ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు భారత్ భారీ షాకిచ్చింది. భారత్‌లో టెస్లా మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం రాయితీలు ఇచ్చేలా ప్రత్యేక విధానాలు అమలు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలిపారంటూ పీటీఐ నివేదించింది. తాజా, నిర్ణయంతో భారత్‌లో టెస్లా కార్లను తయారు చేసి విడుదల చేయాలన్న మస్క్ కోరికకు బ్రేకులు పడినట్లైంది.
మేకిన్ ఇండియా నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఏసీసీ బ్యాటరీ స్టోరేజ్‌కు సంబంధించి రూ. 18,100 కోట్లు నుంచి రూ. 26,058 కోట్లతో ఆటో, ఆటో విడిభాగాలు, డ్రోన్ పరిశ్రమల కోసం పీఎల్‌ఐ కింద ప్రత్యేక పథకాన్ని రూపొందించించింది.
అయితే, భారత్‌లో టెస్లా కార్లను తయారు చేయాలన్న మస్క్ ఆలోచనను స్వాగతిస్తున్నాం. కాకపోతే, దేశీయంగా తయారీ యూనిట్లకు తాము ఎలాంటి ప్రొత్సహకాలు అందిస్తున్నామో, టెస్లాకు సైతం అదే విధమైన రాయితీలు ఉంటాయి. అంతే తప్పా టెస్లా కోసం ఎలాంటి ప్రత్యేక పాలసీలు అమలు చేయడం లేదంటూ మెలిక పెట్టింది.
మస్క్ డిమాండ్
2021 నుంచి ఎలక్ట్రిక్ కార్లపై భారత్ దిగుమతి సుంకం తగ్గించాలంటూ టెస్లా డిమాండ్ చేస్తూ వస్తుంది. అయినప్పటికీ కేంద్రం దిగుమతి సుంకం తగ్గించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా, ఎలాన్ మస్క్ భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించాలని కోరింది. ఏర్పాటు విషయంలో ప్రభుత్వం సైతం మస్క్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చింది.
తగ్గేదేలే
భారత్‌లో టెస్లా కార్ల అమ్మకాలపై కేందర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే ఓ స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. టెస్లా యాజమాన్యం సంస్థ ఎలక్ట్రిక్ కార్లను చైనాలో తయారీ చేసి, ఇండియాలో అమ్మకాలు జరుపుతామంటే కుదరదు. ‘టెస్లా భారత్‌కు రావాలి. తయారీ యూనిట్‌ను నెలకొల్పి కార్లను తయారు చేయాలి. ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు.’ ప్రభుత్వ సహాయ, సహకారాలు అందిస్తుందని తెలిపారు.
కేంద్రం వైఖరి ఇదే
ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ టెస్లా బాస్ ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం భారత్‌లో టెస్లా కార్లను తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత టెస్లా అధికారులు ఇక్కడి వచ్చి కేంద్రంతో చర్చలు జరిపారు. ఈ తరుణంలో టెస్లా కార్ల తయారీ యూనిట్‌పై కేంద్రం తన వైఖరి స్పష్టం చేసింది. మరి దీనిపై ఎలాన్ మస్క్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment