మరో దేశం నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తామంటే కుదరదు అని తేల్చి చెప్పింది. దీంతో భారత్‌లో టెస్లా కార్ల అమ్మకాలపై మస్క్ వెనక్కి తగ్గారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా మస్క్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం పరిణామాలు వేగంగా మారుతూ వస్తున్నాయి. తాజాగా, కేంద్రం ఈవీ వాహనలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని భావిస్తున్నట్లు నివేదికలు హైలెట్ చేశాయి. టెస్లా అభ్యర్ధనపై కేంద్రం గ్రీన్ సిగ్నల్? ప్రస్తుతం, భారత్‌లో టెస్లా కార్ల మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకై జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి రాగా.. దీన్ని మరింత ముందుకు సాగేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి సుంకాలను 15శాతానికి తగ్గించాలన్న టెస్లా అభ్యర్థనను భారత ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చవకగా టెస్లా కార్లు తన అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేలా టెస్లా జర్మనీలో ప్లాంట్ నిర్మించేలా ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది. ఈ సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తొలుత బడ్జెట్ ధరలో టెస్లా కార్ల అమ్మకాల్ని చేపట్టేలా భారత్‌లో టెస్లా తయారీ ప్లాంట్లను నిర్మించాలని అనుకున్నారు. అయితే, మస్క్ మనసు మార్చుకుని ఇప్పుడు ఇదే కారును జర్మనీలో తయారు చేయనున్నారు. లాంచ్ అయిన తర్వాత టెస్లా కార్లలో ఇదే అత్యంత బడ్జెట్ కారు కానుంది. ప్రస్తుతం బడ్జెట్ ధరలో టెస్లా మోడల్ 3 సెడాన్ దీని ధర సుమారు రూ.22.50లక్షలుగా ఉంది. -
టెస్లా కారు రిపేర్ బిల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రపంచ ధనవంతుడైన ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా కార్లను కొనుగోలు చేసేందుకు వాహనదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తుంటారు. అయితే ఇవి ఎలాంటి రిపేర్ రానంతవరకు సాఫీగానే ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఏదైనా రిపేర్ వస్తే మాత్రం బిల్లు తడిసిమోపెడవుతుందనే వాదనలు ఉన్నాయి. ఇటీవల టెస్లా కారు ఓనర్ తన కారును రిపేర్ చేయించడానికి వెళ్తే ఏకంగా రూ.17.46లక్షలు బిల్లు వేసినట్లు హిండెన్‌బర్గ్ నివేదిక తెలిపింది. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. టెస్లాకు సంబంధించిన 'స్కాటిష్ మోడల్ Y ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్' కారు కొనుగోలు చేసిన ఓనర్‌కు కంపెనీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వాహనాన్ని మరమ్మతు కోసం ఇవ్వగా.. టెస్లా వేసిన బిల్లు చూసి ఖంగుతిన్నాడు. ఏకంగా రూ.17.46 లక్షల బిల్లు వేశారు. నివేదిక తెలిపిన వివరాల ప్రకారం..భారీగా వర్షం కురుస్తున్న సమయంలో యజమాని కారు నడిపాడు. వాహనం తీసుకున్న కొత్తలో కొంతకాలం పాటు బాగానే నడిచినా వర్షంలో తడిసిన తర్వాత స్టార్ట్ అవలేదు. ఈవీని ట్రక్ ద్వారా వర్క్‌షాప్‌కు తరలించడానికి ఓనర్ ఐదు గంటలు వేచి చూడాల్సి వచ్చింది. టెస్లా కస్టమర్ సర్వీస్ కూడా అంతగా సహాయపడలేదని యజమాని పేర్కొన్నాడు. టెస్లా వర్క్‌షాప్ యాజమాన్యం ఈ విషయంపై స్పందించింది. బ్యాటరీలోకి నీరు ప్రవేశించడం వల్ల ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ పాడైందని తెలిపింది. ఇది ప్రొపల్షన్ సిస్టమ్ పై ప్రభావం చూపినట్లు వివరించింది. టెస్లా అందించే వారంటీ పరిధిలోకి ఇది రాలేదని స్పష్టం చేసింది. అయితే యజమానికి రూ.17.46లక్షల రిపేర్ బిల్లు రావడంపై వర్క్‌షాప్ మేనేజర్ని నిలదీసినట్లు నివేదిక వెల్లడించింది. భారీగా బిల్లులు వసూలు చేస్తూ టెస్లా గతంలోనూ వార్తల్లో నిలిచింది. కానీ ఈసారి బిల్ మరింత షాకింగ్ గా ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. కస్టమర్ సపోర్ట్ వల్ల అంతగా ఉపయోగం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. -
‘భారత్‌లో టెస్లా కార్లని తక్కువ ధరకే అమ్ముతాం’?: ఎలాన్ మస్క్
భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ, మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాట్లపై రోజుకో వార్త ప్రధానాంశంగా మారుతోంది. తాజాగా, టెస్లా ప్రతినిధులు దేశీయంగా టెస్లా కార్ల తయారీపై త్వరలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం కానున్నారని సమాచారం. ఇప్పటికే ఈ భేటీకి సంబంధించిన అన్నీ ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్‌లో టెస్లా కార్ల తయారీ ఫ్యాక్టరీని నిర్మించి అతి తక్కువ ధరకే వాటిని వాహనదారులకు అందించాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఎందుకంటే మస్క్ చైనాలో టెస్లా కార్లను తయారు చేసి భారత్‌కు దిగుమతి చేసి ఇక్కడ అమ్మకాలని చూశారు. అందుకు కేంద్రం సైతం తిరస్కరించింది. ఈ తరుణంలో అమెరికా పర్యటనలో భాగంగా ఎలాన్ మస్క్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం భారత్‌లో టెస్లా కార్ల ఉత్పత్తిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అందుకు తగ్గట్లే మస్క్ సైతం భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే, దేశీయంగా తయారీ సంస్థలకు ఎలాంటి ప్రొత్సహకాలు అందిస్తున్నామో, టెస్లాకు సైతం అదే విధమైన రాయితీలు ఉంటాయి. అంతే తప్పా టెస్లా కోసం ఎలాంటి ప్రత్యేక పాలసీలు అమలు చేయడం లేదంటూ కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పియూష్ గోయల్‌తో టెస్లా ప్రతినిధులు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. పియూష్తో జరిపే సమావేశంలో భారత్‌లో టెస్లా కార్లను తయారు చేసి చైనా కంటే తక్కువ ధరకే అమ్ముతామని టెస్లా చెప్పనుందని వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. చైనాలో టెస్లా మోడల్3 సెడాన్ కారును 32,200 డాలర్లకు అమ్ముతుండగా..ఆ ధర కంటే తక్కువగా అంటే 25శాతం తగ్గించి రూ.20 లక్షల (24 వేల డాలర్ల) ధరకే అందుబాటులోకి తేవాలని టెస్లా భావిస్తున్నట్లు రాయిటర్స్ ఓ వార్తా కథనం ప్రచురించింది. దీనిపై అధికారికంగా స్పందించడానికి టెస్లా ప్రతినిధులు అందుబాటులోకి రాలేదు. చదవండి👉 భారత్‌లో టెస్లా కార్ల తయారీ.. ధరెంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు -
భారత్‌లో టెస్లా.. త్వరలో కార్ల తయారీ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటాం!
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారతీయులకు శుభవార్త చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి దేశీయంగా టెస్లా కార్ల తయారీ సంస్థను ఏర్పాటు చేసేలా ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటామని తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎలాన్ మస్క్‌ను న్యూయార్క్ టైమ్స్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్ థోరాల్డ్ బార్కర్ భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల మ్యానిఫ్యాక్చరింగ్ ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నించారు. అందుకు మస్క్ ‘ఓ అబ్సల్యూట్లీ’ అంటూ సుమఖత వ్యక్తం చేశారు. దీంతో గత కొన్నేళ్లుగా భారత్‌లో టెస్లా కార్ల తయారీపై నెలకొన్న సందిగ్ధతకు తెర పడింది. భారత్‌లో టెస్లా ప్రతినిధుల పర్యటన కొద్ది రోజుల క్రితం టెస్లా సీనియర్ ఉన్నతోద్యోగులు భారత్‌లో పర్యటించనున్నారని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవుతారని, ఈ సందర్భంగా టెస్లా కార్ల తయారీలో ఉపయోగించే విడిభాగాల గురించి చర్చిస్తారని బ్లూంబెర్గ్ నివేదించింది. ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గిస్తుందా? కాగా, భారత్‌లో పర్యటించే ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ విభాగంలో నిపుణులు(సీ- సూట్ ఎగ్జిక్యూటీవ్)లు, మేనేజర్లు ఉన్నారని బ్లూంబెర్గ్ పేర్కొంది. అయితే టెస్లా ప్రతినిధులు విదేశాల నుంచి భారత్‌కు దిగుమతయ్యే కార్లపై విధించే ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించాలని మోదీని కోరనున్నారని హైలెట్ చేసింది. చదవండి👉రికార్డ్ల రారాజు.. ఎలాన్ మస్క్ ఖాతాలో ప్రపంచంలో అత్యంత అరుదైన చెత్త రికార్డ్ -
టెస్లాకు షాక్: స్లీక్ అండ్ స్టైలిష్ ఎలక్ట్రిక్ సెడాన్, రేంజ్ ఎంతో తెలిస్తే
Hyundai IONIQ 6: లగ్జరీ కార్ మేకర్ టెస్లాకు షాకిచ్చేలా హ్యుందాయ్ తన తొలి ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ హ్యుందాయ్ ఐయోనిక్ 6ని విడుదల చేసింది. ఐయోనిక్ 6 ఎలక్ట్రిక్ సెడాన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 610 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని వాహన తయారీ సంస్థ వెల్లడించింది. ఇదే నిజమైతే లాంగ్-రేంజ్ టెస్లా మోడల్ 3 కంటే మెరుగైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టెస్లా ఆధిపత్యం చలాయిస్తున్న ఈవీ మార్కెట్లో పాగా వేసే లక్ష్యంతో `ఎలక్ట్రిఫైడ్ స్ట్రీమ్‌లైనర్` ఐయోనిక్-6 సెడాన్‌ను తీసుకొచ్చింది. ఒక్కసారి ఛార్జ్‌పై 602 కిలోమీటర్లు దూసుకుపోతుంది. 5.1 సెకన్లలో గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. 12 రంగులలో అలరించనున్న హ్యుందాయ్ ఐయోనిక్ 6 కేవలం 18 నిమిషాల్లో 350-kW ఛార్జర్‌తో 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. ఈవీ పెర్ఫార్మెన్స్ ట్యూన్-అప్ ఎలక్ట్రిక్ యాక్టివ్ సౌండ్ డిజైన్ (e-ASD) తో అత్యంత ఏరోడైనమిక్ స్టైలింగ్ డ్యూయల్ కలర్, యాంబియంట్ లైటింగ్, స్పీడ్ సింక్ లైటింగ్, అత్యాధునిక ఫీచర్లున్న కారు ఇదేనని హ్యుందాయ్ మోటార్ ప్రెసిడెంట్ , సీఈవో జేహూన్ చాంగ్ తెలిపారు. అల్ట్రా-ఫాస్ట్, మల్టీ-ఛార్జింగ్ సామర్థ్యం, డ్యూయల్ కలర్ యాంబియంట్ లైటింగ్ 64 కలర్స్ స్పెక్ట్రమ్ , స్పెషల్ థీమ్స్, స్పీడ్ సింక్ లైటింగ్ మోడ్, నాలుగు టైప్-సి, ఒక టైప్-ఏ యూఎస్ బీ పోర్ట్‌లు, సిస్టమ్ డ్రైవర్ స్టీరింగ్ ఎఫర్ట్, మోటార్ పవర్, యాక్సిలరేటర్ పెడల్ సెన్సిటివిటీ లాంటివి ఫీచర్లు ఇందులో జోడించినట్టు చెప్పారు. విశాలమైన ఇంటీరియర్, ప్రత్యేకమైన సీట్లు, స్లీక్ అండ్ స్టైలిష్ లుక్‌లో వినియోగదారులు మనసు దోచుకుంటుందని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ డివిజన్ హెడ్ థామస్ స్కీమెరా అన్నారు. ఈ కారును వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అమెరికాలో విక్రయించనుంది. అయితే దీని ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అలాగే ఇండియాలో ఎపుడు తీసుకొచ్చేది కూడా స్పష్టత లేదు. -
ఎలన్ మస్క్ ఉక్కిరి బిక్కిరి, టెస్లా కొనుగోలుదారులకు భారీ షాక్!
జాతీయ,అంతర్జాతీయ సమస్యలు టెస్లా అధినేత ఎలన్ మస్క్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గ్లోబల్ సప్లయి చైన్‌తో పాటు ఇతర కారణాల వల్ల కార్ల ఉత్పత్తితో పాటు అమ్మకాలు తగ్గిపోతున్నాయి. దీంతో లాభాలు రాకపోయినా ఫర్వాలేదు. సంస్థ నష్టపోకుండా ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా టెస్లా కార్ల ధరల్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మే, జూన్ నెలల్లో టెస్లా కార్లలో వినియోగించే అల్యూమినియంతో పాటు ఇతర ముడి సరుకు ధరలు పెరిగాయి. వాటి పెరుగుదల టెస్లా కార్ల ఉత్పత్తిపై పడింది. అందుకే జూన్ నెలలో టెస్లా పలు లాంగ్ రేంజ్ మోడల్ టెస్లా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు దారులకు చెప్పిన టైంకు డెలివరీ చేయడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో పెరిగిపోతున్న ముడి సరకు ధరల్ని తట్టుకొని కార్లను ఉత్పత్తి చేసేందుకు మస్క్ టెస్లా మోడల్ వై లాంగ్ రేంజ్ ధరల్ని 62,990 డాలర్ల నుంచి 65,990 డాలర్లకు పెంచారు. ఇదే విషయాన్ని టెస్లా తన అఫీషియల్ వెబ్సైట్లో అధికారికంగా ప్రకటించింది. టెస్లాలో కాస్ట్ కటింగ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని వర్క్ ఫ్రమ్ హోం నిర్వహిస్తున్నాయి. అందుకు భిన్నంగా మరికొన్ని కంపెనీలు ఉద్యోగుల్ని కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నాయి. మస్క్ సైతం టెస్లా ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని పిలుపునిచ్చారు. వర్క్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని అన్నారు. అదే సమయంలో 10శాతం టెస్లా ఉద్యోగుల్ని తొలగిస్తూ మస్క్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చారు. చదవండి👉 ఎలన్ మస్క్ ఆగమాగం, మంచు పర్వతంలా కరిగిపోతున్న ఆస్తులు! -
"నా దారి నేను చూసుకుంటా", కేంద్రానికి ఎలన్ మస్క్ భారీ షాక్!?
టెస్లా సీఈవో ఎలన్ మస్క్ భారత్‌కు భారీ షాకివ్వనున్నారు. మనదేశాన్ని కాదని సౌత్ఈస్ట్ ఏసియా కంట్రీ ఇండోనేషియాలో టెస్లా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎలన్ మస్క్ టెక్సాస్‌లోని రాకెట్ల తయారీ ప్రాంతమైన బోకాచికా సైట్లో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో భేటీ అయ్యారు.ఈ సమావేశంలో ఇండోనేషియాలో పెట్టుబడులతో పాటు, టెస్లా మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను ప్రారంభించే అంశాలపై చర్చించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. రాగి నిక్షేపాలకు నిలయం ఇండోనేషియాలో విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేలా ప్రపంచంలోని అతిపెద్ద రాగి, నికెల్, టిన్ నిక్షేపాలు ఉన్నాయి. అందుకే విదేశీ ఇన్వెస్టర్లు ఇండోనేషియాలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతుంటుంటారు. తాజాగా జోకో విడోడోతో మస్క్ జరిపిన మంతనాల్లో ఇండోనేషియాలో టెస్లా కార్ల తయారీ యూనిట్‌ను ప్రారంభించాలని ప్రతిపాధన తెచ్చినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి "నా దారి నేను చూసుకుంటా" మరోవైపు టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, స్పెస్ రాకెట్ లాంచ్ సైట్ల ఒప్పొందాలు చేసేలా ఇండోనేషియా ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇప్పుడు మళ్లీ ఆ ఒప్పొంద ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. చైనాలో టెస్లా కార్లను తయారు చేసి భారత్‌లో అమ్మేందుకే కేంద్రం ఒప్పుకోకపోవడం, ఇప్పటికే పలు మార్లు అందుకు కేంద్రాన్ని ఒప్పించేలా మస్క్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో భారత్‌లో టెస్లా కార్లను అమ్మాలనే ప్రణాళికల్ని, టెస్లా కోసం భారత్‌లో అనువైన స్థలం కోసం చేస్తున్న ప్రయత్నాల్ని మస్క్ విరించుకున్నారు. తాజాగా ఇండోనేషియా అధ్యక్షుడు విడోడోతో ఎలన్ మస్క్ భేటీ అవ్వడం మరింత చర్చాంశనీయంగా మారింది. భారత్‌ను వద్దనుకొని ఇండోనేషియాలో టెస్లా మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటూ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి👉 నితిన్ గడ్కరీ..మాటంటే మాటే! ఎలన్‌మస్క్‌కు బంపరాఫర్! -
టెస్లా కార్లలో కలకలం, 8లక్షల కార్లకు పైగా!!
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ దిగ్గజం టెస్లాకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. టెస్లా కార్లలో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా సుమారు 8.17లక్షల కార్లకు పై రీకాల్ చేయాలని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్హెచ్టీఎస్ఏ) విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఎస్ సెడాన్, మోడల్ ఎక్స్ ఎస్యూవీ, మోడల్ 3, మోడల్ వై ఎస్యూవీ వాహనాల డ్రైవింగ్ సమయంలో సీట్ బెల్ట్ రిమైండ్ చేయడం సమస్య తెలత్తినట్లు తెలుస్తోంది. ఈ సమస్య కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఎక్కువ ఉంటుందనే కారణంతో సుమారు.8,17,000 కార్లను రీకాల్ చేయాలని ఎన్ హెచ్ టీఎస్ ఏ అధికారులు టెస్లాను ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన టెస్లా కార్లకు సంబంధించిన లోపాల్ని సత్వరమే పరిష్కరించి వాహనదారులకు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. సిగ్నల్ పడినా దూసుకొని వెళ్తున్నాయ్ కొద్ది రోజుల క్రితం ఇదే టెస్లాకు చెందిన 54వేల కార్లలో సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రెడ్ సిగ్నల్ పడినా టెస్లా కార్లు రయ్ మంటూ దూసుకెళ్లాయి. దీంతో టెస్లా కార్లలో భద్రత ప్రధాన సమస్యగా మారిందని, వెంటనే ఆ కార్లను రీకాల్ చేయాలని అమెరికా రక్షణ నియంత్రణ సంస్థ టెస్లా సంస్థకు నోటీసులు జారీ చేసింది. కాగా, టెస్లా మాత్రం తమ కార్లలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదని తెలిపింది. వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. -
టెస్లా కార్లలో ‘కలకలం..!’
అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా కీలక నిర్ణయం తీసుకుంది. టెస్లా కార్లలోని రియర్ వ్యూ కెమెరా, ట్రంక్ లో సమస్యలు ఉన్నట్లు కంపెనీ గుర్తించడంతో ఈ సమస్యను తనిఖీ చేయడానికి టెస్లా తన 4,75,000 ఎలక్ట్రిక్ వాహనదారులకు రీకాల్ ఆర్డర్లను జారీ చేసింది. ఈ సమస్య వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్లు భావించి రీకాల్ చేసినట్లు పేర్కొంది. రీకాల్ చేయబడ్డ యూనిట్లు టెస్లా మోడల్ 3, మోడల్ ఎస్ ఎలక్ట్రిక్ వాహనాలు. టెస్లా రీకాల్ ఆర్డర్‌ను యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌హెచ్‌టిఎస్‌ఎ) ధృవీకరించింది. 2014 నుంచి 2021 మధ్య కాలంలో తయారు చేసిన మోడల్ 3, మోడల్ ఎస్ ఎలక్ట్రిక్ వాహనలను సంస్థ రీకాల్ చేసింది. ఈ మోడల్ 3 ఈవీలలో వెనుక ట్రంక్ తెరిచినప్పుడు, మూసివేసినప్పుడు వెనుక కెమెరా దెబ్బతినే అవకాశం ఉన్నట్లు రాయిటర్స్ నివేదించింది. కొన్ని టెస్లా కార్లలోని ఫ్రంట్ ట్రంక్ లో ఉన్న లోపం వల్ల భారీ ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉన్నట్లు సంస్థ గుర్తించింది. కారు ప్రయాణిస్తున్న సమయంలో ముందు ఉన్న ట్రంక్ ఒకేసారి ఆటోమెటిక్‌గా తెరుచుకోవడంతో ముందు వెళ్తున్న వాహనాలు, రోడ్డు కనిపించకపోవడంతో వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఇప్పటివరకు ప్రమాదాలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదని టెస్లా పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా 4,75,000 ఈవీలను రీకాల్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. (చదవండి: చేనేతకు ఊరట.. జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా) -
రాజకీయాల నుంచి ''ఆ ముసలోళ్లను ఎలిమినేట్ చేయండి సార్''..!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. 70 ఏళ్ల వయస్సు పైబడిన వారిని రాజకీయ పదవులకు పోటీ చేయకుండా నిషేధించాలని పిలుపునిచ్చారు. ట్వీట్లో చట్టసభ సభ్యులు ఎవరనేది ప్రస్తావించనప్పటికీ, ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్, మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్, ఇద్దరూ 70 ఏళ్లు పైబడిన వారు. కొద్ది రోజుల క్రితం ఎలన్ సెటైర్లు వేసిన సెనేటర్ సాండర్స్ వయస్సు 80 సంవత్సరాలు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఎలన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. Let’s set an age limit after which you can’t run for political office, perhaps a number just below 70 … — Elon Musk (@elonmusk) December 2, 2021 ఎలన్ మస్క్ అమెరికా నేతల్ని పరోక్షంగా కర్ర కాల్చి వాత పెడుతున్నారు. నవంబర్ 13న వాషింగ్టన్లో కొంతమంది డెమోక్రాట్లు ఎలన్ మస్క్, జెఫ్ బేజోస్, మార్క్ జుకర్‌బర్గ్ లాంటి బిలియనీర్లపై పన్నులు పెంచాలని ఒత్తిడి చేశారు. బిలియనీర్లు స్టాక్స్ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. అదే సమయంలో అమెరికా సెనేట్ బడ్జెట్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న సాండర్స్ అమెరికాలోని 0.1 శాతం ఉన్న అత్యంత ధనవంతులు కుటుంబాలపై వార్షిక పన్నును ప్రతిపాదించారు. ‘‘అత్యంత ధనవంతులు వారి వంతు పన్నులను సక్రమంగా చెల్లించాల్సిందిగా మనం డిమాండ్ చేయాలి’’ అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌పై ఎలన్ తనదైన స్టైల్లో సాండర్స్ పై సెటైర్లు వేశారు. ‘‘ సాండర్స్ నువ్వు బతికున్నావనే విషయాన్ని నేను మర్చిపోతుంటాను..ఇప్పుడేమంటావ్.. నేను మరింత స్టాక్ అమ్ముకోవాలని నువ్వు కోరుకుంటున్నావా.. చెప్పు’’ అంటూ ఎలన్ మస్క్ విరుచుకుపడ్డాడు. అయితే తాజాగా ఎలన్ చేసిన 'ఎలిమినేట్' వ్యాఖ్యలకు కారణం సెనెటర్లు బిలియనీన్లు పన్నులు కట్టాలని సెనెటర్లు చేసిన డిమాండ్లేనని తెలుస్తోంది. బిలియనీన్లు పన్నులు చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఎలన్..టెస్లాలోని తన శాతం షేర్లను అమ్మకానికి పెడుతున్నట్లు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ దెబ్బకు టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో లక్షకోట్లుకు పైగా నష్టం వాటిల్లింది. ఆ నష్టాన్ని తట్టుకోలేకనే ఈ బిలియనీర్ 70ఏళ్లకు పై బడిన వారిని రాజకీయాల్లో పదవులకు పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తించాలని ట్వీట్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్యం అమెరికాలో చర్చాంశనీయం కాగా..ఆ వ్యాఖ్యల ప్రభావం ఎలన్పై భారీగా ఉండొచ్చనేది విశ్లేషకులు చెబుతున్నమాట. చదవండి: లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1 -
టెస్లాకు గట్టి పోటీ.. ఛార్జింగ్ లేకున్నా దూసుకెళ్తుంది!
ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో రారాజు అంటే కచ్చితంగా టెస్లా పేరే చెప్పుకోక ఉండలేదు. టెస్లా కార్లు మార్కెట్లోకి వచ్చిన తర్వాతనే ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎలక్ట్రిక్ వాహన ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది టెస్లా. అలాంటి కంపెనీ నుంచి ఒక కారు వస్తుంది అంటే? దానికి ఉండే క్రేజ్ వేరు. టెస్లా గతంలో సైబర్ ట్రక్ పేరుతో ఒక కారును తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు ఈ కారుని మార్కెట్లోకి తీసుకొని రాలేదు. అయితే, అచ్చం అలాంటి ఒక కారును చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ స్టార్టప్ ఎడిసన్ ఫ్యూచర్ కంపెనీ ఈఎఫ్1-టీ పేరుతో రూపొందించింది. అచ్చం టెస్లా సైబర్ ట్రక్ లాగా ఈ ఎడిసన్ ఫ్యూచర్ స్టార్టప్ కంపెనీ ఈఎఫ్1-టీ సోలార్ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ కాన్సెప్ట్ ను నవంబర్ 19 నుంచి జరుగుతున్న లాస్ ఏంజిల్స్ ఆటో షోలో ఈ వారం ప్రదర్శించింది. ఇది అచ్చం చూడాటానికి టెస్లా సైబర్ ట్రక్ లాగా కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ సోలార్ ట్రక్కును ఈఎఫ్1-టీ పేరుతో పిలుస్తారు. ఇది రిట్రాక్టబుల్ సోలార్ కవర్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఈ ట్రక్ పగటిపూట ప్రయాణిస్తున్నపుడు దానికి అదే ఛార్జ్ అవుతుంది. సోలార్ రూఫ్ రోజుకు 25 నుంచి 35 మైళ్ల రేంజ్ అందించగలదని కంపెనీ చెబుతోంది. ఈ ట్రక్ వెనుక భాగాన్ని మూసినప్పుడు ఈఎఫ్1-టీ పికప్ ట్రక్కు టెస్లా సైబర్ ట్రక్ లాగా కనిపిస్తుంది. ఈఎఫ్1-టీ రిట్రాక్టబుల్ సోలార్ ప్యానెల్స్ పొరల రూపాన్ని కలిగి ఉంటుంది. 724 కిమీ రేంజ్ టెస్లా సైబర్ ట్రక్ లాగా ఈ ట్రక్ గ్లాస్ బుల్లెట్ ప్రూఫ్ అవునా? కాదా అనేది తెలీదు. ఈఎఫ్1-టీ ఎలక్ట్రిక్ సోలార్ పికప్ ట్రక్కు లోపల17.5 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్, మిర్రర్ కెమెరా స్క్రీన్లు, డోర్ మౌంటెడ్ టూల్ బాక్స్, రూఫ్ మౌంటెడ్ రీడింగ్ లైట్లు ఉన్నాయి. ఈఎఫ్1-టి ధర ఎంత అనేది తెలీదు, కానీ కంపెనీ 2025లో ట్రక్కును ప్రారంభించాలని యోచిస్తోంది. ఇది ఈఎఫ్1-టీ ట్రక్ మూడు వేరియంట్స్ లలో అందుబాటులో ఉండనుంది. దీని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 724 కిమీలకు పైగా దూసుకెళ్లనుంది. ఇది 0-100 కిమీ వేగాన్ని 3.9 సెకన్లలలో అందుకోనుంది. -
ఎలన్ మస్క్ ఆపసోపాలు, టిమ్ కుక్ అప్పుడే ప్రకటించేశాడు..?!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ సెల్ఫీ డ్రైవింగ్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైంది. మరో నాలుగేళ్లలో కారును మార్కెట్లో విడుదల చేసే లక్క్ష్యంగా ప్రణాళికల్ని సిద్ధం చేసినట్లు బ్లూమ్ బెర్గ్ తన కథనంలో వెల్లడించింది. అయితే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారు ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సి ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణాలు అనేకం ఉన్నాయని అంటున్నారు. ఎలన్ మస్క్ ఫెయిల్ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను విడుదల చేసేందుకు కిందా మీదా పడుతున్నారని అమెరికా 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' గణాంకాలు చెబుతున్నాయి. ఎలన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ టెస్లాను సెల్ఫ్ డ్రైవింగ్ కారును విడుదల చేసేందుకు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. 2023లో ఎలన్ మస్క్ వినియోగదారులకోసం సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అందుబాటులోకి తెస్తామని ఛాలెంజ్ చేశారు. అందుకోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. కానీ సెల్ఫ్ డ్రైవింగ్ కారు టెస్టింగ్‌ల్లో పెయిల్ అవుతూ వస్తుంది. అలా ఇప్పటి వరకు సుమారు 24 సార్లు ఫెయిల్ అయినట్లు, కారు ప్రమాదంలో పలువురు మరణించినట్లు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఇప్పుడు టెక్ దిగ్గజం యాపిల్ మరో అడుగు ముందుకేసి సెల్ఫ్ డ్రైవింగ్ కారును విడుదల చేస్తామని చెప్పింది. దీంతో యాపిల్ షేర్లు మూడు శాతం పెరిగినట్లు బ్లూమ్ బెర్గ్ తన కథనంలో పేర్కొంది. యాపిల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు యాపిల్ చేస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్ ప్రాజెక్ట్‌కు టైటాన్ అనే పేరు పెట్టింది. స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకుండా పూర్తిగా అటానమస్‌గా ఈ వాహనం ఉండనుంది. అంతేకాదు సెల్ఫ్ డ్రైవింగ్ కారు కోసం ప్రత్యేకంగా అదునాతన చిప్ సెట్‌ను రూపొందించనుంది. కానో సంస్థ తమ ఎలక్ట్రిక్ వెహికల్స్ లిమోసిన్ స్టైల్ సీటింగ్ ను ఏర్పాటు చేయాలని అనుకుంది. ఇప్పుడు అదే సీటింగ్ స్టైల్‌ను యాపిల్ కారుకు డిజైన్ చేయాలని భావిస్తోంది. ఈ తరహాలో కారును డిజైన్ చేసి 2025 కల్లా కారును విడుదల చేయాలని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రయత్నాలు ముమ్మరం చేశారని బ్లూమ్ బెర్గ్ తన రిపోర్ట్‌లో తెలిపింది. చదవండి: Work From Home: చేసింది చాలు, యాపిల్ కీలక నిర్ణయం..! -
ఎలన్ మస్క్ సంచలనం: వెహికల్స్ ఎన్ని ఉన్నా, టెస్లా కార్ల తర్వాతే ఏదైనా
వాతావరణ మార్పు (క్లైమేట్ చేంజ్).. ఇప్పడు ప్రపంచాన్ని వణికిస్తున్న హాట్ టాపిక్. అడ్డగోలుగా పర్యావరణానికి తూట్లు పొడిచి మనం నిర్మించుకున్న నగరాలు, పరిశ్రమలు, వాహనాలు, లగ్జరీలు ఇప్పుడు ధరిత్రికే కాదు... మానవాళి మనుగడకే ముప్పుగా మారాయి. భూతాపం (గ్లోబల్ వార్మింగ్) దెబ్బకు ఈ శతాబ్దం చివరికల్లా ప్రపంచంలోని అనేక తీర ప్రాంత నగరాలను సముద్రాలు ముంచెత్తనున్నాయని పర్యావరణవేత్తలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. మరోపక్క పెట్రోలు, డీజిల్ రేట్లు ‘సెంచరీ’ కొట్టి జేబు గుల్ల చేస్తున్నాయి. కట్ చేస్తే... ప్రపంచ దేశాలన్నీ కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఆగమేఘాలపై ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఎట్టకేలకు ‘ఎలక్ట్రిక్’ రాగం అందుకున్నాయి. పెట్రోలు, డీజిల్ ఇతరత్రా శిలాజ ఇంధనాల కాలుష్యానికి చెక్ చెప్పేందుకు ప్రభుత్వాలు, ప్రపంచ ఆటోమొబైల్ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాల బాట పట్టాయి. చకచకా తమ ప్లాంట్లను ‘ఎలక్ట్రిక్’ వేగంతో కొత్త టెక్నాలజీ వైపు పరుగులు తీయిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహన రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు... ప్రజల్లో వీటికున్న ఆదరణ... కంపెనీలు, ప్రభుత్వాల ప్రణాళికలు వంటి సంగతులను తెలుసుకోవడానికి ఓ లాంగ్ డ్రైవ్ చేద్దాం!! కార్లు, స్కూటర్లు, బైక్‌లు, విమానాలు, ట్రక్కులు, నౌకలు ఇలా ఒకటేంటి ప్రపంచ వాహన, రవాణా రంగం మొత్తం ‘ఎలక్ట్రిక్’ మయం అయ్యే రోజు మరెంతో దూరంలో లేదా? ఈ రంగంలో పెను విప్లవం చోటుచేసుకోబోతోందా? అంటే కచ్చితంగా అవుననే అంటున్నారు విశ్లేషకులు. క్లైమేట్ చేంజ్ భయాలకు తోడు పెట్రోలు, డీజిల్ ధరలు అంతకంతకూ ఎగబాకుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఇటీవలి కాలంలో టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నాయి. ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) కొనుగోళ్లను ప్రోత్సహించే విధంగా తీసుకొస్తున్న పాలసీలు, చట్టాలు, సబ్సిడీలు కూడా ఇందుకు దన్నుగా నిలుస్తున్నాయి. ఈ జోరు ఇలాగే కొనసాగితే 2030 నాటికి మొత్తం ప్యాసింజర్ వాహన విక్రయాల్లో ఈవీల వాటా 40 శాతానికి చేరుకోవచ్చనేది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ అంచనా. 2016లో ప్రపంచవ్యప్తంగా 13 లక్షల ఈవీలు అమ్ముడవగా, 2020లో ఈ సంఖ్య 45 లక్షలకు చేరుకుంది. మొత్తం ప్రపంచ లైట్–డ్యూటీ వెహికల్ మార్కెట్ (కార్లు, వ్యాన్లు ఇతరత్రా తక్కువ లోడ్ గల వాహనాలు)లో ఇది దాదాపు 5 శాతానికి సమానం. కాగా, 2020 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా రోడ్లపై తిరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య ఒక కోటి మైలురాయిని అధిగమించింది. అంతేకాదు ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 6 లక్షలు, ట్రక్కులు 31,000 మార్కును అందుకున్నాయి. కోవిడ్ దెబ్బతో ప్రపంచ కార్ల అమ్మకాలు 16 శాతం క్షీణించినప్పటికీ ఈవీ కార్ల సేల్స్ 41% ఎగబాకడం విశేషం. ప్రపంచ ఈవీ మార్కెట్లో ఇప్పటికీ చైనాదే అగ్రస్థానం. టార్గెట్ 2030... అగ్ర దేశాలతో పాటు భారత్ వంటి పలు వర్ధమాన దేశాలు ఈవీలపై గట్టిగా దృష్టి సారించడంతో ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఈవీల ఉత్పత్తి, అమ్మకాలను పరుగులు పెట్టిస్తున్నాయి. 2030 నాటికి దేశంలో పెట్రోలు, డీజిల్ వాహనాలకు పూర్తిగా అడ్డుకట్టవేసి (నెట్–జీరో), మొత్తం ఈవీల విక్రయాలే ఉండాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ దిశగా బ్రిటన్ 2030, ఫ్రాన్స్ 2040 ఏడాదిని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వచ్చే 10–30 ఏళ్లలో నెట్–జీరో లక్ష్యాలను ప్రకటించిన దేశాలు 2020 చివరి నాటికి 20కి పైగానే ఉన్నాయి. మరో 130 దేశాలు సైతం కొన్ని దశాబ్దాల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రకటించాయి. కంపెనీల మెగా ప్లాన్స్.... ఈవీల డిమాండ్‌కు అనుగుణంగా, ప్రపంచంలోని టాప్–20 వాహన తయారీ సంస్థలు ఈవీ వాహన మోడళ్ల సంఖ్యతో పాటు ఉత్పత్తిని కూడా భారీగా పెంచనున్నట్లు ప్రకటించాయి. ఇక హెవీ–డ్యూటీ ఈవీల (బస్సులు, ట్రక్కులు ఇతరత్రా) తయారీ కంపెనీలు కూడా భవిష్యత్తులో ఆల్–ఎలక్ట్రిక్ సంకేతాలిచ్చాయి. 2020లో ఎలక్ట్రిక్ కార్లపై వినియోగదారుల వ్యయం 120 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. ప్రభుత్వాలు కూడా ఈవీలకు మద్దతుగా 14 బిలియన్ డాలర్లను ఈవీ కొనుగోళ్లపై వెచ్చించాయి. కాగా, ఐఈఏ అంచనాల ప్రకారం 2030 నాటికి నార్వే, ఫిన్లాండ్ మొత్తం వాహన అమ్మకాల్లో 75 శాతం పైగా ఈవీలే ఉండనున్నాయి. ఇక ఆస్ట్రేలియా, అమెరికా, చైనాల్లో కూడా 2030 నాటికి అమ్మకాల్లో ఈవీల వాటా 50–60 శాతానికి చేరే అవకాశం ఉంది. భారత్ విషయానికొస్తే, ఇది 20–30 శాతానికి చేరుకోవచ్చని అంచనా. భారత్‌లో ఈవీల జర్నీ ఇలా... ►1993 – దేశంలో మొదటి రెండు సీట్ల ఎలక్ట్రిక్ కారు ‘లవ్‌బర్డ్’ ఆవిష్కరణ. ►1996 – తొలి ఎలక్ట్రిక్ త్రీవీలర్ (ఆటో) ‘విక్రమ్ సాఫా’ను స్కూటర్స్ ఇండియా ప్రవేశపెట్టింది. ►1999 – మహీంద్రా అండ్ మహీంద్రా ‘బిజిలీ’ పేరుతో ఎలక్ట్రిక్ త్రీవీలర్‌ను తీసుకొచ్చింది. ►2000 – బీహెచ్ఈఎల్ 18 సీట్ల ఎలక్ట్రిక్ బస్సును రూపొందించింది. ►2001 – బెంగళూరుకు చెందిన మైనీ గ్రూప్ రెండు సీట్ల ‘రేవా’ కారును విడుదల చేసింది. వాణిజ్యపరంగా భారత్‌లో అత్యంత విజయవంతమైన ఎలక్ట్రిక్ కారు ఇది. ►2006 – ఎలక్ట్రిక్ టూవీర్లను తొలిసారిగా వాణిజ్యపరంగా ప్రవేశపెట్టిన కంపెనీ గుజరాత్‌కు చెందిన ఎలక్ట్రోథర్మ్ ఇండియా. 2006లో తొలిసారి ఇది ‘యో బైక్స్’ పేరుతో తీసుకొచ్చింది. ►2007 – ఈవీ స్కూటర్ల రంగంలోకి హీరో ఎలక్ట్రిక్ (అప్పట్లో అల్ట్రా మోటార్స్) భారీ స్థాయిలో అడుగుపెట్టింది. ► 2013 – టయోటా భారత్‌లో ప్రియస్ ఈవీని ప్రవేశపెట్టింది. అలాగే ‘క్యామ్రీ హైబ్రిడ్’ కారును తెచ్చింది. ► 2015 – కేంద్ర ప్రభుత్వం ఫేమ్ ఇండియా స్కీమ్‌ను ప్రవేశపెట్టడం, భారీగా సబ్సిడీలను ఆఫర్ చేయడం వంటివి మళ్లీ ఈవీలు జోరందుకున్నాయి. మారుతీ స్మార్ట్ హైబ్రిడ్ సియాజ్, ఎర్టిగా మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. ► 2020 – భారత్‌లో తొలి హైడ్రోజన్ ఎఫ్‌సీఈవీ ప్రోటోటైప్ వాహనాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), కార్పొరేట్ దిగ్గజం కేపీఐటీ కలసి విజయవంతంగా పరీక్షించాయి. ► 2020 – భారత్‌లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రపంచ ఎలక్ట్రిక్ దిగ్గజం టెస్లా ప్రకటించింది. ► 2021 – ఫేమ్–2 స్కీమ్ రాయితీని కేంద్రం భారీగా పెంచింది. మరోపక్క, పెట్రోలు టూవీలర్లపై 28 శాతం జీఎస్టీ ఉండగా, ఎలక్ట్రిక్ టూవీలర్లపై జీఎస్టీ 5 శాతమే. అంతేకాదు రోడ్ ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. ఈవీల కొనుగోలు కోసం తీసుకునే రుణాలపై చెల్లించే వార్షిక వడ్డీపై రూ.1.5 లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపును కూడా ప్రకటించింది. ►2021 – ఉత్పత్తి ఆధారిత రాయితీ (పీఎల్ఐ) స్కీమ్‌ను ఈవీ పరిశ్రమకూ కేంద్రం ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం ప్యాసింజర్ ఈవీ, హైబ్రిడ్ వాహన రంగంలో టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, మహీంద్రా ఎలక్ట్రిక్, టయోటా, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, హ్యుందాయ్, అశోక్ లేలాండ్, ఎంజీ మోటార్స్, జేబీఎం మోటార్స్, వోల్వో, ఆడి తదితర కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లు, బస్సులను విక్రయిస్తున్నాయి. హీరో ఎలక్ట్రిక్, ఎలక్ట్రోథర్మ్ (యో బైక్స్), ఎథర్ ఎనర్జీ, ఒకినవా, ప్యూర్ ఈవీ, సింపుల్ ఎనర్జీ, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, ఓలా ఎలక్ట్రిక్ తదితర కంపెనీలు ఈ–స్కూటర్లను విక్రయిస్తున్నాయి. రివోల్ట్ ఈవీ బైక్‌లను విక్రయిస్తోంది. ఫేమ్ స్కీమ్, వివిధ రాష్ట్రాల సబ్సిడీలను పరిగణనలోకి తీసుకుని చూస్తే వీటి ధరలు రూ.70,000 నుంచి రూ.1.13 లక్షల మధ్యనున్నాయి. బీహెచ్ఈఎల్, సన్ మొబిలిటీ, ఎక్సైడ్, కైనటిక్ ఇంజినీరింగ్, టాటా పవర్ వంటివి దేశీయంగా లిథియం ఆయాన్ బ్యాటరీల తయారీ, ఇంకా పబ్లిక్ చార్జింగ్ సర్వీసులకు సంబంధించి భారీ ప్రణాళికలతో దూసుకెళ్తున్నాయి. ఈవీ... పాస్ట్ అండ్ ఫ్యూచర్! ►1832: ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని స్కాట్లాండ్కు చెందిన రాబర్ట్ ఆండర్సన్ రూపొందించారు. ►1889: అమెరికాలో ఎలక్ట్రిక్ కార్లు రోడ్డెక్కాయి. పదేళ్ల పాటు వీటికి ప్రాచుర్యం లభించింది. ►1901: ప్రపంచంలోనే తొలి హైబ్రిడ్ వాహనాన్ని (పెట్రోలు, విద్యుత్ రెండింటితో నడిచేది) విఖ్యాత జర్మనీ ఆటోమోటివ్ ఇంజినీర్ ఫెర్డినాండ్ పోర్ష్ (లగ్జరీ కార్ల కంపెనీ పోర్ష్ వ్యవస్థాపకుడు) కనుగొన్నారు. ►1920–35: తక్కువ ధరల్లో పెట్రోలు, డీజిల్ కార్లు హల్చల్ చేయడంతో ఎలక్ట్రిక్ వాహనాలకు జనాదరణ కరువైంది. 1935 నాటికి మార్కెట్లో ఇవి పూర్తిగా మాయమయ్యాయి. ►1972: జర్మనీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ వాహనం ►‘1602ఈ’ మ్యూనిక్ ఒలింపిక్స్‌లో ఆవిష్కృతమైంది. అయితే, వాణిజ్యపరంగా మాత్రం ఇది ఉత్పత్తికి నోచుకోలేదు. ►1974: అమెరికాలో సెర్బింగ్–వ్యాన్‌గార్డ్ తయారు చేసిన వ్యాన్‌గార్డ్ సిటీ కార్ గొప్ప సక్సెస్ సాధించింది. 2,300 కార్లు అమ్ముడయ్యాయి. ►1996: అమెరికా వాహన దిగ్గజం జనరల్ మోటార్స్ (జీఎం) ఎలక్ట్రిక్ కారు ప్రియుల కోసం ప్రత్యేకమైన ‘ఈవీ1’ కల్ట్ కారును విడుదల చేసింది. ►1996: ప్రపంచంలో తొలిసారి వాణిజ్యపరంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ప్యూజో స్కూటెలెక్’ను ఫ్రాన్స్ వాహన కంపెనీ ప్యూజో విడుదల చేసింది. ►1997: కొత్త జనరేషన్ హైబ్రిడ్ కారు (పెట్రోలు, ఎలక్ట్రిక్) ‘ప్రియస్’ను జపాన్ దిగ్గజం టయోటా మార్కెట్లో ప్రవేశపెట్టింది. వాణిజ్య పరంగా మంచి విజయం సాధించింది. ►2008: స్టార్టప్ కంపెనీ టెస్లా మొట్టమొదటి లగ్జరీ ఈవీ ‘రోడ్‌స్టర్’ను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది. చైనాకు చెందిన బీవైడీ ఆటో కూడా ఎఫ్3డీఎం పేరుతో ప్రపంచంలోనే మొదటి ప్లగ్–ఇన్ హైబ్రిడ్‌ను విడుదల చేసింది. ►2010: జపాన్ కంపెనీ నిస్సాన్ ఎలక్ట్రిక్ కారు ‘లీఫ్’ను ప్రవేశపెట్టింది. ►2014: అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో టెస్లా గిగా ఫ్యాక్టరీ 1 పేరుతో అత్యంత భారీ బ్యాటరీ, ఈవీ ప్లాంట్‌కు తెరతీసింది. ►2016: క్లైమేట్ చేంజ్‌పై ‘ప్యారిస్ ఒప్పందం’ అమల్లోకి వచ్చింది. గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేందుకు ప్రపంచ దేశాలన్నీ కాలుష్యానికి చెక్ చెప్పాలని అంగీకరించడంతో ఎలక్ట్రిక్ వాహనాలకు జోష్ మొదలైంది. జీఎం తన తొలి ఫుల్ ఎలక్ట్రిక్ కారు ‘షెవీ బోల్ట్’ను విడుదల చేసింది. ►2017: భారత్, యూకే ప్రభుత్వాలు 2030 నాటికి దేశంలో పూర్తిగా ఈవీల విక్రయం మాత్రమే జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించాయి. ఫ్రాన్స్ 2040 టార్గెట్‌గా పేర్కొంది. ►2020: ఏడాదికి 10 లక్షల ఈవీ విక్రయాలను టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ 2040 నాటికి తమ రవాణా అవసరాలన్నింటికీ ఈవీలనే వాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ► 2021: పెట్రోలు, డీజిల్ వాహనాల ఉత్పత్తిని 2030 నాటికి పూర్తిగా నిలిపేస్తామని, కేవలం ఈవీలనే విక్రయిస్తామని స్వీడన్ దిగ్గజం వోల్వో ప్రకటించింది. ►2021: అమెరికాలో మూడు బ్యాటరీ ప్లాంట్లు, ఒక ఈవీ తయారీ ప్లాంట్ నిర్మాణం కోసం 11.5 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఫోర్డ్ ప్రకటించింది. ►2025: జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ 2025 నాటికి ఏటా 20 నుంచి 30 లక్షల ఈవీ అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది. బీఎండబ్ల్యూ కూడా అమ్మకాల్లో 20 శాతం ఈవీలే ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ►2030: ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకు పైగా ఈవీలు రోడ్లపై పరుగులు తీస్తాయని అంచనా. ►2040: మొత్తం ప్రపంచ వాహన విక్రయాల్లో 32 శాతం ఈవీలే ఉంటాయని అంచనా. టెస్లా.. సంచలనం ఎలక్ట్రిక్ వాహన రంగంలో, ఆ మాటకొస్తే ప్రపంచ ఆటోమొబైల్ రంగంలోనే టెస్లా ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఒక స్టార్టప్ కంపెనీగా 2003లో సిలికాన్ వ్యాలీలో అడుగుపెట్టిన టెస్లా... కేవలం 15 ఏళ్ల కాలంలోనే ప్రపంచ వాహన రంగంలో ఎవరికీ అందనంత ఎత్తుకు దూసుకెళ్లింది. 2008లో మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు ‘రోడ్‌స్టర్’ను విడుదల చేసింది. ఇన్వెస్టర్‌గా కంపెనీలోకి అడుగుపెట్టి 2008లో సీఈఓగా మారిన ఎలాన్ మస్క్.. హయాంలో మోడల్ ఎస్, మోడల్ 3, మోడల్ వై, మోడల్ ఎక్స్ కార్లను ప్రవేశపెట్టింది. పెట్రోలు, డీజిల్ కార్లకు సమాన సామర్థ్యంతో ఈ ఎలక్ట్రిక్ కార్లు పరుగులు పెట్టడం, ఒక్కసారి చార్జింగ్ చేస్తే 375 నుంచి 480 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వీలుండటంతో వీటికి డిమాండ్ జోరందుకుంది. మరోపక్క, సోలార్, బ్యాటరీలు, ఈవీల ఉత్పత్తి కోసం గిగా ఫ్యాక్టరీల పేరుతో టెస్లా అత్యంత భారీ ప్లాంట్లను నెలకొల్పుతూ వస్తోంది. 2016లో మొదటి గిగా ఫ్యాక్టరీ అమెరికాలోని నెవాడాలో నెలకొల్పింది (ప్రస్తుతం 4 ఉన్నాయి). జర్మనీ ఇతరత్రా దేశాల్లో (భారత్ సహా) మరిన్ని గిగా ఫ్యాక్టరీలను నెలకొల్పే యత్నాల్లో ఉంది. ప్రస్తుతం టెస్లా మార్కెట్ విలువ దాదాపు 800 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.60 లక్షల కోట్లు). టయోటా, ఫోక్స్‌వ్యాగన్, చైనా దిగ్గజం బీవైడీ, జనరల్ మోటార్స్, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలన్నింటి మార్కెట్ విలువ కంటే టెస్లాదే ఎక్కువ కావడం ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తుకు నిదర్శనం. అంతేకాదు, ప్రపంచ కుబేరులందరినీ వెనక్కి నెట్టి, మస్క్ ప్రపంచంలోకెల్లా అపర కుబేరుడిగా (ప్రస్తుత సంపద 200.4 బిలియన్ డాలర్లు) అవతరించడం కూడా ఎలక్ట్రిక్ చలవే!! అంకెల్లో... 5,20,000.. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2021 జూలై నాటికి దేశంలో రిజిస్టర్ అయిన మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య. ఇందులో దాదాపు 4–5 లక్షల వరకూ టూ, త్రీ వీలర్లే. మిగిలిన వాటిలో కార్లు, బస్సులు ఉన్నాయి. 2020–21లో భారత్‌లో మొత్తం 2,38,000 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో అత్యధికం స్కూటర్లు, ఆటోలే. రూ.12.5 లక్షల కోట్లు.. 2030 కల్లా భారత్ ఈవీ లక్ష్యాల కోసం వాహనాల ఉత్పత్తి, చార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం అవసరమయ్యే పెట్టుబడి మొత్తం. 4,00,000.. దేశంలో 2026 నాటికి అవసరమయ్యే పబ్లిక్ చార్జింగ్ పాయింట్లు. ప్రస్తుతం 2,000 చార్జింగ్ పాయింట్లున్నాయి. 63 లక్షలు.. 2027 నాటికి భారత్‌లో వార్షిక ఈవీ అమ్మకాల సంఖ్య అంచనా. 14 కోట్లు.. ఐఈఏ అంచనా ప్రకారం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా రోడ్లపై తిరగవచ్చని అంచనా వేస్తున్న ఈవీల (టూ, త్రీవీలర్స్ మినహా) సంఖ్య. 38 కోట్లు.. ఐఈఏ అంచనా ప్రకారం 2030 నాటికి చేరుకోనున్న మొత్తం టూ, త్రీవీలర్ ఈవీల సంఖ్య. 13 లక్షలు.. ప్రపంచవ్యాప్తంగా 2020 నాటికి పబ్లిక్ చార్జింగ్ పాయింట్ల సంఖ్య. వీటిలో 30 శాతం ఫాస్ట్ చార్జర్లు. 29 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి అవసరమయ్యే ఈవీ చార్జింగ్ పాయింట్ల సంఖ్య. లిథియం అయాన్ బ్యాటరీలదే హవా... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈవీల్లో లిథియం అయాన్ బ్యాటరీల హవా కొనసాగుతోంది. ఈవీ ధరలో 40–50 శాతం వరకు వ్యయం బ్యాటరీదే. గడచిన పదేళ్లుగా దేశంలో లిథియం అయాన్ బ్యాటరీ రేట్లు వార్షికంగా 20 శాతం మేర దిగొస్తున్నాయి. 2026 నాటికి ఈవీ బ్యాటరీ మార్కెట్ మొత్తం విలువ 166 బిలియన్ డాలర్లను చేరే అవకాశం ఉంది. కాగా, 2020లో లిథియం అయాన్ బ్యాటరీ ఉత్పత్తి 160 గిగావాట్–అవర్స్ (జీడబ్ల్యూహెచ్)కు ఎగబాకింది. 2030 నాటికి ఇది 1,300 జీడబ్ల్యూహెచ్‌కు దూసుకెళ్లొచ్చని బ్లూమ్‌బర్గ్ న్యూ ఎనర్జీ ఫైనాన్స్ (బీఎన్ఈఎఫ్) నివేదిక పేర్కొంది. కాగా, ప్రపంచ ఈవీ బ్యాటరీ ఉత్పత్తిలో చైనా 70 శాతం వాటాతో టాప్‌లో ఉంది. లిథియం అయాన్ బ్యాటరీల్లో గ్రాఫైట్, నికెల్, అల్యూమినియం, లిథియం, కోబాల్ట్ ఇంకా మాంగనీస్లను ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇందులో లిథియం మైనింగ్ అనేది అత్యంత క్లిష్టతరం కావడం, ఈ లోహపు లభ్యత పరిమితం కావడం కూడా బ్యాటరీ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. 100% కాలుష్య రహితం కాదా? ఎలక్ట్రిక్ వాహనాలు నిజంగానే 100% పర్యావరణహితమైనవి కావా... ఇవి కూడా కాలుష్యానికి ఎంతో కొంత కారణమవుతాయా? దీనికి అవుననే చెప్పక తప్పదు. ఎందుకంటే, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను చార్జింగ్ చేయడానికి ఉపయోగించే విద్యుత్ ఉత్పత్తి వల్ల భారీగా కర్బన ఉద్గారాలు విడులవుతాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విద్యుదుత్పత్తిలో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 29 శాతమే. అంటే 71% ఉత్పత్తి కాలుష్యకారకమైనదే. అదేవిధంగా ఈవీల తయారీ ప్రక్రియ కూడా గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతుంది. ఉదాహరణకు సంప్రదాయ పెట్రోలు/డీజిల్ కారు తయారీతో పోలిస్తే ఈవీ ఉత్పత్తిలో 15 శాతం అధిక కర్బన ఉద్గారాలు విడుదలవుతాయని అంచనా. ఈవీల లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో వాడే లోహాల కోసం జరిపే గనుల తవ్వకం ఇతరత్రా ప్రక్రియల రూపంలో భారీగా వాతావరణంలోకి కాలుష్యం విడుదలవుతుంది. అయితే, ఒక్కసారి ఈవీలు తయారయ్యాక వాటి జీవితకాలంలో నెట్–జీరో కాబట్టి కాలుష్య ప్రభావం అనేది పాక్షికమేననేది పరిశ్రమవర్గాల మాట. చార్జింగ్ స్పీడ్ పెరగాలి... ఎలక్ట్రిక్ వాహనాలను ఇంట్లో సాధారణ ప్లగ్ సాకెట్ (13 లేదా 15 యాంప్)తో కూడా చార్జ్ చేసుకోవచ్చు. అయితే పూర్తి చార్జింగ్కు కనీసం 6–12 గంటలు పడుతుంది. అదే పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లో అయితే డీసీ ఫాస్ట్ చార్జర్లతో 60–110 నిమిషాల్లో, ఏసీ స్లో చార్జర్లతో 6–7 గంటల్లో ఫుల్ చార్జ్ చేసుకోవచ్చు. సగటున ఫాస్ట్ చార్జర్లతో నిమిషానికి 1.5–3 కిలోమీటర్ల రేంజ్ చార్జింగ్ అవుతుంది. అయితే, ఈ చార్జింగ్ వ్యవధి భారీగా దిగొస్తే ఎలక్ట్రిక్ వాహనాలను డిమాండ్ మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది. దీనికి అనుగుణంగానే ఆటోమేషన్ రంగంలో ప్రపంచ దిగ్గజం ఏబీబీ తాజాగా అల్ట్రా ఫాస్ట్ చార్జర్ ‘టెరా 360’ని విడుదల చేసింది. దీంతో 100 కిలోమీటర్ల రేంజ్ వరకు కార్ బ్యాటరీని చార్జ్ చేయడానికి కేవలం 3 నిమిషాలే పడుతుంది. అంతేకాదు ఎలాంటి ఎలక్ట్రిక్ కారునైనా 15 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేసేయొచ్చని కంపెనీ ప్రకటించింది. దీంతో ఏక కాలంలో 4 కార్లను చార్జ్ చేయొచ్చని కూడా అంటోంది. -
చరిత్ర తిరగ రాసిన టెస్లా కంపెనీ
అమెరికా రెంటల్ కార్ కంపెనీ హెర్జ్, టెస్లాతో భారీ ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం హెర్ట్జ్ కంపెనీ 1,00,000 టెస్లా మోడల్ 3 సెడాన్ కార్లను ఆర్డర్ చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో ఇప్పటి వరకు ఇది ఒక రికార్డు అని బ్లూమ్ బెర్గ్ న్యూస్ తెలిపింది. రాబోయే 14 నెలల్లో టెస్లా కంపెనీ దశల వారీగా లక్ష కార్లను డెలివరీ చేయనుంది. ఈ డీల్ వివరాలు బయటకు రావడం ఆలస్యం టెస్లా కంపెనీ షేర్లు ఆకాశాన్ని తాకాయి. మార్కెట్ ముగిసే సమయానికి 14.9 శాతంగా షేర్ల విలువ పెరిగింది. ఈ టెస్లా మోడల్ 3 సెడాన్ కార్లు యుఎస్, ఐరోపాలో అద్దెకు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే, ఈ అద్దె కార్లను ప్రోత్సహించడం కోసం మౌలిక సదుపాయాలను కలిపించడానికి భారీగా పెట్టుబడి పెట్టనున్నట్లు హెర్ట్జ్ తెలిపింది. ఈ ఆర్డర్ టెస్లాకు ఒక పెద్ద వరం. టయోటా, జనరల్ మోటార్స్ వంటి దిగ్గజాలతో పోలిస్తే కంపెనీ ఇప్పటికీ తక్కువ మొత్తంలో వాహనాలను విక్రయిస్తుంది. 2020లో ఈ ఆటోమేకర్ ప్రపంచవ్యాప్తంగా 5,00,000 వాహనాలను విక్రయించింది. ఈ కొత్త కార్ల ప్రచార కోసం రాబోయే వాణిజ్య ప్రకటనలో టామ్ బ్రాడీ నటించనున్నట్లు హెర్ట్జ్ తెలిపింది. (చదవండి: ఎలక్ట్రిక్ కారు కొనేవారికి టాటా పవర్ తీపికబురు) -
అదిరే 'ఆడి'..ఇండియన్ మార్కెట్లో మరో సూపర్ ఎలక్ట్రిక్ కార్
లగ్జరీ బ్రాండ్ ఆడి సరికొత్త ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారుని మార్కెట్లోకి రీలీజ్ చేసింది. టెస్లాకార్లకు పోటీగా ఈ కారు ఎస్యూవీ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 1,79,90,000లుగా స్పోర్ట్స్ మోడల్ ధర రూ. 2.05 కోట్లుగా ఆడి నిర్ణయించింది. ఆడి సంస్థ తమ ఈవీ కారుని ఎస్యూవీ, స్పోర్ట్స్ బ్యాక్ మోడళ్లలో మార్కెట్లోకి తెస్తోంది. ఈ రెండు మోడళ్లలో స్టాండర్డ్, ఆర్ఎస్ వేరియంట్లు ఉన్నాయి ఈ ట్రాన్ కార్లలో 93 కిలోవాట్ లిథియమ్ ఐయాన్ బ్యాటరీని అమర్చారు. స్టాండర్డ్ వేరియంట్లో ఒక్క సారి ఛార్జ్ చేస్తేఏ 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఆర్ఎస్ వేరియంట్ 481 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఆర్ఎస్ ఈట్రాన్ కారు 637 బీహెచ్పీతో 830ఎన్ఎం టార్క్‌ని రిలీజ్ చేస్తుంది. స్టాండర్డ్ ఈ ట్రాన్ 523 బీహెచ్పీతో 630 ఎన్ఎం టార్క్‌ని రిలీజ్ చేస్తుంది. 3.3 సెకండ్ల నుంచి 4.1 సెకన్ల వ్యవధిలో గంటలకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు 2025 కల్లా ఇండియా ఈవీ మార్కెట్లో 25 శాతం మార్కెట్ వాటాని ఆడి లక్ష్యంగా పెట్టుకుంది. -
Tesla: టెస్లా చీప్ ఎలక్ట్రిక్ కార్.. భారత్ కోసమే?
వాహన రంగంలో సంచలనాలకు కేరాఫ్‌గా మారిన అమెరికన్ కంపెనీ టెస్లా.. చీప్‌గా ఎలక్ట్రిక్ కారును వాహనదారులకు అందించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కిందటి ఏడాది టెస్లా బ్యాటరీ డే సందర్భంగా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ చేసిన ప్రకటనకు కొనసాగింపుగా.. తక్కువ ధరకే ఫుల్లీ ఆటానమస్ ఈ-కారును టెస్లా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఫుల్ సెల్ప్ డ్రైవింగ్ వ్యవస్థతో రూపొందించనున్న ఈ కారు ధర.. 25 వేల డాలర్లుగా(మన కరెన్సీలో 18 లక్షలుగా) ఫిక్స్ చేసినట్లు సమాచారం. స్టీరింగ్ వీల్ లేకుండానే రానున్న ఈ ఎలక్ట్రిక్ కారును.. మోడల్ 2గా(అఫీషియల్ పేరు కాదు) వ్యవహరించనున్నారు. ఈ చీప్ వెహికిల్‌ను 2023లో లాంఛ్ చేయనున్నారు. అయితే ఇది టెస్లా అధికారిక ప్రకటన కాకపోయినా.. మస్క్ తాజా ఇంటర్వ్యూ వ్యాఖ్యాలను ఉటంకిస్తూ ఎలక్ట్రిక్ అనే వెబ్సైట్ ఈ విషయాల్ని వెల్లడించింది. షాంఘై(చైనా)లోని గిగాఫ్యాక్టరీ నుంచి ఈ వాహనాలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయనున్నట్లు ఆ కథనం పేర్కొంది. భారత్ టార్గెట్‌గా.. ఒక్కసారిగా అంత ధర తగ్గించడం ఎలా సాధ్యమంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కొత్త బ్యాటరీ సెల్ యూనిట్ నెలకొల్పడం ద్వారా భారం తగ్గించుకోవచ్చంటూ మస్క్ ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాడు. ఈ మేరకు కొత్త కార్లపై 50 శాతం ధరల తగ్గింపు ఆలోచనకు టెస్లా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక టెస్లా కంపెనీ భారత్ లాంటి పెద్ద మార్కెట్‌పై కన్నేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో నాలుగు మోడల్స్‌కు సూత్రప్రాయంగా లైన్ క్లియర్ అయ్యిందంటూ కథనాలు వస్తున్నాయి. అయితే తక్కువ రేటు కార్ల తయారీ కూడా భారత్‌లాంటి దేశాలను దృష్టిలో పెట్టుకునే టెస్లా చేస్తోందని తెలుస్తోంది. -
Tesla: ఆటోపైలట్ యాక్సిడెంట్లు... మొదలైన విచారణ
డ్రైవర్ లేకుండా కారు తీసుకొస్తామంటూ ఓ వైపు టెస్లా చెబుతుంటే మరోవైపు ఇప్పటికే టెస్లా కార్లలో ఉన్న ఆటోపైలట్ పనితీరుపై విచారణ మొదలైంది. ఇప్పటి వరకు టెస్లా కార్ల వల్ల జరిగిన ప్రమాదాలు ఎన్ని, జరిగిన నష్టం ఎంత అనే అంశాలపై పూర్తి నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఆటోపైలట్‌పై విచారణ టెస్లా కంపెనీ అధినేత ఎలన్‌మస్క్ డ్రైవర్ లేకుండా నడిచే కారును తీసుకొస్తామమంటూ తరచుగా ప్రకటనలు గుప్పిస్తున్నాడు. దీంతో డ్రైవర్ లెస్ కారు, ఆటోపైటల్ టెక్నాలజీపై విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ బేస్డ్ డ్రైవర్ లెస్ కారుపై ఎలన్‌మస్క్ రోజుకో అప్డేట్ బయటకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టెస్లా కార్లలో అందుబాటులో ఉన్న ఆటోపైలట్‌పై అమెరికాకు చెందిన నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ విచారణ ప్రారంభించింది. ఒకరి మరణం అమెరికాలో 2014 నుంచి ఇప్పటి వరకు టెస్లా అమ్మకాలు జరిపిన 7.65 లక్షల కార్లకు సంబంధించిన డేటాను క్రోడీకరించారు. దీని కోసం 2018 నుంచి ఇప్పటి వరకు కాలాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో మాసాచుసెట్స్, మియామీ, శాన్డియాగోలలో జరిగిన ప్రమాదాల్లో మొత్తం 17 గాయపడగా అందులో ఒకరు మరణించారు. ఇందులో అత్యధిక ప్రమాదాలు రాత్రి వేళలలో జరిగినవే ఉన్నాయి. అంచనా వేయడంలో పొరపాటు? ప్రమాదాలు జరిగినప ప్రదేశాలను పరిశీలించగా ట్రాఫిక్ బోర్డులు, హైవే సూచికలతో పాటు కోన్లు తదితర రక్షణ ఏర్పాట్లు సరిగానే ఉన్నట్టు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన ప్రదేశాల్లో లైట్ల వెలుతురు కూడా ఎక్కువగా ఉండటాన్ని నమోదు చేశారు. ఈ ప్రమాదాలు జరిగిన సమయంలో సగానికిపైగా కార్లు ఆటోపైలట్ మోడ్‌లోనే ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్లు, హెచ్చరిక బోర్డులను అంచనా వేయడంలో ఆటోపైటల్ వ్యవస్థ వందశాతం సమర్థంగా పని చేయడం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం సహయకారి ఆటోపైలట్ వ్యవస్థ డ్రైవర్‌కు సహాయకారిగా ఉపయోగపడుతుందే తప్ప పూర్తిగా డ్రైవర్ లేకుండా కారును సమర్థంగా నడపలేదని తాము ముందు నుంచే చెబుతున్నామంటోంది టెస్లా. ఎదైనా ప్రమాదాలను, హెచ్చరికలను గుర్తించినప్పుడు డ్రైవర్‌ను అలెర్ట్ చేస్తుందే తప్ప స్వంతగా నిర్ణయాలు తీసుకోదని వెల్లడించింది. అదేవిధంగా డ్రైవర్ లెస్ కార్ల తయారీ అనేది ఇంకా కాన్సెప్టు దశలోనే ఉందంటోంది టెస్లా. -
టెస్లాకు దిమ్మతిరిగే కౌంటర్.. ఇరుక్కుపోయిన ఎలన్ మస్క్
ఇండియాలో ఇంపోర్ట్ ట్యాక్స్ ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గిస్తే టెస్లా ఎస్ ప్లెయిడ్ కార్లను భారత్‌కు తీసుకువస్తామంటూ ఎలన్ మస్క్ చేసిన ట్వీట్‌పై చెలరేగిన దుమారం ఇంకా చల్లారలేదు. భారత ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు ఎలన్ మస్క్ ట్వీట్‌పై స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వంలో ఉన్నతాధికారి చేసిన చేసిన ప్రకటన ఎలన్‌మస్క్‌ని ఇరుకున పడేలా చేసింది. దీనికి ఓకేనా తమ కంపెనీ రూపొందించిన ఎలక్ట్రిక్ కారును లగ్జరీ కారుగా పరిగణించ వద్దని, కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ కారుగా గుర్తించి దిగుమతి పన్నులు తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని టెస్లా కంపెనీ గతంలో కోరింది. టెస్లా కోరినట్టుగా దిగుమతి పన్ను తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమేనని అయితే ఆ కంపెనీ కార్ల తయారీ యూనిట్‌ను దేశంలో నెలకొల్పుతామని ప్రకటిస్తే అది సాధ్యం’ అంటూ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ఉన్నతాధికారి చెప్పారంటూ ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. అంతేకాదు ఈ రాయితీ ఒక్క టెస్లా కంపెనీకే వర్తించదని.. ఆ రంగం మొత్తానికి వర్తిస్తుందని ఆ అధికారి చెప్పినట్టు ఈటీ వివరించింది. టెస్లా బేరాలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్న లగ్జరీ కార్లకు సంబంధించి 40 వేల డాలర్లు లోపు ధర ఉంటే 60 శాతం పన్నుని ప్రభుత్వం దిగుమతి సుంకంగా విధిస్తోంది. అంతకు మించి కారు ధర ఉంటే వంద శాతం పన్నుని విధిస్తోంది. ప్రస్తుతం టెస్లా ఎస్ ప్లెయిడ్ కారు ధర మన కరెన్సీలో కోటి రూపాయలలకు పైగానేగా ఉంది. దిగుమతి సుంకం కలిపితే ఈ కారు ధర రెండు కోట్లు దాటుతుంది. దీంతో పన్ను మినహాయింపు కోరుతోంది టెస్లా కంపెనీ. ఇరుక్కుపోయిన ఎలన్ మస్క్ టెస్లా కంపెనీ అమెరికాకు వెలుపల జర్మనీ, చైనాలో కార్ల తయారీ యూనిట్‌ని ప్రారంభించింది. ఆ యూనిట్లలో తయారైన కార్లను ఇండియాకు దిగుమతి చేసి అమ్మకాలు సాగించాలనే వ్యూహంతో ఉంది. అందుకే పన్ను రాయితీలు అంటూ బేరాలకు దిగింది. ఇండియాలో కార్ల తయారీ పరిశ్రమ పెడతామంటే పన్ను మినహాయింపు అంశం పరిశీలిస్తామంటూ టెస్లా ఓనర్ ఎలన్ మస్క్‌కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇండియా ఇచ్చింది. దీంతో బాల్ ఎలన్ మస్క్ కోర్టులో పడినట్టయ్యింది. భారత ప్రభుత్వం వదిలిన ఫీలర్కి ఎలన్‌మస్క్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి. -
Tesla S Plaid : ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కార్
కాలిఫోర్నియా : ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కార్ని రిలీజ్ చేసింది టెస్లా కంపెనీ. అమెరికాలోని కాలిఫోర్నియాలో గురువారం రాత్రి జరిగిన లాంచింగ్ ఈవెంట్లో టెస్లా ఎస్ ప్లెయిడ్ కారుని ప్రపంచలోనే అత్యంత ఫాస్టెస్ట్ కారుగా టెస్లా ఫౌండర్ ఎలన్ మస్క్ అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్షే కంటే వేగంగా వోల్లో కంటే భధ్రమైన కారుగా ఎస్ ప్లెయిడ్‌ని పేర్కొన్నారు. 2 సెకన్లలో టెస్లా నుంచి ఫ్లాగ్షిప్ లగ్జరీ సెడాన్ కారుగా ఎస్ ప్లెయిడ్‌ని అమెరికా మార్కెట్లోకి ఎంటరైంది. 1020 హెపీ హర్స్‌పవర్ శక్తి కలిగిన ఈ కారు కేవలం రెండు సెకన్లలో 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటలకు 322 కిలోమీటర్లు. ప్రస్తుతం అమెరికాలోనే ఈ కారు లభిస్తోంది. ఈ కారు ధర 1,29,990 (రూ. 94 లక్షలు) డాలర్లుగా ఉంది. కాఫీ తాగేలోపు ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న ప్రధాన సమస్యైన ఛార్జింగ్ టైం విషయంలో టెస్లా ప్రయత్నాలు ఫలించాయి. కేవలం కేవలం 15 నిమిషాల పాటు బ్యాటరీ ఛార్జీంగ్‌తో 301 కిలోమీరట్ల ప్రయాణం చేయవచ్చుని కంపెనీ పేర్కొంటోంది. కేవలం కాఫీ బ్రేక్ సమయంలోనే కారు తిరిగి ప్రయాణానికి సిద్థమవుతుందని ప్రకటించింది. ఈ కారులో లిథియం అయాన్ బ్యాటరీతో పాటు ఫాస్ట్‌ఛార్జింగ్ ఆప్షన్లను టెస్లా అందుబాటులోకి తెచ్చింది. లగ్జరీ బ్రాండ్లకు ధీటుగా లగర్జీ కార్ల మార్కెట్లో దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తోంది టెస్లా. లగ్జరీ, పవర్ఫుల్ ఇంజన్ కాంబినేషన్లో టెస్లా రిలీజ్ చేసి ఎస్ ప్లెయిడ్ కారు అమెరికా మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. క్షణాల్లో రివ్వుమని దూసుకుపోయే వేగం, అద్వీతీయమైన లగ్జరీ ఫీచర్లలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా టెస్లా ఎస్ ప్లెయిడ్ మారింది. చదవండి: అదిరే అల్కాజర్, సరికొత్త ఫీచర్లతో మార్కెట్లో సందడి -
టెస్లాకు థ్యాంక్యూ చెప్పిన వికలాంగుడు?
రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల ఒకప్పుడు మనం ఇబ్బంది పడిన ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం అభివృద్ధి చెందిన టెక్నాలజీ వల్ల కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా ఆఫీస్ పనిని ఇంటి నుంచి చేయడం జరుగుతుంది. ఇలా ఎన్నో సమస్యలకు టెక్నాలజీ వల్ల పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం పెద్ద పెద్ద పట్టణాల్లో ప్రతి మనిషికి ఒక కారు ఉంటుంది. దీనివల్ల వారు బయటకి వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ లతో పాటు, కారు పార్కింగ్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. చైనా, జపాన్ లాంటి దేశాల్లో కార్ పార్కింగ్ కోసం వివిధ అంతస్థుల్లో కారు పార్కింగ్ చేసే పద్ధతి కూడా ఉంది. అయితే, ఈ కార్ల పార్కింగ్ వల్ల చాలా మంది ఎప్పుడో ఒకసారి ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. ఇక కారు పార్కింగ్ విషయంలో వికలాంగులు పడ్డ ఇబ్బందుల గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఒక వికలాంగుడు కూడా కారు పార్కింగ్ విషయంలో ఇటువంటి సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. తాను తన కారు పార్క్ చేసిన ప్రదేశానికి వచ్చి కారు డోర్ తీయడానికి ప్రయతించినప్పుడు చాలా ఇబ్బందికి గురి అయ్యాడు. తన టెస్లా కారుకి ఇరువైపులా వేరే కార్లు పార్క్ చేసి ఉండటం వల్ల కారు డోర్ తీయడానికి సాధ్యం కాలేదు. Thank you @Tesla for this helpful and cool feature :-) pic.twitter.com/FLuY3yFdSL — Thomas Fogdö (@Fogdo) September 8, 2019 కారు యజమాని థామస్ ఫొగ్డో తన కారున్న పరిస్థితిని గమనించి కాస్త వెనక్కి వచ్చి జేబులో నుంచి తన స్మార్డ్ ఫోన్ తీసి టెస్లా యాప్ లో క్లిక్ చేయగానే టెస్లా కారు వచ్చి తన ముందు ఆగుతుంది. అంత మంచి సౌకర్యాన్ని అందించిన టెస్లాకు ఫోగ్డో థాంక్యూ చెప్పాడు. ట్విట్టర్లో ఈ వీడియోను "థ్యాంక్యూ @టెస్లా హెల్ప్‌ఫుల్, కూల్ ఫీచర్ అందించినందుకు" అని పోస్టు చేసాడు. ఈ ఘటన 2019, సెప్టెంబర్ 8న జరిగింది. 44 సెకన్లు వీడియో క్లిప్‌ని 1.3 మిలియన్ల కంటే ఎక్కువ మందే చూశారు. వేల కొద్దీ లైక్‌లు, రీట్వీట్లు, రిప్లైలు వచ్చాయి. అయితే అన్నింటిలో మంచి చెడులు ఎలా ఉంటాయో, ఈ టెక్నాలజీలోనూ అంతే ఎంతో కొంత ఇబ్బంది ఉండకపోదు. అందుకే ఈ వీడియోకి మిక్స్డ్ స్పందన వచ్చింది. కొందరు అద్భుతంగా ఉందంటే, ఇంకొందరు ఇలాగైతే కారును హ్యాక్ చేసేయొచ్చు, యాక్సిడెంట్లు తప్పవు అంటూ కామెంట్ చేశారు. చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు!