ప్రముఖ అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారతీయులకు శుభవార్త చెప్పనుంది. దేశీయంగా తయారు చేసిన టెస్లా ఎలక్ట్రిక్ కార్ రూ.20 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వాహనదారులకు అందని ద్రాక్షగా మిగిలిపోయిన టెస్లా మరింత తక్కువ ధరకే దొరికినట్లువుతుందని ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. పర్యటలో ఎలాన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో మస్క్‌తో భారత్‌లో పెట్టుబడులతో పాటు వివిధ అంశాలపై చర్చించారు.
ఈ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో తాను భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగా.. తాజాగా భారత్‌లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేలా టెస్లా ప్రతినిధులు కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ చర్చల కార్యరూపం దాల్చితే.. చైనా తరహాలో భారత్‌లో టెస్లా కార్యకలాపాలు నిర్వహిస్తుందని హామీ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు, ఏడాదికి 5 లక్షల కార్ల తయారీ సామర్ద్యం దిశగా అడుగులు వేస్తున్నట్లు టెస్లా బృందం కేంద్రం వద్ద పలు ప్రతిపాదనలు పెట్టింది. ఒకవేళ అదే జరిగితే టెస్లా కార్ల ప్రారంభ ధర 2 మిలియన్లు (భారత కరెన్సీలో రూ.20లక్షలు )గా నిర్ధేశించనుంది.
కేంద్రంతో టెస్లా జరుపుతున్న చర్చల్లో
పెట్రోల్, డీజిల్ కార్ల తయారీకి ఉపయోగించే కాంపోనెంట్స్ (ఆటో పార్ట్స్), ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం వినియోగించే కాంపోనెట్స్ తయారీ, వాటి అమ్మకాల సామర్ధ్యాలపై టెస్లా కేంద్రంతో చర్చలు జరుపుతుంది. కేంద్రం ఇప్పటికే అమలు చేస్తున్న రాయితీలు, ట్యాక్స్ బెన్ఫిట్స్‌ను పునరుద్ధరించాలని కోరుతుంది.
చర్చలు కీలకం
ఈ చర్చలతో సంబంధం ఉన్న ప్రభుత్వ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘టెస్లా భారత్‌లో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉంది. కానీ రాయితీల విషయంలో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తుంది. టెస్లా అభ్యర్ధనపై దేశీయ ఆటోమొబైల్ రంగం వృద్దితో పాటు కార్ల తయారీ విడిభాగాల సప్లయ్ చైన్ మార్కెట్ విలువ చూడాలని కేంద్రం కోరింది.
అదే సమయంలో టెస్లా నిర్దిష్ట అవసరాలు, పర్యావరణ వ్యవస్థ నుండి కావాల్సిన అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం తరుపున చర్చల్లో పాల్గొన్న అధికారులు టెస్లా ప్రతినిధులకు హామీ ఇచ్చినట్లు సదరు అధికారి వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ, టెస్లా ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న తరుణంలో కేంద్రంతో ఎలాన్ మస్క్ జరిపే చర్చలు భారత్‌లో టెస్లా కార్ల తయారీ యూనిట్ ప్రారంభించేందుకు కీలకంగా ఉన్నాయని ప్రభుత్వ అధికారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
చదవండి👉 భారత్‌లో టెస్లా.. త్వరలో కార్ల తయారీ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటాం!
Comments
Please login to add a commentAdd a comment