టెస్లా సీఈవో ఎలన్ మస్క్ భారత్‌కు భారీ షాకివ్వనున్నారు. మనదేశాన్ని కాదని సౌత్‌ఈస్ట్ ఏసియా కంట్రీ ఇండోనేషియాలో టెస్లా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఎలన్ మస్క్ టెక్సాస్‌లోని రాకెట్‌ల తయారీ ప్రాంతమైన బోకాచికా సైట్‌లో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో భేటీ అయ్యారు.ఈ సమావేశంలో ఇండోనేషియాలో పెట్టుబడులతో పాటు, టెస్లా మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌లను ప్రారంభించే అంశాలపై చర్చించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి.
రాగి నిక్షేపాలకు నిలయం
ఇండోనేషియాలో విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేలా ప్రపంచంలోని అతిపెద్ద రాగి, నికెల్, టిన్ నిక్షేపాలు ఉన్నాయి. అందుకే విదేశీ ఇన్వెస్టర్లు ఇండోనేషియాలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతుంటుంటారు. తాజాగా జోకో విడోడోతో మస్క్ జరిపిన మంతనాల్లో ఇండోనేషియాలో టెస్లా కార్ల తయారీ యూనిట్‌ను ప్రారంభించాలని ప్రతిపాధన తెచ్చినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి
"నా దారి నేను చూసుకుంటా"
మరోవైపు టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, స్పెస్ రాకెట్ లాంచ్ సైట్‌ల ఒప్పొందాలు చేసేలా ఇండోనేషియా ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇప్పుడు మళ్లీ ఆ ఒప్పొంద ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
చైనాలో టెస్లా కార్లను తయారు చేసి భారత్‌లో అమ్మేందుకే కేంద్రం ఒప్పుకోకపోవడం, ఇప్పటికే పలు మార్లు అందుకు కేంద్రాన్ని ఒప్పించేలా మస్క్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో భారత్‌లో టెస్లా కార్లను అమ్మాలనే ప్రణాళికల్ని, టెస్లా కోసం భారత్‌లో అనువైన స్థలం కోసం చేస్తున‍్న ప్రయత్నాల్ని మస్క్ విరించుకున్నారు.
తాజాగా ఇండోనేషియా అధ్యక్షుడు విడోడోతో ఎలన్ మస్క్ భేటీ అవ్వడం మరింత చర్చాంశనీయంగా మారింది. భారత్‌ను వద్దనుకొని ఇండోనేషియాలో టెస్లా మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటూ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
చదవండి👉 నితిన్ గడ్కరీ..మాటంటే మాటే! ఎలన్‌మస్క్‌కు బంపరాఫర్!
Comments
Please login to add a commentAdd a comment